28, జనవరి 2026, బుధవారం

గురు పాదుకలు

    *శ్లోకము 5:*

*నృపాళి మౌళి వ్రజ రత్న కాంతి*

సరిద్విరాజత్ ఝష కన్యకాభ్యామ్

*నృపత్వదాభ్యామ్ నత లోక పంక్తే*

నమో నమః శ్రీ గురు పాదుకాభ్యామ్

    *భావము :*

        అనేకమంది రాజుల కిరీటాలను ఒకచోట చేర్చగా, వాటిలో వున్న రత్నాల వెలుగంతా ఒక నదిగా మారితే, అంతటి వెలుగులో కూడా మెరిసే చేపల వంటివి గురు పాదుకలు. అంటే, ఎంతటి సిరులూ, అధికారమూ వున్నా అవి గురువుగారి చెప్పుల పాటి కూడా చెయ్యవు. అటువంటి గురువు పాదుకలకు నమస్కారం చేసినవారికి, అనేక లోకాల ఆధిపత్యం ప్రసాదించగల శక్తి ఆ పాదుకలకు వుంది. అటువంటి గురుపాదుకలకు నమస్కారము.

    రచన : *జగద్గురు ఆదిశంకరాచార్యులు** 

29జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌷గురువారం🌷*

 *🌹29జనవరి2026🌹*      

   *దృగ్గణిత పంచాంగం* 

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - శుక్ల పక్షం*

*తిథి  : ఏకాదశి* ‌మ 01.55 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం   : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : రోహిణి* ఉ 07.31 *మృగశిర* (30) తె 05.29 వరకు 

*యోగం : ఐంద్ర* రా 08.27 వరకు ఉపరి *వైధృతి*

*కరణం  : భద్ర* మ 01.55 *బవ* రా 12.32 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు*

          *- ఈరోజు లేవు -*

అమృత కాలం  : *రా 09.26 - 10.54*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.43*

*వర్జ్యం    : రా 12.39 - 02.07*

*దుర్ముహూర్తం  : ఉ 10.27 - 11.12 మ 03.00 - 03.46*

*రాహు కాలం   : మ 01.46 - 03.11*

గుళికకాళం      : *ఉ 09.30 - 10.55*

యమగండం    : *ఉ 06.39 - 08.04*

సూర్యరాశి : *మకరం*                        

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 06.49*

సూర్యాస్తమయం :*సా 06.10*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.39 - 08.56*

సంగవ కాలం         :     *08.56 - 11.12*

మధ్యాహ్న కాలం    :    *11.12 - 01.29*

అపరాహ్న కాలం    : *మ 01.29 - 03.46*

*ఆబ్ధికం తిధి        : తిథి ద్వయం ఏకాదశి/ద్వాదశి*

సాయంకాలం      :*సా 03.46 - 06.02*

ప్రదోష కాలం       :*సా 06.02 - 08.34*

రాత్రి కాలం         :*రా 08.34 - 11.55*

నిశీధి కాలం       :*రా 11.55 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58-05.48*

******************************

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*!!.ఓం శ్రీ సద్గరుభ్యో నమః!!*

*త్సర్వశ్రుతిశిరోరత్న*

*విరాజిత పదాంబుజః*

*వేదాంతాంబుజసూర్యోయః* 

*తస్మై శ్రీగురవే నమః*

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*

🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*మాఘ పురాణం - 11వ*

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️

*🌷గురువారం 29 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 11వ* 

      _*అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

      *29వ తేదీ గురువారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

``

మాఘ పురాణం లోని పదకొండవ అధ్యాయం, బలవంతుడైన భీముడి గర్వం మరియు అతని మార్పు గురించి చెబుతుంది. గర్వంతో ఇతరులతో గొప్పలు చెప్పుకునే భీముడు, ముని సలహా మేరకు ఏకాదశి వ్రతం పాటించి, వినయం, సంయమం పెంచుకుంటాడు. వ్రతం అతని గర్వాన్ని తగ్గించి, వినయంతో నింపి, ఇతరులకు సహాయం చేసేలా మార్చేస్తుంది. 

ఈ కథ, గర్వం హానికరమని, వినయం, సంయమం మన జీవితాలను మెరుగుపరుస్తాయని బోధిస్తుంది

*భీముని ఏకాదశి వ్రతము*```

సంవత్సరములో వచ్చు పన్నెండు మాసములలోనూ మాఘ మాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసములో నదిలోగాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకము కూడా అందుబాటులో లేని యెడల నూతివద్దగానీ స్నానము చేసినచో పాపములన్నియు హరించిపోవును. 

పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులు అందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందినవారై యున్నారు.

అతడు చిన్నతనములో గడుసరి, పెంకివాడు, అతడు తల్లితండ్రుల భయ భక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొను చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్దుడయ్యెను, తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునపుడిట్లు ఆలోచించెను. “అయ్యో! నేనెంతటి పాత్ముడనైతిని ధనము, శరీర బలము వున్నదను మనో గర్వముతో జీవితాంతమూ ముక్తినిచ్చే పుణ్యకార్యమొక్కటియు చేయలేక పోయినానుగదా” అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. 

అన్ని రోజులు ఒకే విధముగా నుండవు కదా! ఆ నాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనమూ, బంగారమూ యెత్తుకొని పోయిరి.

అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా, అతని సంపద అంతయూ అపహరింపబడినది అన్యాయముగా ఆర్జించిన ధనము. అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘ మాసము నడచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీస్నాన ఫలముదక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగసి పోవుచూ ‘నారాయణా’ అని ప్రాణములు విడచినాడు. దివ్యమైన యమునా నదిలో స్నానము చేయుట వలన అతడు చేసియున్న పాపములు అన్నియూ నశించిపోయి వైకుంఠ వాసుడయ్యెను, అని వశిష్టుడు తెలియజేసెను.

పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి యేమాత్రమూ ఆగలేనివాడు బండెడు అన్నము అయినా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతో ఉండెను. అదేమందువా “ఏకాదశీ నాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసినచో ఫలము దక్కదుకదా! అని విచారించి, తన పురోహితుని కడకు బోయి, ఓయీ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరుగదా దాని విశిష్టత యేమి”, అని భీముడు అడిగెను.

అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు “అవును భీమసేనా! ఆరోజు అన్ని దినములకంటెను ప్రశస్తమైనది. శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైనది. కనుక, అన్ని జాతులవారును ఏకాదశీ వ్రతము చేయవచ్చును” అని పలికెను. 

సరే నేను అటులనే చేయుదును. గాని, “విప్రోత్తమా! నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్విదితమే గదా! ఒక ఘడియ ఆలస్యమైననూ నేను ఆకలికి తాళజాలను, కనుక, ఏకాదశినాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి యెక్కువగా నుండును. కావున ఆకలి దాహము తీరులాగున, ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహానీయుము”, అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు, కాన, నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ద ఏకాదశి మహా శ్రేష్ఠమైనది, దానిని మించిన పర్వదినము మరి ఒక్కటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశీ సమాన మగునది మరి ఏమియులేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశి లలో  మాఘశుద్ద ఏకాదశి మహా పర్వదినము కావున, ఆ దినము ఏకాదశీ వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు యేమాత్రమును సంశయములేదు. కాన, ఓ భీమ సేనా! నీవు తప్పక మాఘశుద్ద ఏకాదశి వ్రతము నాచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము, దీక్షతోనున్న యెడల ఆకలి యేమాత్రమునూ కలుగదు, నియమము తప్పకూడదు” అని వివరించెను.  

ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టతో వ్రతము చేసి ఉపవాససం ఉండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని “భీమ ఏకాదశి” అని పిలుతురు. అంతియే గాక, ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాస మందే వచ్చును. కాన మహా శివరాత్రి మహత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువువై ఆలకింపుము అని వశిష్టులవారు దిలీప మహారాజుతో నిటులపలికిరి..

ఏకాదశి మహా విష్ణువునకు యెటుల ప్రీతికరమైన దినమో, అదే విధముగా మాఘ చతుర్దశి అనగా, శివచతుర్దశి. దీనినే “శివరాత్రీ” యని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చెడి చతుర్దశి దీనినే “మహాశివరాత్రి” అని అందరూ పిలిచెదరు. 

ఇది మాఘ మాసములో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. 

ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణపక్షములో వచ్చు మహా శివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. 

ఆ రోజు నదిలోగాని, తటాకమందుగాని లేక నూతి వద్దగాని స్నానము చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్ఠోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలయును. అటుల పూజించి, అమావాస్య స్నానము కూడా చేసినయెడల యెంతటి పాపములు కలిగియున్ననూ, అవన్నియు వెంటనే హరించిపోయి, కైలాస ప్రాప్తి కలుగును. 

శివపూజా విధానములో శివరాత్రి కంటె మించినది మరియొకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కావున  శివరాత్రి దినమున ప్రతిఒక్కరూ అనగా జాతి భేదముతో నిమిత్తము లేక, అందరూ శివరాత్రి వ్రతమును ఆచరించి  జాగరణ చేయవలయును.

మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి, తాను తిని, తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదియూ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయ వానిని చూచి భయపడి పారిపోయేడివి, అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతి దినము వలె ఒక నాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమియూ కంట పడలేదు. సాయంకాలం అగుచున్నది. వట్టి చేతులతో యింటికి వెళ్ళుటకు మనస్సంగీకరించనందున ప్రొద్దు కృంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు యెదురు చూచుచుండెను.

తెల్లవారుతున్నకొలదీ చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న యెండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండితినక రాత్రంతా జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండిలేక ఉపవాసముండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశు వృద్ధ భేదములుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే, మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసికొనిపోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు – పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర, నారదాది గణములతో కొలువుతీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి, ఉచిత ఆసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణం ఏమని ప్రశ్నించెను. అంతట యముడు, “మహేశా! చాలా దినములకు మీ దర్శనభాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను.

మీ దర్శన కారణమేమనగా, ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి వున్నాడు. ఒక దినమున అనగా మహా శివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండితినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి యంతయు మెలకువగానున్నాడేగాని, చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా అంతమాత్రమున అతనికి కైవల్యము దొరకునా” అని యముడు విన్నవించుకున్నాడు. 

“యమధర్మరాజా! నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమునందు  బిల్వపత్రములు నాపై వేసి తిండి తినక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప ముక్తుడు కాగలడు.ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసినవే గనుక, ఈ బోయవాడు పాపాత్ముడైనను, ఆనాటి శివరాత్రి మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమైనది” అని పరమేశ్వరుదు వివరించెను.```

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```

*మాఘపురాణం పదకొండవ* *అధ్యాయము సంపూర్ణము*

         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 28 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                   1️⃣1️⃣8️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``

        *సంపూర్ణ మహాభారతము*        

                    *118 వ రోజు*                   

*వన పర్వము పంచమాశ్వాసము*

*మాతాపితలను సేవించడం*```

ధర్మవ్యాధుడు “మహర్షీ! నేను సర్వజ్ఞుడిని కావడానికి మూలమైన ధర్మం నీకు తెలుపుతాను” అన్నాడు. అతనిని గృహాంతర్భాగానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ సుఖాశీనులై ఉన్న తల్లి తండ్రులకు నమస్కరించి కుశలం అడిగాడు. వారు “కుమారా! నీవంటి కొడుకు ఉండగా మాక్షేమమునకు లోటు ఏమి? నీ ధర్మం నీకు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి. నీ వలన మన వంశం పవిత్రమైనది. నీవు మనుష్య జన్మ ఎత్తిన దేవతామూర్తివి. త్రికరణ శుద్ధిగా తల్లితండ్రులను సేవించే నీవు పరశురాముని కన్నా గొప్పవాడివి" అన్నారు. 

అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని తల్లి తండ్రులకు పరిచయం చేయగా వారు కౌశికుని కుశలం అడిగారు. ధర్మవ్యాధుడు కౌశికునితో “వీరు నా జననీ జనకులు. వీరిని సేవించి నేను ఇంత జ్ఞానం సంపాదించాను. నేను ఇతర దేవుళ్ళను ఎరుగను, తల్లితండ్రులే నా దైవాలు. నేను వీరికి పండ్లు, ఆహారం, వస్త్రములు ఇచ్చి వీరిని సేవిస్తుంటాను. నా భార్యా బిడ్డలు వీరికి సేవ చేస్తుంటారు. యజ్ఞాలు, క్రతువులూ, వేదాలూ అన్నీ వీరే అని భావిస్తాను. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ అయిదిటిని ఎవరు పూజిస్తారో వారే మహాత్ములు. అయ్యా! పతివ్రత పంపగా ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. ఆమె అనుగ్రహంతో నేను నీకు చెప్పగలిగాను. నీ వంటే నాకు అప్రియంగా ఉంది. అందుకు కారణం నీవు నీ తల్లి తండ్రుల అనుమతి లేకుండా వేదాధ్యయనానికి వెళ్ళి వారిని వ్యాకులతకు గురి చేసావు. వారి పట్ల కృూరంగా ప్రవర్తించావు. నీవు వేదజ్ఞానం సంపాదించినా నీ తల్లి తండ్రులను బాధించినందుకు నాకు నీ ఎడల అప్రియం కలిగినది. నీ తల్లితండ్రులు నీ కొరకు రోదించి గుడ్డి వాళ్ళు అయ్యారు. ఆ సంగతి నీకు తెలుసా? ఇకనైనా వారి వద్దకు వెళ్ళి వారి శోకమును చల్లార్చు. నీ జ్ఞానం పుణ్యం తల్లి తండ్రులను బాధించడం వలన నిష్ఫలం ఔతాయి. నేను చెప్పినది విని వారిని సేవించి తరించు” అని ధర్మవ్యాధుడు చెప్పాడు. 

కౌశికుడు “మహాత్మా! నీవు చెప్పినట్లే వెళ్ళి నా తల్లితండ్రులను సేవించుకుంటాను. నేను చేసిన పాపం నుండి నీ బోధనలతో విముక్తుడని అయ్యాను. నా భాగ్యవశమున నీ పరిచయ భాగ్యం కలిగినది. నా మనసు ఆహ్లాదం అయింది. నీవు నాకు దైవ సమానుడవు. నీ వలె ధర్మమార్గాన సంచేరించే వాడు అరుదు. వేలకొలది మానవులలో ఏ ఒక్కరో నీ వంటి వాడు ఉంటాడు. నేను నిన్ను శూద్రునిగా తలచడంలేదు. భూత, భవిష్యత్తు, వర్తమానాలను ఎరిగిన నీవు ఏల ఈ శూద్ర జన్మను ఎత్తావో చెప్పు” అన్నాడు.```

*ధర్మవ్యాధుని పూర్వ జన్మ వృత్తాంతం*```

“అయ్యా మీరడిగినది చెప్పడం నాధర్మం. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను. వేదవేదాంగాలు చదువుకున్నాను. నాకు ఒక రాజకుమారునితో మైత్రి కలిగిన కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను. ఒకరోజు నేను రాజకుమారునితో వేటకు వెళ్ళి అనేక మృగములను చంపాను. నే విడిచిన ఒక బాణం పొదల మాటున గడ్డిచాటున ఉన్న మునీశ్వరునికి తగిలింది. నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నేలమీద దొర్లుతున్న ఆయనతో అనునయ వాక్యాలు పలికాను. ఆయన బ్రాహ్మణుడుగా పుట్టి శూద్రునిలా మృగములను చంపావు కనుక మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు” అని శపించాడు. 

ఎరుగక తప్పు చేసిన నన్ను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆయనను వేడుకున్నాను. ఆ ముని కరుణించి “నా శాపానికి తిరుగు లేదు వ్యాధుడిగా జన్మించినా నీకు ధర్మసూక్ష్మములు తెలియగలవు. నీవు తల్లితండ్రులను సేవించినంత కాలం పూర్వ జన్మ స్ఫురణ ఉంటుంది. సత్కర్మాచరణము వలన నీవు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలవు” అని పలికాడు. 

నేను ఆ ముని శరీరం నుండి బాణం బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేర్చి గాయానికి మందు వేసి బ్రతికించాను. కానీ నాకు ఈ వ్యాధుని జన్మ తప్పలేదు” అన్నాడు.```

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

సుభాషితమ్

  శివస్తుతి🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

 పద్యం : *దర్పణంబు లేక తన మోము గానరాదు* 

              *దాననైన వెన్ను గాన రాదు* 

              *కన్ను లొప్ప నెంత గన నోపు జెప్పుడా* 

              *యెరుక చూరకాంచు నెల్ల యవియు* 

అర్థము: *కేవలము కన్నులు సర్వాన్నీ చూడ లేవు. మన ఆలోచనతో కొంత తెలుసుకోవాలి. కళ్ళు చూసినదే సత్యమనుకో రాదనీ మన వెన్ను మనకు కనపడనట్లే కొన్ని సత్యాలు తరచి చూస్తే గాని కనపడవు అని కవి భావము.*

✍️💐🌹🌸🙏

శివస్తుతి

  *మాఘమాస శివస్తుతి

         28/1/26 (15)

 కం . 

 పరమేశ్వరు పరమాత్మగ

 శరణనిభక్తాళి శివుని సన్నుతి జేయన్

వరమాత్మపాప హరణా

 ధరపైపూజించమిమ్ము దరిశన మిడుమా|| (15)

కం. 

రజతాచలవాసశివా

గజచర్మపు వస్త్రధారి గంగాధరు డా

ప్రజలకు సద్గతినిడుమా

భజియించెడు భక్తుకెపుడు భా గ్యం బిడుమా|| (16)

డా|| శేషం వేణుగోపాల శర్మ 

       స్కూల్ అసిస్టెంట్ తెలుగు 

              కరీణ్ణగరమ్

భాగవతం

 *భాగవతం వింటే బాగవుతాం*

శ్రీ పోతన భాగవత మధురిమలు.

(6-121-క)

డెందంబు పుత్రు వలనం

జెందిన దని తలఁప వలదు శ్రీపతి పే రే

చందమున నైనఁ బలికిన

నందకధరుఁ డందుఁ గలఁడు నాథుం డగుచున్

*భావము:-* ఇతడు “నారాయణా!” అని పిలిచినప్పుడు ఇతని మనస్సు కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు అనుకోవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినా శ్రీహరి రక్షకుడై అందులోనే ఉంటాడు.

(అజామిళోపాఖ్యానం)

ఏదో ఒక విధంగా నామ స్మరణ చేస్తూ ఉండాలి.

ఫోన్ చేసినప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు 'హలో' చెప్పడానికి బదులు *'జై శ్రీ రామ్'* అలవాటు చేసుకోవాలి. ...... *జై శ్రీ రామ్* 

శ్రీ శంకరాచార్య కృత *శ్రీ గణేశ పంచరత్న* కీర్తనతో శుభోదయం.

*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

బుధవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

28-01-2026 బుధవారం రాశి ఫలితాలు

మేషం

సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

---------------------------------------

వృషభం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

మిధునం

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

---------------------------------------

కర్కాటకం

చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

సింహం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు చేస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు. 

---------------------------------------

కన్య

కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

తుల

కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

ధనస్సు

సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు. 

---------------------------------------

మకరం

వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. 

---------------------------------------

కుంభం

ఇంట బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మీనం

వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

---------------------------------------

కాళహస్తి శతకము 66 వ పద్యానికి సరళానుసరణ

శ్రీశైలమునకేగి సేవలన్ గావించ

         శంకరా ! నా కంత శక్తిలేదు

కాంచీపురికి నేగి కనుల నేకామ్రేశు

         దర్శించి సేవించ తనువు వినదు

కాశికావిశ్వేశు కనులార గాంచంగ

         కాంక్ష యున్నది కాని కదల లేను

శ్రీమహాకాళేశు చేరిసేవించగా

         స్థిరభక్తి యుండినన్ చేవ లేదు

నాదు నణుమాత్ర శక్తిని నయముగాను

కాంచనాద్రిగా నీవు భావించి మదిని

వేగ రక్షించునన్ను నీ వీక్షణముల 

ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ !                   

ధూర్జటి కాళహస్తి శతకము 66 వ పద్యానికి సరళానుసరణ 👆

✍️గోపాలుని మధుసూదన రావు 🙏

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 28 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                   1️⃣1️⃣8️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``

        *సంపూర్ణ మహాభారతము*        

                    *118 వ రోజు*                   

*వన పర్వము పంచమాశ్వాసము*

*మాతాపితలను సేవించడం*```

ధర్మవ్యాధుడు “మహర్షీ! నేను సర్వజ్ఞుడిని కావడానికి మూలమైన ధర్మం నీకు తెలుపుతాను” అన్నాడు. అతనిని గృహాంతర్భాగానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ సుఖాశీనులై ఉన్న తల్లి తండ్రులకు నమస్కరించి కుశలం అడిగాడు. వారు “కుమారా! నీవంటి కొడుకు ఉండగా మాక్షేమమునకు లోటు ఏమి? నీ ధర్మం నీకు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి. నీ వలన మన వంశం పవిత్రమైనది. నీవు మనుష్య జన్మ ఎత్తిన దేవతామూర్తివి. త్రికరణ శుద్ధిగా తల్లితండ్రులను సేవించే నీవు పరశురాముని కన్నా గొప్పవాడివి" అన్నారు. 

అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని తల్లి తండ్రులకు పరిచయం చేయగా వారు కౌశికుని కుశలం అడిగారు. ధర్మవ్యాధుడు కౌశికునితో “వీరు నా జననీ జనకులు. వీరిని సేవించి నేను ఇంత జ్ఞానం సంపాదించాను. నేను ఇతర దేవుళ్ళను ఎరుగను, తల్లితండ్రులే నా దైవాలు. నేను వీరికి పండ్లు, ఆహారం, వస్త్రములు ఇచ్చి వీరిని సేవిస్తుంటాను. నా భార్యా బిడ్డలు వీరికి సేవ చేస్తుంటారు. యజ్ఞాలు, క్రతువులూ, వేదాలూ అన్నీ వీరే అని భావిస్తాను. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ అయిదిటిని ఎవరు పూజిస్తారో వారే మహాత్ములు. అయ్యా! పతివ్రత పంపగా ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. ఆమె అనుగ్రహంతో నేను నీకు చెప్పగలిగాను. నీ వంటే నాకు అప్రియంగా ఉంది. అందుకు కారణం నీవు నీ తల్లి తండ్రుల అనుమతి లేకుండా వేదాధ్యయనానికి వెళ్ళి వారిని వ్యాకులతకు గురి చేసావు. వారి పట్ల కృూరంగా ప్రవర్తించావు. నీవు వేదజ్ఞానం సంపాదించినా నీ తల్లి తండ్రులను బాధించినందుకు నాకు నీ ఎడల అప్రియం కలిగినది. నీ తల్లితండ్రులు నీ కొరకు రోదించి గుడ్డి వాళ్ళు అయ్యారు. ఆ సంగతి నీకు తెలుసా? ఇకనైనా వారి వద్దకు వెళ్ళి వారి శోకమును చల్లార్చు. నీ జ్ఞానం పుణ్యం తల్లి తండ్రులను బాధించడం వలన నిష్ఫలం ఔతాయి. నేను చెప్పినది విని వారిని సేవించి తరించు” అని ధర్మవ్యాధుడు చెప్పాడు. 

కౌశికుడు “మహాత్మా! నీవు చెప్పినట్లే వెళ్ళి నా తల్లితండ్రులను సేవించుకుంటాను. నేను చేసిన పాపం నుండి నీ బోధనలతో విముక్తుడని అయ్యాను. నా భాగ్యవశమున నీ పరిచయ భాగ్యం కలిగినది. నా మనసు ఆహ్లాదం అయింది. నీవు నాకు దైవ సమానుడవు. నీ వలె ధర్మమార్గాన సంచేరించే వాడు అరుదు. వేలకొలది మానవులలో ఏ ఒక్కరో నీ వంటి వాడు ఉంటాడు. నేను నిన్ను శూద్రునిగా తలచడంలేదు. భూత, భవిష్యత్తు, వర్తమానాలను ఎరిగిన నీవు ఏల ఈ శూద్ర జన్మను ఎత్తావో చెప్పు” అన్నాడు.```

*ధర్మవ్యాధుని పూర్వ జన్మ వృత్తాంతం*```

“అయ్యా మీరడిగినది చెప్పడం నాధర్మం. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను. వేదవేదాంగాలు చదువుకున్నాను. నాకు ఒక రాజకుమారునితో మైత్రి కలిగిన కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను. ఒకరోజు నేను రాజకుమారునితో వేటకు వెళ్ళి అనేక మృగములను చంపాను. నే విడిచిన ఒక బాణం పొదల మాటున గడ్డిచాటున ఉన్న మునీశ్వరునికి తగిలింది. నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నేలమీద దొర్లుతున్న ఆయనతో అనునయ వాక్యాలు పలికాను. ఆయన బ్రాహ్మణుడుగా పుట్టి శూద్రునిలా మృగములను చంపావు కనుక మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు” అని శపించాడు. 

ఎరుగక తప్పు చేసిన నన్ను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆయనను వేడుకున్నాను. ఆ ముని కరుణించి “నా శాపానికి తిరుగు లేదు వ్యాధుడిగా జన్మించినా నీకు ధర్మసూక్ష్మములు తెలియగలవు. నీవు తల్లితండ్రులను సేవించినంత కాలం పూర్వ జన్మ స్ఫురణ ఉంటుంది. సత్కర్మాచరణము వలన నీవు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలవు” అని పలికాడు. 

నేను ఆ ముని శరీరం నుండి బాణం బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేర్చి గాయానికి మందు వేసి బ్రతికించాను. కానీ నాకు ఈ వ్యాధుని జన్మ తప్పలేదు” అన్నాడు.```

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పతనానికి మూలకారణము

----------------------------

సృష్టిలో సర్వసాధారణంగా తాను ఎంతటి గొప్ప వ్యక్తి అయనా , ఏదో ఒకటి 

కోరుకుంటూనే యుంటాడు..... ముందుగా ధనం కోరుతాడు..... అది పుష్కలంగా 

వుంటే అధికారపదవులూ ,ఉద్యోగమూ, వగైరా కోరుకుంటాడు..... దీనినే 

 భావ దారిద్ర్య మంటారు..... ఈశ్వరుని లో అటువంటి గుణం ఎక్కడా వుండదు..... 

కానీ లోక విడంబనం కోసం ఆయన , ఆది భిక్షువుగా కన్పిస్తాడు..... ఆ గుణం  

ఈశ్వరుని పరమ త్యాగ శీలానికి సంకేతంగా చెప్పుకోవచ్చు...... ఇది ఒకవిధంగా 

లోకానికి గొప్ప ఉపదేశం ఇస్తోంది..... " నశించి పోయే భౌతిక పదార్థాలైన 

ధనకనక,వస్తు, వాహనాలకై నీవు ఆశింౘకు..... అవినాశీ, 

నిత్య సత్యుడూ

ఆనంద స్వరూపుడూ అయిన పరమాత్మకు సర్వమూ సమర్పింౘు" 

అన్నదే , ఆ ఉపదేశం..... 

ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహింౘాలి..... మనకు ఏది లభించినా 

 అది అంతా భగవదనుగ్రహ ఫలితమే.... మనం నిజానికి భగవంతుడికి 

ఏమీ ఇవ్వవలసిన పని లేదు..... భగవంతుని కి మనం పత్రమో,పుష్పమో, 

ఫలమో, తోయమో ,సమర్పింౘడమన్నది మనం భగవంతుని యందు ౘూపించే కృతజ్ఞత మాత్రమే...... మనకు ఈ దేహాన్నిచ్చి,సంపదలిచ్చి, పుత్ర పౌత్రాదులనిచ్చి ౘల్లగా కాపాడుౘున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ ఆయనకు మనం కృతజ్ఞత ను వెల్లడింౘ డానికే, నిజానికి ఆయనకు కావలసినదేమీ లేదు.... ఆయన సర్వ సంపూర్ణుడు.... 

అయితే భగవంతునికి ఏమి యివ్వాలి అన్న విషయంలో భగవద్గీత ఇలా 

చెప్పింది. 

               *శ్లో". పత్రం పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి!*

                     *తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః!!"*

*_తాత్పర్యము_*

నిర్మల బుద్ధి తో, నిష్కామ భావంతో పరమ భక్తునిచే సమర్పింపబడిన

పత్రమునుగానీ, పుష్పమునుగానీ, ఫలమునుగానీ, జలమునుగానీ 

నేను ప్రత్యక్షంగా, స్వయంగా ప్రీతితో స్వీకరిస్తాను..... 

పై శ్లోకంలో ని పత్రపుష్పఫలతోయ శబ్దాలలోని అంతరార్థం

1. పత్రం : "పతతీతి పత్రం". పడిపోయేది పత్రం.... మనిషిని పడవేసేది

                   మనస్సు.... కాబట్టి పత్రాన్ని సమర్పింౘాలీ అంటే మనమనస్సును

                  దైవాంకితం చేయాలని దాని అంతరార్థం..... 

2. పుష్పం: "పుష్యతీతి పుష్పం". వికసించేది పుష్పం, మనిషిలో వికసించేది 

                  బుద్ధి__ కాబట్టి మన బుద్ధి ని దేవునిపై లగ్నం చేయాలని దీని 

                  అంతరార్థం... 

3. ఫలం : "విశీర్యతే ప్రహారైరితి ఫలం" __ ప్రహారైః_అనగా దెబ్బలచే__ 

                  విశీర్యతే అనగా పగిలేది ఫలము...... జ్ఞాన బోధము అనే దెబ్బలచే

                  పగిలేది మనస్సులోని అహంకారం..... కాబట్టి ఫలాన్ని అనగా 

                  అహంకారాన్ని మనం దైవానికి సమర్పింౘాలని అంతరార్థం.... 

4. తోయం: "త్రాయతే_పాయతీతి". అనగా రక్షింౘు నది కనుక తోయము... 

                  సోహం భావంతో ఉన్నప్పుడు, ధ్యేయాన్ని గుర్తుంౘుకొని , రక్షించేది

                   చిత్తము..... కాబట్టి తోయము అంటే చిత్తము అని అంతరార్థం.... 

                  అంటే మన చిత్తాన్ని భగవంతునికి సమర్పింౘాలని భావము.... 

మనస్సు మన పతనానికి మూలకారణము..... అందుకే దాన్ని మనం ముందుగా భగవంతునికి సమర్పింౘాలి..... శంకరులు ఈ శ్లోకంలో *"భవతు భవదర్థం మమ మనః"* అనగా ఈశ్వరా ! నా మనస్సు నీ స్వాధీనం అగు గాక " అని కోరు కున్నారు.

శ్రీహరి స్తుతి 91*

 *శ్రీహరి స్తుతి 91*

*కం.అమ్మ యనుగ్రహ మందగ*

*యిమ్మహి లోని జనులెల్ల యీప్సిత మతులై*

*రమ్మని యింటికి పిలుతురు* 

*పొమ్మని చెప్పరెవరైన పుడమిని లేరే*

*మాఘ పురాణం* ➖➖➖✍️ 10 వ అధ్యాయము

  ```

           *మాఘ పురాణం*

               ➖➖➖✍️

           10 వ అధ్యాయము

*ఋక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము:*```

పూర్వము భృగు మహాముని వంశమునందు ఋక్షకయను కన్య జన్మించి, దినదినాభి వృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు, పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి, విరక్తితో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ తీరు సమయము దగ్గర పడినది. ఒక నాడు ఆమె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆమె చాల సంవత్సరములు వైకుంఠము నందే ఉండి తరువాత బ్రహ్మ లోకమునకు పోయెను. ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగిన పవిత్రురాలు అగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవ కార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా జేసి “తిలోత్తమ” అను పేరుతో సత్యలోకమునకు పంపెను.

ఆ కాలములో సుందోపసుందులు అనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు  ప్రత్యక్షమై “ఓయీ ! మీకేమి  కావలయునో కోరుకొనుము” అని అనగా, “స్వామీ మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము” అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చితిని అని చెప్పి అంతర్ధానమయ్యెను.

బ్రహ్మ దేవుని చే వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వము కల వారై దేవతలందరిని హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞ యాగాది క్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి, ప్రజలను నానా భీభత్సములు చేయుచుండిరి. దేవ లోకమునకు దండెత్తి, దేవతలను అందరిననీ తరిమివేసిరి, ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్య లోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్శాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో బెట్టి నానా భీబత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయమాలోచించు” మని ప్రార్థించిరి. 

బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి  “అమ్మాయి ఈ సుందోపసుందులను రాక్షసులకు యితరులెవరి వల్లను మరణము గలుగదని వరము నిచ్చియున్నాను. వారువారి గర్వముతో చాల అల్లకల్లోలము చేయుచున్నారు.

కాన, నీవుపోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగు నటుల ప్రయత్నించుము” అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు వున్న అరణ్యమున ప్రవేశించెను. ఆమె చేత వీణపట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపములో తిరుగుచుండెను. వీణా నాదమును ఆమె మధుర గానమునూ విని ఆ దానవ సోదరులు అటు నిటు తిరుగునట్టు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకులవలె వెంటాడుచుండిరి, నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తమను యెవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతట నా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసురులారా ! మిమ్ములను పెండ్ళియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే! నేను 

మీ ఇద్దరి యెడల సమాన ప్రేమతోనున్నాను. కాని ఇద్దరిని వివాహ మాడుట సాధ్యము కానిది కాని నాకోరిక యొకటి యున్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను స్వంతము కాగలను అని చెప్పెను.

ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసమును  మెలిపెట్టి నేను బలవంతుడని నేను బలవంతునని ఆ ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, పిడిగ్రుద్దుకొనిరి. మల్లయుద్దము చేసిరి, ఇక పట్టుదల వచ్చి గదలు పట్టిరి, మద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనుచుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా గర్జించుచు భయంకరంగా యుద్ధము చేసిరి. గదా యుద్ధము తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలూ తెగి క్రిందపడినవి, ఇద్దరూ చనిపోయిరి.         

తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మకడకు పోయి జరిగినది తెలియపర్చగా బ్రహ్మ సంతోషించి, “తిలోత్తమా ! నీవు మంచికార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమాస వ్రతఫలమే గాన, నీవు దేవలోకమునకు వెళ్ళుము, దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదు” వని పంపెను.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

భోజన పధ్ధతి:*

  281f8;

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇M.A.165.

*మన ఆరోగ్యం…!

*వాగ్బాటాచార్యుల వారు వివరించిన భోజన పధ్ధతి:*

               ➖➖➖✍️

```

ఆయుర్వేద చరిత్రలో వాగ్బాటాచార్యుల వారికి చాలా గొప్పస్థానం ఉన్నది. ఆయన రాసినటువంటి “అష్టాంగహృదయం” అనే గ్రంథం చాలా ప్రాచుర్యం పొందింది. 

వారు తెలియచేసిన భోజనపద్ధతి గురించి మీకు వివరిస్తాను..

మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. 

ఈ మోతాదు జఠరాగ్నిని దీపనం చెందించును. 

తినగలిగినతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను. లఘుపదార్థాలను కడుపునిండా ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. 

అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. 

మోతాదుకు తక్కువుగా భుజించకూడదు. దానివల్ల శరీరం యొక్క బలము, ఓజస్సు, పుష్టి నశించును. సకల వాతవ్యాధులు సంభవించును.

మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత, పిత్తాలను ప్రకోపింపచేయును. 

దీనివలన త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు. 

పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం, కడుపుబ్బరం కలిగించునవి, సరిగ్గా పక్వము కానివి, గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి, అశుచిగా ఉండునవి, దాహాన్ని అధికము చేయునవి, ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి, మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. 

శోకం, కోపం, భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.

భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. 

సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు. 

మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు, 

వాత, పిత్త, కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు, త్రేన్పులు లేనప్పుడు, బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు, జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను.

                  భోజనకాలమున స్నానం చేసి శుచి అయ్యి, ఏకాంతంగా కూర్చుని పితృదేవతలు, బాలురు, అతిధులు వీరిని తృప్తులు కావించి తాను పెంచుతున్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి, ఎవరిని నిందించకుండా, మాట్లాడకుండా తనకు హితమైనది, తనయందు భక్తి కలిగినవారు పెట్టినది అయిన ఆహారంను భుజించవలెను.

ఉదరమును నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగములను ఆహారపదార్థాల చేత, ఒక భాగం ఉదకాది ద్రవపదార్థాల చేత నిండింపవలెను. 

నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచవలెను. 

భోజనం అయిన వెంటనే చదువుట, నడుచుట, పడుకోవడం, ఎండలో ఉండటం, అగ్నికి సమీపాన ఉండటం, వాహనములు ఎక్కుట, ఈదుట, ఎగిరి దాటుట మున్నగునవి చేయకూడదు.       

పైన చెప్పిన నియమాలు ప్రతి ఒక్కరు పాటించినచో మంచి ఆరోగ్యవంతులు అవుతారు.

ఆయుర్వేదం నందు ఒక సామెత ఉంది. “ఏకకాల భోజనే మహాయోగి, ద్వికాల భోజనే మహాభోగి, త్రికాల భోజనే మహా రోగి” అని. 

దీనినిబట్టి చూడవచ్చు ఆయుర్వేదం మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో. 

ప్రతిఒక్కరు నియమిత సమయంలో నియమిత ఆహారాన్ని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

* 634వ రోజు*

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

సుమిత్రుడు

సమస్తదేవతలకు ఆలవాలమైన ఆవు గురించి ఈ సందర్భంలో నీకు ఒక ఇతిహాసము చెప్తాను. త్రిశిఖరము అనే కొండ ఉండేది. ఆ కొండప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంత మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు. వారిలో సుమిత్రుడు ఒకడు. ఒకరోజు అంగీరసుడు అనే బ్రాహ్మణుడు గోశర్కర అనే తీగను సుమిత్రుడికి ఇచ్చాడు. సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులకు తామర తంపరగా సంతానం పెరిగింది. అలా ఆ గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసి పోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల పాలు త్రాగుతుంటే వాటి నుండి వచ్చే నురగను తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతడికి ఫేనుడు చూసి అక్కడే స్నానం చేస్తున్న గోవులు " మీరు ఎవరు ? ఇక్కడ ఏమి చేస్తున్నారు ? మీకీ రూపములు ఎలా వచ్చాయి " అని అడిగాయి. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు " మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము. యజ్ఞములకు, పితృకార్యములకు, అతిథి సత్కారములకు, బ్రాహ్మణులకు ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము. బ్రాహ్మణుల పొలములో పని చేయడానికి మా పిల్లలను పంపుతాము. మేము చేసే మంచి పనుల వలన మాకు గోలోక ప్రాప్తి కలిగింది. కాని మీరు మంచి పని చేసే వారిని చూసి అసూయ చెందుతారు. కనుక మీకు మీ దూడలకు ఈ దుర్గతి పట్టింది " అని పలికాయి. మిగిలిన గోవులు తమ తప్పు తెలుసుకుని తమకు తరుణోపాయము చూపమని కాంతల రూపంలో ఉన్న గోవులను అడిగాయి.

రంతిదేవుని యజ్ఞము

ఆ గోవులు " రంతిదేవుడు ఒక యజ్ఞము చేస్తున్నాడు. మీరు అక్కడకు వెళ్ళండి. ఆయన మిమ్మల్ని ఆయజ్ఞములో బలి ఇస్తాడు. మీకు గోలోకప్రాప్తి కలుగుతుంది " అని పలికాయి. వెంటనే ఆ ఆవులన్ని రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధం అయ్యాయి. కాని అందులో ఒక గోవు సందేహం వెలిబుచ్చింది. " మనం మన యజమాని సుమిత్రుని అడిగి కదా వెళ్ళాలి అని అంది. కొన్ని ఆవులు " సుమిత్రుడు మనము వెళ్ళడానికి సుమిత్రుడు అనుమతి ఇవ్వడు. కనుక మనం అతడిని చంపుదాము అప్పుడు అతడు కూడా గోలోకముకు వస్తాడు " అన్నాయి. కాని కొన్ని ఆవులు సుమిత్రుడిని చంపలేక పోయాయి. కొన్ని కపిలగోవులు మాత్రం " మేము సుమిత్రుడిని చంపుతాము. దానికి బదులుగా మీరు మాకు ఏమి ఇస్తారు " అని అడిగాయి. మిగిలిన ఆవులు కపిలగోవులతో " ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి " అని వరం ఇచ్చాయి. వెంటనే ఆ ఆవులు మారురూపంలో తమ యజమాని సుమిత్రుడి వద్దకు వెళ్ళి " అయ్యా ! ఇప్పటి వరకు మీరు గోపూజ చేసారు. మేము ఎంతో సంతోషించాము. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి " అని అడిగాయి. అందుకు సుమిత్రుడు " నాకు ఇప్పటి వలె ఎప్పటికి ఆవుల అందు భక్తి, శ్రద్ధ ఉండేలా అనుగ్రహించండి " అని కోరుకున్నాడు. ఆ ఆవులు " అలాగే అనుగ్రహిస్తాము మేము గోలోకము వెడుతున్నాము. మీరు కూడా మాతో రండి " అన్నాయి. సుమిత్రుడు " నేను నా గోవులను విడిచి ఎక్కడకు రాను " అన్నాడు.p మారు వేషములో ఉన్న గోవులు అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి కింద పడవేసాయి. సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు. అతడి శరీరం మాత్రం కింద పడింది. ఆత్మమాత్రం గోలోకం పోయింది. అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి అతడికి జరిగినది చెప్పి నీకు మేలే జరిగింది కాని నిన్నిలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం ముఖం నల్లగా మాడి పోతుంది " అని శాపం పెట్టాయి.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మన గుడి : నెం 1371

  🕉 మన గుడి : నెం 1371

⚜  తమిళనాడు : కాంచీపురం 

⚜  శ్రీ అనేక ధంగవదేశ్వర ఆలయం

💠 కాంచీపురం సందర్శించేవారు సాధారణంగా ప్రసిద్ధ కైలాసనాథర్ ఆలయాన్ని సందర్శిస్తారు. 

అయితే, దీనికి చాలా దగ్గరగా శివుని మరొక పురాతన మరియు ముఖ్యమైన నివాసం ఉంది - పవిత్రమైన " అనేకధంగవదేశ్వర" ఆలయం, దీనిని అనేకతంగవదేశ్వరుడు అని కూడా పిలుస్తారు.

💠 అనేకధం  అనే పదం ఏనుగు నుండి ఉద్భవించిందని నమ్ముతారు ఎందుకంటే అది దాని తొండం మరియు నోటితో నీరు తాగుతుంది. 

💠 అనేకం - ఏనుగు ముఖంగా ఉన్న శ్రీ వినాయగర్ ఈ ఆలయంలో ప్రతిష్టించి పూజించారు. 

ఇక్కడ ప్రధాన దేవత శ్రీ అనేకతంగవదేశ్వరుడు, మరియు తల్లి శ్రీ కామాక్షి అమ్మన్.

💠 అనేకతంగవధం అనే పేరుతో సంబంధం ఉన్న రెండు ఆలయాలు ఉన్నాయి - ఒకటి ఉత్తర హిమాలయాలలో మరియు మరొకటి దక్షిణాన, కాంచీపురంలో. 

💠 రెండింటి మధ్య తేడాను గుర్తించడానికి, ఈ ఆలయాన్ని కంచి అనేకతంగవధం అని పిలుస్తారు.

ఈ ఆలయం కాంచీ పురాణంలో ప్రస్తావించబడిన 108 శివాలయాలలో ఒకటి. 

💠 ఇది ప్రారంభ మధ్యయుగ తేవరం శ్లోకాలలో కీర్తించబడిన 276 పాదల్ పెట్ర స్థలాలలో ఒకటి.  

8వ శతాబ్దపు తమిళ శైవ సంప్రదాయానికి చెందిన గొప్ప సాధువు సుందరర్ భగవంతర్ అనేకదంగవదేశ్వరుడిని స్తుతిస్తూ పాడారు. 

దీనిని తొండైనాడులోని 4వ దేవరం పాదల్ పెట్రా శివ స్థలంగా గౌరవిస్తారు.

💠 కాంచీపురం పట్టణం నుండి కైలాసనాథర్ ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న దీనిని ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం హిందూ మత మరియు ధార్మిక బోర్డు నిర్వహిస్తోంది.

💠 ఆలయ కథల ప్రకారం, మరిచి మహర్షి ఒకసారి స్నానం చేస్తున్నప్పుడు పవిత్రమైన చెరువులో తామర ఆకుపై తేలుతున్న ఒక ఆడ శిశువును కనుగొన్నాడు. 

అతను ఆమెను దత్తత తీసుకుని ఆమెకు వల్లబ అని పేరు పెట్టాడు. బాల్యం నుండి వల్లబ శివునికి అంకితభావంతో పూజించేది

💠 ఒక రోజు, ఆమెను కేశి అనే రాక్షసుడు అపహరించాడు. భయపడి, ఆమె రక్షణ కోసం శివుడిని ప్రార్థించింది.

ఆమెను రక్షించమని శివుడు వినాయకుడిని ఆదేశించాడు. 

రాబోయే యుద్ధంలో విజయం కోసం పార్వతి దేవి వినాయకుడిని ఆశీర్వదించాడు.

💠 ఈ పవిత్ర భూమిపై తనను పూజించడం వల్ల వినాయకుడు అజేయుడవుతాడని శివుడు చెప్పాడు.  

ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించి, వినాయకుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు, ఆ తర్వాత శివుడు అనేకధంగవదేశ్వరుడిగా అవతరించాడు. 

దైవిక ఆశీర్వాదాలతో బలపడి, వినాయకుడు కేశి అనే రాక్షసుడిని నాశనం చేసి వల్లభుడిని రక్షించాడు.

💠 ఇక్కడే, వినాయకుడు వల్లభను వివాహం చేసుకున్నాడు, మరియు దైవిక వివాహాన్ని శివుడు మరియు తల్లి పార్వతి ప్రత్యక్షంగా చూసి ఆశీర్వదించారు.

💠 సంపదకు దేవుడు మరియు యక్షుల పాలకుడు కుబేరుడు ఒకప్పుడు అలగపురిని పరిపాలించాడు. 

అతని పెరుగుతున్న శ్రేయస్సు రాక్షసుల గురువు అయిన శుక్రుడిని అసూయపడేలా చేసింది. 

శుక్రుడు అతన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు మరియు ఆశ్రయం కోరుతూ, కుబేరుడు ఈ ఆలయానికి వచ్చి శివుడిని పూజించాడు.

💠 శివుడు, తన భక్తుడిని రక్షించడానికి, శుక్రుడిని మింగి, అతని అహంకారాన్ని అణిచివేసి, కుబేరుడికి శాంతిని పునరుద్ధరించాడు.

💠 అనేకధంగవదేశ్వరర్ ఆలయ సముదాయంలో ఒకే ప్రాకారాలు (బయటి ప్రాంగణం) మరియు ఉత్తరం వైపు ఒక చిన్న రాజ గోపురం ఉన్నాయి. 

మధ్య మందిరం తూర్పు ముఖంగా ఉంది మరియు గ్రానైట్‌తో చేసిన లింగం రూపంలో అనేకధంగవదేశ్వరర్ ప్రతిమను కలిగి ఉంది .

💠 కాంచీపురంలోని ఇతర దేవాలయాల మాదిరిగానే కాంచీపురంలోని కామాక్షి అన్ని శివాలయాలకు సాధారణ పార్వతి మందిరం అని నమ్ముతారు కాబట్టి పార్వతికి ప్రత్యేక మందిరం లేదు. నంది యొక్క గ్రానైట్ చిత్రాలు గర్భగుడికి అక్షసంబంధంగా ఉన్నాయి. 

💠 తమిళనాడులోని ఇతర శివాలయాలలో వలె, అనేకధంగవదేశ్వరర్ గర్భగుడి చుట్టూ ఉన్న మొదటి ఆవరణ లేదా గోడలలో దక్షిణామూర్తి (శివుడు గురువుగా), దుర్గ మరియు చండికేశ్వరర్ చిత్రాలు ఉన్నాయి. పెరియ వినాయకుడికి ప్రత్యేక మందిరం ఉంది. 

💠 ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది, ఉత్తరం వైపున ఒక చిన్న రాజగోపురం ప్రవేశ ద్వారం ఉంది. ప్రధాన రహదారిపై ఒక ప్రవేశ తోరణం కూడా ఉంది. 

గర్భగుడిలో గర్భగుడి, అంతరాల మరియు అర్థమండపం ఉన్నాయి. ముందు భాగంలో ఒక షెడ్ మూక మండపంగా పనిచేస్తుంది. 

💠 ఋషభం మరియు బలిపీఠం ఆలయం ముందు ఉన్నాయి. 

కోష్టం వినాయకుడిలో, దక్షిణామూర్తి, లింగోత్బవర్, బ్రహ్మ మరియు దుర్గ ఉన్నారు.

💠 ఈ ఆలయంలో ఉదయం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు వివిధ సమయాల్లో రెండు రోజువారీ ఆచారాలు మరియు  మూడు వార్షిక పండుగలు ఉంటాయి, వీటిలో నవంబర్ - డిసెంబర్ నెలలో జరిగే తిరుకార్తికై మరియు ఫిబ్రవరి - మార్చి నెలల్లో జరిగే మహాశివరాత్రి అత్యంత ముఖ్యమైనవి. 

రచన

©️ Santosh Kumar

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

 పద్యం : *దర్పణంబు లేక తన మోము గానరాదు* 

              *దాననైన వెన్ను గాన రాదు* 

              *కన్ను లొప్ప నెంత గన నోపు జెప్పుడా* 

              *యెరుక చూరకాంచు నెల్ల యవియు* 

అర్థము: *కేవలము కన్నులు సర్వాన్నీ చూడ లేవు. మన ఆలోచనతో కొంత తెలుసుకోవాలి. కళ్ళు చూసినదే సత్యమనుకో రాదనీ మన వెన్ను మనకు కనపడనట్లే కొన్ని సత్యాలు తరచి చూస్తే గాని కనపడవు అని కవి భావము.*

✍️💐🌹🌸🙏

27 నక్షత్రాలకు సంబంధించిన స్తోత్ర మాలిక

  🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

*ఈరోజుతో అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలకు సంబంధించిన స్తోత్ర మాలిక పూర్తయ్యింది. ఆదరించిన ప్రతి ఒక్కరకు ధన్యవాదములు తెలియజేస్తూ*...

*మీరు మీ నక్షత్రానికి లేదా ఆయా రోజుల నక్షత్రాలకు అనుగుణంగా ఈ స్తోత్రాలను పఠించి సత్ఫలితాలను పొందవచ్చు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ*....

*వాసు ముక్తినూతలపాటి* 🙏 

-- *నక్షత్ర స్తోత్ర మాలిక - 27 వ రోజు* 

*నక్షత్రం* - *రేవతి* 

*అధిపతి*_*బుధుడు* 

*ఆరాధించాల్సిన దైవం_పూషణుడు* / *శ్రీ రంగనాథుడు* (విష్ణువు)

*రేవతి నక్షత్ర జాతకులు, మరియు జీవితంలో పరిపూర్ణత, మానసిక ఆనందం, మోక్షం కోరుకునే వారు పఠించాల్సిన మంగళకరమైన స్తోత్రం*.

🙏 *శ్రీ రంగనాథాష్టకం* 🙏

*ఆనందరూపే నిజబోధరూపే*

*బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే* ।

*శశాంకరూపే రమణీయరూపే*

*శ్రీరంగరూపే రమతాం మనో మే* ॥ 1 ॥

*కావేరితీరే కరుణావిలోలే*

*మందారమూలే ధృతచారుకేలే* ।

*దైత్యాంతకాలేఽఖిలలోకలీలే*

*శ్రీరంగలీలే రమతాం మనో మే* ॥ 2 ॥

*లక్ష్మీనివాసే జగతాం నివాసే*

*హృత్పద్మవాసే రవిబింబవాసే* ।

*కృపానివాసే గుణబృందవాసే*

*శ్రీరంగవాసే రమతాం మనో మే* ॥ 3 ॥

*బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే*

*ముకుందవంద్యే సురనాథవంద్యే* ।

*వ్యాసాదివంద్యే సనకాదివంద్యే*

*శ్రీరంగవంద్యే రమతాం మనో మే* ॥ 4 ॥

*బ్రహ్మాధిరాజే గరుడాధిరాజే*

*వైకుంఠరాజే సురరాజరాజే* ।

*త్రైలోక్యరాజేఽఖిలలోకరాజే*

*శ్రీరంగరాజే రమతాం మనో మే* ॥ 5 ॥

*అమోఘముద్రే పరిపూర్ణనిద్రే*

*శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే* ।

*శ్రితైకభద్రే జగదేకనిద్రే*

*శ్రీరంగభద్రే రమతాం మనో మే* ॥ 6 ॥

*సచిత్రశాయీ భుజగేంద్రశాయీ*

*నందాంకశాయీ కమలాంకశాయీ* ।

*క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ*

*శ్రీరంగశాయీ రమతాం మనో మే* ॥ 7 ॥

*ఇదం హి రంగం త్యజతామిహాంగం*

*పునర్న చాంగం యది చాంగమేతి* ।

*పాణౌ రథాంగం చరణేఽంబు గాంగం*

*యానే విహంగం శయనే భుజంగమ్* ॥ 8 ॥

*రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్* ।

*సర్వాన్కామానవాప్నోతి రంగిసాయుజ్యమాప్నుయాత్* ॥ 9 ॥

*ఇతి శ్రీ రంగనాథాష్టకమ్* ।

 *శుభం!*

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

28-01-2026 బుధవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

28-01-2026 బుధవారం రాశి ఫలితాలు

మేషం

సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

---------------------------------------

వృషభం

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

మిధునం

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

---------------------------------------

కర్కాటకం

చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

సింహం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో చర్చలు చేస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు. 

---------------------------------------

కన్య

కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

తుల

కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

ధనస్సు

సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయట పడతారు. 

---------------------------------------

మకరం

వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు. 

---------------------------------------

కుంభం

ఇంట బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మీనం

వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

---------------------------------------

గార్దభశాసనం

 గార్దభశాసనం

ఈ శాసనం అద్దంకిలోని వినాయకుడి గుడికి దక్షిణంగా, జాతీయ

రహదారికి ఆవలగా ఒకప్పుడు ఉండేది. జాతీయ రహదారి తన ఎత్తును

పెంచుకుంటూ భూమిపొరల్లో ఈ శాసనాన్ని దాచేసింది. రహదారి విస్తరణ

శాసనం యొక్క నోరు నొక్కేసింది. శాసనాన్ని భూమిపొరల్లో దాచేసింది. ఈ శాసనాన్ని

మా తరంతో పాటు ఇప్పటితరంకూడా చూశారు. శాసనం పైభాగంలో సూర్య

చంద్రులు మధ్యలో శివలింగంఅడుగున గాడిద బొమ్మను చిత్రించారు. అనగా పరమేశ్వరుని సాక్షిగా సూర్యచంద్రులుండే

దాకా ఈ శాసన విషయం సత్యమని అర్థం. మరి శాసనంపై గాడిద బొమ్మ

ఎందుకు? ఈ గ్రామంలో (అద్దంకిలో నూటొక్క బావులు, నూటొక్క గుళ్ళు

లేవనే వాడు గాడిదకడుపున పుడతాడనేది శాసన విషయం. మనకిప్పుడు గ్రామంగా

కనపడే అద్దంకి ఒకప్పటి తెలుగువారి రాజధాని. ఇంకొక విషయమేమిటంటే ఈ

శాసనం రెడ్డిరాజుల నాటిది కాదని చెప్పవచ్చును. ఎంచేతనంటే రెడ్డిరాజుల నాటికి

అద్దంకి వారి రాజధాని. గ్రామం మాత్రం కాదు. రాజధాని హెూదా కోల్పోయిన

తర్వాత అద్దంకి ఒక గ్రామంగా మారి ఉండవచ్చును. ఆ సందర్భంలో అద్దంకి

గొప్పదనాన్ని చెప్పడానికి వేసిన శాసనంగా దీన్ని భావించవచ్చును. మరొక విషయం

కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేస్తున్నది. అది ఏమిటంటే అద్దంకి కోట చుట్టు

ఒక్క రెడ్డి గారి పాలెం కూడా లేదు. చుట్టుపక్కల రెడ్డి గార్లుండే పల్లెలు ఉన్నాయి

కాని కోట చుట్టూ లేవు. అద్దంకిలోని ప్రముఖ దేవాలయాల జాబితా ఇలా ఉంది.

అద్దంకి కోటకు వెలుపల వేయిస్థంభాల గుడి, వినాయకుడి గుడి కలదు. ఇవి

హైదరాబాద్, ఒంగోలు పోయే జాతీయరహదారికి ఇరువైపులా కలవు. రహదారికి

పడమటగా వేయిస్థంభాల గుడి, తూర్పుగా వినాయకుడి గుడి. వినాయకుడి

గుడికి ఎదురుగా నిలబడి ఉన్న గార్దభశాసనం ఇలాంటి గుళ్ళు మా ఊళ్ళో

నూరునొక్కటి గలవని చెప్పేది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకికి గొప్ప స్థానం

ఉంది. ఇంతేగాక చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కలదు. ఊరికి ఉత్తరాన ఉన్న

అద్దంకి కొండలో రాక్షస గూళ్ళు కలవు. దీనిని బట్టి అద్దంకి ఒక

జనావాసయోగ్యమైన పురాతన ప్రదేశంగా గమనించవచ్చును. గొప్ప

సైనికస్థావరమని(బోయకొట్టము) అద్దంకి పండరంగని పద్యశాసనం చెబుతుంది.

 పద్యశాసనం తెలుగువాడు తల ఎత్తుకుని తిరిగేలా చేసింది. పూర్తి ఛందస్సుగల

తరువోజ పద్యంతో మన భాష ప్రాచీనతకు నిలువెత్తు సాక్ష్యంగా

నిలిచింది. రెడ్డి రాజుల రాజధానిగా తెలుగువారి శౌర్యపరాక్రమాలను,

తెలుగువెలుగులను దేశం నలుదిశలా చాటింది. అద్దంకి కళలకు కాణాచిగా

విఖ్యాతినొందింది. అర్థాంతరంగా ఆగిపోయిన శేషభారతాన్ని పూరించింది.

ఆలయాలతోరణంగా వెలసిల్లింది.  

 గార్దభశాసన విషయానికి వస్తే నుయ్యి ఇంట్లో వాడకానికి పనికి వచ్చే

జలవనరు. బావి అంటే ఊరి మొత్తానికి పనికి వచ్చే జలవనరు. ఆ ప్రకారం

చూస్తే అద్దంకి గ్రామంలో నూటొక్క బావులున్నాయంటే నూటొక్క పాలేలు

ఉన్నాయని అర్థం. ఆ పాలేలలో పాలెంకు ఒక గుడి చొప్పున నూటొక్క

దేవాలయాలు ఉన్నాయని అవగతమౌతుంది.

అద్దంకి కోటకు చుట్టూ ఈ పాలేలు ఆనుకొని ఉన్నాయి. కోటలోకి

రావాలంటే ఈ పాలేలను దాటుకుంటూ లోనికి ప్రవేశించాలి. అద్దంకి లోని ప్రసిద్ధ

దేవాలయాలు వరుసగా 1)వేయిస్థంభాల గుడి 2)శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి

ఆలయం, పాత అద్దంకి. 3) శ్రీ రామలింగేశ్వరస్వామి వారి ఆలయం 4) పోలేరమ్మ

గుడి 5)శ్రీ కాళికా సమేత కమఠేశ్వర స్వామి వారి ఆలయం 5)శ్రీ మాధవ

స్వామివారి దేవాలయం 6) వినాయకుని గుడి 7) శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం

8)శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం 9)శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయం

10)శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం 11)నాంచారమ్మ గుడి 12 గంగమ్మ

గుడి 13)గాజుల పాలెం శివాలయం. 14) సింగరకొండ లక్ష్మీనరసింహ స్వామివారి

ఆలయం 15)సింగరకొండ ఆంజనేయస్వామి వారి ఆలయం. ఇవి గాక అద్దంకి

చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు ఉండవచ్చును. అద్దంకి కోట చుట్టూ ఉండే

పాలేలు 1)చినగానుగపాలెం, 2) పెద గానుగ పాలెం. 3) పసుమర్తి వారిపాలెం.

 4)గురకాయపాలెం. 5)

బలిజపాలెం, 6) నర్రావారి పాలెం. 7)గుంజివారి పాలెం,

8)గాజుల పాలెం. 9) చాకలిపాలెం 10) పెరికపాలెం. 11)కట్టక్రిందపాలెం

12)కాకానిపాలెం. 13) దామావారిపాలెం. 14) నంబూరివారిపాలెం.

15) మొండితోకపాలెం 16) ముతరాసువారి పాలెం 17) పొలిమి పాలెం

18)నాగులపాలెం 19)బోడెంపూడి వారి పాలెం. 20)నృసింహ పాలెం. 21)బత్తుల

వారి పాలెం. 22) దూదేకుల పాలెం. 23) వడ్డెర పాలెం 24)యాదవపాలెం

25)కడెంపాలెం 26) ముదామువారిపాలెం 27)గుర్రంవారిపాలెం

28)కోటవారిఅగ్రహారం 29)ముజావారి పాలెం 30)కాటిపాపలపాలెం. ఇవి గాక

కోటకు నాలుగైదు మైళ్ళలోపు ఉండే గ్రామాలు 31) నాగులపాలెం 32)

జాళ్ళపాలెం

33)చెర్వుకొమ్ముపాలెం 34) బొమ్మనంపాడు 35) కశ్యపురం 36) కలవకూరు

37)ధర్మవరం 38) సింగరకొండపాలెం 39)గోపాలపురం 40)చక్రాయపాలెం

41)తిమ్మాయపాలెం 42)రామాయపాలెం 43)కొటికలపూడి 44)తిమ్మారెడ్డిపాలెం

45)అనమనమూరు 46) మణికేశ్వరం 47) యర్రబాలెం 48) బొడ్డువానిపాలెం 49)

విప్పర్లవారిపాలెం 50) కొంగపాడు 51)వేలమూరిపాడు 52)

వెంకటాపురం

53)నృసింహపుర అగ్రహారం. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే కోటలోపల

రాజులు, రాజబంధువుల పరివారము ఆహారం, అవసరాల కోసం కోటచుట్టూ

వృత్తులవారీ కుటుంబాలు పాలేలుగా ఏర్పడ్డాయనిపిస్తుంది. అద్దంకి రాజధాని

వైభవం నుండి గ్రామస్థాయికి వచ్చేసరికి అద్దంకి గ్రామ పరిథిలోని కొన్ని పాలేలు

కాలక్రమేణా రక్షణ కోసం, రాజాశ్రయాల కోసం, బ్రతుకుతెరువు కోసం వెళ్ళి

ఉండవచ్చును. ఎవరు వేయించారో ఈ శిలాశాసనం తెలియదు కాని అద్దంకికి

సంబంధించిన చాలా ముచ్చట్లు తెలుసుకునే అవకాశం కలిగింది. మా అద్దంకిలో

అనేక దేవాలయాలు, అనేక పాలేలు ఉన్నాయన్న సంగతి చెప్పిన ఈ శాసనం

భూమి పొరల్లో దాగున్నది. ఎప్పటికి బయటకు వస్తుందో మనం వేచి చూద్దాం.

-పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి

సెల్ నెం:8179636617

కోపం, అహంకారం* జీవితంలో,

 శుభ సౌమ్య వాసరే 🌹Happy Wednesday. 

*కోపం, అహంకారం* జీవితంలో,

మనము వాడే క్రెడిట్ కార్డ్ లాంటివి.

క్రెడిట్ కార్డు ముందు ఉపయోగిస్తూ,

*ఆనంద* పడతాము. తర్వాత 

ఉపయోగించిన దాని కంటే కూడా,

ఎక్కువ *మూల్యం* చెల్లిస్తాము.

అలాగే మనకు ఉన్న కోపము వల్ల,

*మనశ్సాంతినీ* కోల్పోతాము.

మన *ఆహంకారము* వల్ల,

మన వాళ్ళను కోల్పోతాము.

వీటివల్ల *నష్టమే* తప్ప,

*లాభము* ఏమి ఉండదు.

ఏమి మిగలకుండా పోతుంది.

టాన్సిల్స్ హరించుటకు

 టాన్సిల్స్ హరించుటకు నేను ప్రయోగించిన సులభ యోగం  - 

ఒక వ్యక్తికి గొంతులో టాన్సిల్స్ బాగా ఉబ్బి ఆహారం తీసుకోవడం బాగా కష్టం అయ్యింది . ఆపరేషన్ చేయాలి అని చెప్పారు.

            ఉల్లిగడ్డ బాగా దంచి రసం తీసి రెండు పూటలా బాగా వాచి ఉన్న గొంతు మీద టాన్సిల్స్ ఉన్న ప్రదేశంలో రెండుపూటలా రాయించాను . ఇలా 5  రోజుల్లో టాన్సిల్స్ సమస్య నుంచి బయట పడ్డారు .

  మామిడాకులు రసం కూడా టాన్సిల్స్ సమస్య తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

*  టాన్సిల్స్ ఇబ్బంది ఉన్నప్పుడు తాంబూలం లో వాడే కాచు చూర్ణం చేసి పూటకు పావు స్పూన్ చూర్ణం కొంచం తేనెతో కలిపి లోపలికి తీసుకోవాలి లేదా అరకప్పు నీటిలో కలిపి తాగాలి ఇలా రోజు చేయుచున్న టాన్సిల్స్ వాపు క్రమక్రంగా తగ్గును.

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

గమనిక  -

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

.      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

.         కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం - దశమి - కృత్తిక -‌‌ సౌమ్యవాసరే* (28.01.2026)

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శ్రీమదాంధ్ర మహాభారతము

 శ్రీమదాంధ్ర మహాభారతము 

నన్నయభట్టుతో నయముగా మొదలయ్యు 

               నాంధ్ర భారతకావ్య మవని సాగె 

యిరు పర్వ భాగమే పరిపూర్ణ మయ్యును 

                నంతలో యా కావ్య మాగిపోయె 

సాగగ నిన్నూఱు సంవత్సరములకు 

                పుణ్యుడౌ తిక్కన పుడమి పుట్టి 

పర్వంబు నాల్గుతో ప్రారంభ మొనరించి 

                 పరిపూర్తి గావించె పదియునైదు 

పిదపను నూఱేండ్లు సదమల కావ్యమ్ము          

                నుండెను కొరతతో నుర్వి పైన 

నన్నయ్య వీడిన నవకంపు భాగమ్ము 

                 పూరించె నెఱ్ఱన పూర్తిగాను 

భవ్యమైనట్టి శ్రీయాంధ్ర భారతంబు 

గడచి మున్నూఱు వత్సర కాల మరయ 

కవులు ముగ్గురు రచియింప ఘనత కెక్కి 

తెలుగు జాతికి లభియించె దివ్యముగను 

✍️గోపాలుని మధుసూదనరావు 🙏