భద్రాచలం లో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం గురించి...
భద్రుడు అనే ఋషి,,, శ్రీ రాముడిని,, ఒక వరం అడిగాడు.
( అసలు భద్రుడు,,, ఎవరు అంటే... మేరు పర్వత రాజుకి 2 కొడుకులు.
రత్నుడు, భద్రుడు,
ఇద్దరూ విష్ణు భక్త్తులు.. ముక్తి పొంది పర్వతాలుగా.. మారారు..
రత్నుడు అన్నవరం లో రత్నగిరిగా ,,,, భద్రుడు భద్రాచలం లో " భద్రగిరి' గా మారారు).ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి.,,, దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను.,,, తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.,,, కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు.
అది తెలిసిన భద్రుడు ఘోరతపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు,,
అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం,విల్లుతో పాటు విష్ణువు చేతిలో వుండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చొన్నట్లు పురాణాలను బట్టి తెలుస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి