21, మే 2026, గురువారం

*🪷22, మే, 2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹శుక్రవారం🌹*

 *🪷22, మే, 2026🪷*  

 *దృగ్గణిత పంచాంగం*             


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం -:గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : షష్ఠి* ఉ 06.24 ఉపరి *సప్తమి* రా.తె 05.04 వరకు

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : ఆశ్లేష* రా 02.08 వరకు ఉపరి *మఖ* 

*యోగం : వృద్ధి* ఉ 08.19 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం  : తైతుల* ఉ 06.24 *గరజి*;సా 05.38 ఉపరి *వణజి* రా.తె 05.04 ఆపైన *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 06.00 - 08.00 సా 05.00 - 06.00*     

 అమృత కాలం  : *రా 12.34- 02.08*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : మ 03.15 - 04.48*

*దుర్ముహూర్తం  : ఉ 08.11 - 09.03 మ 12.30 - 01.22* 

*రాహు కాలం  : ఉ10.27- 12.04*

గుళికకాళం      : *ఉ 07.12 - 08.50*

యమగండం    : *మ 03.19 - 04.56*

సూర్యరాశి : *వృషభం*                               

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.42*  

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం        :*ఉ 05.35 - 08.11*

సంగవ కాలం        :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం    :*10.46 - 01.22*

అపరాహ్న కాలం   :*మ 01.22- 03.58*

*ఆబ్ధికం తిధి        : అధిక జ్యేష్ట శుద్ధ సప్తమి*

సాయంకాలం     :*సా 03.58- 06.33*

ప్రదోష కాలం     :*సా 06.33 - 08.46*

రాత్రి కాలం        :*రా 08.46 - 11.42*

నిశీధి కాలం       :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


  *గాయత్రీ సోమసంభూతి*

    *స్సావిత్రీ ప్రణవాత్మికా*

           

               *🪷ఓం🪷* 

*🌷శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

21-05-2026 రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

21-05-2026 రాశి ఫలితాలు


మేషం


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.  

--------------------------------------- 


వృషభం


కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

---------------------------------------


మిధునం


నూతన ఋణాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని పనులు మధ్యలో వాయిదాపడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. 

---------------------------------------


సింహం


నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కన్య


ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


తుల


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమౌతుంది.  

---------------------------------------


వృశ్చికం


ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. 

---------------------------------------


ధనస్సు


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


మకరం


వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------


కుంభం


ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్నిపనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------


మీనం

 

విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

---------------------------------------

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 21 మే 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*                              

           *95వ భాగం*


*శ్రీకృష్ణావతారము                      యదువంశ కథ!*```


యయాతి ప్రథమ పుత్రుడైన యదువుకి సహస్రజిత్తు,క్రోష్టుడు, అనలుడు, నహుషుడు అనే నలుగురు కుమారులు ఉన్నారు.  సహస్రజిత్తుకి శతజిత్తుడు జన్మించగా, శతజిత్తుకి హేహయ, తాళజంఘ, వేణు హయులని ముగ్గురు కుమారులు జన్మించారు.

హేహయునకు ధర్ముడు, ధర్మునికి కుంతలుడు జన్మించారు. కుంతలుడి పేరుతో వారి రాజ్యానికి కుంతలదేశము అని పేరు వచ్చింది కుంతలుని కుమారుడు సభాజిత్తు. సభాజిత్తుని కుమారుడు మహిష్మంతుని పేరుతో మహిష్మతిపురం నిర్మించబడింది.

మహిష్మంతుని పుత్రుడు భద్రశోణి, భద్రశోణి కుమారుడు దుర్దముడు, దుర్దముని కొడుకు, ధనకుడు. ధనకునికి కృతవీర్యుడు కృతాగ్ని, కృతధర్ముడు, కృతాజుడు అనే నలుగురు కుమారులు కలిగారు. కృతవీర్యునికి వేయి చేతులు గల కార్తవీర్యార్జునుడు జన్మించాడు. కార్తవీర్యార్జునుడు పరశురాముని చేతిలో మరణించాడు.


కార్తవీర్యార్జునుడికి గల నూరుగురు కుమారులలో శూరసేనుడు, వృషసేనుడు,మధువు, జయధ్వజుడు ముఖ్యమైనవారు. జయధ్వజుని కుమారుడు తాళజంఘుడు. తాళజంఘునికి నూరుగురు కుమారులు జన్మించారు. వారిలో మొదటి వాడు వీతిహోత్రుడు,రెండవవాడు భరతుడు. భరతునికి వృషుడు, వృషునికి మధుడు,మధునికి వృష్ణి జన్మించారు. వృష్ణి పేరుతో వృష్ణి వంశం ప్రసిద్ధి చెందింది.


యదువుకి మరో పుత్రుడైన క్రోష్ఠునికి ధ్వజినీశుడు జన్మించాడు. ధ్వజినీశునికి స్వాతి,  ఋశంకుడు జన్మించారు. ఋశంకునికి చిత్రరథుడు జన్మించారు. చిత్రరథునికి జన్మించిన శశిబిందుడు చక్రవర్తిగా భూమినంతా పరిపాలించాడు. శశిబిందుని కుమారులలో పెద్దవాడు పృథుశ్రవుడు. పృథుశ్రవునికి కుమారుడు దముడు, దమునికి పుట్టిన ఉశనుడు పది అశ్వమేధాలతో సహా అనేక యజ్ఞయాగాదులు చేశాడు.


ఉశనునికి ఇతవుడు, ఇతవునికి మధువు, మధువుకి పరాజితుడు, రుక్ముడు,పృథురుక్ముడు,జ్యామఘుడు, ఫలితహరితుడు అనే ఐదుగురు కుమారులు జన్మించారు. వీరిలో జ్యామఘుడు శైబ్య అనే కాంతను మోహించి వివాహం చేసుకున్నాడు. వారికి చాలా కాలం తరువాత విదర్భుడు అనే కుమారుడు జన్మించాడు. విదర్భుని చక్కటి పరిపాలనతో ఆ దేశానికి విదర్భ దేశం అని పేరు వచ్చింది.


విదర్భునికి క్రథకైశుడు, రోమపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. రోమపాదుని కుమారుడు విభ్రుడు, విభ్రుని కుమారుడు ధృతి, ధృతి కుమారుడు కౌశికుడు. కౌశికుడి కుమారుడు చేదితో చేది వంశం, చేది దేశం ఏర్పడ్డాయి. కృథకైశునికి కుంతి అనే కుమారుడు, ఇందుమతి అనే కుమార్తె కలిగారు.


ఇందుమతి సూర్యవంశజుడైన అజునికి భార్య అయ్యింది. కుంతికి వృష్ణి, వృష్ణికి ధృతి, ధృతికి దాశార్హుడు, దాశార్హునికి వ్యోముడు, వ్యోమునికి అనుడు, అనునికి పూరుహోత్రుడు, పూరుహోత్రునికి అంశుడు, అంశునికి సత్వతుడు, సత్వతునికి ఉత్వకుడు జన్మించారు.


ఉత్వతుడికి భజమాన, దివ్యాంధ, దేవావృధ, మహాభోజ, వృష్ణులని కుమారులు కలిగారు. భజమానునికి నిమి, వృక్షుడు, వృష్ణి, శతజిత్తు, సహస్రజిత్తు, యుతజిత్తు అనే ఆరుగురు కుమారులు పుట్టారు. దేవావృధునికి బభ్రుడు, దేవవిభుడు జన్మించారు.  మహాభోజునికి భోజమూర్తులు జన్మించారు. భోజ వంశం వృద్ధి చెందింది. 


వృష్ణి కుమారుడు సుమిత్రుడు, సుమిత్రునికి అమిత్రుడు, శిని అని కుమారులు కలిగారు. అమిత్రుని పుత్రుడు నిఘ్నుడు, నిఘ్నుని కుమారులు సత్రాజిత్తు ప్రసేనుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. సత్రాజిత్తుని కుమార్తె సత్యభామ శ్రీకృష్ణునికి మూడవ పత్ని అయ్యింది.


అమిత్రుని కుమారుడు శినికి సత్యకుడు, సత్యకునికి సాత్యకి జన్మించారు. సాత్యకికి యయు ధానుడు అనే మరోపేరు ఉంది.  శ్రీకృష్ణునికి సాత్యకి సోదరుడు అవుతాడు.


అంధకుని  రుచికంబళ, కుకుర బర్వులు అనే కుమారులు జన్మించారు. అంధకుని వంశములో పుట్టినవారు అంధకులుగా ప్రసిద్ధి చెందారు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏