30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

పార్వతి పేర్లు

 శ్లోకం:☝️అమరకోశంలో పార్వతి పేర్లు

*ఉమా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవతీశ్వరీ*

*శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమఙ్గళా l*

*అపర్ణా పార్వతీ దుర్గా మృడానీ చణ్డికాఽమ్బికా*

*ఆర్యా దాక్షాయణి చైవ గిరిజా మేనకాత్మజా ll*


భావం: ఉమా = ఉ+మా = ఉ అంటే ఎవరినైనా పిలుచుట, మా = వద్దు, పార్వతి శివుని కొరకు తపస్సు చేయడానికి బయలుదేరగా ఆమె తల్లియైన మేనక పార్వతిని ‘‘ఓయి ! వద్దు’’ అని వారించెను.

పార్వతీ; కాత్యాయనీ = జగన్మాత కాత్యాయన మహర్షి కూతురుగా జన్మించెను. అందువలన పార్వతీదేవి కాత్యాయనీ అనే పేరుతో కూడా పిలవబడుచున్నది. 

గౌరీ = సహజముగా పార్వతి రంగు నలుపు, ఐతే ఆమె బ్రహ్మకోసం తపస్సు చేసి బంగారు రంగుకు మార్పు చెందింది.

కాళీ = పార్వతి యొక్క ముదురు నలుపు రూపాన్ని కాళీగా పిలుస్తారు. ఆమె అశుభమైనవి నాశనం చేస్తారు;

హైమవతీ = పర్వతరాజైన హిమవంతుని కూతురు;

ఈశ్వరీ = భగవతీ, జగన్మాతా;

శివా = పార్వతి శివుని యొక్క ఉనికి. అందుకని పార్వతిని శివా మరియు శివానీ అని పిలుస్తారు.

భవానీ = ఉత్పత్తి జేయగల శక్తి కలిగిన మాత; 

రుద్రాణీ = రుద్రుని (శివుడు) యొక్క దేవేరి ;

శర్వాణీ = శర్వా (నలుపు) అవతారం లో శివుని యొక్క దేవేరి ; 

అపర్ణా = అ+పర్ణ = పార్వతి శివుని కోసం ఏమీ (కనీసం ఆకులైన ) తినకుండా తపస్సు చేస్తుంటే అక్కడ ఉన్న సాధువులు ఆమెను అపర్ణా అని పిలిచేవారు.

పార్వతీ = పర్వతరాజు కూతురు; 

దుర్గా = పార్వతి యొక్క రూపం, అజేయురాలు;

మృడానీ = ఆనందాన్నిచ్చే పార్వతి రూపం;

చండికా = కాళీ, సరస్వతీ, లక్ష్మీ ఈ కలిపిన రూపం, ఆ రూపం భయకరమైనది దరి చేరడానికి అసాధ్యమైనది;

అంబికా = పార్వతియొక్క మరొక రూపం, 8 చేతులతో వివిధములైన ఆయుధములతో పులిని గాని సింహముని గాని అధిరోహిస్తున్నట్టుగా ఉన్న రూపం;

దాక్షాయణీ = దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి యొక్క మరియొక అవతారము;

గిరిజా = గిరి+జ= పర్వతం +పుట్టుట= పర్వతము యొక్క (హిమవంతుని) కూతురు;

మేనకాత్మజ = మేనక + ఆత్మజ = హిమవంతుని భార్య మేనక కూతురు.🙏

కామెంట్‌లు లేవు: