6, అక్టోబర్ 2022, గురువారం

రామ - రావణుల

 ॐ        రామ - రావణుల మధ్య అంతరం 


    అరణ్యంలో రావణుడు వచ్చి, తన ఉద్దేశాన్ని ప్రకటించినపుడు, సీతాదేవి, 

    శ్రీరామునికీ - రావణాసురునికీ అంతరాన్ని తొమ్మిది జంట విషయాలతో పోల్చుతుంది. 


    అవి 


1. సింహం - నక్క 

   (a Lion and a jackal in a forest), 

2. సముద్రం - పిల్లకాలవ 

   (a Sea and a brook), 

3. అమృతం - బియ్యపుకడుగు నీరు 

    (Nector - the foremost of beverages and Sauveeraja - a sour and sabvoury drink prepared by dissolving powdered rye seeds into water and preserving it for a day or two), 

4. బంగారం - సీసం 

   (Gold and a base metal like lead), 

5. మంచిగంధం - బురద 

   (Sandal paste and mud), 

6. ఏనుగు - పిల్లి 

   (an Elephant and a cat in jungle), 

7. గరుత్మంతుడు - కాకి 

   (Garuda - son of Vinata and the king of birds and a crow), 

8. నెమలి - నీటికాకి 

   (a Peacock and a diver bird), 

9. హంస - గ్రద్ద 

   (a Swan - believed to feed on pearls and a vulture - feeds on the rotten flesh of carcasses). 


ఈ తొమ్మిదిటిలో, 


    సింహం, సముద్రం, అమృతం, బంగారం, గంధం, ఏనుగు, గరుత్మంతుడు, నెమలి, హంస అనేవి సత్పురుషుల లక్షణాలకి ఉపమానాలు. 


    నక్క, పిల్ల కాలువ, బియ్యంకడుగు నీళ్ళు, సీసం, బురద, అడివి పిల్లి, కాకి, నీటి కాకి, గ్రద్ద అనేవి దుర్జనుడి లక్షణాలకి ఉపమానాలు. 


     యదన్తరం సింహసృగాలయోర్వనే 

     యదన్తరం స్యన్దనికాసముద్రయోః I

     సురాగ్ర్య సౌవీరకయోర్యదన్తరం 

     తదన్తరం దాశరథేస్తవైవ చ ॥ 

     యదన్తరం కాఞ్చనసీసలోహయోః 

     యదన్తరం చన్దనవారిపఙ్కయోః I 

     యదన్తరం హస్తిబిడాలయోర్వనే 

     తదన్తరం దాశరథేస్తవైవ చ ॥ 

     యదన్తరం వాయసవైనతేయయోః 

     యదన్తరం మద్గుమయూరయోరపి I 

     యదన్తరం హంసకగృధ్రయోర్వనే 

     తదన్తరం దాశరథేస్తవైవ చ ॥ 

                - అరణ్య 47/45-47 


    The difference between you and Rama is the difference between

  - a jackal and a lion in the forest,   

  - a ditch and the sea, and 

  - sour gruel and the best of wines. 


    The difference between you and Rama is the difference between 

  - gold and lead, 

  - sandal and slime, 

  - an elephant and a cat of the forest.


    The difference between you and Dasaratha's son is the difference between 

  - a crow and Garuda, 

  - a water-crane and a peacock, 

  - a vulture and a swan in the forest. 


                    =x=x=x= 

             

  — రామాయణం శర్మ 

            భద్రాచలం 

     (అచ్చంపేట మకాం)

కామెంట్‌లు లేవు: