28, ఏప్రిల్ 2021, బుధవారం

కనువిప్పు

 *కనువిప్పు*


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధుర్యొధనుడు భంగమైన వూరువులతో తన మృతువుకై ఎదురుచూస్తున్నాడు . పాండవులు ధుర్యొధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రధాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గధాయుద్దాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.


కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రధాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో వుప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి -


"బావా చూసావా.. కౌరవులు ఎలా నశించారో..?" అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు.


అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ, కర్ణాది శత్రువులంతా ఎలా తన అస్త్రాలకి బలైంది కళ్ళముందు కనపడినది. తను జయించాడు...కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన విలుకాడే ఈ భూమి మీదే లేడు..!!


అన్నిరధాలు రణరంగం మధ్యలో వున్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క వుదుటన రధం కిందకు దూకి - "పితామహా.. పితామహా.. మేము జయించాం... కౌరవులందరూ నిహతులైనారు.." అన్నాడు.


భీష్ముడు దుఖ్ఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.


"అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా.." అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు -


"అవును పితామహా... సుయోధనుడి వూరువులను ఇప్పుడె భంగపరిచాను... గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను.. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది.."


"కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట"


"అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి.." నకులుడన్నాడు.


"నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా.." సహదేవుడాన్నాడు.


భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు. "అర్జునా..." పిలిచాడాయన నెమ్మదిగా.


"చెప్పండి పితామహా.."


"నీవేమి చెప్పవేం..??"


"చెప్పేదేముంది పితామహా... నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను, కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను... ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము.."👍


"మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?" ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి శాంతనునికి నమస్కరించాడు.


"పరంధామా.. నాకెందుకయ్యా నమస్కరిస్తావు.. ధర్మ పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదే ముకుందా... నీకే మేమంతా నమస్కరించాలి."


ఆ మాటలువింటూనే అర్జునిడికి కోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు.


"యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత." అనుకున్నాడు.


అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రధాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారధి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రధం పైన వున్న ధ్వజం వైపు చూసాడు. జండా పై వున్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రధమ్ముందు నమస్కరిస్తూ నిలబడ్డాడు.


"శ్రీరామచంద్రా... వాసుదేవా.. నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా... పార్ధుడి రధంపై ధ్వజమై నిలిపి నీ నోటివెంటవచ్చే భగవద్గీత విని నీ విశ్వరూప సదర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా.." అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు.


శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రధంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రధంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.


అంతే... ఫెళ ఫెళ మంటూ రధం కుప్పకూలిపోయింది... రధ చక్రాలు తునాతునకలైయ్యాయి. రధాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపీతులై చూస్తుండగానే రధం అశ్వాలతోసహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు "అర్జునా అర్జునా" అంటూ పరుగున వచ్చాడు.


అర్జునుడు భయపడుతూ "బావా వాసుదేవా.. " అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. "నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది.." అన్నాడు ఖంగారుగా.


ఆ మాటలువింటునే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.


"ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా.." అన్నాడు అర్జునుడు. హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి అన్నాడు -


"పార్థా.. నవ్వక ఏమి చెయ్యమంటావు. నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది."


"నన్ను కాపాడాడా..?"


"అవును అర్జునా... ఈ రధం ఇప్పుడుకూలిపోలేదు... భీష్మ బాణ ధాటికి నీ రధ చక్రాలు కూలాయి... కర్ణ అస్తాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణిచాయి.. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రధం ఎప్పుడో తునాతునకలయ్యింది... బ్రహ్మాస్త్ర ధాటికి నీ రధం యావత్తూ బూడిదయ్యింది..."


"మరి..?"


"నీ

రధంపైన సాక్షాత్తు ఆదివిష్ణువున్నాడు... ఆ పర్మాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచివున్నాయి. ఇప్పుడు వాసుదేవుడు అవరోహించడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రధం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా.. అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంధాముణ్ణి దాటి రావాలి కాబట్టి.."


హనుమంతుడు ఈ మాటలనగానే పాండవులకు తమ అజ్ఞానం బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడి ఎందు ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.


"పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి.." అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.

శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.


              💥 సర్వేజనా సుఖినోభవంతు💥

రత్నధారణ

 సిద్ధ నాగార్జునుడు చెప్పిన రత్నధారణ రహస్యాలు  -


  *  వజ్రము  - 


            దీనిని ధరించడం వలన ఐశ్వర్యం వృద్ది చెందును. ఎల్లప్పుడు నూతన వికాసము కలుగును. విడిపోయిన దంపతులను కలుపును. వజ్రమాల ధరించినచో సుఖప్రసవం అగును. కలరా , ప్లేగు వ్యాధుల నుండి రక్షింపబడును . 


 *  వైడుర్యం  - 


            దీనిని ధరించినచో ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉండును. శత్రుభయం తొలగిపోతుంది. భూత , పిశాచ భాదలు నివృత్తి అవుతాయి. ఆపదలు , అపాయాలు పోగాట్టబడతాయి . దీనిని స్త్రీలు ధరిస్తే సుఖప్రసవం జరుగుతుంది. 


 *  గోమేధికం  - 


           దీనిని ధరించడం వలన నష్టమైన ధనం మళ్లి లభిస్తుంది. అమితమైన ఉద్రేకానికి ఉపశమనం కలుగుతుంది. ఇతరులను సమ్మోహితులను చేస్తుంది . ఆకర్షిస్తుంది.


 *  పుష్యరాగం  - 


           దీనిని ధరించడం వలన వంశము వృద్ది చెందును. భోగబాగ్యాలు కూడా బాగా సమకూరును. 


 *  మరకతం  - 


          దీనిని ధరించడం వలన జ్ఞాపకశక్తి , బుద్ధిబలం పెరుగును . పిచ్చి , ఉన్మాదం , విషదోషం  దృష్టిదోషం నివారించ బడతాయి.


 *  మాణిక్యం  - 


         దీనిని ధరించడం వలన ఆయువు వృద్ది అవుతుంది. ధనధాన్యాలు సిద్దించి లోకంలో ఉన్నత స్థితి కలుగుతుంది. మనసులోని అందోళన , విచారము , చికాకు తొలగిపోతాయి. అంటువ్యాధులు తొలగిపోతాయి. అంటువ్యాదులు రాకుండా నివారించబడును .


 *  నీలము  - 


              దీనిని ధరించడం వలన అర్ధాంతర మృత్యువు తొలగిపోతుంది. అంతులెని కీర్తి , ధనము , అదృష్టం కలుగుతాయి . శనిగ్రహం వలన కలిగే బాధలు తొలగిపోతాయి. సోకకుండా ఉంటాయి. 


 *  పగడము  - 


           దీనిని ధరించడం వలన శత్రువుల మీద విజయం కలుగుతుంది. పట్టరాని ఆవేశం , ఉద్రేకం శాంతిస్తాయి. అప్పులబాధ నుండి బయటపడతారు 


 *  ముత్యము  -  


             దీనిని ధరించడం వలన పనులు లలొ ఆటంకాలు తొలగిపోయి  సకాలంలో జరుగుతాయి. శరీరంలో అతి ఉష్ణం అనిగిపోతుంది . ధనలాభం కలుగుతుంది . వివాహం కానివారికి వివాహం అవుతుంది. 


   


          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


  గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ స్వామివారి కోరిక...*


*(పదకొండవ రోజు)*


శ్రీధరరావు గారితో కేశవులు గారికి పరిచయం ఏర్పడ్డాక..శ్రీ స్వామివారి గురించి ఇద్దరూతరచూ ముచ్చటించుకునే వారు..కాలం గడచిపోతోంది..

శ్రీ స్వామివారి గురించిన ప్రాథమిక సమాచారం విన్న ప్రభావతి గారి మనసులో ఏమూలో వున్న చిన్నపాటి సందేహాలు కూడా తీరిపోయాయి..ఒక నిజమైన సాధకుడికి సేవ చేసుకునే భాగ్యం తమ దంపతులకు కలిగిందని ఎంతో ఆనందపడ్డారు..నిజానికి శ్రీధరరావు గారు మొదటినుంచీ శ్రీ స్వామివారు సాధారణ మానవ మాత్రుడు కాదని..ఒకానొక సిద్ధపురుషుడు ఈ రూపంలో తమ దగ్గరకు వచ్చాడని భావిస్తూ వున్నారు..అదే నిజమయ్యింది..శ్రీ స్వామివారి పరిచయం తరువాత ఆ దంపతుల జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి..


శ్రీధరరావు, ప్రభావతి దంపతులు యధావిధిగా ప్రతి శనివారం మాలకొండకు వెళ్లి వస్తున్నారు..మాలకొండ వెళ్లిన ప్రతిసారీ శ్రీ స్వామివారిని కలిసిరావడం వారి పర్యటనలో ఒక భాగం అయిపోయింది..శ్రీ స్వామివారు కూడా ఈ దంపతులు వచ్చేసమయానికి కొద్దిగా అటూ ఇటుగా..పార్వతీదేవి మఠానికి చేరుకునేవారు..ఒక్కొక్కసారి ఆయన తపస్సాధన లో మునిగిపోయివుంటే..శ్రీధరరావు గారు ప్రభావతి గారు కొద్దిసేపు ఎదురుచూసి..తిరిగి తమ గ్రామానికి చేరుకునేవారు..


అలా ఒక శనివారం సాయంత్రం నాలుగు, ఐదు గంటల ప్రాంతంలో..శ్రీ స్వామివారిని కలుద్దామని ఈ దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం వద్ద వేచి ఉన్నారు..కొద్దిసేపటికే శ్రీ స్వామివారు శివాలయం వద్దనుంచి మెల్లిగా దిగివచ్చి..పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకుని..వీరిద్దరి ఎదురుగ్గా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు..ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది..చల్లటి చిరునవ్వు..ఆప్యాయత ఉట్టిపడే చూపు..ఉదయం నుంచీ మాలకొండ లక్ష్మీ నృసింహుడి దర్శనం.. ఆ తరువాత కొండ శిఖరం పై ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయం..ఇవన్నీ ఎక్కి దిగి..మళ్లీ పార్వతీదేవి మఠం దాకా మెట్ల మార్గంలో వచ్చిన బడలిక అంతా..శ్రీ స్వామి వారి ప్రసన్న వదనం చూడగానే మటుమాయం అయింది..


"ధ్యానం లో ఉండగా బ్రాహ్మణ దంపతులిద్దరూ వచ్చారని ఆదేశం వచ్చిందమ్మా..వెంటనే లేచి ఇలా వచ్చేసాను..శ్రీధరరావు గారూ మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి..అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది..చెప్పమంటారా?.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.."చెప్పండి.." అన్నారు..


"ఈ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి కొండమీద..ఈ శివ పార్వతుల సమక్షం లో నా తపస్సాధన పూర్తి అయింది..త్వరలో నేను ఆశ్రమం నిర్మించుకొని...అందులో కొరవ సాధన చేసి..మోక్ష ప్రాప్తిని పొందాలి..ఆశ్రమ నిర్మాణం కొరకు నాకు స్థలం కావా!ఈ..అది మీరు ఏర్పాటు చేయాలి.." అన్నారు గంభీరంగా..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..వాళ్ళిద్దరి హృదయాలలో శ్రీ స్వామివారి కోరిక కలవరం కలిగించింది..మళ్లీ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు..ప్రభావతి గారు ఏదో అడుగబోయేంతలో శ్రీధరరావు గారు కల్పించుకుని.."మీరు త్వరపడకండి స్వామీ..మేము ఇంటికెళ్లి ఆలోచించుకుని మళ్లీ మిమ్మల్ని కలుస్తాము..సావకాశంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాము..మనం కూర్చుని కూలంకషంగా చర్చించుకుని ఆపై ఒక నిర్ణయానికి వద్దాము.." అన్నారు..


శ్రీధరరావు గారు ఎంతో సంయమనంతో చెప్పిన మాటలు విన్న స్వామివారు.."మీరూ ఆలోచించండి..కానీ ఈ క్షేత్రం లో నా సాధన పూర్తి కావొచ్చింది..ఇక ఇక్కడ ఎక్కువ కాలం వుండే పరిస్థితి లేదు..మీరు చెప్పినట్లే మళ్లీ త్వరలో..( త్వరలో అన్నమాట శ్రీ స్వామివారు నొక్కి చెప్పారు..) ఈ సంకల్పం నెరవేరుతుంది..ఇప్పటికే పొద్దు కూకుతోంది..మీరు మళ్లీ మొగలిచెర్ల వెళ్ళాలి..ఇక బైలుదేరండి.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామి వారికి నమస్కారం చేసి, పార్వతీదేవి మఠం వద్దనుండి మెట్లు దిగి, తమ గూడు బండిలో కూర్చుని మొగలిచెర్లకు పయనం అయ్యారు..


అప్పటిదాకా ఓపిక పట్టివున్న ప్రభావతి గారు..ఇక ఆగలేక పోయారు.."శ్రీవారూ..ఇదేమిటి?..ఈయన ఈ కోరిక కోరాడు?..పాపం కేశవులు గారు ఎంతో ఆశపెట్టుకుని ఆశ్రమం కొరకు  ఇస్తానన్న భూమి వద్దన్నారు..మనలను మాత్రం తానే అడిగారు..ఈ క్షేత్రం లో చేసే సాధన కన్నా..జన బాహుళ్యం లోకి వచ్చి, ఆశ్రమం కట్టుకొని చేసే సాధన ఏ విధంగా సాగుతుంది..సాధారణ మనుషుల మధ్యకు వస్తే..ఇతరత్రా కోరికలు పట్టవా?..మామూలు ప్రలోభాలకు లొంగిపోరా?.." అని అడిగారు..శ్రీధరరావు గారు మాత్రం నిశ్చింతగా.."నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడతావనే..నేను ముందుగా గ్రహించి..నేనే స్వామివారితో మళ్లీ చర్చిద్దామని చెప్పాను ప్రభావతీ..కాలం మన జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో తెలీదు..అన్నీ పరిశీలిద్దాము..చూద్దాం..ఏం జరుగుతుందో.." అన్నారు..ఈ జవాబుతో ప్రభావతి గారు సంతృప్తి చెందలేదు..ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి..


శ్రీ స్వామివారి వివరణ... రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్: 94402 66380 & 99089 73699).