*'భాగవతం వింటే బాగవుతాం'*
శ్రీ పోతన భాగవత మధురిమలు
(8-215-క.)
ఆలోల జలధి లోపల
నాలో నహి విడిచి సురలు నసురులుఁ బఱవం
గీలా కోలాహలమై
హాలాహల విషము పుట్టె నవనీనాథా!
*భావము:-* పరీక్షిన్మహారాజా! అల్లకల్లోలమైన ఆ పాలకడలిలో నుండి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన “హాలాహలము” అనే మహావిషము పుట్టింది. అది చూసి భయంతో దేవతలూ, రాక్షసులూ పట్టుకున్న నాగరాజు వాసుకిని వదలిపెట్టి పారిపోసాగారు.
_(లకార ప్రాసతో హాలాహల, కోలహలాలకు జత కట్టించిన బమ్మెరవారి పద్యం మధురాతి మధురం.)_
శ్రీ తాళ్ళూరి నారాయణ కవి గారి శివ తత్వ కీర్తనతో శుభోదయం.
*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి