4, జులై 2023, మంగళవారం

శ్రీ నవగ్రహ ఆలయం

 🕉 మన గుడి : 



⚜ అస్సాం : గౌహతి


⚜ శ్రీ నవగ్రహ ఆలయం 



💠 సాధారణంగా మనం ఆలయా‌లలో  నవగ్రహాలు  ఒక ప్రక్కగా విగ్రహ రూపాల్లోనూ,కొన్ని ఆలయాలలో వారి వారి వాహన సహితంగానూ ప్రతిష్టింపబడి వుండటం చూస్తాము.

కాని కేవలం నవగ్రహాలకే ప్రత్యేక ఆలయము అస్సాం రాష్ట్రమందలి  గౌహతీ నగరమున కలదు 


💠 పరిస్ధితులు బాగుండనివారు నవగ్రహాలకి నియమం ప్రకారం ప్రదక్షిణలు, పూజలు, దానాలు చేస్తారు. గౌహతిలో నవగ్రహాలకి ప్రత్యేకించి ఆలయం వున్నది.  ఉజాన్ బజార్ లో వున్న ఈ ఆలయం 18వ శతాబ్దానికి చెందినది. 

చిత్రాచల్, లేదా నవగ్రహ హిల్ గా పిలువబడే ఈ చిన్ని కొండ ఎక్కటానికి దాదాపు 25 మెట్లు ఎక్కాలి.


💠 సాధారణంగా ఆలయంలో నవగ్రహాలు అంటే ఆయా గ్రహాల అకృతితో కూడిన శిల్పాలతో  ఉంటాయు.. కానీ  గౌహతి లోని ఆలయంలో నవగ్రహాలు అన్ని శివలింగ ఆకృతిలో ఉంటాయి .. 

గర్భగుడిలో నవగ్రహాల శివలింగాలు మాత్రమే ఉంటాయి .. శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహం దాని రంగులో ఉంటుంది . ఆకారం మాత్రం దాదాపుగా ఒకేలా ఉంటాయి .. 


💠 వర్తులాకారంలో వున్న గర్భ గుడిలో మధ్యలో సూర్యుడి స్ధానంలో ఒక లింగం, చుట్టూ మిగతా గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు లింగరూపంలో వాటికి నిర్దేశింపబడిన స్ధానాలలో ప్రతిష్టించబడ్డారు.  

ప్రతి గ్రహానికీ ఆ గ్రహాన్ని సూచించే రంగు బట్ట కడతారు. ఇవన్నీ నేలమట్టంలోనే వుంటాయి.  వాటిమధ్య కేవలం ఒకరు నడవటానికి మాత్రమే ఖాళీ వుంటుంది. గుమ్మంలోంచి చూస్తే గర్భగుడి అంతా లింగాలతో కనబడుతుంది.

ఇక్కడ గర్భగుడిలో వెలుతురు వుండదు.  కరంటు వుందిగానీ, లైటు వెయ్యరు. అస్సలు కనబడటంలేదంటే ఒక్క నిముషం లైటు వేసి తీసేస్తారు


💠 అస్సాం ఇదివరకు పేరు ప్రాగ్జోతిష్య పురం.   అస్సాంలో  నవగ్రహ ఆరాధన ప్రాచీన కాలంనుంచీ వున్నది.  పూర్వం అస్సాం జ్యోతిష్య శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికీ నెలవుగా వుండేది.  అందుకే అస్సాంకి ప్రాగ్జోతిష్యపురం అనే  పేరు వచ్చిందంటారు.  

ప్రాక్ అంటే తూర్పు ప్రాంతం అని జ్యోతిష్య పురం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది గనుక ప్రాగ్జోతిష్యపురం (eastern city of astrology) అన్నారు


💠 అక్కడ నవగ్రహ అభిషేకాలు పూజలు ... గ్రహ అభిషేకాలు పూజలు చేస్తారు... ముఖ్యంగా జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవాళ్లు అక్కడ నివారణ  పూజలు చేయించుకొంటారు.


💠 గ్రహబలం మీద జాతకం ఆధారపడి ఉంటుందని హిందువులు నమ్ముతారు.

గ్రహదోషాలు వున్నవారు ఈ ఆలయానికి వచ్చి ఆయా గ్రహాలకు దోష నివారణా పూజలు చేయించుకుంటారు.


💠 కాళికా పురాణం ప్రకారం బ్రహ్మ దేవుడు ఇంద్రలోకంతో సమానమైన నగరాన్ని సృష్టించాలని ప్రాగ్జోతిష్యపురాన్ని నిర్మించాడంటారు.  

ఇక్కడ దేనికైనా ప్రామాణికంగా ఎక్కువ కాళికా పురాణాన్నే చెబుతారు. మానవుని జీవిత గమనాన్ని నిర్దేశించే నవగ్రహాలకి ఎంతో ప్రాముఖ్యత వున్నది.  గ్రహ సంచారాల వలన మనుష్యల జీవితాల్లో సుఖ దుఃఖాల సంఘటనలు ఏర్పడతాయని హిందువుల నమ్మకం.


⚜ చరిత్ర మరియు పురాణం ⚜


💠 గౌహతి నవగ్రహ ఆలయ చరిత్ర 18వ శతాబ్దం నాటిది. ఈ దేవాలయం అహోం రాజు రాజేశ్వర్ సింఘా కాలంలో నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ఆలయం ఒక కొండపై నిర్మించబడింది, దీనిని స్థానికులు పవిత్ర స్థలంగా భావిస్తారు. 

పురాణాల ప్రకారం, రాక్షస రాజు నరకాసురుని నుండి 16,000 మంది యువరాణులను రక్షించడానికి శ్రీకృష్ణుడు తన ప్రయాణంలో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు.

 శ్రీకృష్ణుడు రాక్షసరాజుతో యుద్ధానికి ముందు ఈ ప్రదేశంలో నవగ్రహాల పూజ (పూజలు) చేశాడని చెబుతారు.


💠 ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో అహోమ్ రాజు రాజేశ్వర సింఘ నిర్మించారు. తర్వాత 1923-45 మధ్య పునరుధ్ధరింపబడింది.


💠 ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి కుడివైపు  వినాయకుడు ఆసీనుడైవునాడు.

ఆ విఘ్నేశ్వరునికి నమస్కరించుకుని లోపలికి ప్రవేశించగానే  గుండ్రటి హాలు అందులో తొమ్మిది శివలింగాలు వున్నాయి.

మధ్యలో సూర్యలింగం చుట్టూ లింగరూపంలో వున్న 8 గ్రహాలు వున్నాయి.


💠 ఈ ఆలయంలో పవిత్రమైన చెరువు ఉంది. దీనిని నవగ్రహ కుండ్ అని పిలుస్తారు, 

ఇది వైద్యం చేసే శక్తులను కలిగి ఉందని నమ్ముతారు.


💠 భక్తులు, పూజలు నిర్వహించి, దేవతలకు పూలు, పళ్లు, మిఠాయిలు సమర్పిస్తారు. ముఖ్యంగా నవరాత్రులు, శివరాత్రి, మకర సంక్రాంతి వంటి శుభ సమయాల్లో ఆలయాలు రద్దీగా ఉంటాయి. నవగ్రహాల ఆశీర్వాదం కోసం నవగ్రహ పూజకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి . పూజారి మంత్రాలను పఠిస్తూ దేవతలకు వివిధ పదార్థాలను సమర్పిస్తారు. ఈ పూజలో ఒక్కో గ్రహానికి సంబంధించిన ఒక్కో రకమైన పదార్ధాలను విడివిడిగా పెట్టి పూజిస్తారు.


💠 గౌహతి నవగ్రహ ఆలయంలో జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ వార్షిక నవగ్రహ ఉత్సవం. 

నవంబరు నెలలో జరుపుకునే ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. పండుగ యొక్క ప్రతి రోజు నవగ్రహాలలో ఒకరికి అంకితం చేయబడి ,సంబంధిత దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు. 


💠 గౌహతిలో కామాఖ్య అమ్మవారి ఆలయానికి 20 కిమీ దూరంలో ఉంటుంది...  వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి 5 కిమీ దూరంలో ఉంటుంది ..

*రైల్వే సమాచారం

 *రైల్వే సమాచారం*

 🚂🚂🚂🚂🚂🚂🚂

 =====================

 *జూలై 1 నుండి* రైల్వే యొక్క ఈ 10 నియమాలు మార్చబడ్డాయి ....

 =====================

 *1*) వెయిటింగ్ లిస్ట్ యొక్క ఇబ్బంది ముగుస్తుంది.  *రైల్వే నడుపుతున్న సువిధ రైళ్లలో ప్రయాణీకులకు ధృవీకరించబడిన టికెట్ల సౌకర్యం ఇవ్వబడుతుంది.*

 ...................................

 *2*) జూలై 1 నుండి *తత్కాల్ టిక్కెట్ల రద్దుపై 50 శాతం మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది.*

 ...................................

 *3*) జూలై 1 నుండి తత్కాల్ టిక్కెట్ల నిబంధనలలో మార్పు ఉంది. *ఎసి కోచ్ కోసం ఉదయం 10 నుండి 11 వరకు టికెట్ బుకింగ్ చేయగా, స్లీపర్ కోచ్ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు బుక్ చేయబడుతుంది.*

 ...................................

 *4*) జూలై 1 నుండి రాజధాని మరియు శతాబ్ది రైళ్లలో పేపర్‌లెస్ టికెటింగ్ సౌకర్యం ప్రారంభించబడుతోంది. ఈ సౌకర్యం తరువాత, శతాబ్ది మరియు రాజధాని రైళ్లలో పేపర్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు, *బదులుగా టికెట్ మీ మొబైల్‌లో పంపబడుతుంది.*

 ........................

 *5*) త్వరలో రైల్వే టికెటింగ్ సౌకర్యం వివిధ భాషలలో ప్రారంభం కానుంది.  ఇప్పటివరకు, రైల్వేలలో హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి, *కానీ కొత్త వెబ్‌సైట్ తరువాత, ఇప్పుడు టికెట్లను వివిధ భాషలలో బుక్ చేసుకోవచ్చు.*

 ......................

 *6*) రైల్వేలో టిక్కెట్ల కోసం ఎప్పుడూ పోరాటం ఉంటుంది.  ఇలాంటి పరిస్థితుల్లో *జూలై 1 నుంచి శాతాబ్ది, రాజధాని రైళ్లలో బోగీల సంఖ్య పెరుగుతుంది.*

 ......................

 *7*) ప్రత్యామ్నాయ రైలు సర్దుబాటు వ్యవస్థ, సువిధ రైలు మరియు *ముఖ్యమైన రైళ్ల రద్దీ సమయంలో మెరుగైన రైలు సౌకర్యాన్ని అందించడానికి ప్రణాళిక చేయబడ్డాయి.*

 ......................

 *8*) జూలై 1 నుంచి *రాజధాని, శాతాబ్ది, దురోంటో, మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాల్లో సువిధ రైళ్లను రైల్వే మంత్రిత్వ శాఖ నడుపుతుంది.*

 ........................

 *9*) జూలై 1 నుండి రైల్వే ప్రీమియం రైళ్లను పూర్తిగా ఆపబోతోంది.

 ......................

 *10*) సువిధ రైళ్లలో *టిక్కెట్ల వాపసుపై 50% ఛార్జీలు తిరిగి ఇవ్వబడతాయి.*  ఇది కాకుండా, ఎసి -2 లో రూ .100, ఎసి -3 పై రూ .90 /, స్లీపర్‌లో ప్రయాణీకుడికి రూ .60 / - తగ్గించబడుతుంది.

 ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేస్తారు

 ........................................

 *రైలులో నిర్లక్ష్యంగా నిద్రించండి*, మీ గమ్యం స్టేషన్ వద్దకు వచ్చే కొద్ది సమయంలోనే రైలు యాప్  మేల్కొపుతుంది ....

 =====================

 మీరు 139 కు కాల్ చేసి మీ పిఎన్‌ఆర్‌లో *వేకప్ కాల్-డెస్టినేషన్ అలర్ట్ సదుపాయాన్ని సక్రియం చేయాలి.*

 ...................................

 గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకునే ముందు రాత్రి రైలులో ప్రయాణించే *ప్రయాణికుల కోసం రైల్వే వేకప్ కాల్-డెస్టినేషన్ హెచ్చరిక సౌకర్యాన్ని ప్రారంభించింది.*

 .........................

 *గమ్యం హెచ్చరిక అంటే ఏమిటి*

 =====================

 > ఈ సదుపాయాన్ని *గమ్యం హెచ్చరిక* అని పేరు పెట్టారు.

 =====================

 సౌకర్యాన్ని సక్రియం చేసినప్పుడు, *గమ్యం స్టేషన్ రాకముందే మొబైల్‌లో అలారం వినిపిస్తుంది.*

 ........................

 > ఈ సదుపాయం పొందటానికి,

 ...................

 *హెచ్చరిక* అని టైప్ చేసిన తరువాత

 ...................

  *పిఎన్‌ఆర్ నంబర్* టైప్ చేసి

  139 కు పంపండి.

 ...................

 > 139  కాల్ చేయాలి *.

 *కాల్ చేసిన తరువాత, భాషను ఎంచుకుని, ఆపై 7 డయల్ చేయండి.*

 ...................

 *7 డయల్ చేసిన తరువాత, పిఎన్ఆర్ నంబర్ డయల్ చేయాలి *ఆ తరువాత ఈ సేవ మొదలు అవుతుంది.

 ...................................

 > ఈ సదుపాయానికి *వేక్-అప్ కాల్* అని పేరు పెట్టారు.

 ......................

 అది మీరు మొబైల్ లిఫ్ట్ చేసే వరకు *మొబైల్ బెల్ మోగుతుంది.*

 ......................

 ఈ సదుపాయం మీరు ఉపయోగించితే, స్టేషన్ రాకముందే మొబైల్ గంట మోగుతుంది.  మీరు ఫోన్‌ను స్వీకరించే వరకు ఈ గంట మోగుతూనే ఉంటుంది.  ఫోన్ అందిన తరువాత, స్టేషన్ రాబోతున్నట్లు ప్రయాణికుడికి సమాచారం ఇవ్వబడుతుంది.

 ........................................

 🙏🏻 *దయచేసి ఈ సందేశాన్ని అందరికీ పంపండి.*

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ:


*కుబేరునికి రావణుడు తమ్ముడు కదా! వీరి ఇద్దరి మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది.?*


కుబేరుడు ధనాధిపతి. యక్షులకు రాజు. మనిషిని వాహనంగా గలవాడంటారు. ఇతని రూపం కొంత వికృతంగానే వుంటుందని పేర్కొన్నా, ఈయన కుమారుడయిన నలకూబరుడు పురాణాలలో అందగాళ్ళలో ఒకడిగా పేరు చెందినవాడు.

కుబేరుడిని అసలు పేరు వైశ్రవణుడు. తండ్రి విశ్రవసు వయినా తల్లి ఎవరనే దానిగురించి వేరు వేరు పురాణాలలో భిన్న కథనాలు వున్నాయి. కుబేరుడనే పేరు శాపం వలనే వచ్చింది. ఒకసారి పార్వతీదేవి శివుని ఎడమ తొడపై కూర్చొని ఉండగా కుబేరుడు అసూయతో చూడడం పార్వతి గమనించి కు(చెడు) దృష్టితో చూచినాడు కనుక కన్ను పచ్చగా మారుతుందని శాపం ఇచ్చింది. అందుకే కుబేరుని ఏక పింగ లేక పంగళాక్షుడని కూడా అంటారు. కుబేరుడికి స్నేహితుడు అయిన శివుడు పార్వతిని శాంతింపచేసి మాములు చూపు కలిగించాడు.

రావణ, కుంభకర్ణ, విభీషణుడు, శూర్పణఖ మొదలయినవారు విశ్రవసుడికి మరో భార్య అయిన కైకసి వలన కలిగారు. దీనికీ భిన్న కథనాలు వున్నాయి.

కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి దిక్పాలకత్వం (ఉత్తర దిక్కుకు అధిపతి), అంతులేని సంపదలు, వరంగా పొందాడు. బ్రహ్మ నుండి పుష్పక విమానం పొందగా, తండ్రి దక్షిణ సముద్రంలో లంకానగరాన్ని కుబేరుడికి నివాసంగా ఇస్తాడు.

రావణుడు. బ్రహ్మనుండి వరాలు పొంది దేవతల్ని బ్రాహ్మణుల్ని హింసిస్తున్నాడని తెలిసి, కుబేరుడు తన తమ్ముడైన రావణుడిని నీతిగా జీవించమని దూతతో వర్తమానం పంపగా, కోపించిన రావణుడు వచ్చిన దూతని చంపి, కుబేరునిపై దండెత్తి యుద్దంలో అతనిని ఓడించి లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని గెలుచు కొంటాడు. తదుపరి కుబేరుడు గంధమాదన పర్వతం పైన అలకాపురిని నిర్మించుకుని నివసించాడు.

భాగవత కధా కవితా సుధారసము

 భాగవత  కధా కవితా సుధారసము

                                                   --------------------------------------------------- 


              కం: పలికెడిది భాగవతమట!

                     పలికించెడు వాఁడు  రామభద్రుండట!  నే

                     పలికిన  భవహర మగునట!

                     పలికెద,  వేరొండు గాధ  పలుకఁగ  నేలా? 


                       అంటూ సర్వము  భగవత్కర్తృత్వము గా నెంచి  భక్తి భావ సంభరితముగా  రచియింపఁ బడిన  మహాపురాణ గ్రంధము

శ్రీమదాంధ్ర మహాభాగవతము.


                 భాగవతం చదవటం  అంటే  బాగుపడటం"- అన్నారు పెద్దలు. తపస్సు యజ్ఙయాగాదులు చేయటం, వంటి కష్టాలు యేమాత్రం పడకుండా కేవలం  ,శ్రవణ  మాత్రం చేతనే  ముక్తిని పొందే ఉపాయం భాగవత కధాశ్రవణం .


                                 చతుర్వేదములను, అష్టాదశ పురాణములను, పదునెనిమిది పర్వముల మహాభారతమును  రచించించియు,

కలత వొందు వ్యాసుని  చిత్తార్తిని దీర్చుటకు నారదోప దేశమున వ్యాసునిచే నీగ్రంధము విరచింప ఁబడినది .పన్నెండు స్కంథములుగా

విస్తరిం చిన  యీగ్రంధము మహాపురాణముగా కీర్తింప బడుచున్నది.


                                  భగవం తుడే (శ్రీకృష్ణుడు) కథానాయుకుడైన యీగ్రంధమును  పరమ భాగవతాగ్రేసరుడు  ఆంధ్రీకరించి  యాంధ్రులకు  సారస్వత సంబంధమైన విందు సమకూర్చినాడు. కల్పక సదృశమైన యీభాగవతము మందార మకరందములను

గురియించు పద్య సంపదకు నెలవై యాంధ్రుల హృదయ క్షేత్రములలో  నాధ్యత్మికమును పండించుచు ముక్తిద్వారముగా మురిపించుచున్నది.


                              పోతన కవిత్వ మొక పంచదార పాకము. జుంటితేనియ. గొజ్జగి పూమృదులము. తెనుగు పదములకు సంస్కృత సమపదములను జోడించి, శబ్దార్ధాలంకార భాసురమై  నాదసుభగాభిరామమై  చదివినంత సేపు పాఠకుని యొక దివ్య కవితాలోకమున

విహరింపఁజేయును.


                    కృష్ణుని బాల్యక్రీడలు మరపురాని ఘట్టము. భావుకుడైన పాఠకుడా ఘట్టమున మునిగి కన్నుల నానంద భాష్ప శిక్తుడౌట

తథ్యము. యిందలి యుపాఖ్యానములన్నియు నొకదానిని మించి మరియొకటిగా చిత్రిపబడి యుండును. అనుప్రాసలతోను, అంత్యప్రాసలతోను, యమకాదులతోను, ఆపద్యములు పాఠకుని కవితాడోలలో  నూయల లూగించును.


                     పోతన ప్రతిభను "మందార మకరందాది యొండు రెండు పద్యములతో  వివరించుట  సాధ్యము కానిపని.సామాన్యముగా క్రియాపదముతోనో లేక అవ్యయముతోనో ప్రారంభమౌ వృత్తపద్యములు ఆపై వరుసగా విశేషణ ముల

ముక్తాయింపులతో  అంత్యప్రాసల విన్యాసములతో బహు సుందరముగా నుండును.


            "  అట  గాంచెన్  కరణీ విభుండు  నవఫుల్లాంభోజ కల్హారమున్

                నట దిందీవర వారమున్  గమఠ మీన గ్రాహ  దుర్వారమున్

               వట హింతాల తమాల తాల తరుణీ వల్లీ కుటీతీరమున్

                చటులోధ్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గా సారమున్ి


                                అట, అవ్యయం.కాంచెన్ క్రియ.కాసారమున్  విశేష్యము.తక్కినవన్నీ విశేషణములే!


                     పోతన భాగవత మొక కవితా సాగరము.పద్యములన్నియు మంచి ముత్యముల రాసులే  ఎన్నిని యెన్నగలం? అదిమన శక్తికి మించిన పని.


                        పోతన కవితా తత్వమును బహుముఖములుగా బరిశీలించిన వారిలో  అభినవ పోతన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి ప్రశంసా పద్యాలతో మనమీ విషయాన్ని ముగిద్దాం.మరోసారి విపులంగా పోతన గారిగురించి చెప్పుకుందాం.


                "  అచ్చపు జుంటితేనియల  నైందవబింబ  సుధారసాల  గో

                   ర్వెచ్చని  పాలమీగడల  విచ్చిన  కన్నె  గులాబి  మొగ్గలన్

                   మచ్చరికించు  నీ మధుర మంజుల మోహన మైన  శైలి నీ

                   వెచ్చట  నేర్చినావు సుకవీ!సుకుమారకళా కళానిధీ!


                "  ముద్దులుగార  భాగవతమున్  రచియించుచు  పంచదారలో

                    నద్దితివేమొ  ఘంటము  మహాకవి శేఖర!  మధ్య  మధ్య   న

                    ట్లద్దక  వట్టి ఘంటమున  నట్టిటు  గీసిన  తాటియాకు  లో

                    పద్దెములందు  నీ మధుర  భావన  లెక్కడినుండి  వచ్చురా?


                                                         కరుణశ్రీ,


జ      జుంటితేనెల తీయదనం. వెన్నెల లోని యమృతం,  గోరువెచ్చని పాలమీగడల సొగసును,విచ్చిన లేతగులాబి మొగ్గలను మచ్చరికింప జేస్తుందట పోతన కవిత్వం. కరుణశ్రీ యెంతచక్కగా చెప్పారు.అసలు యింత సుకుమారమైన కవితాకళను నీవెక్కడ

నేర్చుకున్నావయా? అనిప్రశ్న? అదియా భగవదత్తము. నిరంహంకారమునకు నిర్మమత్వమునకు ప్రతిఫలము!


                     మద్దులు గారేవిధంగా కవిత్వంవ్రాస్తూ గంటాన్ని పంచదారలోముంచావేమో ?అందుకే నీకవిత్వానికి అంతతీపి! మధ్యమధ్యమరచావేమో నంటాడు కరుణశ్రీ యింతకన్నా యెవ్వరు మాత్రం పోతన కవితను వింగడించగలరు?


                           " అందుకే భాగవతమును రోజూ చదువుకుందాం  అందరం బాగుపడదాం!


                                                                       స్వస్తి!🙏🙏🌷🌷💐💐💐🌷🌷🌷🌷💐💐💐

సుభాషితమ్

 .                   🪷🪷🪷

                _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


 *దారా ఇమే మే తనయ ఇమే మే*

*గృహా' ఇమే 'మే పశవశ్చ మేమేl*

*ఇత్థం నరో మేష సమాన ధర్మః*

*మేమేకరః కాలవృకేణ నీతఃll*


తా𝕝𝕝 

మానవుడు జీవితమంతా 'ఈమె నా భార్య', ' వీళ్లు నా పిల్లలు', 'ఇవి నా ఇళ్లు' , 'ఇవి నా పశువులు' అని(మే మే అని)మేకలా అరుస్తూ అరుస్తూ ఒక రోజున తోడేలు వంటి మృత్యువు చేతికి చిక్కి మరణిస్తున్నాడు..... కాబట్టి ఎల్లప్పుడూ బంధరహితునిగా ఉండుము.

చదువుతోబాటురసజ్ఙత

 కవితాకన్యక వరించేదెవరిని?


" నైనం వ్యాకరణజ్ఙమేతి పితరమ్ !

నభ్రాతరం ఛాందసమ్/

మీమాంసానిపుణం నపుంసక ఇతి,జ్ఙాత్వా నిరస్తాదరాత్/

"కావ్యాలంకరణజ్ఙమేవ, కవితాకన్యా వృణీతే స్వయమ్ "//

ఒక కవిగారు కష్టపడి ఒకకావ్యంవ్రాశారు.ఆకావ్యకన్యకు (కావ్యాన్ని కన్యగా పోల్చుట కవిసమయం) తగిన వరుని నిర్ణయించగోరి నలుగురు వరులను రప్పించారు. వారు వరుసగా-

1 వ్యాకరణవేత్త.

2వేదవేత్త.

3 తర్కశాస్త్ర పండితుడు

4కావ్య,అలంకారాదులపరిచయముగలవాడు.

     ఈనలుగురిలో నొకనివరింపుమని కవితాకన్యనుగోర ఆమె మొదటి ముగ్గురను కాదని నాల్గవవానినే వరించినది.కారణమేమో? చూతము.

 1"నైనం  వ్యాకరణజ్ఙమేతిపితరమ్."-వ్యాకరణవేత్తను తండ్రివరుసయగుననితిరస్కరించినదట.!

2 వేదవేత్తసోదరుడగునని వలదన్నదట!

3తర్కశాస్త్రప్రవీణునిజూచి వీడా! తృతీయప్రకృతి(నపుంసకుడు)వలదన్నదట! వ్యర్ధవాగ్వాదమేగాని పనిశూన్యమని యామెయాంతర్యము.

4 ఇకమిగిలిన వాడు వివిధకావ్యములనెరింగినవాడు.అలంకారశాస్త్రవేత్త,రసజ్ఙుడు కావున అతనిని స్వయముగా వరించినదట!


ఈవిషయాన్నే తిరుపతివేంకట కవులు చమత్కారంగా-

"ఎందరిజూపెనేని వరియింపదు 'మాకవితాకుమారి' క /

న్నందుకుదేశముల్ తిరుగుటబ్బెను సౌఖ్యములేకపోయె,నా /

నందనృపాల! నీదుసుగుణంబులనేగనిదెల్పినంత, వెం /

టందలయూచె;ఁగావున దటాలునదీనిపరిగ్రహింపుమా!

     (నానారాజ సందర్శనం-తిరుపతికవులు) అన్నారట!


   చూచితిరా కావ్యకన్యనిర్ణయము."చదువుతోబాటురసజ్ఙత అత్యవసరము.అప్పుడే చదివినదానికి సార్ధకత!సౌందర్యమునారాధించుటకు కళాహృదయముండవలెను.అట్లే సాహిత్యము నారాధించుటకు సరసుడై యుండవలెను.లేకున్నకావ్యరసాస్వాదనము.గగన కుసుమమే!!


                 స్వస్తి!💐🌷🌷🌷🙏🙏💄🌷👍💐🌷🌷🌷🌷🌷🌷💐🌷🌷🌷










 

వ్యాస పౌర్ణమి

 🙏వ్యాస పౌర్ణమి (గురు పౌర్ణమి)సందర్భంగా 

*గురు అక్షరమాల స్తుతి*

అ - అద్వైతమూర్తి - గురువు*

ఆ - ఆనందస్ఫూర్తి - గురువు*

ఇ - ఇలదైవం - గురువు*

ఈ - ఈశ్వరరూపము - గురువు*

ఉ - ఉద్ధరించువాడు - గురువు*

ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు*

ఋ - ఋజువర్తనుడు - గురువు*

ౠ - ఋణము లేనివాడు - గురువు*

ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు*

ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు*

ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు*

ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు*

ఓ - ఓంకార రూపము - గురువు*

ఔ - ఔదార్య మేరువు - గురువు*

అం - అందరూ సేవించేది - గురువు*

అః - అహంకార రహితుడు - గురువు*

క - కళంకము లేనివాడు - గురువు*

ఖ - ఖండరహితుడు - గురువు*

గ - గుణాతీతుడు - గురువు*

ఘ - ఘనస్వరూపము - గురువు*

ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు*

చ - చక్రవర్తి - గురువు*

ఛ - ఛత్రము వంటి వాడు - గురువు*

జ - జనన మరణములు లేని వాడు - గురువు*

ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు*

ఞ - జ్ఞానస్వరూపము - గురువు*

ట - నిష్కపటుడు - గురువు*

ఠ - నిష్ఠకలవాడు - గురువు*

డ - డంబము లేనివాడు - గురువు*

ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు*

ణ -  తూష్ణీభావము కలవాడు - గురువు*

త - తత్త్వోపదేశికుడు - గురువు*

థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు*

ద - దయాస్వరూపము - గురువు*

ధ - దండించి బోధించువాడు - గురువు*

న - నవికారుడు - గురువు*

ప - పంచేంద్రియాతీతుడు - గురువు*

ఫ - ఫలాకాంక్షా రహితుడు - గురువు*

బ - బంధము లేనివాడు - గురువు*

భ - భయరహితుడు - గురువు*

మ - మహావాక్యబోధకుడు - గురువు*

య - యమము కలవాడు - గురువు*

ర - రాగద్వేష రహితుడు - గురువు*

ల - లవలేశము ద్వేషము లేనివాడు - గురువు*

వ - వశీకరణశక్తి కలవాడు - గురువు*

శ - శమము కలవాడు - గురువు*

ష - షడ్భావ వికారములు లేనివాడు - గురువు*

స - సహనశీలి - గురువు*

హ - హరిహర రూపుడు - గురువు*

ళ - నిష్కళంకుడు - గురువు*

క్ష - క్షరాక్షర విలక్షణుడు - గురువు*

ఱ-ఎఱుకతో ఉన్నవాడు -

గురువు* 

గురువు లందరికి 

గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏

గురుపూర్ణిమ వైశిష్ట్యం

 *ఆషాఢ పూర్ణిమ - గురుపూర్ణిమ వైశిష్ట్యం.*👇

>>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<                                                     *శ్లో॥ ఏకాక్షర ప్రదాతారం, యో గురుం నాభి మన్యతేl                                                                                      స శ్వయోని శతం గత్వా, చండా లత్వం అవాప్నుయాత్॥*


అన్నింటికంటే!గురుద్రోహం మహాపా తకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చా లాకష్టం. ఒక్కఅక్షరం లేక ఓంకారం, ఉపదేశంగా ప్రసాదించినగురువును గౌరవించని పాపి, వరుసగా నూరు జన్మలు కుక్కగా పుడతాడు. 

ఈ పాపానికి ప్రాయశ్చిత్తంఆషాఢశు క్లద్వాదశీ వ్రతం. 

ఆషాఢ శుక్లద్వాదశి నాడు ఉదయా న్నే లేచి, శిరస్నానం చేసి,గోపంచకం తో విప్రుల పాదాలు కడిగి, ఆపైశివా లయంలోనిఅర్చకునకు,స్వయంపా కాదులు దానం చేస్తే!, గురుద్రోహపా పం ఉపశమిస్తుంది.


సత్యవతికి, పరాశరమహర్షికి శ్రీమ హావిష్ణువు అంశతో వ్యాసమహర్షి జన్మించిన తిథి ఆషాఢపూర్ణిమ. ఇదేవ్యాసపూర్ణి/మగురుపూర్ణిమగా ప్రసిద్ధికెక్కినది. 

అనంతరం ఏకరూపం అయిన వేదా న్నివిభజించి,వేదవ్యాసుడయ్యాడాయన. అష్టాదశమహాపురాణాలను, ఉపపురాణాలను,మహాభారతసంహితను, బ్రహ్మసూత్రాలనులోకాలకి అందించిన విష్ణుస్వరూపుడైన వ్యా సుని జన్మమాసం ఈఆషాఢమాసం. పూర్ణిమ నాడు గురుపూజచేసినవా రుదక్షిణామూర్తిస్వరూపులవుతారు.

1. వేదవ్యాసుడు సాక్షాత్తు విఘ్ణస్వ రూపుడు. *వ్యాసో నారాయణో హరిః* అని సమస్త జగత్తుఆయన్ని కీర్తించింది.

2. శ్రీమన్నారాయణుడు భూమిపైధ రించిన ఇరవైరెండు అవతారాల్లో ఒక దివ్యఅవతారంవ్యాసావతారం.

3. సత్యవతికి, పరాశరుడికి వ్యాసు డు ఆషాఢమాసంలో పూర్ణిమనాడు సరిగ్గా మధ్యాహ్నం( సమయంలో ఇంచుమించుగా 11:౩౦ కి ఆవిర్భ వించినట్టుగా పురాణాలు చెపుతు న్నాయి.

4. వ్యాసపూర్ణిమని గురుపూర్ణిమ అని పిలవబడడానికి కారణం అం దరికి గురువు ఆయనే!. విష్ణువు, వ్యాసుడి రూపంలో వచ్చి, వేదము లను విభజించి ఇచ్చిన మహానుభా వుడు.ఆచరించవలసిన విధివిధాన ములు 

1. మనం ఎక్కడున్నా తప్పకుండా గురువుని ధ్యానించాలి, కుదిరితేగు రువుని దర్శించి, సేవ చేసి, ప్రదక్షిణ చేసి, దక్షిణ సమర్పించాలి.

2. గురువుకి దూరంగా ఉన్నవారు, ఇంట్లోనే కూర్చుని యథాశక్తిగాగురు వుని అర్చించాలి.

3. ఎంత ఎక్కువ గురుస్మరణ చేస్తే, జీవితంలో అంత ఎక్కువ శుభాల ను పొందుతారు.

4. అమ్మవారి దగ్గర ఉన్న చింతామ ణి ఇచ్చేటటువంటి శుభాలు పొందా లంటే గురువుపాదాలుపట్టుకోవాలి.

5. గురువు అనుగ్రహిస్తే! యోగాలు కూడా పొందలేనటువంటి శుభాలు ఈ జన్మలో పొందవచ్చు.

6. వ్యాసపూర్ణిమ నాడుతప్పకగురు వును పూజించడంవల్లభగవంతుడి అనుగ్రహం పొందవచ్చు. అందువల్లేతమగురువునివ్యాసుడిగా భావించి, భక్తితో పూజించాలి.   నేడు గురు పూర్ణిమ: వ్యాసుని పూ జిస్తేఅనుగ్రహిస్తాడు..దానికి ఈ కథే ఉదాహరణ!.

సనాతన హైందవ సమాజంలోగురు వుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. 

పూర్వ కాలంలో గురువులనుశిష్యు లు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివ శించేవారు.ఆషాఢ శుద్ధపౌర్ణమిని *‘గురుపూర్ణిమ’-‘వ్యాసపూర్ణిమ’* అని అంటారు. ఈ రోజున గురువు లను పూజించి , గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునేవ్యాసమహర్షిజన్మిం చినట్టుపురాణాలుచెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒకమహాపర్వ దినంగా జరుపుకోవడం తరతరాలు గా కొనసాగుతోంది. ఈ రోజునగురు భగవానుడిని , వ్యాస మహర్షినిపూ జించే వారికి అష్టైశ్వర్యాలు కలుగు తాయి. 

*‘గురుబ్రహ్మ గురుర్విష్ణుగురుర్దేవో మహేశ్వరః!                                             గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’.!!* 

గురు పౌర్ణమి చాతుర్మాస దీక్షప్రారం భ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమేఈచాతు ర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమి. అంటే! తమకు సమీ పంగా,నివసిస్తున్నతపస్సంపన్నులను సమీపించి , పూజించి , జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్ఠమైంది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.*పురాణాల కథనం ప్ర కారంపూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతులునివాసంఉం డేవారు. ఆ బ్రాహ్మణుని పేరువేద నిధి. ఆయన సతీమణి పేరు వేద వతి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మికచిం తన , భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి , వ్రతాలు చే సినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు రోజూ మధ్యా హ్న సమయంలో రహస్యంగాగం గానదికి స్నానానికి వస్తూ ఉంటా రని తెలుసుకున్న వేదనిధిఎలాగై నా ఆయన దర్శించుకోవాలనిభా వించాడు. ఆ రోజు నుంచివ్యాసు డి కోసం వేయికళ్లతోవెతకడంప్రా రంభించాడు. ఈ నేపథ్యంలో ఒక రోజు భిక్షువు రూపంలో చేతిలో దండం,కమండలం ధరించిన వ్య క్తిని చూసిన వేదనిధి వెంటనే అ తడి పాదాలపై పడి నమస్కరిం చాడు. ఆ భిక్షువు మాత్రంకసురు కున్నాసరే! పట్టిన పాదాలనుమా త్రం విడవకుండా‘మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవాను లని నేను గ్రహించాను. కాబట్టిమి మ్మల్ని శరణు పొందగోరు చున్నా ను’అని అంటాడు.* ఆ మాటలకు ఖంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒ డ్డున నలుదిశలా చూస్తూ , ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికిం చాడు.వెంటనేవేదనిధినిఆప్యాయం గా పైకిలేపి ఏమికావాలోకోరుకోమం టారు.


రేపు నా తండ్రి పితృకార్యం , దానికి తమరు బ్రాహ్మణార్థమైఅతిథిగామా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడు కుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మ న్నించి మహర్షి దీనికిఅంగీకరిస్తాడు. దీంతో సంతోషంగాఇంటికిచేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంత మంతా వివరించాడు. ఇచ్చిన మాటప్రకారం మర్నాడు ఉదయమే! వారి ఇంటికి విచ్చేసిన వ్యాసభగవానుడిని ఆదం పతులు సాదరంగా లోనికిఆహ్వానిం చి అతిథిసత్కారాలుచేసిపూజించా రు.అనంతరందేవతార్చనకుతులసీ దళాలు,పువ్వులను సిద్ధం చేసి, శ్రా ద్ధవిధులనువిధివిధానంగానిర్వహిం చి , అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్ఠుడైన ఆయన వారికిఏవరంకావాలోకోరుకోమన్మారు.స్వామి ఎన్నినోములు , వ్రతాలు చేసినా సంతానభాగ్యం మాత్రం లేద ని , ఆ వరాన్ని ప్రసాదించాలని వేడు కున్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు , ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆ శీర్వదించాడు. వ్యాసుడిఅనుగ్రహం తో వేదనిధి , వేదవతి సంతానయో గం లభించింది. సుఖసంతోషాలతో జీవితచరమాంకంలో విష్ణుసాయు జ్యాన్ని పొందగలిగారు. 

కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున మహా మునిని ప్రార్థిస్తే! ఆయనఅనుగ్రహం లభిస్తుందని,పండితులువివరిస్తున్నా రు.నేడు (03.07.2023)సోమ వారంవ్యాస పూర్ణిమ సందర్భంగా! *శ్రీ వేదవ్యాస అష్టోతర శతనా మా వళిః.* 

---------------------------------------------------------------                                                  

1. ఓం వేదవ్యాసాయ నమః

2. ఓం విష్ణురూపాయ నమః

3. ఓం పారాశర్యాయ నమః

4. ఓం తపోనిధయే నమః

5. ఓం సత్యసన్ధాయ నమః

6. ఓం ప్రశాన్తాత్మనే నమః

7. ఓం వాగ్మినే నమః

8. ఓం సత్యవతీసుతాయ నమః

9. ఓం కృష్ణద్వైపాయనాయ నమః

10. ఓం దాన్తాయ నమః

11. ఓం బాదరాయణసంజ్ఞితాయ నమః

12. ఓం బ్రహ్మసూత్రగ్రథితవతే నమః

13. ఓం భగవతే నమః

14. ఓం జ్ఞానభాస్కరాయ నమః

15. ఓం సర్వవేదాన్తతత్త్వజ్ఞాయ నమః

16. ఓం సర్వజ్ఞాయ నమః

17. ఓం వేదమూర్తిమతే నమః

18. ఓం వేదశాఖావ్యసనకృతే నమః

19. ఓం కృతకృత్యాయ నమః

20. ఓం మహామునయే నమః

21. ఓం మహాబుద్ధయే నమః

22. ఓం మహాసిద్ధయే నమః

23. ఓం మహాశక్తయే నమః

24. ఓం మహాద్యుతయే నమః

25. ఓం మహాకర్మణే నమః

26. ఓం మహాధర్మణే నమః

27. ఓం మహాభారతకల్పకాయ నమః

28. ఓం మహాపురాణకృతే నమః

29. ఓం జ్ఞానినే నమః

30. ఓం జ్ఞానవిజ్ఞానభాజనాయ నమః

31. ఓం చిరఞ్జీవినే నమః

32. ఓం చిదాకారాయ నమః

33. ఓం చిత్తదోషవినాశకాయ నమః

34. ఓం వాసిష్ఠాయ నమః

35. ఓం శక్తిపౌత్రాయ నమః

36. ఓం శుకదేవగురవే నమః

37. ఓం గురవే నమః

38. ఓం ఆషాఢపూర్ణిమాపూజ్యాయ నమః

39. ఓం పూర్ణచన్ద్రనిభాననాయ నమః

40. ఓం విశ్వనాథస్తుతికరాయ నమః

41. ఓం విశ్వవన్ద్యాయ నమః

42. ఓం జగద్గురవే నమః

43. ఓం జితేన్ద్రియాయ నమః

44. ఓం జితక్రోధాయ నమః

45. ఓం వైరాగ్యనిరతాయ నమః

46. ఓం శుచయే నమః

47. ఓం జైమిన్యాదిసదాచార్యాయ నమః

48. ఓం సదాచారసదాస్థితాయ నమః

49. ఓం స్థితప్రజ్ఞాయ నమః

50. ఓం స్థిరమతయే నమః

51. ఓం సమాధిసంస్థితాశయాయ నమః

52. ఓం ప్రశాన్తిదాయ నమః

53. ఓం ప్రసన్నాత్మనే నమః

54. ఓం శఙ్కరార్యప్రసాదకృతే నమః

55. ఓం నారాయణాత్మకాయ నమః

56. ఓం స్తవ్యాయ నమః

57. ఓం సర్వలోకహితే రతాయ నమః

58. ఓం అచతుర్వదనబ్రహ్మణే నమః

59. ఓం ద్విభుజాపరకేశవాయ నమః

60. ఓం అఫాలలోచనశివాయ నమః

61. ఓం పరబ్రహ్మస్వరూపకాయ నమః

62. ఓం బ్రహ్మణ్యాయ నమః

63. ఓం బ్రాహ్మణాయ నమః

64. ఓం బ్రహ్మిణే నమః

65. ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః

66. ఓం బ్రహ్మాత్మైకత్వవిజ్ఞాత్రే నమః

67. ఓం బ్రహ్మభూతాయ నమః

68. ఓం సుఖాత్మకాయ నమః

69. ఓం వేదాబ్జభాస్కరాయ నమః

70. ఓం విదుషే నమః

71. ఓం వేదవేదాన్తపారగాయ నమః

72. ఓం అపాన్తరతమోనామ్నే నమః

73. ఓం వేదాచార్యాయ నమః

74. ఓం విచారవతే నమః

75. ఓం అజ్ఞానసుప్తిబుద్ధాత్మనే నమః

76. ఓం ప్రసుప్తానాం ప్రబోధకాయ నమః

77. ఓం అప్రమత్తాయ నమః

78. ఓం అప్రమేయాత్మనే నమః

79. ఓం మౌనినే నమః

80. ఓం బ్రహ్మపదే రతాయ నమః

81. ఓం పూతాత్మనే నమః

82. ఓం సర్వభూతాత్మనే నమః

83. ఓం భూతిమతే నమః

84. ఓం భూమిపావనాయ నమః

85. ఓం భూతభవ్యభవజ్జ్ఞాత్రే నమః

86. ఓం భూమసంస్థితమానసాయ నమః

87. ఓం ఉత్ఫుల్లపుణ్డరీకాక్షాయ నమః

88. ఓం పుణ్డరీకాక్షవిగ్రహాయ నమః

89. ఓం నవగ్రహస్తుతికరాయ నమః

90. ఓం పరిగ్రహవివర్జితాయ నమః

91. ఓం ఏకాన్తవాససుప్రీతాయ నమః

92. ఓం శమాదినిలాయాయ నమః

93. ఓం మునయే నమః

94. ఓం ఏకదన్తస్వరూపేణ లిపికారిణే నమః

95. ఓం బృహస్పతయే నమః

96. ఓం భస్మరేఖావిలిప్తాఙ్గాయ నమః

97. ఓం రుద్రాక్షావలిభూషితాయ నమః

98. ఓం జ్ఞానముద్రాలసత్పాణయే నమః

99. ఓం స్మితవక్త్రాయ నమః

100. ఓం జటాధరాయ నమః

101. ఓం గభీరాత్మనే నమః

102. ఓం సుధీరాత్మనే నమః

103. ఓం స్వాత్మారామాయ నమః

104. ఓం రమాపతయే నమః

105. ఓం మహాత్మనే నమః

106. ఓం కరుణాసిన్ధవే నమః

107. ఓం అనిర్దేశ్యాయ నమః

108. ఓం స్వరాజితాయ నమః


*ఇతి శ్రీ వేదవ్యాస అష్టోత్తర శత నామావళి సంపూర్ణం.*

మహాస్వామి - మల్లయోధుడు

 మహాస్వామి - మల్లయోధుడు


మన్నక్కల్ కృష్ణ శాస్త్రి అనే యువకుడు తరచుగా శ్రీమఠానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవాడు. అతను మంచి ఒడ్డూ పొడుగు ఉండి కండ పుష్టి కలిగినవాడు. మహాస్వామివారు అతణ్ణి రప్పించారు. 

“కృష్ణా... ఒక గంటసేపు ద్వారం దగ్గర నిలబడు. కదలడానికి వీల్లేదు సరేనా. ఏమంటావు?” అని అడిగారు.


“మీ ఆజ్ఞ పెరియవ” అని బదులిచ్చాడు.


కృష్ణ శాస్త్రితో పాటు అక్కడున్నవారెవరికి అర్థం కాలేదు ఈ మాటల అర్థం ఏంటో. స్వామివారు ఆదేశం ప్రకారం శ్రీమఠం ద్వారం వద్ద నిలబడ్డాడు. ఒక గంట గడిచిన తరువాత లోపలి వచ్చాడు. మహాస్వామివారు పూజ ముగించి రాగానే కృష్ణ శాస్త్రి స్వామి వారికి చెప్పి సెలవు తీసుకొని మన్నక్కల్ వెళ్ళిపోయాడు.


ఖ్యాతినొందిన మహాబలవంతుడైన మల్లయోధుడు ఒకరు కాంచీపురానికి వచ్చాడు. అతనికి గుప్పెడు నువ్వులని ఇస్తే, అవలీలగా వాటిని నలిపి నూనె తియ్యగలడు. ఎన్నో మల్ల యుద్ధాల్లో గెలిచి ఏంటో పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. దాంతో అతన్ని అభిమానించేవారు చాలా ఎక్కువమంది ఉండేవారు. మహాస్వామి వారితో బహుమానం అందుకోవాలని అతని ఉద్ద్యేశం. అతను పరమాచార్య స్వామి ముందర తన కండబలం ప్రదర్శించి స్వామివారు సూచించిన వారితో మల్లయుద్ధం చెయ్యాలని అతని కోరిక.


కంచిలో నివసించే మల్లయోధుని బంధువు ఒకరు ఆ రోజు రాత్రి మఠానికి వచ్చి ఒక శిష్యునితో, “మఠంలో వైదికులు, శిష్యులు, పరిచారకులు ఉడడం సహజమే. ఇప్పుడు మఠం వారు మల్లయోధులను కూడా వినియోగించుకుంటున్నారా?” అని అడిగాడు.


“అదేమీ ప్రశ్న? మఠం ఎందుకు మల్లయోధులను నియమించుకుంటుంది?” అని అన్నాడు ఆ సేవకుడు.


“ఒక పేరుగాంచిన మల్లయోధుడు ఉదయం పది గంటలప్పుడు మఠం దగ్గరకు వచ్చాడు. ద్వారం వద్ద బలవంతుడైన ఒక మల్లయోదుణ్ణి చూసి కనీసం స్వామివారి దర్శనం కూడా చేసుకోకుండా తిరిగొచ్చాడు. ఇప్పుడే అతణ్ణి చెన్నై పంపించి నేను ఇక్కడకు వస్తున్నాను” అని చెప్పాడు.


అక్కడున్న వారందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. “అందుకా మహాస్వామి వారు మన్నక్కల్ కృష్ణ శాస్త్రిని ద్వారం వద్ద నిలబడమన్నారు. అతణ్ణి చూసి ఆ మల్లయోధుడు భయపడి వెళ్ళిపోయాడు”


ఒక మల్లయోధుడు వచ్చి శిష్యులతో మల్ల యుద్ధం చెయ్యడానికి ఆహ్వానిస్తాడని పరమాచార్య స్వామీ వారికి ఎలా తెలుసు? అదే అతిపెద్ద చిక్కుప్రశ్న కదా!


--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

విద్యాభ్యాసం - గురుదక్షిణ

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - VI 


విద్యాభ్యాసం - గురుదక్షిణ 

    

   ప్రస్తుత విద్యావిధానంలో 

1. సమగ్రమైన విద్యను నేర్చుకొనే అవకాశం లేదు. 

    దీనికి కారణం, మానవ మేధస్సుతో ఆలోచించి, తయారుచేసిన విద్యావిషయాలు. 

2. ఉపాధికోసమే విద్యార్జన అనేది పూర్తి అలవాటైంది. 

3. ఏదైనా విద్య నేర్చకొనాలంటే, 

* ప్రవేశ పరీక్షలో ప్రతిభనైనా కనబరచాలి. లేదా 

* రిజర్వేషను వర్తించాలి. లేదా 

* Donation కట్టి చదువు "కొనే" స్థోమతైనా ఉండాలి. 


    కానీ, మెకాలే విద్యావిధానం ప్రవేశపెట్టకముందు, మన దేశంలో,

1. విద్య అసలు సిసలు శాస్త్రీయమైనది. వేద, ఉపనిషత్ ప్రామాణికమైనది. 

2. విద్య ఉపాధికోసం కాక, మనో వికాసానికే.

3. పిల్లవాడి అభిరుచి మేరకు గురువు దగ్గర విద్య నేర్చుకునేవాడు. 

    గురువు వద్ద విద్యనేర్చుకోవడానికి ఏ విధమైన ప్రవేశ పరీక్ష ఉండేదికాదు. 

    రాజు - రైతు - సేవకుడు అనే భేదం లేకుండా, విద్యార్థుల అభిరుచినిబట్టి అందఱూ కలసి గురుకులంలో ఉచితంగా విద్యని అభ్యసించేవారు. కృష్ణుడు - కుచేలుడు కలసి చదువుకోవడమే దీనికి నిదర్శనం. 


గురుదక్షిణ 


    గురువువద్ద విద్యనేర్చుకున్న అనంతరం శిష్యుడు తన గురువుకు సమర్పించుకునేదే గురుదక్షిణ. 

    గురువు తన అవుసరాన్నీ, శిష్యుని స్థితినీ దృష్టిలో పెట్టుకుని గురుదక్షిణ అడిగేవాడు. 

    దీనికి ఉదాహరణలు 

 1. కుచేల,బలరామ,కృష్టులకు గురువైన సాందీపని, 

     ప్రభాస తీర్థంలో మునిగి మరణించిన తన పుత్త్రుని గురుదక్షిణగా తెచ్చిమ్మని,  కృష్ణుణ్ణి అడిగాడు. 

2, పాండవుల కౌరవుల గురువైన ద్రోణుడు, గురుదక్షిణగా - తనని అవమాన పరచిన ద్రుపదుని బంధించి తీసుకురమ్మని అర్జునుని అడిగాడు. 


లౌకిక - పారమార్థిక విద్యలు 


1. ద్రోణ ద్రుపదులు కలసి చదువుకున్న ప్రాణమిత్రులు. ఎప్పటికీ ప్రియమైనవారుగా ఉండాలని ప్రతిజ్ఞ చేసుకున్నవారు. కానీ ద్రోణుడు దరిద్ర స్థితిలో ద్రుపదుని సహాయంకోరి వెడితే "రాజుకీ - బీదబ్రాహ్మణునికీ సంబంధమేమని" అవమానపరిచాడు. 

    ప్రతిగా ద్రోణుడు ద్రుపదుడు తన సహాధ్యాయే అయినా, తనని అవమాన పరచి శత్రువైన ద్రుపదుని బంధించి తీసుకురమ్మని అర్జునుని అడిగాడు. 

   {అదే ద్రోణుడు అర్జునుని మాత్రమే మేటి విలుకాడుగా చూడడానికి, 

    బొటనవ్రేలు గురుదక్షిణగా అడగడం కూడా గమనించదగ్గ విషయం(దానికి లోతైన వేరే కారణం ఉంది. అది వేరే విషయం) }. 

2. కృష్ణ - కుచేల సంబంధాన్ని మనం గమనిస్తే, దీనికి విరుద్ధంగా కనిపిస్తుంది. 

    తనతో కలసి విద్యనభ్యసించిన కుచేలుడు వస్తే, సాదరంగా ఆహ్వానించి, 

     కుచేలుడు అడగకుండానే, కుచేలుడికి సంపదను కృష్ణుడు అనుగ్రహించాడు. 


    ఈ ద్రోణ - ద్రుపద, కృష్ణ - కుచేల సంఘటనలను గమనిస్తే ఒక విషయం బోధపడుతుంది. 

    ద్రోణ - ద్రుపదులు విలువిద్యవంటి లౌకిక విద్యలు నేర్చుకున్నవారు. 

    కృష్ణ - కుచేలులు పారమార్థికవిద్య అభ్యసించినవారు. 


    కేవలం "లౌకిక" విద్యలైతే కక్షలూ కార్పణ్యాలకు దారితీసే అవకాశం ఉంటుందనీ, దానికి "పారమార్థిక" విద్య చేరితే దయాదాక్షిణ్యాలబ్బుతాయనీ తెలుస్తుంది. 


    ప్రస్తుతం మన విద్యావిధానంలోని లోపం అదేకదా! 


                    =x=x=x= 


రామాయణం శర్మ 

            భద్రాచలం

ఈ రోజు పదమ:

 210వ రోజు: (జయ వారము) 04-07-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదమ:

కోడలు: జామి, వధువు, స్నుష. 

కోడరికము: కోటరము, కోటరికము, కోడంట్రము, కోడంట్రికము. 


 ఈ రోజు పద్యము:


సంతత పుణ్యశాలి యొక జాడను సంపద వాసిపోయి తా/

నంతట పోకనెట్టుకొని యెప్పటియట్ల వసించియుండు; మా/

సొంతము నందు చందురుని యన్ని కళల్ పెడబాసి పోయినన్/

కాంతి వహింప డోటు తిరుగంబడి దేహము నిండ!  భాస్కరా!

 

 భాస్కరా! పుణ్యాత్ముడు తన సంపద అంతా పోయినా బాధపడక ఎప్పటిలా ఉంటాడు. చంద్రుడు నెల చివర కళలన్నీ పోయినా మళ్ళీ కాంతివంతునిగా వెలుగొందును కదా!

తెలుగు చమత్కారం

 .*తెలుగు చమత్కారం*💥💥💥

🙂 🙂 🙂 🙂 🙂 🙂


'ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ' సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని దండించారట. ' చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా రాసినా పర్వాలేదు.


కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు' అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది.భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.


'వాడెదవ' అంటే తిట్టనుకునేరు .చెరకుగడ చివరిభాగం.


tip of the sugar cane అన్నాడు బ్రౌన్.


'సమాజం' అనబోయి 'సమజం' అన్నారనుకోండి.ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.

'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. (ఈ అర్ధం బాగుంది కదా!)

'శ్రీ' అంటే విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.


'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా .(customary fee - బ్రౌన్)


ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట.


తండ్రికి తగ్గ ఆ కొడుకు " పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు " అన్నాడట ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు. పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.


ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ " మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు " అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం( శబ్దరత్నాకరం)


సొంతవిషయాలను పదేపదే చెబుతుంటే ' నీ సొద ఆపు అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ "శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.


ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది.


' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.


గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం' అని రాస్తున్నాం.


'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.


గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే? కర్ర లేని గొడుగు.


పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.


బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది


'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.


( డాక్టర్ కె ఆనంద్ కిషోర్, పూర్వ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్)

~~~~Forwarded~~~~

గురువులు రకాలు

 *గురువులు ఎన్ని రకాలు ఉంటారు ?*

*గురువుల వలన ఏమిటి ఉపయోగం ?*

*ఏ గురువుని  ఆశ్రయించాలి.*


*1) సూచక గురువు : బాల్యం నుండి నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో.  జీవితంలో ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు. వీరిని సూచక గురువు అంటారు. వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటాము.*


*2 ) వాచక గురువు : ధర్మా ధర్మ విచక్షణ, మంచి చెడు విశ్లేషణ, చతురాశ్రమాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు (బ్రహ్మ చర్యము, గృహస్త్దము, వానప్రస్దం, సన్యాసం). వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో వసిస్తాము.*


*3 ) భోధక గురువు : మహా మంత్రాలను ఉపదేశిస్తారు. లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని, అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని. వీరిని భోధక గురువు అంటారు. లోకికం నుండి అలోకికం వరకు మెల్లగా అడుగులు వేస్తాము.*


*4 ) నిషిద్ద గురువులు : మారణ ప్రయోగాలు, వశికరణాలు, వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది. చిత్తాన్ని శుద్ధి చేయరు. విత్తాన్ని హరిస్తారు. (పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి)*


*5 ) విహిత గురువు: మన హితము గోరి సూచనలు సలహాలు ఇస్తారు, నశించి పోయే విషయ భోగాలుపై  ఆశక్తి తగ్గించి, సత్యమైన శాశ్వతమైన విషయాల పై అంతర్ముఖం చేస్తాడు. ( ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణతో జీవిస్తావు )*


*6) కారణ గురువు : ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు. ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు. (నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటాము)*


*7) పరమ గురువు : ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు. శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ ఈ చరా చర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’ అహం బ్రహ్మస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళే వారు ఈ పరమ గురువులు. వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. నీ నిజ జీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. ( నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీ విడుదలకు మార్గం చూపేవారు పరమ గురువు ).*