5, అక్టోబర్ 2021, మంగళవారం

మహాలయ అమావాస్య’’

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

Mahalaya Amavasya 2021 : ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో రెండు అమావాస్యలకు ప్రత్యేకత ఉంది ఒకటి మహాలయ అమావాస్య , రెండోది దీపావళి అమావాస్య. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య, రెండోవది ఆశ్వయుజ మాసం అమావాస్యలు చెప్పుకోదగినవి. భాద్రపద అమావాస్యను ‘‘మహాలయ అమావాస్య’’ అని, ఆశ్వయుజ అమావాస్యని, దీపావళి అమావాస్య అని పిలుస్తారు. ఈ రెండు అమావాస్యలు పితృదేవతలకు సంబంధించినవి.


‘‘ఆషాఢీ మవధిం కృత్వా పంచమం పక్షమ్మాతాః కాంక్షంతి పితరః క్లిష్టా అన్నమప్యన్వహం జలమ్’’ ఆషాడ పూర్ణిమ మొదలు అయిదవ పక్షమును అనగా ఆషాఢ కృష్ణపక్షం, శ్రావణ రెండు పక్షములు, భాద్రపద శుక్లపక్షం, వెరశి నాలుగు పక్షములు (పక్షం అంటే పదిహేను రోజులు) గడిచిన తరువాత వచ్చేది, అయిదవ పక్షం, అదే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షము’’లంటారు. చివరగా వచ్చే అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అంటారు. ఈ ఏడాదిమహాలయ అమావాస్య అక్టోబర్ 6వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఈ మహాలయ పక్షం రేపటితో ముగుస్తుంది. అమావాస్య2021వ సంవత్సరం లో అక్టోబర్ 5 మంగళవారం రాత్రి 7 గంటల తర్వాత నుంచి వచ్చింది కనుక బుధవారం నాడే పితృతర్పణాలు వదలాలి.

            🌷🌷🌷

ఈ పక్షములో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున, మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే,

పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు, తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు, నిర్ణయ దీపికా

గ్రంథములు పేర్కొన్నాయి.


భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షము. మహాలయమంటే …మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు.

                🌷🌷🌷

అమావాస్య అంతరార్థం: ‘అమా’ అంటే ‘‘దానితోపాటు’’, ‘వాస్య’ అంటే వహించటం. చంద్రుడు, సూర్యుడిలో చేరి, సూర్యుడితోపాటు వసించే రోజు కాబట్టి ‘అమావాస్య’ అన్నారు.

సూర్యుడు – స్వయం చైతన్యం. చంద్రుడు జీవుడే. మనస్సుకు అధిపతి. అదే చంద్రుని ఉపాధి. మనస్సు పరమ చైతన్యంలో లయమైతే, జీవుడికి జీవభావం పోయి దైవభావం

సిద్ధిస్తుంది. అదే నిజమైన అమావాస్య.


చంద్రమండలం ఉపరితలం మీద నివసించే పితృదేవతలకు, అమావాస్య తిధి మిట్టమధ్యాహ్నమవుతుంది. అందుకే భాద్రపద అమావాస్య రోజున, దీపావళి అమావాస్య రోజున

పితృదేవతలు పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి.


మత్స్యపురాణగాథ: పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వారి మానవ పుత్రిక ‘‘అచ్ఛోద’’. పితృదేవతలు ఒక సరస్సును సృష్టించారు. ఆ సరస్సుకు పుత్రిక పేరు పెట్టారు. ఆ

అచ్ఛోద, సరస్సు తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు సంతుష్టులై ప్రత్యక్షమయ్యారు. వరము కోరుకోమన్నారు. ఆమె వారిలో ‘‘మావసు’’ డను పితరుని కామ పరవశంతో

వరునిగా కోరింది. యోగభష్ట్రురాలయింది. దేవత్వంపోయి, భూమి మీద కొచ్చింది. మావసుడు, అచ్చోదను కామించలేదు. కనుక అచ్ఛోద ‘‘మావస్య’’ అనగా ప్రియురాలు

అధీనురాలు కాలేకపోయింది. కనుక. ‘‘మావస్య’’ కాని ఆమె ‘‘అమావస్య’’ లేక ‘‘అమావాస్య’’ అయింది.


తన తపస్సుచే పితరులను తృప్తినొందించిన అమావాస్య అనగా అచ్ఛోద, పితరులకు ప్రీతిపాత్రమయింది. అందువలన, పితృదేవతలకు అమావాస్య (అచ్ఛోద) తిథి యందు

పితురులకు అర్పించిన తర్పణాది క్రియలు, అనంత ఫలప్రదము, ముఖ్యంగా సంతానమునకు క్షేమము, అభివృద్ధికరము. తప్పును తెలిసికొన్న అచ్ఛోది మరల తపోదీక్ష వహించింది.


జననీ జనకులకు ప్రేమానురాగాలను అందించి, మరణానంతరం కూడా వారికోసం యథావిధిగా నైమిత్తిక కర్మల నాచరించి, పితృతర్పణాదులనిస్తే, వారి ఋణం తీర్చుకున్న

వాళ్లవుతారని, పితరుల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని చెప్తోంది మహాలయ అమావాస్య. చనిపోయినవారందరి స్మృతికోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్ధం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది.


ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఈ పితృ స్మరణ రోజు ప్రత్యేకంగావున్నది.ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, వాళ్ళెక్కడవున్నా, వారి వారి సంప్రదాయాన్నిబట్టి, ఇంటి ఆచారాల్నిబట్టి, వాళ్ల వాళ్ల అనుకూలతనుబట్టి పితృ దేవతలను సంస్మరించుకునే రోజు ఇది. ఈ రోజు తెలిసిన, తెలియని బంధువులకు శ్రాద్ధం పెట్టడానికి ఒక నిర్ధిష్టమైన రోజు. పితృ పక్షంలో తమ చనిపోయిన వారి తిథిని మరచిపోయిన వారికి అమావాస్య అనువైన రోజు. ఈ రోజు చనిపోయిన వారికి శ్రాద్ధం నిర్వహిస్తే.. వారి ఆత్మ లకు మోక్షం దక్కుతుందని నమ్మకం. దీంతో వారు వారి కుటుంబాలకు దీవెనలు అందిస్తారని అంటారు.

ఈ పక్షములో పితరులు అన్నాన్ని, ప్రతిరోజూ జలమును కోరుతారు. తండ్రి చనిపోయిన రోజున, మహాలయ పక్షములలో పితృతర్పణములు, యధావిధిగా శ్రాద్ధవిధులు నిర్వర్తిస్తే,

పితృదేవతలంతా సంవత్సరమంతా తృప్తి చెందుతారు, తమ వంశాభివృద్ధిని గావిస్తారు. వారు ఉత్తమ గతిని పొందుతారు. ఈ విషయాలన్నీ నిర్ణయసింధువు, నిర్ణయ దీపికా

గ్రంథములు పేర్కొన్నాయి.


భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవపదము, కృష్ణపక్షం పితృపదము, అదే మహాలయ పక్షము. మహాలయమంటే …మహాన్ అలయః, మహాన్‌లయః మహల్ అలం యాతీతివా అనగా పితృదేవతలకిది గొప్ప ఆలయము, పితృదేవతల యందు మనస్సు లీనమగుట, పుత్రులిచ్చు తర్పణాదులకు పితృదేవతలు తృప్తిని పొందుట, అని అర్థములు.

సంస్కృత మహాభాగవతం*

 *5.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పండ్రెండవ అధ్యాయము*


*సత్సంగముయొక్క మహాత్మ్యము - కర్మవిధి - కర్మత్యాగవిధి*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*12.1 (ప్రథమ శ్లోకము)*


*న రోధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఏవ చ|*


*న స్వాధ్యాయస్తపస్త్యాగో నేష్టాపూర్తం న దక్షిణా॥12663॥*


*12.2 (రెండవ శ్లోకము)*


*వ్రతాని యజ్ఞశ్ఛాందాంసి తీర్థాని నియమా యమాః|*


*యథావరుంధే సత్సంగః సర్వసంగాపహో హి మామ్॥12664॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! వర్ణాశ్రమోచిత కర్మయోగములు, ప్రాణాయామయోగము, ప్రకృతి పురుషులకు సంబంధించిన సాంఖ్యయోగము, అహింసాది ధర్మములు, వేదాధ్యయనము, అనశనాది (ఉపవాసాది) తపశ్చర్యలు, దానధర్మములు, యాగాదివైదిక కర్మలు, వాపీ, కూప, తటాకాది నిర్మాణములు, యజ్ఞయాగాదుల పరిసమాప్తియందు ఇయ్యబడు సాద్గుణ్య దక్షిణలు *(హతో యజ్ఞస్త్వదక్షిణః - సాద్గుణ్య దక్షిణలు లేని యజ్ఞము యజ్ఞమే కాదు -నీతి శాస్త్రము)*, ఏకాదశి - ఉపవాసాది వ్రతములు, పంచమహా యజ్ఞములు (1. బ్రహ్మయజ్ఞము - అధ్యాపనము, 2. పితృయజ్ఞము - తర్పణము, 3. దేవయజ్ఞము - హోమము, 4. భూతయజ్ఞము - బలి 5. నృయజ్ఞము - అతిథిపూజ మరియు 1.. మాతాపితృభక్తి, 2. పాత్రివత్యము, 3. సమత, 4. మిత్రులను ద్వేషించకుండుట, 5. విష్ణుభక్తి - అనునవి పంచామహా యజ్ఞములు), గోప్యములగు మంత్రములు, గంగాది తీర్థముల యందలి పవిత్రస్నానములు, శౌచ-అశౌచ-ఆచమనాది నియమములు, బాహ్యాభ్యంతర మనోనిగ్రహాదులు మొదలగునవి ఎవ్వియును సత్సంగముతో సాటిరావు. ఏలయన సత్సంగము సకల లౌకిక బంధములను దూరమొనర్చును. మీదుమిక్కిలి, అది తన (సాధకుని) హృదయమున నన్ను (భగవానుని) పదిలపరచుకొనుటలో ప్రముఖ సాధనము (శ్లో. *సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్| నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః॥* క్రమముగా జీవన్ముక్తికి సాధనమైన సత్సంగత్వమును వర్ణించుట జగద్గురు శంకరాచార్యస్వామికే సాధ్యము)


*12.3 (మూడవ శ్లోకము)*


*సత్సంగేన హి దైతేయా యాతుధానా మృగాః ఖగాః|*


*గంధర్వాప్సరసో నాగాః సిద్ధాశ్చారణగుహ్యకాః॥12665॥*


*12.4 (నాలుగవ శ్లోకము)*


*విద్యాధరా మనుష్యేషు వైశ్యాః శూద్రాః స్త్రియోఽన్త్యజాః|*


*రజస్తమఃప్రకృతయస్తస్మింస్తస్మిన్ యుగేఽనఘ॥12666॥*


*12.5 (ఐదవ శ్లోకము)*


*బహవో మత్పదం ప్రాప్తాస్త్వాష్ట్రకాయాధవాదయః|*


*వృషపర్వా బలిర్బాణో మయశ్చాథ విభీషణః॥12667॥*


*12.6 (ఆరవ శ్లోకము)*


*సుగ్రీవో హనుమాన్ ఋక్షో గజో గృధ్రో వణిక్పథః|*


*వ్యాధః కుబ్జా వ్రజే గోప్యో యజ్ఞపత్న్యస్తథాపరే॥12668॥*


సత్సంగము యొక్క ప్రభావము అపారమైనది, నిరుపమానమైనది. ఆయా యుగములయందు సత్సంగము ద్వారా దైత్యులు, రాక్షసులు, మృగములు, పక్షులు, గంధర్వులు,అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు (యక్షులు), విద్యాధరులు మున్నగువారు నా సేవలలో తరించిరి. మానవులలో వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, నిమ్నజాతులవారు మొదలగు రజస్తమోగుణ స్వభావములు గలవారు ఈ సత్సంగముద్వారా నన్నుభజించి, నా అనుగ్రహమునకు పాత్రులైరి. అట్లే వృత్రాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలిచక్రవర్తి, బాణుడు, మయుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, తులాధారుడను వైశ్యుడు, ధర్మవ్యాధుడు, కుబ్జ, వ్రజాంగనలు (గోపికలు), యజ్ఞాచరణమునందు నిమగ్నులైన బ్రాహ్మణుల యొక్క పత్నులు, ఇంకను పెక్కుమంది ఈసత్సంగముద్వారా నన్ను సేవించి కృతార్థులైరి. 


*12.7 (ఏడవ శ్లోకము)*


*తే నాధీతశ్రుతిగణా నోపాసితమహత్తమాః|*


*అవ్రతాఽతప్తతపసః సత్సంగాన్మాముపాగతాః॥12669॥*


వీరు అందరును వేదాధ్యయనపరులుగారు, మహాత్ములను ఉపాసించినవారు (మహాత్ములను ఆశ్రయించి దైవోపాసనలను ఒనర్చినవారు) కారు. ఏ విధమైన వ్రతములను, తపస్సులను ఆచరించి యుండలేదు. వీరు ఎల్లరును కేవలము సత్సంగప్రభావముననే నా కృపకు పాత్రులై పరమపదమును పొందిరి.


*12.8 (ఎనిమిదవ శ్లోకము)*


*కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగాః|*


*యేఽన్యే మూఢధియో నాగాః సిద్ధా మామీయురంజసా॥12670॥*


గోపికలు, గోవులు, యమళార్జునాది వృక్షములు, వ్రజభూమియందలి మృగములు, తమోగుణ ప్రధానులైన కాళియుడు మొదలగువారు కేవలము నన్నే ఆశ్రయించి, స్మరించి ముక్తిని పొందిరి. అట్లే కొందరు సిద్ధులు ఈ భక్తిమార్గమున నన్ను సేవించి, కృతార్థులైరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కృషి పరాశర గ్రంథ విశేషాలు -

 పరాశర మునిచే రచించబడిన కృషి పరాశర గ్రంథ విశేషాలు -


 * మాఘఫాల్గుణ మాసములలో విత్తనములు అన్ని ఒకచోట చేర్చి ఎండలో ఎండబెట్టవలెను . ఎండబెట్టుటకు భూమిపైన ఏదన్నా ఉంచవలెను .సరాసరి భూమి తగలరాదు.


 * సమాన ఆకారము లో ఉన్న విత్తనాలు మంచిఫలితాలను ఇచ్చును. అందువలన ఒకేరూపములో ఉన్న విత్తనాలను భద్రపరచవలెను.


 * బీజముల సంచులను పుట్టలపైన , చీమల బొరియల పైన , గోశాలలో , ప్రసూతి గృహములలో , వంధ్య స్త్రీ ఉన్న స్థలములలో ఉంచరాదు.


 * బీజములను ఎంగిలి చేయరాదు . రజస్వల, వంధ్యస్త్రీ, గర్భిణీస్త్రీ , బాలింత బీజములను తాకరాదు.


 * వ్యవసాయదారుడు పొరపాటున కూడా నెయ్యి, నూనె , మజ్జిగ, దీపము బీజముల పైన ఉంచరాదు. 


 * దీపము , అగ్ని, పొగతో ఎండిన , వర్షములో 

తడిచిన బీజములను పొలములో చల్లరాదు.


 * విత్తనములు వృక్షరూపములో పెద్దవైన తరువాత వాటిని తీసివేయరాదు. ఫలితాన్ని ఇవ్వవు.


 * శ్రావణములో హస్త ప్రమాణ దూరములో భాద్రపదములో హస్తానికి ప్రమాణానికి సగం దూరంలో , కన్యలో నాలుగంగుళాల దూరంలో పంటలను నాటవలెను.


 * ఆషాడ , శ్రావణ మాసములలో పంటలను కోయవలెను . ఆ సమయంలో కోయకున్న బీజాలు అలానే ఉండును.


 * శ్రావణ మాసములో పంటని కోసిన వర్షము వలన పంట నష్టం జరగదు. భాద్రపదములో పంటని కోసిన సగం పంట మాత్రమే మిగులును. ఆశ్వయుజ మాసములో పంటని కోసిన ఆ పంట పైన ఆశలు వదుకోవలసివచ్చును.


 * పొలమును రోగముల నుండి రక్షించుటకు భాద్రపద మాసములో పొలములోని జలమును బయటకి తీయవలెను. కేవలం వరిమొక్క మొదళ్ళలో మాత్రమే నీరు ఉండునట్టు చేయవలెను . భాద్రపదములో జలముతో నిండిన పంట వివిధరోగములతో నాశనం అగును.


 * రైతు మార్గశిర మాసము వచ్చినపుడు శుభదినములలో పొలం దగ్గరకి వెళ్లి రెండు ముష్టిల ధాన్యం కోయవలెను . కోసిన ధాన్యపు దుబ్బులకు గంధపుష్పములతో నైవేద్యం తగినవిధముగా చేసి పూజించి ఈశాన్య కోణము నుంచి కోయడం మొదలు పెట్టవలెను.


 * కోసిన ధాన్యపు కట్టను శిరస్సుపైన ఉంచి దారిలో ఎవరిని ముట్టుకోకుండా రైతు మౌనముగా గృహమునకు రావలెను. ఇంటిలో నున్న గదిలో ఏడడుగులు నడిచి పూర్వదిశలో ధాన్యపు కట్టని ఉంచి పూజించవలెను.


 * ధాన్యము కొలిచే ఆడకము ఆకారములో పన్నెండు అంగుళములు ఉండవలెను . ఆడకముతో ధాన్యపు రాశిని ఎడమవైపు నుండి కొలవవలెను. దక్షిణము నుండి ధాన్యమును కొలిచిన వ్యయకారకం అగును. ఎడమవైపు నుండి కొలిచిన ధాన్యము వృద్ధిని పొందును.


 * ధాన్యము కొలుచు ఆడకము మామిడి, పున్నాగము కర్రతో చేసినది ఉత్తమముగా ఉండును. వెలగచెట్టు , జువ్విచెట్టు కర్రతో చేసిన ఆడకముతో కొలిచిన పేదరికము వృద్ది అగును.


 * హస్త, శ్రవణ, ధనిష్ట, మృగశిర, శతబిషం , పుష్యమి, రేవతి , రోహిణి , భరణి, మూల, ఉత్తరాత్రయం , మఘ , పునర్వసు నక్షత్రములలో గురు, శుక్ర, సోమవారాలలో సూర్యుడు మీనలగ్నములలో ఉన్నప్పుడు ధాన్యస్థాపనం చేయవలెను . నిధన సమయములు అనగా ఆది , మంగళ , శని, బుధవారములలో ధాన్యస్థాపనం చేయకూడదు . ధాన్యస్థాపనం అనగా పండిన ధాన్యాన్ని నిలువచేయడం .


  

      

సంస్కృత మహాభాగవతం

 *5.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదకొండవ అధ్యాయము*


*బద్ధజీవుల-ముక్తజీవుల-భక్తుల లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*11.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*యద్యదిష్టతమం లోకే యచ్చాతిప్రియమాత్మనః|*


*తత్తన్నివేదయేన్మహ్యం తదానంత్యాయ కల్పతే॥12654॥*


లోకమునందలి జనులకు మిగుల ఇష్టమైనవి, తమకు ఎంతయు ప్రియమును గూర్చునవి ఐనవాటిని నాకు సమర్పింపవలెను. అట్లొనర్చినవారికి అపారఫలములు చేకూరును.


*11.42 (నలుబది రెండవ శ్లోకము)*


*సూర్యోఽగ్నిర్బ్రాహ్మణో గావో వైష్ణవః ఖం మరుజ్జలమ్|*


*భూరాత్మా సర్వభూతాని భద్రపూజాపదాని మే॥12655॥*


కళ్యాణపురుషా! ఉద్ధవా! సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవు, విష్ణుభక్తుడు, ఆకాశము, సకలప్రాణులు అనునవి నా పూజాస్థానములు.


*11.43 (నలుబది మూడవ శ్లోకము)*


*సూర్యే తు విద్యయా త్రయ్యా హవిషాగ్నౌ యజేత మామ్|*


*ఆతిథ్యేన తు విప్రాగ్ర్యే గోష్వంగ యవసాదినా॥12656॥*


మహాత్మా! ఉద్ధవా! నన్ను ఋగ్యజుస్సామ మంత్రములద్వారా సూర్యమండలమధ్యవర్తిగను, పవిత్రములైన దివ్యహవిస్సుల ద్వారా అగ్నిదేవునిగను (యజ్ఞస్వరూపునిగను), ఆరాధింపవలెను. భూసురోత్తముల స్వరూపములలో ఆతిథ్యములద్వారానూ, గోమాతల రూపములో కోమల తృణాహారముల ద్వారాను నన్ను సేవింపవలెను.


*11.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*వైష్ణవే బంధుసత్కృత్యా హృది ఖే ధ్యాననిష్ఠయా|*


*వాయౌ ముఖ్యధియా తోయే ద్రవ్యైస్తోయపురస్కృతైః॥12657॥*


విష్ణుభక్తుని తన ఆత్మీయునిగా తలంచి ఆదర సత్కారములను జరుపవలెను. నిరంతరము ధ్యాననిష్ఠాపరుడై హృదయాకాశములో నన్ను సేవింపవలెను. వాయువును (వాయుస్వరూపుడనైన నన్ను) ముఖ్యప్రాణస్వరూపునిగా భావించి పూజింపవలెను. జలములు, పుష్పములు, గంధాది పూజద్రవ్యములతో జలస్వరూపుడనైన నన్ను ఆరాధింపవలెను.


*11.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*స్థండిలే మంత్రహృదయైర్భోగైరాత్మానమాత్మని|*


*క్షేత్రజ్ఞం సర్వభూతేషు సమత్వేన యజేత మామ్॥12658॥*


రహస్యమైన మూలమంత్రములచే, అంగన్యాస, కరన్యాసపూర్వకముగా అష్టదళపద్మశోభితమై, చక్కగా సంస్కరింపబడిన స్థండిలము (వ్రతము పూనినవాఁడు పండుకొనుటకు దర్భాదులచే సంస్కరింపఁబడిన భూమి లేదా అగ్నిహోత్రము నుంచుటకై సంస్కరించిన స్థానము) నందు నన్ను ఆరాధింపవలెను. ఆత్మస్వరూపుడనైన నన్ను శాస్త్రసమ్మతమైన భోగ(భోజన) పదార్థములతో తృప్తి పరచవలెను. రాగద్వేషరహితుడై, దేవ, మనుష్యాది సకలదేహముల యందును క్షేత్రజ్ఞునిగా నన్ను పూజింపవలెను.


*11.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*ధిష్ణ్యేష్వేష్వితి మద్రూపం శంఖచక్రగదాంబుజైః|*


*యుక్తం చతుర్భుజం శాంతం ధ్యాయన్నర్చేత్సమాహితః॥12659॥*


సూర్యుడు మొదలుకొని క్షేత్రజ్ఞ (జీవుడు) పర్యంతముగల సకలస్థానములయందును చతుర్భుజములతో శంఖచక్రగదాపద్మశోభితుడనై విరాజిల్లుచు శాంతస్వరూపునిగా ఉండెడి నా మూర్తిని ధ్యానించుచు సమాహితచిత్తముతో అర్చింపవలెను.


*11.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*ఇష్టాపూర్తేన మామేవం యో యజేత సమాహితః|*


*లభతే మయి సద్భక్తిం మత్స్మృతిః సాధుసేవయా॥12660॥*


ఈ విధముగా మానవుడు ఏకాగ్రచిత్తముతో వైదికములైన యజ్ఞయాగాదులను ఆచరించుట, సమాజమునకు ఉపయుక్తములగు సత్రములు, బావులు, చెఱువులు, పాఠశాలలు మొదలగువానిని నిర్మించుట మున్నగు సత్కార్యములను నా పూజగా భావించి, ఆచరించినచో అతనికి నా యందు భక్తి కుదురుకొనును. అట్లే సత్పురుషులను సేవించినవారికి నా స్వరూపజ్ఞానము ప్రాప్తమగును.


*11.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*ప్రాయేణ భక్తియోగేన సత్సంగేన వినోద్ధవ|*


*నోపాయో విద్యతే సధ్ర్యఙ్ ప్రాయణం హి సతామహమ్॥12661॥*


ఉద్ధవా! నేను సత్పురుషులకు ఆశ్రయుడను. కనుక సత్సంగము, భక్తియోగము అనువాటిని ఆచరించుట యనగా నన్ను పూజించుటయే యగును. కనుక సంసారసాగరమును తరించుటకు వాటిని ఆచరించుట తప్ప మఱియొక మార్గము లేదు. ఇది నా నిశ్చితాభిప్రాయము.


*11.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*అథైతత్పరమం గుహ్యం శృణ్వతో యదునందన|*


*సుగోప్యమపి వక్ష్యామి త్వం మే భృత్యః సుహృత్సఖా॥12662॥*


ఆత్మీయుడవైన ఉద్ధవా! నీవు నాకు భృత్యుడవు, హితైషివి, పరమమిత్రుడవు. అందువలన నీకు అతిగోప్యమైన మరియొక విషయమును తెలిపెదను. సావధానముగా వినుము.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ఏకాదశోఽధ్యాయః (11)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *బద్ధజీవుల-ముక్తజీవుల-భక్తుల లక్షణములు* అను పదకొండవ అధ్యాయము (11)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*435వ నామ మంత్రము* 5.10.2021


*ఓం చాంపేయ కుసుమ ప్రియాయై నమః*


చంపకపుష్పము అనిన ప్రీతికలిగిన శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చాంపేయ కుసుమ ప్రియా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చాంపేయ కుసుమ ప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధన చేయు భక్తులను ఆ తల్లి వారి జీవనమార్గమంతయును సుమసౌరభ భరితముగను, సిరిసంపదలతోను, శాంతిసౌఖ్యములతోను వర్ధిల్లునట్లుగను అనుగ్రహించును.


చాంపేయ కుసుమము అను శబ్దమునకు నాగకేసరము, సంపెంగ, దేవదారు పుష్పములని అర్థము. అమ్మవారికి సంపెంగపూలు అనిన మాత్రమే కాదు, కదంబకుసుమము, పాటలీకుసుమము మొదలైన పుష్పములనిన అత్యంత ప్రీతి. అసలు స్త్రీలకు సువాసనా భరితమును, సౌందర్యమును ఇనుమడించు పష్పములనినను మహాప్రీతి. ఆ తల్లికి కూడా పుష్పము లనిన మహాప్రీతి. పుణ్యస్త్రీలకు అంటే అయిదవ తనమున్నస్త్రీలకు పుష్పములు కూడా సౌభాగ్య చిహ్నము. అయిదో తనము అంటే ముత్తయిదువ అని అర్థం. స్త్రీలు ఎప్పుడూ అయిదు అలంకరణలతో కళ కళలాడుతుండాలి. అవే…

పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగళ్యం . వివాహం అయిన తర్వాత మాత్రమే మెట్టెలు, మాంగళ్యం వస్తాయి. వీటితోబాటు పువ్వులతో స్త్రీ పరిపూర్ణతను పొంది ముత్తయిదువగా పిలవబడుతుంది. అమ్మవారికి ఎన్నోరకములైన సౌరభభరితమైన పుష్పములతోబాటు చాంపేయ కుసుమములనిన ప్రీతిగలది యగుటచే, ఆ తల్లి *ఓం చాంపేయ కుసుమ ప్రియాయై నమః* అని స్తుతింపబడుచున్నది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*436వ నామ మంత్రము* 5.10.2021


*ఓం కుశలాయై నమః*


చతుష్షష్టి కళలయందును, పంచకృత్యముల (సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహముల) యందును కౌశలత్వము గలిగిన పరమేశ్వరికి నమస్కారము.


సదా (భూత భవిష్య ద్వర్తమానములయందు కుశలముగా (ఆరోగ్యముగా) ఉండు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కుశలా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం కుశలాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి కరుణతో ఆయురారోగ్యభాగ్యములతోను, శాంతిసౌఖ్యములతోను విలసిల్లునటులు అనుగ్రహించును.


అమ్మవారు పంచకృత్య పరాయణమునందు మంచి నేర్పుగలిగినది. ఆ తల్లి తన సౌందర్యమును ఇనుమడింప జేయునటులు అలంకరించుకొనుటలో మంచినేర్పుగలిగినది. *సర్వారుణా* యని అనబడినటులు ఆ తల్లి తన అరుణవర్ణ దేహమునకు తగిన విధంగా ఆభరణములు, వస్త్రములు, పుష్పాలంకరణ మొదలైనవి ఏర్పరచుకొనుటలో మంచి నేర్పుగలిగి, మహిళాలోకానికి చీరకు తగిన జాకెట్టు, అందుకు తగిన బొట్టు, పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, ఆభరణములు అలంకరించుకొనుటలో ఆదర్శమూర్తి అయినది. కామేశ్వరుడు ఎంతో అందగాడు. అందుకు తగిన అందగత్తె కామేశ్వరి. అంతటి నేర్పరియైన అమ్మవారు *కుశలా* యని అనబడినది. భండాసురుడు, మహిషాసురాది రాక్షసులను సంహరించుటకు ఆ తల్లి మాత్రము సరిపోతుంది. కాని తన యుద్ధకుశలత్వమును లోకాలకు తెలియజేయుటకేమో! కోట్లాది శక్తిసేనలను, గజదళములకు అధిపతియైన సంపత్కరీదేవిని, అశ్వదళములకుఅధిపతియైన అశ్వారూఢాదేవిని, శత్రుదుర్భేద్యమైన జ్వాలాప్రాకారమును నిర్మించిన జ్వాలామాలినిని, నిత్యాదేవతలను, బాలాత్రిపురసుందరిని, మంత్రిణియైన శ్యామలాదేవిని, మహాగణేశ్వరుని, అసురుల శస్త్రాలకు ధీటైన అస్త్రములు మొదలైన యుద్ధసాధనములను ఉపయోగించుటలో తన యుద్ధకుశలత తెలియజేసినది. అంతేనా! *కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః* అన్నట్లు తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళసందుల నుండి అసురులను సంహరించుటకు నారాయణుని పది అవతారములను పంపించినది.


కుశలము అనగా క్షేమము. ఆరోగ్యకరముగా నుండుట. అమ్మవారు ఏవిధమైన కోర్కెలు లేని పరబ్రహ్మస్వరూపిణియై  *నిష్కామా* యని అనబడింది. ఏ కోరికలు లేనివాడు కోటీశ్వరునితో సమానము. ఆరోగ్యవంతుడై, ఆనందస్వరూపముతో ఉంటాడు. అలాగే నిష్కామ యైన అమ్మవారు బ్రహ్మానందస్వరూపిణి యగుటచే *కుశలా* యని అనబడినది. అన్ని సంపదలకు మించినది ఆరోగ్యము. ఆరోగ్యముగా, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండువారు కుశలముగా నుండువారేగదా. అందుకే అమ్మవారు ఏరకమైన కోర్కెలు లేకను మరియు తృప్తిగాను కుశలముగాను ఉండుటచే ఆ తల్లి *ఓం కుశలాయై నమః* యనుచూ నమస్కరింపబడుచున్నది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం*

 *4.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదకొండవ అధ్యాయము*


*బద్ధజీవుల-ముక్తజీవుల-భక్తుల లక్షణములు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*11.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*జ్ఞాత్వాజ్ఞాత్వాథ యే వై మాం యావాన్ యశ్చాస్మి యాదృశః|*


*భజంత్యనన్యభావేన తే మే భక్తతమా మతాః॥12646॥*


నా స్వరూపమును, స్వభావమును, విభూతులను ఎరిగినను, ఎరుగకున్నను, అనన్య భక్తిభావముతో నన్నే సేవించువారు నా పరమభక్తులుగా పరిగణింపబడుదురు.


*11.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*మల్లింగమద్భక్తజనదర్శనస్పర్శనార్చనమ్|*


*పరిచర్యా స్తుతిః ప్రహ్వగుణకర్మానుకీర్తనమ్॥12647॥*


ఉద్ధవా! నా మూర్తియొక్క, నా భక్తులయొక్క దర్శనము, స్పర్శనము, అర్చనము, పరిచర్యలు, స్తుతి, ప్రణామములు మొదలగువాటిని ఆచరింపవలెను. అట్లే నా గుణములను, కర్మలను కీర్తింపవలెను.


*11.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*మత్కథాశ్రవణే శ్రద్ధా మదనుధ్యానముద్ధవ|*


*సర్వలాభోపహరణం దాస్యేనాత్మనివేదనమ్॥12648॥*


నా కథలను వినుటయందు శ్రద్ధను కలిగియుండవలెను. నిరంతరము నన్నే ధ్యానింపవలెను. లభించిన ప్రతివస్తువును నాకు సమర్పింపవలెను. దాస్య భావముతో ఆత్మసమర్పణము గావింపవలెను.


*11.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*మజ్జన్మకర్మకథనం మమ పర్వానుమోదనమ్|*


*గీతతాండవవాదిత్రగోష్ఠీభిర్మద్గృహోత్సవః॥12649॥*


నా దివ్యావతారములను గూర్చియు, నా లీలలను గురించియు భాషించుకొనుచుండవలెను. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి మొదలగు పర్వదినములను సంతోషముగా చేసికొనుచుండవలెను. గీతాలాపములు, నృత్యములు, వివిధములగు వాద్యగోష్ఠులు మొదలగువానితో నా మందిరము నందు ఉత్సవములను జరుపవలెను.


*11.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*యాత్రా బలివిధానం చ సర్వవార్షికపర్వసు|*


*వైదికీ తాంత్రికీ దీక్షా మదీయవ్రతధారణమ్॥12650॥*


రథయాత్ర, బ్రహ్మోత్సవములవంటి విశేష వార్షిక పర్వదినములలో (చాతుర్మాస్యముల యందును, ఏకాదశీ తిథులయందును) దివ్యక్షేత్రములను సేవించుచుండవలెను. వైదికములైన, తాంత్రికములైన దీక్షలను పాటింపవలెను. నాకు సంబంధించిన వ్రతములను ఆచరించుచుండవలెను.


*11.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*మమార్చాస్థాపనే శ్రద్ధా స్వతః సంహత్య చోద్యమః|*


*ఉద్యానోపవనాక్రీడపురమందిరకర్మణి॥12651॥*


దేవమందిరముల యందు నా అర్చామూర్తులను వ్యక్తిగతముగానైనను, సామూహికముగానైనను స్థాపింపవలెను. నా కొరకై ఉద్యాన వనములను, ఉపవనములను, క్రీడాస్థానములను, నగరములను, మందిరములను నిర్మింపవలెను.


*11.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*సమ్మార్జనోపలేపాభ్యాం సేకమండలవర్తనైః|*


*గృహశుశ్రూషణం మహ్యం దాసవద్యదమాయయా॥12652॥*


సేవకునివలె భక్తిశ్రద్ధాపూర్వకముగా, నిష్కపట భావముతో నా మందిరములయందు ఊడ్చుట, గోమయముతో గూడిన జలములను చల్లుట, స్వస్తికాది చిహ్నమలతో చిత్రవిచిత్రములుగా మ్రుగ్గులు పెట్టుట చేయవలెను.


*11.40 (నలుబదియవ శ్లోకము)*


*అమానిత్వమదంభిత్వం కృతస్యాపరికీర్తనమ్|*


*అపి దీపావలోకం మే నోపయుంజ్యాన్నివేదితమ్॥12653॥*


దంభాహంకారములను విడనాడవలెను. తానొనర్చిన కార్యములను గూర్చి గొప్పలు చెప్పికొనరాదు. ఇతరదేవతల ఆరాధనలలో ఉపయోగించిన దీపములను నా పూజలకై వినియోగింపరాదు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

హనుమాన్ శ్లోకం

 👆 ఈ రోజు తప్పక వినండి హనుమాన్ శ్లోకం - 

బుద్ధిర్ బలం యశో ధైర్యం

నిర్ భయత్వం ఆరోగత

అజాత్యం వాక్ పటుత్వం చ

హనుమత్ స్మరనాత్ భవేత్

అర్థం -

హనుమంతుడు బలం, విజయం, నిర్భయం, ధైర్యం, వివేకం మరియు వక్తృత్వ నైపుణ్యాలతో తన ఆశీర్వాదాలను కురిపిస్తాడు, మనం భయంతో లేదా ఏదైనా అడ్డంకులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన మనతో ఉంటాడు.


మనోజ్-అవమ్ మారుతి తుల్య వేగమ్

జితేంద్రియం భూధి-మాతం వారిష్టం

వాతాత్మజం వానర-యుత-ముఖ్యమ్

శ్రీ రామదూతం శరణం ప్రపద్యే లేదా శ్రీ రామదూతం శిరసా నమామి

అర్థం -

శ్రీరాముని దూత అయిన, గొప్ప వేగంతో ఎగురుతున్న మరియు తన అవయవాల భావాన్ని నియంత్రించే సామర్ధ్యం కలిగిన గొప్ప హనుమంతునికి నేను నమస్కరించి, లొంగిపోతాను మరియు అతను తెలివైన వారందరిలో తెలివైనవాడు, గాలి దేవుడి కుమారుడు మరియు మంకీ తెగకు అధిపతి.


ఆంజనేయం అతి-పాట-లనం

కాంచనాద్రి కమనీయ విగ్రహం

పారిజాత-తరుమూల వాసినం

భావయామి పవమాన నందనమ్

అర్థం -

అంజనా దేవత కుమారుడు, ముదురు ఎరుపు రంగులో ఉన్నాడు, అతని శరీరం భారీ బంగారు పర్వతంలా ప్రకాశిస్తుంది, పారిజాత చెట్టు మూలంలో ఎల్లప్పుడూ విశ్రాంతి తీసుకుంటుంది. అతనిపై నా ధ్యానం చేస్తుంది, పవన దేవుని కుమారుడు.


యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్

తత్ర తత్ర కృత మస్తకంజలిమ్

భాషాప-వారి పరిపూర్ణ లోచనమ్

మారుతి నామద రాక్షస-అంతకం

అర్థం -

రఘునాథ (రాముడు) గురించి పాడే అన్ని ప్రదేశాలలో మరియు మూలల్లో, అలాంటి అన్ని ప్రదేశాలలో మరియు మూలల్లో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు, అతని కళ్ల నుండి కన్నీళ్లు తేలుతాయి. నీకు నా ప్రభువు మారుతి, ఇచ్చేవాడు ఒంటరితనం యొక్క బలం మరియు అతని భక్తుల మార్గంలో ఉన్న అన్ని చెడులను నాశనం చేస్తుంది.https://youtu.be/ar1jW6GoUTM

భక్తులకు ఆహ్వానం*

 *భక్తులకు ఆహ్వానం*                        

*శ్రీ రామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రం & శృంగేరీ శంకరమఠం. ఖమ్మం. ప్రాంగణం లో ఉన్న శ్రీ శారదా మాత* *ఆలయం లో ది. 07-10-2021 గురువారం నుండి* *ది. 15-10-2021 శుక్రవారం వరకు శరన్నవరాత్రి ఉత్సవములు నిర్వహించ బడును. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతి రోజు శ్రీ లలితా* *సహస్రనామస్తోత్రం పారాయణం జరుపుటకు శ్రీ శృంగేరీ పీఠాధిపతులు* *మహసన్నిధానం శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామి వారు మరియు సన్నిధానం శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వార్ల దివ్య ఆశీస్సులతో జరుపుటకు ట్రస్టు కమిటీ వారు* *నిర్ణయించనైనది.*

*ప్రతి రోజూ ఉ.8 గం నుండి 11*గం.ల వరకు, మరల* *సాయంత్రం 6 గం ల నుండి 8 గం వరకు జరిగే ఈ శ్రీ లలితా* *సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం లో* *భక్తులు ప్రతి రోజూ అందరూ విరివిగా పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులు కాగలరు.* *ప్రతి రోజూ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇవ్వబడును.*

*పూర్తి వివరాలకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సాయికిరణ్ శర్మ గారి ని*. *సంప్రదింగలరు. సెల్ నెంబర్: 7093328846*

                   *ఇట్లు*  

*జూపూడిహన్మత్ ప్రసాద్* *ధర్మాధికారి* *కూరపాటిసీతారామారావు*

*అధ్యక్షులు*

  *05-10-2021*

శ్రీమద్భాగవతము

 *05.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2282(౨౨౮౨)*


*10.1-1409-వ.*

*10.1-1410-*


*శా. ఉర్విన్ మానవు లెవ్వరైన గురువా క్యోద్యుక్తులై కాని త*

*త్పూ ర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్*

*సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియున్*

*గుర్వంగీకరణంబు సేయఁ జని; రా గోవిందుఁడున్ రాముఁడున్.* 🌺



*_భావము: శ్రీకృష్ణుడు జన్మించిన సమయమున, చెరసాలలో బందీయై యున్న వసుదేవుడు మనస్సులోనే   బ్రాహ్మణోత్తములకు గోవులను ధారపోశాడు. ఇప్పుడు వారికి  ఉపనయనము జరిగిన పిమ్మట, వసుదేవుడు విప్రులకు  ధేనువులను దక్షిణగా ఇచ్చాడు. కోరిన వారి కోరికలగు తగినట్లుగా, సువర్ణ దానము మొదలగు అనేక దానాలు చేశాడు. ఈ విధంగా బలరామకృష్ణులు బ్రహ్మచర్యవ్రతము స్వీకరించారు. లోకములోని వారికి మంచి ఆదర్శముగా నిలవటానికి, గురూపదేశము పొందితే గానీ, ఏ సాధనా ప్రయత్నము చేయరాదని బోధించటానికా అన్నట్లుగా , సర్వజ్ఞులైన, బలరామకృష్ణులు సద్గురువును అన్వేషిస్తూ వెళ్లారు._* 🙏



*_Meaning: When Sri Krishna was born while he was in prison, Vasudeva, in his mind  promised to present cows to Brahmins (on the auspicious occasion). Since he could not fulfil his wish all these years, on this pious occasion, he gave away cows to Brahmins and also gave various useful things including gold as per the wishes of the seekers. Thus Balarama and Sri Krishna accepted  Brahmacharya Asrama. To set an example to the people of the world, though they were omniscients, set on their journey in search of  a competent Guru to seek higher knowledge._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

అమ్మవారి అవతారాలు

 *దసరా నవరాత్రుల లో అమ్మవారి అవతారాలు , అమ్మకు పెట్టవలసిన నైవేద్యాలు , శ్లోకాలు*



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాసించ వలెను.


*నవదుర్గలు :*


ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||

నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.


*నవదుర్గా ధ్యాన శ్లోకములు*


*శైలపుత్రీ : (బాలా త్రిపుర సుందరి)*


నైవేద్యం : కట్టు పొంగలి


శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


*బ్రహ్మ చారిణి ( గాయత్రి ):*


నైవేద్యం : పులిహోర


శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


*చంద్రఘంట ( అన్నపూర్ణ )*


 నైవేద్యం : కొబ్బరి అన్నము


శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||


*కూష్మాండ ( కామాక్షి )*


నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు


శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||


*స్కందమాత ( లలిత )*


నైవేద్యం : పెరుగు అన్నం


శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||


*కాత్యాయని(లక్ష్మి)*


నైవేద్యం : రవ్వ కేసరి


శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||


*కాళరాత్రి ( సరస్వతి )*


నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని


శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||


*మహాగౌరి( దుర్గ )*


నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)


శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||


*సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )*


నైవేద్యం : పాయసాన్నం


శ్లో|| సిద్ధ గంధర్వ యక్షాద్యైరసురైరమరైరపి | సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||



*దుర్గా ధ్యాన శ్లోకము :*


శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥


*నవదుర్గా అవతారాలు , నైవేద్యం , మంత్రం*


శైలపుత్రి , 

బ్రహ్మచారిణి , చంద్రఘంట , 

కూష్మాండ , 

స్కందమాత , కాత్యాయిని , 

కాలరాత్రి , 

మహాగౌరీ , 

సిద్ధిధాత్రీలను నవదుర్గలుగా పిలుస్తారు. ఈ నవదుర్గలకు సానుకూలంగానే భక్తులు శైలపుత్రి - గాయత్రీదేవి , చంద్రఘంట - అన్నపూర్ణ , 

కూష్మాండ - మహాలక్ష్మి , స్కందమాతను లలితా త్రిపురసుందరి., కాత్యాయిని - సరస్వతీదేవి , 

కాలరాత్రిని దుర్గాదేవి., మహాగౌరి - మహిషాసురమర్దని , 

సిద్ధి ధాత్ని - రాజరాజేశ్వరీదేవిగా అలంకరించి పూజిస్తారు.


తిథులలో అమ్మవారి అవతార విశేషం , ఆ రోజున సమర్పించాల్సిన నైవేద్యం , జపించాల్సిన మంత్రం , గాయత్రి మంత్రం.


పాడ్యమి - బాలా త్రిపురసుందరి - పాల పాయసం


"దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే - హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే

సకల జయకరీ , శక్తి బాలే నమస్తే|| " అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి


*బాల గాయత్రి :*


" ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి - తన్నో బాలా ప్రచోదయాత్‌||"

అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.


విదియ - అన్నపూర్ణేశ్వరి - పాయసన్నం


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||

మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః


*అన్నపూర్ణ గాయత్రి :*


అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||


తదియ - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం


మాతర్నమామి కమలే కమలాయతాక్షి - శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః

క్షీరదజే కమల కోమల గర్భగౌరి - లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||


*లక్ష్మీ గాయత్రి :*


ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||

"ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి - తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌||" అని పఠించినా మంచిది.


చవితి - గాయత్రి దేవి - కట్టు పొంగలి అన్నం


ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్‌||

అని పఠించినట్టయితే తల్లి కరుణిస్తుంది.


పంచమి - శ్రీ లలితా దేవి - పులిహోరాన్నం


అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ - ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||


*శ్రీలలితా గాయత్రి :*


లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్‌||


షష్టి - శ్రీ దుర్గాదేవి - చిల్లు లేకుండా అల్లపు గారెలు


ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే - తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ

పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ - సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ

నవమా సర్వస్థిశ్చేత్‌ నవదుర్గా ప్రకీర్తితా||


*దుర్గా గాయత్రి :*


ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్‌


సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - కొబ్బరి అన్నం


సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||


*సరస్వతీ గాయత్రి :*


సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి - తన్నో వాణీ ప్రచోదయాత్‌||


అష్టమి - మహిషాసురమర్ధని - శాకాన్నం , కేసరిబాత్‌


జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే


*మహిషాసుర మర్ధిని గాయత్రి :*


మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి - తన్నో మాతా ప్రచోదయాత్‌||


నవమి - శ్రీరాజరాజేశ్వరి - చిత్రాన్నం , లడ్డూలు


అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్‌

దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా

అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా

చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||


*రాజరాజేశ్వరి గాయత్రి :*


రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి - తన్నో దేవి ప్రచోదయాత్‌||

ఓం శ్రీ మాత్రే నమః

రాతిరి సూర్యుడు

 

రాతిరి సూర్యుడు నంబరమున దోచెన్‌

ఆతతకాసారముల

బ్జాత మనోజ్ఞంబు లయ్యె జక్రములెల్లన్‌

గావరముడిగెను, ముగిసెన్‌

రాతిరి, సూర్యుడు నంబరమున దోచెన్‌




స్క్రబ్‌ టైపస్‌ వింత జ్వరం

 *విజయవాడలో వింత జ్వరం!.. వైద్యులకూ అంతుబట్టని ‘స్క్రబ్‌ టైపస్‌’*


ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్న వైద్యులు



కరోనా, డెంగీ లక్షణాలతో వణికిస్తున్న అరుదైన వ్యాధి 


విజయవాడకు చెందిన ఓ యువకుడు తీవ్రమైన చలి, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్నా ఫలితం లేకపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. ఆ రోగి వ్యాధి లక్షణాలను బట్టి డెంగీగా భావించి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయినా జ్వరం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండటంతో అన్ని రకాల వైద్యపరీక్షలు చేయించారు. అన్నీ నెగెటివ్‌ రావడంతో నిపుణులైన వైద్యులను సంప్రదించారు. చివరికి తేలిందేమంటే ఆ యువకుడికి సోకింది వైద్యుల ప్రాధాన్యక్రమంలో ఉన్న విషజ్వరాల జాబితాలోనిది ఏదీ కాదు. ఆ యువకుడు ‘స్క్రబ్‌ టైపస్‌’ వైరస్‌ బారిన పడ్డాడని వైద్యనిపుణులు గుర్తించారు. వెంటనే తగిన చికిత్స అందించి ఆ యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.

జిల్లాలో విష జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్‌లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ తదితర విష జ్వరాలు రావడం సాధారణమే అయినా.. ఈ మధ్య కాలంలో ‘స్క్రబ్‌ టైపస్‌’ కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. అయితే ఎక్కువగా పిల్లల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు కూడా దాదాపు డెంగీని పోలి ఉండటం వల్ల వైద్యులు కూడా ప్రాథమిక దశలో దీనిని గుర్తించలేకపోతున్నారు. ఆలస్యంగా గుర్తించి రక్తపరీక్షలు చేయిస్తున్నా.. వాటి రిపోర్టులు రావడానికి కొన్ని వారాల సమయం పడుతుండటంతో సకాలంలో తగిన చికిత్స అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళుతున్న రోగుల్లో కొందరు ‘స్క్రబ్‌ టైఫస్‌’ బారినపడినవారు ఉండడం వైద్యులను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వ్యాధికి సకాలంలో సరైన చికిత్స అందకపోతే 50 నుంచి 60 శాతం వరకు మరణాలు సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. 




స్క్రబ్‌ టైపస్‌ అంటే...?


ప్రాణాంతకమైన స్క్రబ్‌ టైపస్‌ వ్యాధి దోమలు కుట్టడం వల్ల రాదు. అదొక రకమైన కీటకం (టిక్స్‌) కుట్టడం వల్ల బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని బారినపడినవారికి డెంగీ మాదిరిగానే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విజయవాడ నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా ఈ బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తున్నట్టు వైద్యనిపుణులు భావిస్తున్నారు. ఈ స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇతర జ్వరాల్లో కాక, టైఫస్‌ లక్షణాలున్న పురుగులు కుట్టడం ద్వారానే ప్రాణాంతకమైన ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. పెంపుడు జంతువులతో సహవాసం చేసేవారు, పొదలు, అటవీ ప్రాంతాల్లో నివాసించేవారిని ఈ స్క్రబ్‌ టైఫస్‌ సోకిన పురుగులు కుడితే, పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తొలుత పురుగు కాటు ఉన్న ప్రదేశంలో ఎర్రటి గాయం ఏర్పడుతుంది. క్రమంగా చలి, జ్వరం, తలనొప్పి, పొడి దగ్గు, వికారం, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు, కాళ్ల వాపు, కండరాల నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం, రక్తకణాలు పడిపోవడం, కిడ్నీలు, లివర్‌, గుండె, మెదడు తదితర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. 




నివారణ పద్ధతులివీ.. 


స్రైబ్‌ టైఫస్‌ వ్యాధిని నివారించడానికి ఎలాంటి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. దీని వ్యాప్తికి కారకాలైన పురుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం. ఈగలు, పురుగులు, పేలు కుట్టినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలున్నాయి. ఇది ఒకసారి రక్తంలోకి ప్రవేశిస్తే మెల్లగా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లో పురుగులు, కీటకాలకు ఆవాసంగా ఉండేలా మొక్కలు, పొదలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఆరుబయటకు వెళ్లేటప్పుడు చర్మంపైన, దుస్తులపైన క్రిమి వికర్షకమైన స్ర్పేలు, క్రీములను వాడవచ్చు. చిన్నపిల్లల శరీరం, చేతులు, కాళ్లు మొత్తం కప్పి ఉంచేలా దుస్తులను వేయాలి. లేదా దోమతెరలు, బేబీ క్యారియర్‌లలో వారిని నిద్రపుచ్చాలి. పిల్లలు, పెద్దలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధిని మోసే పురుగుల నుంచి రక్షణ పొందవచ్చు.




డెంగీ, కరోనాలతో కలిసి కూడా ఉండొచ్చు


ఇటీవల డెంగీ జ్వరాలతో పాటు స్క్రబ్‌టైపస్‌ కేసులు పిల్లల్లోనూ పెరుగుతున్నాయి. ఇది డెంగీ, కరోనా వైరస్‌లతో కూడా కలిసి ఉండొచ్చు. ఇలాంటి కాంబినేషన్‌ ఆఫ్‌ డిసీజెస్‌ ఇటీవల పెరుగుతున్నాయి. స్క్రబ్‌టైపస్‌ను గుర్తించడానికి మన దగ్గర ప్రస్తుతం ‘వైల్‌ఫిలిక్స్‌’ అనే టెస్టు మాత్రమే అందుబాటులో ఉంది. అందులో కూడా 40 నుంచి 50 శాతం మాత్రమే ఫలితాలు తెలుస్తున్నాయి. అది కూడా వారం దాటితేగాని రిపోర్టులు రావడం లేదు. ఈ కారణంగానే ప్రాథమిక దశలో స్క్రబ్‌టైపస్‌ను గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధిని గుర్తించడానికి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్స్‌ చేయించాల్సిన బాధ్యత వైద్యులపైనే ఉంది. ఇందుకు క్వాలిటీ ల్యాబ్‌ సపోర్టు కూడా అవసరం. నిపుణులైన పెథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు మాత్రమే ఇలాంటి అరుదైన వ్యాధులను గుర్తించగలుగుతారు. స్క్రబ్‌టైపస్‌ను పూర్తిస్థాయిలో గుర్తించడానికి ఈ మధ్యనే ‘మాలిక్యులర్‌’ టెస్టు అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా మెట్రో నగరాల్లో మాత్రమే ఉంది. ఈ వ్యాధి లక్షణాలు దాదాపు డెంగీ మాదిరిగానే ఉంటున్నా.. స్క్రబ్‌టైపస్‌ సోకిన బాధితుల్లో రక్తంలో సోడియం తగ్గుతుంది. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందించకపోతే శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది. - డాక్టర్‌ చలసాని మల్లికార్జునరావు, పిల్లల వైద్యనిపుణులు

దొంగజాంకాయ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

 శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ* 

                🌷🌷🌷

దొంగజాంకాయ( ఇష్టమైన...పాత హాస్యకధ )


""""జోగారావురికి బాగాసీరియస్ గా ఉందిట కదా. నెల్లాళ్లు ఐసీయూ లో ఉంచి , లాభం లేదు. ఇంటికి తీసుకెళ్లిపోండి, అయినవాళ్లనందరినీ ఆఖరిచూపులుకు పిలుచుకోండి అని చెప్పేసారంట కదా! అప్పుడే వారమయిందట ఇంటికి తీసుకొచ్చి...........", ధనలక్ష్మితో... అదే తలనొప్పి. మొదలెట్టడమే... అవతలి వారికి మాటాడే అవకాశం ఇవ్వదు.


భార్య వాక్ప్రవాహానికి అడ్డుకట్టేస్తూ.. రాంబాబు అందుకున్నాడు.


" అవును! తెలుసు! ఇప్పుడు అక్కడినుంచే వస్తున్నా! అయితే ఏంటంట?! "...... కాస్త కటువుగా పలికాడు.


" ఏంటంటారేంటండీ! జోగారావుగారు మన యజమాని. మీ బాల్యస్నేహితుడు. 

పైగా వామాక్షి నా ఫ్రెండు. 

నాకు కనీసం మాటయినా చెప్పలేదు ఎవరూ. నేనింకా ఏదో సుస్తీయే అనుకుంటున్నా ఇంకా! ఇంత సీరియస్ సిట్యుయేషన్ అని చెప్పద్దూ మీరు! 

మన చిన్నది అమెరికా నుండి కాల్ చేసి చెప్పింది. వాళ్ల చిన్నబ్బాయి కూడా వచ్చేసాట్ట కదా! 

మనం ఇలాంటి సమయంలో దగ్గర లేకపోతే నలుగురూ ఏమనుకుంటారు?.........."


మళ్లీ ఆపాల్సి వచ్చింది అతనికి.. ఆమె వాగ్ధోరణిని.


" ఏం మాట్లాడుతున్నావ్ ధనా? 

వాడు మనకు యజమానేమిటి? 

నన్ను బిజినెస్ పార్టనర్ గా చేర్పించి, మన ఆస్తంతా అమ్మించి ,పెట్టుబడి పెట్టించి, ఆనక నష్టాలొచ్చాయని కంపెనీ మూసేసాడు!

కొత్త వ్యాపారం మొదలెట్టి , కోట్లు గడించాకా, నాకన్నా విశ్వాసపాత్రుడు దొరకడని, నన్నే మేనేజర్ గా పెట్టుకుని, పూలమ్మిన చోట కట్టెలమ్మిస్తున్న చీట్ ఆ జోగారావు. 

స్నేహం విలువెరగని ట్రైటర్ వాడు. 

మంచి శాస్తే అయింది. 

అందరి పొట్టలూ కొట్టి, సంపాదించింది తినకుండానే... పోతున్నాడు"! .......కక్షగా నొక్కి మరీ చెప్పాడు రాంబాబు.


" నిజమే నండి! ఆ వామాక్షి మాత్రం తక్కువా! చీరల వ్యాపారం పెడదామంటే , మా అమ్మా వాళ్లిచ్చిన ఎకరమూ అమ్మి చేతులో పెట్టా! మూడునెలలు లాభం చూపించి ...నాలుగోనెల కస్టమర్లు డబ్బివ్వలేదని మూసేసింది.।

నా చేతిలో పదిచీరలూ, పదివేలూ పెట్టేసి నోరుమూయించి, గప్ చుప్ గా దొడ్డిదారిని వ్యాపారం చేసుకుంది అప్పట్లో!...విచిత్రం చూడండి... వామాక్షి అంటే కుచేలుడి పెళ్లంట. 

మనం కుచేలుళ్లమయ్యాం. 

ఆమె ధనలక్ష్మి అయిపోయింది. అయినా దేవుడున్నాడా అసలు? ఈ అన్యాయాలు చూస్తూ కూడా ఎలా సహిస్తున్నాడో............."


భార్యనాపకపోతే ఆమె శాపాలకి ప్రపంచం భస్మమైపోతుందని గ్రహించి , రాంబాబు 

" సరే! తయారవ్వు. నువ్వూ ఒకసారి చూసేద్దువు గాని ...ఆ జోగిగాడిని"..... అంటూ బాత్రూంలో దూరాడు. 


స్నానం చేసొచ్చి, కాస్సేపు ధ్యానం చేద్దామని కూర్చున్నాడు కానీ , ఎక్కడా మనసు లగ్నం అవ్వడం లేదు. జోగారావు మీదకే ఆలోచనలన్నీ మళ్లాయి.


పెంటపాడులో తనతండ్రి పెద్దకామందు. తనూ, తన అన్నగారూ పిల్లజమిందార్లలా తిరిగేవారు. ఈ జోగిగాడు కరణంగారబ్బాయి. పదిమంది పిల్లల్లో ఎనిమిదో వాడు. తన తండ్రికీ, కరణం గారికీ ఉన్న లావాదేవీల వలన జోగారావు తండ్రితో ...తమింటికి వస్తూ పోతూ... తనకి మిత్రుడయ్యాడు.


తనూ, అన్నయ్యా ఆడుకుంటుంటే ఆటలో అరటిపండులా వచ్చిచేరి, కొంచెం సేపటికే లీడర్ అయిపోయేవాడు. ఖాళీజేబూలు గోళీలతో నిండేవి. కొన్నాళ్లకి వయసుతో పాటూ వాడు గెలుచుకునే వస్తువులూ పెరిగాయి. బేట్లు, బుష్ షర్టులు, రేమాండ్ పేంట్లు, రేబాన్ కళ్లద్దాలు, చివరకు తమ పోకెట్ మనీలూ. 


వాళ్లనాన్నా తక్కువ తినలేదు. తనతండ్రి మంచితనాన్ని ఆసరా చేసుకుని , తమ్మినిబమ్మి చేసి, ఆరుగురి కూతుళ్ల పెళ్లి చేసాడు. 


ఖర్మకాలీ జోగారావు తనకు కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో కూడా తగులుకున్నాడు. అరబ్బూ-ఒంటే కధలోలా, మెల్లగా తన గదంతా హాయిగా ఆక్రమించి, తన తిండితిని , తన బట్టలన్నీ వాడి, తనతోనే ఫీజులు కట్టించి... మొత్తానికి ఇంజినీరయ్యాననిపించాడు.


అలా కేవలం కాళ్లూ, చేతులతో వచ్చేసి, పైసా ఖర్చుపెట్టకుండా... పైకొచ్చిన వాడు అతనే. పొరుగువాడి దేదైనా తనది కావలసిందే. నవ్వుతూనే అవతలివాళ్ల మెడకాయమీంచి తలకాయ లాగేసే రకం.


ఎలా సంపాదించాడో తెలీదు, తనఅత్తెసరు మార్కులతోనే , నాగార్జున సాగర్లో అసిస్టెంట్ ఇంజినీరుగా చేరిపోయాడు. 


అక్కడే తమకు బంధువులయిన ఈ.ఈగారి కూతురు వామాక్షిని పెళ్లాడేసి , అంచెలంచెలుగా ఎదిగిపోయాడు. 


వామాక్షి విషయంలోనూ వంచనే! 

నిజానికి వామాక్షి తన మేనత్తకూతురు. తనకనుకున్న సంబంధం. 

చూచాయిగా ఈవిషయం జోగి కి తెలుసు. 

అంతే సాగర్ వెళ్లడమేమిటి పావులు కదిపి, తన మేనత్త వేపునుండి నరుక్కొచ్చి వామాక్షిని సొంతం చేసుకున్నాడు. 


అప్పుడే తనని అన్నయ్య హెచ్చరించాడు..."జోగిగాడి నీడకూడా పడకుండా దూరంగా ఉండరా"... అని! 


తండ్రిపోయాకా , ఆస్తుల పంపకం చేసుకుని... తను కాకినాడలో కాంట్రాక్ట్ లు చేసుకుంటూ, బానే సంపాదిస్తూ ఉండేవాడు. ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉంది జీవితం.


అదిగో అప్పుడే మళ్లీ ఊడబడ్డాడు జోగారావ్. ఉద్యోగం ఒదిలేసి... కాంట్రాక్టర్ అవతారం ఎత్తానని, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్, నేవీ క్వార్టర్స్ సబ్ కాంట్రాక్ట్ దొరికిందని, మొత్తం రెండొందల కోట్ల పనులనీ ..... ఓ ఊదరగొట్టేసాడు. 


వచ్చినప్పుడల్లా, కొత్తకారులో రావడం, పిల్లలకేవో బహుమానాలు తేవడం చేసేవాడు. 


మెల్లగా జోగారావ్ చూపించే అరచేతి వైకుంఠం తనకీ, ధనాకీ బాగా బుర్రకెక్కింది. 

అన్నగారు చెప్తున్నా వినకుండా తన వంతు ఆస్తులమ్మి జోగారావ్ ఫర్మ్ లో పెట్టాడు. 

చాకిరీ యేమో తనది. 

బిల్లులూ, బడ్జెట్లూ వాడివీ. 


ఆఖరికి ఐదేళ్లకల్లా ఫర్మ్ లో నష్టాలూ, తన చేతికి చిప్పా చూపించాడు . 


కొన్నాళ్లకు జోగారావ్ పెట్టిన "వామాక్షీ ఇంజినీరింగ్ కంపెనీకి" మేనేజర్ లెవల్లో తను కుదురుకోవలసి వచ్చింది.


జోగారావ్ నల్లగా ఉంటాడు. పెద్ద పర్సనాలిటీ కూడా ఉండదు. కానీ సమ్మోహనంగా నవ్వుతాడు. అంతకన్నా మధురంగా మాట్లాడతాడు. 


ఈ నేర్పుతోనే ఇద్దరు వంటరి మహిళలు ఆస్తులతో సహా ఇతనివైపు ఆకర్షితులయ్యారు. అవన్నీ తెరవెనుక భాగోతాలే! 


వామాక్షికి ఇవన్నీ పెద్ద పట్టింపు లేదు. "భర్త సమర్ధుడు! అదే చాలు!" అనుకునే మనిషి. ధనలక్ష్మి వట్టి భోళా! అమాయకురాలు. తనకి తగ్గట్టే! 


జోగారావు పుణ్యమా అంటూ ఎక్కడో ఉండవలసిన తన కుటుంబం ఎక్కడికి చేరిందో తలుచుకున్నప్పుడల్లా.... తన మనసు వికలం అయిపోతుంది. 


దీర్ఘంగా నిట్టూర్చి, ధ్యానం నుండి లేచాడు రాంబాబు. అప్పటికే ధనలక్ష్మి తయారయి ఉంది.


*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^^^^^^^*^*


కారు డ్రైవ్ చేస్తున్న రాంబాబు దృష్టి యూనివర్సిటీ రోడ్డుపక్క అమ్ముతున్న లేతాకు పచ్చలో పెద్దపెద్ద దబ్బకాయలంత జామకాయల మీద పడింది. కారాపి, బేరం చేసి డజను ఎనిమిదొందలికి కొని తెచ్చాడు.


" మతి లేదేంటి? కోమాలో ఉన్నవాడికి పళ్లెందుకు? ఇంట్లో వాళ్లు మింగడానికా?.....కోపంగా అడిగింది ధన! 


" అన్నట్టు చెప్పలేదు కదూ! జోగారావ్ ఇప్పుడు డెలీరియంలో ఉన్నాడు. అస్తమానూ "జామకాయ" "జామకాయ"! అనే కలవరిస్తున్నాడు. వాడికి పాపం చిన్నప్పటి నుండి జాంకాయలంటే పిచ్చి. అందరి గోడలెక్కి, అందరి దొడ్లలో దూరి జాంకాయలు దొంగతనం చేసి తన్నులు తినేవాడు.....మా రామారావు సార్ వాడిని " దొంగ జాంకాయ!" అనేవారు. వాడికి ఆఖరికోరిక లాగుంది... జామకాయ తినడం!"


"వామాక్షి అప్పటికీ...పాపం కడియం, ద్వారపూడి, పాలకొల్లు, విజయవాడ మనిషిని పంపి జాంకాయలు తెప్పించింది. ...పెద్దకొడుకు కలకత్తానుండి తెచ్చాడు. చిన్నాడు అమెరికానుంచి మెక్సికో జాంపళ్లు తెచ్చాడు. ఆడపిల్ల ఇంకో మెట్టెక్కి ఏకంగా చైనానుండి జాంపళ్లు తెప్పించింది. వాళ్ల బావగారు ఏదో ఎయిర్ లైన్స్ డైరక్టర్ కదా!" 


"జోగి ముందు ఎన్ని రకాలు చూపించి, ముక్కలు పెట్టినా ఆత్రంగా చూడడం , నిరాశగా మొహం తిప్పి, కిటికీ కేసి, యమదూతల కోసం చూస్తున్నట్టు చూస్తుంటాడు... వెధవ! ఎంత శత్రువయినా ఇప్పుడు ఇలా చూస్తుంటే కడుపుతరుక్కుపోతోంది." 


"అప్పటికీ నేను మనూరి జాంకాయలూ... తెప్పించా! అన్నయ్యకు చెప్పి! "


"కాదుట! కళ్లమ్మట నీరు కారుస్తాడు! జాంకాయ! జాంకాయ్ అని గొణుగుతాడు. అందుకే ధనా ! ఇవి కొన్నా"......... చెప్తూనే చొక్కా లోపల పేంట్లో దోపుకున్న పవర్ ఆఫ్ అటార్నీ కాయితాలు తడుముకున్నాడు రాంబాబు!!


ధనలక్ష్మి కళ్లల్లో కూడా నీళ్లు చిప్పిల్లాయి. 


వెళ్తూనే ధనలక్ష్మి... వామాక్షిని కావులించుకుని భోరుమంది. 


వామాక్షి ఆల్రెడీ ప్రిపేర్ అయివుండడంతో, అతి ప్రయత్నం మీద కన్నీరు సృష్టించుకుని, ధనని పొదివిపట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి, జాగారావు కేమయిందో, ఏమవబోతోందో ...అన్నీ చెప్పుకొచ్చింది. 


ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంది. ఈవేళో రేపో అనుకుని వచ్చేసిన చుట్టాలంతా సోఫాల్లో, వరండాల్లో, గదుల్లో, లాన్లో సర్దేసుకున్నారు! 


పెద్ద ఇల్లేమో ! పిల్లలంతా హాయిగా పరుగులెడుతూ ఆడుకుంటున్నారు! కొంత మంది చేతుల్లో కాఫీకప్పులూ, అందరి చేతుల్లో మాత్రం జాంకాయలు. ఇల్లంతా పండిపోయిన జాంపళ్ల వాసనతో ఒకలా ఉంది.


ధనా, వామాక్షి, రాంబాబు .... జోగారావు గదిలోకి వెళ్లారు. మనిషి నెలలోనే చిక్కిశల్యమై మంచానికి అతుక్కుని ఉన్నాడు. 

ఏసీ గదిలో వెంటిలేటర్ల శబ్దం తప్ప మారులేదు. ధనలక్ష్మి నీరునిండిన కళ్లతో అతని చెయ్యి పట్టుకుంది. 

కన్నీరు కారుస్తూ " జాంకాయ" అంటూ నిర్వేదంగా బయటకు చూస్తున్నాడు జోగారావ్. 

ఒక్కసారి ఘొల్లుమంది వామాక్షి


" ఇది ధనా! వరస! .....అంటూ! 


ధన ..తను తెచ్చిన జాంకాయలు రెండు చేతుల్లో పట్టుకుని అతని కళ్లముందాడించింది. మార్పులేదు. 

చూపు కూడా తిప్పలేదు. 


నిరాశగా ఆడవాళ్లిద్దరూ గదినుంచి నిష్క్రమించారు.


రాంబాబు... చలనం లేని జోగి చెయ్యి.. తనచేతిలోకి తీసుకుని, 


" జోగారావ్! నీతో కొంచెం మాట్లాడాలి. నీ పరిస్థితి నీకు తెలుసో లేదో నాకు తెలీదు... కానీ నువ్వింక బ్రతికి బట్టకట్టవని డాక్టర్లు తేల్చేసారు. 


అమెరికా తీసుకెళ్లడానికీ లేదు. నీ బీపీ , పల్స్ రేట్ పడిపోతున్నాయి. ఇలా వెన్నెముక విరిగిపోయి, కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి, నువ్వు రోజుల్లో ఉన్నావు. 


నీ వ్యాపారం నీ కలల సౌధం అని నాకు తెలుసు!!నీ తరువాత ఎవరు? అన్నది ఎవరికీ అవగాహన లేదు ! 

మన ప్రాజెక్టుల మీద నాకు తప్పా... మరి ఎవరికీ పూర్తి సమాచారం లేదు!


నేను మోసగాణ్ని కాదని నీకు తెలుసు. తలుచుకుంటే నేనిప్పుడే నీ అప్పోనెంట్స్ తో చేతులు కలిపి కావలసిన సమాచారం అందించచ్చు. కానీ నేనెప్పటికీ అలా చెయ్యను.


కనుక నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇయ్యి. నీ వ్యాపారం పువ్వుల్లో పెట్టి చూసుకుని భద్రంగా... నీ కొడుకులకు అప్పజెప్తా!" ........


అది వినగానే , జోగారావు మొహంలోకి కోపం ఛాయలు పొడజూపాయి.


" వామాక్ క్ క్...... అనుకుంటూ గొణిగాడు!


" ఛీఛీ! నీదెంత పాడుబుద్ధిరా! 

చావుపడక మీద కూడా ఎంత అభద్రత నీకు!. వామాక్షి నాకు పెళ్లి ముందు మరదలయినా , పెళ్లయ్యాకా నాకు సోదరిసమానురాలు. 

ఆమెను వశపరచుకుని నీ ఆస్తి కాజేస్తానేమో అనే కదా నీ భయం? అవన్నీ నువ్వు చేసిన వెధవ పనులు! నేనంత నీచుడ్ని కాదు! 


చిన్నప్పటినుండీ పరాన్నభుక్కు లాగా ఇంకోళ్ల సొమ్ము మీద పడి తిన్నది నువ్వు. పక్కవాడి దగ్గర ఏది నదురుగా వుంటే , దాన్ని సాధించేదాకా నిద్రపోలేదు! 


ఎవడేమి వ్యాపారం చేస్తే దానిలో దిగిపోవడం, తమ్మినిబమ్మి చేసి, వాడిని నాశనం చేయడం. ఇదేగా మనం చేస్తున్న వ్యాపారం!! చెప్పరా! అలాంటిది... నువ్వు వామాక్షీ, నా ...పేరత్తడం నీ..నీచత్వానికి పరాకాష్ట!! 


" సరే విను! యూఎస్ లో... మా అమ్మాయీ, మీ చిన్నకొడుకూ ఒకళ్లంటే ఒకళ్లు ఇష్టపడ్డారు. 

మా పెద్దపాపని మీ పెద్దాడికిమ్మని.. వామాక్షి అడిగింది. 

కనుక నాకన్నా సరయిన వాడు నీకు దొరకడు... నీ ఆస్తి కాపాడడానికి. 


నువ్వు 'ఊ'...అంటే లాయర్నీ, మేజిస్ట్రేట్ నీ పిలిపిస్తా. రాతకోతలు చేసుకుందాం! పైగా నీ వ్యాపారంలో... నా డబ్బుందని నీకూ తెలుసు".....


జోగారావు మూసుకుపోతున్న కళ్ల వెనుక భావమేదో అర్ధమవ్వలే.. రాంబాబుకు. చూపు మాత్రం... పక్క తలుపుమీంచి తిప్పడంలే!! 


ఒళ్లుమండుకొచ్చింది రాంబాబుకి. కుర్చీలోంచి విసురుగా లేచి... పక్క తలుపు తెరుచుకుని బాల్కనీలోకెళ్లాడు. 


విశాలమైన బాల్కనీలో ఉయ్యాలబల్ల మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు. పెరట్లో ఎవరో ఆడవాళ్ల వాదన వినిపించింది. జోగారావ్ ఇంటి పనిమనిషి... పక్కింటి పనిమనిషితో గొడవపడుతోంది. 


వెనక్కితిరిగి పోబోతున్న రాంబాబు చెవుల్లో అసంకల్పితంగా కొన్ని మాటలు చెవున పడ్డాయి. ఆగి చెవులు రిక్కించి...వారి మాటలు విన్నాడు. మసక చీకట్లో పెరడూడుస్తున్న జోగారావు పనిమనిషి.,. తమింట్లో రాలుతున్న పక్కింటి చెట్ల ఆకుల గురించి గొడవపడుతోంది. అదేమీ విచిత్రం కాదు... కానీ ఆ ఆకులు రాలుస్తున్న చెట్లు జామచెట్లు! వంగుని పిట్టగోడ మీంచి పారాపెట్ మీదకు వాలి చూసాడు రాంబాబు! 


పక్కింటి వాళ్ల ...పెద్ద జామిచెట్టు కొమ్మకటి ....వీళ్ల పేరాపెట్ మీదకు... ఎండ కోసమై విస్తరించి ఉంది. 


పేరాపెట్ ఎత్తుగా మొదటి అంతస్తులో ఉండడం వలన ఎవరికీ అందదు. 

మిగిలిన కొమ్మలన్నీ పిందే పీపీతో ఉంటే, పేరాపెట్ మీదున్న విశాలమైన కొమ్మకు మాత్రం... ఆరముగ్గినవీ, దోరగా పండిన జామకాయలు పెద్దవి గుత్తులు గుత్తులుగా..గుత్తంగా పడున్నాయి...నోరూరిస్తూ! 


రాంబాబు పెదవులమీదకి ఒక్కసారిగా... విశాలమైన నవ్వు పాకింది. 

అది అతని మనసుని చక్కిలిగిలి పెట్టి... పకపకలాడించింది. 


కాసేపు అక్కడే నిలబడి... మనస్ఫూర్తిగా నవ్వుకుని , లోపలికి వెళ్లేముందు... రెండు ఫోన్ కాల్స్ చేసి, తలుపు తెరుచుకుని, జోగారావు బెడ్ రూంలోకి వచ్చాడు.


సవ్వడి విని జోగారావు... అతికష్టం మీద కళ్లు విప్పాడు. 

రాంబాబు చేతులకేసి ఆశగా చూసాడు. 

అతని రిక్తహస్తాలు చూసి... జోగారావు కన్నీళ్ల పర్యంతమయ్యాడు.


రాంబాబు మిత్రుడిని సమీపించి... ప్రేమగా నుదుటి మీద ముద్దుపెట్టుకున్నాడు. 


అతని చచ్చుబడిపోయిన చేతిని... తన చేతిలోకి తీసుకుని మార్దవంగా......


" జోగీ! నిజం చెప్పు! ఆరోజు... నువ్వుఆ పక్కింటాళ్ల జాంకాయలు కోద్దామని ..చీకట్లో వంగి, మేడమీంచి పడిపోయావ్ కదూ! 

మీ వాళ్లంతా నువ్వు ఫోన్ మాట్లాడుతూ కళ్లుతిరగడం వలన కిందపడి, అక్కడున్న రోటిమీద పడడం వలన అయ్యిందనుకుంటున్నారు ...పిచ్చాళ్లు. 


ఒరే! నాకు తెలీదురా నువ్వెంత దొంగజాంకాయవో! 


నీ విస్తరిలో పంచభక్ష పరవాన్నాలున్నా, పక్కోడి విస్తరిలోంచి ఆవకాయ బద్ద దొబ్బుకుతింటే కానీ... నీకు పూటగడవదు కదా! 


సరే! అదంతా వదిలేయ్! నీకు ఆ పక్కింటి జాంకాయలు... కోసిస్తా. 

మరి నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తావా? 

ఇలా అడగడం మానవత్వం కాదని తెలుసురా జోగీ! 

కానీ అవన్నీ నీకు పట్టవు కదా! పరవాలేదు! "


కానీ జోగారావుకి ఇవేవీ పట్టట్లేదు. 

స్నేహితుడికి ...తన ఆఖరికోరిక తెలిసిపోయిందన్న సంగతి తెలియగానే... మొహంలోకి విపరీతంగా వెలుగొచ్చేసింది. 


ముద్దముద్దగా " పెడతా! పెడతా!" అని గొణిగాడు. 


ఆ తరువాత రాంబాబు ఒక్క క్షణం ఆలస్యం చెయ్యలేదు.


అప్పటికే వచ్చివున్న లాయర్, మెజిస్ట్రేట్, జోగారావు కొడుకులూ, భార్యా సమక్షంలో తన అన్ని వ్యాపారలమీద... రాంబాబుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ ...ఒప్పందాలు అయిపోయాయి. 


డాక్టర్, అతని సిబ్బంది జోగారావుని వీల్ చెయిర్ లో కుదేసారు. 

ఆక్సిజన్ మాస్క్ తోనే పక్కనున్న బాల్కనీలోకి తోసుకెళ్లారంతా! 

అప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన... ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆ ప్రాంతమంతా వేడిగా, వెలుగుగా ఉంది. 


జోగారావుని... పేరాపెట్ వాల్ దగ్గరగా తెచ్చారు. 


రాంబాబు మెల్లగా తాడు సాయంతో పళ్లతో నిండిన కొమ్మలు పైకిలాగాడు, పేరాపెట్ మీద నిలబడ్డ నౌకర్.. పైకి ఎత్తితోస్తుంటే!!


జోగారావు ఒళ్లోకి గుత్తుల గుత్తుల జాంపళ్లు వచ్చాయి. వామాక్షి.... ఏడుస్తూ ఒక జాంపండు కాకెంగలి చేసి ...జోగారావు నోటికందించింది. 


అదే ఆఖరికి ...అతని పాలిట తులసితీర్ధమయింది. 


పదకొండోరోజు పిండప్రధానానికి.... అన్నం ముద్దలు పేరాపెట్ వాల్ మీదే పెట్టారు. అక్కడే పదిరోజులుగా తిష్టవేస్తున్న కాకి ..ఆరోజు ఆ పిండప్రసాదాన్ని ముట్టలేదు! 


జోగారావు కొడుకులు ఆర్ద్రంగా " నాన్నా! రా నాన్నా! తిను నాన్నా! "....అన్నా తినలేదు. పక్కింటాళ్ల జాంకాయ పెట్టారు . అయినా తినలేదు.


ఈలోపల రాంబాబు ఒక బాక్సులోంచి తన ఇంట్లోంచి తెచ్చిన అన్నం ముద్దలు చేతికిచ్చి... పెట్టమన్నాడు. వెంటనే కాకొచ్చీ చటుక్కున తినేసి... పారిపోయింది. ఎవ్వరికీ అర్ధం కాలేదు... ఒక్క రాంబాబుకు తప్పా.


ఆకాకి మళ్లీ జోగారావు ఇంటిమీద వాలలేదు. ఇప్పుడు రాంబాబు తినే ప్రతీ మొదటిముద్దా... తనింటి మీదే కాపరం పెట్టిన కాకికి ...పెట్టాలిసిందే! 


మరి... కోట్ల ఆస్థికి బాధ్యత కట్టబెట్టిందిగా! తీసుకోడమే తెలిసిన చెయ్యికి, మొదటిసారిగా ఇవ్వాలిసొచ్చింది. కనుక ఇంక కాకి బాధ్యత రాంబాబుదే!


రాంబాబూ మాత్రం విసుక్కోడు! మంచి నెయ్యేసి కలిపిన అన్నం ముద్ద పట్టుకుని , *"ఒరే! దొంగ జాంకాయ్!"* అని పిలవగానే తయారుగా ఉంటుంది కాకి!!

              🌷🌷🌷

 *శశికళ ఓలేటి*

పన్నులు ఏ విధంగా వసూలు చేయాలంటే.

 పన్నులు ఏ విధంగా వసూలు చేయాలంటే.

..............................................................


ఓ రాజా ! తోటమాలి(మాలకారుడు) ఏ విధంగానైతే మొక్కలను నాటి పాదుచేసి నీల్లుపోసి కలుపును ఏరివేసి పెద్దచేసి వాటి పూలను సంరక్షించి సేకరించి మాలలను కట్టి ధనం ఎలా సంపాదిస్తాడో అలానే రాజనేవాడు కూడా ప్రజలను విద్యావంతులను భాగ్యవంతులకు చేసి అపై పన్నులు వసూలు చేయాలి.


అలా కాకుండా


స్వతహాగా పెరిగిన చెట్టును నరికి కాల్చి బొగ్గులుచేసి, అమ్మి ధనం సంపాదించినట్లుగా చేయరాదు. 


 కాబట్టి రాజు ప్రజలు ప్రజలను రక్షించి వారినుండి పన్నులు వసూలు చేయాలి.


పై విషయాన్ని భవభూతి *ఉత్తరరామచరితం* కింది శ్లోకంలో తెలియచేస్తోంది.


*"పుష్పమాత్రం వినుచియాత్,* *మూలఛ్చేదం న కారయేత్*

*మాలాకార ఇవ ఆ న యథాంగారకారక:"*

........... ............ .............


ఇంకా పన్నుల వసూలవిధానం ఎలా వుండాలో కింది *సుభాషితశ్లోకం* తెలియచేస్తోంది.


*"యాథాల్పాల్ప మదంత్యాద్యం వార్యోకో వత్సషట్పాదా:*

*తథాల్పోల్పో గృహితవ్యో రాష్ట్రా ద్రాజ్ఞాఅబ్దిక:కర:"*


అంటే

తేనెటీగలు పుప్వులనుండి తెనెను సేకరించినట్లుగా

దూడ ఆవునండి పాలను త్రాగినట్లుగా 

జలగ నొప్పి తెలియకుండా రక్తాన్ని పీల్చినట్లుగా రాజు కొంచెంకొంచెంగా పన్నులు వసూలు చేయాలి.


అప్పుడేప్పుడో చెప్పింది ఇప్పటిరాజులు పాటిస్తారా ?


॥సేకరణ॥

...............................................................................

జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

అజరా అమర వ త్

 అజరా అమర వ త్ ప్రా జ్న : , వి ధ్యా 0 అర్ధం చ సాధయే త్. గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మ మా చ రేత్. ఈ సాధనతో నీవు నిత్యుడవే, మార్పు లేనివాడవే! ధర్మ స్వరూపుడవే అనే గ్రహింపు కలుగుతుంది. ఇప్పుడు ఎలాగ నేను ఎప్పటికైనా నశించె వాడను అని స్థిరంగా అనిపిస్తోందో, అప్పుడు నేను శా శ్వ తుడనే అనే అవగాహన కలుగుతుంది. ఓం నమః

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..


*స్వప్న సాక్షాత్కారం..*


1998 వ సంవత్సరం..విజయవాడలో ఉంటున్న పద్మావతి గారు కనకదుర్గా దేవి కి భక్తురాలు..తనకు ఏపాటి కష్టం కలిగినా..ఇంద్రకీలాద్రి కి వెళ్లి, ఆ తల్లిని దర్శించుకొని..తన బాధలు విన్నవించుకొని వచ్చేది..ఆ కనకదుర్గమ్మ దయతో పద్మావతి గారి సంసారం చక్కగా సాగిపోతున్నది..భర్త ప్రభుత్వద్యోగి..ఇద్దరు పిల్లలూ హైస్కూలు చదువులో వున్నారు..


కానీ..కొన్నాళ్లుగా ఆవిడకు స్వప్నంలో త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్తాత్రేయుడు కనబడి..అంతలోనే మరో యోగి రూపంలోకి మారిపోయినట్లుగా దర్శనం అవుతున్నది..నవ్వుతూ తనను ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తోంది..ఇలా రెండు మూడు సార్లు స్వప్నం లో అనుభవం అయిన తరువాత..భర్త తో ఈ విషయం చెప్పింది..ఆయన పెద్దగా పట్టించుకోలేదు సరికదా.."నువ్వు ఎక్కువగా పూజలు చేస్తుంటావు కదా..ఆ భ్రమ లోంచి బైటకు రాకపోవడం చేత..ఇలాటి కలలు వస్తున్నాయేమో..సరే..నువ్వు నమ్మిన ఆ అమ్మవారి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చేయి..అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది.." అని చెప్పారు..పద్మావతి గారికి భర్త అలా తేలిగ్గా మాట్లాడటం నచ్చలేదు కానీ..కనకదుర్గా దేవిని దర్శించమని చెప్పిన సలహా మాత్రం మనసులో నాటుకున్నది..


సాయంత్రమే దుర్గగుడికి పద్మావతి గారు వెళ్లారు..అమ్మవారిని దర్శించుకున్న తరువాత..అక్కడే కూర్చున్నారు..ఇంతలో ఆవిడకు కొద్దిదూరంలో నలుగురైదుగురు ఆడవాళ్లు కూర్చుని వున్నారు..వాళ్ళ లో ఒకావిడ లేచి వచ్చి పద్మావతి గారి ప్రక్కనే కూర్చుని..తన చేతిలోని పుస్తకాన్ని తీసుకొని చదువుకోసాగింది..పద్మావతి గారు కేవలం కుతూహలం కొద్దీ..తన ప్రక్కన కూర్చున్నావిడ చదువుతున్న పుస్తకం ఏమిటని ఆవిడను అడిగారు..


"ఇది మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర అనీ..తాము శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి అనుయాయులమనీ..అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చామని..ఈ ఆలయం లో కొద్దిసేపు పారాయణ చేసుకుందామని ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నాననీ.." చెప్పింది..


("మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో మా అనుభవాలు" పేరుతో శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు వ్రాసిన రచన మొట్టమొదట శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో వెలువడుతున్న సాయిబాబా పత్రికలో ముద్రితం అయింది..తరువాత శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలోనే పుస్తక రూపంలో ముద్రించారు..)


పద్మావతి గారు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని..చూసారు..ఆశ్చర్యం!..ఆ పుస్తకం పై తనకు స్వప్నం లో కనిపించి ఆశీర్వదించిన యోగి ఫోటో ముద్రించి ఉన్నది..పద్మావతి గారు ఒక్కక్షణం మాన్ప్రడి పోయి..తేరుకొని.."అమ్మా..ఈ క్షేత్రం ఎక్కడ ఉన్నది?..ఎలా వెళ్ళాలి?..ఈ ఫొటోలో ఉన్న మహానుభావుడి దర్శనం నాకు స్వప్నంలో జరిగింది..మీరు వివరాలు చెప్పగలరా?.." అని గబ గబా అడిగేసారు..


ఆ వచ్చినావిడ..ఓపికగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి..ఆయన చరిత్ర..కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందడం..మొగలిచెర్ల వెళ్ళడానికి మార్గం..వివరంగా తెలిపారు..పద్మావతి గారు ఆవిడకూ..ఆవిడతో పాటు ఉన్న మిగిలిన ఆడవాళ్లకూ ధన్యవాదాలు తెలిపి..పరుగు పరుగున ఇంటికి వచ్చారు..ఆసరికే కార్యాలయం నుంచి వచ్చిన తన భర్త కు ఈ విషయం చెప్పి..మొగలిచెర్ల కు వెళ్లి ఆ అవధూత సమాధిని..ఆ యోగికి ఆశ్రయం కల్పించిన శ్రీధరరావు, ప్రభావతి గార్లను కూడా చూసి వద్దామని పట్టు బట్టారు..ఒక్క రెండురోజులు ఆగిన తరువాత ఆదివారం నాడు వెళదామని ఆయన చెప్పారు..


ఆదివారం నాడు కారు మాట్లాడుకుని..భర్త పిల్లలతో సహా పద్మావతి గారు మొగలిచెర్ల చేరారు..ముందుగా శ్రీధరరావు ప్రభావతి గార్లను కలిశారు..ఆ దంపతుల తో శ్రీ స్వామివారి గురించి వివరాలు తెలుసుకొని..శ్రీ స్వామివారి మందిరానికి చేరి..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..అక్కడ ఉన్న శ్రీ స్వామివారి ఫోటో ను చూసిన పద్మావతి గారికి కళ్లలోంచి ధారగా కన్నీళ్లు కారిపోసాగాయి..తనను ఆ దత్తాత్రేయుడి రూపంలో వచ్చి ఆశీర్వదించినది ఈ మహానుభావుడే అని భర్తతో పదే పదే చెప్పుకున్నారు..శ్రీ స్వామివారి సమాధికి సాగిలబడి నమస్కారం చేసుకున్నారు..శ్రీ స్వామివారికి నైవేద్యంగా ఇతర భక్తులు సమర్పించిన పొంగలిని, పద్మావతి గారు ప్రసాదంగా స్వీకరించి, భర్తకూ పెట్టారు..ఇటువంటి దత్త క్షేత్రం లో అన్నదానం చేస్తే విశేష ఫలితముంటుందని భర్త గారికి చెప్పి, ఒప్పించి..ఆ ప్రక్క ఆదివారం అన్నదానం చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును విరాళంగా ఇచ్చారు..


ఆరోజునుంచీ..పద్మావతి గారి కుటుంబం మొత్తం శ్రీ స్వామివారికి భక్తులుగా మారిపోయారు అంటే ఆశ్చర్య పోనక్ఖరలేదు కదా...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699)