17, ఆగస్టు 2022, బుధవారం

విఘ్నవిదారణదక్షం

 శ్లోకం:☝️

*గణపతిపదయుగమాశ్రయ సతతం*

*విఘ్నవిదారణదక్షం*

*ఇంద్రాదిదేవ వరదానవ సంఘైః*

*ప్రేమ్నా సంస్థుత యుగళం*

*విఘ్నధ్వాంత వినాశన భానుం*

*ఆశ్రిత జన సంపోషం*

*తవ శుభ రూపం దృష్వా*

*దివిషద ముఖ్యాస్సర్వే*

*ముక్తాస్తవ కృపయా చ*

*జనగణ ఈప్సితదాయకమనిశం*

*మూషకవాహనమీశం*

*ప్రణమః ప్రణమః ప్రణమః*

*మమ భవహరణం ప్రణమః*


అన్వయం: *విఘ్న-విదారణ-దక్షం,*

*ఇంద్రాది-దేవ-వర-దానవ-సంఘైః ప్రేమ్నా-సంస్థుత-యుగళం,*

*విఘ్నధ్వాంత-వినాశన-భానుం,*

*ఆశ్రిత-జన-సంపోషం*

*గణపతి-పద-యుగం సతతం ఆశ్రయ |*

*తవ శుభ-రూపం దృష్వా సర్వే దివిషద-ముఖ్యాః, జనగణాః చ తవ కృపయా ముక్తాః భవంతి |*

*ఈప్సితదాయకం, మూషకవాహనం, ఈశం, మమ భవహరణం అనిశం ప్రణమః ||*


భావం: విఘ్నాలను నాశనం చేయగల సమర్థత కలిగినవి,

ఇంద్రాది దేవతలు మరియు దానవ శ్రేష్ఠులు ప్రేమతో కొలిచేవి,

విఘ్నాలనే చీటికిని నాశనం చేసే సూర్యుడు వంటివి,

తనను ఆశ్రయించిన భక్తులను పోషించేవి,

అయిన గణపతి పాదపద్మములను ఎల్లప్పుడూ ఆశ్ర యించు (ఓ మనసా!)

ఇంకా ఆ దివ్య పద యుగళ దర్శనం చేత పుణ్యాత్ములయిన మానవులు , దేవతలు ముక్తులవుతున్నారు.

కోరిన కోర్కెలను తీర్చేవాడు, మూషికవాహనుడు, ఈశ్వరుడు, ముక్తిదాయకుడు ఆయన గణపతికి సర్వదా నమస్కరిస్తున్నాను.

కామెంట్‌లు లేవు: