9, జనవరి 2023, సోమవారం

తెలిసినది కాదు తెలియనిది కాదు 

 

 తెలిసినది కాదు తెలియనిది కాదు 

మన మహర్షులు వారి అత్యంత గొప్ప మేధ శక్తితో మనకు భగవంతుని స్వరూపాన్ని ఆవిష్కరింప చేశారు.  వారు పేర్కొన్న జ్ఞ్యాన బాండాగారం మనకు ఉపనిషత్తుల రూపంలో లభ్యమవుతున్నది. అతి సామాన్యమైన విషయంతో అనన్తమైన బ్రహ్మ పదార్ధాన్ని తెలుసుకోవటం కొరకు  అసామాన్యమైన జ్ఞ్యానం అనాలి. 

భగవంతుడు: మన మహర్షులు భగావంతునికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి అని చెప్పారు. 

1) త్రిగుణాతీతుడు. మనుషులమైన మనము సత్వ, రజో తమో గుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉంటాము. కొన్ని సందర్భాలలో ఒక గుణం ఇంకొక గుణంతో మిళితమై లేక అధిగమించి గోచరించవచ్చు. ఏది ఏమైనా గుణాలలో మాత్రమే మనిషి కనపడతాడు.  కానీ భగవంతునికి ఏ రకమైన గుణం ఉండదు అంటే ఆయనకు రాగ ద్వేషాలు వుండవు. 

2) కాలాతీతుడు: ఈ భూమి మీద వున్న ప్రతిదీ అది నిర్జీవమైనది కావచ్చు లేక జీవమైనది కావచ్చు ఒక కాలంలో ఉద్బవించి (జన్మించి) కొంత కాలం వుంది తరువాత నశించి పోతుంది. ఉన్నంతకాలం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ భగవంతుడు కాలములో లేడు ఆయన త్రికాలలో ఉంటాడు అంటే భూతకాలంలో వున్నాడు, వర్తమానంములో వున్నాడు భవిష్యత్తులో ఉంటాడు. అందుకే భగవంతుని నిత్యుడు అని అన్నారు. 

3) రూప రహితుడు: మనకు ఈ భూమి మీద ప్రతిదీ ఏదో ఒక రూపంలో కనబడుతూ వున్నది. అందుకే మనం వాటిని గుర్తించగలుగుతున్నాము. కానీ భగవంతుడు ఏ రూపం లేకుండా ఉంటాడు. అందుకే ఆయన కాలంలో లేడు . 

4) నామరహితుడు: అంటే పేరులేని వాడు.  ఏదైనా రూపం ఉంటేనే పేరు ఉంటుంది.  రూపమేలేనప్పుడు ఇక పేరు అనే సమస్యే లేదు. 

5) భగ కలిగిన వాడు:  మనము అదృషవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, బలవంతుడు అనే మాటలు వుంటూ ఉంటాము.  అంటే ఏది ఉంటే వానికి ఉన్నదాని ప్రక్కన వంతుడు అని పెట్టి అది అలిగినవాడుగా మనం పేర్కొంటాము.  ఉదా : ధనం వున్నవానిని ధనవంతుడు అని అదృష్టం వున్నవానిని అదృష్టవంతుడు ఇలా మనం ఉపయోగిస్తూవుంటాము. మరి భగవంతుడు" అంటే ఎవరు? భగ అనే ఆరుగుణాలు వున్నవాడు క్రింది శ్లోకాన్ని చుడండి

"మాహాత్మ్యస్య సమగ్రస్య ధైర్యస్య యశస శ్రియఃజ్ఞాన వైరాగ్యయేశ్చైవ షణాం - భగ, ఇత్యుక్త భగోzస్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్ర నిర్వచనం .అంటే

1) మాహాత్మ్యం 2) ధైర్యం 3) యశస్సు4) సంపద5) జ్ఞానం 6) వైరాగ్యం ఈ ఆరింటిని షడైశ్వైర్యాలు అంటారు.వీటికే "భగ" అని పేరు. ఈ ఆరు ఐశ్వైర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే "భగవంతుడు" అని పేరు.

భగ అనే ఈ ఆరు లక్షణాలు భూమిమీద వున్న జీవకోటికి కానీ, మానవులకు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వుండవు.  మనం ఒక్కొక్క లక్షణాన్ని పరిశీలిస్తే విషయం తెలుస్తుంది.  

1) మాహాత్మ్యం  పవిత్రత వల్ల మాహాత్మ్యం సిద్ధిస్తుంది." పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం" అని వేదశాస్త్ర పురాణేతిహాసాలు దేవుడిని కీర్తిస్తున్నాయి.దేవుడు "సంపూర్ణ పవిత్ర స్వరూపుడు" కాబట్టి సంపూర్ణ మాహాత్మ్యం కలిగి ఉంటాడు.అనుభవ పూర్వకంగా చూసుకున్నా మనం ఏ విషయంలో పవిత్రంగా ఉంటామో ఆ విషయంలో మాహాత్మ్యం సిద్ధిస్తుంది. ఉదాహరణకు...తల్లిదండ్రులు తమ సంతానం విషయంలో ఎలాంటి కల్మషం లేని పవిత్రతతో ఉంటారు.కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తమ దీవెనలు ఫలించగలిగే మాహాత్మ్యం సిద్ధిస్తుంది..... ఇలా ఏ విషయంలో మనం పవిత్రతను కలిగి ఉన్నామో ఆ విషయంలో ' మాహాత్మ్యం' ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు!ఎక్కడ మాహాత్మ్యం ఉంటుందో అక్కడ నమస్కార యోగ్యత ఏర్పడుతుంది.నమస్కారం వల్ల అవతలి వ్యక్తి మాహాత్మ్యాన్ని - ఆశీర్వాదాన్ని మనం స్వీకరించ గలుగుతాము.అందుకే పవిత్రంగా జీవించే సాధువులకూ, మహాత్ములకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకు నమస్కరించే పద్ధతి సనాతన ధర్మం లో సాంప్రదాయ సిద్ధంగా వస్తూ ఉంది.

2) ధైర్యం ఇక ధైర్యం దేనివల్ల కలుగుతుంది.భయం లేకపోవడం వల్ల.భయం ఎలా పుడుతుంది?ప్రధానంగా 50% భయాలు అజ్ఞానం వల్లనే కలుగుతాయి. ఎక్కడ తెలియనితనం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది.అది తెలిసిన తర్వాత ఆ భయం పోతుంది.ఇక మిగతా భయాలు మనకున్న ఆరోగ్యం - ఆయుస్సు - సంపదలు - పరివారం - అధికారం - కీర్తి - సౌఖ్యం ...మొ॥ ఐశ్వర్యాలు ఎక్కడ నశించి పోతాయో అనే కారణం నుండి పుడుతాయి.

ఇక దేవుడు వేదస్వరూపుడు.అంటే జ్ఞానస్వరూపుడు.ఇక అతనికి అజుడని పేరు.అంటే పుట్టక లేని వాడు .అలాగే అచ్యుతుడు.. అంటే నాశనం లేనివాడు.శ్రీధరుడు అంటే సమస్త ఐశ్వర్యాలను ధరించినవాడు.కాబట్టి సంపూర్ణ ధైర్యం అనెడి ఐశ్వర్యం అతనిని సేవిస్తూ ఉంటుంది.

3) యశస్సుయశస్సు అంటే స్వచ్చమైన కీర్తి ."క్రియాశీలత వల్ల కీర్తి... నిష్క్రియత్వం వల్ల అపకీర్తి " ఏర్పడుతుంది.నీరు నిరంతరం ప్రవహిస్తూ క్రియాశీలంగా ఉండడం వల్ల " నది "లా మారి అందరిచే పూజించబడుతూ "కీర్తి"ని పొందుతుంది.ఆగిపోయిన నీరు " నిష్క్రియత్వం" వల్ల మురికి గుంటలా మారి అందరిచే అసహ్యించబడుతూ.. అపకీర్తిని పొందుతుంది.మనష్యుల పరిస్థితి అయినా అంతే!ఏ విషయంలో మనిషి క్రియాశీలతను కలిగి ఉంటే ఆ విషయంలో కీర్తి లభిస్తుంది.ఉదాహరణకు.. చదువు విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి విద్య విషయంలో కీర్తి లభిస్తుంది.ధన సంపాదన విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి ధనవంతుడనే కీర్తి లభిస్తుంది..... ఇలా ఏ విషయంలో క్రియాశీలత ఉంటుందో ఆ విషయంలో సహజంగానే కీర్తి లభిస్తుంది.ఇక సంపూర్ణ క్రియాశీలుడైన ఈశ్వరున్ని యశస్సు అనెడి ఐశ్వర్యం నిరంతరం సేవిస్తూ ఉంటుంది.

4) సంపద సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు.తృప్తి పరిచేది - అవసరాలను తీర్చేది సంపద.సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది.

i)ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్ది సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది.ఒక కూలి నుండి బిల్ గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి. వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది.శారీరకంగా - మానసికంగా -బౌద్ధికంగా - ఆథ్యాత్మికంగా ..... ఏ రకంగానైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే, శ్రీమంతుడు కావడానికి ప్రధాన కారణం.
ఇక రెండవది
ii) క్రియాశక్తి వల్లలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి.సంపద అనేది శ్రమకు ప్రతిఫలం . శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది.శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్చాశక్తినీ... జ్ఞాన శక్తిని క్రియా రూపంలోకి మార్చడం వల్ల సంపద సృష్టించబడుతూ వుంటుంది.ఈ రెండు రకాలుగా కాకుండా ఇతరుల చే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టేవారు కొందరుంటారు. వీరు ఇహ-పర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది.ఎందుకంటే....సంపద అంటే డబ్బు - బంగారం కాదు. అవి సంపదకు బదులుగా వినియోగించే వినిమయాలు మాత్రమే!ఒక దేశంలోని డబ్బుకు మరో దేశంలో విలువ ఉండదు. అలాగే భూలోకంలో ఉండే వినిమయాలు మరో లోకంలో చెల్లబడి కావు.కానీ, ఇతరుల అవసరాలను తీర్చగలిగే నెైపుణ్యశక్తి.... క్రియాశక్తి ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడు గా నిలుపుతుంది.

ఇక ఈ సమస్త సృష్టి అవసరాలు తీర్చడం వల్లా.., సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరున్ని సంపద అనెడి ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుంది.

5) జ్ఞానంఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం - సర్వశక్తిమత్వమే సర్వజ్ఞత్వానికి కారణమౌతుంది.తత్వశాస్త్ర దృష్ట్యా జ్ఞానం అనేది పొందబడేది ... కోల్పోయేది కాదు. అది ఎప్పుడూ ఉండేది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది.దాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము.ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తిపైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది.ఏ విషయంలో ఏకాగ్రత చూపుతాడో ఆ విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది.ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినపుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాము. వారి వ్యక్తిగత చైతన్యం విశ్వ స్థాయికి ఎదగడం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది.ఈ విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నియతిని ఏర్పాటు చేయడం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది.ఆ నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించడాన్నే మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాము.ఇలా సర్వవ్యాపకుడు - విశ్వరూపుడు - నియంత అయిన ఆ పరమాత్మను జ్ఞానం అనెడి ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది.

6) వైరాగ్యంసంతృప్తితో కూడిన త్యాగమే వైరాగ్యం.ఈశ్వరునికి నిరంజనుడని పేరు.అంటే దేనికీ అంటకుండా కేవల సాక్షి మాత్రంగా ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం.వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి.హిమాలయాల్లో "పరుసవేది " అనే మూలిక ఉంటుందట. ఆ వేరుతో ఏ లోహాన్ని ముట్టినా ఆ లోహం బంగారంగా మారుతుందట. అలాంటి పరుసవేది ని కలిగి ఉన్న వ్యక్తి గుట్టలు గుట్టలుగా బంగారాన్ని ప్రోగుచేస్తాడా?ఆ వేరును మాత్రం దగ్గరుంచుకుని అవసరమున్నంత వరకే వాడుకుంటాడు. అతనికి ధనాన్ని సంపాదించాలనే కోరిక - ఆశ వంటివి ఏమీ ఉండవు.అంటే ధన విషయంలో వైరాగ్యం లభించినదన్న మాట!అసంతృప్తితో - అశక్తతతో వచ్చేది వైరాగ్యం కాదు. అది లేమితనం - బలహీనత.ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు.ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం.మన దేశంలో చాలా మంది మిథ్యా వైరాగ్య సంపన్నులు ఉంటారు. నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు. మళ్లి కష్టపడకుండా - తేరగా ధనం వస్తే సంతోషిస్తారు. ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తితో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది.వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు. అది ఇంతకు ముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి.ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు.

ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి.కాబట్టి వైరాగ్యం అనెడి ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది.ఇలా ఈ ఆరు ఐశ్వర్యాలను కలిపి 'భగ' అని పేరు. వీటిని కలిగి ఉండడం వల్ల భగవంతుడని పేరు.మనలో కూడా ఈ ఆరు ఐశ్వర్యాలు అంశ మాత్రంగా ఉంటాయి. మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి.

భూమిమీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ ఆరు ఐశ్వర్యాలు వారి వారి ప్రారబ్ధఫళంగా అంశమాత్రంగా కలిగి వుంటారు. ఉదాహరణకు సంపద అనే ఐశ్వర్యం తీసుకున్నామనుకోండి కొందరు వారి దైనందిక జీవనం గడపటానికి వలసినంత సంపద కూడా లేకుండా ఉంటే మరి కొందరు చాలా సంపద కలిగి అనేక భవనములు, వాహనములు ఇత్యాదివి కలిగి భూమిమీద పొందగల అనేక భోగాలు అనుభవిస్తూ ఉండవచ్చు.  కానీ ఇలాంటి ఐశ్వర్యవంతులు ఎవరు కూడా భూమిమీద శ్రేష్ఠమైన ఐశ్వర్యవంతులు అని చెప్పలేము ఎందుకంటె ఒకరిని మించిన ఐశ్వర్యం ఇంకొకరికి ఉండిఉండవచ్చు.  అలా కాదు ఫలానా వాడు భూమిమీద ఉన్న ఐశ్వర్యవంతులలో శ్రేష్ఠుడు అని అంటే అతనుకూడా శ్రేష్ఠుడు అని చెప్పటానికి వీలులేదు ఎందుకంటే అతనికంటే తక్కువ ఐశ్వర్యవంతులుగా వున్న వారి ఐశ్వర్యాలు కలిపితే ఆ ఐశ్వర్యం ఇతని ఐశ్వర్యం కన్నా ఎక్కువగా ఉంటుంది.  వెరసి ఏదో ఒక స్థాయిలో మాత్రమే ఐశ్వర్యం కలిగి ఉండగలరు. అదేవిధంగా భగవంతుని ఆరు గుణాలను మానవులు ఏదో కొంత స్థాయిలో మాత్రమే కలిగి వుంటారు.  కానీ భగవంతునితో సమానంగా కానీ పొతే పడే స్థాయిలో కానీ ఎవ్వరు ఉండలేరు.  కానీ వారికి కలిగిన ఐశ్వర్యతోటె విఱ్ఱవీగుతు తన అంతటి వాడు ఏరే ఎవ్వరు లేరని అహంభావంతో ఉండివారి పతనాన్ని వారే ఆహ్వానిస్తారు.  

ఇలా సర్వ సంపన్నుడు ఐన భగవంతుని తెలుసుకోవటం ఎలా. 

సామాన్య మానవులు కలిగిన సంపదలకు ఒక అవధి వున్నది కాబట్టి అది హాద్దు కలిగి వున్నది.  అంతేకాకుండా ఆ సంపద కేవలం ఒక్క భూమి మీద ఒక ప్రాంతంకు మాత్రమే పరిమితి కలిగి వున్నది.  కాబట్టి మనం ఆ ఐశ్వర్యవంతుని, అతని ఐశ్వర్యాన్ని చూడగలుగుతున్నాము. మరి ఈ చరాచర సృష్టి మొత్తము భగవంతుని సంపదే వున్నది అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే అది  మనం కంటితో కాంచగలిగేది కాంచలేని సంపద, అటువంటి  సంపద కలిగిన ఐశ్వర్యవంతుని చూడటం ఎలా.  ఎప్పుడైతే మనం కంటితో చూడలేని సంపద అని అన్నమో అప్పుడే ఆ ఐశ్వర్యవంతుడు కూడా కంటితో చూడలేని వాడని అర్ధం అవుతుంది. అదేవిధంగా ఇతర గుణాలకు కూడా అనువర్తించుకోవచ్చు. వెరసి తేలింది ఏమిటంటే షడ్గుణవంతుడైన వాడు మన కంటికి కనిపించటానికి అవకాశం లేదు ఎందుకంటె మనం ఈ చరాచర జగత్తులో చూసేది ప్రతిదీ ఏదో ఒక అవధిని కలిగి వున్నది.  ఆకార విషయానికి వస్తే ఒక మనిషి 5 నుంచి 6 అడుగుల ఎత్తులోవుండి ఉంటాడు అంటే అతని ఎత్తుకు ఒక అవధి వున్నది.  అదే విధంగా త్రిగుణాలలో ఏదో ఒక గుణం కలిగి ఉంటాడు అంటే అతని గుణాలకు ఒక అవధి  వుంది. అంతేకాకుండా భూమిమీద యేదోకొంత సంపద కలిగి ఉంటాడు అంటే సంపదకు అవధి వుంది. అలాగే దేర్యం కూడా ఒక హాద్దులో ఉంటుంది.  కాబాట్టి భగవంతుడు మానవరూపంలో లేడు, ఉండటానికి వీలులేదు. 

భగవంతుడు ఉన్నట్లు ఎందుకు నమ్మాలి: ఇది చాలామంది మందిలో మెదిలే ప్రశ్న .  అవును నిజమే మన కంటికి కనబడని భగవంతుని ఉన్నట్లు ఎందుకు నమ్మాలి. దానికి సరైన వివరంకావాలి. మన మహర్షులు వారి అనంత మేధాసంపత్తితో చక్కటి వివరం ఇచ్చారు.

ఒకటి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటమే ప్రమాణం.

ప్రమాణము అంటే ఒక విషయం యొక్క సత్యాసత్యాలను నిర్ధారించుకోవడం. హిందూ సాంప్రదాయంలో అందుకు వివిధ పద్ధతులు వివరించబడ్డాయి. అవి:

  1. ప్రత్యక్ష ప్రమాణం: ప్రత్యక్ష ప్రమాణం అంటే స్వయంగా గ్రహించడం. నీవు రామారావుని చూసావు అంటే అతని ఉనికిని నీ నేత్రాలు తెలుసుకొన్నాయి అది ప్రత్యక్ష ప్రమాణం.  మనం పురాణాలలో వింటూవుంటాము  అతని భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అని అంటే దాని అర్ధం ఇంద్రియ గోచరము కానీ భగవంతుడు ఇంద్రియ గోచరుడు అయ్యాడు అని.  ఈ విషయంమీద అనేక సందేహాలు ఉత్పన్నం అవుతాయి దానికి కారణం సాధకునికి సాధనలో పటుత్వం లేకపోవటమే. ముముక్షువులకు సాధనలో తీవ్రత పెరుగుతువుంటే అతనికి కలిగే సందేహాలు వాటంతట అవే నివారణ అవుతాయి.
  2. అనుమాన ప్రమాణం: పొగను గమనించి నిప్పు ఉండవచ్చునను కోవడం అనుమాన ప్రమాణం. అరణ్యంలో దూరంగా మనకు పొగ కనిపించిందంటే అక్కడ నిప్పు వున్నదని తెలుసుకోవచ్చు.  అంతే కాదు అరణ్యంలో నిప్పు ఉండటానికి అవకాశం లేదు ఎందుకంటె అరణ్యంలో వృక్షాలు, జంతువులూ మాత్రమే ఉంటాయి.  జంతువులకు నిప్పుని తయారుచేసే జ్ఞ్యానం ఉండదు కాబట్టి తప్పకుండా అక్కడ మనుషులు వుండివుంటారు అనేది కూడా మనకు అనుమాన ప్రమాణంతో తెలుసుకోవచ్చు.
  3. శబ్ద / ఆప్తవాక్య ప్రమాణం: తాను నమ్మే ప్రమాణ గ్రంథంలో ఉన్నందువలన గానీ, తను విశ్వసించే వారెవరైనా చెప్పినందువలన గానీ అంగీకరించడం శబ్ద / ఆప్తవాక్య ప్రమాణం.
  4. ఉపమాన ప్రమాణం: ఏదైనా ఒక ఉపమానాన్ని చెప్పి ఒప్పించడం ఉపమాన ప్రమాణం.
  5. అర్థాపత్తి ప్రమాణం: వాచ్యంగా చెప్పక పోయినప్పటికీ ధ్వనివల్ల విషయాన్ని బోధపరచడం అర్థాపత్తి. ఫలానా వ్యక్తి పగలు భోజనం చేయడం లేదు అంటే అతడు రాత్రి భోజనం చేస్తున్నాడనుకోవచ్చు.
  6. అనుపలబ్ధి ప్రమాణం: ఒక వస్తువు కోసం ఒకరు మిగతా అందరితో పాటు వరుసలో నిలుచున్నాడు. కాని, అతని వంతు రాకముందే సరకు అయిపోయింది. సరకు అయిపోయి నందువల్ల తనకు వస్తువు దొరకలేదని తెలియడం అనుపలబ్ధి ప్రమాణం.
  7. సంభవ ప్రమాణం: ఈ రోజు ఏకాదశి అయితే నిన్న దశమి, మొన్న నవమి అని చెప్పకపోయినా తెలియడం సంభవ ప్రమాణం.
  8. ఐతిహ్య ప్రమాణం: ఏదైనా వస్తువును చూసినప్పుడు, దానిని గురించి గతంలో తాను విన్న విషయాలు జ్ఞాపకానికి వచ్చి తదనుభూతి కలగడం ఐతిహ్య ప్రమాణం.

మనకు ప్రత్యక్ష జ్ఞ్యానం లేకపోయినను ఒక విషయాన్నీ తెలుసుకొనే విధానమే పైన పేర్కొనిన ప్రమాణాలు. భగవంతుని కూడా మనం ఇందులో ఏదో ఒక లేక ఒకటికన్నా ఎక్కువ ప్రమాణాల వలన ఆయా సమయాలలో తెలుసుకోగలం. నాకు ఒక కోరిక ఎన్నో రోజులనుండి తీరటం లేదు అప్పుడు ఎవరో చెప్పారు నీవు సతయనారాయణస్వామి వ్రతం ఆచరించు నీ కోరిక నెరవేరుతుంది అని వెంటనే నేను స్వామి వ్రతం చేసాను నా కోరిక తీరింది. ఇక్కడ మన కంటికి ఏది కనిపించటం లేదు కానీ కార్యం  నెరవేరింది. అప్పుడు నేను నా కోరిక తీరటానికి స్వామే కారణమ్ అయన అనుగ్రహంతోటే నాకు ఫలితం వచ్చింది అని నమ్ముతాను. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే భగవంతుని లీలలు మనకు ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము అని. 

కార్య కారణ సంబంధం : 

మన కంటిముందు ఒక కార్యము (పని) కనబడుతూ వున్నది అంటే దానికి కారణమైన కారకుడు వుండివుండాలి అనేది  కార్య కారణ సంబంధం :నీ కంటిముంది ఒక చక్కటి కట్టడం కనపడుతున్నది అది చాలా పురాతనమైనది.  దానిని ఎవరు కట్టారో నీకు తెలియదు.  కానీ అది ఎవరో కట్టి వుంటారు అన్నది మాత్రం ప్రమాణం ఎందుకంటె నీ ముందు కార్యం (పని అంటే నిర్మాణం) కాన పడుతూవున్నది. అంటే అది నిర్మించిన పనివాడు కూడా వుంది ఉంటాడు. అదే విధంగా నీకు పర్వతాలు, నదీనదాలు, సాగరాలు, ఎడారులు, కనపడుతూ వున్నాయి అంటే అవి ఒక కార్యం (పని) అటువంటప్పుడు ఆ కార్యం చేసిన కారకుడు అంటే నిర్మాత వుంది ఉండాలి కదా అటువంటి నిర్మాతనే కార్యకర్తగా భగవంతునిగా మన మహర్షులు ఆవిష్కరించారు. 

నియతి నియంత:

మనం నిత్యం కార్యాలయాలలో కొన్ని నియమాలను చూస్తూవుంటాం అవేమిటంటే ఉదయం 10. గంటలకు కార్యాలయంలోకి ఉద్యోగులు రావటం, 1 గంట దాకా పనిచేయటం, తరువాత భోజన విరామం తరువాత మరల సాయంత్రం 5 గంటలవరకు పనిచేయటం.  ఇలా నియమాలను సారంగా ఉద్యోగులు పనిచేయటం ఒక నియతి అంటే ఒక క్రమ పద్దతి.  మరి ఆ క్రమ పద్దతిని నియమించింది ఎవరు అంటే అది యాజమాన్యం అంటే ప్రభుత్వం.  ప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తే అన్ని కార్యాలయాలు ఆ పద్దతి ప్రకారంగా పనులు చేస్తుంటాయి. అంటే ఇట్లా ఉన్న నియతికి కారణం ప్రభుత్వం అని మనకు తెలుస్తున్నది.  ఎప్పుడైతే నియతి కనిపిస్తున్నాదో అప్పుడు నియంత  ఉన్నట్లు మనకు జ్యోతకమవుతున్నది. 

మనం ఈ  ప్రకృతుడిలో  రోజు అలాంటి నియతినే చూస్తూవున్నాము. ఈ రోజు నీవు ఒక విత్తును నాటావు అది ఒక నాలుగు రోజులలో మొలకెత్తి మొలకగా కనిపిస్తున్నది, తరువాత చెట్టుగా మారి దానికి మొగ్గలు, పూలు, కాయలుగా రోజుకొక విధంగా రూపాంతరం చెంది చివరకు ఒకరోజు నశించిపోతుంది. ఈ దృగ్గోచరం నీవు నేను రోజు చూస్తున్నాము. 

వర్షపు నీరు ప్రవహించి పల్లానికి వెళుతున్నాయి, అవి ఒక వాగుగా, నదిగా మారి చివరకు సముద్రాన్ని చేరుకుంటున్నాయి. మనకు వేసవి కాలం తరువాత, వర్షాకాలం ఆతరువాత శీతాకాలం మరల వేసవికాలం ఒక క్రమపద్ధతిలో వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒక నియతి వున్నది. 

ఇంకొక విషయం ప్రకృతికి కొన్ని నియమాలు వున్నాయి అవి ఆకాశంలో నీళ్లు లేవు కానీ మేఘాలు వర్షితున్నాయి, నిప్పు ముట్టుకుంటే కాలుతున్నది, భూమికి ఆకర్షించే గుణం వున్నది. చంద్రుడు తన కళలతో విరాజిల్లుతున్నాడు సూర్య చంద్రులు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రిపగళ్ళు ఏర్పడుతున్నాయి. ఇలాంటివన్నీ నియతులే.  ఇంతక్రమపద్ధతిలో కాలచక్రం ఎలా నడుస్తున్నది అంటే దానిని నడిపే కర్త ఎవరో ఒకరు ఉండాలి.  ఆ కర్తే భగవంతుడు.. 

ఆ భగవంతుని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం మరి అది పొందటం ఎలా. 

ముందుగా మనం బౌతికంగా వున్నవిషయాలను తెలుసుకుందాము.  

తెలిసిన విషయాలు: 

ప్రతి మానవుని జ్ఞ్యానం ఒక పరిమిత స్థాయికి మాత్రం చేరుకొని ఉంటుంది. జ్ఞ్యానం అంటే తెలిసిన విషయాలు అని సాదారణ అర్ధం చెప్పుకుందాం. నిజానికి బౌతికంగా కనిపించే వస్తువులమీద కూడా ప్రతివానికి ఒక పరిమితమైన జ్ఞ్యానమే ఉంటుంది. సంపూర్ణ జ్ఞ్యానం ఒక్కరికే ఉండదు కొంతమంది జ్ఞ్యానవంతుల జ్ఞ్యానాన్ని సమీకరిస్తేనే సంపూర్ణ భౌతిక జ్ఞ్యానం కలుగుతుంది. 

ఉదాహరణకు ఒక కారుని తీసుకుందాము. మీ ఇంట్లోని బాలునికి నీ కరుగురించి కలిగిం జ్ఞ్యానం ఏమిటనే మీ కారుని గుర్తించటం కారులో నీతో ప్రయాణం  చేయటం. అదే నీకు కారుని నడపటం వరకు మాత్రమే జ్ఞ్యానం వుంది.  దానికి రిపేరు వస్తే బాగుచేయటానికి రిపేరరు వద్దకు తీసుకొని వెళ్ళాలి, అతనికి కూడా కొంతవరకే జ్ఞ్యానం ఉంటుంది. దానిని తయారుచేసిన వారందరి సంపూర్ణ జ్ఞ్యానాన్ని సమీకరిస్తేనే ఆ కారుకి సంబందించిన సంపూర్ణ జ్ఞ్యానం లభించదు. భౌతికమైనదే ఇంత జటిలంగా ఉంటే ఆధ్యాత్మికమైనది ఇంకా యెంత కఠినంగా ఉంటుంది. 

ప్రతి మనిషికి కలిగిం జ్ఞ్యనం రెండు రకాలుగా చెప్పవచ్చు ఒకటి అతనికి కలిగిన జ్ఞ్యానం రెండవది అతను పొందవలసిన జ్ఞ్యానం మొదటిది తనకు కలిగిన జ్ఞ్యానం అంటే ఒక మనిషి తానూ పంచేంద్రియాలద్వారా తెలుసుకున్న జ్ఞ్యానం, అది తన స్వన్తంగా తెలుసుకున్నది, గ్రంథపఠనం వలన తెలుసుకున్నది, గురువులద్వారా శ్రవణం చేసి తెలుసుకున్నది కావచ్చు.  ఏది ఏమైనప్పటికి ప్రతిదీ ఇంద్రియాలకు లోబడినది, ఈ జగత్తులో కనిపించేది, వినిపించేది, అనుభవంలోకి వచ్చేది మాత్రమే అవుతుంది.  కానీ అంతకుభిన్నంగా మాత్రం ఉండటానికి వీలులేదు. తెలిసినదానిని జ్ఞ్యానం తెలియనిదానిని అజ్ఞ్యానం అని మనం అంటాము.  నీకు జ్ఞ్యానంగా వున్నది ఇంకొకరికి అజ్ఞ్యానంగా ఉండవచ్చు అదేవిధంగా నీకు అజ్ఞ్యానంగా వున్నది ఇంకొకరికి జ్ఞ్యానంగా గోచరించవచ్చు.  వెరసి భూమిమీద వున్నవారికి ఒక్కొక్కరికి ఒక్కోక పరిధిలో జ్ఞ్యానం ఉంటుంది అన్నది సత్యం. భూమిమీద వున్న మానవుల అందరి జ్ఞ్యానాన్ని మనం ఒక సంపూర్ణ జ్ఞ్యానంగా అంటే ఇక్కడ అన్ని శాస్త్రాల జ్ఞ్యానం అనుకుంటే అందులో ఒక మనిషికి  తెలిసిన జ్ఞ్యానాన్ని అతని జ్ఞ్యానంగా తెలియని జ్ఞ్యానాన్ని అజ్ఞ్యానంగా పరిగణిస్తున్నాము. ఇది మన భౌతిక మైన సాదారణ ఆలోచన. అంటే ప్రతి మనిషికి ఉన్న అజ్ఞ్యానాన్ని తొలగించుకోవాలంటే దానికి సంబందించిన జ్ఞ్యానవంతుని ద్వారా శిక్షణపొంది జ్ఞ్యానవంతుడు  అవవచ్చు. అంటే ఒక మనిషికి తెలియని జ్ఞ్యానాన్ని మనం ఒక గురువునుంచి పొందవచ్చు అని అనుకుంటాము. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేనిగురించి ఐనా అజ్ఞానం ఉందంటే దానికి సంబందించిన జ్ఞ్యానం ఉన్నవారి వద్దనుండి పొందవచ్చు అంటే ఒక విష్యంగూర్చిన జ్ఞ్యాననఁ ఉంటె నీకున్న జ్ఞ్యానంములోనన్న లేక నీకున్న అజ్ఞ్యానంలో నయినా ఉండి  ఉండాలి తత్భిన్నంగా ఉండటానికి వీలులేదు. 

ఇది చదువుతుంటే అర్ధం ఐనట్లే అనిపిస్తుంది అర్ధంకానట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటె మనం ఇప్పుడు తెలుసుకునే జ్ఞ్యానం బ్రహ్మ జ్ఞ్యానానికి సంబంధించింది అంటే ఏ జ్ఞ్యానం తెలుసుకుంటే మరొకటి తెలుసుకొనవసరంలేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం. దీనిని అర్ధంచేసుకోవటానికి సునీత సూక్ష్మ ఆవగాహన కలిగి ఉండి శ్రర్ధ, అకుంఠిత దీక్ష సంపూర్ణంగా తెలుసుకోవాలనే జిగ్న్యాస కలిగివుంది ఇతర విషయాలమీద మనస్సు పోకుండా ఏకాగ్రత చిత్తం కలిగి ఉండాలి. విషయవాంఛలకు లోనయివుండే మనస్సు ఏకాగ్రతను ఏర్పరచుకోవడం చాలా కష్టం. సాధారణ మానవులకు దైవ చింతన అనేది కేవలం దైవభక్తి వరకు మాత్రమే పరిమితం అయివుంటుంది.  అదికూడా నేటి సమాజంలో అనేక దొంగగురువులు, దొంగ సాధువులు  తారసపడుతున్నారు.  వారు వారి ఆధ్యాత్మికతలో ఏమాత్రం అభివృద్ధి సాధించకపోయినా కొన్ని మహిమలు అవి ఏరకంగా వస్తాయో ఇక్కడ వివరించనవసరంలేదు ఎందుకంటె అవి సాధనావల్ల, సిద్దించిన సిద్దులు కావు కాబట్టి వాటికి ప్రచారం ఎక్కువగా వుంది అందరిని తాను మహిమాన్వితుడనని నమ్మించటం చాలా తేలిక . ఈ రోజుల్లో అటువంటి బాబాలు, స్వామీజీలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నారు, సాధారణ ప్రజల్ని మోసగిస్తూ వాళ్ళ పబ్బం  గడుపుకుంటున్నారు. కాబట్టి ముముక్షువులు జాగరూకతకలిగి ఉండాలి. 

ఇక విషయానికి వస్తే బ్రహ్మ జ్ఞ్యానం ఈ భూమిమీద వున్న జ్ఞ్యానం కాదు కాబట్టి అది గురువులద్వారా పొందేది కాదు. ఎవరైనా నేను సద్గురువును నీకు ఆత్మా జ్ఞనాన్ని ఉపదేశిస్తాను అంటే నమ్మవలదు.  అది కేవలం సాధకుడి అకుంఠిత దీక్షతో సాధించేది మాత్రమే. 

సాధకుడు తన సాధనతో ప్రారంభంలో కొన్ని శక్తులు వస్తాయి అవికేవళం తాత్కాలికమేనవి మాత్రమే కానీ సంపూర్ణ దీక్షతో నిరంతన సాధనతో సాధకుడు సమాధి స్థితికి చేరుకున్న తరువాత అష్టసిద్ధులు  వస్తాయి. అష్ట సిద్దులు లభించిన తరువాత సాధకుడు వాటిని దుర్వినియోగం చేయకుండా తన సాధనను ఇంకా ఇంకా కొనసాగిస్తే అప్పుడు మాత్రమే అనిర్వచనమిలేం మోక్షం లభిస్తుంది. 

ఓం తత్సత్,

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 






 ఇంకా వుంది

సూర్యుడు

 శ్లోకం:☝️

 *దక్షిణాం దిశం ప్రతి*

*అయనం దక్షిణాయనం ।*

*సౌమ్యత్వాదత్ర సోమో హి*

 *బలవాన్ హీయతే రవిః ।*

*మేఘవృష్ట్యనిలైః శీతైః*

 *శాంతతాపే మహీతలే ॥*


భావం: సూర్యుడు భూమధ్యరేఖకి ఉత్తరానున్న కర్కాటక రేఖ (Tropic of Cancer) వద్ద నుండి దక్షిణం వైపు అంటే మకర రేఖ వైపు పయనించడమే దక్షిణాయనం. అలా ప్రయాణిస్తూ మకర రేఖకు (Tropic of Capricorn) చేరుకున్నప్పుడు మకర సంక్రమణం (Winter Solstice). ఈ దక్షిణాయన కాలంలో సూర్యుని తేజస్సు క్రమంగా తగ్గటం వలన చంద్రుని తేజస్సు బలపడుతుంది. వర్ష-శరత్-హేమంత ఋతువులు దక్షిణాయన కాలంలోనే వస్తాయి.

పాశ్చాత్యుల ప్రకారం మకర సంక్రమణం (Winter Solstice) డిసెంబర్ 21 కి వస్తుంది. మనకి జనవరి 14న మకర సంక్రాంతి వస్తుంది. మనకి వారికీ మూడు వారాల తేడా! ఎవరి పద్ధతి సరైనదో పెద్దలు చెప్పాలి.🙏

ఒత్తిడి తగ్గడానికి

 ☘️☘️☘️



*_మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు_*


🎊💦🦚🍇🥀🌺🌷



👉🌱```1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !


👉🌱2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !


👉🌱3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను 

తగ్గించగలదని గుర్తించుకో !


👉 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !


👉🌱 5. కక్ష కన్నా క్షమ గొప్పది 

క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !


👉🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !


👉 🌱7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!


👉🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !


👉🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !



👉🌱 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !


👉🌱11. *మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో*  *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!


👉🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!


👍🌱13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !


👉 🌱14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో ! 


👉🌱 15. *టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !


👉🌱16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !


👉🌱17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !




👉🌱18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !


👉🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !


👉🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !


👍🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!


👉🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !


👉🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !


👉🌱24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !


👉🌱25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.


👉🌱 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .


👉🌱 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .```


☘️☘️☘️

ఖర్చులు పెరిగాయి

 మిత్రమా జనం అంటారు ధరలు పెరిగాయని......

కాదు...... ఖర్చులు పెరిగాయి.


అప్పట్లో మన సెలవులు అమ్మమ్మ గారి ఇంట్లో గడిచేవి!

మరి ఇప్పుడు..... గోవాలోనో, మనాలిలోనో గడుస్తున్నాయి!!


*ధరలు పెరగలేదు మిత్రమా....*

*ఖర్చులు పెరిగాయి., కాదు కాదు.....*

*నువ్వు 👉 ఖర్చులు పెంచుకున్నావు.*


ముందు జనాలు మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్ళేవారు!

కానీ ఇప్పుడు..... రెండడుగుల దూరం వెళ్లాలంటే క్యాబ్ బుక్ చేస్తున్నారు!!


*ధరలు పెరగలేదు మిత్రమా.....*

*నువ్వు 👉 ఖర్చులు పెంచుకున్నావు.*


అప్పట్లో సెలవుల్లో సకుటుంబ, సపరివార, సమేతంగ ఇంట్లో కూర్చుని భోజనం చేసేవారు!

కానీ ఇప్పుడు..... వారాంతాల్లో (Weekends లో) కుటుంబమంతా రెస్టారెంట్లలో కనిపిస్తున్నారు!

లేదా... స్విగీ లేదా జొమాటో ను ఆశ్రయిస్తున్నారు!!


*ధరలు పెరగలేదు మిత్రమా.....*

*నువ్వు 👉 ఖర్చులు పెంచుకున్నావు.*


అప్పట్లో ఏటా రెండంటే రెండు జతల బట్టలు కొనేవాళ్ళం!

మరి ఇప్పుడు..... నెలలో రెండు, మూడు సార్లు ఆన్లైన్ షాపింగులు, మాల్స్ లో ఆఫర్ ప్యాకింగులు!!


*ధరలు పెరగలేదు మిత్రమా.....*

*నువ్వు 👉 ఖర్చులు పెంచుకున్నావు.*


అప్పట్లో ఒక్క T.V తో వీధి వీదంత ఆనందించేది!

ఒక్క DD తో కుటుంబం మొత్తానికి కాలక్షేపంగా వుండేది!

మరి ఇప్పుడు..... Netflix, Amazon prime మాయలో పడిపోయింది లోకం!!


*ధరలు పెరగలేదు మిత్రమా.....*

*నువ్వు👉 ఖర్చులు పెంచుకున్నావు.*


అప్పట్లో 25 పైసల లెటర్ కోసం కుటుంబమంతా ఎదురు చూసేది!

ఆ లేఖతో ఇంట్లో అందరికీ పండగ వాతావరణం వచ్చేది!

మరి ఇప్పుడు..... కుటుంబంలోని అందరి చేతుల్లో (పసి పిల్లలతో సహా) సెల్ ఫోన్స్ కనిపిస్తుంది!!


*ధరలు పెరగలేదు మిత్రమా.....*

*నువ్వు👉 ఖర్చులు పెంచుకున్నావు. అంతే..... 😀😆*


* ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు కొక్కొళ్ళలు......


అందుకే మళ్ళీ చెప్తున్నా.....


*ధరలు పెరగలేదు మిత్రమా.....*

*నువ్వు👉 ఖర్చులు పెంచుకున్నావు.*


కాబట్టి ఈ 2023 లో నైనా రేపటి తరానికి ఆర్థిక ,సామాజిక, వాతావరణ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.

💐💐💐

భద్రాచలం లో శ్రీ రామచంద్ర స్వామి

 భద్రాచలం లో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం గురించి...



భద్రుడు అనే ఋషి,,, శ్రీ రాముడిని,,  ఒక వరం అడిగాడు.


( అసలు భద్రుడు,,, ఎవరు అంటే... మేరు పర్వత రాజుకి 2 కొడుకులు.

రత్నుడు, భద్రుడు,

ఇద్దరూ విష్ణు భక్త్తులు.. ముక్తి పొంది పర్వతాలుగా.. మారారు..

రత్నుడు అన్నవరం లో రత్నగిరిగా ,,,,  భద్రుడు భద్రాచలం లో " భద్రగిరి' గా మారారు).ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి.,,,  దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను.,,,  తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.,,, కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.


అది తెలిసిన భద్రుడు ఘోరతపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు,, 

అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం,విల్లుతో పాటు విష్ణువు చేతిలో వుండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చొన్నట్లు పురాణాలను బట్టి తెలుస్తుంది.