9, అక్టోబర్ 2026, శుక్రవారం

భగవద్గీతను మొత్తం

 *🌸సంజయుడు

*భగవద్గీతను మొత్తం ధృతరాష్ట్రుడికి వినిపిస్తాడు🙏 



 మహాభారతంలో ధృతరాష్ట్రుని రథసారథి,  మంత్రి మరియు ఆంతరంగిక సలహాదారుడు.గవల్గణుడి కుమారుడైన ఇతడు సూతజాతికి చెందినవాడు.వ్యాసమహర్షి అనుగ్రహంతో దివ్యదృష్టిని పొందాడు.ఈ శక్తి వల్ల అతడు హస్తినాపురంలో కూర్చునే కురుక్షేత్ర యుద్ధభూమిలో జరిగే ప్రతి సంఘటననూ చూడగలిగాడు మరియు వినగలిగాడు.ఎవరి మనసులోని భావాలనైనా గ్రహించగలిగాడు.యుద్ధంలో అలసట,గాయాలు అతనిని తాకవని కూడా వరం ఉన్నది.

యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజులూ సంజయుడు ధృతరాష్ట్రునికి ప్రత్యక్ష వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.భీష్ముడు,ద్రోణుడు,కర్ణుడు వంటి మహావీరుల పతనం,అభిమన్యుని వధ,దుర్యోధనుని మరణం వంటి ఘట్టాలను ఉన్నదున్నట్లు,దాపరికం లేకుండా వివరించాడు.భగవద్గీత కూడా సంజయుని ద్వారానే లోకానికి అందింది.కృష్ణార్జునుల సంభాషణను విని,దానిని ధృతరాష్ట్రునికి వినిపించాడు.గీత చివర *"యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః,తత్ర శ్రీర్విజయో భూతిః"* అని అతడు చెప్పిన మాటలు ప్రసిద్ధమైనవి.కృష్ణుడు,అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడే విజయం,సంపద,నీతి ఉంటాయని తెలియచెప్పాడు.

సంజయుడు కేవలం వార్తాహరుడు కాదు.ధర్మనిష్ఠ కలిగిన సలహాదారుడు.యుద్ధానికి ముందు పాండవుల వద్దకు రాయబారిగా వెళ్లాడు,ధృతరాష్ట్రునికి పదేపదే హితవు చెప్పాడు.దుర్యోధనుని దుష్ట ఆలోచనలను ఖండించాడు.యుద్ధానంతరం ధృతరాష్ట్రుడు,గాంధారి,కుంతితో కలిసి అడవికి వెళ్లి వారికి సేవ చేశాడు.వారు కార్చిచ్చులో దేహత్యాగం చేసిన తర్వాత హిమాలయాలకు వెళ్లి తపస్సు చేశాడని చెబుతారు.విశ్వసనీయత,నిజాయితీ,ధర్మబుద్ధికి సంజయుడు ప్రతీకగా నిలిచాడు🙏

కామెంట్‌లు లేవు: