15, జూన్ 2026, సోమవారం

చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం

  చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది. మహా విష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ బ్రహ్మదేవుడిని పూజించాలని శాస్త్రవచనం.

ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి.

జ్యేష్ఠమాసంలో త్రివిక్రముని ప్రీతి కొరకు నీటి కుంభమును, నీరు, విసనకర్రను, చందనమును దానం చేయాలిచాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది. మహా విష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ బ్రహ్మదేవుడిని పూజించాలని శాస్త్రవచనం.

ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి.

జ్యేష్ఠమాసంలో త్రివిక్రముని ప్రీతి కొరకు నీటి కుంభమును, నీరు, విసనకర్రను, చందనమును దానం చేయాలి..

మంగళవారం🍁* *🌹16, జూన్, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

  *🌹16, జూన్, 2026🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

                  

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 


*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*నిజ జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి : విదియ* రా 12.52 వరకు ఉపరి *తదియ*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* సా 04.12 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం* :*వృద్ధి* రా12.35ఉపరి *ధ్రువ*

*కరణం  : బాలువ* మ 02.39 *కౌలువ* రా 12.52 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 11.00 సా 04.00 - 06.00* 

అమృత కాలం  :*ఉ 07.25-08.50*

 అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.34*

*వర్జ్యం    :రా02.54 -04.20తె*

*దుర్ముహూర్తం  : ఉ 08.12 - 09.05 రా 11.03 - 11.46*

*రాహు కాలం   :మ03.25- 05.03*

గుళికకాళం      : *మ 12.08 - 01.46*

యమగండం    : *ఉ 08.52 - 10.30*

సూర్యరాశి : *మిధునం*                 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 05.42*

సూర్యాస్తమయం :*సా 06.52*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.35 -08.12*

సంగవ కాలం        :*08.12 - 10.50*

మధ్యాహ్న కాలం    :*10.50 - 01.27*

అపరాహ్న కాలం   :*మ 01.27- 04.04*

*ఆబ్ధికం తిధి        : నిజ జ్యేష్ఠ శుద్ధ విదియ*

సాయంకాలం     :*సా 04.04- 06.41*

ప్రదోష కాలం      :*సా 06.41- 08.52*

రాత్రి కాలం        :*రా 08.52 - 11.46*

నిశీధి కాలం       :*రా 11.46 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.08 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

సోమవారం

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     🕉️ *సోమవారం*🕉️

  *🌹15, జూన్, 2026🌹*

     *దృగ్గణిత పంచాంగం* 

              

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం*

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి : అమావాస్య* ఉ 08.23 ఉపరి *నిజ మాసారంభః*

*పాడ్యమి* రా.తె 04.30 వరకు ఆపైన *విదియ*

*వారం   :సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : మృగశిర* రా 07.08 వరకు ఉపరి *ఆరుద్ర*

*యోగం : శూల* ఉ 08.56 ఉపరి *గండ* రా.తె 04.39 వరకు 

*కరణం  : నాగ* ఉ 08.23 *కింస్తుఘ్న* సా 06.26 ఉపరి

*బవ* రా.తె 04.30 వరకు ఆపైన *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

           *-ఈరోజు లేవు-* 

 అమృత కాలం  : *ప 11.28 - 12.52*

 అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.34*

*వర్జ్యం    : రా 02.30 - 03.55*

*దుర్ముహూర్తం  : మ 12.34 - 01.27 & 03.11 - 04.04*

*రాహు కాలం  :ఉ 07.13 -08.51*

గుళికకాళం      :*మ 01.46 - 03.25*

యమగండం    : *ఉ10.30 - 12.08*

సూర్యరాశి : *వృషభం/మిధునం*

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 05.42*

సూర్యాస్తమయం :*సా 06.52*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం       :*ఉ 05.35- 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.49*

మధ్యాహ్న కాలం    :*10.49 - 01.27*

అపరాహ్న కాలం  :*మ 01.27- 04.04*

*ఆబ్ధికం తిధి       : నిజ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం    :*సా 04.04- 06.41*

ప్రదోష కాలం     :*సా 06.41 - 08.52*

రాత్రి కాలం        :*రా 08.52 - 11.46*

నిశీధి కాలం       :*రా 11.46 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

అక్షర ప్రేమికుడు*

 *అక్షర ప్రేమికుడు*

================

రచన :- సురేష్ వంకాయలపాటి (పిఠాపురం )

==================



    పచ్చని పొలాలు మధ్య  గోదావరి గాలులు చల్లదనానికి  సాయం సంధ్య వేళ  వేళ పక్షుల రమణీయమైన  కిలకిలారావాలతో  సందడి చేసే  ఒక చిన్న పల్లెటూరు లో మహేంద్ర అనే వ్యక్తి  ప్రశాంతంగా తన అభిరుచి కి అనుగుణంగా అందరినీ అలరిస్తూ పలకరిస్తూ....

చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ  చూపిస్తూ  నే అన్ని రకాల పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అతనికి ఎంతో ఇష్టంమైన వ్యాపకం  గా చేసుకున్నాడు...

           మహేంద్ర  కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.   దురదృష్టవశాత్తు  తన చదువుకు తగిన మంచి ఉద్యోగం దొరకలేదు. అయినా నిరాశ పడకుండా అన్ని  ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూలకు వెళ్లాడు . ఎంతో  ఆశతో ఎదురు చూశాడు చూసిన ప్రతీ సారి తనకి  నిరాశే ఎదురైంది.

    తర్వాత కొన్ని   ప్రైవేట్  సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు.  చివరగా మరో ప్రైవేట్ కంపెనీలో  క్లర్క్‌గా  చాలా కాలం పని చేశాడు. అతను చేసే పని  అతనికి  నచ్చలేదు.. జీతం సమస్య కాకపోయినా ఎందుకో తన మనసుకు తృప్తి కలగలేదు. చివరకు ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు.

       మహేంద్రకు చిన్నప్పటి నుండి తనకటూ మరో లోకము ఉంది అదే అక్షర ప్రపంచం.

       అతనికి కథలు, కవితలు వ్రాయడం అంటే  చాలా ఇష్టం. ప్రకృతి అందాలు వర్ణిస్తూ  సగటు మనుషుల జీవిత విశేషాలు,  సమాజంలో జరిగే సంఘటనల  ఆలోచనలు తన  కలంతో  కథలుగా మారేవి.

     నిద్ర లేని ఎన్నో రాత్రిళ్ళు కాగితం మీద  తన భావాలను పదాలుగా మార్చేవాడు. పుస్తకాలు, కాగితాలు అతని నేస్తాలు.

కాల క్రమంలో జీవితంలో కొన్ని మార్పులు అనివార్యం అవుతూ వచ్చాయి.  వాళ్ల  పొలాలు అమ్మి రాజమండ్రి గోదావరికి 

చేరువుగా తన అభిరుచికి తగ్గట్టు ఒక ఇల్లు  కొనుగోలు చేశాడు. కొంత  డబ్బును బ్యాంకులో జమ చేశాడు. వచ్చే వడ్డీతో కుటుంబం సాదాసీదాగా ఒడి దుడుకులు లేకుండా ముందుకు సాగిపోతోంది.

      మహేంద్ర కు మేనమావ కూతురు శ్రీవల్లి  తో వివాహం అయింది. వారికి  ఒక్క గాని ఒక్క కూతురు . ఆమెకు సరస్వతి  అని పేరు పెట్టీ గారంగా పెంచుతున్నారు. సరస్వతి పేరుకు తగ్గట్టు చదువులో ముందు ఉండేది.  తెలివైన అమ్మాయి. ఆమెకు  తండ్రి అంటే  ఎంతో గౌరవం. 

     మహేంద్ర కు కూడా కూతురు అంటే అంతే ప్రేమ.  అమ్మాయి చదువు విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. కష్టపడి ఆమెను బి.టెక్ వరకు చదివించాడు.

అలాగే  మహేంద్ర తనకి ఇష్టమైన రచన వ్యాపకం   కొనసాగిస్తూ ఉన్నాడు. ఎక్కడ  సాహితీ సభలు జరిగితే అక్కడ పాల్గొనేవాడు  . అవకాశం  వచ్చినపుడు తన కవితలు తను వ్రాసిన కథలు చదివేవాడు. అలా ఎందరో  సాహిత్యప్రియులు తో సాన్నిత్యం  ఏర్పడింది. వారంతా అతనిలోని ప్రతిభ ను గుర్తించి తన  రచనలను మెచ్చుకునేవారు.

      కావలసిన వారు ,  చుట్టుపక్కల ఉన్నవారికి మాత్రం మహేంద్ర చేస్తున్న పని అంతగా రుచించలేదు. ఉద్యోగం , సద్యోగం లేకుండా కవితలు. గోష్టి అంటూ తిరిగితే ఏంటి ప్రయోజనం అంటూ జాలి పడుతూ హేళన చేసేవారు.

ఇరుగు పొరుగు అమ్మలక్కలు   శ్రీవల్లి తో...

మీ వారు రోజంతా ఇంట్లో కూర్చుని ఏవేవో  రాస్తుంటాడు. ఎక్కడికి వెళ్లాడా ఏ  పని చేయడా అని ఆడి పోసుకునేవారు..” పైగా ఇలాగే కొనసాగితే ఎదిగిన కూతురు పెళ్లి ఎలా  చేస్తారు అంటూ   దెప్పి పొడవటం మొదలు పెట్టారు. క్రమేణా శ్రీవల్లి వాళ్ళ మాటలకు భయపడటంతో తనలో కొంత మార్పు వచ్చింది. ఆమె భర్త తో అయిన దానికి కానిదానికి రుస రుస లాడటం కారణం లేకుండా  గొడవ పడటం మొదలు పెట్టింది.

“రోజంతా ఆ పుస్తకాలు, కాగితాలు ముందు వేసుకుంటే  వాటి వల్ల  మన జీవితాలు మారిపోతాయా అంటూ రుస రుస లాడటం కూడా  మొదలు పెట్టింది.

మహేంద్ర  ఆమె ప్రవర్తన చూసి కాస్త ఆశ్చర్య పడుతూ అంతలోనే  శాంతంగా నవ్వుకునేవాడు.

చూడు శ్రీ వల్లి … నువ్వు తీసి  పడేస్తున్న ఈ రచనలకు  కూడా ఒక రోజు వస్తుంది.”అని చెప్పటానికి ప్రయత్నిస్తుంటే 

      శ్రీవల్లి  మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

కళ్ళ ముందు రోజులు గడిచి పోయాయి  నెలలు గడచి పోతున్నాయి.

ఒక రోజు మహేంద్ర రాసిన కథ ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది. ఆ కథలో గ్రామీణ జీవితం, అక్కడ మనుషుల భావాలు చాలా హృదయానికి హత్తుకునేలా వ్రాయటం తో  అందరికీ బాగా  నచ్చింది.

       చివరకు ఆ కథ సినిమా దర్శకుడు  సురేష్ వంకాయలపాటి చదవటం జరిగింది. కథ చదివిన వెంటనే చాలా ఇంప్రెస్స్ అవటమే కాకుండా  చాలా  ఆశ్చర్యపోయాడు. ఇలాంటి 

మంచి కథ ఎవరు రాశారు?”  అని వాకబు చేయటం మొదలు పెట్టాడు.

పత్రికలో ఉన్న చిరునామాతో  మహేంద్ర ఆచూకీ తేలుకుని  ఒక  మంచి రోజు అతని ఇంటికి వెళ్ళాడు.

తలుపు తడితే  మహేంద్ర బయటికి వచ్చాడు.

“మీరు మహేంద్ర గారేనా?” అని అడిగాడు సురేష్.

“అవును… నేను మహేంద్రనే” అంటూ  సమాధానం ఇచ్చాడు. నేను దర్శకుడు సురేష్ ను అంటూ పరిచయం చేసుకున్నాడు.

“మీరు రాసిన కథ నేను చదివాను. అద్భుతం. ఆ కథను నేను సినిమాగా తీయాలనుకుంటున్నాను.” అని చెప్పటంతో  అతని మాటలకు 

మహేంద్ర ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు.

          సురేష్ వెంటనే ఒక కవర్ తీసి అతని చేతిలో పెట్టాడు.

“ఇది అడ్వాన్స్. మిగతా విషయం తరువాత మాట్లాడుకుందాం.”

ప్రక్కగా నిలబడి  చూస్తున్న శ్రీవల్లి కి ఒకటే  ఆశ్చర్యం.  తను తక్కువగా చూస్తున్న భర్త చేతి వ్రాతలే  వారి ఇంటికి  ఇంత గౌరవం తీసుకొచ్చాయి అని తెలుసుకుని  ఆశ్చర్యము తో ఆనందపడిపోతోంది.

నెమ్మదిగా  ఆ వార్త కాలనీ అంతా తెలిసిపోయింది.

ఇప్పటివరకు మహేంద్రను విమర్శించిన వారు  అతని దగ్గరకు వచ్చి అభినందనలు తెలియచేస్తున్నారు ఒక్కొక్కరుగా .

“మహేంద్ర గారూ! మేము మీలో ఉన్న  ప్రతిభ ను  గుర్తింక ఏవేవో  మీ గురించి తప్పుగా మాట్లాడాం అంటూ సంజాయిషీ చెప్పుకుంటున్నారు.

            త్వరలోనే కాలనీలో ఒక చిన్న సభ కూడా  ఏర్పాటు చేశారు. సభలో అందరూ ఆయన్ని కొనియాడారు. చివరగా  మహేంద్రను మాట్లాడమని కోరారు.

మహేంద్ర మైక్ దగ్గరకు వెళ్లి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు.

“ప్రియమైన మిత్రులారా…మీ అందరికీ  నా హృదయ పూర్వక నమస్కారములు. మీ విమర్శలే నన్ను చైతన్య వంతుణ్ణి  చేశాయి. రచయిత అంటే 

 కేవలం పదాలు అల్లేవాడు  మాత్రమే  కాదు. రచయిత ఎప్పుడూ   మనుషుల మనసులను అర్థం చేసుకునే వ్యక్తి. వారి  మనోగతాలను అవగాహన చేసుకునే శక్తి గల వ్యక్తి కూడా...

కవిగా పుట్టడం అంటే ఒక వరం.పూర్వ జన్మ సుకృతం.

కవిత్వం అంటే భావాలను అక్షరాలుగా మార్చే కళ. కొందరికి కొన్నిటి మీద మక్కువ. సైంటిస్టు కి ఏదో  ఒక కొత్తది కనిపెట్టాలి అనే తపన.  వ్యాపారం చేసేవారికి డబ్బు సంపాదించాలన్న కోరిక, మరొకరికి పదవి అంటే ప్రాణం.  అలాగే కొందరికి సాహిత్యం అంటే ఇష్టం. ఏ రంగంలో ఎవరికైనా 

డబ్బు వెంటనే రాకపోవచ్చు. గౌరవం కూడా ఆలస్యంగా రావచ్చు. కానీ నిజమైన అక్షరాలు ఎప్పటికైనా తమ విలువను చూపిస్తాయి. సంఘంలో గౌరవాన్ని పెంచుతాయి.

కవి ఆలోచనలు ఏదో ఒక  రోజు సమాజానికి అద్దం పడతాయి. అందుకే అక్షరాలను నమ్ముకున్న వాణ్ణి  , ప్రేమించే వాడిని  తక్కువగా చూడకూడదు.”

ఒక్కసారిగా అతని మాటలు వింటున్న ప్రతీ ఒక్కరు లేచి నిలబడి  గట్టిగా చప్పట్లు కొట్టారు.

శ్రీవల్లి  కళ్లలో ఆనందబాష్పాలు సుళ్ళు తిరుగుతున్నాయి. 

        సభ ముగిసిన తరువాత ఆమె మహేంద్ర దగ్గరకు వెళ్లి క్షమార్పణ కోరుతున్నట్టు నెమ్మదిగా  చెప్పింది.

“నన్ను క్షమించండి. నేను మీ అభిరుచి , మీ  అభీష్టం   అర్థం చేసుకోలేకపోయాను.” అంటుంటే

మహేంద్ర చిరునవ్వుతో  ఆమెను దగ్గరగా తీసుకుంటూ 

కొన్నింటి  విలువ తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానికి కొంచెం ఓపిక ఉండాలి అంటూ ప్రేమతో మరింత దగ్గరికి తీసుకున్నాడు. గోదావరి మీద నుండి వస్తున్న చల్లటి  గాలి తెర ఇద్దర్ని ఆశీర్వదించింది.

గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు -

 గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు -


• తవాక్షరి చూర్ణంని తేనెతో సేవించుచున్న గుండెకు మంచి బలం కలిగి గుండె బలహీనత తొలగును .


• కోడిగుడ్డు సొన పాలతో బాగుగా కలియునట్లు చేసి దానిలో మిరియాల చూర్ణం , చక్కెర కలిపి ఉదయమే సేవించుచున్న బలహీనత తగ్గును. గుండెకు సత్తువ ఇచ్చును.


• బెల్లపు పానకం లో మద్దిచెక్క చూర్ణంని కలిపి తాగిన గుండెజబ్బులు పోవును . దీర్గాయువుని ఇచ్చును.


• గోధుమలు , మద్దిచెక్క చూర్ణములను ఆవునెయ్యి మేకపాలలో వేసి పక్వముగా చేసి దానిలో చక్కర చేర్చి సేవించుచున్న గుండెజబ్బులు తొలగును . గుండె బలహీనత పొవును .


• మద్దిచెక్క చూర్ణం, నెయ్యి, పాలు కలిపి తాగుచున్న గుండె బలహీనత తగ్గును.


• పెద్ద ముత్తువపులాగ చూర్ణంని పాలతో కలిపి తాగుచున్న గుండెబలహీనత , గుండెజబ్బు తగ్గును.


• 12 గ్రాముల స్వచ్ఛమైన తేనెను నీళ్లతో కలిపి ఉదయాన్నే తాగుచున్న గుండెజబ్బు నయం అగును.


• మద్దిచెక్క చూర్ణంని పంచదారతో కలిపి తాగిన గుండెజబ్బు నయం అగును.


• కటుకరోహిణి గంధమును గుండెకు పట్టువేసిన గుండెజబ్బు తొలగును .


• మారేడు వేరును కషాయంగా చేసి తాగుచున్న గుండెదడ హరించును .


• ఇంగువ 10 గ్రాములు , హారతి కర్పూరం 10 గ్రాములు ఇవి రెండు నీళ్లతో నూరి గురిగింజలు అంత మాత్రలు చేసి పూటకి ఒకమాత్ర చొప్పున రోజూ రెండుపూటలా వేసుకొని అనుపానంగా 40 గ్రాములు జటామాంసి కషాయం తాగుచున్న యెడల గుండెదడ , ఆయాసం హరించిపోవును .


• మూసామ్బారం నీళ్లతో నూరి గుండెలకు పట్టువేసిన యెడల గుండెలాగుట , పీకుట , ఆయాసం తగ్గును.


• గుండెల్లో మంట గా ఉంటే పుచ్చగింజలు 20 గ్రాములు నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయమున ఆ నీటిలో ఆ గింజలను బాగా పిసికి పటికబెల్లం పొడి కొద్దిగా కలిపి ఆ తరువాత దానిని వడపోసి ఆ ద్రవమును తాగవలెను .


• రావి ఆకులను నీళ్లలో నానబెట్టి మరునాడు ఉదయము దానిని వడబోసి తెల్లటి సీసాలో నిలువ ఉంచవలెను. ఆ ద్రావకం రోజుకి మూడుమార్లు 50ml చొప్పున తాగుచున్న గుండెదడ తగ్గును. పైన చెప్పిన వాటిలో కొలతలు లేకున్నచో 3 నుంచి 5 గ్రాములు చూర్ణపు మోతాదు తీసుకోవచ్చు . ద్రవపదార్థం 100 ml నుంచి 150 ml వరకు తీసుకోవచ్చు .



మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.


రేపటికి పునాదులు*

  *రేపటికి పునాదులు*


*-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు,*

 


ఎండలు మండిన కాలానంతరం

బడుల్లో నవ క్రాంతి

భవిత కేంద్రాలకు కొత్త కాంతి

 

కొన్ని ఆశలు

హరివిల్లులై సాక్షాత్కరిస్తాయి

కొన్ని ఆశయాలు

గాలిపటాలై

అక్కడి వినువీధుల్లో

కనువిందు చేస్తాయి

కొన్ని కలలు

అక్కడ రంగురంగుల

రంగవల్లికలై

భూమాత హృదయానికి

రంగుల కలలద్దుతాయి

కొన్ని మెలకువలు

కిలకిలరావాలై

అక్కడ గాలి చేసే నృత్యానికి

నేపథ్య రాగాలవుతాయి

కొన్ని నెమళ్లు 

అక్కడ పురివిప్పి

నృత్యాలు చేస్తాయి

కొన్ని సీతాకోకచిలుకలు

అక్కడ మనసులకు రెక్కలిస్తూ  

పరిసరాలకు                                                     

ఆహ్లాదపు లేపనమద్దుతాయి

కొన్ని కంఠాలు   

దోస్తులను దూరం చేసిన

సెలవులను

నవ్వుల పువ్వులు               

వెదజల్లుతూ వెక్కిరిస్తాయి


ఇప్పుడు అక్కడ

పాత వెలుగులు

కొత్త మెరుగులు దిద్దుకుంటాయి

రేపటికి పునాదులు వేసుకుంటాయి


*(తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా)*

పరిపూర్ణ వికాస దిశగా

 *సందర్భం: జూన్ 15వ తేదీ పాఠశాలల పునఃప్రారంభం*


*పరిపూర్ణ వికాస దిశగా …*

*-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు* 


ఇక్కడి గోడలు

తిమిర నిర్మూలనకు

కంకణం కట్టుకున్న

విజ్ఞాన కేంద్రాలు


నోట్లోని శ్వేత కుడ్యాల చాటు నుండి

బుజ్జి నాలుకలు

లోపలికీ బయటికీ

కిందికీ పైకీ

లేలేత పెదాలు పైకీ కిందికీ

కదులుతూ

ఇక్కడి పరిసరాల్లో

అనునిత్యం జరిగే శబ్దప్రసారం  

అడుగడుగునా చేతనకు కారణమవుతుంది.


నోటి నుండి వెలువడే శబ్దానికి

రూపం కల్పిస్తూ

పలకపై రాసిన అక్షరాన్ని

మెదడు ఛాయాచిత్రంగా భద్రపర్చుకుంటుంది

ఆ ఛాయాచిత్రమే డీకోడ్ అయి

తిరిగి పెదవుల గుండా

పరావర్తనమవుతుంది


నల్లబల్లపై చిత్రితమయ్యే

అక్షరమాలలు

అరవై అవతారాలెత్తి  

ఒకేసారి అరవై గమ్యాలకు

ప్రయాణం చేస్తాయి  


ఇంటర్వెల్ బెల్లు కొట్టగానే

పరుగులు తీసే చిట్టి కాళ్లు

పాదముద్రలతో

బడినేలపై హాజరు వేసుకుంటాయ్


ఇక్కడే

చిట్టి నెమళ్లు

పరిసరాల్ని మరచి

పురివిప్పుకుని ఆడతాయ్  

చదువులూ

ఆటలూ

పాటలూ

పోటాపోటీగా కొనసాగుతాయ్  

సమగ్ర మూర్తిమత్వమూ

పరిపూర్ణ వికాసమూ

గమ్యాలుగా

అడుగులు కదులుతాయ్

అరుణాచలేశ్వరా

 _తండ్రీ అరుణాచలేశ్వరా!🌹_ 


ఎక్కడెక్కడో ఉన్నావని 

పిలిచి పిలిచి

అలసి సొలసి డస్సిపోయాను

ఎదలో కొలువైనావని 

ఎరిగే జ్ఞానము లేదు

ఆగని ఆరాటం 

అంతులేని ఉక్రోషం తో

మాటలు రాక మూగబోయిన మనసు

ఆర్తితో జాలువారిన 

కన్నీరు ఇంకిపొయింది

మరో కన్నీటి బొట్టు జనిస్తే

నీ అభిషేకానికి వాడుకో మహదేవా

నా ఎదలో చెమ్మతో మీరు 

ఎపుడూ చల్లంగా ఉండాలి


 _హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర!🙏_

మన మనస్సులో కలిగే ఆలోచనలే మన స్వభావాన్ని నిర్మిస్తాయి.*

  *మన మనస్సులో కలిగే ఆలోచనలే మన స్వభావాన్ని నిర్మిస్తాయి.*


*ఎల్లవేళలా భగవంతుణ్ణే స్మరిస్తూ, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మన మనోబుద్ధులు ఆయనకే సమర్పించాలి. అప్పుడు నిస్సంశయంగా ఆయననే పొందుతాము.*


*పవిత్రములైన వాటి గురించి యోచిస్తే, మనం పవిత్రులం అవుతాము.*


*మన హృదయం సదా ప్రేమతో నిండి ఉంటే ద్వేషానికి అక్కడ తావులేదు. అప్పుడు మనలోని శాంతిని ఎవరూ భగ్నపరచలేరు.*


*మనం అజాగ్రత్తగా వ్యవహరిస్తే మన స్వభావం మారిపోగలదు. ఎవరి గురించైనా చెడు తలపు కలిగే ముందు ఆ చెడు మనలో ప్రవేశిస్తుంది.*


*మనం సాధు వర్తనను కలిగి ఉంటే సాధుశీలురం అవుతాము. దాని గురించి యోచిస్తే, ఆ సాధుత్వం మనలో స్ఫూర్తిని కలిగిస్తుంది.*


*మనకు సరియైన త్రోవను చూపుతుంది. మన జీవితాన్నే మార్చివేస్తుంది.*

ధనం పెరిగిన కొద్దీ

  “ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”


వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే, 

ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.


ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...  తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !


అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. 


ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పద్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి.


చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా, ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. 


క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైనత ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.


మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది. 


దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది! ఇది సత్యం ..!!

.

సత్సంగం

  🔔 *సత్సంగం* 🔔


అందరూ రెమెడీస్ చెబుతారు 

దోష నివారణలు చెబుతారు…

గ్రహశాంతులు, క్రియలు, హోమాలు, యజ్ఞాలు, రత్నాలు, తాయెత్తులు…...


మరి"కర్మ, పశ్చాత్తాపం, సేవ, ప్రేమ, క్షమ, బాధ్యత, మౌనం, వివేకం, ఆత్మపరిశీలన, నియమం, త్యాగం, ధర్మం, చైతన్యం… ఇవే ఎందుకు?”


“ఎందుకంటే…

రోగం బయట లేదు.

మనిషి లోపల ఉంది.


గ్రహాలు నీ జీవితాన్ని అంతగా నాశనం చేయవు.

నీ అహంకారం చేస్తుంది.


శని కన్నా భయంకరమైనది

నీ అలసత్వం, నిన్ను నువ్వు నమ్మకపోవడం, భయం..


రాహు కన్నా ప్రమాదకరమైనది

నీ మోహం, స్వార్థం..


కేతు కన్నా విచిత్రమైనది

నీ అయోమయం.


కుజదోషం కన్నా ఎక్కువ ఇళ్ళను కూల్చింది

మనుషుల కోపం.


పితృదోషం కన్నా ఎక్కువ శాపాన్ని ఇచ్చింది

తల్లిదండ్రుల కళ్లలో వచ్చిన కన్నీరు.


అందుకే నేను రెమెడీస్ కంటే

మనిషిని సరిచేసే మార్గం చెబుతాను.


ఎందుకంటే

నీ చేతులతో చేసిన కర్మను, కొబ్బరికాయలు కొడితే దేవుడు తుడిచేయడు.


నువ్వు నాటింది ముల్లు అయితే

పూజలతో పూలు పూయవు.


ఈ సృష్టి అంత చౌక కాదు.


వేదం ‘కర్మణ్యేవాధికారస్తే’ అని చెప్పింది.

ఉపనిషత్తులు ‘యథా కర్మ యథా శ్రుతం’ అని చెప్పాయి.

బుద్ధుడు ‘చిత్తమే మూలం’ అన్నాడు.

అష్టావక్రుడు ‘నీ బంధనానికి కారణం నీ మనసే’ అన్నాడు.


కానీ మనిషి ఏమి కోరుతున్నాడు?


పాపం చేసేందుకు స్వేచ్ఛ…

ఫలితం తప్పించుకునేందుకు రెమెడీ.


కోపం మార్చుకోడు…

కాని కుజశాంతి చేయిస్తాడు.


తల్లిదండ్రులను బాధపెడతాడు…

కాని పితృతర్పణం చేస్తాడు.


భార్యను ఏడిపిస్తాడు…

కాని లక్ష్మీపూజ చేస్తాడు.


మోసం చేస్తాడు…

కాని దోష నివారణ కోసం దేవాలయాలు తిరుగుతాడు.


ఇది ఆధ్యాత్మికత కాదు.

ఇది భయంతో చేసే వ్యాపారం.


నిజమైన పరిహారం ఏమిటో తెలుసా?


ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం.

నిన్ను నమ్మినవారిని మోసం చేయకపోవడం.

తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడం.

అహంకారాన్ని తగ్గించుకోవడం.

కోపం వచ్చినప్పుడు మౌనం పాటించడం.

డబ్బు కన్నా ధర్మాన్ని ఎంచుకోవడం.

రోజు కాసేపు జపం లేదా ధ్యానం చేయడం.


 తల్లిదండ్రులను, భర్తను, పెద్దలను, గురువును, ప్రేమించినవారిని నమ్మడం, గౌరవించడం...


స్వార్థం తగ్గించి సేవ చేయడం.

నిత్యం ఆత్మపరిశీలన చేయడం.


పిల్లలను ప్రేమతో, క్రమశిక్షణ తో పెంచడం..


ఇవే మహా రెమెడీస్.


ఎందుకంటే

దేవుడు నీ చేతిలో రాయి పెట్టలేదు…

బుద్ధి పెట్టాడు.


దేవుడు నీకు తాయెత్తు ఇవ్వలేదు…

వివేకం ఇచ్చాడు.


అందుకే నేను

భయాన్ని కాదు — బాధ్యతను నేర్పుతాను.

రెమెడీని కాదు — రూపాంతరాన్ని చెబుతాను.


ఎందుకంటే

జాతకం మారితే జీవితం కొద్దిగా మారొచ్చు…

కాని

మనిషి మారితే అతని ప్రపంచమే మారిపోతుంది.”


రోజు తప్పకుండా ధ్యానం లేదా జపం చేస్తే - మనని మనం సులువుగా జయించవచ్చు 🙏🏻

_వజ్ర కవచం 1000 కోట్ల కథ_

 _వజ్ర కవచం 1000 కోట్ల కథ_


_శ్రీవారి అత్యంత ఖరీదైన ఆభరణం_


_వజ్ర కవచం అంటే:_  

స్వామివారి శరీరాన్ని పూర్తిగా కప్పే బంగారు కవచం. దీనిపై 28000 పైగా వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగి ఉంటాయి. మొత్తం బరువు సుమారు 30 కేజీల బంగారం. ఇప్పటి విలువ 1000 కోట్లకు పైనే.


_ఎవరు చేయించారు:_  

1930లలో మైసూర్ మహారాజు నాలుగవ కృష్ణరాజ వడయార్ భక్తితో చేయించారు. ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు అయింది.


_ఎప్పుడు తొడుగుతారు:_  

సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే శుక్రవారం నాడు. దీన్నే "వజ్ర కవచ అలంకారం" అంటారు. ఆ రోజు స్వామి దర్శనం మహా అద్భుతం.


_విశేషం:_  

1. వజ్రం ఇంద్రుడి ఆయుధం. ఈ కవచం వల్ల స్వామి శక్తి వంద రెట్లు పెరుగుతుందని నమ్మకం.  

2. ఈ కవచాన్ని ఎప్పుడూ తూకం వేయరు. లెక్క పెట్టరు.  

3. మిగతా రోజుల్లో 6 లాకర్ల భద్రతలో TTD ఖజానాలో ఉంటుంది.


_ఉత్సవమూర్తికి:_  

మలయప్ప స్వామికి కూడా చిన్న వజ్ర కవచం ఉంది. దాన్ని గరుడ సేవ రోజు తొడుగుతారు.


_గమనిక:_  

వజ్ర కవచ అలంకారంలో ఉన్న స్వామి ఫోటోలు TTD వెబ్‌సైట్‌లో చూడవచ్చు. గర్భగుడి దీపాల కాంతి వజ్రాలపై పడి గుడి అంతా వెలిగిపోతుంది.


_ఓం నమో వెంకటేశాయ_ 🙏


🟡🟢🔴🔵🙏🔵🔴🟢🟡

కాలం వేగాన్ని అణచే అంకుశం

 కాలం వేగాన్ని అణచే అంకుశం - ​విష్ణు పాదంలోని కాల రహస్యం..........!!

​మహావిష్ణువు కుడి పాద పద్మంపై రెండు ముఖ్యమైన చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి ఒకటి వజ్రాయుధం, మరొకటి అంకుశం (ఏనుగును నియంత్రించడానికి ఉపయోగించే ఆయుధం).

​సాధారణంగా వీటిని కేవలం ఆయుధాలుగానే చూస్తారు. కానీ, ఇవి కాల గమనానికి మరియు మన ఆత్మకు సంబంధించిన ఒక లోతైన విశ్వ రహస్యాన్ని తమలో దాచుకున్నాయి.


​వజ్రాయుధ చిహ్నం.......

​మార్చలేని కాల నియమం. కాలాన్ని ఎవరూ మార్చలేరు, వంచలేరు; అది వజ్రాయుధంలా అత్యంత బలమైనది. మనం చేసే పుణ్య, పాప కర్మల ఫలాలను కాలం మనకు అత్యంత ఖచ్చితత్వంతో అందిస్తుంది. అయితే, భగవంతుడి పాదాలపై ఉండే ఈ వజ్రాయుధ చిహ్నం దేనికి సంకేతమో తెలుసా? విధి బలీయత వల్ల కలిగే కర్మ ఫలాలను, కాలం యొక్క క్రూరమైన ప్రభావాలను ముక్కలు ముక్కలు చేసే శక్తి కేవలం ఆ పరమాత్ముని పాదాలకు మాత్రమే ఉందనే పరమ రహస్యాన్ని ఇది మనకు బోధిస్తుంది!


​అంకుశ చిహ్నం..........

​కాలాన్ని, మనస్సును లొంగతీసుకోవడం. మదించిన ఏనుగును మావటివాడు ఒక చిన్న అంకుశంతో లొంగతీసుకుంటాడు. ఈ విశ్వంలో మదగజం కంటే వేగంగా పరుగెత్తేది ఏంటో తెలుసా? ఒకటి 'కాలం', మరొకటి మన 'మనస్సు'!

​గత కాలపు బాధల్లో, భవిష్యత్తు గురించిన భయాల్లో చిక్కుకుని మన మనస్సు నిరంతరం పరుగెడుతూనే ఉంటుంది. మహావిష్ణువు తన పాదంలో ఈ అంకుశాన్ని ధరించడం వెనుక ఉన్న రహస్యం ఇదే మనం ఆయన పాదాలను శరణు వేడినప్పుడు, అదుపు లేకుండా పరుగెత్తే మన మనస్సు శాంతిస్తుంది, మనల్ని శాసించే కాలం యొక్క వేగం కూడా అణిగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.


​మన సిద్ధులు (మహర్షులు) చూపిన ఆధ్యాత్మిక మార్గం యొక్క ముఖ్య ఉద్దేశ్యం "మనస్సును ఏకాగ్రం చేయడం" (నిశ్చలం చేయడం). మనస్సు లొంగిపోతే, అక్కడ కాల గమనం ఆగిపోతుంది; మరణం లేని మహాజీవనం లభిస్తుంది. విష్ణు పాదంలోని అంకుశం, మన చంచల బుద్ధిని అణచివేసి, కాలాన్ని దాటి నిలిచే "శాశ్వత బ్రహ్మానంద" స్థితికి మనల్ని నడిపించే ఒక దివ్య సంకేతం.


​కాల చక్రంలో, విధి చేతిలో చిక్కుకుని తల్లడిల్లకుండా ఉండటానికి.. ఆ కాలాన్నే శాసించే పరమేశ్వరుని పాద చిహ్నాలను మన హృదయంలో ప్రతిష్టించుకుందాం! 

​"మనస్సు అనే ఏనుగును ఆయన పాదాలనే అంకుశంతో అదుపు చేద్దాం; కాలాన్ని దాటి ఆ పరబ్రహ్మంలో లీనమవుదాం!"

తాబేలు రావడం వల్ల

 "ఇంట్లోకి తాబేలు రావడం వల్ల దురదృష్టం కలగదు, ఇదొక భ్రమ మాత్రమే".............!!

​భారతీయ లోకజీవనంలో "తాబేలు గనుక ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు వృద్ధి చెందదు" అనే ఒక సామెత ప్రచారంలో ఉంది. ఈ సామెత ఆధారంగా చాలా మంది తాబేలును అశుభానికి, దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కానీ ఈ నమ్మకం నిజంగా నిజమేనా?

​నిజానికి తాబేలు ఏమాత్రం అశుభకరమైన జీవి కాదు. సనాతన ధర్మంలో తాబేలుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. భగవంతుడైన విష్ణుమూర్తి దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం (తాబేలు అవతారం).


 క్షీరసాగర మధనం సమయంలో విష్ణుమూర్తి తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై మోశారు. సాక్షాత్తూ శ్రీహరి స్వరూపంగా భావించే జీవిని అశుభం అని ఎలా అనగలం?

​ఒకవేళ ఎప్పుడైనా తాబేలు మీ ఇంట్లోకి వస్తే, దానికి హాని చేయకండి. ప్రేమతో దానిని సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టండి. అనేక సంప్రదాయాలలో దీనిని విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిల అనుగ్రహానికి సంకేతంగా కూడా భావిస్తారు.


​నిజానికి కాలక్రమేణా ఈ సామెత యొక్క మూల రూపం మారిపోయింది. ప్రాచీన తమిళ సంప్రదాయంలో అసలు సామెత ఇలా ఉండేది.

​"ఆంబి పూసిన ఇల్లు వృద్ధి చెందదు."

​ఇక్కడ "ఆంబి" అంటే కుక్కగొడుగు (మష్రూమ్). కుక్కగొడుగులు సాధారణంగా చీకటి, తేమ, శిథిలావస్థ మరియు కుళ్ళిన ప్రదేశాలలో పెరుగుతాయి. ఏదైనా ఇంట్లో నిరంతరం తేమ, చీకటి మరియు కుళ్లు ఉంటే, అక్కడ రోగాలు, అనారోగ్యం మరియు దరిద్ర వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి ఇల్లు వృద్ధి చెందకపోవడం సహజం.


​కాలక్రమేణా "ఆంబి" అనే పదం యొక్క ఉచ్చారణ మారి "ఆమి" గా, ఆ తర్వాత "ఆమా (తాబేలు)" గా రూపాంతరం చెందింది. దీనివల్ల సామెత యొక్క అసలు అర్థమే మారిపోయింది.

​కాబట్టి తాబేలును తప్పుపట్టడం సరైనది కాదు. అశుభానికి కారణం తాబేలు కాదు, ఇంటి యొక్క అపరిశుభ్రత, చీకటి మరియు తేమ మాత్రమే.


​కూర్మావతార స్తుతి......


​నమామి దేవం కూర్మాఖ్యం

మందరాధారకారకమ్।

సముద్రమంథనే విష్ణుం

భక్తానాం హితకారకమ్॥


​కూర్మ గాయత్రీ మంత్రం.........


​ఓం కూర్మరూపాయ విద్మహే

మహావిష్ణవే ధీమహి।

తన్నో కూర్మః ప్రచోదయాత్॥


​ఎవరైతే శ్రద్ధతో కూర్మావతారాన్ని స్మరిస్తారో, వారి జీవితంలో సహనం, స్థిరత్వం, రక్షణ మరియు విష్ణుమూర్తి అనుగ్రహం నిలిచివుంటాయి.

సోమవతి అమావాస్య

 సోమవతి అమావాస్య


  సోమవారం రోజున వచ్చే అమావాస్య. 

హిందూ ధర్మంలో ఇది అత్యంత పుణ్యప్రదమైన అమావాస్యలలో ఒకటిగా భావించబడుతుంది.


సోమవతి అమావాస్య ప్రాముఖ్యత:

ఈ రోజు పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధం చేయడం ఎంతో శ్రేయస్కరం.

పవిత్ర నదుల్లో స్నానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతాయి.

వివాహిత స్త్రీలు భర్త ఆయురారోగ్యాల కోసం వ్రతం ఆచరిస్తారు.

రావి (అశ్వత్థ) చెట్టుకు ప్రదక్షిణలు చేసి పూజ చేస్తారు.

దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మకం.

వ్రత విధానం

ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి.

సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి.

శివుడు, విష్ణువు, పితృదేవతలను పూజించాలి.

అశ్వత్థ వృక్షానికి జలాభిషేకం చేసి 108 ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ.

ఉపవాసం లేదా ఫలాహారం తీసుకోవచ్చు.

బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి.

ఆధ్యాత్మిక ఫలితాలు

పితృదోష నివారణకు ఉపకరిస్తుందని విశ్వాసం.

కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం.

పాపక్షయం మరియు పుణ్యప్రాప్తి కలుగుతాయని పురాణాలు పేర్కొంటాయి.

2026లో సోమవతి అమావాస్య

2026 సంవత్సరంలో జూన్ 15, సోమవారం రోజున సోమవతి అమావాస్య వస్తోంది.


సోమవతి అమావాస్య పూజా విధానం :

తేదీ: 15 జూన్ 2026, సోమవారం

సంకల్పం

స్నానం చేసి, తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖంగా కూర్చుని ఇలా సంకల్పం చేయండి:

"మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, పితృదేవతానుగ్రహ సిద్ధ్యర్థం, కుటుంబ క్షేమ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సోమవతి అమావాస్య వ్రతం కరిష్యే."

పూజా సామగ్రి

పసుపు, కుంకుమ

పూలు

దీపం, అగరుబత్తులు

పండ్లు

కొబ్బరికాయ

నువ్వులు

అక్షింతలు

తులసి దళాలు (విష్ణు పూజకు)

పూజా క్రమం

గణపతి ప్రార్థన

శివ పూజ

విష్ణు పూజ

పితృ తర్పణం (తెలిసినవారు చేయవచ్చు)

అశ్వత్థ (రావి) వృక్ష పూజ

దీపారాధన

నైవేద్యం

హారతి

శివ ప్రార్థన

ఓం నమః శివాయ

108 సార్లు జపించవచ్చు.

విష్ణు ప్రార్థన

ఓం నమో నారాయణాయ

108 సార్లు జపించవచ్చు.

పితృ తర్పణం కోసం సరళ ప్రార్థన

"మా పితృదేవతలు సంతుష్టులై మమ్మల్ని అనుగ్రహించుగాక."

రావి చెట్టు ప్రదక్షిణ

సాధ్యమైనంత వరకు 11, 21 లేదా 108 ప్రదక్షిణలు చేయండి.

ప్రతి ప్రదక్షిణ సమయంలో:

ఓం నమో భగవతే వాసుదేవాయ

అని జపించవచ్చు.

దానం చేయవలసినవి

నువ్వులు

బియ్యం

వస్త్రాలు

పండ్లు

అన్నదానం

అమావాస్య రోజున చదవదగిన స్తోత్రాలు

విష్ణు సహస్రనామం

శివ పంచాక్షరి స్తోత్రం

ఆదిత్య హృదయం

గరుడ పురాణంలోని పితృ స్మరణ శ్లోకాలు

విశేష ఫలితం

సోమవతి అమావాస్య రోజున స్నానం, జపం, పూజ, పితృతర్పణం, దానం చేయడం ద్వారా పితృ అనుగ్రహం, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి.

శుభమస్తు. శ్రీ పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు, పితృదేవతల అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

తెలివితేటలు పొందటానికి

 *తెలివితేటలు పొందటానికి ఒక దేవత, ధనాన్ని పొందటానికి ఒక దేవత, అందాన్ని పొందటానికి మరో దేవత, ఈ విధంగా ఒకొక్క ఫలం పొందటానికి ఒకొక్క దేవతను ఆరాధించి అర్చించి, ఆశ్రయించి అన్ని విధాలైన సౌకర్యాలను పొంది కోర్కెలను తీర్చు కొనవచ్చును.


*కాని, ఈ విధంగా పొందినవన్నీ, తాత్కాలిక సుఖాలను పరిమిత కాలానికే ఇస్తాయి కానీ, శాశ్వతానందాన్ని ప్రసాదించలేవు.


*దేనిని పొందితే ఇక పొందవలసినది ఉండదో -దేనిని పొందకపోతే ఇంకా పొందవలసిందేదో పొందలేదనే భావన ఉంటుందో - అటువంటి శాశ్వతమైన ఆనందాన్ని పొందటమే ప్రతి జీవి యొక్క పరమావధి.


*సులభ సాధ్యం కాని ఇట్టి ఆనందాన్ని పొందటానికి, శివుని దగ్గర, బ్రహ్మేంద్రాది దేవతలందరూ కాచుకొని వుంటారు.


*శ్రీ శంకరుల వంటి సద్భక్తులు, మిగిలిన వారి సేవను గాని, అందువలన వచ్చే క్షుద్రలాభాలను గాని, కోరరని అర్ధం.

తిరువణ్ణామలై

  *🛕🔥 తిరువణ్ణామలై అష్ట లింగాల చరిత్ర & మహిమ 🔥🛕*


🌸 అరుణాచలం గిరి ప్రదక్షిణలో

అష్ట దిక్కులకు అష్ట లింగాలు కొలువై ఉన్నాయి 🙏

ప్రతి లింగాన్ని ఒక్కో దిక్పాలకుడు ప్రతిష్టించాడని పురాణ విశ్వాసం ✨


━━━━━━━━━━━━━━━


🔸 1. ఇంద్ర లింగం 🌤️

📍 దిక్కు: తూర్పు

📖 చరిత్ర: దేవేంద్రుడు తన అహంకారం తొలగించుకోవడానికి ఈ లింగాన్ని ప్రతిష్టించి శివుని ప్రార్థించాడని చెబుతారు.

🌸 ఫలితం: ఐశ్వర్యం, గౌరవం, పదవి.


🔸 2. అగ్ని లింగం 🔥

📍 దిక్కు: ఆగ్నేయం

📖 చరిత్ర: అగ్ని దేవుడు తన పాప విమోచన కోసం ఈ లింగాన్ని ఆరాధించాడని పురాణం.

🌸 ఫలితం: పాప విమోచనం, ఆరోగ్యం, శక్తి.


🔸 3. యమ లింగం ⚔️

📍 దిక్కు: దక్షిణం

📖 చరిత్ర: యమధర్మరాజు శివుని కృప కోసం ఈ లింగాన్ని ప్రతిష్టించాడని విశ్వాసం.

🌸 ఫలితం: ఆయురారోగ్యం, భయ నివారణ.


🔸 4. నిరృతి లింగం 🌑

📍 దిక్కు: నైరుతి

📖 చరిత్ర: నిరృతి దేవత దుష్టశక్తుల నివారణ కోసం శివుని ప్రార్థించింది.

🌸 ఫలితం: దోష నివారణ, శత్రు బాధల తొలగింపు.


🔸 5. వరుణ లింగం 🌊

📍 దిక్కు: పడమర

📖 చరిత్ర: వరుణ దేవుడు వర్షాలు, జీవజాల రక్షణ కోసం ఈ లింగాన్ని పూజించాడని చెబుతారు.

🌸 ఫలితం: మనశ్శాంతి, ఆరోగ్యం.


🔸 6. వాయు లింగం 🌬️

📍 దిక్కు: వాయవ్యము

📖 చరిత్ర: వాయుదేవుడు ప్రాణశక్తి కోసం శివుని ప్రార్థించాడు.

🌸 ఫలితం: ఉత్సాహం, శ్వాస సంబంధిత ఉపశమనం.


🔸 7. కుబేర లింగం 💰

📍 దిక్కు: ఉత్తరం

📖 చరిత్ర: ధనాధిపతి కుబేరుడు సంపద రక్షణ కోసం ఈ లింగాన్ని ప్రతిష్టించాడని విశ్వాసం.

🌸 ఫలితం: ధనం, వ్యాపారాభివృద్ధి.


🔸 8. ఈశాన్య లింగం 🕉️

📍 దిక్కు: ఈశాన్యం

📖 చరిత్ర: ఈశాన దేవత ఆధ్యాత్మిక జ్ఞానం కోసం శివుని ఆరాధించింది.

🌸 ఫలితం: జ్ఞానం, మోక్షం, ఆధ్యాత్మిక శక్తి.


━━━━━━━━━━━━━━━


🙏 అష్టలింగాలను దర్శిస్తూ

గిరి ప్రదక్షిణ చేస్తే

✨ అనంత కోటి పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం 🌸

సోమవారం శివపూజ …

 *సోమవారం శివపూజ …*

                  *శివానుగ్రహం*

                


*శివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!*


*రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...*


*మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...*


*జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూపమే.*


*శబ్దం ఆకాశానికి ప్రాణం, శబ్దంలోనే కదా నటరాజు ధ్వనించేది! డమరుక నాదంలో వినిపించే మాహేశ్వర సూత్రాలన్నీ శివస్వరూపాలే...*


*శివపూజకు ఏ ఆడంబరాలూ అవసరం లేదు... ప్రకృతి నుంచి లభించే పత్రి, పుష్పం, పండు, నీళ్లు... ఇవే శివుడికి ప్రీతిదాయకాలు.*


*‘హరహరా’ అంటూ నీటితో అభిషేకిస్తే చాలు, ఎంతో తృప్తిచెంది పాపాలను హరిస్తాడు...*


*బిల్వదళాలనే పట్టువస్త్రాలుగా భావిస్తాడు, పువ్వులను అలంకరిస్తే చాలు, మనసును ఇచ్చినంతగా సంతోషపడతాడు...*


*ఒక్క పండు ఇస్తే జీవితాన్నే సఫలం చేస్తాడు, అందుకే అతణ్ని బోళాశంకరుడంటారు...*


*రుద్రాభిషేకాలు పుణ్యదాయకాలు, యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలో ఈ ప్రపంచం అంతా రుద్ర గణాలతో నిండి ఉందనే వర్ణనలున్నాయి...*


*ఆ రుద్రగణాలన్నింటికీ అధిపతి శివుడు, అందుకే అతడు రుద్రుడు...*


*రుద్రాధ్యాయంలో రెండు భాగాలున్నాయి, ఒకటి నమకం. రెండోది చమకం...*


*‘నమః’ అనే పదంతో రుద్రుణ్ని స్తుతించేది కనుక ఇది నమకం...* 


*‘చ’ కారంతో శివుడి విశ్వరూపాన్ని స్తుతించిన భాగం కనుక అది చమకం.*

 

*ఒక్కొక్క భాగంలో పదకొండు అనువాకాలు (మంత్ర సముదాయాలు) ఉంటాయి...*

*అందుకే ఏకాదశరుద్రులు అనే ప్రసిద్ధి, శివుడి పూజలో పదకొండు సంఖ్య ఎంతో విశిష్టం...*


*శివుడి పూజకు నిర్మలమైన మనసు ఉంటే చాలు, మానసపూజకే శివుడు ప్రసన్నుడవుతాడు. మనసు ఏర్పడాలంటే భక్తి ఉండాలి, భక్తి అంటే మానసికంగా దగ్గర కావడమే..*


*శివుణ్ని పూజిస్తున్నంతసేపూ శివసంకీర్తనంతో ‘సారూప్యముక్తి’ లభిస్తుంది.*


*శివభక్తులు చేసే పూజల్లో పాల్గొంటూ వాళ్లతో సంభాషిస్తుంటే ‘సామీప్యముక్తి’ వస్తుంది...*


*శివస్వరూపం అయిన ఈ చరాచరప్రకృతిలో జీవిస్తున్నందువల్ల మనిషికి ‘సాలోక్యముక్తి’ సాధ్యం.*


*శివుణ్ని వీడకుండా ఉండే మనసు వల్ల ‘సాయుజ్యముక్తి’ సంప్రాప్తించినట్లే...!*


*మనిషి మోహం అనే అడవిలో దారీతెన్నూ తెలియక తిరుగుతుంటాడు. అతణ్ని బాల్యంలో, కౌమారంలో, యౌవనంలో, వార్ధక్యంలో వ్యామోహాలు వెంటాడుతుంటాయి.*


*వాటినుంచి తప్పించుకోవడం అతడికి అంత సులభం కాదు, శివతత్త్వాన్ని చక్కగా తెలుసుకుంటే మోహం తొలగిపోతుంది, యథార్థం తెలుస్తుంది...*


*సోమవారం చంద్రుడికి నెలవు...!!!* 

*కనుక ప్రతీ సోమవారం చంద్రకళాధరుడి పూజ ఐహికాముష్మిక ఫలదాయకం.. https://chat.whatsapp.com/EPYbxih5n1q5IKzJfslLb5

చింత చిగురు

 చింత చిగురు

దాని వల్ల కలిగే ప్రయోజనాలు ...


చింత చచ్చినా పులుపు చావలేదు… అన్న సామెతను మీరు వినే ఉంటారు.


చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. 


1. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది.


2. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట రాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట రాల్ను పెంచుతుంది.


3. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి.


4. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.


5. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.


6. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.


7. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.


8. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది.


9. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి.


10. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.


11. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.


12. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


13. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.


14. ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.


15. చింత చిగురును పేస్ట్లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.


16. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది.


17. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

శ్రీమహావిష్ణుపురాణం

 



         *శ్రీమహావిష్ణుపురాణం*

                ➖➖➖✍️ 

                119 వ భాగం 


*శ్రీకృష్ణావతారము-21.*

*కౌరవ పాండవుల కలహం - *శకుని మాయాజూదం - 

*ద్రౌపదికి అవమానం - 

*పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు -

*కురుక్షేత్రం - 

*ధర్మరాజు పట్టాభిషేకం```

రాజసూయ యాగంలో పాండవుల ఐశ్వర్యవైభోగం చూసి దుర్యోధనుడు బాగా అసూయ చెందాడు. మయసభలో జరిగిన అవమానం మరింత రగిలేటట్టు చేసింది. తన సహచరులైన శకుని, కర్ణుడు, దుశ్శాసనులతో దుర్యోధనుడు “పాండవులను రాజ్య సంపదలు తీసుకుని బికారులను చేయాలి! ద్రౌపది చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి! ఇందుకు ఏమి చేయాలన్న చేస్తాను! చెప్పండి!" అని అడిగాడు. 


కర్ణుడు పాండవుల పై యుద్ధం చేసి గెలిచి రాజ్యం తీసుకుంటామని చెప్పగా శకుని "కృష్ణుడి అండ ఉండగా, పాండవులను జయించటం కష్టమని" అన్నాడు. 


రాజసూయంలో కృష్ణుడు మహా వీరుడైన జరాసంధుని, శిశుపాలుని వధించిన విషయం గుర్తు చేసాడు. తనకు మాయాజూదం వచ్చునని, ఎవరైనైనా జూదంలో ఓడించగలనని చెప్పాడు. కృష్ణుడు పాండవుల దగ్గర లేని సమయంలో ధర్మరాజుని జూదక్రీడకు హస్తినాపురం రమ్మని 

ధృతరాష్ట్రుడి ద్వారా ఆహ్వానం పంపమన్నాడు.


ధర్మరాజుకి జూదం ఆడే అలవాటు ఉంది. రాజుగా పెదనాన్న ధృతరాష్ట్రుడు పంపిన ఆహ్వానం తిర స్కరించలేక హస్తినాపురం వస్తాడు. జూదంలో రాజ్యం, పాండ వులైదుగురితో పాటు ద్రౌపదిని పందెంగా పెట్టించి గెలిచి దుర్యో ధనుడికి కానుకగా ఇస్తాను. మయసభలో చేసిన అవమానానికి ద్రౌపది పై నిండుసభలో ప్రతీకారం తీర్చుకోవచ్చును" అని మాట ఇవ్వడంతో దుర్యోధనుడికి ఆనందం కలిగింది.


శకుని ప్రతిపాదనకు అంగీకరించిన దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రుని ఒప్పించి విదురుని ఇంద్రప్రస్థం పంపి జూద క్రీడకు హస్తినాపురం రమ్మని ఆహ్వానించాడు.  


ధర్మరాజు అంగీకరించి పాండవులు, ద్రౌపది, కుంతీదేవితో కలసి హస్తినాపురం వెళ్లాడు. 

భీష్మ ద్రోణాదులు "దాయాదుల మధ్య జూదం మంచిది కాదు" అని ధృత రాష్ట్రునికి హితబోధ చేసినా పట్టించుకోకుండా, పుత్రవ్యామోహంతో దుర్యోధనుడి మాట మేరకు జూదక్రీడ ఏర్పాటు చేసాడు.


పాండవుల తరపున ధర్మరాజు, కౌరవుల తరపున శకుని జూద క్రీడలో పాల్గొన్నారు. మొదట చిన్న చిన్న పందాలు ధర్మరాజు గెలిచేలా చేసి శకుని ధర్మరాజు అతిశయాన్ని పెంచాడు. తరువాత కౌరవుల రాజ్య సంపదలు పందెంగా పెట్టి శకుని ధర్మరాజుని పాండవుల రాజ్య సంపదలు పందెంగా పెట్టించాడు. మాయా పాచికలతో శకుని పందెం గెలిచి పాండవుల రాజ్యం, సంపదలు గెలిచాడు. తరువాత ధర్మరాజుని ప్రేరేపిస్తూ పాండవులైదుగురిని ఒక్కొక్కరుగా పందెం పెట్టించి గెలిచాడు. చివరికి ద్రౌపదిని కూడా ధర్మరాజు చేత పందెంగా పెట్టించి గెలిచాడు.


దుర్యోధనుడు "నాడు మయ సభలో తనను చూసి నవ్విన ద్రౌపదిని నిండుసభకు పిలిపించి అవమానించి ప్రతీకారం తీర్చు కుంటానని" ప్రకటించాడు. దుశ్శాసనుని ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభకు ఈడ్చుకు రమ్మని ఆదేశించి పంపాడు. భీష్మ ద్రోణాదులు, విదురుడు మొదలైన పెద్దలు ఏమి చేయలేక తలలు వంచుకుని మౌనంగా కూర్చున్నారు. ఓడిన పాండవులు తలలు దించుకుని కూర్చున్నారు.


నిండుసభలో దుర్యోధనుడి ఆదేశం ప్రకారం దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రములు బలవంతంగా లాగివేసి వివస్త్రను చేసే ప్రయత్నం చేశాడు. ద్రౌపది కృష్ణుని ప్రార్ధించడంతో ద్రౌపదికి అనంతమైన వస్త్రములను ప్రసాదించాడు. దుశ్శాసనుడు వస్త్రములన్ని లాగలేక, విప్పలేక అలసి సృహతప్పి పడ్డాడు. కృష్ణుడి లీలకు భయపడిన ధృతరాష్ట్రుడు ద్రౌపదికి పాండవులను బానిసత్వం నుండి విముక్తులను చేసి రాజ్యసంపదలతో కలిపి తిరిగి ఇచ్చేశాడు.


కోపంగా ఉన్న భీముడు యుద్దంలో ద్రౌపదిని అవమానించిన దుశ్శా సనుని రొమ్ము చీల్చి వచ్చిన రక్తంతో ద్రౌపది కురులను సవరిస్తానని, ఊరువులపై వచ్చికూర్చోమని సంజ్ఞ చేసిన దుర్యోధనుడి తొడలు విరుస్తానని సభలో అందరిముందు ప్రతిజ్ఞ చేసాడు. భీముడి ప్రతిజ్ఞకు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు.  

అది చూసిన శకుని పాండవులకు రాజ్యసంపదలు లేకుండా చేస్తే వారు బలహీనులై దుర్యోధన దుశ్శాసనులను ఏమీ చేయలేరని చెప్పి ధర్మ రాజుని తిరిగి జూదానికి ధృతరాష్ట్రుడు ఆహ్వానించేలా చేశాడు.


"ఈ సారి పందెంగా జూదంలో ఓడి పోయిన వారు పన్నెండు ఏళ్లు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాత వాసంతో దొరికిపోతే తిరిగి అరణ్యవాసానికి వెళ్ళాలి. పాండవులు ఈవిధంగా ఎప్పటికి రాజ్యం లభించక అరణ్యంలోనే ఉంటారు. యుగ నియమం ప్రకారం పదమూడు ఏళ్ళు దూరంగా ఉన్నవారు వారసత్వ హక్కు, ఆస్తి హక్కు కోల్పోతారు. కనుక మీ కుమారులు దుర్యోధనుడికి, దుశ్శాసనునికి భీముడి వలన ప్రాణహాని ఉండదు" అని శకుని చెప్పడంతో ధృతరాష్ట్రుడు జూదానికి, జూద నియమానికి అంగీకరించాడు.


శకుని మాయాజూదంతో ధర్మరాజు సర్వస్వం ఓడి తమ్ముళ్ళు, ద్రౌపదితో అరణ్యవాసానికి బయలుదేరి వెళ్లాడు. కుంతీదేవి విదురుని ఇంటిలో ఉండసాగింది. 


కృష్ణుడు సత్యభామతో వచ్చి అరణ్యవాసంలో ఉన్న పాండవులను కలిసి ధైర్యం చెప్పాడు. ధర్మానికి, నీతికి, న్యాయానికి కట్టుబడిన వారికే అంతిమ విజయం లభిస్తుంది అని ప్రకటించాడు. 


రాబోయే కౌరవ పాండవుల యుద్ధంలో గెలవడానికి అర్జునుడు దివ్య ఆయుధాలు కలిగి ఉండాలి. కావున శివుని అనుగ్రహం పొంది పాశుపతాస్త్రం సంపాదించమని తపస్సుకి అర్జునుని కృష్ణుడు పంపాడు. 


శివుడు తన కోసం తపస్సు చేస్తున్న అర్జునుని కిరాతుడి రూపంలో వచ్చి పరీక్షించి కోరిన పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఇంద్రాది దేవతలు కూడ ప్రత్యక్షమై అర్జునుడికి తమ పేరులతో ఐంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైనవి ఇచ్చారు.


ఇంద్రుడు తన అంశగా జన్మించిన అర్జునుని కొన్ని రోజులు తనతో గడపమని స్వర్గలోకం తీసుకు వెళ్లాడు. అక్కడ ఊర్వశిని అర్జునునికి నాట్యం నేర్పించమని ఆదేశించాడు. ఊర్వశి నాట్యం నేర్పతూ అర్జునుడిపై మోహం చెంది తనతో గడపమనగా అర్జునుడు తిరస్కరించాడు. ఆగ్రహించిన ఊర్వశి అర్జునుని నపుంసకుడివి కమ్మని శాపం ఇచ్చింది. 

ఇంద్రుడు వచ్చి ఊర్వశి శాపం ఒక సంవత్సరం ఉంటుందని, అజ్ఞాతవా సంలో శత్రువులు గుర్తు పట్టకుండా ఆ శాపాన్ని ఉపయోగించుకొమ్మని శాపవిమోచనం చెప్పాడు.


పాండవులు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసం చేయడానికి విరాట దేశం వెళ్లారు. అక్కడ మారువేషాలలో విరాటరాజు కొలువులో చేరారు. విరాటుడు బావమరిది అయిన కీచకుడు (సింహబలుడు) మహారాణి వద్ద సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని మోహించి తన దగ్గరకు పంపమన్నాడు. భీముడు ఆడవేషంలో వెళ్లి కీచకుని సంహరించాడు.


అరణ్య అజ్ఞాతవాసాలు దిగ్విజయంగా పూర్తి చేసిన పాండవులు తమ రాజ్య భాగం ఇవ్వమని కృష్ణుని రాయబారిగా దుర్యోధనుడి వద్దకు పంపారు. కృష్ణుడు ధృతరాష్ట్ర భీష్మ ద్రోణ దుర్యోధనాదులకు పాండవుల రాజ్యం ఇచ్చివేస్తే కౌరవ పాండవులు ప్రశాంతంగా జీవించవచ్చును అని చెప్పాడు. యుద్దంవలన అపార జన నష్టం జరుగుతుంది. ఎవరికి ప్రయోజనం ఉండదు. కనీసం ఐదుగురు పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇమ్మని అడిగాడు.


దుర్యోధనుడు సంధి ప్రతిపాదన తిరస్కరించి యుద్దానికి సిద్దం అని ప్రకటించాడు. రాయబారిగా వచ్చిన కృష్ణుడినే బంధించటానికి ప్రయత్నించాడు. కృష్ణుడు విశ్వ రూపం ప్రదర్శించి దుర్యోధనాదులను సృహ తప్పించి "యుద్దంలో కౌరవుల సర్వనాశనం తప్పదు" అని ధృతరాష్ట్రుని హెచ్చరించి వచ్చేసాడు.


పాండవులు ఏడు అక్షోహిణిల సైన్యంతో, కౌరవులు పదకొండు అక్షౌహిణల సైన్యంతో కురుక్షేత్రంలో యుద్దానికి సిద్దమైయ్యారు. భీష్ముడు కౌరవ సేనాధిపతిగా ధృష్టద్యుమ్నుడు పాండవుల సేనాధిపతిగా సేనలను నడిపించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారధిగా ఉండి యుద్దతంత్రం నడిపించాడు. పద్దెనిమిది రోజులు జరిగిన యుద్దంలో భీష్మ ద్రోణ కర్ణ అభిమన్యదుశ్శాసనాది వీరులందరు మరణించారు.


పాండవులు ఐదుగురు, కృష్ణుడు పాండవుల పక్షాన, దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ నలుగురు కౌరవుల పక్షాన మిగిలారు.


ప్రాణభీతితో సరస్సులో దాగిన దుర్యోధనుని కృష్ణుడు ధర్మరాజు చేత రెచ్చగొట్టించి బయటకు రప్పించాడు. భీముడికి దుర్యోధనుడికి ద్వంద్వ గదా యుద్దం ఏర్పాటు చేశాడు. భీమునికి ద్రౌపది అవమానం చేసిన సమయంలో చేసిన ప్రతిజ్ఞ గుర్తుచేసి గదతో దుర్యోధనుడి తొడలు విరగ గొట్టించాడు. దుర్యోధనుడు మరణించాడు. హస్తినాపురం పాండవులతో వెళ్లి ధర్మరాజుని పట్టాభిషిక్తుని చేశాడు. పాండవులతో కొంతకాలం గడిపి కృష్ణుడు ద్వారక చేరుకున్నాడు.✍️```

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

సుందరకాండ-హనుమ*



         *సుందరకాండ-హనుమ*

                  ➖➖➖✍️

                   23 వ భాగం 


*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*

*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై*

*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో*

*నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః*


*సీతమ్మ తల్లి శోకం*```

*సీతమ్మ తల్లి అశోకవనములో నిస్సహాయురాలై కృంగి కృశించి పోయి భయంతో వణుకుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కూర్చుంది. ఏకజట, హరిజట, ప్రఘన, వికట, దుర్ముఖి, వికృత, పింగళ, కలహప్రియ మొదలగు రాక్షస స్త్రీలందరూ సీతమ్మను నానా విధములుగా ప్రలోభపెడుతున్నారు. అందరకీ ఒకే మాటతో సమాధానం చెప్పింది సీతమ్మ తల్లి. అక్కడ వున్న హరిజట, నేను సీతను చూసిన మరుక్షణం నుండి నాకు యీమెను భక్షించాలని కోరిక కలుగుతోంది, కత్తులు తీసుకురండి, యీమెని ఇప్పుడే నరికి ముక్కలు చేసి భక్షిద్దాం, ఉపవాసం చేయడం వలన మరణించిందని మన ప్రభువుతో చెప్పండి. యిప్పుడే చెబుతున్నా, శిరస్సు గుండె నాది, చేతులు నీవి, కాళ్ళు నీవు యని సీతమ్మను వధించి భాగాలు యెలా పంచుకోవాలో భాగాలు వేసింది. భయంకరమైన రూపాలతో వున్న వారందరినీ చూసి భయంతో కంపిస్తూ అశోక వృక్షం యొక్క కొమ్మలను పట్టుకుని విలపిస్తూ వుంది.


*శ్రీరామచంద్రా, లక్ష్మణా, కౌసల్యాదేవీ, సుమిత్రా దేవి, నాకెందుకీ దైన్యమైన స్థితి పట్టింది, రామునికి దూరమైన ఈ బ్రతుకు విషస్పర్శం తగిలిన దేహంలా వుంది. రాముడు వస్తాడనే ఆశ నశిస్తోంది. యిక నేను ఆత్మాహుతి చేసుకోవడం మేలు, యింత దుఃఖంలో కూడా నేను మరణించలేదంటే బహుశా నా గుండెను బ్రహ్మదేవుడు రాతితో చేసి వుంటాడు. ఏది యేమైనా నా యెడమ కాలు గోటితో కూడా రావణుని తాకను. శరణాగతవత్సలుడైన నా నాధుడు యింకా యెందుకు రాలేదో అర్థం కావడం లేదు. రావణుడు నను అపహరించుకు వచ్చిన క్షణం నుండి ఆయన నామమే జపిస్తున్నా, రావణుని సంహరించగల సామర్థ్యం కల నా రాముడు యెందుకింత ఆలస్యం చేస్తున్నాడు. బహుశా నేనిక్కడ వున్న విషయం నా రామునికి తెలియదేమో, తెలిసివుంటే యీపాటికి రావణ సంహారం చేసి నను రక్షించేవాడు, రామునికి రావణుడు అపహరించాడనే వార్త తెలియజేయడానికి లేకుండా రావణుడు జటాయువును సంహరించాడే, యీనాడు నేను శోకిస్తున్నట్లు వీరంతా విలపిస్తారు. శ్రీరాముని కంటబడిన ఉత్తరక్షణం లంకా నగరం దహనం కావడం తథ్యం. యీ లంకలో యింటింటా త్వరలో ఆర్తనాదాలు తప్పవు. రామబాణం నుండి జ్వలించే అగ్నికి ఈ రావణ కుంభకర్ణ మొదలగు వీరులందరు నశిస్తారు. యింతవరకు శ్రీరామునికి నేను బ్రతికి వున్నానో లేదో తెలియదు. నేను లేని జీవితం వ్యర్ధమని తలచి అస్త్ర సన్యాసం చేసి వానప్రస్థం స్వీకరించాడా, లేక యీ రావణుడు మాయచేసి నను తీసుకువచ్చిన విధముగా వారిని మాయచేసి సంహరించాడా, యిటువంటి దుర్దశ నాకెందుకు కలిగింది. రాముడు లేని జీవితం నాకెందుకు. యింత బాధలో నాకు మరణం యెందుకు సంభవించడం లేదు. మనోనిగ్రహ సంపన్నులు, రాగద్వేషాతీతులు, పాపరహితులు అయినటువంటి మహర్షులు యెంతటి ధన్యజీవులు, దుర్మార్గుడైన ఈ రావణుని చేతిలో మరణం కన్నా ఆత్మాహుతి మేలు" అని విలపించసాగింది. యీ మాటలు విన్న కొంతమంది రాక్షసి స్త్రీలు రావణునికి యీ మాటలు చేరవేయడానికి వెళ్ళారు. యివన్నీ చూసిన స్వామి హనుమ మనసు చలించి పోయింది. దుఃఖం పొర్లిపోయింది. అయ్యో శ్రీరాముని పట్టమహిషి జానకీ మాతకు యెంతటి కష్టం కలిగింది. పది నెలలు పాటు యీ భయంకర రాక్షసి మూక మధ్య యెన్ని బాధలు భరిస్తూ ఉపవాసం చేస్తూ జీవిస్తోందని చింతించారు స్వామి.✍️(సశేషం)```

*జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్*

*జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

వంటింటి చిట్కాలు part 2

  వంటింటి చిట్కాలు part 2

=================

పోపుల పెట్టె లో దాగున్న మరిన్ని ఆరోగ్య రహస్యాలు మరికొన్ని మనం తెలుసుకుందాం. వాస్తవానికి ఇవి అన్నీ మనకి తెలిసినవే అయినా మనం పాటించడం మానేసాము.


పేరిన నెయ్యి లో కాసింత బెల్లం వేసుకుని తింటే గొంతు గర గర తగ్గుతుంది. అదే విధంగా తమలపాకులు పరగడుపునే తింటే కఫం తగ్గుతుంది అని చెప్పేవారు. తమలపాకులు తడిపి నుదిటిపై పెట్టుకుంటే తల నొప్పి మటు మాయం అవుతుంది. ఈ మధ్య పెళ్ళిళ్ల ల్లో తములపాకుల బజ్జిలు వేయడం ఎక్కువ అయ్యింది.మంచిదే తమలపాకులు ఎక్కువ వాడటం. అయితే అతి సర్వత్రా వర్జినియేత్ మరువకండి...దేనికీ అతి పని చేయదు.


అన్నం అరుగుదలకు కూడా తమలపాకులు బాగా పనిచేస్తాయి. అందుకే పూర్వం భోజనం తరువాత తాంబూలం తప్పనిసరిగా వేసుకునే వారు.


ఐరన్ లోపం ఉంటే తమలపాకులు లో పాత బెల్లం వేసుకుని రెండు ఆకులు తింటే నీరసం తగ్గుతుందని చెప్పెవారు.

 అందుకే ప్రతి ఇంట్లో తమలపాకులు పాదు ఉండాలి. పెంచడం కూడా చాలా సులభం.


పిల్లలు పుట్టని దంపతులకి మినప సున్ని ఉండలు పెట్టే వారు. పాలు లొ యాలకులు వేసి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.


పిలల్లు నీరసం గా, బలం లేకుండా ఉంటే ప్రతీ రోజు పప్పు అన్నం లో ఆవు నెయ్యి ఎక్కువ గా వేసి పెట్టే వారు.ఆవు నెయ్యి ఎక్కువ గా పిల్లలకు పెట్టడం వల్ల మేధస్సు పెరుగుతుంది.


 బలం తక్కువగా ఉండి ఎప్పుడు నీరసం గా, చె లాకీ తనం లేకుండా ఉండే వారికి వారం లో రెండు మూడు రోజులు గారెలు నేతిలో లో వేయించి పెట్టిన మంచి బలం కలుగు తుందని చెప్పేవారు. మరి ఎక్కువ గా తింటే కడుపు ఉబ్బరం తగ్గడానికి అల్లం రసం లేదా అల్లం పచ్చడి వాడమని చెప్పేవారు.


ఇంతకు ముందు తరం బలం గా ఆరోగ్యం గా ఉండటానికి కారణం వారు తీసుకునే బలమైన ఆహారంమే.


కాళ్ళు నొప్పులు గా ఉంటే కొబ్బరి నూనె తో కాళ్ళు మర్ధనా చేసుకుని వేడినీటిలో నిమ్మకాయ చెక్క పిండి ఒక పదినిముషాలు కాళ్ళు మునిగే వరకూ వేడి నీటిలో ఉంచితే కాళ్ళు నొప్పులు తగ్గుతాయని చెబితే అర్చర్యం కలుగుతుంది....నిమ్మకాయ బదులు ఉప్పు వేసుకుంటే కాళ్ళు పగుళ్ళు తాగుతాయి.


ఇలా ఇలా అనేక చిట్కాలు... నేను స్వయంగా చూసాను...వీలైతే తప్పకుండ ఆచరించండి...

వంటింటి చిట్కాలు మరువ కండి. ఇది పెద్దలు మనకి ఇచ్చిన ఆస్తి.....


*సురేష్ వంకాయలపాటి*

వంటింటి చిట్కాలు part 3

 వంటింటి చిట్కాలు part 3


ఆవాలు( mustardseeds 

 =================

మన భారతీయ వంటింటిలో చాలా సాధారణంగా ఉపయోగించే పదార్థం. చిన్నగానే కనిపించినా, ఇవి పోషక విలువలతో నిండి ఉంటాయి. 

ఆవాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి.


మొదటగా, ఆవాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.


 భోజనం చేసిన తరువాత జీర్ణ సమస్యలు, వాయువు, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.


 ఆవాలలో ఉండే సహజ తైలాలు కడుపు రసాలను ఉత్పత్తి చేయడంలో సహకరిస్తాయి.


రెండవది, ఆవాలు శరీరానికి వేడి ఇస్తాయి. చలికాలంలో ఆవాల పొడి లేదా ఆవాల నూనె ఉపయోగించడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి.


 ఛాతి మీద ఆవాల నూనె రాయడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు కొంతవరకు ఉపశమనం పొందుతాయి.


మూడవది, ఆవాలు నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పులు, వాతం వంటి సమస్యలలో ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది.


అలాగే, ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మానికి కూడా ఆవాల నూనె ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచి, పొడిబారకుండా కాపాడుతుంది.


మొత్తానికి, ఆవాలు చిన్నవైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధంగా చెప్పవచ్చు. అయితే, మితంగా ఉపయోగించడం మంచిది. అధికంగా తీసుకుంటే కొన్ని సందర్భాలలో కడుపు సమస్యలు రావచ్చు.


*సురేష్ వంకాయలపాటి*

మా కామాఖ్య అంబుబాచి మేళా 2026

 మా కామాఖ్య అంబుబాచి మేళా 2026

​భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శాక్త మరియు తాంత్రిక పండుగలలో ఒకటైన 'మా కామాఖ్య అంబుబాచి మేళా 2026', గౌహతిలోని నీలాచల్ కొండపై ఉన్న ప్రముఖ కామాఖ్య ఆలయంలో 2026 జూన్ 22 నుండి జూన్ 26 వరకు జరగనుంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అంబుబాచి మహాయోగం 2026 జూన్ 22 రాత్రి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఆలయ గర్భగుడిని సాంప్రదాయబద్ధంగా మూసివేస్తారు, ఇది మా కామాఖ్య అమ్మవారి వార్షిక పవిత్ర రజస్వల (ఋతుస్రావం) సమయాన్ని సూచిస్తుంది.


​జూన్ 23, 24, మరియు 25 తేదీలలో భక్తులకు ఆలయ దర్శనం ఉండదు. ఈ రోజుల్లో ప్రత్యేక తాంత్రిక పూజలు, ప్రార్థనలు మరియు ఆధ్యాత్మిక ఆచారాలు నిర్వహిస్తారు. అత్యంత శుభప్రదమైన 'నివృత్తి' (ఆలయాన్ని తిరిగి తెరిచే కార్యక్రమం) 2026 జూన్ 26 తెల్లవారుజామున జరుగుతుంది. సూర్యోదయ సమయంలో గర్భగుడి తలుపులు తిరిగి తెరుచుకుంటారు, ఆ తర్వాత భక్తులకు దర్శనంతో పాటు 'అంగోదక్' మరియు 'అంగవస్త్ర' ప్రసాదాలను అందజేస్తారు.


​స్త్రీ శక్తిని, సంతానోత్పత్తిని, సృష్టిని మరియు శక్తి యొక్క శాశ్వతమైన ప్రాముఖ్యతను చాటిచెప్పే ఈ అద్భుతమైన పండుగ కోసం లక్షలాది మంది యాత్రికులు, సాధువులు, అఘోరాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులు తరలివస్తారని భావిస్తున్నారు. అంబుబాచి మేళా అనేది మా కామాఖ్య అమ్మవారి విశ్వ శక్తిని గుర్తుచేసే ఒక పవిత్రమైన పండుగ మరియు ఇది హిందూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సమ్మేళనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము


శ్రీ భగవానువాచ ।

సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।

తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ।। 2 ।।



ప్రతిపదార్థ:

 

 శ్రీ భగవానువాచ — భగవంతుడు ఇలా పలికెను; సన్యాసః — సన్యాసము; కర్మ-యోగః — భక్తితో పని చేయటము; చ — మరియు; నిఃశ్రేయస-కరౌ — అత్యున్నత లక్ష్యం వైపు తీసుకెళ్లును; ఉభౌ — రెండూ; తయో — ఈ రెంటిలో; తు — కానీ; కర్మ-సన్యాసాత్ — కర్మ సన్యాసము కంటే; కర్మ-యోగః — భక్తితో పనిచేయటం; విషిశ్యతే — ఉన్నతమైనది.

 


 తాత్పర్యము : 


భగవానుడు పలికెను: కర్మ సన్యాస (పనులను త్యజించుట) మార్గము మరియు కర్మ యోగ (భక్తితో పనిచేయుట) మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి. కానీ, కర్మ యోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్ఠమైనది.



వివరణ:


ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసమును మరియు కర్మ యోగమును పోల్చి చూపిస్తున్నాడు. ఇది చాలా నిగూఢమైన/గంభీరమైన శ్లోకం; కాబట్టి దీనిని ఒక్కొక్క పదాన్ని విడదీసి అర్థం చేసుకుందాం.


ఒక కర్మ యోగి, ఆధ్యాత్మిక మరియు సామాజిక ధర్మాలని రెంటినీ చేస్తాడు. మనస్సుని భగవంతుని యందే నిలిపి, కేవలం శరీరంతో సామాజిక ధర్మాలు చేయబడుతాయి. జగద్గురు కృపాలుజీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:


సోచు మన యహ కర్మ మమ సబ లఖత హరి గురు ప్యారే


(సాధన భక్తి తత్త్వ)


‘ఓ ప్రియ సాధకుడా! ఎల్లప్పుడూ నీ యొక్క అన్ని పనులను, గురువు మరియు భగవంతుడు గమనిస్తున్నారని భావించుము.’ ఇదే కర్మ యోగ సాధన, దీనితో మనల్ని మనం క్రమక్రమముగా శారీరక దృక్పథం నుండి ఆధ్యాత్మిక దృక్పథం వైపు ఉద్ధరించుకోవచ్చు.


కర్మ సన్యాసము అనేది శారీరక దృక్పథానికి అతీతంగా వెళ్ళిన ఉన్నత స్థాయి జీవుల కోసము. పూర్తి స్థాయిలో భగవత్ భావనలో ఐక్యమగుట వలన, సామాజిక బాధ్యతలను త్యజించి, సంపూర్ణంగా ఆధ్యాత్మిక విధులనే (భగవత్ సేవ) నిర్వర్తించే మనిషి కర్మ సన్యాసి. శ్రీ రామ చంద్రుడు లక్ష్మణుడిని ప్రాపంచిక విధులను నిర్వర్తించమన్నప్పుడు, ఈ కర్మ సన్యాస భావము లక్ష్మణుడిచే చక్కగా వ్యక్తపరచబడింది:


మోరె సబఇ ఏక తుమ్హ స్వామీ, దీనబంధు ఉర అంతరయామీ


(రామచరితమానన్)


 


లక్ష్మణుడు రామునితో అన్నాడు, ‘నీవే నా స్వామివి, తండ్రివి, తల్లివి, స్నేహితునివి, మరియు నా సర్వస్వమూ నీవే. నీ పట్ల ఉన్న ధర్మాన్నే నేను శాయాశక్తులా నిర్వర్తిస్తాను. కాబట్టి దయచేసి నా శారీరక ధర్మాల్ని నాకు చెప్పవద్దు.’


కర్మ సన్యాసం అభ్యాసం చేసే వారు తమని తాము శరీరము అనుకోరు, తత్ఫలితంగా వారు తమ శారీరక ధర్మాల్ని నిర్వర్తించే అవసరం లేదు అని భావిస్తారు. ఇటువంటి కర్మ సన్యాసులు తమ పూర్తి సమయాన్ని ఆధ్యాత్మికత కోసమే కేటాయిస్తారు. అదే సమయంలో, కర్మ యోగులు తమకున్న సమయాన్ని ప్రాపంచిక విధులకు, ఆధ్యాత్మిక విధులకు మధ్య విభజించాల్సి ఉంటుంది. అందుకే కర్మ సన్యాసులు భగవంతుని దిశగా వేగంగా వెళ్ళగలుగుతారు, కానీ కర్మ యోగులు సామాజిక విధుల భారంతో నెమ్మదిగా సాగుతారు.


కానీ, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసం కంటే, కర్మ యోగాన్నే ప్రశంసిస్తున్నాడు మరియు అర్జునుడికి దానినే అనుసరించమని సిఫారసు చేస్తున్నాడు. ఎందుకంటే కర్మ సన్యాసులు ఒక ప్రమాదంలో చిక్కుకోవచ్చు. ఒకవేళ తమ కర్తవ్యములను త్యజించిన పిదప తమ మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేయలేకపోతే వారు అటూ ఇటూ కాకుండా పోతారు. భారత దేశంలో, ఇటువంటి, ఎన్నోవేల మంది సాధువులు, తమకు వైరాగ్యం కలిగింది అనుకుంటూ, ప్రపంచాన్ని త్యజించారు, కానీ వారి మనస్సు భగవంతుని పట్ల పూర్తిగా లగ్నం కాలేదు. దీని వలన వారు ఆధ్యాత్మిక పథంలో దివ్య ఆనందాన్ని అనుభవించలేకపోయారు. కాబట్టి, ఏదో బైరాగులు ధరించే కాషాయి వస్త్రాలు ధరించినా, గంజాయి పీల్చటం వంటి అత్యంత పాపభూయిష్ట పనులు చేస్తుంటారు. కేవలం అజ్ఞానులు మాత్రమే తమ సోమరిపోతుతనాన్ని, వైరాగ్యమని తప్పుగా అర్థం చేసుకుంటారు.


మరో పక్క, కర్మ యోగులు, ప్రాపంచక విధులు మరియు ఆధ్యాత్మిక విధులను రెండూ చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ వారి మనస్సు ఆధ్యాత్మికత నుండి పక్కకి తప్పితే, కనీసం వారి వృత్తి/పని మీద ఆధార పడవచ్చు. ఈ విధంగా కర్మ యోగము అనేది అత్యధిక జనులకు సురక్షితమైన మార్గము; అదే సమయంలో, సమర్థుడైన గురువు గారి పర్యవేక్షణ లోనే కర్మ సన్యాస మార్గమును అవలంబించాలి.

*శ్రీ మూకశంకర విరచిత* *

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 11*


*జటాలా మంజీరస్ఫురదరుణరత్నాంశునికరైః*

*నిషిదంతీ మధ్యే నఖరుచిఝరీగాంగపయసామ్ ।*

*జగత్త్రాణం కర్తుం జనని మమ కామాక్షి నియతం*

*తపశ్చర్యాం ధత్తే తవ చరణపాథోజయుగలీ ॥*


*భావము :*


*జగన్మాతా! నీ కాలి అందియలలో కూర్చబడిన ఎర్రటి రత్నములు నీ పాదములకు కేశములవలె అమరి ఉన్నాయి. నీ పాద నఖములనుండి వెలువడుతున్న వెన్నెల కాంతులు గంగా నదీ ప్రవాహమువలే దృశ్యమై, జటలతో కూడి నదీమధ్యమున స్థితమైన నీ పాదములు, సకల జగత్తును రక్షిస్తున్న తాపసివలె కనిపిస్తున్నాయి.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

హిమోగ్లోబిన్

  హిమోగ్లోబిన్ అనునది ఇనుము సంబంధిత రసాయన పదార్ధము. ఇది మన శరీరంలో ఎక్కడ శక్తి కావాలో అక్కడకు ఆక్షీజనును తీసుకొని వెళుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉన్నాకూడా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మన శరీరానికి కావలసినంత ఆక్షీజను లభించదు దద్వారా మన శరీరాన్ని శక్తివంతంగా పనిచేయలేము. ఈ రోజుల్లో ఎక్కువగా మహిళల్లో రక్తహీనత సర్వసాధారణమైనది. ఎవ్వరు చూసిన రక్త హీనతతో బాధపడుతున్నవారే అయితే ఎక్కువగా మహిళలకే ఎందుకు రక్త హీనత వస్తుంది అని ఆలోచించినట్లయితే దానికి అనేక కారణాలు వున్నాయి. అందులో ఒకటి మహిళల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పురుషులలో వుండే హిమోగ్లోబిన్ శాతం కన్నా తక్కువ ప్రకృతి సిద్దంగానే ఉంటుంది. 


పురుషుల్లో హిమోగ్లోబిన్ : 14 to 18 g/dl;


మహిళల్లో హిమోగ్లోబిన్ 12 to 16 g/dl. 


ఇక్కడ ఇచ్చిన సమాచారం సగటు ఆరోగ్యవంతులైన వారి విషయం. ఇంకొక విషయం మనం గుర్తించాలి పురుషలల్లో రక్తం శరీరంలో వున్నది వున్నట్లే ఉంటుంది. కానీ మహిళలకు ఋతుక్రమంలో వారి ప్రమేయం లేకుండా చాలా రక్తం వెలువడుతుంది. అసలే శరీరంలో హిమోగ్లోబిన్ పురుషులకన్నా తక్కువ ఉంటే వారు ఈ విధంగా కూడా రక్తాన్ని కోల్పోతారు. నాకు వున్న సమాచారం ప్రకారం చాలామంది మహిళలు 10g /dl కన్నా తక్కువ ఉన్నట్లు తెలిసింది. పూర్వకాలంలో మన ఇండ్లలో వున్న వస్తువులు, ఆహారపు అలవాట్లు చాలావరకు మనం ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా రక్త హీనత లేకుండా ఉండటానికి ఉపకరించేవి. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రక్త హీనత వలన అనేక ఇతర రుగ్మతలు కూడా రావచ్చు. ఎందుకంటె ఎప్పుడైతే శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ అవుతుందో అప్పుడు శరీరం బలహీన పడుతుంది దానివల్ల శరీరం ఇతర రోగాలను రాకుండా నిరోధించే శక్తిని కోల్పోతుంది దాని పర్యవసానంగా ఇతర రోగాలు ప్రవేశించటానికి తలుపులు తేరాచినట్లు అవుతుంది. కాబట్టి ప్రతివారు తమ ఇంటిలోని ఆడవారి శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ కాకుండా ఉండేటందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. 


వంటశాలలో మార్పులు: పూర్వం మన ఇండ్లలో అనేక వంట సామాగ్రిని మనం ఇనుముతో చేసినవి ఉపయోగించే వాళ్ళము. ఇప్పుడు మన వంటశాలలో ఇనుము పూర్తిగా కనుమరుగు అయ్యింది. వాటి వల్ల శరీరం అనారోగ్యం పాలు అవుతున్నది. ఇప్పుడు నిశీతంగా పరిశీలిద్దాం. 


ముఖ్యంగా మనందరికీ తెలిసిన వంట ఇంటి వస్తువు ఇనుప మూకుడు. మనం పూర్వం ఇనుప మూకుడులో అనేక పిండివంటలను చేసుకునేవారము. పూరి, వడ, బజ్జే కారపూస, అదే జంతికలు, వడియాలు, అప్పడాలు, చల్లమెరపకాయలు అంతే కాదు బండపచ్చళ్ళు గోంగూర, బచ్చలికూర, చింతకాయ, మామిడికాయ, దోసకాయ మొదలయిన పచ్చళ్ళు చేయటానికి ఇనుప మూకుడునూనెలో వేయించి రోట్లో రుబ్బుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తినే వాళ్ళం. అంతే కాకుండా పోపుపెట్టాలన్నా ఇనుప మూకుడు లేక ఇనుప గరిటను వాడే వాళ్ళము. ఒక్క మాటలో చెప్పాలంటే మన వంట సగానికి సగం ఇనుప ముకుడు మీదనే ఆధారపడి వున్నది. పూర్వం ఆడవారు ఇలా మాట్లాడుకునే వారు "వదిన మా ఇంట్లో మూకుడు పెట్టి వారం రోజులైంది నా కుమారుడు వచ్చాడు ఏదైనా చేయాలి" అని అంటే ఇంట్లో పిండి వంట చేసి అని అర్ధం. ఈ రకంగా మన వంట ఇల్లు ఇనుప మూకుడుతో అనుసందానం చేసి ఉండటం వలన మనం ఆరోగ్యంగా వుండే వాళ్ళము. మూకుడు తరువాత స్తానం ఇనుప పెనం తీసుకుంది. అట్లు వేసుకోవాలన్న, రొట్టెలు చేసుకోవాలన్న, పెనం మనకు అవసరం. వీటితో పాటు అట్లకాడ, జాలి గంటె ఇవికూడా ఇనుమువే ఉండేవి.


వీటితరువాట్ మరింత ప్రాధాన్యత సంతరించుకున్న వంట ఇంటి ఇనుప వస్తువు కత్తిపీట కత్తిపీట లేని ఇల్లు గతంలో ఉండేదే కాదు. ప్రతి కూరగాయను కత్తిపీటతోటె తరిగే వాళ్ళు ఎప్పుడైతే కూరలు కత్తిపీటతో తరుగుతారో ఆ కూరలలో వుండే ఆమ్లము ఇనుముతో రసాయనకిక్ చర్య చెంది ఆమ్లంలో కరిగిన ఆ పదార్ధం కూరలతో పాటు వంటగిన్నెను చేరేది. మనందరికీ తెలిసిన విషయం మనం మామిడికాయలు తిరిగినప్పుడు కత్తిపీట చాలా పదును ఎక్కుతుంది. "అరె ఇప్పుడే మామిడి కాయలు తరిగా కత్తిపీట బాగా పదును మీద వుంది జాగ్రత్త" అని కత్తిపీట పిల్లలకు ఇచ్చేటప్పుతూ అనటం కద్దు అంటే మరి కత్తిపీట ఎలా పదును ఎక్కింది అంటే కత్తిపీటలోని ఇనుము మామిడి కాయలలో కరిగి ముక్కలలో కలిసింది అని అర్ధం. 


గతంలో మనకు ప్రతి ఆహారపదార్ధం ఇనుముతో చేసిన వస్తువుమీది నుంచి వచ్చేవి దానివలన ఇనుము స్వల్పంగా ఆహారపదార్ధాలలో కరిగి మన ఆహారంలోకి ప్రేవేశించేది. దాని వలన ఇనుము మన శరీరానికి అందేది రక్త హీనత అనేది అస్సలు ఉండేది కాదు. 


ఇప్పుడు ఇనుప వస్తువులు అన్నీ స్టీలు అల్యూమినియం, ప్లాస్టిక్ పదార్ధాలతో మార్పు చేయబడినవి వాటి వలన ఆరోగ్యకరమైన కరిగిన ఇనుము మన శరీరంలోకి వేళ్ళ కుండా అనారోగ్యాన్ని చేకూర్చే ప్లాస్టిక్కు, అల్యూమినియం వెళ్లి శరీరాన్ని సుషుకింపచేస్తూ అనారోగ్యం పాలుచేస్తున్నాయి. 


శరీరంలో రక్త హీనతను గుర్తించటం ఎలా: రక్తహీనత వుండే వారిలో త్వరగా అలసట చెందటం, కంటి గ్రుడ్డు క్రింది రెక్కను ప్రక్కకు అని చుస్తే అక్కడ గులాబిరంగుగా, లేక పాలిపోయి ఉంటాయి. శరీరం శుష్కించినట్లుగా కనపడుతుంది. రక్తహీనత సాదారణ మైన విషయమే కానీ దీనిని ఆశ్రర్ధ చేయకూడదు. సత్వరం తగిన ఆహారపదార్ధాలు అంటే ఇనుము ఎక్కువ ఉండేవి తినటం వలన దీనినుండి కాపాడుకోవచ్చు. 


కొన్ని వంటింటి చిట్కాలు: 


1) పల్లీ చెక్క అంటే వేరుశనగ పల్లెలను బెల్లంలో కలిపి చేసే స్వీట్ ఇది చావుకగా లభిస్తుంది. దీనిని రోజు స్వేకరించాలి . 


2) పల్లీలు, బెల్లం నువ్వులు, రోజు తినే అలవాటు చేసుకోవాలి.


విధిగా మన వంటకాలలో పంచదార బదులుగా బెల్లాన్ని వాడాలి. మరల ఇనుపముకుడును మన వంటశాలకు ఆహ్వానిస్తే చాలావరకు మనం రక్త హీనతనుండి కాపాడుకోగలుగుతాము. ఈ వ్యాసము చదివిన వారందరికీ ఆరోగ్యం చేకూరాలని ఆశిస్తున్నాను.

నవనీత హారతి

 నవనీత హారతి 


ఆనందనిలయంలో కులశేఖరపడి వద్ద తెరవేసి, శ్రీస్వామివారికి దంతధావన జిహ్వోల్లేఖన ఆచమనాది అనుష్ఠాన క్రియలు సమర్పించి, ఆ తర్వాత 'మహంతు మఠం' వారు ప్రత్యేకంగా తెచ్చిన నవనీతం (తాజా వెన్న), పాలు, పంచదారలను స్వామివారికి నైవేద్యంగా పెట్టి, మంచి సువాసన గల తాంబూలాన్ని స్వామివారికి సమర్పిస్తారు.


గుడి బయట వేద పండితులు సుప్రభాత సేవను ముగిస్తున్న సమయంలో... లోపల అర్చకులు స్వామివారికి కర్పూర హారతి ఇస్తారు. వెన్న నైవేద్యం పెట్టే సమయంలో ఇచ్చే ఈ కర్పూర హారతినే 'నవనీత హారతి' అంటారు. సరిగ్గా ఈ హారతి ఇచ్చే సమయంలోనే బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. ఆ కర్పూర దీపాల వెలుతురులో శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపం భక్తులకు కన్నులపండువగా కనిపిస్తుంది.


హారతి అయిపోయాక, రాత్రి సమయంలో బ్రహ్మ దేవుడు వంటి దేవతలు పూజించడానికి గర్భగుడిలో ఉంచిన పవిత్ర తీర్థాన్ని, చందనాన్ని, శఠారిని మొదట అర్చకులు తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని జియ్యంగారికి, ఏకాంగికి ఇస్తారు. చివరగా సన్నిధిగొల్లకు తీర్థం, శఠారితో పాటు నవనీత హారతిలోని తాంబూలాన్ని కూడా ప్రసాదంగా అందిస్తారు.


ఈ పూజ ముగిసిన వెంటనే జియ్యంగార్, ఏకాంగి, సన్నిధిగొల్ల ముగ్గురూ బంగారు వాకిలి దాటి బయటకు వస్తారు. అప్పుడు ఆలయ సిబ్బంది (పరిచారకులు) లోపలికి వెళ్లి, రాత్రి స్వామివారు పవళించిన మంచాన్ని, పరుపును (పాన్పును) తీసి బయట ఉన్న 'సభేరా గది' లోకి మారుస్తారు.

భాగవతం

 *'భాగవతం వింటే బాగవుతాం'*

శ్రీ పోతన భాగవత మధురిమలు 

 

(8-215-క.)

ఆలోల జలధి లోపల

నాలో నహి విడిచి సురలు నసురులుఁ బఱవం

గీలా కోలాహలమై

హాలాహల విషము పుట్టె నవనీనాథా!


*భావము:-* పరీక్షిన్మహారాజా! అల్లకల్లోలమైన ఆ పాలకడలిలో నుండి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన “హాలాహలము” అనే మహావిషము పుట్టింది. అది చూసి భయంతో దేవతలూ, రాక్షసులూ పట్టుకున్న నాగరాజు వాసుకిని వదలిపెట్టి పారిపోసాగారు.


_(లకార ప్రాసతో హాలాహల, కోలహలాలకు జత కట్టించిన బమ్మెరవారి పద్యం మధురాతి మధురం.)_


శ్రీ తాళ్ళూరి నారాయణ కవి గారి శివ తత్వ కీర్తనతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

పంచాంగం 15.06.2026 Monday

  ఈ రోజు పంచాంగం 15.06.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష అమావాస్య తదుపరి నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష ప్రతిపత్తి తిథి ఇందు వాసర మృగశిర నక్షత్రం శూల తదుపరి గండ యోగః నాగవం తదుపరి కింస్తుఘ్నం తదుపరి బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: ప్రతిపత్తి.


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి ।

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే ।। 3 ।।



ప్రతిపదార్థ:


జ్ఞేయః — పరిగణించవలెను; సః — అతను; నిత్య — ఎల్లప్పుడూ; సంన్యాసీ — సన్యాస దీక్షను ఆచరిస్తూ; యః — ఎవరైతే; న, ద్వేష్టి — దేనినీ ద్వేషింపక; న, కాంక్షతి — దేనినీ ఆశించక; నిర్ద్వంద్వః — అన్ని ద్వంద్వములకు అతీతంగా; హి — నిజముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; సుఖం — సునాయాసముగానే; బంధాత్ — బంధము నుండి; ప్రముచ్యతే — విముక్తి చేయబడును.



 

 తాత్పర్యము : 



దేనినీ ద్వేషింపక, దేనినీ ఆశించక ఉన్న కర్మ యోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులౌతారు.



వివరణ:


బాహ్యంగా ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే, కర్మ యోగులు, అంతర్గతంగా అనాసక్తత/వైరాగ్యాన్ని అభ్యాసము చేస్తుంటారు. అనుకూల, ప్రతికూల ఫలితాలని రెంటినీ సమదృష్టితో, ఈశ్వర అనుగ్రహంగా స్వీకరిస్తారు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే అది మన క్రమానుసార ఉన్నతి కొరకు సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవింప చేస్తుంటుంది. మనం సాధారణ జీవితాన్ని గడుపుతూ మన దరికి వచ్చే దేనినైనా సహిస్తూ, సంతోషంగా మన ధర్మ మనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచం సహజంగానే క్రమక్రమంగా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి వైపు తీసుకువెళ్తుంది.


దీనిని వివరించటానికి ఒక చక్కటి కథ ఉంది:


ఒకప్పుడు ఒక కొయ్య ముక్క ఉండేది. అది ఒక కొయ్యబొమ్మలు చేసే శిల్పి దగ్గరికి వెళ్లి, ‘నన్ను దయచేసి అందంగా చేయవా?’ అని అడిగింది.


శిల్పి అన్నాడు, ‘నేను ఆ పనికి సిద్ధంగా ఉన్నాను. కానీ, నీవు దానికి సిద్ధమేనా?’


ఆ చెక్క అన్నది, ‘అవును, నేను కూడా సిద్ధమే.’


ఆ శిల్పి తన పనిముట్లు తీసుకుని దానిని చెక్కటం మొదలుపెట్టాడు. ఈ కొయ్య “అయ్యో, ఏం చేస్తున్నావు? దయచేసి ఆపు, చాలా నొప్పిగా ఉంది’ అని అరిచింది.


అప్పుడు ఆ శిల్పి తెలివిగా అన్నాడు, ‘నీవు అందంగా అవ్వాలనుకుంటే, నీవు బాధని సహించాలి.’


‘సరే’, అన్నది కొయ్య. ‘అయితే చెక్కండి, కానీ దయచేసి కాస్త నెమ్మదిగా, సున్నితంగా చేయండి’.


ఆ శిల్పి తన పని మళ్ళీ ప్రారంభించాడు. ఈ కొయ్య అరుస్తూనే ఉంది, ‘ఇక ఈ రోజుకు చాలు; ఇంకా సహించలేను. దయచేసి మళ్ళీ రేపు తిరిగి ప్రారంభించండి.’ అని. ఆ శిల్పి తన పని యందే శ్రద్ధతో ముందుకెళ్ళాడు, మరియు కొద్ది రోజుల్లోనే ఆ కొయ్య, గుడిలో ఉంచతగిన, ఒక అందమైన విగ్రహంగా తయారయ్యింది.


ఇదే విధముగా, అనంతమైన జన్మలలో ప్రపంచంతో మమకారం వలన మన హృదయములు మొరటుగా, మలినముతో ఉన్నాయి. మనం అంతర్గత సౌదర్యంతో ఉండాలంటే మనం బాధని సహించి, ఈ ప్రపంచాన్ని మనలని పరిశుద్దం చేసే తన పనిని చేసుకోనివ్వాలి. కాబట్టి, కర్మ యోగులు భక్తితో పని చేస్తూ, ఫలితముల పట్ల సమదృష్టితో ఉంటారు, మరియు భగవంతుని యందే తమ మనస్సుని లగ్నం చేయటానికి అభ్యాసం చేస్తుంటారు.

15-06-2026 సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏


15-06-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.  

---------------------------------------


వృషభం


ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------


మిధునం


కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వ్యాపారస్థులకు అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.

---------------------------------------


కర్కాటకం


ఉద్యోగాలలో అధికారులతో చర్చల్లో పురోగతి కలుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 

---------------------------------------


సింహం


ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------


కన్య


ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

---------------------------------------


తుల


పాత ఋణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి.  

---------------------------------------


వృశ్చికం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చాలాకాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


ధనస్సు


బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

---------------------------------------


మకరం


అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందక ఇబ్బందిపడతారు. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------


కుంభం


చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 


ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగాలలో ఊహిం చని మార్పులు ఉంటాయి.

---------------------------------------