9, అక్టోబర్ 2026, శుక్రవారం

తాంబూల విశేషాలు -

  తాంబూల విశేషాలు -


• తాంబూలమును భుజించిన తరువాత వేసుకొనవలెను . భోజనమునకు తరువాత మూడు నాలుగుసార్లు ఒక వక్క , నాలుగు ఆకులు , సున్నము వేసుకొని సేవించవలెను .

• వక్కకు , ఆకులకు సరిపోవునట్లు సున్నము రాచుకొని కషాయ రసం లేక కొంచము కారము ఉండునట్లు చూచుకొని తాంబూలము వేసుకొనవలెను .

• భొజనమునకు ముందు తాంబులం వేయకూడదు . తాంబూలం పిప్పిని మింగకుండా ఉమ్మివేయవలెను .

• తాంబులం వేసుకొనుటకు ముందు నోటిని శుభ్రముగా పుక్కిలించి తాంబులం వేసుకొన్నచో నోటికి రుచిని చేకూర్చి మంగళకరముగా ఉండును.

• తాంబులం నోటిలో వేసుకున్న తరువాత మొదటిసారిగా వచ్చిన తాంబూల రసము మింగిన విషసమానముగా ఉండును. రెండొవసారి వచ్చినది విరోచనకారి . ఆ తరువాత వచ్చు రసము అమృతతుల్యమైనది. చక్కగా జీర్ణం చేయును . రసాయనం .

• పాలు తాగిన వెంటనే తాంబులం వేసుకొన్నయెడల కుష్ఠు రోగము గాని ప్రమేహరోగము గాని , మూత్రరోగము గాని కలుగును.

• పాలు , వెలగపండు , పనస , మామిడి , అరటి , చెరకుగడ , మద్యము , మాంస రసము , కషాయము , నెయ్యి , తేనె , కొబ్బరి నీరు వాడిన ఒక గంట వరకు తాంబులం వేసుకొనిన విషముగా పరిణమించును.

• నేత్రవ్యాధి , క్షయ , పాండువు , భ్రమ , మద్యపానం చేయుట వలన జబ్బు పడినవారు , అపస్మారము , శ్వాస , గుండెజబ్బు , రక్తపైత్యము , గ్రహణి , అతిసారం వంటి సమస్యలతో ఇబ్బందిపడువారు తాంబూల సేవన చేయరాదు .

• దెబ్బలు తగిలినవారు , పిత్తరోగము , రక్తవ్యాధులు కలిగినవారు , వేడిశరీరం కలిగినవారు , మూర్చ , క్షయరోగము కలిగినవారికి తాంబులం నిషిద్దం . సంధ్యాసమయం నందు తాంబూలసేవన చేయరాదు .

• తమలపాకు తొడిమ వ్యాధికారకము , చివర భాగము మంచిది . సున్నము నందు ఉంచిన ఆకు ఆయుక్షీణము . ఈనెలు బుద్దిని చెడగొట్టును . కావున ఆకుల యొక్క తొడిమలు , చివరలు , ఈనెలు వదిలి సున్నము పెట్టిన ఆకును పారవేచి తాంబూల సేవన చేయుట మంచిది .

• సున్నము పెట్టిన ఆకు చూర్ణపర్ణం అనబడును . పురుగులచే కొట్టబడి , రుచిలేనిది అయ్యి నల్లనిరంగు కలిగిన ఆకులు మంచివి కావు . రాళ్లు కలిగి , తెల్లగా ఉండక , ఎండిపోయిన పొడి సున్నము మంచిది కాదు .

• తాంబులం నందు వేయు పోకకాయ మంచి ప్రదేశము నందు పుట్టినది , గట్టిది , బరువు గలది , చిక్కనిది , పగలగొట్టినచో కుందేలు మాంసపు వర్ణము కలది మంచిది .

• తమలపాకును మాలిన్యము లేకుండా వస్త్రముతో తుడిచి ఈనె చీల్చి , సున్నము రాచి రెండువేళ్ళ పొడుగునా పార్శ్వములు మడిచి చుట్టి తీసికొనవలెను .

• పోకలు కషాయ , మధురరసములు కలవిగా ఉండును. ఋక్షగుణము కలవి . త్రిదోషములను పోగొట్టును . బాగుగా వండినది త్రిదోష హరము . వండని పచ్చి వక్క దోషములను ప్రకోపింపచేయను . కారముగా ఉండు తమలపాకు మంచిది . పండిన తమలపాకు సర్వదోషములను హరించును . విశేషముగా కఫవాతములను హరించి దోషములను బేధించి అగ్నిదీప్తిని కలిగించును. క్రిమిదోషములను పోగొట్టును .

• కర్పూర మిశ్రితమైన తాంబూలము మనస్సుకు సంతోషమును , మిక్కిలి సంభోగ శక్తిని , మదమును కలిగించును. ముఖరోగములను , క్రిమిరోగములను పోగొట్టును . కాచుతో కూడిన తాంబూల సేవన వలన ముఖరోగములు , క్రిమిరోగములు పోవుటయే కాక దంతములకు పటుత్వంను కలిగించును. నోటి దుర్గన్ధమ్ పోవును . వాతమును , శ్లేష్మమును హరించి దోషములను చేధించి రక్తమును , పైత్యమును పెంపొందించును . 


       

పంచాంగం 09.10.2026 Friday,

  ఈ రోజు పంచాంగం 09.10.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస క్రిష్ణ పక్ష చతుర్దశి తిథి భృగు వాసర ఉత్తరఫల్గుని నక్షత్రం బ్రహ్మ యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు. 


శ్రాద్ధ కర్మ తిథి : చతుర్దశి.


 

నమస్కారః , శుభోదయం

09-10-2026 శుక్రవారం రాశి ఫలితాలు

  శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

09-10-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఋణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.     

---------------------------------------


వృషభం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.   

---------------------------------------


మిధునం


అధికారుల అనుగ్రహంతో పదోన్నతుల పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయసహకారాలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.       

---------------------------------------


కర్కాటకం


ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. 

---------------------------------------


సింహం


వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.   

---------------------------------------


కన్య


ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.   

---------------------------------------


తుల


ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.    

---------------------------------------


వృశ్చికం


బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది.      

---------------------------------------


ధనస్సు


మాతృ వర్గ బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.         

---------------------------------------


మకరం


సోదరుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.        

---------------------------------------


కుంభం


వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణయత్నాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి.           

---------------------------------------


మీనం

 

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.   

---------------------------------------