🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*గురువారం 21 మే 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*95వ భాగం*
*శ్రీకృష్ణావతారము యదువంశ కథ!*```
యయాతి ప్రథమ పుత్రుడైన యదువుకి సహస్రజిత్తు,క్రోష్టుడు, అనలుడు, నహుషుడు అనే నలుగురు కుమారులు ఉన్నారు. సహస్రజిత్తుకి శతజిత్తుడు జన్మించగా, శతజిత్తుకి హేహయ, తాళజంఘ, వేణు హయులని ముగ్గురు కుమారులు జన్మించారు.
హేహయునకు ధర్ముడు, ధర్మునికి కుంతలుడు జన్మించారు. కుంతలుడి పేరుతో వారి రాజ్యానికి కుంతలదేశము అని పేరు వచ్చింది కుంతలుని కుమారుడు సభాజిత్తు. సభాజిత్తుని కుమారుడు మహిష్మంతుని పేరుతో మహిష్మతిపురం నిర్మించబడింది.
మహిష్మంతుని పుత్రుడు భద్రశోణి, భద్రశోణి కుమారుడు దుర్దముడు, దుర్దముని కొడుకు, ధనకుడు. ధనకునికి కృతవీర్యుడు కృతాగ్ని, కృతధర్ముడు, కృతాజుడు అనే నలుగురు కుమారులు కలిగారు. కృతవీర్యునికి వేయి చేతులు గల కార్తవీర్యార్జునుడు జన్మించాడు. కార్తవీర్యార్జునుడు పరశురాముని చేతిలో మరణించాడు.
కార్తవీర్యార్జునుడికి గల నూరుగురు కుమారులలో శూరసేనుడు, వృషసేనుడు,మధువు, జయధ్వజుడు ముఖ్యమైనవారు. జయధ్వజుని కుమారుడు తాళజంఘుడు. తాళజంఘునికి నూరుగురు కుమారులు జన్మించారు. వారిలో మొదటి వాడు వీతిహోత్రుడు,రెండవవాడు భరతుడు. భరతునికి వృషుడు, వృషునికి మధుడు,మధునికి వృష్ణి జన్మించారు. వృష్ణి పేరుతో వృష్ణి వంశం ప్రసిద్ధి చెందింది.
యదువుకి మరో పుత్రుడైన క్రోష్ఠునికి ధ్వజినీశుడు జన్మించాడు. ధ్వజినీశునికి స్వాతి, ఋశంకుడు జన్మించారు. ఋశంకునికి చిత్రరథుడు జన్మించారు. చిత్రరథునికి జన్మించిన శశిబిందుడు చక్రవర్తిగా భూమినంతా పరిపాలించాడు. శశిబిందుని కుమారులలో పెద్దవాడు పృథుశ్రవుడు. పృథుశ్రవునికి కుమారుడు దముడు, దమునికి పుట్టిన ఉశనుడు పది అశ్వమేధాలతో సహా అనేక యజ్ఞయాగాదులు చేశాడు.
ఉశనునికి ఇతవుడు, ఇతవునికి మధువు, మధువుకి పరాజితుడు, రుక్ముడు,పృథురుక్ముడు,జ్యామఘుడు, ఫలితహరితుడు అనే ఐదుగురు కుమారులు జన్మించారు. వీరిలో జ్యామఘుడు శైబ్య అనే కాంతను మోహించి వివాహం చేసుకున్నాడు. వారికి చాలా కాలం తరువాత విదర్భుడు అనే కుమారుడు జన్మించాడు. విదర్భుని చక్కటి పరిపాలనతో ఆ దేశానికి విదర్భ దేశం అని పేరు వచ్చింది.
విదర్భునికి క్రథకైశుడు, రోమపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. రోమపాదుని కుమారుడు విభ్రుడు, విభ్రుని కుమారుడు ధృతి, ధృతి కుమారుడు కౌశికుడు. కౌశికుడి కుమారుడు చేదితో చేది వంశం, చేది దేశం ఏర్పడ్డాయి. కృథకైశునికి కుంతి అనే కుమారుడు, ఇందుమతి అనే కుమార్తె కలిగారు.
ఇందుమతి సూర్యవంశజుడైన అజునికి భార్య అయ్యింది. కుంతికి వృష్ణి, వృష్ణికి ధృతి, ధృతికి దాశార్హుడు, దాశార్హునికి వ్యోముడు, వ్యోమునికి అనుడు, అనునికి పూరుహోత్రుడు, పూరుహోత్రునికి అంశుడు, అంశునికి సత్వతుడు, సత్వతునికి ఉత్వకుడు జన్మించారు.
ఉత్వతుడికి భజమాన, దివ్యాంధ, దేవావృధ, మహాభోజ, వృష్ణులని కుమారులు కలిగారు. భజమానునికి నిమి, వృక్షుడు, వృష్ణి, శతజిత్తు, సహస్రజిత్తు, యుతజిత్తు అనే ఆరుగురు కుమారులు పుట్టారు. దేవావృధునికి బభ్రుడు, దేవవిభుడు జన్మించారు. మహాభోజునికి భోజమూర్తులు జన్మించారు. భోజ వంశం వృద్ధి చెందింది.
వృష్ణి కుమారుడు సుమిత్రుడు, సుమిత్రునికి అమిత్రుడు, శిని అని కుమారులు కలిగారు. అమిత్రుని పుత్రుడు నిఘ్నుడు, నిఘ్నుని కుమారులు సత్రాజిత్తు ప్రసేనుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. సత్రాజిత్తుని కుమార్తె సత్యభామ శ్రీకృష్ణునికి మూడవ పత్ని అయ్యింది.
అమిత్రుని కుమారుడు శినికి సత్యకుడు, సత్యకునికి సాత్యకి జన్మించారు. సాత్యకికి యయు ధానుడు అనే మరోపేరు ఉంది. శ్రీకృష్ణునికి సాత్యకి సోదరుడు అవుతాడు.
అంధకుని రుచికంబళ, కుకుర బర్వులు అనే కుమారులు జన్మించారు. అంధకుని వంశములో పుట్టినవారు అంధకులుగా ప్రసిద్ధి చెందారు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి