30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

శ్రీదేవీసంస్తుతి-5

 శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి-5 


పంచమి 

9.

మత్ హృన్మందిరదివ్యధామ్నినివసత్ హ్రీంకారబీజేశ్వరీమ్ 

నిత్యానందగుణస్వరూపరుచిరాం నిత్యాం పరాదేవతామ్ 

ఆత్మజ్ఞాననియంత్రణైకకుశలా మార్యాం కలాధారిణీమ్ 

అంతర్యాగపరాయణైకసులభాం వందే జగన్మాతరమ్ 


10. కాలిక 

విద్యానుగ్రహశాలినీం స్తుతమతిం కామ్యప్రదాం కాలికామ్ 

శత్రూణాం ప్రవిమర్దినీం ధృతిమతీం సామ్రాజ్యలక్ష్మీప్రదామ్ 

ప్రజ్ఞాం నిర్గుణపూజనప్రియమతీం కామ్యార్థకల్పద్రుమామ్ 

దుష్టారిష్టతమోంఽధకారశమనాం స్తోతాస్మహే దేవతామ్ 

*~శ్రీశర్మద*

గోత్రమని అంటే

 *గోత్రం అంటే ఏమిటి?* 

సైన్సు ప్రకారము  మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి.


మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??


గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 

*జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే!


గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?

మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 

వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 


కొడుకులకు ఈ గోత్రం  ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?

వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? తర్కం ఏమిటి?


ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!


గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది. మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం

గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.


జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి, వీటిల్లో సెక్స్ క్రోమోజోములు (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని (gender) నిర్ణయిస్తుంది.


గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు.


XY లో - X తల్లి నుండి  మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.


ఈ Y ప్రత్యేకమైనది మరియు అది X లో కలవదు.  కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు ... అలా..).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 


ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి...

గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా  ఉండకూడదు. ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.


ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.


ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...


మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయోసైన్స్ గోత్రం. ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు.


మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.


అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి.

ఇలా వివరణతో సహా చెప్పండి. షేర్ చేయండి

నిబంధన తీసుకురావాలి._*

 🌼🌼💧🌿🌿🌿☄️

*_18 ఏళ్లకే డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్ ,సిగరెట్లకి బానిసలుగా మారుతున్న  యువతను కాపాడేదెట్ల?_*


  *_ఇనుప కండలు, ఉక్కు నరాలతో ఉండాల్సిన యువత  మత్తు పదార్థాలకు బానిసై పెలుసుగా మారి  సమయం వృధా చేస్తూ  దేశ భవిష్యత్తు ని ప్రమాదంలోకి నెడుతున్న నేటి పరిస్థితుల్లో యువత ని కాపాడే బాధ్యతను తల్లిదండ్రులు ప్రజలు ..ఉపాధ్యాయులు,ప్రభుత్వాలు  తీసుకొని  తగు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది._*


*_ఇప్పుడు ఎందుకు చెపుతున్నాను అంటే ఈ రోజు  విచారిస్తే  అతని కస్టమర్స్ లో  90 శాతానికి పైగా  విద్యార్థులే ఉన్నారని ఇది బాధాకరమని  చెప్పడం విన్నాను, పోలీసులు, ప్రభుత్వం ఎంత కట్టడి చేసిన ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్& గంజాయిని యువత  దొరికించుకోగలరు?  అందుకే దీనికి  అడ్డుకట్ట ఎట్లా ?అంతం ఎక్కడ....? అని నేను ఆలోచిస్తే  నా మదిలో కొన్ని ఆలోచనలు   మెదిలాయి._*




*_1) విద్యార్థుల కు   ఇంటర్ నుండి  పరీక్షలు రాయాలన్నా.. పై చదువులకు  అర్హత , అడ్మిషన్స్  పొందాలన్నా  ఆల్కహాల్ &  డ్రగ్స్ టెస్ట్ చేసి  అందులో క్లీన్ గా ఉన్నవారికే  అనుమతి ఇవ్వాలి అనే నిబంధన తీసుకురావాలి._*


*_2). ప్రభుత్వ  ఉద్యోగాలకు   పరీక్షలు రాయాలన్న మరియు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత  సాధించాలంటే అన్ని అర్హతలతో పాటు ఆల్కహాల్ & డ్రగ్స్ క్లీన్  సర్టిఫికేట్  కూడా  ఉండాలి  అనే నిబంధనలు పెట్టాలి._*


*_3)  IT, BT, ఇతర ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు  కూడా  డ్రగ్స్ సర్టిఫికెట్   తప్పనిసరి చేయాలి._*


*_4). స్వయం ఉపాధికి ప్రభుత్వ రుణాలు ,సబ్సిడీలు పొందాలంటే  కూడా డ్రగ్స్ సర్టిఫికెట్   సమర్పించాలి అనే నిబంధనలు పెట్టాలి._*


*_5). పెళ్ళిళ్ళకి కూడా డ్రగ్స్ క్లీన్ సర్టిఫికెట్  నిబంధన పెట్టాలి_*


*_నేను పైన చెప్పిన కొన్ని ఆలోచనలు కొంత వరకైనా  యువతను  కాపాడగలదని  అనుకుంటున్నాను.లేదంటే  దేశాభివృద్ధి కి తీవ్ర విఘాతం కలుగుతుంది. మీరు కూడా కొంత ఆలోచన చేసి  డ్రగ్స్ ,ఆల్కహాల్ భారీ నుండి యువతకి ఎలా కాపడవచ్చో  మీకున్న ఆలోచనలు పంచుకోండి._*

🙏🙏🙏🙏

శారదదాంబా

 🪷శృంగేరి పీఠం శంకరమఠము, *శారదదాంబా* 

 తేది 30 సెప్టెంబరు, 2022 శుక్రవారం (భృగువాసరే)    

*శరన్నవరాత్రుల* - ఐదవ రోజు *ఇంద్రాణి*

*(శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి)* అలంకరణ విద్యానగర్ - నల్లకుంట, హైదరాబాదు....🙏


*కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్జ్వలే |వృత్రప్రాణహరే చైంద్రి నారాయణి నమోఽస్తుతే* ||


*చక్రాకారం మహత్తేజః తన్మధ్యే పరమేశ్వరీ ! జగన్మాతా జీవదాత్రీ నారాయణీ పరమేశ్వరీ* !!


*వ్యూహతేజో మయీ బ్రహ్మానందినీ హరిసుందరీ ! పాశాంకుశేక్షుకోదండ పద్మమాలాలసత్కరా !!*


*దృష్ట్వా తాం ముముహుర్దేవాః ప్రణేముర్విగతజ్వరాః ! తుష్టువుః శ్రీమహాలక్ష్మీం లలితాం వైష్ణవీం పరాం !!*


🌹🌷🙏🪷🪷🙏🌷🌹

మోక్షద్వారాలు

 #మోక్షద్వారాలు తెరిచే... ఈ దానాలు తప్పక చేయండి!

పూర్వ జన్మలో మనం చేసిన దాన ధర్మాల ఫలితమే ఈ జన్మ అనేది, చాలా మంది విశ్వాసం. ఈ జన్మ లో చేసిన దాన ధర్మాలు వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడతాయి అనే మాటలు మనం వింటూ ఉంటాము. అయితే, శాస్త్రాలు, పురాణాలు కూడా, దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలూ ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి. ఈ కారణంగానే చాలా మంది గుడిలో దైవ దర్శనం చేసుకున్న తరువాత, గుడి దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి, తమకి తోచిన విధంగా బియ్యం, డబ్బులు, పళ్ళు, వస్త్రాలు, ఇలా దాన ధర్మాలు చేస్తుంటారు. అయితే, పేదవానికి మీ శక్తి కొలదీ చేసే ద్రవ్య సహాయము కానీ, వస్తు సహాయము కానీ, ‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం, ఇహ లోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మనకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, ఏదైనా దానంగా ఇవ్వడానికి వీలు లేదు. దానం చేయడానికి కొన్ని పరిధులున్నాయి. ఏది పడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్ర నియమానుసారంగా, దాన యోగ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం 10 దానాలు: 1. దూడతో కూడుకున్న ఆవు: ఇదే గోదానం, 2. భూ దానం, 3. నువ్వులు, 4. బంగారము, 5. ఆవునెయ్యి, 6. వస్త్రములు, 7. ధాన్యము, 8. బెల్లము, 9.వెండి, 10. ఉప్పు.. ఈ పదింటినీ దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్ర పూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. అన్నదానం, వస్తద్రానం, జలదానం గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషిని సంతృప్తి పరచేది అన్నదానము. దాహార్తిని తీర్చేది జలదానం. ముఖ్యంగా వేసవికాలంలో బాటసారుల దాహార్తిని తీర్చటం ద్వారా, వారికి మనమెంతో మేలుచేసిన వారమౌతాం. వస్త ద్రానం చేస్తే, సాక్షాత్తూ ఆ భగవంతుడికే వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది. ఎండా, వానా, చలినుండి, పేదలను కాపాడిన తృప్తి మనకు దక్కుతుంది. ఇక కన్యా దానం చేయటం ద్వారా, ఆ కన్య ద్వారా ఒక వంశం వృద్ధి చెందుతుంది. తద్వారా కొన్ని తరాల పరంపర కొనసాగుతుంది. గోదానం మహిమ, చెప్పనలవికానిది. గోవునూ దూడనూ కలిపి దానం చేస్తే, మన పితృదేవతలను వైరతరణీ నదిని దాటించి, స్వర్గలోక గతులను చేసిన పుణ్యం దక్కుతుంది. దానాలన్నింటిలోకీ ఉత్కృష్టమైనది, భూదానం. భూమిని మన పెద్దలు రత్నగర్భ అని పిలిచేవారు. సువర్ణ, జల, నవరత్న ఖచిత మణి మణిక్యాదులన్నీ, భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి, భూమిని దానం చేయటంవల్ల, భూమితోపాటుగా, పైవాటినన్నింటినీ కూడా దానం చేసిన ఫలితం ఉంటుంది. ఆ భూమిలో పొందే పంటల వలన మానవులకే కాక, పశు పక్ష్యాదులకన్నింటికీ ఆహారం చేకూర్చిన వాళ్లమవుతాం. పేదలకు జీవన భృతి దొరుతుంది. చేసిన దాన ధర్మాల వలన, ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రత్యుపకారమునాశింపక చేసే దానము పుణ్యప్రదము. కానీ, ప్రతిఫలాన్ని ఆశించి దానం చేస్తే, అది దానంగా గ్రహించబడదు. అంటే, ఇదిగో ఈ దానం చేస్తున్నాంగనుక, ఈ ఫలం తప్పక రావాల్సిందే.. అనిగాక, ఎదుటివారి అవసరాన్ని ఎరిగి, వారికి కావలసిన వస్తువులను దానం చేయడం, ఉత్తమం. దాని వల్ల మంచి ఫలితమే వస్తుందని, మన పురాణాలు చెబుతున్నాయి. ఏమి చేస్తామో, ఏమి ఆలోచిస్తామో, అవే ఎదురవుతుంటాయి. ఆకలిగొన్నవారినీ, అనాధలనూ, రోగులనూ, అసమర్థులనూ, అన్న, వస్త్ర, ఓషధులు మొదలైనవి లేనివారినీ, విద్వాంసులనీ, బ్రాహ్మణులనీ, ధనాదులచే ఆదుకొనుటా, సత్కరించుట కూడా దానమనే చెప్పవచ్చు...

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

పార్వతి పేర్లు

 శ్లోకం:☝️అమరకోశంలో పార్వతి పేర్లు

*ఉమా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవతీశ్వరీ*

*శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమఙ్గళా l*

*అపర్ణా పార్వతీ దుర్గా మృడానీ చణ్డికాఽమ్బికా*

*ఆర్యా దాక్షాయణి చైవ గిరిజా మేనకాత్మజా ll*


భావం: ఉమా = ఉ+మా = ఉ అంటే ఎవరినైనా పిలుచుట, మా = వద్దు, పార్వతి శివుని కొరకు తపస్సు చేయడానికి బయలుదేరగా ఆమె తల్లియైన మేనక పార్వతిని ‘‘ఓయి ! వద్దు’’ అని వారించెను.

పార్వతీ; కాత్యాయనీ = జగన్మాత కాత్యాయన మహర్షి కూతురుగా జన్మించెను. అందువలన పార్వతీదేవి కాత్యాయనీ అనే పేరుతో కూడా పిలవబడుచున్నది. 

గౌరీ = సహజముగా పార్వతి రంగు నలుపు, ఐతే ఆమె బ్రహ్మకోసం తపస్సు చేసి బంగారు రంగుకు మార్పు చెందింది.

కాళీ = పార్వతి యొక్క ముదురు నలుపు రూపాన్ని కాళీగా పిలుస్తారు. ఆమె అశుభమైనవి నాశనం చేస్తారు;

హైమవతీ = పర్వతరాజైన హిమవంతుని కూతురు;

ఈశ్వరీ = భగవతీ, జగన్మాతా;

శివా = పార్వతి శివుని యొక్క ఉనికి. అందుకని పార్వతిని శివా మరియు శివానీ అని పిలుస్తారు.

భవానీ = ఉత్పత్తి జేయగల శక్తి కలిగిన మాత; 

రుద్రాణీ = రుద్రుని (శివుడు) యొక్క దేవేరి ;

శర్వాణీ = శర్వా (నలుపు) అవతారం లో శివుని యొక్క దేవేరి ; 

అపర్ణా = అ+పర్ణ = పార్వతి శివుని కోసం ఏమీ (కనీసం ఆకులైన ) తినకుండా తపస్సు చేస్తుంటే అక్కడ ఉన్న సాధువులు ఆమెను అపర్ణా అని పిలిచేవారు.

పార్వతీ = పర్వతరాజు కూతురు; 

దుర్గా = పార్వతి యొక్క రూపం, అజేయురాలు;

మృడానీ = ఆనందాన్నిచ్చే పార్వతి రూపం;

చండికా = కాళీ, సరస్వతీ, లక్ష్మీ ఈ కలిపిన రూపం, ఆ రూపం భయకరమైనది దరి చేరడానికి అసాధ్యమైనది;

అంబికా = పార్వతియొక్క మరొక రూపం, 8 చేతులతో వివిధములైన ఆయుధములతో పులిని గాని సింహముని గాని అధిరోహిస్తున్నట్టుగా ఉన్న రూపం;

దాక్షాయణీ = దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి యొక్క మరియొక అవతారము;

గిరిజా = గిరి+జ= పర్వతం +పుట్టుట= పర్వతము యొక్క (హిమవంతుని) కూతురు;

మేనకాత్మజ = మేనక + ఆత్మజ = హిమవంతుని భార్య మేనక కూతురు.🙏

ఆటిజం జైగాంటిజం కారణాలు

 మాంసం తినే పాశ్చాత్య ఆవులు

=====

అమెరికాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఆటిజం (పిల్లలలో బుద్ధిమాంద్యం), జైగాంటిజం (చిన్నపిల్లలు కూడా రాక్షసులలాగా పెరిగిపోవడం), ఒబెసిటీ (ఊబకాయం), ప్రికోసియస్ ప్యూబర్టీ (తొమ్మిదేళ్లకే ఆడపిల్లలు రజస్వలలు కావడం, ఎనిమిదేళ్లకే అబ్బాయిలకు గడ్డాలు మీసాలు రావడం), 25 ఏళ్లకే వస్తున్న రకరకాల కేన్సర్లు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయా అని తెగ పరిశీలించా చాలాసార్లు. వీటన్నిటికీ కొన్ని కారణాలు కనిపించాయి. అవి, 


1. జీవనవిధానాలు లేదా లైఫ్ స్టైల్స్. అంటే, ఒక వేళకు నిద్ర లేవడం, నిద్రపోవడం లాంటి ఒక నియమిత జీవనవిధానం లేకపోవడం. 


2. ఆహారదోషాలు. అంటే, ప్రాసెస్ చేసినవి, ఫ్రోజెన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, రెడ్ మీట్ లాంటివి తెగ తినడం.


3. సిగరెట్లు, త్రాగుడు, వీడ్ మొదలైనవి వివరీతంగా తీసుకోవడం.


4. ఉద్యోగ టెన్షన్లు. విపరీతమైన పని ఒత్తిడితో, టెన్షన్ తో, బాగా చేయకపోతే ఉద్యోగం పోతుందేమో అన్న భయంతో ఏళ్లకేళ్లు పనిచేయడం.


5. మోడ్రన్ మెడిసిన్ లో వాడబడుతున్న సింథటిక్ డ్రగ్స్, ఇంకా స్టెరాయిడ్స్ మొదలైన వాటి వాడకం. ప్రతి చిన్నదానికీ భయపడి హై పవర్ మందులు వాడెయ్యడం. 


6.. వందలాది టీకాలను పుట్టినప్పటినుండీ పిల్లలకు విచక్షణారహితంగా వేయించడం.


ఇలా చాలా కారణాలు నాకు కనిపించాయి. కానీ వీటిని చెప్పినా కూడా ఎవరూ నమ్మనంతగా జనం తయారయ్యారు. పైగా, 'ఇవి కారణాలు కాదులే' అని తేలికగా కొట్టిపారేస్తున్నారు. సరే ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు? అని నేనూ వదిలేస్తూ ఉంటాను.


మూడేళ్ళ క్రితం మావాడు నాతో ఫోన్లో మాట్లాడుతూ, 'నాన్నా నేను పాలు పెరుగు మానేశాను.  వీగన్ నయ్యాను' అన్నాడు.


నేను షాకయ్యాను.


'అదేంటి నాన్నా? పాలూ పెరుగూ మానేస్తే ఎలా? మనం తినే ఆహారంలో కాస్త ప్రోటీన్ అదే కదా? పైగా పెరుగేమో ప్రో బయాటిక్. గట్ హెల్త్ కి అది చాలా అవసరం. అది మానేస్తే ఎలారా?' అని కొంచం గదిమినట్లే అన్నాను.


మావాడు తేలికగా, 'నువ్వు ఇక్కడికొచ్చినపుడు నీకర్థమౌతుందిలే నాన్నా' అన్నాడు.


'సరే. అక్కడి పరిస్థితులేంటో మనకు తెలీవు కదా. వెళ్ళినపుడు చూద్దాం' అనుకోని నేనూ ఊరుకున్నాను.  


ఇక్కడికొచ్చి నలభై రోజులయ్యాయి. ఈ నలభై రోజులలో అరుగుదలలో చాలా తేడా వచ్చింది.  ముందు నీళ్ల తేడా అనుకున్నాను. కానీ రోజురోజుకూ కొన్ని సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపిస్తున్నది.  మొదటిరోజునుంచీ ఇక్కడ పాలు, పెరుగుల మీద నాకేదో అనుమానంగానే ఉంది. అవి సహజంగా ఉన్నట్లు అనిపించవు. రుచి తేడాగానే ఉంటుంది, అదీగాక వాటిని తీసుకున్న తర్వాతే అరుగుదల సమస్యలు ఎక్కువౌతున్నట్లు అనిపించింది.  అందుకని ఈ మధ్యనే అవి రెండూ మానేశాను. వెంటనే అప్పటిదాకా కనిపిస్తున్న డైజెషన్ సమస్యలన్నీ మంత్రం వేసినట్లుగా మాయమయ్యాయి. ఈ రెండే అసలైన దొంగలని అర్ధమైంది. వీటిమీద ఇంకాస్త రీసెర్చి చేద్దామని నిర్ణయించుకున్నాను. 


ఈ లోపల డెట్రాయిట్ రిట్రీట్ వచ్చింది. నాలుగైదు రాష్ట్రాల నుండి సభ్యులు వచ్చారు. ఒకరోజున  మాటల మధ్యలో ఇదే టాపిక్ వచ్చింది.


'డైరీ ప్రాడక్స్ ఇక్కడివాళ్లకు అసలైన చేటు చేస్తున్నాయని నా ఉద్దేశ్యం' అన్నాను.


సభ్యులలో ఒక డాక్టర్ ఉన్నారు. ఆమె గత ముప్పై ఏళ్ళనుంచీ ఇక్కడ డాక్టర్ గా ఉన్నారు. ఆమె నా మాటలతో ఏకీభవించడమే గాక, ఇలా అన్నారు.


'ఇక్కడ ఆవులకు మాంసం తినిపిస్తున్నారు. వాటి పాలను కల్చర్ చేసి, చాలా మార్చేసి మార్కెట్లో పెడుతున్నారు. వాటిని త్రాగిన పిల్లల్లో మీరు చెప్పిన రోగాలన్నీ వస్తున్నాయి. చిన్నచిన్న పిల్లల్లో కూడా కేన్సర్లు వస్తున్నాయి. ఇక్కడి తిండే ఇక్కడి రోగాలకు కారణం, పాలు బాగా త్రాగాలని ఇక్కడి పిల్లలకు మనవాళ్లు తెగ తాగిస్తారు. అవే వాళ్ళ కొంప ముంచుతాయి. కానీ ఆ విషయం అర్ధమయ్యేసరికి చేయి దాటిపోతుంది.'


నేను నిర్ఘాంతపోయాను.


'ఆవులకు మాంసమా?' అన్నాను నోరెళ్ళబెట్టి. కానీ అమెరికాలో ఆమె చాలా సీనియర్ డాక్టర్ అవడం చేత ఆమె చెప్పినది నమ్మక తప్పలేదు.


తరువాత రీసెర్చి చేస్తే దిమ్మెరపోయే నిజాలు బయటపడ్డాయి.


ఇక్కడ స్టోర్స్ లో, 'గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్' అని విడిగా పాలపేకెట్లు దొరుకుతాయి. అంటే, 'గడ్డి తినే ఆవుల పాలు' అన్నమాట. మొదటిసారి స్టోర్స్ లో ఈ పాల పాకెట్స్ చూసినపుడు నాకు మళ్ళీ మతిపోయింది. 


'ఆవులు గడ్డి తినక ఇంకేం తింటాయి?' అనడిగాను.


'అలా కాదు, బలం కోసం, మరిన్ని పాలివ్వడం కోసం వాటికి బీన్స్ పెడతారు. అంతేగాక హార్మోన్  ఇంజక్షన్లు ఇస్తారు' అని నాకు చెప్పారు.


ఇప్పుడు, ఆ బీన్స్ తో బాటు, మాంసాన్ని బాగా ఎండబెట్టి, పొడిచేసి, అందులో కలిపి ఆవులకు తినిపిస్తున్నారన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవం బయటపడింది. అందులో పందిమాంసం కూడా ఉంటుందట. అందుకే ఇక్కడి పాలు ఏదోగా ఉంటాయి. పెరుగేమో బంక బంకగా సాగుతూ ఉంటుంది. సహజమైన రుచి వాటిలో ఉండదు.


అంటే, అలాంటి మాంసం తిని, హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకున్న ఆవుల పాలు, డబల్ పాశ్చరైజేషన్, కల్చర్ చెయ్యబడిన తర్వాత, మనం త్రాగుతున్నాం. అదే పెరుగును తింటున్నామన్న మాట !


మరి పైన చెప్పిన నానా రోగాలు రాక ఇంకేమొస్తాయి?


అమెరికాలో అడుగుపెట్టిన మొదటిరోజునుంచీ నాకీ పాలంటే, పెరుగంటే ఎందుకు అసహ్యంగా ఉందో ఇప్పుడర్థమైంది. వాటిని మానేశాక, ఎందుకు హాయిగా ఉందో ఇంకా బాగా అర్ధమైంది.


ఇవీ ఫుడ్ మాఫియా లీలలు !


అందుకేనేమో, అమెరికాలో ఎక్కడ చూసినా వీగన్ కల్చర్ బాగా ఎక్కువైంది. ఇప్పుడు ఇండియాలో కంటే అమెరికాలోనే శాకాహారులు ఎక్కువగా ఉన్నారు. ఇండియాలో మనం పాలు పెరుగులు కూడా తీసుకుంటాం. ఇక్కడ వీగన్స్ అవి కూడా తినరు. పూర్తిగా మొక్కల నుండి తయారైన ఆహారాన్నే వీళ్ళు వాడతారు.  వీగనిజం అనేది ప్రస్తుతం ఇక్కడొక ఉద్యమంలా వ్యాపిస్తోంది. ఎక్కడచూచినా వీగన్ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఇండియాలో తినే శాకాహారమే అన్నిటికంటే బెస్ట్ బేలన్సుడ్ ఫుడ్ అని అమెరికన్లు చాలామంది అంటున్నారు.


చావుకొస్తుంటే చస్తారా మరి?


ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను.


బాక్సింగ్ రంగంలో ఎప్పటికీ గుర్తుండే పేరు - మైక్ టైసన్. రెడ్ మీట్ లేనిదే అతనికి ముద్ద దిగదు, అతనితో రింగ్  లోకి దిగాలంటే భయపడి చచ్చేవాళ్ళు ప్రత్యర్ధులు. కానీ ప్రస్తుతం అతను వీగన్.


'ఎందుకిలా అయ్యావు? అని ఎవరో అడిగితే అతనిలా చెప్పాడు.


'రెడ్ మీట్ నాకు చేసిన హానిని నా బాడీ నుంచి క్లిన్ చేసుకోవడానికి ఇంతకంటే నాకు మార్గం కనిపించలేదు, అందుకే వీగన్ నయ్యాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది' అన్నాడు. 


మైక్ టైసన్ నుండి ఈ మాటను ఊహించగలమా? కానీ ఇది నిజం. యూట్యూబ్ లో ఉంది చూడండి.


అమెరికా నాశనమౌతున్నది ఫుడ్డు, మందులు, జీవన అలవాట్ల నుంచి మాత్రమే. ఇప్పుడు ఈ జాడ్యం మన ఇండియాకి కూడా దిగుమతి అవుతున్నది. ఇప్పటిదాకా లేని రోగాలను మనం  ఇండియాలో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా యువతలో. ముప్ఫైకే అన్నీ ఉడిగిపోయి జీవచ్ఛవాలైపోతున్నారు.


ప్రపంచ వినాశనం అణ్వస్త్రాలతో కాదుగాని, ఆహారపు అలవాట్లతోనే వచ్చేటట్టు ఉంది.


విపరీతంగా డబ్బు చేతిలో ఉన్నా, ఆకులూ అలములూ తినాల్సి రావడం ఎంత విచిత్రమో కదా? ఆ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నట్లో మరి?? ఎటు పోతోంది మానవజాతి?


వేపచెట్టుకు తియ్యటి పండ్లు కాస్తాయి, చింతచెట్టు నుంచి పాలు కారతాయి. అని బ్రహ్మంగారు వ్రాశారు.


'ఆవులు మాంసం తింటాయి, మానవజాతి వినాశనానికి అదొక గుర్తు'. అని కూడా వ్రాశారో లేదో మరి. కాలజ్ఞాన పండితులు చెప్పాలి.


ఏదేమైనా పాలూ పెరుగూ తినడం మానేశాక నాకు చాలా హాయిగా ఉంది. నేనూ వీగన్నయ్యానా? చూడబోతే అలాగే ఉంది మరి !


సేకరణ                 *బాబ్ లాల్*

Saidulu song