17, ఆగస్టు 2022, బుధవారం

రామ రామ రామేతి

 🙏🌺శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే

  సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే🌺🙏


 🌺"శ్రీరాముడు" ఎక్కడుంటారు అని చెప్తారో తెలుసా శాస్త్రంలో...

"రామచంద్రమూర్తి"ని నమ్ముకొని బ్రతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో...రాముడు అక్కడే ఉంటాడు. 

ప్రక్కనే ఉంటాడుట ధనుర్ధరుడై. 

ఆయన కూర్చుంటే కూర్చుంటాడు...

నిలుచుంటే నిల్చుంటాడు...

ఆయన వెడుతూంటే వెళతాడు. ఆయన పడుకుంటే గుమ్మం ముందు కూర్చుంటాడట.

ఎందుకంటే... ఆయనకి ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని.🌺

🌺రామచంద్రమూర్తి తనను నమ్మిన వాళ్ళను రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుంటాడు.

అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామ భక్తులు ఎక్కడ ఉంటారో... అక్కడే "సీతారామలక్ష్మణులు" "హనుమ"  కూడా ఉంటారు. 

ఇది "తులసీదాసు" గారి జీవితంలో నిజమైంది. ఆయన "రామ"దర్శనం అవ్వాలి అనుకుంటూ పడుకుంటే... 

ఒక దొంగ వచ్చి లోపలికి వెళ్ళి... దొరికినవి మూట కట్టుకొని... బయటకు వద్దాం అనుకున్నాడు. 

తల బైటపెట్టాడు.

"రామలక్ష్మణులు" ఇద్దరూ కోదండాలు పట్టుకొని నిల్చొని ఉన్నారు.

నన్ను నమ్ముకున్న వాడి సొత్తు ఎత్తుకు పోతావా నువ్వు అని. 

ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. 

తెల్లవారే వరకు తల బైటపెడుతున్నాడు... 

లోపల పెడుతున్నాడు.

రామలక్ష్మణులు ఇద్దరూ అలాగే ఉన్నారు. తెల్లవారింది. తులసీ దాసు గారు నిద్రలేచారు. 

దొంగ మూట కట్టుకొని కూర్చుని ఉన్నాడు. 

నువ్వు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అని అడిగారు. బుద్ధి గడ్డితిని దొంగతనానికి వచ్చాం అన్నాడు.

పట్టుకెళ్ళపోయావా? అన్నారు. 

తీసుకు వెళదామని బయటికి వెళ్తే... ఎవరో ఇద్దరు ఉన్నారు. 🌺

🌺ఒకాయన నల్లగా మేఘంలా ఉన్నాడు. 

ఒకాయన ఎర్రగా ఉన్నాడు. 

కోదండాలు పట్టుకొని నిల్చున్నారు. హడలి లోపలికి వచ్చి కూర్చున్నాం అన్నారు. 

ఆయన అప్పుడు బయటికి వెళ్ళి చూశారు. 

"స్వామీ నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా? మీరెంత ధన్యులురా...

ఇన్నిమార్లు దర్శనం పొందారు, నాకు అవలేదు అని ఏడ్చారు. 

ఎవరు రాముణ్ణి నమ్మారో... వారున్నచోట రాముడు ఉంటారు తప్ప... ఇంకొక చోట రాముడు ఉంటారు అనుకోకండి. రామభక్తులు ఎక్కడ ఉంటారో... అక్కడే సీతారాములుంటారు.


కష్టాలను గట్టెక్కించే కరుణామూర్తి...

మనకు వచ్చిన ఆపదలను తొలగించి శాంతిని సుఖాన్ని ప్రసాదించే పరంధాముడు ఆ శ్రీరాముడు. 

సుఖ, శాంతులు, ఆయురారోగ్యాలే కదా ఆయన మనకిచ్చే సంపదలు. 🌺


🌺ఆపత్కాలంలో ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని బాధలు తొలగిపోతాయి.

అటువంటి మహిమాన్వితుడైన సుందర రాముని ఎల్లప్పుడూ తలచుకుందాం.

అదే ఈ శ్రీ రామ శ్లోకం...

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.🌺

కామెంట్‌లు లేవు: