*శాస్త్రాలు - కంప్యూటర్ పరిజ్ఞానము*
శాస్త్రము అంటేనే ఏదైనా ఒక విషయము పై క్రమబద్ధంగా, శాస్త్రీయంగా, ప్రామాణికంగా ఉన్న జ్ఞానం, నియమాలు, సూత్రాలు ఇత్యాది. ఈ సందర్భంగా ఒక వర్గీకరణ చూద్దాము. 1) *సంప్రదాయ భారతీయ శాస్త్రాలు* 2) *భాషా శాస్త్రాలు* 3) *ప్రకృతి విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు* 4) *కంప్యూటర్ శాస్త్రము*. విపులంగా పరిశీలిస్తే...
1) *సంప్రదాయ భారతీయ శాస్త్రాలు* వేద వేదాంగాలు, పురాణ, ఇతిహాస , శృతి, స్మృతి, బ్రహ్మ సూత్రాలు, యోగ విజ్ఞానం, తత్వ శాస్త్రం (వైశేషిక, భాట్ట ఇత్యాది), జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు, ఆయుర్వేద, న్యాయ మరియు అర్థ శాస్త్రాలు.
2) *భాషా శాస్త్రాలు* వ్యాకరణ, ఛందస్సు, తర్క, మీమాంసా శాస్త్రాలు.
3) *ప్రకృతి విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు*. భౌగోళిక, భౌతిక, రసాయన, విశ్వ నిర్మాణ (Cosmology), వైద్య, జంతు, వృక్ష, మానవ విజ్ఞాన (Anthropology), యంత్రం (Engineering), సాంకేతిక (Technology) ఇత్యాది.
4) *కంప్యూటర్ శాస్త్రము*
మానవ మేధస్సు మరో ఘన విజయం సాధించిన రోజే ఈ కంప్యూటర్ (COMPUTER = *Common Operating Machine Purposefully Used for Technological and Educational Resaech)* అవతరించిన రోజు. ఈ కంప్యూటర్ యుగంలో *శాశ్వత మృత్యు నివారణ* తప్ప ఏది అసాధ్యం కాదను విషయం మనందరికీ విదితమే. కంప్యూటర్ ప్రయోజనాలు వింటున్నాము, చూస్తున్నాము, ఆశ్చర్యపోతున్నాము, ఆనందిస్తున్నాము. *ఇంతటితో సరిపోదు, అందరూ కంప్యూటర్ పరిజ్ఞానం పొందాలి*.
కంప్యూటర్ శాస్త్రము అత్యాధునిక కాలానికి చెందినది. కంప్యూటర్ శాస్త్రమంటే సమాచారము (Information ) గణకముల (Accounting) సైద్ధాంతిక అధ్యయనము. ఈ అధ్యయనమును కంప్యూటర్ (గణన సాధనము/యంత్రము) ద్వారా అమలులోకి తేవడము, నిర్వహించడము. వాస్తవానికి ఇది కూడా ఒక క్రమబద్ధమైన శాస్త్రము (Formal science).
ఈ ఆధునిక కాలంలో కంప్యూటర్ శాస్త్రము వలన విశ్వ వ్యాప్తంగా మానవ జన జీవనంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నవి. మున్ముందు ఇంకెన్ని అద్భుతాలో. *కంప్యూటర్ శాస్త్రము/విజ్ఞానము గురించి విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము*.
ధన్యవాదములు
*శాస్త్రాలు - కంప్యూటర్ పరిజ్ఞానము 2*
దైనందిన జీవితంలో మనకున్న భారతీయ సంప్రదాయ శాస్త్రాలతో ఆనందంగా గడిచిపోతున్న తరుణంలో మళ్ళీ అదనంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఎందుకు అని అనిపించ వచ్చును.*ఎందుకు అన్న ప్రశ్ననే మన వెనుకబాటుతనానికి కారణమవుతున్నది* కట్టెల పొయ్యి నుండి కిరోసిన్ వాడుక అక్కడి నుండి LPG కి ప్రయాణము. చేద బావి నుండి వంట ఇంటి కుళాయి వరకు, రుబ్బురోలు నుండి గ్రైండర్/మిక్సర్ వరకు, వీధి బడీ నుండి విశ్వ విద్యాలయం వరకు, కాలి నడక నుండి విమాన ప్రయాణం వరకు ఎన్నెన్ని అధిగమించుకుంటూ వచ్చామో.... వస్తున్నామో...
మనం మనకు రోజూ అవసరమైన *కంప్యూటర్ పరిజ్ఞానం* పొందుటకు సంశయమెందుకు.
ఎప్పుడో వచ్చింది కంప్యూటర్ విద్య, ఇప్పటికీ ఆ పరిజ్ఞానము పొందనిపొందని వారుంటారా అను ప్రశ్న కూడా వద్దు. ప్రతి సమాజంలో మనకంటే అధికులు, మన సమానులు, మనకంటే దిగువ శ్రేణి వారు ఉండనే ఉంటారు. కావున అవసరమైన వాళ్ళం కంప్యూటర్ పరిజ్ఞానంపై శ్రద్ధ ఉంచుదాము. అవగాహన పెంచుకుందాము.
బాల్యం నుంచే పిల్లలకు కంప్యూటర్ విద్య సర్వ సాధారణమైనది. ఈ వ్యాస పరంపర వయోధికులకు
(లింగ భేదము లేకుండా) మాత్రమే.
ఈ వృద్ధాప్యంలో ఈ కంప్యూటర్ తో తంటాలు ఎందుకు అని అనుకోరాదు. ప్రస్తుతం మనమున్నది డిజిటల్ ప్రపంచంలో. డబ్బు లావాదేవీలు, కొనుగోలు వ్యవహారాలు, సమాచార సేకరణ, బస్సు, రైలు బుకింగ్ లు. దూరాననే కాదు పక్కింటి వారితో మాట్లాడాలన్న సెల్ ఫోన్ కావల్సిందే.
కంప్యూటర్ పరిజ్ఞానం అనేక అంశాలను సులభతరం చేస్తుంది. కంప్యూటర్ పరిజ్ఞానం విలాసాలకు మాత్రమే కాకుండా విజయాలు సాధించడానికి గూడా ఎంతో అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం పెరిగిన తదుపరి కాగితము అవసరము భౌతికంగా కుదించబడినది, కాగిత రహిత సమాజంగా విశ్వమే మారిపోయినది. కట్టలు కట్టలు డబ్బు మోసుకపోయే అవసరం. డబ్బులు జారవిడుచుడు, దొంగతనాలు శూన్యము. అన్ని లావాదేవీలు నగదు రహితమే *ఆమాటకొస్తే ఎప్పుడు మన చేతిలో ఉండే సెల్ ఫోన్ కూడా కంప్యూటర్ సాధనమే*.
సభ్యులు కూడా కంప్యూటర్ విషయంలో తమ వద్ద నున్న సమాచారమును గూడా అందివ్వగలరు.
ధన్యవాదములు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి