ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, జులై 2026, సోమవారం
ఆ రోజుల్లో – ఈ రోజుల్లో
Ramesh
ఆ రోజుల్లో – ఈ రోజుల్లో
ఎటు పోతుంది ఎటు పోతుంది ఈ ప్రపంచం
డిజిటల్ యుగం లోనే ఈ పయనం
మునుగుతామా తేలుతామా చెప్పలేము ఈ సమయం
ఎందుకంటే ఇది జెన్ జీ యుగం
మా రోజుల్లో లేవు ఇంత డిజిటల్ టెక్నోలజీ
చెప్పాలేమో మేము అందరికీ అపోలజీ
సైకిల్ మీదే మా ప్రయాణం ఉండేది ఆరోగ్యం
ఇప్పుడు ఆరోగ్యం కోసం జిమ్మే శరణ్యం
మానవ బంధాలే ఉమ్మడి కుటుంబానికి మూలం
డిజిటల్ తో బంధాలే ఈనాటి కుటుంబాలకి శాపం
వెలవెలని చెమట చుక్కల సాగు, మట్టి వాసన తెలిసిన మంచితనం మా తరం
స్పీడుగా మారిన టెక్నాలజీ యుగం, ప్రపంచాన్ని ఏలే డిజిటల్ జ్ఞానం ఇదీ ఈ తరం
నిండు కుటుంబం, నలుగురితో సావాసం, నిజాయితీకి కట్టుబడిన మనిషి జీవనం మా తరం
ఎత్తయిన ఆశలు, వేగమైన ఆలోచనలు, మార్పును కోరుకునే ప్రతి అడుగు ఇదీ ఈ తరం
స్వంత ఇల్లు, వెనక చిన్న తోట, మిద్దె పైన నిద్ర, అప్పుడప్పుడు సినిమా ఇది మా తరం
హై రైజ్ అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటి, ఈవెనింగ్ పబ్, వీకెండ్ ఛిల్ ఇదే ఈ తరం.
మా తరానిది నిన్నటి నేర్పిన అనుభవాల పాఠం,
ఈ తరానిది రేపటిని గెలిచే ఆత్మవిశ్వాసం.
పాత తరపు ఓర్పు-కొత్త తరపు చూపు కలిస్తే,
సరికొత్త సమాజానికి అందమైన రూపం!
తరాలు మారినా, కాలం గడిచినా...
వేర్లు పాతవే అయినా, చిగురులు కొత్తవే!
పాత తరపు జ్ఞాపకాలు, కొత్త తరపు కలలు కలిస్తేనే,
జీవితం పరిమళిస్తుంది అమృతంలా!
ఈ కవిత నా అనుభవం, నా ప్రయాణం, నా అభిప్రాయం
మారతానో లేదా మర్వలేక పోతానో తేలుస్తుంది ముందర కాలం.
Loaded more posts.
పంచాంగం 13.07.2026 Monday,
ఈ రోజు పంచాంగం 13.07.2026 Monday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస క్రిష్ణ పక్ష చతుర్దశి తిథి ఇందు వాసర ఆర్ద్ర నక్షత్రం ధ్రువ యోగః భద్ర తదుపరి శకుని తదుపరి చతుష్పాత్ కరణం.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శ్రాద్ధ తిథి: చతుర్దశి
నమస్కారః , శుభోదయం
భగవద్గీత
--------------------------భగవద్గీత. ------------------------
షష్ఠమోధ్యాయః
ధ్యాన యోగము
శ్రీ భగవానువాచ ।
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ।। 1 ।।
ప్రతిపదార్థ:
శ్రీ భగవానువాచ — భగవంతుడు పలికెను; అనాశ్రితః — ఆశించకుండా; కర్మఫలం — పనుల యొక్క ఫలితములు; కార్యం — చేయవలసిన; కర్మ — పని; కరోతి — నిర్వర్తించుట; యః — ఎవరైతే; సః — ఆ మనిషి; సంన్యాసీ — సన్యసించిన; చ — మరియు; యోగీ — యోగి; చ — మరియు; న — కాదు; నిః — లేకుండా; అగ్ని — అగ్ని; న — కాదు; చ — మరియు; అక్రియః — క్రియా రహితంగా
తాత్పర్యము :
భగవంతుడు పలికెను: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు.
వివరణ:
వేదాలలో అగ్ని హోత్ర యజ్ఞముల వంటి కర్మ కాండలు చెప్పబడినవి. సన్యాసాశ్రమంలో ప్రవేశించిన వారు కర్మ కాండలు చేయకూడదనే నియమాలు ఉన్నాయి, నిజానికి వారు అగ్నిని తాకరాదు, వంట కోసంకూడా తాకరాదు. భిక్ష అన్నాన్ని మాత్రమే స్వీకరించాలి. కానీ, కేవలం అగ్నిని విడిచిపెట్టినంత మాత్రాన, వ్యక్తి సన్యాసి అయిపోడు, అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు.
నిజమైన యోగులు ఎవరు, మరియు నిజమైన సన్యాసులు ఎవరు? ఈ విషయంపై చాలా అయోమయం ఉంది. జనులు అనుకుంటారు, ‘ఈ స్వామీజీ, ఫలాహారి (అంటే పండ్లు తప్ప ఇంకా ఏమీ తిననివాడు), కాబట్టి ఈయన ఒక ఉన్నతమైన యోగి.’ ‘ఈ బాబాజీ, దూధాహారి (పాల మీదనే బ్రతుకుతాడు), కాబట్టి ఇంకా ఉన్నతమైన యోగి.’ ‘ఈ గురూజీ, పవనాహారి (ఏమీ తినరు, కేవలం శ్వాస మీదనే జీవిస్తాడు), కాబట్టి తప్పకుండా భగవత్ ప్రాప్తి నొంది ఉండాలి.’ ‘ఈ సాధువు నాగాబాబా (వస్త్రములు కట్టుకోని సాధువు), కాబట్టి సంపూర్ణంగా సన్యాసం స్వీకరించినట్టే.’ కానీ, శ్రీ కృష్ణుడు ఈ అన్ని దృక్పథాలని ఖండిస్తున్నాడు. కేవలం బాహ్యమైన సన్యాస శకలు ఎవరినీ సన్యాసిని కానీ యోగిని కానీ చేయవు. ఎవరైతే తమ కర్మ ఫలములను భగవంతుకే అర్పిస్తారో వారే నిజమైన సన్యాసులు, యోగులు.
ఈ మధ్య కాలంలో, 'యోగా' అనేది పాశ్చ్యాత్య దేశాల్లో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎన్నెన్నో యోగా స్టూడియోస్ ప్రతి దేశంలో, ప్రతి ఊర్లో వచ్చేసాయి. గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి పది మందిలో ఒకరు యోగాభ్యాసము చేయుచున్నారు. కానీ, ఈ 'యోగా' అన్న పదం సంస్కృత వాఙ్మయంలో లేదు; అసలైన పదం ఏమిటంటే అది 'యోగ్', అంటే ఏకమవ్వటం. ఇది జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటాన్ని సూచిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, యోగి అంటే మనస్సు పూర్తిగా భగవంతునితో ఏకమయినవాడు అని అర్థం. అంటే, అటువంటి యోగి మనస్సు సహజంగానే ఈ ప్రపంచం నుండి ఉపసంహరించబడి ఉంటుంది. కాబట్టి, ఒక నిజమైన యోగి ఒక నిజమైన సన్యాసి కూడా.
కర్మ యోగమును పాటించే వారు తమ అన్ని కార్యములను, ఫలాపేక్ష లేకుండా, భగవంతుని పట్ల వినయ విధేయ సేవా దృక్పథంతోనే చేస్తారు. వారు గృహస్థులైనా అటువంటి వ్యక్తులు నిజమైన యోగులు మరియు అసలైన సన్యాసులు.
పాదారవింద శతకం - 2*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*పాదారవింద శతకం - 2*
*శ్లోకము - 34*
*నఖశ్రీసన్నద్ధస్తబకనిచితః స్వైశ్చ కిరణైః*
*పిశంగైః కామాక్షి ప్రకటితలసత్పల్లవరుచిః ।*
*సతాం గమ్యః శంకే సకలఫలదాతా సురతరుః*
*త్వదీయః పాదోఽయం తుహినగిరిరాజన్యతనయే ॥*
*భావము :*
*హిమవత్పుత్రీ! ఓ కామాక్షీ! నీ పాద నఖముల కాంతులు పువ్వుల గుత్తులు అయితే, నీ పాదముల ఎర్రని కాంతి లేలేత చిగురు ఆకులు. అవి భక్తులకు సకల కోరికలను తీరుస్తాయి. దీనిని గమనిస్తే, నీ పాదములు భక్తుల పట్ల, సాధువుల పట్ల కల్పవృక్షమే కదా.*
🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
సోమవారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః
13-07-2026 సోమవారం రాశి ఫలితాలు
మేషం
ఈరోజు చేపట్టిన పనులు ఆశించిన దిశగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో మీ కృషికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన నిర్ణయాలను ఆత్మవిశ్వాసంతో తీసుకోవచ్చు.
---------------------------------------
వృషభం
వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆదాయానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యంపై సాధారణ శ్రద్ధ వహించడం మంచిది.
---------------------------------------
మిధునం
ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం. సన్నిహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.
---------------------------------------
కర్కాటకం
చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకోవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
---------------------------------------
సింహం
వృత్తిపరంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అధికారులతో జరిగే చర్చలు సానుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలను నివారించడం మంచిది.
---------------------------------------
కన్య
కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు. ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.
---------------------------------------
తుల
పని విషయంలో ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో అభిప్రాయాలను పంచుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
---------------------------------------
వృశ్చికం
భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
---------------------------------------
ధనస్సు
శ్రమకు తగిన ఫలితం అందుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం అన్ని విధాలుగా ఉంటుంది. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ వహించాలి.
---------------------------------------
మకరం
స్థిరాస్తి సంబంధిత పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.
---------------------------------------
కుంభం
కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
---------------------------------------
మీనం
అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత రెండూ అనుకూలంగా ఉంటాయి.
---------------------------------------
