26, డిసెంబర్ 2025, శుక్రవారం

శాస్త్రాలు - కంప్యూటర్ పరిజ్ఞానము*

 *శాస్త్రాలు - కంప్యూటర్ పరిజ్ఞానము*




శాస్త్రము అంటేనే ఏదైనా ఒక విషయము పై క్రమబద్ధంగా, శాస్త్రీయంగా, ప్రామాణికంగా ఉన్న జ్ఞానం, నియమాలు, సూత్రాలు ఇత్యాది. ఈ సందర్భంగా ఒక వర్గీకరణ చూద్దాము. 1) *సంప్రదాయ భారతీయ శాస్త్రాలు* 2) *భాషా శాస్త్రాలు* 3) *ప్రకృతి విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు* 4) *కంప్యూటర్ శాస్త్రము*. విపులంగా పరిశీలిస్తే...

1) *సంప్రదాయ భారతీయ శాస్త్రాలు* వేద వేదాంగాలు, పురాణ, ఇతిహాస , శృతి, స్మృతి, బ్రహ్మ సూత్రాలు, యోగ విజ్ఞానం, తత్వ శాస్త్రం (వైశేషిక, భాట్ట ఇత్యాది), జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు, ఆయుర్వేద, న్యాయ మరియు అర్థ శాస్త్రాలు.

2) *భాషా శాస్త్రాలు* వ్యాకరణ, ఛందస్సు, తర్క, మీమాంసా శాస్త్రాలు.

3) *ప్రకృతి విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు*. భౌగోళిక, భౌతిక, రసాయన, విశ్వ నిర్మాణ (Cosmology), వైద్య, జంతు, వృక్ష, మానవ విజ్ఞాన (Anthropology), యంత్రం (Engineering), సాంకేతిక (Technology) ఇత్యాది.

4) *కంప్యూటర్ శాస్త్రము*

మానవ మేధస్సు మరో ఘన విజయం సాధించిన రోజే ఈ కంప్యూటర్ (COMPUTER = *Common Operating Machine Purposefully Used for Technological and Educational Resaech)* అవతరించిన రోజు. ఈ కంప్యూటర్ యుగంలో *శాశ్వత మృత్యు నివారణ* తప్ప ఏది అసాధ్యం కాదను విషయం మనందరికీ విదితమే. కంప్యూటర్ ప్రయోజనాలు వింటున్నాము, చూస్తున్నాము, ఆశ్చర్యపోతున్నాము, ఆనందిస్తున్నాము. *ఇంతటితో సరిపోదు, అందరూ కంప్యూటర్ పరిజ్ఞానం పొందాలి*.

 కంప్యూటర్ శాస్త్రము అత్యాధునిక కాలానికి చెందినది. కంప్యూటర్ శాస్త్రమంటే సమాచారము (Information ) గణకముల (Accounting) సైద్ధాంతిక అధ్యయనము. ఈ అధ్యయనమును కంప్యూటర్ (గణన సాధనము/యంత్రము) ద్వారా అమలులోకి తేవడము, నిర్వహించడము. వాస్తవానికి ఇది కూడా ఒక క్రమబద్ధమైన శాస్త్రము (Formal science). 


ఈ ఆధునిక కాలంలో కంప్యూటర్ శాస్త్రము వలన విశ్వ వ్యాప్తంగా మానవ జన జీవనంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నవి. మున్ముందు ఇంకెన్ని అద్భుతాలో. *కంప్యూటర్ శాస్త్రము/విజ్ఞానము గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము*.


ధన్యవాదములు


*శాస్త్రాలు - కంప్యూటర్ పరిజ్ఞానము 2*




దైనందిన జీవితంలో మనకున్న భారతీయ సంప్రదాయ శాస్త్రాలతో ఆనందంగా గడిచిపోతున్న తరుణంలో మళ్ళీ అదనంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఎందుకు అని అనిపించ వచ్చును.*ఎందుకు అన్న ప్రశ్ననే మన వెనుకబాటుతనానికి కారణమవుతున్నది* కట్టెల పొయ్యి నుండి కిరోసిన్ వాడుక అక్కడి నుండి LPG కి ప్రయాణము. చేద బావి నుండి వంట ఇంటి కుళాయి వరకు, రుబ్బురోలు నుండి గ్రైండర్/మిక్సర్ వరకు, వీధి బడీ నుండి విశ్వ విద్యాలయం వరకు, కాలి నడక నుండి విమాన ప్రయాణం వరకు ఎన్నెన్ని అధిగమించుకుంటూ వచ్చామో.... వస్తున్నామో... 

మనం మనకు రోజూ అవసరమైన *కంప్యూటర్ పరిజ్ఞానం* పొందుటకు సంశయమెందుకు.


 ఎప్పుడో వచ్చింది కంప్యూటర్ విద్య, ఇప్పటికీ ఆ పరిజ్ఞానము పొందనిపొందని వారుంటారా అను ప్రశ్న కూడా వద్దు. ప్రతి సమాజంలో మనకంటే అధికులు, మన సమానులు, మనకంటే దిగువ శ్రేణి వారు ఉండనే ఉంటారు. కావున అవసరమైన వాళ్ళం కంప్యూటర్ పరిజ్ఞానంపై శ్రద్ధ ఉంచుదాము. అవగాహన పెంచుకుందాము.


బాల్యం నుంచే పిల్లలకు కంప్యూటర్ విద్య సర్వ సాధారణమైనది. ఈ వ్యాస పరంపర వయోధికులకు

 (లింగ భేదము లేకుండా) మాత్రమే. 


ఈ వృద్ధాప్యంలో ఈ కంప్యూటర్ తో తంటాలు ఎందుకు అని అనుకోరాదు. ప్రస్తుతం మనమున్నది డిజిటల్ ప్రపంచంలో. డబ్బు లావాదేవీలు, కొనుగోలు వ్యవహారాలు, సమాచార సేకరణ, బస్సు, రైలు బుకింగ్ లు. దూరాననే కాదు పక్కింటి వారితో మాట్లాడాలన్న సెల్ ఫోన్ కావల్సిందే.


కంప్యూటర్ పరిజ్ఞానం అనేక అంశాలను సులభతరం చేస్తుంది. కంప్యూటర్ పరిజ్ఞానం విలాసాలకు మాత్రమే కాకుండా విజయాలు సాధించడానికి గూడా ఎంతో అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం పెరిగిన తదుపరి కాగితము అవసరము భౌతికంగా కుదించబడినది, కాగిత రహిత సమాజంగా విశ్వమే మారిపోయినది. కట్టలు కట్టలు డబ్బు మోసుకపోయే అవసరం. డబ్బులు జారవిడుచుడు, దొంగతనాలు శూన్యము. అన్ని లావాదేవీలు నగదు రహితమే *ఆమాటకొస్తే ఎప్పుడు మన చేతిలో ఉండే సెల్ ఫోన్ కూడా కంప్యూటర్ సాధనమే*.

సభ్యులు కూడా కంప్యూటర్ విషయంలో తమ వద్ద నున్న సమాచారమును గూడా అందివ్వగలరు.


ధన్యవాదములు

విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ 4 T*

  *విజ్ఞాన శాస్త్రము - కంప్యూటర్ 4 T*




వ్యక్తిగత కంప్యూటర్లు రెండు రకాలు అంటే పోర్టబుల్ (ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్ మరియు చేతి యందుంచుకునునవి) మరియు డెస్క్ టాప్. 


కంప్యూటర్‌ల యొక్క ప్రధాన భాగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి *1)* విద్యుత్ సరఫరా యూనిట్లు *2)* మదర్ బోర్డ్‌ను కలిగి ఉంటుంది i) మైక్రో ప్రాసెసర్లు ii) మెమరీ iii) డ్రైవ్ కంట్రోలర్లు *3)* హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు *4)* CD ROM డ్రైవ్‌లు. *5)* ఫ్లాపీ / CD డ్రైవ్‌లు *6)* ఇతర ఫైల్ నిల్వ పరికరాలు అంటే DVD, టేప్ బ్యాకప్ పరికరాలు మరియు కొన్ని ఇతర ఉపకరణాలు. *7)* మానిటర్ *8)* కీ బోర్డ్ *9)* మౌస్ (ఎలక్ట్రానిక్ మౌస్). 


*కంప్యూటర్ ఉపయోగాలు*

కంప్యూటర్ ప్రభావం సార్వత్రికమైనది. కంప్యూటర్‌లను పొలాలను నడపడం నుండి వ్యాధి నిర్ధారణ, శాస్త్రీయ సమస్యలను పరిష్కరించడానికి అంతరిక్ష వాహనాన్ని రూపొందించడం మరియు ప్రారంభించడం, సంక్లిష్టమైన సహజ దృగ్విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడం వరకు అనువర్తనాల్లో ఉపయోగిస్తారు. కంప్యూటర్లను సాధారణంగా వర్డ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్, డిజిటల్ వీడియో / ఆడియో, ఆడియో కూర్పు కోసం ఉపయోగిస్తారు. డెస్క్ టాప్ పబ్లిషింగ్ కూడా వైద్యం, బ్యాంకింగ్, ట్రావెల్ లైన్స్, టెలికమ్యూనికేషన్స్, డిఫెన్స్, ఇ-లెర్నింగ్, వాతావరణ విశ్లేషణ మొదలైన రంగాలలో ఉంది. 


కంప్యూటర్లు మానవ సమాజాన్ని ఆధునీకరించాయి. ఇది మానవ జీవితంలోని ప్రతి రంగంలోనూ ఉపయోగించబడుతుంది, నిరక్షరాస్యత మరియు పేదరికం వంటి సామాజిక సమస్యలను నిర్మూలించడంతో సహా. కంప్యూటర్లు లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టం. *ఈ విప్లవాత్మక సాంకేతికత నిజంగా మానవ జాతికి ఒక వరం*.


నిన్నటి ఆంగ్ల సమాచారాన్ని ఆంగ్లీకరించినది కూడా కంప్యూటరే. 


ధన్యవాదములు

26.12.2025, శుక్రవారం

 🙏జై శ్రీమన్నారాయణ🙏 

26.12.2025, శుక్రవారం


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - శుక్ల పక్షం

తిథి:షష్ఠి ఉ10.05 వరకు

వారం:భృగువాసరే (శుక్రవారం)

నక్షత్రం:పూర్వాభాద్ర తె5.55 వరకు

యోగం:సిద్ధి మ12.00 వరకు

కరణం:తైతుల ఉ10.05 వరకు తదుపరి గరజి రా9.33 వరకు

వర్జ్యం:మ12.36 - 2.11

దుర్ముహూర్తము:ఉ8.43 - 9.26

మరల మ12.21 - 1.05

అమృతకాలం:రా10.03 - 11.37

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:ధనుస్సు

చంద్రరాశి:కుంభం

సూర్యోదయం:6.31

సూర్యాస్తమయం:5.28


 

               11 వ పాశురము:


*కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు*

*శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్*

*కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే*

*పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్*

*శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్*

*ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ*

*శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ*

*ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్.*



ఓ గోపాలకుల తిలకమా! 

ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా! ఓ వనమయూరమా! రమ్ము. 

నీ సఖులు, బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక, మాటాడక, ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు. అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, పలకక (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక అందరును అనుభవించునట్లు చేయవలె కాన, మా గోష్ఠిలో కలిసి యీ వ్రతము పూర్తిగావించుము అనుచున్నారు.


అన్ని విషయములందును, అగ్ని విధములందును శ్రీకృష్ణునితో సరిసమానమైన ఒక గోపికామణిని, యీ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీ కృష్ణుడు ఆ ఊరిలోని వారికందరకు అన్నివిధాలా ఆరాధ్యుడు. ఆదరణీయుడు. అట్లే యీ గోపిక కూడ అతనితో సమానముగా ఆరాధ్యురాలు. ఆదరణీయురాలు. ఈమె తాను పలికే పలుకు, చేసే పనులు అన్నీ భగవదారాధనగాను, భాగావత్కైంకర్యంగాను వుండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్వరం కానిది ఏదీ వుండరాదని యీమె భావన. అందువల్ల యీమె భావానికి తగినట్లు భగవచ్చింతనలోనే వుండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి వుంటుంది. అందులోనే తాదాత్త్మ్యం చెందుతూ వుంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే వుండటాన బాహ్యమైనవేవీ వినపడవు. కనపడవు. పట్టించుకోదు. ఈమె అతిలోక సుందరి. అందరినీ ఆకట్టుకొనే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింప చేసినట్లు యీమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్యరాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపచేసిన యీమెను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు. ```🙏జై శ్రీమన్నారాయణ🙏 

26.12.2025, శుక్రవారం


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

పుష్య మాసం - శుక్ల పక్షం

తిథి:షష్ఠి ఉ10.05 వరకు

వారం:భృగువాసరే (శుక్రవారం)

నక్షత్రం:పూర్వాభాద్ర తె5.55 వరకు

యోగం:సిద్ధి మ12.00 వరకు

కరణం:తైతుల ఉ10.05 వరకు తదుపరి గరజి రా9.33 వరకు

వర్జ్యం:మ12.36 - 2.11

దుర్ముహూర్తము:ఉ8.43 - 9.26

మరల మ12.21 - 1.05

అమృతకాలం:రా10.03 - 11.37

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:ధనుస్సు

చంద్రరాశి:కుంభం

సూర్యోదయం:6.31

సూర్యాస్తమయం:5.28


 

               11 వ పాశురము:


*కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు*

*శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్*

*కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే*

*పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్*

*శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్*

*ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ*

*శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ*

*ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్.*



ఓ గోపాలకుల తిలకమా! 

ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా! ఓ వనమయూరమా! రమ్ము. 

నీ సఖులు, బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక, మాటాడక, ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు. అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, పలకక (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక అందరును అనుభవించునట్లు చేయవలె కాన, మా గోష్ఠిలో కలిసి యీ వ్రతము పూర్తిగావించుము అనుచున్నారు.


అన్ని విషయములందును, అగ్ని విధములందును శ్రీకృష్ణునితో సరిసమానమైన ఒక గోపికామణిని, యీ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీ కృష్ణుడు ఆ ఊరిలోని వారికందరకు అన్నివిధాలా ఆరాధ్యుడు. ఆదరణీయుడు. అట్లే యీ గోపిక కూడ అతనితో సమానముగా ఆరాధ్యురాలు. ఆదరణీయురాలు. ఈమె తాను పలికే పలుకు, చేసే పనులు అన్నీ భగవదారాధనగాను, భాగావత్కైంకర్యంగాను వుండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్వరం కానిది ఏదీ వుండరాదని యీమె భావన. అందువల్ల యీమె భావానికి తగినట్లు భగవచ్చింతనలోనే వుండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి వుంటుంది. అందులోనే తాదాత్త్మ్యం చెందుతూ వుంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే వుండటాన బాహ్యమైనవేవీ వినపడవు. కనపడవు. పట్టించుకోదు. ఈమె అతిలోక సుందరి. అందరినీ ఆకట్టుకొనే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింప చేసినట్లు యీమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్యరాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపచేసిన యీమెను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు. ```

శ్రీరంగం

  🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


                  *శ్రీరంగం*

                 ➖➖➖✍️

 ````

శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి)కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పట్టణం.


శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు అందరూ ఈ క్షేత్ర మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి. ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).


1. ప్రపంచంలో అతిపెద్దదైన కంబోడియాలోని అంకార్ వాట్ మందిరం శిథిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్‌సైటులో ఉంది. 

శ్రీరంగం ఆలయం 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది.


2. ఈ గోపురాన్ని ‘రాజగోపురం’ అంటారు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు). ఇది ఆసియాలో అతిపెద్ద గోపురం.


కావేరీనది తీరాన మూడు ప్రసిద్ధ రంగనాథ ఆలయాలున్నాయి. అవి


#ఆది రంగడు : మైసూరు సమీపంలో శ్రీరంగపట్టణం లోని రంగనాథస్వామి మందిరం.


#మధ్య రంగడు : శివ సముద్రంలోని రంగనాథస్వామి మందిరం.

.

#అంత్య రంగడు : శ్రీరంగంలోని రంగనాథస్వామి మందిరం.


నెల్లూరు పట్టణంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం కూడా ఒక ప్రసిద్ధ రంగనాథ మందిరం.


ఆళ్వారుల దివ్య ప్రబంధాలకూ, రామానుజుని శ్రీవైష్ణవ సిద్ధాంతానికీ శ్రీరంగం పట్టుగొమ్మగా నిలిచింది. నాలాయిర దివ్యప్రబంధంలోని 4,000 పాశురాలలో 247 పాశురాలు "తిరువారంగన్" గురించి ఉన్నాయి. శ్రీవైష్ణవుల పవిత్ర గురు ప్రార్థన (తనియన్) గా భావించే ‘శ్రీశైలేశ దయాపాత్రం..’ అనే శ్లోకాన్ని రంగనాథస్వామి స్వయంగా మణవాళ మహామునికి సమర్పించాడని భావిస్తారు.


కీర్తిశేషులు పద్మశ్రీ షేక్ చినమౌలానా ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందిన వారు.```



*#ఉత్సవాలు:*```

శ్రీరంగనాథుడికి మకరం పునర్వసు; కుంభం శుద్ధ ఏకాదశి; మీనం ఉత్తర; మేషం రేవతి చివరి దినములుగా నాలుగు బ్రహ్మోత్సవములు జరుగుతాయి. ధనుశ్శుద్ధ ఏకాదశికి ముందు వెనుకలుగా అధ్యయనోత్సవము పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవములు, మిక్కిలి వైభవముగా జరుగుతాయి.


#విశేషం:


శ్రీ రంగము ఉభయ కావేరి నదుల మధ్యన గల ఒక ద్వీపము. సప్త ప్రాకారములతో పదునైదు గోపురములతో విలసిల్లు భూలోక వైకుంఠము.


#సాహిత్యం:


శ్లో. కావేరి పరిపూత పార్శ్వ యుగళే పున్నాగ సాలాంచితే

 చంద్రాఖ్యాయుత పుష్కరిణ్యనుగతే రంగాభిధానే పురే|

వైమానే ప్రణవాభిధే మణిమయే వేదాఖ్య శృంగోజ్జ్వలే

దేవం ధర్మదిశా ముఖం ఫణిశయం శ్రీ రజ్గనాధం భజే||


శ్లో. శ్రీ ధర్మ వర్మ రవివర్మ నిషేవితాజ్గ:

   శ్రీరజ్గిణీ చటుల విభ్రమ లోల నేత్ర:|

   నీళా సరస్యముఖ సూరి వరేణ్య గీతి

   పాత్రం విరాజితి విభీషణ భాగధేయ:|


శ్లో. కావేరి విరజా సేయం వైకుంఠం రంగమందిరమ్|

   సవాసుదేవో రంగేశ: ప్రత్యక్షం పరమం పదమ్||


ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూలమని అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమని ఆళ్వారుల విశ్వసిస్తారు. మన పెద్దలు ప్రతి దినం "శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ" అని అనుసంధానము చేస్తుంటారు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము.


వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపస్సు చేసాడు. బ్రహ్మ ప్రీతిచెంది తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించాడు. ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. శ్రీరామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరలలేక పోయాడు. ఆ సమయమున శ్రీరామచంద్రుడు తమకు మారుగ శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదించాడు. విభీషణుడు సంతుష్ఠుడై లంకకు పయనమయ్యాడు. లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరి మధ్య భాగమును చేరేసమయానికి సంధ్యాసమయం అయింది. విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానములో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడు. శ్రీరంగనాథుడు విభీషణుని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణుని పూజనందుకుంటానని అనుగ్రహించాడు.


#ఆలయవిశేషాలు:


ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి నంబెరుమాళ్‌ అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవమేర్పడగా శ్రీరంగనాథుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు చేర్చారు. 

ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించారు. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని తిరువరంగ మాళిగైయార్‌ అని అంటారు.


#వివరణ:


పెరియాళ్వార్ తన "ముముక్షుప్పడి" గ్రంథములో సర్వేశ్వరుని కళ్యాణగుణములను విశదీకరించి ఈ తిరుకల్యాణ గుణము లన్నియు మనకు నంబెరుమాళ్ విషయములో ఉన్నాయని ప్రస్తుతించుటచే ఉత్సవమూర్తికి "నంబెరుమాళ్" అని పేరు వచ్చింది. వారు శ్రీరంగనాథుని సౌందర్యమును అభివర్ణించాడు.


#శ్రీ పరాశర భట్ట స్తుతి:


శ్లో. అబ్జన్యస్త సదాజ్జ మంచితకటీ సంవాది కౌశేయకం

   కించిత్ తాండవ గంధి సంహసనకం నిర్వ్యాజ మందస్మితమ్|

   చూడాచుమ్బి ముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం

   శ్రీరంగే శరదశ్శతం తత ఇత:పశ్యేమ లక్ష్మీ సఖిమ్||


#బంగారు స్థంభాలు:


గర్భాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు "తిరుమణై త్తూణ్" అని పేరు. నంబెరుమాళ్ళ సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొంటారు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశానికి "గాయత్రీమంటపము" అనిపేరు. గర్భాలయమునకు ముందుగల ప్రదేశము "చందన మంటపము". గర్భాలయ ప్రదక్షిణకు "తిరువణ్ణాళి" ప్రదక్షిణమని పేరు.


#మొదటి ప్రాకారం:


మొదటి ప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, విరజబావి, సేనమొదలియార్ సన్నిధి, పగల్‌పత్తు మండపం, చిలకల మండపం, కణ్ణన్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ గల చిలుకల మండపము నుండి విమానముపై గల పరవాసు దేవులను దర్శించాలి.


#రెండవ-ప్రాకారము:


ఈ గోపుర ద్వారమునకు "ఆర్యభట్టాళ్‌వాశల్" అని పేరు. ఈ ప్రాకారములోనే పవిత్రోత్సవ మండపం ఉంది. ఈ మండపములో హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు ఉన్నాయి. రెండవది ఉళ్‌కోడై మంటపము. దీనికి దొరమండపమనియు పేరుగలదు. విరజా మండపము. దీని క్రింది విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం (అభ్యర్థన) జరుగు మండపం. పరమపద వాశల్, తిరుమడప్పళ్లి, ఊంజల్ మండపం, ధ్వజారోహణ మండపం ఉన్నాయి. ఇచట స్తంభముపై ఉన్న వినీత ఆంజనేయస్వామి వరములను ప్రసాదించగలిగిన శక్తివంతుడు.


#మూడవ ప్రాకారం:


ఈ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు. ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధి ఉంది. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే ఉన్నాయి. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచే మండపము ఉంది. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి ఉంది. ఉగ్రాణము పైన పట్టాభిరామన్ సన్నిధి, ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కిళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాదన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి ఉన్నాయి.


#నాల్గవ ప్రాకారము:


ఈ ప్రాకారమునకు "అకళంకనాట్టాళ్వాన్" తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంది. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ ప్రతిష్ఠితమై ఉన్నాడు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తులైన గరుడాళ్వార్‌సన్నిధి ఉంది. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట నాదముని సన్నిధి ఉంది. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము ఉంది. ఈ ప్రాకారమలో శ్రీరంగ విలాసం ఉంది. దీనిపై తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు, (శ్రీకృష్ణ, శ్రీవరాహ, శ్రీరామ) అవతరించిన విధము చిత్రించబడి ఉంది.


విజయ స్థంభం

విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వాన్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, ఈ ప్రాకారములోనే ఉన్నాయి. శ్రీరంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే ఉంది. ఈ సన్నిధి ముఖ మండప స్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షుడు ప్రతిష్టితమై ఉన్నాడు. మీనమాసం, పంగుని ఉత్తరా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్‌తో శ్రీరంగనాథులు వేంచేసియున్న సమయమున ఉడయరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము ఉంది. మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఐన్దుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు, మూడు ద్వారములు) శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి. ఈ ప్రాకారములోనే ఉన్నాయి.


ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీ రంగనాధులు కొలువు తీరు వేయి కాళ్ల మండప మీప్రాకారములో ఉంది. దీనికి "ఆయిరం కాల్ మండపమని" పేరు. (సహస్రస్థూప మండపం) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.


#శేషరాయన్-మండపము:


ఈ ప్రాకారంలో ఉన్న శేషరాయన్-మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామ సన్నిధి ఉన్నాయి. దాని ప్రక్కన లోకాచార్యుని సన్నిధి, సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారథి సన్నిధి ఉన్నాయి.


#పరివారదేవతలు:


ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (రామానుజుల) సన్నిధి. ఇచట ఉడయవర్ "తానానా" తిరుమేనిగా వేంచేసియున్నారు (పవిత్రశరీరం తానే అయిన ) ఇది ఒకప్పటి వసంత మండపము. ఇచట ఉడయ వరులు భక్తుల హృదయమున వేంచేసి ఉంటాడని మణవాళ మామునులు అభివర్ణించాడు. ఈ సన్నిధిలో ఆళవందార్ పెరియనంబి సన్నిధులు ఉన్నాయి. వరదరాజస్వామి సన్నిధి ప్రక్కన ఉంది.


ప్రతి దినం ఉదయం 9 గంటల సమయంలో స్వామి సన్నిధిలో శాత్తుముఱై సేవ జరిగుతుంది.ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి, విఠల్ కృష్ణన్, తొండరడిప్పొడియాళ్వార్ ఉన్నాయి.


#ఐదవ ప్రాకారము:


ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి యనిపేరు. మకర (తై) మీన (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాధులు ఈ వీధులలో వేంచేయుదురు. మకరమాస పుష్యమీ నక్షత్రమున నంబెరుమాళ్లు ఉభయనాచ్చియార్లతో తిరిత్తేరుపై వేంచేయుదురు. ఈ ప్రాకారములో ఉత్తమనంబి, తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్యపురుషుల తిరుమాళిగలు మణవాళమామునుల సన్నిధి ఉన్నాయి.


#ఆరవ ప్రాకారము:


ఈ ప్రాకారమునకు "చిత్రవీధి" యనిపేరు. మేషమాస (చిత్రి) బ్రహ్మోత్సవంలో నంబెరుమాళ్లు ఈ వీధులలో ఊరేగుటచేత ఈ వీధికి "చిత్రవీధి" యని పేరు వచ్చెను. ఆళ్వార్లు తిరునక్షత్రముల యందు ఈ తిరువీధులలో ఊరేగించబడతారు. ఉత్తర మాడ వీధిలో వేదాంత దేశికర్ సన్నిధి, జగన్నాథన్ సన్నిధి, తూర్పు చిత్ర మాడ వీధిలో రథం, పెరియనంబి, కూరత్తాళ్వాన్, మొదలి యాండాన్ తిరుమాళిగలు, వానమామలై జీయర్ మఠం గలవు. దక్షిణ ప్రాకార వీధి మధ్యలో 5 అడుగుల లోతులో పాతాళకృష్ణన్ సన్నిధి ఉంది.


#ఏడవ ప్రాకారము:


ఈ ప్రాకారమునకు "అడయవళంజాన్" వీధియనిపేరు. ఈ ప్రాకారములో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి ఉంది. వెళియాండాళ్ సన్నిధి కూడా ఉంది. పడమటి ద్వారము గుండ తెప్పగుంటకు పోవచ్చును. కుంభమాస (మాసి) బ్రహ్మోత్సవములో రథోత్సవమునకు బదులు తెప్ప ఉత్సవము ఈ తెప్పగుంటలోనే జరుగును. ఉత్తర ద్వారమునుండి కొల్లడమునకు పోవు దారి ఉంది. ఈ కొల్లడం దక్షిణ తీరమున తిరుమంగై యాళ్వార్లకు ప్రత్యక్షమైన దశావతారముల సన్నిధి ఉంది. ఇచట తిరుమంగై ఆళ్వార్ వేంచేసి యున్నారు. ఈ కొల్లడ మందు తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై, ఆళవందార్ పడిత్తురై ఉన్నాయి. పడమటి ద్వారా సమీపములో కాట్టళిగియ శింగర్ సన్నిధి ఉంది. ఇది శ్రీ వచన భూషణ మవతరించిన స్థలము. దక్షిణ గోపురము ద్వారా కావేరి నదికి పోవచ్చును. దీనికే రాయగోపురమని పేరు.


#ఉత్సవాలు:


మకరం, కుంభం, మీనం, మేష మాసములందు వరుసగా నాల్గు బ్రహ్మోత్సవములు జరుగును. మకరమాసమున "పునర్వసు" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇది చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులచే) ఏర్పాటు చేయబడింది. కావున దీనికి భూపతి తిరునాళ్లు అని పేరు వచ్చింది. కుంభమాసమున "శుద్ధ ఏకాదశి" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది స్వామి యెంబెరుమనార్లచే ఏర్పాటు చేయబడింది. మీన మాసమున "ఉత్తరా నక్షత్రము" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది చతుర్ముఖ బ్రహ్మచే జరిపింప బడింది. దీనికి ఆది బ్రహ్మోత్సవమని పేరు. మేష మాసమున "రేవతి" అవసాన దినముగా బ్రహ్మోత్సవము. దీనికి విరుప్పన్ తిరునాళ్లు అనిపేరు.


ఇవిగాక అధ్యనోత్సవము (పగల్‌పత్తు రాపత్తు) తప్పక సేవింప దగినది. ధనుర్మాసము, ధనుశ్శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనము సేవింపదగినది. ఇంకను ఉగాది, విజయ దశమి మున్నగు ఉత్సవములు జరుగును. ఇచట ప్రతి నిత్యము ఉత్సవ సంరoభమే.✍️````

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷````


 🙏

                   🙏

చెల్లినిc బెండ్లియాడెను విచిత్ర మటంచు దలంప రెవ్వరున్*

 *చెల్లినిc బెండ్లియాడెను విచిత్ర మటంచు దలంప రెవ్వరున్*

ఈ సమస్యకు నా పూరణ. 


కల్లలు మాటలాడుచును కఱ్ఱియె దాల్చెను మౌని వేషమున్


ఉల్లము ప్రేమ నింపెనట నోగితమింతయు లేక పార్థుడున్


కల్లరి, యాదవేశ్వరుని కక్కసపెట్టి హరించె, చక్రికిన్


చెల్లినిc బెండ్లియాడెను విచిత్ర మటంచు దలంప రెవ్వరున్.




అల్వాల లక్ష్మణ మూర్తి