13, జూన్ 2026, శనివారం

*మన్రో గంగాళాలు

 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


              *మన్రో గంగాళాలు*

                 ➖➖➖✍️



*"మన్రో గంగాళాలు" అంటే  ఏవో తెలుసా..??*


కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే...*

```

తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి.?? 


ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..??


1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు. 


అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. 


అక్కడక్కడా రామానుజ కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ జరిగినా ఆలయంలో పంచి పెట్టే ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం.


1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. “THOMOS MUNRO” ..


దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఏలుబడి కింద ఉండేది.


ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు.

మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు.


ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా... ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు.


అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు (అవే వారికి భోజనాలు).


అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా, దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు). 


ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద  కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది.


స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని, శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని.... మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు.


శ్రీవారి లీల ప్రభావంతో  ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో... అదే  తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి, పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు. 


అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి, శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు ధన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు. 


అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి, సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల  శ్రీవారి పట్ల, ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. 


శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది..


తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం  చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు.


ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు.


మనోవ్యధతో మంచం పట్టి “నేరుగా 

నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామీ” అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు. 


అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు... 


ఈ గంగాళలను ఇప్పటికీ ```

*"మన్రో గంగాళాలు"*  ```అనే పేరుతో  దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణీలో ఉన్నాయి.


శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి  ప్రసాదించాడు. 


తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాలలోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర  కలదు. 


భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడపకి, ప్రతి చెట్టుకి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది...```


*శ్రీనివాసుడి గురించి తెలుసుకోండి ... నలుగురికి తెలియజెప్పండి...*✍️

     *ఓం నమో వెంకటేశాయ!*

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పెళ్లిళ్ల వరుస

 పూర్వం పెళ్లిళ్ల వరుస ఇలా ఉండేది


"వర విక్రయం" నాటకంలో లింగరాజు గారు కట్నం తీసుకుని రశీదు రాసిచ్చిన వైనం చూడండి ....


"బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. మీకొమార్తె చి॥ సౌ॥ కాళిందిని, నాకొమారుడు చి॥ బసవరాజునకు చేసికొనుటకు, అందులకై మీరు మాకు కట్నం క్రింద ఐదువేలు యైదువందల రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండిచెంబులు, వెండికంచము, వెండిపావుకోళ్ళు, పట్టుతాబితాలు, వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధావిధిగా ఇచ్చుటకున్నూ, ప్రతిపూఁటఁ పెండ్లివారిని బ్యాండుతో పిలుచుటకున్నూ, రాకపోకలకు బండ్లు, రాత్రులు దివిటీలు నేర్పాటు చేయుటకున్నూ, రెండుసారులు పిండివంటలతో భోజనములు, మూడుసారులు కాఫీ, సోడా, ఉప్మా, యిడ్డెన, దోసె, రవ్వలడ్డు, కాజా, మైసూరు .... మైసూరు పాకాలతో ఫలహారములు చొప్పున మా యిష్టానుసారము ఐదు దినములు మమ్ము గౌరవించుటకున్నూ, అంపకాలనాడు మాకు పట్టుబట్టలు, మాతో వచ్చువారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకున్నూ నిర్ణయించుకొని బజానా క్రింద పదిరూపాయలు ఇచ్చినారు గాన ముట్టినవి .... అయ్యా .... ఇట్లు .... సింగరాజు లింగరాజు వ్రాలు" .... చాలునా?


పేర:- చాలు బాబూ! చాలు! మచ్చుకోసం దాచిపెట్టుకోవలసిన మతలబు!


పెండ్లి సమయంలో వియ్యపురాలికి చేయవలసిన మర్యాదల గురించి కాళ్ళకూరి నారాయణ రావు గారి చమత్కారం చూద్దాం.


"వియ్యపురాలు గారికి తెలివిరాగానే కళ్ళు తుడవాలి; కాళ్ళు మడవాలి; కోక సర్దాలి; కిందకు దింపాలి; పెరట్లోకి పంపాలి; నీళ్ళచెంబందివ్వాలి; రాగానే కాళ్ళు కడగాలి; పండ్లు తోమాలి; మొహం తొలవాలి; నీళ్ళు పోయాలి; వళ్ళు తుడవాలి; తల దువ్వాలి; కొత్తచీర కట్టాలి; కుర్చీ వెయ్యాలి; కూర్చోబెట్టాలి; పారాణి రాయాలి; గంధం పుయ్యాలి; అత్తర్లివ్వాలి; పన్నీరు చల్లాలి; మొహాన్ని మొహరీలద్దాలి! కళ్ళకు కాసులద్దాలి! వంటిని వరహాలద్దాలి; వెండి పలుపు వెనకను కట్టాలి; బంగారుపలుపు పక్కను చుట్టాలి; దిష్టి తియ్యాలి; హార తివ్వాలి; అధ్వాన్న మివ్వాలి; నా పిండాకూడివ్వాలి ....యిల్లాంటివింకా నా తలవెంట్రుక లన్ని వున్నాయి. ఆలస్యమైతే అలక కట్నం చెల్లించ వలసి వస్తుంది".


మొగ పెళ్లి వారికి చేయ వలసిన మర్యాదల్లో లోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి ....


"నిన్నటి వుప్మాలో నిమ్మపళ్లరసమే లేదట. ఇడ్డెన్లలో అల్లం ముక్కలు లేవట. కాఫీలో పంచదార లేదట. ఈ పూటయినా కాస్త యింపుగా వుండకపోతే పట్టుకు వచ్చిన వాళ్ళ మొహాన్ని పెట్టికొట్టాలని పదిమందీ ఆలోచిస్తూన్నారు. ఖారాఖిల్లీలు కాస్త యెక్కువగా పంపండి. చుట్టలూ, సిగరెట్లూ, బీడీలూ కూడా కాస్త శుభ్రమైనవి చూడండి. నిన్న పంపిన చీట్లపేకలు నిన్ననే చిరిగిపోయాయి. ఈపూటింకో నాలు గెక్కువ పంపండి. మదరాసు నశ్యం మాట మరిచిపోకండి. శలవు. మఱి ఆలస్యమైతే మాటదక్కదు".


పెళ్ళైన తరువాత పదహారు రోజుల పండుగ అంటే ఏమిటో చూద్దాం. 


"తొలినాడు హడావడి, మలినాడు ఆయాసం; మూడు మంగళాష్టకాలు; నాలుగు సిగపట్ల గోత్రాలు; అయిదు అప్పగింతలు; ఆరు అంపకాలు; ఏడు వంట బ్రాహ్మల తగువు; ఎనిమిది ఋణదాత నోటీసు; తొమ్మిది జవాబు; పది దావా; పదకొండు స్టేటుమెంటు; పన్నెండు విచారణ; పదమూడు డిక్రీ; పద్ధానుగు టమటమా; పదిహేను వేలం; పదహారు చిప్ప. 

ఈ రోజుల్లో యిదే పదహారు రోజుల పండగ.


ఇది చదివితే అప్పటి పెళ్లిళ్ల సరళి గుర్తొస్తుంది కదా!

Have a great week end 🙏

పంచాంగం 13.06.2026 Saturday,

 ఈ రోజు పంచాంగం 13.06.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధికజ్యేష్ఠ మాస కృష్ణ పక్ష త్రయోదశి తిథి స్థిర వాసర కృత్తిక నక్షత్రం సుకర్మ యోగః గరజి తదుపరి వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: త్రయోదశి.


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము


అర్జున ఉవాచ ।

సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి ।

యఛ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ।। 1 ।।



ప్రతిపదార్థ:

 

.అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సన్న్యాసం — సన్యాసము; కర్మణాం — కర్మల యొక్క; కృష్ణ — శ్రీ కృష్ణ; పునః — మరల; యోగం — కర్మ యోగం గురించి; చ — మరియు; శంససి — ప్రశంసించావు; యత్ — ఏదైతే; శ్రేయః — ఎక్కువ శేయస్కరమో; ఏతయో — ఈ రెంటిలో; ఏకం — ఒకటి; తత్ — అది; మే — నాకు; బ్రూహి — దయచేసి చెప్పుము; సు-నిశ్చితమ్ — నిర్ణయాత్మకముగా.

 


 తాత్పర్యము : 



అర్జునుడు అన్నాడు : ఓ శ్రీ కృష్ణా, నీవు కర్మ సన్యాసమును (పనులను త్యజించుట) ప్రశంసించావు మరియు కర్మ యోగమును (భక్తితో పనిచేయుట) కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము?



వివరణ:


అర్జునుడు అడిగిన పదహారు ప్రశ్నలలో ఇది ఐదవది. శ్రీ కృష్ణుడు పనులను త్యజించటమును మరియు భక్తితో పని చేయటమును రెంటినీ ప్రశంసించాడు. పైకి విరుద్ధంగా అనిపించే ఈ రెండు ఉపదేశములతో అర్జునుడు తికమక పడి, ఈ రెంటిలో ఏది తనకు ఎక్కువ శ్రేయస్సుని కలుగచేసేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రశ్న ఏ సందర్భంలో వచ్చిందో ఒకసారి చూద్దాం.


మొదటి అధ్యాయం, అర్జునుడి శోకం యొక్క తీరు వివరించి, శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించటానికి ఒక చక్కటి వాతావరణం కలిగించింది. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని తెలియపరిచాడు; ఆత్మ నిత్యమైనది, నాశము లేనిది కాబట్టి, ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు, కాబట్టి శోకించటం తెలివితక్కువ పని అని చెప్పాడు. తదుపరి, అర్జునుడికి ఒక వీరుడిగా తన కర్మ (సామాజిక విధి), యుద్ధంలో ధర్మ పక్షం వైపు పోరాడటమే అని చెప్పాడు. కానీ, కర్మ అనేది వ్యక్తులను కర్మ-ఫల బంధములకు కట్టివేస్తుంది కాబట్టి అర్జునుడిని తన కర్మ ఫలములను భగవత్ అర్పితము చేయమన్నాడు, శ్రీ కృష్ణుడు. అప్పుడు అతని పనులు కర్మ యోగమవుతాయి, అంటే ‘పనుల ద్వారా భగవత్ సంయోగము.’


మూడవ అధ్యాయంలో, కర్తవ్య నిర్వహణ చేయటం అవశ్యకమైనది ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహద పడుతుంది అని ఆ పరమాత్మ చెప్పాడు. కానీ, అంతఃకరణ శుద్ధి సాధించిన వ్యక్తి ఎలాంటి సామాజిక విధులను నిర్వర్తించే అవసరం లేదు అని కూడా చెప్పాడు (శ్లోకం 3.17).


నాలుగవ అధ్యాయంలో భగవంతుడు చాల రకాల యజ్ఞముల (భగవత్ ప్రీతి కొరకు చేసే కార్యములు) గురించి విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానముతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనదని చెప్పాడు. అన్ని యజ్ఞములు కూడా చివరకి మనకు భగవంతునితో ఉన్న సంబంధము యొక్క జ్ఞానాన్ని తెలియజేయుటకే దారి తీస్తాయి అని చెప్పాడు. చివరికి 4.41వ శ్లోకంలో, కర్మ సన్యాస విషయాన్ని పరిచయం చేసాడు; దీనిలో కర్మకాండలు మరియు సామాజిక విధులు త్యజించి వ్యక్తి పూర్తిగా శరీరము, మనస్సు, మరియు ఆత్మతో భక్తి పూరిత సేవలోనే నిమగ్నమౌతాడు.


ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురి చేసాయి. అతను కర్మ సన్యాసము మరియు కర్మ యోగము రెండూ విరుద్ధ స్వభావాలతో కూడినవి అనుకున్నాడు, మరియు ఈ రెంటినీ ఒకేసారి చేయలేమనుకున్నాడు. కాబట్టి, తన సందేహాన్ని శ్రీ కృష్ణుని దగ్గర వ్యక్తం చేస్తున్నాడు.

పువ్వులలోని ఆరొగ్య రహస్యాలు -

 పువ్వులలోని ఆరొగ్య రహస్యాలు -


మందార పువ్వులు -


ఈ మందార పువ్వులు స్త్రీలకు అత్యంత ప్రీతికరం. ఆయుర్వేదం ప్రకారం ఇవి చాలా విలువయిన పుష్పములు. ఈ పువ్వుల రసమును ఆలివ్ నూనే లొ గాని , కొబ్బరి నూనే లొ గాని కలిపి పొయ్యి మీద పెట్టి రసం ఇగిరి పోయి నూనే మాత్రం మిగిలే వరకు కాచాలి. ఆ తరువాత ఆ నూనెను వడపోసుకొని రాసుకుంటూ ఉంటే వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోయి , బాగా గుబురుగా నల్లగా నిగనిగ లాడుతూ వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. తలలో వచ్చే చుండ్రు, దురద, కురుపులు తగ్గిపోయి , వెంట్రుకలు పుర్తిగా ఉడిపోయిన చోట కుడా మళ్ళి మొలుస్తాయి. మందార పువ్వుల ను ఎండబెట్టి చూర్ణం చేసి లోపలి కి వాడితే మూత్ర రోగాలు , స్త్రీల ఋతు రక్త దోషాలు మేహా రోగాలు హరించి పొతాయి.


మల్లె పువ్వులు -


వీటిని తలలో ధరించడం వలన నేత్ర వ్యాదులు, శ్లేష్మ వ్యాధులు హరించి పోతాయి . వెంట్రుకలు మృదువు గా , దట్టం గా పెరుగుతాయి. స్త్రీల స్థనాల పైన లేచే గడ్డలకు ( పాలు గడ్డ గా తయారు అయ్యి స్తనాలలో విపరీత మయిన బాధ ఉంటుంది.) ఈ పువ్వులను గడ్డల మీద వేసి కడతారు.


గులాబీ పువ్వులు -


ఇది సువాసన కలిగిన పుష్పము. శరీరమునకు మంచి బలం, చల్లదనం ఇస్తుంది. శరీరం లొని వాత పిత్త , కఫ అనే త్రిదోషములను హరించే శక్తి ఈ పువ్వులకు ఉంది. ఈ పువ్వులను ఎండబెట్టి నెయ్యిలో దోరగా వేయించి అన్నం తినేప్పుడు మొదటి ముద్దలో తగినంత కలుపుకుని తింటూ ఉంటే మలబద్ధక వ్యాధి హరించి పొతుంది .ఇంకా మేహా రోగాలని నశింప చేస్తుంది .నోటి పూత తగ్గిపొతుంది.

ఈ పువ్వుల సారం తోటి "అత్తరు" అనే పేరు గల సుగంద ద్రవ్యం తయారు చెస్తారు. అలాగే ఈ పువ్వులతో షర్బత్ గూడా తయారు చెస్తారు.ఇది ఎంతో రుచిగా ఉండి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.


పల్లేరు పువ్వులు -


పల్లేరు పువ్వులలో మధుర రసం, చలువ స్వభావం ఉన్నాయి . జట రాగ్నిని వృద్ధి చేస్తుంది . బలం కలిగిస్తుంది. ముత్రా శయం ను శుద్ధి చేస్తూంది . లొపలికి వాడిన వెంటనే వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. వాత రోగాల్ని , మూత్రం లొని రాళ్ళను హరింప జేస్తుంది. గుండె జబ్బులను శమింప జేస్తుంది.

పల్లేరు పువ్వులను ఒక కప్పు ఆవు పాలతో ఉడకబెట్టి తగినంత చెక్కర కలుపుకుని తాగుతూ ఉంటే మూత్రం లొని చురుకు, మంట, వేడి వెంటనే తగ్గిపోతాయి.

పల్లేరు పువ్వులు , కాయలు, నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణం గా తయారు చేసుకోని దాన్ని రోజుకీ రెండు పూటలా 5 గ్రా మోతాదు గా ఒక గ్లాస్ గొర్రె పాలు , ఒక స్పూన్ తేనే కలిపి వాడుతూ ఉంటే వారం రొజుల్లొ రాళ్ళు కరిగి పొతాయి.



మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.



 *🌺 అష్టాంగ ప్రణామము 🌺*


*అష్టాంగ ప్రణామము అనగా భగవంతునికి సంపూర్ణ శరణాగతితో శరీరంలోని ఎనిమిది అంగాలను భూమికి తాకిస్తూ చేసే నమస్కారం. "అష్ట" అంటే ఎనిమిది, "అంగ" అంటే అవయవాలు.*


*శాస్త్రోక్తంగా:*


*"ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।*

*పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే ॥"*


*అంటే హృదయం, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, పాదాలు, చేతులు, మోకాళ్ళతో చేసే నమస్కారాన్ని అష్టాంగ ప్రణామం అంటారు.*


*1️⃣ కరములు (చేతులు)*

*చేతులను జోడించి భూమిపై ఉంచడం.*

*"నా కర్మలన్నీ భగవంతునికి సమర్పితం" అనే భావన.*


*2️⃣ పాదములు*

*రెండు పాదాలు భూమిని తాకుతూ ఉండాలి.*

*జీవిత ప్రయాణం ధర్మమార్గంలో సాగాలని సంకల్పం.*


*3️⃣ తొమ్ము (ఛాతి / వక్షస్థలం)*

*వక్షస్థలాన్ని భూమికి ఆనించడం.*

*హృదయంలోని అహంకారం, మమకారాన్ని భగవంతుని పాదాల వద్ద సమర్పించడం.*


*4️⃣ ఉదరము*

*ఉదర భాగం భూమిని* *తాకుతుంది.*

*భౌతిక కోరికలు, భోగాసక్తులను దైవానికి అర్పించడం.*


*5️⃣ లలాటము*

*నుదిటిని భూమికి ఆనించడం.*

*బుద్ధి, జ్ఞానం, ఆలోచనలన్నీ దైవానుగ్రహంతో నడవాలని ప్రార్థన.*


*6️⃣ నేత్రములు*

*దృష్టిని భగవంతుని* *పాదాలపై కేంద్రీకరించడం.*

*ప్రపంచ విషయాల కంటే దైవదర్శనమే శ్రేష్ఠమని సూచిస్తుంది.*


*7️⃣ భుజములు*

*భుజాలను భూమికి ఆనించడం.*

*"నా శక్తి, బాధ్యతలన్నీ దైవసంకల్పానుసారమే" అనే శరణాగతి.*


*8️⃣ కటి (నడుము భాగం)*

*శరీరమంతా వినయంతో వంగి ఉండడం.*

*అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి భగవంతునికి లొంగిపోవడం.*


*అష్టాంగ ప్రణామం వల్ల కలిగే ఫలితాలు*

*✅ వినయం పెరుగుతుంది*

*✅ భక్తి గాఢమవుతుంది*

*✅ మనస్సు* ప్రశాంతమవుతుంది*

*✅ అహంకారం తగ్గుతుంది*

*✅ దైవసాన్నిధ్యం* అనుభూతి కలుగుతుంది*

*✅ పుణ్యఫలం లభిస్తుంది*


*అష్టాంగ ప్రణామము అనేది శరీరంతో చేసే నమస్కారం మాత్రమే కాదు; మనస్సు, బుద్ధి, హృదయం, కర్మలు అన్నింటినీ భగవంతుని పాదాలకు సమర్పించే సంపూర్ణ శరణాగతి యోగం.*


*"నమస్కారమే భక్తికి ద్వారం, శరణాగతియే మోక్షానికి మార్గం."*


*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*

          *ఆధ్యాత్మిక అన్వేషకులు*

🍁📚🍁 🙏🕉️🙏 🍁📚🍁

చింత చిగురు ఆరోగ్యం

 చింత చిగురు

దాని వల్ల కలిగే ప్రయోజనాలు ...


చింత చచ్చినా పులుపు చావలేదు… అన్న సామెతను మీరు వినే ఉంటారు.


చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. 


1. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది.


2. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట రాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట రాల్ను పెంచుతుంది.


3. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి.


4. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.


5. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.


6. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.


7. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.


8. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది.


9. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి.


10. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.


11. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.


12. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


13. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.


14. ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.


15. చింత చిగురును పేస్ట్లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.


16. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది.


17. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

ఇంటి పని కాదు

 *"ఇంటి పని కాదు, అది ఇంటి యోగం" – ఒక తరాల కథ*


తెల్లవారుజామున 4 గంటలు. 65 ఏళ్ల మహిళ నిద్దుర లేచింది.


*మొదటి ఆసనం - మాలాసనం*: వంగి ముగ్గు వేస్తుంది. 21 చుక్కలు. ఒక్కో గీతకు వెన్నెముక వంగుతుంది, కాళ్ల నరాలు సాగుతాయి. డాక్టర్ చెప్పిన "Squat Exercise" బామ్మకు 60 ఏళ్లుగా తెలుసు. "ముగ్గు వేస్తే మోకాళ్ల నొప్పులు రావు" అనేది.


*రెండో ఆసనం - ఉత్కటాసనం*: బట్టలు ఉతకడం. రెండు కాళ్లూ కొంచెం వంచి, నడుము నిటారుగా పెట్టి, చేతులతో బట్టను రాయికి బాదడం. 20 నిమిషాలు. భుజాలు, చేతులు, నడుము అన్నీ ఒకేసారి వ్యాయామం. జిమ్‌లో "Chair Pose + Arm Workout" కి అవ్వ పెట్టిన పేరు - 'చీర ఉతకడం'.


*మూడో ఆసనం - త్రికోణాసనం*: తడి బట్టలు పిండి, దండెం మీద ఆరేయడం. కాలు ఒకవైపు, చేయి పైకి, నడుము వంచడం. శరీరం పక్కకి సాగుతుంది. లివర్, కిడ్నీలు శుభ్రపడతాయి.


*నాలుగో ఆసనం - అధోముఖ శ్వానాసనం*: వంగి ఇల్లు కసువు ఊడవడం. రక్తప్రసరణ తలకు ఎక్కుతుంది. మెదడు చురుకవుతుంది.

*ఐదో ఆసనం - మార్జరాసనం*: కూర్చుని బూడిదతో గిన్నెలు తోమడం. మణికట్టు, వేళ్లు తిరుగుతాయి. ఆర్థరైటిస్ రాదు. బూడిదలో ఉన్న పొటాష్ సహజమైన క్రిమిసంహారిణి.


మనవడు రవి అడిగాడు: బామ్మ, నువ్వు పని మనిషిలా ఇన్ని పనులు ఎందుకు చేస్తావ్? ఒకరిని పెట్టుకోవచ్చుగా?"


బామ్మ నవ్వింది: "పనిమనిషా? రా, నేను కాదురా. ఇది నా *ఇంటి యోగం*. ఈ పనులు మానేసిన రోజు నా ఒళ్ళు పట్టుకుపోతుంది, మనసు పాడైపోతుంది."


లచ్చమ్మ కోడలు దీప. సాఫ్ట్‌వేర్. ఉదయం లేవగానే Washing Machine ఆన్, Dishwasher ఆన్, Robot Vacuum ఆన్.


8 గంటలు ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం. మెడ నొప్పి, నడుము నొప్పి, బీపీ, షుగర్. సాయంత్రం జిమ్‌కి 2000 రూపాయలు కట్టి వెళ్తుంది. ట్రైనర్ చెప్తాడు: "మేడం, 20 స్క్వాట్స్ చేయండి, 15 నిమిషాలు Arm Rotation చేయండి, Bend అయ్యి Sweep చేయండి."


దీపకు ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన: "అరే, ఇవన్నీ మా అత్తగారు డబ్బులు తీసుకోకుండా ఇంట్లోనే చేసేవారు కదా! మేము దాన్ని 'పని' అని హేళన చేశాం. వాళ్ళు దాన్ని 'ఆరోగ్యం' అని బతికారు."


ఆ రోజు నుంచి దీప మారింది. మెషిన్ ఉన్నా, ఆదివారం పిల్లలతో కలిసి ముగ్గు వేస్తుంది, బట్టలు ఉతుకుతుంది. "అమ్మా, ఇది పని కాదు, ఫ్యామిలీ యోగా టైం" అని పిల్లలకు చెప్పింది.


### *3. అసలు తప్పు ఎక్కడ జరిగింది?*


మనం రెండు తప్పులు చేశాం:


*తప్పు 1: పేరు మార్చేశాం.*


వంగి ముగ్గు వేస్తే 'మాలాసనం'. ఇంట్లో వేస్తే 'పనిమనిషి పని'.


బయట జిమ్‌లో చేస్తే 'Fitness'. ఇంట్లో చేస్తే 'Chores'.


పేరు మారగానే గౌరవం మారిపోయింది.


*తప్పు 2: ఉద్దేశం మర్చిపోయాం.*


అవ్వ ముగ్గు వేసింది 'ఇల్లు అందంగా ఉండాలి' అని కాదు.


*"నా కుటుంబం ఉదయం లేవగానే అందమైనది చూసి, మంచి మూడ్‌తో రోజు మొదలుపెట్టాలి"* అనే ప్రేమతో.


అన్నం వండింది 'ఆకలి తీర్చడానికి' కాదు.


*"నా చేత్తో తింటే నా బిడ్డకు నా ప్రేమ, నా శక్తి అందాలి"* అనే తపనతో.


ఇల్లు ఊడ్చింది 'దుమ్ము పోతుంది' అని కాదు.


*"నా ఇంట్లోకి వచ్చే వాళ్ళకి రోగాలు రాకూడదు"* అనే బాధ్యతతో.


మనం 'పని'ని మాత్రమే చూశాం. దాని వెనకాల ఉన్న *'ప్రేమ'* ని చూడలేదు. అదే మన తప్పు.


### *4. యోగం అంటే ఏంటి?*


పతంజలి అష్టాంగ యోగంలో చెప్పాడు: "యోగం అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసను ఏకం చేయడం."/


మన అవ్వలు అదే చేశారు:


ఇంటి పని యోగాసనం శరీరానికి లాభం మనసుకు లాభం


**ముగ్గు వేయడం** మాలాసనం, పద్మాసనం మోకాళ్లు, వెన్నెముక బలం ఏకాగ్రత, సృజనాత్మకత


**బట్టలు ఉతకడం** ఉత్కటాసనం, భుజంగాసనం చేతులు, భుజాలు, నడుము ఓర్పు, కష్టే ఫలి అనే తృప్తి


**కసువు ఊడవడం** అధోముఖ శ్వానాసనం రక్తప్రసరణ, జీర్ణశక్తి ఇల్లు శుభ్రం అయ్యిందనే ప్రశాంతత


**రుబ్బురోలు తిప్పడం** చక్రాసనం చేతులు, ఛాతి బలం సొంతంగా చేసుకున్నాం అనే ఆత్మవిశ్వాసం


**గిన్నెలు తోమడం** వజ్రాసనం అరిగే శక్తి, మణికట్టు కుటుంబం కోసం అనే సేవాభావం


వీళ్ళకి 'Yoga Mat' అవసరం లేదు. *నేలే యోగా మ్యాట్. ఇల్లే యోగా స్టూడియో. కుటుంబమే యోగా గురువు.*


### *చివరి మాట: నీ తప్పు కాదు, మనందరి తప్పు*


"ఇది పనిమనిషి పని" అని మనం అన్నప్పుడు, మనం ఒక తల్లి ప్రేమను అవమానించాం.


"Time Waste" అన్నప్పుడు, 5000 ఏళ్ల సైన్స్‌ను చెత్తబుట్టలో వేశాం.


*గుర్తుంచుకో:*


ఇంటి పని అనేది 'పని' కాదు. అది *'ప్రేమను పంచే పద్ధతి'*.


వంట చేయడం అంటే *'రుచిని కాదు, ఆయుష్షుని వడ్డించడం'*.


ఇల్లు శుభ్రం చేయడం అంటే *'చెత్తను కాదు, చెడు ఆలోచనల్ని బయటకు ఊడవడం'*.


ఇకనుంచి ఎవరైనా "అమ్మా, నువ్వెందుకు ఇన్ని పనులు చేస్తావ్?" అని అడిగితే ఇలా చెప్పు:


*"నేను పనులు చేయడం లేదు నాన్నా. నేను నా ఇంటికి, నా ఒంటికి, నా వాళ్లకి యోగం చేస్తున్నాను. ఇది నా పూజ."*


ఎందుకంటే *భారతీయ సంస్కృతిలో 'పని' వేరు, 'సేవ' వేరు.*


పని చేస్తే అలసట వస్తుంది. సేవ చేస్తే ఆనందం వస్తుంది.


మన అవ్వలు 90 ఏళ్ళు బతికింది జిమ్‌కి వెళ్లి కాదు, *ఇంటినే గుడిగా, పనినే యోగంగా* మార్చుకుని.


మరి రేపటి నుంచి నీ ఇంట్లో 'పని' ఉంటుందా? లేక 'యోగం' మొదలవుతుందా?