6, అక్టోబర్ 2022, గురువారం

పండుగ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

రచయిత పేరు తెలియదు. చాలా బాగుంది. వారికి క్షమాపణలతో.👇

               *పండుగ*                         


పొద్దున్నే లేచేసాం... 

కాఫీలు తాగేసాం... 

ఎలక్ట్రానిక్ శుభాకాంక్షలు చూసేసాం... త్రోచేసాం 

వాహనాలూ , BODY లూ ... కడిగేసాం... తుడిచేసాం... 

గుడికెళ్ళేసామ్... మొక్కేసాం... అడిగేసాం ... 

ఇంటికొచ్చేసాం.. మెక్కేసాం...   

టీవీ ముందు తిష్టేసాం... 

రెండెక్కువ ఐటమ్స్ తో... లంచ్ లాగించేసాం.. 

అరగంటెక్కువ నిద్రేసాం... 

మళ్ళీ టీవీ ముందు కొచ్చేసాం... 

మినీ సెలెబ్రిటీల... అతి వీర, అతి రౌద్ర, అతి కరుణ, అతి భక్తి .... 

భావ ప్రదర్శనలను ... చెవులారా.. కనులారా కనేసాం... 

పండగ ను ... వైబ్రేన్ట్ గా సెలెబ్రేట్ చేసేశాం...


****


అయ్యో ... పండుగ డే ... అప్పుడే అయిపొయింది... 


భావి తరాలకు కావలసిన రావి, మర్రి, జమ్మి, రాతి ఉసిరి లాంటి  

ఓ మొక్క నాటేద్దాం అనుకున్నాం .... తర్వాత సూద్దాం 


ఓ కొత్త ఆలోచన చేద్దాం అనుకున్నాం ... తర్వాత సూద్దాం 


ఓ కొత్త విషయం తెలుసుకుందామనుకొన్నాం ... తర్వాత సూద్దాం 


ఇంటికొచ్చిన ఆవుకు... ఇంట్లో మాగిపోయిన అరటి పండు కాకుండా... 

చిట్టూ , తవుడూ కలిపి పెడదాం అనుకున్నాం.... తర్వాత సూద్దాం 

 

వీధి చివర గుడిసె లో పిల్లలకు... బిస్కట్ పాకెట్ లిద్దాం అనుకున్నాం 

ఇంటికి తెచ్చాం ... రేపు చూద్దాం 


మొత్తం మీద పండగ ను ఎంజాయ్ చేసేసాం గా ... 

చాలా అలసి పోయాం.... రేపు సూద్దాం 🙏

కామెంట్‌లు లేవు: