మహాస్వామి - మల్లయోధుడు
మన్నక్కల్ కృష్ణ శాస్త్రి అనే యువకుడు తరచుగా శ్రీమఠానికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవాడు. అతను మంచి ఒడ్డూ పొడుగు ఉండి కండ పుష్టి కలిగినవాడు. మహాస్వామివారు అతణ్ణి రప్పించారు.
“కృష్ణా... ఒక గంటసేపు ద్వారం దగ్గర నిలబడు. కదలడానికి వీల్లేదు సరేనా. ఏమంటావు?” అని అడిగారు.
“మీ ఆజ్ఞ పెరియవ” అని బదులిచ్చాడు.
కృష్ణ శాస్త్రితో పాటు అక్కడున్నవారెవరికి అర్థం కాలేదు ఈ మాటల అర్థం ఏంటో. స్వామివారు ఆదేశం ప్రకారం శ్రీమఠం ద్వారం వద్ద నిలబడ్డాడు. ఒక గంట గడిచిన తరువాత లోపలి వచ్చాడు. మహాస్వామివారు పూజ ముగించి రాగానే కృష్ణ శాస్త్రి స్వామి వారికి చెప్పి సెలవు తీసుకొని మన్నక్కల్ వెళ్ళిపోయాడు.
ఖ్యాతినొందిన మహాబలవంతుడైన మల్లయోధుడు ఒకరు కాంచీపురానికి వచ్చాడు. అతనికి గుప్పెడు నువ్వులని ఇస్తే, అవలీలగా వాటిని నలిపి నూనె తియ్యగలడు. ఎన్నో మల్ల యుద్ధాల్లో గెలిచి ఏంటో పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. దాంతో అతన్ని అభిమానించేవారు చాలా ఎక్కువమంది ఉండేవారు. మహాస్వామి వారితో బహుమానం అందుకోవాలని అతని ఉద్ద్యేశం. అతను పరమాచార్య స్వామి ముందర తన కండబలం ప్రదర్శించి స్వామివారు సూచించిన వారితో మల్లయుద్ధం చెయ్యాలని అతని కోరిక.
కంచిలో నివసించే మల్లయోధుని బంధువు ఒకరు ఆ రోజు రాత్రి మఠానికి వచ్చి ఒక శిష్యునితో, “మఠంలో వైదికులు, శిష్యులు, పరిచారకులు ఉడడం సహజమే. ఇప్పుడు మఠం వారు మల్లయోధులను కూడా వినియోగించుకుంటున్నారా?” అని అడిగాడు.
“అదేమీ ప్రశ్న? మఠం ఎందుకు మల్లయోధులను నియమించుకుంటుంది?” అని అన్నాడు ఆ సేవకుడు.
“ఒక పేరుగాంచిన మల్లయోధుడు ఉదయం పది గంటలప్పుడు మఠం దగ్గరకు వచ్చాడు. ద్వారం వద్ద బలవంతుడైన ఒక మల్లయోదుణ్ణి చూసి కనీసం స్వామివారి దర్శనం కూడా చేసుకోకుండా తిరిగొచ్చాడు. ఇప్పుడే అతణ్ణి చెన్నై పంపించి నేను ఇక్కడకు వస్తున్నాను” అని చెప్పాడు.
అక్కడున్న వారందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. “అందుకా మహాస్వామి వారు మన్నక్కల్ కృష్ణ శాస్త్రిని ద్వారం వద్ద నిలబడమన్నారు. అతణ్ణి చూసి ఆ మల్లయోధుడు భయపడి వెళ్ళిపోయాడు”
ఒక మల్లయోధుడు వచ్చి శిష్యులతో మల్ల యుద్ధం చెయ్యడానికి ఆహ్వానిస్తాడని పరమాచార్య స్వామీ వారికి ఎలా తెలుసు? అదే అతిపెద్ద చిక్కుప్రశ్న కదా!
--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి