Ramesh
ఆ రోజుల్లో – ఈ రోజుల్లో
ఎటు పోతుంది ఎటు పోతుంది ఈ ప్రపంచం
డిజిటల్ యుగం లోనే ఈ పయనం
మునుగుతామా తేలుతామా చెప్పలేము ఈ సమయం
ఎందుకంటే ఇది జెన్ జీ యుగం
మా రోజుల్లో లేవు ఇంత డిజిటల్ టెక్నోలజీ
చెప్పాలేమో మేము అందరికీ అపోలజీ
సైకిల్ మీదే మా ప్రయాణం ఉండేది ఆరోగ్యం
ఇప్పుడు ఆరోగ్యం కోసం జిమ్మే శరణ్యం
మానవ బంధాలే ఉమ్మడి కుటుంబానికి మూలం
డిజిటల్ తో బంధాలే ఈనాటి కుటుంబాలకి శాపం
వెలవెలని చెమట చుక్కల సాగు, మట్టి వాసన తెలిసిన మంచితనం మా తరం
స్పీడుగా మారిన టెక్నాలజీ యుగం, ప్రపంచాన్ని ఏలే డిజిటల్ జ్ఞానం ఇదీ ఈ తరం
నిండు కుటుంబం, నలుగురితో సావాసం, నిజాయితీకి కట్టుబడిన మనిషి జీవనం మా తరం
ఎత్తయిన ఆశలు, వేగమైన ఆలోచనలు, మార్పును కోరుకునే ప్రతి అడుగు ఇదీ ఈ తరం
స్వంత ఇల్లు, వెనక చిన్న తోట, మిద్దె పైన నిద్ర, అప్పుడప్పుడు సినిమా ఇది మా తరం
హై రైజ్ అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటి, ఈవెనింగ్ పబ్, వీకెండ్ ఛిల్ ఇదే ఈ తరం.
మా తరానిది నిన్నటి నేర్పిన అనుభవాల పాఠం,
ఈ తరానిది రేపటిని గెలిచే ఆత్మవిశ్వాసం.
పాత తరపు ఓర్పు-కొత్త తరపు చూపు కలిస్తే,
సరికొత్త సమాజానికి అందమైన రూపం!
తరాలు మారినా, కాలం గడిచినా...
వేర్లు పాతవే అయినా, చిగురులు కొత్తవే!
పాత తరపు జ్ఞాపకాలు, కొత్త తరపు కలలు కలిస్తేనే,
జీవితం పరిమళిస్తుంది అమృతంలా!
ఈ కవిత నా అనుభవం, నా ప్రయాణం, నా అభిప్రాయం
మారతానో లేదా మర్వలేక పోతానో తేలుస్తుంది ముందర కాలం.
Loaded more posts.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి