6, అక్టోబర్ 2022, గురువారం

చేరలేనిచోటు

 మనిషి చేరలేనిచోటు..!?


స్వామి.... నాకు అర్జెంట్ గా వుద్యోగం కావాలి స్వామి.... నాకు అర్జెంట్ గా వివాహం కావాలి


స్వామి.... నాకు అర్జెంట్ గా పిల్లలు కావాలి


స్వామి.... నా పిల్లలు తొందరగా సెటిల్ కావాలి స్వామి.... నాకు ఆరోగ్యం ఆయువు కావాలి


స్వామి.... ఇవన్ని లేకుంటే నిన్ను ఎప్పుడూ, ఎలా తలుచుకోగలను చెప్పు ప్రశాంతంగా !?


దేవుడికి తన ప్రశాంతత గురించి గుర్తు వచ్చింది. ఆ కాలంలో దేవుడు మనిషి కలిసే జీవించేవారు ఆయన సలహాదారులు సూచించారు.. త్వరగా మనుషుల నుండి దూరంగా దేవుడు పారిపోకపోతే... దేవుడుకి శాంతి లేనేలేదని.


@ ఎవరెస్టుకి వెళ్ళిపొండి స్వామీ అన్నారు. భవిషత్తు తెలిసిన దేవుడు అన్నాడు.. # లాభం లేదు. త్వరలో ఒకడు అక్కడికి వస్తున్నాడు.


@ పోనీ చంద్రమండలమో.. అన్నారు. # అది లాభం లేదు. మనిషి అక్కడకి రాబోతున్నాడు.


ఎవ్వరికి ఏమి చెప్పాలో తోచలేదు.


చివరికి వారిలో ఓ పెద్దాయన అన్నాడు. @ మనిషి చేరలేనిచోటు నాకు తెలుసును దేవా. # అవునా! చెప్పుచెప్పు అన్నాడు దేవుడు ఆత్రంగా. @ మనిషి అన్ని చేరగలడు. ఒక్క తన అంతరంగం తప్ప.. అన్నాడు పెద్దాయన.


వెంటనే దేవుడికి ఆ సలహా నచ్చేసింది. ఆరోజు నుండి ఆయన నివాసం అదే అయిపొయింది. వేలాది ఏళ్లుగా ఏ కొద్దిమందో తప్ప ఎవరూ తమ లోలోనే వున్న ఆయనని దర్సించలేకపోయారు. కనుక దేవుడక్కడ హాయిగా వున్నాడు.


కామెంట్‌లు లేవు: