17, ఆగస్టు 2022, బుధవారం

రామ రామ రామేతి

 🙏🌺శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే

  సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే🌺🙏


 🌺"శ్రీరాముడు" ఎక్కడుంటారు అని చెప్తారో తెలుసా శాస్త్రంలో...

"రామచంద్రమూర్తి"ని నమ్ముకొని బ్రతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో...రాముడు అక్కడే ఉంటాడు. 

ప్రక్కనే ఉంటాడుట ధనుర్ధరుడై. 

ఆయన కూర్చుంటే కూర్చుంటాడు...

నిలుచుంటే నిల్చుంటాడు...

ఆయన వెడుతూంటే వెళతాడు. ఆయన పడుకుంటే గుమ్మం ముందు కూర్చుంటాడట.

ఎందుకంటే... ఆయనకి ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని.🌺

🌺రామచంద్రమూర్తి తనను నమ్మిన వాళ్ళను రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుంటాడు.

అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామ భక్తులు ఎక్కడ ఉంటారో... అక్కడే "సీతారామలక్ష్మణులు" "హనుమ"  కూడా ఉంటారు. 

ఇది "తులసీదాసు" గారి జీవితంలో నిజమైంది. ఆయన "రామ"దర్శనం అవ్వాలి అనుకుంటూ పడుకుంటే... 

ఒక దొంగ వచ్చి లోపలికి వెళ్ళి... దొరికినవి మూట కట్టుకొని... బయటకు వద్దాం అనుకున్నాడు. 

తల బైటపెట్టాడు.

"రామలక్ష్మణులు" ఇద్దరూ కోదండాలు పట్టుకొని నిల్చొని ఉన్నారు.

నన్ను నమ్ముకున్న వాడి సొత్తు ఎత్తుకు పోతావా నువ్వు అని. 

ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. 

తెల్లవారే వరకు తల బైటపెడుతున్నాడు... 

లోపల పెడుతున్నాడు.

రామలక్ష్మణులు ఇద్దరూ అలాగే ఉన్నారు. తెల్లవారింది. తులసీ దాసు గారు నిద్రలేచారు. 

దొంగ మూట కట్టుకొని కూర్చుని ఉన్నాడు. 

నువ్వు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అని అడిగారు. బుద్ధి గడ్డితిని దొంగతనానికి వచ్చాం అన్నాడు.

పట్టుకెళ్ళపోయావా? అన్నారు. 

తీసుకు వెళదామని బయటికి వెళ్తే... ఎవరో ఇద్దరు ఉన్నారు. 🌺

🌺ఒకాయన నల్లగా మేఘంలా ఉన్నాడు. 

ఒకాయన ఎర్రగా ఉన్నాడు. 

కోదండాలు పట్టుకొని నిల్చున్నారు. హడలి లోపలికి వచ్చి కూర్చున్నాం అన్నారు. 

ఆయన అప్పుడు బయటికి వెళ్ళి చూశారు. 

"స్వామీ నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా? మీరెంత ధన్యులురా...

ఇన్నిమార్లు దర్శనం పొందారు, నాకు అవలేదు అని ఏడ్చారు. 

ఎవరు రాముణ్ణి నమ్మారో... వారున్నచోట రాముడు ఉంటారు తప్ప... ఇంకొక చోట రాముడు ఉంటారు అనుకోకండి. రామభక్తులు ఎక్కడ ఉంటారో... అక్కడే సీతారాములుంటారు.


కష్టాలను గట్టెక్కించే కరుణామూర్తి...

మనకు వచ్చిన ఆపదలను తొలగించి శాంతిని సుఖాన్ని ప్రసాదించే పరంధాముడు ఆ శ్రీరాముడు. 

సుఖ, శాంతులు, ఆయురారోగ్యాలే కదా ఆయన మనకిచ్చే సంపదలు. 🌺


🌺ఆపత్కాలంలో ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని బాధలు తొలగిపోతాయి.

అటువంటి మహిమాన్వితుడైన సుందర రాముని ఎల్లప్పుడూ తలచుకుందాం.

అదే ఈ శ్రీ రామ శ్లోకం...

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.🌺

ధర్మాకృతి

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -4


సరి! నిర్బందింపబడి తంజావూరునకు కొనిపోబడిన అనంతరం శ్రీమఠానికి కోలాహలమయిన రాజోపచారం జరగానారంభించింది. వెన్నట్రంగరై సత్రం మొదలయిన పెద్ద సత్రములు శ్రీమఠ నివాసార్ధం ఏర్పాటు చేయబడినవి. ఒక్కో సత్రంలోనూ గుండోదరుని కథలో సుందరేశ్వరుడు సృష్టి చేసిన మాదిరి భక్షణాల గుట్టలు అన్న పర్వతాలు అమర్చబడినాయి. విడవకుండా ఒకదాని తరువాయిగా ఇంకొకటిగా ఈ మర్యాద లేమి? అది అలా ఉండనీయండి. భక్తితో ఆహ్వానించకుండా ఈ మొరటు నిర్బంధ భక్తి ఏమి? అంతా చంద్రమౌళీశ్వరుని పనే!


ద్వితీయునితో శ్రీమఠాన్ని ఆహ్వానించడానికి సావకాశం లేదని త్రిప్పి పంపిన రాత్రి రాజావారికి కలవచ్చింది. స్వామివారికి కామాక్షీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి జీర్ణోద్ధరణ కుంభాభిషేకాదులకు ఆనతి నిచ్చిన రీతి రాజావారి కలలో చంద్రమౌళీశ్వరుడు దర్శనమిచ్చి, తాను వసించియున్న మఠమునకూ, తదాచార్య స్వామికీ ఉపచారమొనరింప వలసినదిగా ఆదేశించినారు. అవిధేయుడైన పుత్రునిపై తండ్రికి అతి ప్రేమ ఉండే విధాన రాజావారు కుదరదని తిరస్కరించిన డానికి బహుమానంగా చంద్రమౌళీశ్వరుడే సాక్షాత్కరించారు. అందువలననే వారికంత ఆనందమూ, సంభ్రమమూనూ.


మరి ఈ రాక్షస భక్తో! కొంచెం నాళ్ళ ముందుగానే కదా శ్రీమఠ నిర్వహణాధికారిణి ముఖం మీద కుదరదని చెప్పి, త్రిప్పి పంపివేశారు. రాజ సింహాసనానికి పైనది ఈ ఆది శంకరుల ధర్మాసనం. ఇప్పుడు వచ్చి ఆహ్వానిస్తే నీవు ఆడిన ఆటకల్లా మేము తాళమేస్తామా అని శ్రీమఠమనవచ్చు. వైయక్తికంగా స్వామి మానాభిమానములకు అతీతులయి ఉండవచ్చు. కీడు చేసిన వారిని కూడా మనఃపూర్వకముగా ఆశీర్వదించే వారుగా ఉండవచ్చు. అయితే పీఠగౌరవ విషయంలో కొంచెం అయినా బిగువు సడలించరు కదా! ఇదంతా రాజు ఆస్థాన పురోహితులతో, విద్వాంసులతో ఆలోచించే ఈ అసుర భక్తి ప్రదర్శించారు. అయినా ఇదంతా మనకీ స్వారస్యమైన కథ ప్రసాదించడానికే కావచ్చు.


చంద్రమౌళీశ్వరుడు మంచి లాభం సంపాదించుకొన్నాడు. శివాజీ రాజా చంద్రమౌళీశ్వర పూజార్థం అనేక పాత్రలు, నవరత్న ఖచిత పాత్రలు, బంగారు కవచం తొడిగిన దక్షిణావర్త శంఖం సమర్పించారు. శ్రీవారిని ఎంతో వైభవంగా ఊరేగించారు. జోడు ఏనుగుల వెనుక పెద్ద వెండి అంబారీ కట్టి దానిపై ఊరేగవలెనని స్వామివారిని ప్రార్థించారు. ఇప్పుడు శ్రీమఠంలో పూజకోసం ఉపయోగించే వెండి రథానికి నాలుగింట మూడు వంతులుంటుందిట. ఈ అంబారీ ఎనిమిది కాళ్ళతో అష్టకోణంగా ఉండేదట. స్వామివారు పైకి ఎక్కడానికి అంబారీ కాళ్ళు అవరోధంగా ఉన్నవనీ, అంబారీ కొంచెం వంచితే అనుకూలంగా ఉంటుందనీ గ్రహించారు రాజా గారు. వెంటనే స్వయంగా నిచ్చెనలాంటి వేమి లేకుండానే ఒకే గంతులో ఏనుగునెక్కి అంబారీ గోపురాన్ని ఒక చేత్తో త్రోసిపెట్టి భుజం అంబారీ పీఠం క్రింద మోపి పెట్టి స్వామివారి ఆరోహణకు సౌకర్యం చేసి, ముగిసిన వెంటనే చెంగున క్రిందికి దుమికారట రాజుగారు. రాజ మర్యాదానుసారం అంబారీ ప్రక్క రక్షక స్థానంలో రాజుగారి ఒకే కూతురి భర్త అయిన సహారాం సాహెబు కూర్చుని ఉన్నారు. 


ఆ వెనుక ఇదే మాదిరి అంబారీ కట్టబడిన ఏనుగుల జోడి ఉన్నది. అందులో అంబారీ ముందు ప్రక్క రాజావారు కూర్చుని ఉన్నారు. అది రాచమర్యాద. అది విశేషం కాదు. వెనుక ప్రక్క పరమ మర్యాద సూచకమయిన రక్షక స్థానంతో ఎవరు కూర్చున్నారు అన్నదే విశేషం. పూర్వం ముఖంపై కొట్టి పంపటమే తరువాయిగా చేసి త్రిప్పి పంపబడిన ద్వితీయులు! పూర్వం దక్కవలసిన మర్యాద వడ్డీతో సహా తీర్చుతున్నట్లు రాజావారు తమ ప్రక్క కూర్చుండ పెట్టుకొని ఊరంతా చూసి గౌరవించారు.


ద్వితీయునిది లజ్జా స్వభావం. అది తెలిసిన రాజాగారు ఎవరూ చూడకుండా అంబారీలో ఊరేగే సమయంలో దోసిలి నిండా స్వర్ణ పుష్పాలు గ్రహించి ఈ ద్వితీయునకు బహుకరించారు. ఆ పరమ వైభవంలో అవి తమంతట తామే మూటకట్టుకోవడం లేకిగా అనుచితంగా ఉంటుందని భావించిన వీరు, క్రిందనున్న గుంపులో, తనకు బాగా కావలసిన వృద్ధుని చేతిలో పోశారు. ఆయన ఆ మూటతో పలాయనం చిత్తగించారు. దానిని సరుకు చేయలేదీయన. ఆత్మార్థంగా తాను గురువులకు చేసే కైంకర్యమునకు గురు కటాక్షరూపంగానే ప్రతిఫలం ఉండాలి గానీ, ధనరూపముగా కాదని భావించారు. ఊరందరికీ తెలిపేటట్లు రాజుగారు ఇంకో మర్యాద చేశారు. వారికి ‘హేజీబ్’ అనబడే గౌరవ పదవి ఇచ్చారు. పరమ ప్రతిష్ఠాకరమైన సంస్థకు ప్రతినిధులుగా ఉన్నవారు రాజ్యాంగంతో నేరుగా వ్యవహరించడానికుద్దేశించినది ఈ పదవి. రాజు వీరికి స్వర్ణ పుష్పములకు బహుకరించినది గుంపులో ఎవరికీ తెలియదు. వారంతా స్వామివారి ఊరేగింపు సంరంభం, తమ రాజా వారితో వెళ్ళే ఆయన గొప్పదనం తెలుసుకొని శ్లాఘించడంతో పూర్తిగా నిమగ్నమయి ఉన్నందున అది గ్రహించే అవకాశం లేకపోయింది.


ఆ సంరంభంలో అఖిలాండేశ్వరీ దేవాలయంలో అమ్మవారి సన్నిధిలో ఈ ద్వితీయుడు పాణిగ్రహణ మొనరించిన ఆ ఎనిమిదేళ్ళ చిన్నపిల్ల కూడా ఉన్నారు. ఆ బాల చుట్టూ ఊరి సువాసినులంతా చేరి రాజావారి ప్రక్కన రాజాలాగా వెలిగిపోతున్న నవ యౌవనుడయిన శాస్త్రి గారు ఈమె భర్తే అని బహుధా ప్రశంసింప సాగారట. ఆ మాటలకీ చిన్నపిల్లకు సిగ్గుతో ఏడ్పు వచ్చేది. సిగ్గుతో ఆమె ఎక్కడికి పారిపోతే అక్కడంతా సువాసినులు చుట్టేసేవారట. పాపం ఈ చిన్నపిల్ల ఏం చేస్తుంది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నేను' అంటే ఎవరు

 *'నేను' అంటే ఎవరు? శరీరమా? లేక ఆత్మా?*  


'నేను' అనే పదాన్ని కూడా ఉచ్చరించే స్థితిలో లేదు నేటి సమాజం. అంతగా మనుష్యులందరూ, వారి వారి పనులతో, మరియు సమస్యలతో సతమతమవుతూ ముందుకు వెళుతున్నారు. అలాంటిది, వారు నేనెవరు? శరీరమా లేక ఆత్మా? అని తెలుసుకునేంత సమయం ఎక్కడుంటుంది? కానీ, వారికి ఎన్ని పనులున్నా మరియు ఎన్ని సమస్యలున్నా, మనసు మాత్రం తన పని తానూ చేసుకుంటూ పోతుంది. అది ప్రతి రోజూ గుర్తు చేస్తూ ఉంటుంది. దానిని మనం లెక్క చేయం. ఎందుకంటే.. అది మనకు గుర్తు చేసిన విషయాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలో, ఎలా ముందుకు అడుగు వేయాలో, మనకు తెలియదుగనుక. పోనీలే ఎప్పుడైనా మనం తెలుసుకోవాలని ఎవరినైనా అడుగుదామంటే, వారికీ తెలియదు. పోనీలే అని వారి వారి మత గ్రంధాలు చెదివి తెలుసుకుందామనుకుంటే, అది పూర్తిగా అర్ధం కాదు. అప్పుడు ఎలా తెలుసుకోవాలో తెలియక, మళ్లీ మన పనులలో మనం తలమునకలై, దానిని వదిలేస్తుంటాం..  కానీ, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.. నేనెవరు? పోనీ కాసేపు నేను శరీరం అని అనుకుందాం.. నేను శరీరం అని అనుకుంటే, మనకు మొదటగా వచ్చే జ్ఞాపకం, మన పేరు. అది ఏదైనా కావచ్చు.. సరే, మనం శరీరం అనుకుంటే, ఇలానే శాశ్వతంగా శరీరంతోనే ఉంటామా? అంటే, లేదు.. అని మొదటగా మన మనస్సు, మనకు జవాబు చెప్పేస్తుంది. అప్పుడు మనకు, అవును మరి నిజమే కదా? మన పూర్వీకులు ఎవరూ ఇప్పుడు లేరు.. వారంతా చనిపోయారు కదా?అంటే, శరీరాన్ని విడిచారు కదా? అని మనకు గుర్తు వస్తుంది. అయితే 'నేను' ఈ శరీరం కాదు.. మరి నేనెవరు? అనేది ఇక్కడ మనకు తేలాల్సిన విషయం!  చూశారుగా.. సాయిబాబా ఎంత గొప్ప ప్రయోగం చేశారో. దేనికి ఇదంతా చేయవలసి వచ్చిందంటే.. ఈ శరీరాలు మీరు కాదు! అని నిరూపించడానికే, ఆ మహానుభావులు ఆ విధంగా, ప్రత్యక్షంగా చేసి చూపించారు.. మరి నేను ఈ శరీరం కాదన్నప్పుడు, నేను వేరే ఏదైనా ఉండి ఉండాలి.. “దేన్నయితే మనస్సు గ్రహించలేకపోయినా, దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తున్నదో.. దేన్నయితే కళ్ళు

చూడలేకపోయినా, దేనిచేత కళ్ళు చూడగలుగుతున్నాయో.. దేన్నయితే చెవులు వినలేకపోయినా, దేనిచేత చెవులు వినేశక్తిని పొందగాలుగుతున్నాయో.. దేన్నయితే ముక్కు వాసన చూడలేకపోయినా, దేని చేత ముక్కు వాసన చూడగలుగుతుందో.. అదే ఆత్మ స్వరూపం” అని కేనోపనిషత్తులో సవివరంగా తెలియపరిచారు. 

అంటే, మన శరీరం, మనస్సు మరియు బుద్ధి, అన్నీ ఒక ఆత్మ శక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. ఆ శక్తి మాత్రమే శాశ్వతం.. అదియే నీవు.. ఆ శక్తి ఎప్పుడైతే శరీరాన్ని వదలి వెళుతుందో, అపుడు ఆ శరీరం నిర్జీవమవుతుంది.. అప్పుడు శరీరంలోనివి ఏవీ పనిచేయవు..


మానవుని శరీరంలో ఆత్మ రాజయితే, మనస్సు మంత్రి, లేక సైన్యాధిపతి అయి నడుస్తూ ఉన్నాడు.. 

ఆత్మ రాజయినప్పటికీ, సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండడం వలన, మంత్రే (మనస్సు) స్వతంత్రించి నడుస్తూ, అహంకారంతో ప్రవర్తించడం జరుగుతోంది. మనస్సనే మంత్రి, రాజును మించిపోయి నడుస్తూ ఉన్నాడు. 

ఎప్పుడైతే మనిషి ఆత్మే 'నేను' అనే జ్ఞానాన్ని తెలుసుకుని, అంటే, రాజే 'నేను' అని తన రాజ్యాన్ని పాలించాలని పూనుకుని, పనిచేసుకుంటూ వెళతాడో, అప్పుడు మనస్సనే మంత్రి ఏమీ చెయ్యలేడు. 

జ్ఞానమార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యటం వలన, మనస్సు ఆత్మలో లయించ వలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై, శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని గ్రహించి, 'నేనే ఆత్మను' (రాజు పెళ్ళిను) అని తెలుసుకుంటూ ముందుకు వేళతామో, అప్పుడు మనసు (మంత్రి) అందుకు సహకరిస్తుంది..


.'నేను' కు ఇంకొక్క అక్షరం కూడా చేర్చకుండా

అక్కడితో ఆగిపోతే, ఆ 'నేనే' పరమాత్ముడు అవుతాడు.

*కృష్ణ సందేశం

 *కృష్ణ సందేశం*


*కృష్ణా!*

*కృష్ణా!*

*కృష్ణ అన్న శబ్ధం దివ్యమైనది.*

*ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు 'గార్గ మహర్షి'.*


శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఓ అద్భుతం. జననమునుండియే నేను మానవుణ్ణి కాను, భగవంతుడిని అనే భావం ప్రతీ పలుకులో, ప్రతీ పనిలో ప్రస్ఫుటం చేస్తుంటాడు. తను రాకముందే తన మాయను ఈ లోకానికి రప్పించడం, పుట్టినపిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారంనుండి బయటపడడం, రెండు పాయలుగా యమునానది చీలి వసుదేవునికి దారి ఇవ్వడం, తనకు ఆడపిల్ల పుట్టినవిషయం గానీ, బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడుని తన ప్రక్కన పెట్టిన విషయంగానీ యశోదమ్మకు తెలియకపోవడం ...... అన్నీ పరమాద్భుతఘటనలే. అలానే బాల్యంనందే పూతనను సంహరించడం, మద్దిచెట్లు రూపంలో ఉన్న నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచన చేయడం, కాళియమర్ధనం, వస్త్రాపహరణం......ఇత్యాది పరమాద్భుత ఘటనలన్నీ భగవంతుని బాల్యలీలలు. పరమాత్ముని లీలలన్నీ పారమార్ధిక సందేశాలే.


ఓం దేవకీ గర్భసంజాతాయ నమః 

ఓం యశోదేక్షణ లాలితాయ నమః 

కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీమాతయితే, దేవాదిదేవుని దివ్యలీలలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్యదర్శనములలో ఒకటి -

ఓ దినం ఎప్పటిలాగే కృష్ణుడు, బలరామ గోపబాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోపబాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా -

అమ్మా! మన్ను దినంగా నేశిశువునో? యా కొంటినో? వెఱ్ఱినో?

నమ్మంజూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు గొట్టంగా వీ

రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం

ధమ్మాఘ్రాణముసేసి నా వచనముల్ దప్పైన దండింపవే

అని నోరు తెరిచి చూపగా చిన్నికృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోద.


🚩 *డైలీ విష్* 🚩

Prime Minister of India

 Read it till end, to know the facts

sent as it came

 🕉

 Hello my dear Indians.


   *I am the Prime Minister of India, Narendra Modi!*


  *It has been 7 years since you gave this responsibility!  I would like to take this opportunity to share a few things!  When I was sworn in as prime minister, the throne was thorny!*


  *All government institutions were scattered by the misgovernance, corruption and fraud of 10 years of the previous government!  Huge foreign debt remained, and Indian companies were making losses!*


   *Iran's debt was ₹48,000 crore;*


   *United Arab Emirates' debt account for ₹40,000 crore;*


   *Indian fuel companies had a loss of ₹ 1,33,000 crore;*


   *Indian Airlines' loss was ₹58,000 crore;*


   *The loss of Indian Railways was ₹22,000 crore;*


   *BSNL's loss was ₹1,500 crore;*


  *The soldiers didn't have basic weapons, they didn't have bullet proof jackets!  There were no state-of-the-art fighter planes!  If there was a war, the army would not have survived even for 4 days.*


  *That's when I decided!*


  *At that time my main responsibility was to set up all systems properly!*


  *Fortunately, for Indians, fuel prices in the international market have come down!  But you haven't benefited from all the reduced prices!  You must be feeling that the government has done wrong!*


  *You love me a lot, but you're a little angry with me for the cost of fuel!  I know, but I couldn't help you, because I'm working with my future generations!*


  *The foolishness of the previous government was a curse for us*


  *They borrowed and bought crude oil!  However, they did not increase the price to avoid the aggression of civilians!*


  *Then he had taken a foreign loan of ₹2,50,000 crore!  For this we had to pay ₹25,000 crore as interest every year!*


  *Huge amount of loan was given to our country!  And we were told to pay off our debts, so that India can get fuel without any hiccups!*


  *What is the reason for levying tax on fuel?  We can proudly say that today we have repaid a loan of ₹2,50,000 crore with interest!*


  *Railway was doing damage!  We have completed all the projects started by the previous governments, which are running smoothly!  We completed all the electrification of railway lines at a faster pace than before in the past!*


  *As well as ..*


  *18,500 villages electrified!*


  *5 crore free gas connections have been given to the poor!*

 *Hundreds of kilometers of new roads were built!*


  *Loans worth ₹ 1,50,000 crore were given to the youth!*


  *A medical insurance scheme of ₹ 1,50,000 crore launched for 50 crore citizens named "Ayushman Bharat"!*


  *Our soldiers are provided with all latest and updated version weapons and bullet proof jackets, Rafale fighter aircraft, and many other types of lethal weapons and other facilities!*


*Where did the money come from for all these works?  That money is given by you!  When you all buy petrol and diesel, you give that money to the country*


  *If we remove tax on petrol and diesel, was it possible to pay off our debts?  We can pay off debt, as well as bring on many new projects, so indirectly we need to raise taxes on everything!  The responsibility of 130 crore citizens cannot be of the vehicle owners alone!*


  *One last thing.. As the head of your family, what do you do when there is a huge debt burden on your family?*


   *Do you spend carelessly?*


   *Or do you pay off the loan?*


  *If the loan and interest are not repaid carelessly, what will be the future of the family?*


  *Don't fall into the wrong game of opponents...*


  *You, as a patriotic citizen of this country, please participate in the development of the country.*


  *This protest has always been electoral, some politicians are trying to mislead citizens with false propaganda!*


  *I request all of you, please share this truth with all of you Indians*


   *your,*

   *Narendra Modi*

 *Long live Mother India*

 *Jai Hind!*

 🙏


 *With 1,500 squatters kicked out from Lutyens Bungalows, it might explain why its always Modi vs All!*


 https://www.opindia.com/2018/02/with-1500-squatters-kicked-out-from-lutyens-bungalows-it-might-explain-why-its-always-modi-vs-all/


 *The cleaning up has in fact happened in Lutyens' Delhi, since the BJP came to power, 7 years back!*


 *In the first year itself, more than 460 squatters were sent packing out of their cosy Lutyens' Bungalows!*


 *Many of them had been staying there for generations, and had started considering it their private property.  Some approached the Courts with appeals to let them keep their fiefdoms.  But to no avail!  The Courts, too, refused!*


 *Ajit Singh, the son of former Prime Minister Charan Singh was squatting on a Bungalow.  He was locked out, and his belongings thrown out on the lawns!*


 *Painter Jatin Das, the father of actor Nandita Das, was enjoying another Bungalow in Lutyens.  Had to be evicted!*


 *"The Print", a Congress IT Cell publication, asked why Narendra Modi does not have an army of intellectuals defending him, unlike the Nehrus and the Gandhis?*


 *The word "intellectuals" is a joke!  Most are the lowest moral scums of society, willing to sell anything for a gift in cash or kind!*


 *By late 2016, the number of evictions had swelled to 1,500!*


 *There are only a handful of articles in the media documenting this cleanup mission in Lutyens' Delhi!*


 *A lot of free loading journalists, in love with the Congress gifts, got kicked out, too!*


 *There is this absolute gem of a quote in "The Telegraph" from an unnamed Congress MP:*


 *"The Congress had a long tradition of not implementing the rules so strongly! "*


 *Amazing suggestion:*


 *Looks like Lutyens Delhi was a rent-free district of people who were supporting the political party, in exchange for rent free palatial Bungalows!*


 *In the Congress Raj, before a case went to the Supreme Court, everything was managed - which Judge would go to the bench, and what decision will the Judge give!*


 *This is the biggest secret of the success of 70 years of Congress, that it has managed all the media and the Judiciary, and ruled the country!*


 *Have you ever heard Rahul Gandhi, Lalu Yadav, Sitaram Yechury, Mayawati, Akhilesh, Mamata, Mehbooba, and other Opposition leaders calling each other thieves?*"


  *No !!!*


 *While some of them have been convicted, some are in jail, some are on bail and some are facing trial in Courts, but they do not call each other a thief!*


 *But, Modi, who has no official charge, no FIR, no trial is going on, no court has even ordered any investigation, all these leaders are calling him a thief!*


 *No Blessed Understanding, nor a sense of responsibility towards the country!  It is a shame on such traitors!*

విఘ్నవిదారణదక్షం

 శ్లోకం:☝️

*గణపతిపదయుగమాశ్రయ సతతం*

*విఘ్నవిదారణదక్షం*

*ఇంద్రాదిదేవ వరదానవ సంఘైః*

*ప్రేమ్నా సంస్థుత యుగళం*

*విఘ్నధ్వాంత వినాశన భానుం*

*ఆశ్రిత జన సంపోషం*

*తవ శుభ రూపం దృష్వా*

*దివిషద ముఖ్యాస్సర్వే*

*ముక్తాస్తవ కృపయా చ*

*జనగణ ఈప్సితదాయకమనిశం*

*మూషకవాహనమీశం*

*ప్రణమః ప్రణమః ప్రణమః*

*మమ భవహరణం ప్రణమః*


అన్వయం: *విఘ్న-విదారణ-దక్షం,*

*ఇంద్రాది-దేవ-వర-దానవ-సంఘైః ప్రేమ్నా-సంస్థుత-యుగళం,*

*విఘ్నధ్వాంత-వినాశన-భానుం,*

*ఆశ్రిత-జన-సంపోషం*

*గణపతి-పద-యుగం సతతం ఆశ్రయ |*

*తవ శుభ-రూపం దృష్వా సర్వే దివిషద-ముఖ్యాః, జనగణాః చ తవ కృపయా ముక్తాః భవంతి |*

*ఈప్సితదాయకం, మూషకవాహనం, ఈశం, మమ భవహరణం అనిశం ప్రణమః ||*


భావం: విఘ్నాలను నాశనం చేయగల సమర్థత కలిగినవి,

ఇంద్రాది దేవతలు మరియు దానవ శ్రేష్ఠులు ప్రేమతో కొలిచేవి,

విఘ్నాలనే చీటికిని నాశనం చేసే సూర్యుడు వంటివి,

తనను ఆశ్రయించిన భక్తులను పోషించేవి,

అయిన గణపతి పాదపద్మములను ఎల్లప్పుడూ ఆశ్ర యించు (ఓ మనసా!)

ఇంకా ఆ దివ్య పద యుగళ దర్శనం చేత పుణ్యాత్ములయిన మానవులు , దేవతలు ముక్తులవుతున్నారు.

కోరిన కోర్కెలను తీర్చేవాడు, మూషికవాహనుడు, ఈశ్వరుడు, ముక్తిదాయకుడు ఆయన గణపతికి సర్వదా నమస్కరిస్తున్నాను.