11, నవంబర్ 2020, బుధవారం

దీపావళి



5 రోజుల దీపావళి  ...


దీపావళి అంటే సంతోషం ... సందడి ... సంబరం. ఈ రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో ... మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటిపడే సరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటులేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది.


చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ వుంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది. 


శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.


ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.


ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.


ఈ రోజుల్లో వానలు కురవడం ... చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు. 


ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు ద్వారకానగరానికి చెందిన 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక, అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు. మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు. 


ధనత్రయోదశి .. నరకచతుర్దశి .. దీపావళి ... బలిపాడ్యమి ... యమద్వితీయ అయిదు రోజుల పండుగలా భావిస్తుంటారు కనుక కొందరు అయిదు దీపాలను వెలిగిస్తుంటారు. భూదేవి దీపం వేడిని భరించలేదట. అందువలన ప్రమిదలో ప్రమిద పెట్టి వెలిగిస్తుంటారు ... ఆ బంగారు కాంతుల్లో అనుబంధాల వాకిట్లో ఆనందాల సందడి చేసేస్తుంటారు.


1.🔥 ధన త్రయోదశి 🔥


ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నాడు ‘ధన్వంతరి జయంతి’ మరియు ‘ధన త్రయోదశి’ ని జరుపుకుంటాం. ధన్వంతరిని ఆయుర్వేద వైద్యానికి ఆద్యకర్తగా భావిస్తారు. క్షీరసాగర మథనం జరిగినపుడు శ్రీమహావిష్ణువు అంశగా అమృత కలశహస్తుడై  ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి అవతరించిన రోజు. కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడు. ధన త్రయోదశిరోజు ఆయనను భక్తితో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.  


ఈనాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించాలి. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి. ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. 


మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి.


వైద్యులు తప్పకుండా ఈ   రోజు ధన్వంతరి పూజ చేయాలి. అలా శ్రద్ధగా పూజిస్తే  వైద్యుల హస్తం అమ్రుతీకరణం అవుతుంది. తద్వారా వారు ఇచ్చిన మందు రోగికి  అమ్రుతంవలె పనిచేస్తుంది.     దీనినే హస్తవాసి అంటారుఈరోజు ఐశ్వర్య, సౌభాగ్యదాయిని ధనలక్ష్మీదేవిని పూజిస్తారు.  ఆమెను ఈరోజు పూజించడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 


పూర్వం హిమవంతుడనే రాజుకు లేక లేక ఓ పుత్రుడు జన్మించాడు. అయితే ఆ కుమారుడు జాతకరీత్యా  వివాహమైన నాలుగవ రోజు పాముకాటుకు గురై చనిపోతాడని చెబుతారు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. వివాహం కూడా అవుతుంది. ఆ రాకుమారుడి భార్య వివాహమైన నాలుగోరోజు రాత్రి రాజసౌథాన్ని దీపాలతో అలంకరిస్తుంది. బంగారం, వెండి, రత్నాలని రాశులుగా పోసి  ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని పూజిస్తుంది. రాకుమారుడి ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతి, బంగారు, వెండి ధగధగలకు కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోతాడు. వచ్చిన పని మరచిపోయి తెల్లవారి తిరిగి వెళ్తాడని చెబుతారు. ధనలక్ష్మీ దేవి అనుగ్రహం వల్లే తన భర్తకు ప్రాణహాని తప్పిందని పురాణ కథనం. అందుకే ఈరోజు స్త్రీలు సౌభాగ్యానికి,  ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. అందుకే ఈరోజు శక్తి కొలది లక్ష్మీ అనుగ్రహం కొరకు ధన లక్ష్మి ని పూజిస్తారు. దీనినే యమ త్రయోదశి గా కూడా జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది.


2.🔥 నరక చతుర్దశి 🔥


నరకాసుర సంహారం జరిగింది ఈరోజే.  ఇంకా ఈ చతుర్దశి రోజున ఆచరించాల్సిన  విధానాలు ఇవి.


👉 ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయ తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.  పితృ దేవతలకు నరక బాధలు లేకుండా చేసే చతుర్దశి  కనుక నరక చతుర్దశి అని కూడా వ్యవహరిస్తారు.


3.🔥 దీపావళి 🔥


లోక కంటకుడు అయిన నరకుని పీడ తొలగినందుకు దీపావళి జరుపుకుంటారు. పైన వివరణ చదువుకున్నాం కదా ? ఇంకా ఈరోజున చేయాల్సిన విశేషాలు చూద్దాం. 


దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ.


దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||


దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళి  రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. 


పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. 


ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.


దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటారు .  దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. 


4.🔥 బలి పాడ్యమి 🔥


దీపావళి మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున హిందువులు బలి పాడ్యమి గా జరుపుకుంటారు.

పాడ్యమి రోజు ఉదయాన పంచవర్ణముతో బలిని నిర్మించాలి. తెల్లని బియ్యంతో పరివారాన్ని నిర్మించాలి. ఆ మీద పూజ చేయాలి. బలిని ఉద్దేశించి యధాశక్తి దానాలు చేయాలి. 


  బలి ప్రార్థన :


బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో !

భవిష్యేంద్ర సురారాతే పూజేయం, ప్రతిగృహ్యతాం !! 


బలి చక్రవర్తి గురించి మనలో చాలామంది వినేవుంటారు. ఆయనకు 'మాట తిరుగని మానధనుడు’ అని పేరు కూడా ఉంది. ఇచ్చిన  మాట నిలుపుకోవడంలో ఆయనకు ఎంత మంచి పేరుందో అంతటి అహంకారం కూడా ఉంది.   ఒకసారి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి.. వామనుడైన విష్ణువుకు తన సర్వస్వాన్ని దానం చేశాడు. అప్పుడు వామనుడు తన మూడవ కాలును బలిచక్రవర్తి తలపై పెట్టి అహంకార భంగం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు. అప్పుడు గర్వభంగమైన  బలిచక్రవర్తి "దేవా! నాకోసం ఏమీ అడగను. నా ప్రజల కోసం ఓ వరం అడుగుతాను అని అన్నాడు. “నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి" అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు. 


ఈ రోజున అనగా కార్తీక శుద్ధ పాడ్యమిన.. మహావిష్ణువుతో కలిసి బలి చక్రవర్తి తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు.  ప్రతి ఇంటి ముంగిట దీపాలూ, మామిడితోరణాలు, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నరాని బలి సంతోషపడతాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు 'బలి పాడ్యమి 'అయ్యింది. ప్రజల క్షేమం కోసం వచ్చే బలిచక్రవర్తిని ఈ రోజున పూజించాలి.


      ఈ రోజున గోవర్థన గిరి పూజ చేయాలని మన పెద్దలు  చెబుతారు. తనను మాత్రమే పూజించాలని, లేకపోతే అల్లకల్లోలం చేస్తానని.. ఇంద్రుడు భీకర గాలి,తుఫానును సృష్టిస్తాడు. అప్పుడు  శ్రీకృష్ణుడు గోవర్థన గిరిని తన చిటికెన వేలు మీద నిల్పి, ప్రజలను కాపాడి.. ఇంద్రుడికి కూడా ఇదే రోజున గర్వభంగం చేశాడు. కనుక ప్రజలను కాపాడిన గోవర్థన గిరిని, శ్రీకృష్ణుడిని ఇప్పటికీ పూజిస్తాము.


5 🔥 భగినీ హస్త భోజనం 🔥


కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ.  ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. 


ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ... "ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు'' అంటాడు. దీనికి కారణం ఉంది.


యముడు, యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదరసోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమున, యముడు ల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు.🙏

అన్నం పరబ్రహ్మ స్వరూపం*

 *అన్నం పరబ్రహ్మ స్వరూపం*

 అన్నదానం అన్ని దానాలలోకెల్ల ఉత్తమమైనది..


ఎప్పుడైన ఎవరైనt ఎక్కడైన సరే అన్నం పెట్టమని అడిగినారంటే అది మీ అదృష్టమనే చెప్పవచ్చు, అంటే మీరు పుణ్య కాలంలోనికి ప్రవేశిస్తున్నారని అర్ధం, భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దీన్నీ సరిగ్గా మనం వినియోగించుకోవాలి. నోరు లేని జంతువులకు, గోమాత కడుపు నింపిన కూడా కోట్ల రెట్లు ఫలమధికం. 


మనమే వెళ్ళి అన్నం పెట్టడం కన్నా, వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చెయ్యి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు నీవు పిలవకుండానే వచ్చిదంటే వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్టవలయును. పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భగవంతుడు, ఒక వేదమూర్తి, మాలధారణ స్వామీ నీఇంటికి వస్తే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇచ్చినా కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం అంటే మంచినీరు అందించ్చినా ఎంతో పుణ్యదాయకం.


ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తారో..!! యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతోషించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తొలిగిపోతుంది. భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు. 


నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంత వాళ్ళు తొలగిస్తారు. నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు, మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది, నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో..!!


అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టు, నీ తరతరాలను ఆశీర్వదించి వెళతాడు. ఎవ్వరూ కూడా నీ ఇంటికి తిండి దొరకక రారు, కావున “అమ్మా అన్నం పెట్టు” అని అడిగిన వారికి, మీకు ఎన్ని పనులున్నా కూడా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో మాత్రం పంపకండి, వాటికి పెట్టిన వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది. నల్లని ఆవుకు, నల్లని కుక్కకు అన్నం పెట్టడం వలన అపమృత్యు దోషం తొలిగిపోతుంది. అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిది. "అతిథి దేవోభవ" అనే మాటకు అసలు అర్దం ఇదే.


అన్నదానం మహాదానం అంటే కూడా ఇదే..

జరాసంధుాడు

 *📖 మన ఇతిహాసాలు 📓*



*జరాసంధుాడు*


జరాసంధుడు పరమ శివ భక్తుడు, రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వం వచ్చే పాత్ర.


*జన్మ వృత్తాంతం*



బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. ఒకరోజు బృహద్రధుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహర్షిని చూస్తాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. బృహధ్రద మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతనం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రికి లోనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుంది. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజు దగ్గరకి తీసుకొని వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని చెబుతుంది. ఒకరోజు చందకౌశిక మహర్షి బృహద్రడుడి రాజ్యానికి వచ్చి జరాసంసంధుడిని చూసి, జరాసంధుడూ పరమ శివ భక్తులలో ఒకడౌతాడు అని చెబుతాడు.


*యుధిష్టరుడి రాజసూయం*


*శ్రీకృష్ణుడు, భీముడు, పార్థుడు యుద్ధ భిక్ష*


పోరాడుతున్న భీమ జరాసంధులు

ధర్మరాజు రాజసూయయాగము చేయ నిశ్చయించి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి తన అభిప్రాయాన్ని వెల్బుచ్చుతాడు. రాజసూయానికి కావలసిన ధనము అవసరము అని ఆ జరాసంధుడి వద్ద మిక్కిలి ధనము ఉన్నదని, జరాసంధుడు అనేక రాజులను బంధించి హింసిస్తునాడని, రాజులను శివుడికి బలి క్రింద ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు చెబుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమాలోచన జరిపి తాను, భీముడు, అర్జునుడు జరాసంధుడి వద్దకు బ్రాహ్మణు వేషముతో వెళ్ళి యుద్ధ భిక్ష వేడుతాను అని చెప్పి మగధ బయలు దేరుతాడు. మగధ పొలిమేరలకు చేరు కొనుచుండగా జరాసంధుడి కోట మీద ఉన్న డంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు. ఆ ఢంకాలు శత్రువులు ఎవరైన రాజ్యములో ప్రవేశిస్తే తామంటతామే మోగుతాయి. భీముడికి చెప్పి ఆ ఢంకాలను భీముడీ ఉదరముతో చీల్చమని చెబుతాడు. ఢంకలు ధ్వంసము చేశాక శ్రీకృష్ణ, అర్జున, భీములు రాజమార్గంలో కాకుండా దొడ్డిమార్గములో రాజధానిలో ప్రవేశిస్తారు. జరాసంధుడు వారికి అర్ఘ్య్పాద్యాలు ఇచ్చి, తాంబూలము ఇవ్వబోతే శ్రీకృష్ణుడు వాటిని నిరాకరిస్తాడు. అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుడిని కారణము అడుగగా యుద్ధ భిక్ష కోరుతాడు. జరాసంధుడు భీముడితో మల్లయుద్ధము చేయడానికి అంగీకరించి వారి వారి పరిచయాలు చెప్పమంటాడు. అప్పుడు వారు వారి పరిచయాలు చెబుతారు. జరాసంధుడు తన కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకము చేసి మల్ల యుద్ధానికి దిగితాడు.


*జరాసంధుడు-భీముల యుద్ధము*


జరాసంధుని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చుచున్న భీముడు

యుద్ధం 27 రోజులు గడుస్తుంది. జరాసంధుడు-భీముడు ఘోరాతిఘోరంగా పోరాడుతుంటారు. శ్రీకృష్ణుడి సూచన మేరపు భీముడు జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి రెండు భాగాలను వేరే వేరే దిక్కులకు విసిరేస్తాడు. ఆ విధంగా జరాసంధుడు అస్తమిస్తాడు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

మీకు ఏమి కావాలి

 *ప్రియమైన హిందూ బంధువులందరికీ,*

-మీకు ఏమి కావాలి ??

70 సంవత్సరాల ఇస్లామిక్ పాలన నుండి కాశ్మీర్‌ను బిజెపి విడుదల చేసింది,

 మీరు సంతోషంగా లేరా ??

బిజెపి, మోడీ అన్ని రకాల అవినీతిని ఆపారు, 

మీరు సంతోషంగా లేరా ??

మోడీ మీ 700 సంవత్సరాల కలను   రామ్ మందిర్ ను మొఘలులు మరియు కాంగ్రెస్ నుండి తిరిగి,  పొందడం ద్వారా పునరుద్ధరించారు

మీరు సంతోషంగా లేరా ??

తాజా మరియు ప్రాణాంతక ఆయుధాలతో బిజెపి మన రక్షణ దళాలను పటిష్ట పరుస్తోంది !!

 మీరు సంతోషంగా లేరా ??

ఎన్‌ఆర్‌సి, సిఎఎ మొదలైన చట్టాలు ద్వారా, అక్రమ ముస్లింలను బిజెపి తరిమివేస్తోంది.

 మీరు సంతోషంగా లేరా ??

మీకు మరియు భారతీయ పాస్‌పోర్ట్‌కు బిజెపి విలువ మరియు గౌరవాన్ని జోడిస్తోంది !!

 మీరు సంతోషంగా లేరా ??

బిజెపి అన్ని రకాల ఉగ్రవాదం, బాంబు పేలుళ్లు, దేవాలయాలపై దాడి చేయడం మానిపించ గలిగింది.

మీరు సంతోషంగా లేరా?

మోడీ భారత్‌లో వచ్చే తరం యుద్ధ విమానాలు, క్షిపణులు, జలాంతర్గాములు, ఫిరంగులు, ట్యాంకులను తయారు చేస్తోంది !! 

మీరు సంతోషంగా లేరా?

చైనా మరియు ప్రపంచంలోని ఏ దేశానికైనా సవాలు చేయగల భారతదేశాన్ని మోడీ నిర్మిస్తున్నారు,

 మీరు సంతోషంగా లేరా ??

సౌరశక్తి, పవన శక్తి, శుభ్రమైన & పునరుత్పాదక శక్తిలో భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చాలని మోడీ కోరుకుంటున్నారు !! 

మీరు అతనితో ఉండరా ??

మోడీ, ప్రతి భారతీయుడికి మరుగుదొడ్లు అందిస్తున్నారు,

ప్రతి యువతకు అవకాశం, సరసమైన మరియు ఎక్కువగా ఉచిత విద్య మరియు మిలియన్ల మంది పేద భారతీయులకు ఉత్తమ వైద్య సదుపాయం, కల్పిస్తున్నారు.

మీరు సంతోషంగా లేరా?

      యునైటెడ్ ఇస్లామిక్ మరియు జిహాదీ దళాల దాడి మరియు భరోసా / ఆసన్న దాడి నుండి మోడీ మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు !!

         మీరు ఇటీవల భారతదేశం అంతటా వీధుల్లో వారి అహంకారం మరియు ఉద్దేశాలను చూశారు !! 

          గుంపులు 100% ముస్లింలు, మరియు వారు పార్లమెంటు చట్టబద్ధంగా రూపొందించిన చట్టాన్ని బహిరంగంగా సవాలు చేశారు !! 

         వారు కేవలం 20% ఉంటే మరియు వారు దీన్ని చేయగలిగితే, 10 సంవత్సరాల తరువాత వారు ఏమి చేస్తారో

 ఊహించుకోండి !!

      ఈ మూకలు  మీ పడక గదులలోకి ప్రవేశించలేదు ఎందుకంటే మోడి మీ ఇంటికి కాపలా కాస్తున్నారు !!

లేకపోతే !! ఏమి జరిగేదో మీకు తెలుసు !!!

       మేల్కొనండి హిందువులారా మేల్కొనండి.

      ముస్లింలకు ఆశ్రయం పొందడానికి 58 దేశాలు ఉన్నాయి !!

      బలవంతంగా భారతదేశం నుండి బయటకు వెళితే మీరు ఎక్కడికి వెళతారు ??

            ఆలోచించండి !!

మీ పిల్లల గురించి ఆలోచించండి.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో  హిందువులకు ఏమి జరిగిందో ఆలోచించండి

కాశ్మీర్

కేరళ

పశ్చిమ బెంగాల్ !!!! లో పరిష్థితులెలా ఉన్నాయో తెలుసుకోండి.

             సమయం అయి పోయింది మోడితో పాటు స్టాండ్ / 

      సపోర్ట్ / 

           కంట్రిబ్యూట్ /

                  వర్క్ / 

                        అసిస్ట్ /

     హెల్ప్ /     ఫైట్ యాక్టివ్లీ

               లేదా

         నమాజ్ నేర్చుకోవడం ప్రారంభించండి. 

             మరియు 

      మీ కుటుంబంలోని మహిళా సభ్యుల కోసం బుర్ఖాలను కుట్టించడం ప్రారంభించండి.

 హెచ్చరించటం లేదు !!

ఇదే  మీ చివరి అవకాశం !!

       ఎంపిక మీదే ... 

      చత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, పృథ్వీరాజ్ చౌహాన్, మొత్తం పది మంది సిక్కు గురువులు, గురు గోవింద్ సింగ్జీ, వీర్ సావర్కర్, సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్  లాంటి.... వారు 

       మీలాంటి పిరికివాళ్ళ కోసం పోరాడుతూ వారి జీవితమంతా వృధా చేశారా ??

   ప్రయత్నించండి మరియు సమాధానం కనుగొనండి! చాలా ఆలస్యం కావడానికి ముందే !!

    మీకు నిర్ణయించడానికి సంవత్సరాలు / నెలలు లేవు !!

         ఇస్లాం ఇప్పటికే మీ తలుపు తట్టింది,

    వినబడుతుందా??

          🙏🏽🙏🏽🙏🏽

వాక్_సామర్ధ్యం

 వాక్_సామర్ధ్యం 


వారధి  నిర్మించి రామచంద్ర  ప్రభువు  వానర  సేనతో  లంకా  నగరం  చేరుకున్నారు.  


యుద్ధ  నీతి  ననుసరించి  శాంతి  కోసం  చివరి  ప్రయత్నంగా  అంగదుడిని  రావణుని  వద్దకి   రాయబారిగా  పంపారు.  


 యుద్ధం  నివారించడానికి  ప్రయత్నించమన్నారు. 


 అంగదుడు  రావణ  సభకి  చేరుకున్నాడు.   


అంగదుని  తండ్రి  వాలి  రావణుని జయించినవాడు.  అతన్ని  ఓడించలేక  అతనితో  స్నేహం  చేసుకున్నాడు  రావణుడు. 


 అంతటి   బలశాలిని  ఒక్క  బాణంతో  సంహరించాడు  రాముడు.  


ఈ  విషయం  రావణుడికి  తెలుసు.   


తన  తండ్రిని  చంపిన  రాముడి  తరఫున  దూతగా  వచ్చిన  అంగదుడిని  మానసికంగా  దెబ్బ  తీయాలనుకొన్నాడు.  


 ‘రావోయ్  అంగదా!  నీ  తండ్రి  వాలి  నాకు  మంచి  మిత్రుడు.  ఆయన  కుశలమేనా?’  అంటూ  పలకరించాడు. 


 అప్పుడు  తన  తండ్రి  రాముడి  చేతిలో  హతమయ్యాడని  అంగదుడు  చెప్పవలసి  వస్తుంది.


  ఆ  తర్వాత  అదే  రాముడి  తరఫున  రాయబారానికి  వచ్చావా? అంటూ  అతనిని  పరిహసించ వచ్చు.  


ఎంతటి  మనో  స్థైర్యం  కలవా డైనా  దీనివల్ల  బలహీన  పడటం  ఖాయం.  అప్పుడు  తను  వచ్చిన  పని  సరిగా  చెయ్యలేడు.   ఇదీ  రావణుని  పన్నాగం.  


కానీ  రావణుని  ప్రశ్నకి  అంగదుడి  సమాధానం  చూడండి....


  ‘రావణా! ఇప్పుడు  నా  హిత  వచనాలు  వినకుంటే  నువ్వే  వెళ్లి  నా  తండ్రి  క్షేమ సమాచారాలు  స్వయంగా తెలుసుకోవచ్చు. ఆ  పరిస్థితి  రాకూడదనే  నీ  మంచి  కోరి  రామునితో  శత్రుత్వం  పెట్టుకొని  చావు  కొని  తెచ్చుకోవద్దని  చెప్పడానికి  వచ్చాను’  అన్నాడు.  


అతని  పన్నాగాన్ని  సమర్ధంగా  తిప్పి  కొట్టడమే  కాకుండా  అదే  సమయంలో   తను  ఏమి  చెప్ప్దదలుచుకోన్నాడో  అది  కూడా  స్పష్టంగా  చెప్పాడు  అంగదుడు. 


అతని  ఈ  జవాబు  విని  మనోస్థైర్యం  కోల్పోవడం  రావణుని  వంతయ్యింది.  


ఈ  రోజు  వ్యక్తిత్వ  వికాసం  కోసం  చెప్పే   పాఠాల్ని  మించిన  పాఠాలు  మన  పురాణాల్లో  వున్నాయి. 


 అవి  తెలుసుకుంటే  మన  విద్యార్ధులతో  పోటీ  పడటం  ప్రపంచంలో  ఎవ్వరి  వల్లా  కాదు.

మహాభారతము ' ...74 .

 మహాభారతము ' ...74  . 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


నలదమయంతుల చరిత్ర విన్న తరువాత, ధర్మరాజు, కొంత వుపశమించాడు.  మనస్సు తేలికపడింది.  తరువాత లోమశమహర్షి కూడా ధర్మజుని కలిసి, అర్జునుని యోగక్షేమాలు, ఇంద్రుని వద్ద అర్ధసింహాసనం అధిష్టించడం, పాశుపతం శివుని అనుగ్రహంతో పొందడం మొదలైనవి అన్నీ చెప్పి వుత్సాహపరిచాడు.  లోమశమహర్షి  ఇంద్రుడు ధర్మజుని, తీర్ధయాత్రలు చేసుకుని, తపస్సు ఆచరించి, దైవబలం పొందమని చెప్పమన్న విషయం,  ధర్మజునికి చెప్పాడు.   


కొందరు బ్రాహ్మణులతో, ద్రౌపదీ, మిగిలిన సోదరులతో, ధౌమ్యుడు, లోమశమహర్షి తో సహా తీర్థయాత్రలకు బయలుదేరాడు ధర్మజుడు. నైమిశారణ్యము, గయా దర్శించి, అగస్త్యాశ్రమం చేరారు వారు.   అగస్త్యుని గొప్పదనం తెలుసుకుంటూ, ' లోమశమహర్షీ !  అగస్త్యుడు వాతాపిని యెందుకు చంపాడు ? అంత అవసరం మునిపుంగవునకు యెందుకు వచ్చింది. దయచేసి వివరించమని ' వినయంగా అడిగాడు ధర్మజుడు.     


లోమశమహర్షి చెబుతున్నాడు :  అగస్త్యమహర్షి గొప్ప తప:సంపన్నుడు.  ఒకనాడు ఆయన అరణ్యమార్గంలో నడుస్తూ వుండగా,  ఆయనకు, మార్గం ప్రక్కన ఒక గొయ్యిలో,తన పితృదేవతలు తలక్రిందులుగా వేలాడుతూ వుండడం కనబడింది.  అగస్త్యుడు యెంతో బాధతో, ' పితృదేవతలారా !  మీరు యీవిధంగా వుండడానికి కారణమేమిటి ?  నామనసు వ్యధ చెందుతున్నది.  చెప్పండి. ' అని అడిగాడు.  


' కుమారా ! అగస్త్యా ! నీవు సంసారజీవితంలో ఒక పుత్రుని కన్న తరువాతనే మాకు విముక్తి. ' అని చెప్పారు.   అగస్త్యుడు ఆలశ్యం చెయ్యకుండా, తనకు తగినవధువు యెక్కడ వున్నదా అని అన్వేషించసాగాడు.   ఎక్కడా లభ్యం కాలేదు.  ఆయన తన మంత్రశక్తితో, ఒక్కొక్క జంతువులోని విశిష్టభాగాన్ని సేకరించి, వాటిని ఒకచోట పొందుపరచి, అందమైన అద్భుతమైన స్త్రీమూర్తిని తయారుచేశాడు.  ఈమెను యెవరి గర్భంలో ప్రవేశపెట్టవలెనా అని అనుకుంటుండగా, విదర్భరాజు, సంతానార్థియై తపస్సు చేస్తుండగా, ఆయన రేతస్సులో యీమె ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, ఆయన భార్యద్వారా, మెరుపుతీగ వంటి కుమార్తె వారికి ప్రసవించేటట్లు యేర్పాటుచేశాడు, అగస్త్యుడు.  ఈ విషయం విదర్భ రాజుకు చెప్పాడు. ఆబిడ్డకు లోపాముద్ర అని నామకరణం చేశాడు, విదర్భరాజు.


లోపాముద్ర అత్యంత తేజోరాశిగా దినదిన ప్రవర్ధమానంగా పెరిగి, నవయౌవనంతో, యువకుల మనసులను కొల్లగొట్టేవిధంగా పెరిగింది.  ఆమెను చేపట్టాలని అనేకమంది వువ్విళ్ళు వూరసాగారు  .  అయితే, అగస్త్యునికి భయపడి, వారి మనసులోమాట విదర్భరాజుకు చెప్పలేకపోయారు.  


అగస్త్యుడు, లోపాముద్ర యవ్వనవతి అయిందని తెలుసుకుని,  ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యమని,విదర్భరాజును అడిగాడు. అయితే, రాజు మనసు అందుకు అంగీకరించలేదు.  ఇట్టి అందాల రాసిని,  కందమూలాలు తిని వికృతమైన గడ్డము, మీసాలతో వుండే ఈయనకు అప్పజెప్పడమేనా అని వ్యాకులపడ్డాడు.  తండ్రి బాధను గ్రహించి, లోపాముద్ర ఆయనను వూరడించి, ' తండ్రీ ! మీరు నన్ను అగస్త్యునకు యిచ్చి వివాహము చెయ్యకున్న ఆయన కోపించి శపిస్తాడు.  నాకు యీ రూపలావణ్యాలు   రావడానికి, ఆయన చేసిన కృషే అని చెప్పారు కదా !  కాబట్టి మీరు సంకోచించకుండా నన్ను ఆయనకు యిచ్చి వివాహం జరిపించండి.  కాకున్నది కాక మానదు. ' అని యెంతో నిబ్బరంగా చెప్పింది లోపాముద్ర. 


అలా విధిలేని పరిస్థితులలో, తన అసంతృప్తి బయటకు కనబడకుండా, లోపాముద్రను అగస్త్యునికి యిచ్చి వివాహం జరిపించాడు, విదర్భరాజు.  వివాహానంతరం, అగస్త్యుడు లోపాముద్రతో, ' మనం వుండేది అరణ్యాలలో కాబట్టి, నీవు యీ నగలూ,  చీనాంబరాలు వదలి, నారబట్టలతో నాతో బయలుదేరిరా ! మన ఆశ్రమమునకు వెల్దాము. ' అని ఆదేశించాడు.  ఆమె అలాగే నారబట్టలతో అగస్త్యుని అనుసరించింది.


హరిద్వారంలో చాలాకాలం వుండి తపస్సు ఆచరించాడు అగస్త్యుడు.  లోపాముద్ర ఆయనకు చేదోడు వాదోడుగా వుంటూ, అనేకవిధాలా సపర్యలు చేసి, ఆయన తపోవిధులకు యే ఆంతరాయం రాకుండా చూసుకున్నది లోపాముద్ర.  ఆమె సేవలకు అగస్త్యుడు యెంతో సంతోషించాడు.


ఇలావుండగా, ఒకనాడు, తేజస్సుతో, అందచందాలతో వెలిగిపోతున్న లోపాముద్రను,  అగస్త్యుడు కన్నార్పకుండా చూశాడు. ' ఇంత అందాలరాశినా నేను యిన్నాళ్ళూ నిర్లక్ష్యం చేసినది.  నేను వివాహమాడిన కారణం మర్చిపోయి, యెంత పొరబాటు చేశాను,'  అని మనసులో అనుకుని, తన కామవాంఛను, లోపాముద్రకు తెలియజేశాడు, అగస్త్యుడు. 


అయితే. లోపాముద్ర,  యెంతో వినయంగా '  సామీ !  మీరు అన్యధా భావించవద్దు.  సంతతిని పొందాలనే వుద్దేశ్యంతో, మీరు నన్ను వివాహం చేసుకున్నారు. మీ కోరిక తీర్చడం నాధర్మం.  కానీ, మిమ్ములను, యీ మునీశ్వరరూపంలో, తెల్లనిగడ్డంతో చూస్తుంటే, నాకు కోరిక కలగడంలేదు. అదియునూ గాక, మీరు వుపయోగించే యీ దుస్తులను, సామాగ్రిని మలినపరచడానికి, నా మనస్సు అంగీకరించడం లేదు.  

నారచీరలు, కాషాయవస్త్రాలు విసర్జించి, మేలిమివస్త్రాలు, ఆభరణాలు ధరించి, మనము ప్రణయం జరుపుకోవాలని, నా మనసు కోరుకుంటున్నది.  నా అభిలాష మీకు సమ్మతమేనని భావిస్తాను. ' అని సున్నితంగా మనసులోని మాట చెప్పింది.


ఆమె మాటలకూ అగస్త్యుడు ఆలోచనలో పడ్డాడు.


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.

తీర్థాల రవి శర్మ 

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844

బొమ్మలు చెప్పిన కమ్మని కథలు

 -----ఈ కథ "సింహాసన ద్వాత్రింశక" లోనిది.------(విక్రమార్క సింహాసనం బొమ్మలు

చెప్పిన కమ్మని కథలు)


పూర్వము వైశాలీ రాజ్యాన్ని నందుడనే రాజు ప్రజానురంజకంగా పరిపాలించేవాడు.

ఆయన భార్య పేరు భానుమతీదేవి. నందుడి ప్రధానమంత్రి శారదానందుడు, ఇంద్రుడికి

బృహస్పతి లాగా  చాలా తెలివిగలవాడు,జ్ఞాని. ఏదో చిన్న పొరపాటు జరిగిందని

నందుడు వెనకా ముందూ ఆలోచించకుండా ఆయనకు దేశబహిష్కార శిక్ష విధించాడు.

ఇలా వుండగా ఒకరోజు  రాజకుమారుడైన జయపాలుడు తన అనుచరులతో అడవికి

వేటకు వెళ్ళాడు.అక్కడ తానొక్కడే గుర్రం మీద  ఒక నల్లజింకను వెంటాడుతూ

వెంటాడుతూ దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. చాలా అలసిపోయాడు.దాహమేసింది.


తన గుర్రాన్ని అక్కడవున్న చెట్టుకు కట్టేసి అక్కడవున్న సరస్సులో  నీళ్లు తాగి

చెట్టుక్రింద కాసేపు కూర్చుందామని వచ్చాడు. అంతలోనే దూరం లో  చిత్రాక అనే పులి

గాండ్రిస్తూ అటువైపు రావడం కనిపించింది. అది గమనించిన గుర్రం తాడు తెంచుకొని

అడవిలోకి పరుగు తీసింది.రాజకుమారుడొకడే నిలబడి పోయాడు. భయంతో వణికి

పోతూ గబ గబ ఆచెట్టునెక్కేశాడు. తీరా ఎక్కాక చూస్తే ఆ పక్కకొమ్మపైన ఒక ఎలుగుబంటి

కూర్చొని వుంది.రాజకుమారుడి పై ప్రాణాలు పైనే పోయాయి. భయంతో వణికి పోయాడు

.

    అప్పుడు ఆ ఎలుగుబంటి రాజకుమారా! భయపడకు, నేను నీకేమీ హాని చెయ్యను, .

నీవు నాకు అతిథివి. రక్షణ కోసం వచ్చావు. అని హామీ యిచ్చింది.. అప్పుడు

రాజకుమారుడు ఆ ఎలుగుకు నమస్కరిస్తూ, భల్లూకరాజా! నీవెంతో పుణ్యమూర్తివి.

ఒక ఆశ్రి తుడిని రక్షించడానికి ఎంత త్యాగం చేస్తున్నావు. అన్నాడు.


ఇంతలో సూర్తాస్తమయమైంది, పులి తిన్నగా చెట్టుక్రిందికి వచ్చి కూర్చుంది. 

అలసిపోయిన రాకుమారుడి నిద్ర ముంచుకొని వస్తూంది.ఆ కొమ్మ పైన నిద్రిస్తే నిద్రలో

తూలి క్రిందపడిపోతానని భయపడిపోయాడు. . అది గమనించిన భల్లూక రాజు

రాకుమారా! భయపడకు, యిలా వచ్చి నా తొడపై పడుకో, నీవు క్రింద పడిపోకుండా

నేను కాపాడుతాను. నన్ను నమ్ము అన్నది. సరేనని రాకుమారుడు దాని తొడపైన

పడుకొని నిద్రపోయాడు.

 

అప్పుడు పులి ఎలుగుతో ఇదిగో మిత్రమా ఆ మనిషిని కిందికి

తోసేయ్.. తినేసి వెళ్లిపోతాను.   ”ఈ మానవులు మనకు శత్రువులు,

అవకాశవాదులు.సాయం చేసిన మనకే  హాని చేస్తారు. 

అనింది   వెంటనే ఎలుగు “ఇతడు నేను వున్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను

ఆశ్రయించినట్టే కనుక నేను అతన్ని రక్షిస్తాను కాని కీడు చేయను”నాకేమైనా అయినా 

పరవాలేదుఅనడంతో పులి నిరాశపడినా వెళ్లిపోకుండా అక్కడే కూర్చుంది. 


అర్ధరాత్రి  రాకుమారుడి మెలకువ వచ్చింది. కూర్చునే వున్న ఎలుగుని చూసి జాలి వేసింది. నీవు

నాతొడమీద తల పెట్టి నిద్రపో నేను మేలుకొని వుండి  నీవు పడిపోకుండా  పట్టుకొనే

వుంటాను. అన్నాడు.ఎలుగు అతన్ని నమ్మి నిద్రపోయింది. రాకుమారుడు క్రింద

వున్నపులిని చూసి భయపడుతున్నాడు.అది కనిపెట్టిన పులి రాకుమారుడితో ఈ ఎలుగు

నమ్మతగింది కాదు. అది నేను వెళ్ళిపోయాక నిన్ను చంపి తిందామని ఆలోచనలోవుంది.

దాన్ని క్రిందికి తోసెయ్యి దాన్ని తిని నేను వెళ్ళిపోతాను. నీవు హాయిగా  నీ నగరానికి

వెళ్లిపోవచ్చు. అని నమ్మబలికింది.


దాని మాటలు నమ్మి రాజకుమారుడు ఎలుగు తనను కాపాడిన సంగతి కూడా

మరిచిపోయి దాన్ని క్రిందకు తోశాడు. ఎలుగు క్రింద పడిపోకుండా ఒక కొమ్మను 

పట్టుకొని మరీ పైకి వచ్చింది. దాన్ని చూసి రాకుమారుడు వణికి పోయాడు. అప్పుడు ఆ

ఎలుగు ఓరీ! దుర్మార్గుడా ! నీవు చేసినమేలు మరిచిపోయి నాకే అపకారం తలపెడతావా?

దీని ఫలిత అనుభవించు నీవు పిశాచానివైపోయి 'ససేమిరా" "ససేమిరా" అంటూ

పిచ్చివాడిలా తిరుగుతుంటావు  అని శాపమిచ్చింది.ఇంతలో తెల్లవారి పోయింది. పులి

తనదారిన తాను వెళ్ళిపోయింది. రాకుమారుడు చెట్టుదిగి 'ససేమిరా' 'ససేమిరా అంటూ

అడవిలో తిరుగుతున్నాడు.


రాకుమారుడు తిరిగి రాకపోయేసరికి  నందుడు కంగారు పడిపోయాడు. వెతకడానికి

భటులను పంపించాడు.భటులు నగరంలో ఒంటరిగావచ్చిన  .రాకుమారుడి గుర్రాన్ని 

చూసి అడవిలో వెతకడానికి బయల్దేరారు. అడవిలో పిచ్చివాడిలా తిరుగుతున్న

రాకుమారుడిని చూసి తీసుకొని వచ్చి  అంతఃపురానికి చేర్చారు.

కానీ అతను 'ససేమిరా' 'ససేమిరా' అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే రాజు

గాబరా పడిపోయాడు. రాజ్యంలోని వైద్యులనందరినీ పిలిపించాడు. వాళ్ళెవ్వరికీ

రాకుమారుడి జబ్బేమిటో అంతుపట్టలేదు.


అప్పుడు రాజుకు తన ప్రధానమంత్రి శారదానందుడు  గుర్తొచ్చాడు.అతనే వుంటే ఈ

గండం గట్టెక్కించేవాడు. అనిపించింది. శారదానందుడిని బహిష్కరించి తప్పు చేశానని

పించింది. నందుడు, నా కొడుకు జబ్బు నయం చేసినవాళ్లకు అర్ధరాజ్యం ఇస్తానని

రాజ్యం లో టముకు వేయమనితన మంత్రులను ఆజ్ఞాపించాడు.


వాళ్ళు రహస్యంగా శారదానందుని  కలుసుకొని విషయమంతా వివరించారు. అప్పుడు

శారదానందుడు   నాకూతురు తెరవెనుక కూర్చొని కొన్ని శ్లోకాలు చదివి   రాకుమారుడి

జబ్బు నయం చేస్తుందని రాజుకు చెప్పండి. నేను చెప్పిన  శ్లోకాలు నాకూతురు

చదువుతుంది. అని చెప్పి పంపించాడు.


నందుడు దానికి ఒప్పుకొని తెర ముందు కొడుకుతోనూ మంత్రులతోనూ  కూర్చున్నాడు.

తెర వెనకనుంచి మొదటి శ్లోకం యిలా వినిపించింది.


సద్భావ ప్రతిపన్నానాం వంచనే కా  విదగ్ధతాః

అంక మారుహ్య సుప్తానాం హంతుం నామ పౌరుషం


భావము:--మంచిమనసుతో సహాయం చేసినవాడిని, తన తొడపైన నిద్రించేవాడిని

చంపటం లో నేర్పరితనం, పౌరుషం ఏముంది?

శారదానందుని  కూతురు   ఈ శ్లోకం చదవగానే రాజకుమారుడు మొదటి అక్షరమైన 'స'

లేకుండా 'సేమిరా' అనడం మొదులు పెట్టాడు.


శ్రద్ధానందుని కూతురు  రెండవ శ్లోకం యిలా చదివింది.


సేతుం గత్వా సముద్రస్య గంగా సాగర సంగమం

బ్రహ్మ హత్యాపి ప్రముచ్యతే మిత్రద్రోహీ న ముచ్యతే


భావము:--సేతుస్నానము,సముద్రస్నానం గంగాసాగరసంగమము లో స్నానం

చేసినవాడికి బ్రహ్మహత్యా పాపం పోతుందేమో కానీ మిత్రద్రోహికి మాత్రం ఆపాపము ఎన్ని

చేసిననూ పోదు.


ఈశ్లోకం చదవగానే రాజకుమారుడు రెండవ అక్షరమైన 'సి' వదిలి 'మిరా' 'మిరా'

అనసాగాడు.


ఆమె  చదివిన మూడవ శ్లోకం :--    మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యశ్చవిశ్వాసఘాతుకః

                                                   త్రయాస్తే నరకం యాంతి యావదాభూత సంప్లవం


భావము:--మిత్రద్రోహి,కృతఘ్నుడు,విశ్వాసఘాతకుడు ఈ ముగ్గురికీ నరకం తప్పదు.

దీనితో రాకుమారుడు 'మి' వదిలేసి 'రా' 'రా' అనసాగాడు.


ఆమె  చెప్పిన నాల్గవ  శ్లోక౦:--    రాజేంద్ర నిజ పుత్రస్య యది  కళ్యాణ మిచ్ఛసి

                                                   దేహిదానం ద్విజతిభ్యో దేవతారాధనం కురు.


రాజా నీ పుత్రుడికి మంచి జరగాలనుకుంటే బ్రాహ్మణులకు దానాలు చేసి దేవతారాధన

చెయ్యి.

నాల్గవ శ్లోకంతో రాకుమారుని  పిశాచత్వ౦  పోయి మామూలుగా అయిపోయి.అడవిలో 

జరిగిన దంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.


 తన  కొడుకు మామూలుగా అయిపోగానే రాజు లేచి తెర తొలగించి అక్కడ

శారదానందనుడిని, ఆయన కూతురిని    చూసి ఆశ్చర్యపోయాడు. దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకొని

క్షమించమని ప్రాధేయపడ్డాడు. కాళ్ళు పట్టుకునేంత పని చేశాడు.


ఈకథలో ని నీతి :- ఉపకారికి అపకారము చేయరాదు. ఏనిర్ణయమైనా తీసుకునే

ముందు

ఎంత మంచి ప్రభువైనా తొందర పడకుండా నిదానించాలి., అపకారికైనా ఉపకారము

చేయవలెను.

----------------------       ----------------------

రుద్రక్షా దీపం

 🙏రుద్రక్షా దీపం🙏


ముందుగా ఒక ప్రమిధలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిధను ఉంచి అందులో నూనె కానీ ఆవునేతిని గాని వేసి రెండు ఒత్తులు పెట్టి , దీపం వెలిగించండి ఇదే రుద్రాక్ష దీపం అంటే, ప్రతి సోమవారం ఇలా పెట్టడం చాలా మంచిది, "ప్రదోషకాలే శివనామ స్మరణ సకలపాపహరణం "  ప్రదోషకాలంలో ఇలా చేయడం విశేషం ఫలితం ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజున ఇలా రుద్రాక్ష దీపం పెట్టడం శివానుగ్రహం పొందగలరు..


ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యంతో గాని, అప్పులతో ఉన్న వారికి, ఏది ముందుకు సాగకుండా పనులు ఆగిపోయిన వారికి గృహంలో ఈ దీపం ప్రతి సోమవారం పెట్టడం వల్ల సమస్య పరిస్కారం అవుతుంది.. కుటుంబం లో పిల్లలు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా, లేదా ఇంట్లో ఎవరైనా అతి కోపం మోడితనంతో ఇబ్బంది పెడుతున్న వారి జన్మ నక్షత్రం రోజున ఇలా రుద్రాక్ష దీపం పెట్టి శివునికి కొబ్బరి నైవేద్యం (కొబ్బరి అన్నం అయితే ఇంకా మేలు) పెట్టి శివ స్త్రోత్రాన్ని చదివి హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు కచ్చితంగా వస్తుంది వారి చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం త్వరగా లభిస్తుంది.. ఇన్ని వారాలు అని లెక్క ఏమీ లేదు ,ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు, ఇది ఖర్చు తో చేసేది కాదు.. అదే ప్రమిద అవే రుద్రాక్ష లు జీవిత కాలం వాడుకోవచ్చు ఆ పిండి దీపం కొండ ఎక్కగా నీటిలో కలిపి చెట్టుకు పోయవచ్చు. 


ఈ రుద్రక్షదీపం పరమ శ్రేష్టం అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ ఇష్టమైన దీపం.. భక్తిగా వెలిగించి శివానుగ్రహం పొందండి.


🌷హర హర మహాదేవ🌷

వ్యాధుల పేర్లు

 ఆయుర్వేదం నందు వ్యాధుల పేర్లు - వాటి లక్షణాలు .


 * అండవాతము - అండవృద్ధి  - Hydrocele . 


      వృషణములలో రెండుగాని ఒకటికాని వాపు కలిగి ఉండుట పోటు కలిగియుండుట . వాత ప్రకోపం చేత పొత్తికడుపులో చెడునీరు పుట్టి అది క్రమముగా వృషణాలలోకి దిగి పెరిగెడి రోగం . 


 *  అంతర్వ్రుద్ధి  - Hernia .


      వాతమును ప్రకోపింపచేయు పదార్దాలు అధికంగా భుజించుట వలన , మలమూత్ర వేగమును నిరోధించుట వలన , అతి బరువు మోయుట వలన వాతం ఎక్కువ అయ్యి సన్నపేగులో ఒక భాగం సంకోచింపచేసి తన స్థానం నుండి క్రిందికి వెడలి గజ్జ యందు చేరి గ్రంథిగా రూపం పొంది వాపును కలిగించు రోగం 


 *  అగ్నిమాంద్యం - 


        జఠరాగ్ని మందం అయ్యి ఆకలి లేకుండా ఉండుట . 


 *  అతిమూత్రము  - 


         శరీరంలో మేహం అధికం అయ్యి మూత్రం విస్తారంగా పొయ్యే రోగం . 


 *  అతిసారం  - 


        అమితముగా , వికృతముగా విరేచనములు అయ్యే రోగం . 


 * అనాహం  - 


         మూత్రం బంధించబడి కడుపు ఉబ్బే రోగము .


 *  అపస్మారం  -  Hysteria .


        స్మృతి లేక నోటి వెంట నురుగు పడటం మొదలగు చిహ్నాలు గల రోగం . మరియు స్త్రీలకు వచ్చెడి కాకిసోమాల అనే మూర్ఛరోగం .


 *  అభిఘాత జ్వరం  - 


       కర్రలు , రాళ్లు మొదలగు వాటితో దెబ్బలు తగులుట చేత , మన శరీర సామర్ధ్యం కంటే అధికంగా పనిచేయుట వలన , అతిగా దూరం నడుచుట వలన వచ్చెడి జ్వరం .


 *  అశ్మరీ రోగం  - Blader Stones .


       మూత్రకోశము నందు రాళ్లు పుట్టుట వలన మూత్రము వెడలుట కష్టం అగు రోగము 


 *  అస్థిగత జ్వరం  - 


        శరీరం నందు ఎల్లప్పుడూ ఉంటూ దేహమును క్షీణింపజేయు జ్వరం.


 *  అస్రుగ్ధము  -  Leucorrhoea .


       కుసుమరోగము అని కూడా అంటారు . యోని వెంట తెల్లగానైనా , ఎర్రగానైనా , పచ్చగానైనా , నల్లగానైనా జిగటగా నీరు స్రవించెడి రోగము .


 *  ఆమము  - 


        భుజించెడి పదార్దాలు జీర్ణముగాని కారణంబున గర్భమున జిగురు కలిగి తెల్లగా , బిళ్లలుగా ఘనీభవించెడి దుష్ట జలము.


 *  ఆమాతిసారము - Dysentery . 


       ఆమమే విరేచనమయ్యే రోగము . దీనినే జిగట విరేచనాలు అని , ఆమ విరేచనాలు అని అంటారు.


 *  ఆర్శరోగము  - PILES . 


       మూలవ్యాధి అని అంటారు. గుద స్థానం న లోపల కాని , వెలుపల గాని మాంసపు మొలకలు జనియించి రక్తము స్రవించుచు గాని స్రవించక గాని నొప్పిని కలిగించు రోగము .


  *  ఆహిక జ్వరం  -  Intermittent fever .


        దినము విడిచి దినము లేక మూడు దినములకు ఒకసారి కాని అప్పుడప్పుడు కనిపించే జ్వరం .


  *  ఉదర రోగము - Ascites . 


        శరీరం కృశించుట , తెల్లబారుట , కడుపులో దుష్టపు నీరు చేరి ఉదరము పెరుగుట మొదలగు చిహ్నములు గల రోగము 


  *  ఊపిరిగొట్టు నొప్పి - 


         గాలి విడిచినప్పుడు గుండెలలో ఒకపక్క పోటు పొడిచినట్టు లేచేడి నొప్పి .


 *  ఎరుగు వాతము  - 


         కాళ్ళు , చేతులు మొదలగు అవయవములు గాని  దేహము అంతయు గాని ఎగురుచుండెడి ఒక విధమైన వాత రోగము .


 *  కరపాణి కురుపులు  - 


        బిడ్డల యెక్క కాళ్ళమీద , చేతుల మీద దట్టముగా అయ్యేడి కురుపులు . 


 *  కామిల రోగము - కామెర్లు - Jaundice . 


      కండ్లు , శరీరం , ఆకుపచ్చ లేక పసుపుపచ్చ వర్ణము కలిగి ఆకలి లేకుండా ఉండుట , దాహము , నీరసము మొదలగు లక్షణాలు కలిగి ఉండే రోగము . 


 *  కార్శ రోగము -  Emaciation 


       దేహము నందు ఉండేడి రక్తమాంసములు క్రమక్రమముగా క్షీణించుచూ వుండేడి ఒక రోగము దీనిని ఎండురోగం అని అంటారు.


 *  క్రిమి రోగము  -  Intestinal woms .


        గర్భమున క్రిములు జనించెడి రోగము .


 *  గండమాల  -  Goitre or Scrofuja .


        మెడ , మెడ వెనక నరము , మెడ పక్కలనుండి గ్రంధులుగా మొదలు అయ్యి క్రమముగా పక్వము అయ్యి చీము , రసి స్రవించెడి వ్రణములు అనగా గడ్డలు .


 *  గళ గ్రహము  - 


         స్వరహీనంబై ఆహారాది పదార్ధాలను సులభముగా కంఠం దిగనివ్వకుండా ఉండేడి ఒక శ్లేష్మ రోగము .


 *  గాయపు సంధి - Tetanus .


        కాలి బ్రొటనవేలుకు గాని , చేతి బ్రొటనవేలుకు గాని గాయము తగిలినప్పుడు ,శస్త్ర చికిత్సల యందు దుష్ట క్రిమి ప్రవేశించుట చేత మెడ కొంకులు కుంచించుకు పోయే రోగము .


 *  గాలి బిళ్లలు - Mumps . 


         చెవులకు క్రిందుగా వాపు , పోటుతో లేచేడి బిళ్లలు .


 *  గురదాలు -  Kidneys .


        వీటిని ఉలవకాయలు అందురు. ఇవి నడుముకి సమముగా లొపల వెన్నునంటి ఉండేడు మాంస గ్రంధులు. వీనివలన మూత్రము జనించును.


 *  గుల్మము - internel Tumors .


        వాత , పిత్త , శ్లేష్మముల దుష్ట స్థితి వలన గర్భము న జనించెడి ద్రవకూటమి .


 *  గ్రహణి  - Dysentry .


        కడుపునొప్పి , ఆసనము తీపు కలిగి చీము లేక చీము రక్తము మిశ్రమమై విరేచనములు అయ్యేడి ఒకరకం అయిన అతిసార రోగము .


  *  చర్ది రోగము - trendency to vomit .


       వమన రోగము అని అంటారు. వాంతులు ఎక్కువుగా అవుతాయి .


 *  చర్మ రోగము  - 


       గజ్జి , చిడుము , పొక్కులు , తామర మొదలగు రోగములు .


 *  చిట్ల ఫిరంగి  - a severe kind of syphilis .


        దేహమున నల్లగా స్ఫోటకపు పొక్కుల వలే బయలుదేరేడి సవాయి రోగము .


 *  జలోదరము -  Abdomanal dropsy or Ascitis .


        గర్భమున అమితముగా విషపు నీరు పెరిగి పొట్ట నిండు కుండలా ఉండేడి రోగము .


 *  జిహ్వదోషము  - Tongue diesease .


       నాలుక ద్రవహీనం అయ్యి ముండ్ల వలే గరుకు కలిగి యే వస్తువు రుచింపకుండా ఉండుట .


 *  త్రయాహికా జ్వరం - Tertain fever .


       మూడు దినములకు ఒకసారి వచ్చెడి చలి జ్వరం .


 *  నాడి వ్రణము  - Guinea worm .


        నారీ కురుపులు అనికూడా అంటారు.వీని నుండి తెల్లని దారము వలే నారి బయటకి వెళ్ళును.


 *  పరిణామ శూల  -  


        ఆహారం జీర్ణం అయ్యే సమయంలో జనించెడి నొప్పి . 


 *  పలల మేహము  - 


         చిన్న చిన్న మాంసపు ముక్కలు మూత్రం వెంట పడే రోగము .


 *  పక్షవాతము  - Paralysis .


       శరీరం యొక్క బాగం అనగా ఒకవైపు చెయ్యి , కాలు వీనికి వ్యాపించిన నరములకు సత్తువ లేకుండా చేయు రోగము .


 *  పాండురోగము  -  Anemia .


       దేహము న రక్తము క్షయించి తెల్లబారి ముఖము , కనురెప్పలు , పాదములు , గుహ్యస్థలము నందు వాపు కలిగి ఉండేడి రోగము . 


 *  పీఠికా మేహము  - one type of syphilis .


       దేహము అంతా మట్టిపొక్కులుగా లేచేడి మేహరోగము .


 *  పీనస  -  Ozoena .


       ముక్కువెంట దుర్గంధముతో చీము , రక్తము వెడలె ఒక రోగము .


 *  ప్లీహారోగము  - Enlargement of Spleen .


       కడుపులో బల్ల పెరిగి కలిగెడు రోగము.


 *  పుట్ట వ్రణము  -  Cancer .


        సెలలు వేసే మానని మొండి వ్రణము . 


 *  పురాణ జ్వరం  - Chronic Fever . 


         చాలాకాలం నుంచి ఉండేడి జ్వరం .


 * బాలపాప చిన్నెలు  - Convulsion of Children . 


         శిశువులకు 12 సంవత్సరాల లోపున అకస్మాత్తుగా మూర్చవలె కనిపించే రోగము .


 * భగందరము  - Fistula .


        వృషణాలు కు దిగువున , గుదస్థానముకి పైన చిన్న కురుపువలె లేచి అది పగిలి అందులో నుంచి రసి , చీము కారెడి రోగము .


 *  మూత్రశ్మరీ  - 


          మూత్రపు సంచిలో రాళ్లు పుట్టెడు రోగం .


 *  మూత్రఘాతం  - 


          మూత్రం బంధించుట . మలమూత్ర , శుక్లములు పొత్తికడుపులో చేరి వికృతిని పొంది ముత్ర నిరోధము కలిగి అందువలన మూత్రం అతికష్టముగా బయటకు వెడలు మేహ రోగము .


 *  మూత్రకృచ్చం  - 


          మూత్రము బొట్టుబొట్టుగా నొప్పితో వచ్చు రోగము . ఈ రొగికి శుక్లము మూత్రముతో బయటకి వచ్చును. 


 *  మేఘరంజి  - 


          నీటితో కూడిన మేఘము ఆకాశమున కప్పి ఉన్నప్పుడు శ్వాస పీల్చడం కష్టముతో కూడుకుని ఉండు ఒకరకమైన ఉబ్బస రోగము . 


 *  క్షయ రోగము  - 


          ఈ రోగమును ముఖ్యముగా కాస , శ్వాస , కఫము , జ్వరం , దేహము శుష్కించుట , నీరసం , ఏది తిన్నా రుచి లేకుండా ఉండటం , ఆకలి లేకపోవడం ఈ రోగ లక్షణాలు .


 *  రక్తపైత్యం  - 


          ముక్కువెంట గాని , నోటివెంట గాని అకస్మాత్తుగా రక్తం ప్రవహించెడి రోగము . 


 *  రక్తవాతం  - 


          దీనిని వాత రక్తం అని అంటారు. రక్తం సహజముగా ప్రవహించక దేహమున ఏ భాగం నందు అయినా కూడి వాపు , ఎరుపు , పోటు కలిగి ఉండటం మొదలగు బాధలు కలిగి ఉండు ఒక రోగము . 


 *  రుద్రవాతము  - 


         హఠాత్తుగా మూర్చరోగము వలే స్మారకం లేక పడిపోవడం . నోటివెంట నురుగులు వెడలుట , అంగవైకల్యం కలుగుట ఇలాంటి లక్షణాలు కలిగిన రోగము 


 *  లూతము  - 


          కంటి కోన వద్ద పుట్టెడు రోగము .


 *  వలీఫలితము  - 


          బాల్యము నందే శరీరం ముడతలు పడుట , వెంట్రుకలు నెరియు వ్యాధి . 


 *  విద్రది  - 


         గర్భము నందు పుట్టి నాభిలోకి వెడలు వ్రణము .


 *  విషజ్వరము  - 


        ఒకప్పుడు ఉష్ణం అధికంగా ఉండి మరియొకప్పుడు ఉష్ణము లేకుండా ఒక సమయం లేకుండా వచ్చు జ్వరం.


 *  విసర్పి  - Herpes .


       ఎర్రగా కాని తెల్లగా కాని పొక్కులు ఒకచోట గుంపుగా లేచి వ్యథతో గూడిన చర్మరోగము . దీనినే సర్పి అందురు. 


 *  శిల్ప కుష్ఠు  - 


       రాళ్లు వలే గరుకుగా గ్రంధులు లేచేడు కుష్ఠు రోగము . 


 *  శూల - Sposmodic colic . 


        కడుపులోగాని , పక్కలోగాని హటాత్తుగా వచ్చే కఠినమైన నొప్పి.


 *  శ్వేత కుష్ఠు  -  Leucoderma . 


       తెల్లని మచ్చలు బయలుదేరి వ్యాపించెడి కుష్ఠు రోగము . 


  *  స్వరభంగ రోగము  - 


        స్వరము క్షీణించి పోయెడి రోగము లేక గొంతు బొంగురుగా మారి స్వరం పలకని రోగము . 


 స్థావర విషములు  - 


        పాషాణము , మణిశిల , మైలతుత్తము , గంధకము మొదలగు ఖనిజములు , నాభి , పొత్తిదుంప , గన్నేరు పప్పు , వేరు మొదలగు మూలికలను స్థావర విషములు అంటారు.


  జంగమ విషములు  - 


        పాము , తేలు , నక్క , కుక్క మొదలగు జంతువుల కోరల్లో ఉండు విషమును జంగమ విషము అంటారు.


                           సమాప్తం 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -

 ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం  -


       జలము ఆయువుగా కలవి కావున జలాయుకములు అనియు , జలము నివాసస్థానం కలవి కావున జలౌకలని మరియు జలగలు అని పిలవబడుతున్నవి.  ఇవి 12 విధములు గా ఆయుర్వేదం విభజించింది. ఇందు విషము కలిగినవి నల్లటి రంగులోని బేధము వలన 6 విధములు .  అందు కృష్ణ అనునది కాటుక రంగు పెద్ద శిరస్సు గలది. కర్బూర  అనునది బొమ్మిడ అను చేప వంటి ఆకృతి కలిగి ఒకచోట చిన్నగా , మరొకచోట పెద్దగా ఉండు పొట్ట కలిగి ఉండును. కలగర్ద అనునది ముడుతలతో కూడి ఉండి పెద్ద పార్శ్వములతో కలిగిన ముఖం 

ఉండును. ఇంద్రాయుధ అనునది ఇంద్రధనస్సులోని నానారంగులు గల నీలపు చారలతో కూడుకుని ఉండును. సాముద్రిక అనునది కొద్దిగా నలుపు , పసుపు రంగులతో ఉండి అనేక ఆకృతులుగల తెల్లని మచ్చలతో కూడుకుని ఉండును. గోచందనం అనునది ఆంబోతు బుడ్డ వలే పొట్ట యందు ఒక గీత కలిగి సన్నని ముఖం కలిగి ఉండును.


           పైనచెప్పిన 6 రకాల జలగలు విషము కలిగి ఉంటాయి. ఇవి కరిచినచో కాటునందు వాపు , మిక్కిలి దురద, మూర్చ, జ్వరం, తాపము , వాంతి  కలుగును. 


        ఇప్పుడు మీకు విషము లేని జలగలు గురించి వివరిస్తాను. విషములేని జలగలు మొత్తం 6 రకాలు .  అందులో కపిల అనునది ప్రక్కల యందు మనశ్శిలతో రంగు వేసినట్లు ఉండి వీపున నిగనిగలాడుచూ పెసలవలే ఆకుపచ్చ రంగు కలిగి ఉండును.  పింగళి అనునది కొంచం ఎరుపు రంగు గుండ్రని శరీరం పచ్చని రంగు ఉండి వేగముగా కదులును. శంఖముఖి అనునది యకృత్ వలే ఎరుపు నలుపు రంగులు కలిగి శీఘ్రముగా రక్తమును తాగే స్వభావం పొడవైన వాడి అయిన ముఖం కలిగి ఉంటుంది. మూషిక అనునది ఎలుక వంటి ఆకారం , రంగు , దుర్వాసన కలిగి ఉంటుంది. పుండరీకం అనునది పెసల వలే పచ్చని రంగు , పద్మముల వలే విశాలమైన ముఖం కలిగి ఉండును.  సావరిక అనునది నిగనిగలాడుచూ తామరాకు వంటి రంగు కలిగి 18 అంగుళముల పొడవు కలిగి ఉండును. ఇది ఏనుగులు, గుఱ్ఱములకు చికిత్స చేయుటలో మాత్రమే వాడవలెను .మనుష్యులకు పనికిరాదు. వీటిని నిర్విష జలగలు అందురు.


             ఈ విషము లేనటువంటి జలగలు లభించు ప్రదేశాలు ముఖ్యంగా ఢిల్లీకి పశ్చిమ దిశలోను , సహ్యాద్రి పర్వతాలు అనగా నర్మదా నది ప్రవహించు పర్వత ప్రాంతాలలోను, మధురా ప్రాంతంలోనూ ఈ విషము లేనటువంటి జలగలు ఉండును. ఈ ప్రదేశాలలో లభించు జలగలు పెద్ద శరీరం కలిగి మంచి బలముతో ఉండి శీఘ్రముగా రక్తమును పీల్చెడి స్వభావం ఎక్కువుగా ఉండి విషము లేకుండా ఉండును.


         విషముతో కూడిన చేపలు , పురుగులు , కప్పలు , మూత్రపురీషములు క్రుళ్ళుట చేత పుట్టిన జలగలు మరియు కలుషిత జలము నందు పుట్టిన జలగలు, నీటిలోని పద్మములు కుళ్లుటచేత పుట్టిన జలగలు విషపూరితంగా ఉండును.  శుద్ధజలము నందు పుట్టిన జలగలు విషం లేకుండా ఉండును.


            ఇప్పుడు జలగలను పట్టే విధానం వాటిని పోషించే విధానం మీకు తెలియచేస్తాను .


     రక్తముతో కూడిన తోలు , జంతుమాంసం , వెన్న , నెయ్యి, పాలు మొదలగు వాటితో  కూడిన అన్నమును జలగలు ఉన్న ప్రదేశంలో వేసినచో అవి పైకి వచ్చును. అప్పుడు వాటిని పట్టుకొని మంచి కుండలో చెరువునీటిని , బురదని పోసి అందులో ఉంచవలెను. వాటికి తిండి కొరకు నాచు, ఎండిన మాంసము , నీటిలో పుట్టే దుంపల చూర్ణం ఇవ్వవలెను. అవి నిద్రించుటకు గడ్డి, నీటి యందు పుట్టే పచ్చి ఆకులను ఆ కుండ నందు వేయవలెను .  రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కుండ యందలి నీటిని తీసివేసి కొత్తనీటిని పోసి ఆహారం కూడా కొత్తదానిని వేయవలెను . ప్రతి ఏడు రోజులకు ఒకసారి కుండను మార్చవలెను . ఈ జలగలను శరత్కాలం పట్టుకొనుట మంచిది .


      జలగలను వైద్యంలో ఎలా ఉపయోగించాలో మీకు వివరిస్తాను.


            జలగలచే పోగొట్ట తగిన రోగము కలిగిన వానిని కూర్చుండబెట్టి కాని , పడుకోపెట్టి కాని జలగ పట్టించవలసిన ప్రదేశములో వ్రణము లేనిచో ఆ ప్రదేశంలో ఎండించిన ఆవుపేడ చూర్ణం , మన్ను కలిపి మర్దన చేయవలెను . ఆ తరువాత జలగలను తీసుకుని ఆవాలు , పసుపు కలిపి నూరి కలిపిన నీటిలో ముంచి వేరొక మంచినీటి పాత్రలో ముంచి వాటిని రోగమున్న ప్రదేశములో పట్టించవలెను. ఆ తరువాత ఆ జలగకు మంచి కాటన్ గుడ్డ ముక్కతో  ముఖము విడిచి శరీరం అంతయు కప్పవలెను. అప్పుడు ఆ జలగ రోగ స్థానమును పట్టును . అలా పట్టనిచో ఆ రోగస్థానం పైన పాలచుక్క గాని  రక్తపుచుక్క గాని వేయుట లేక కత్తితో గీయుట చేసినచో జలగ వెంటనే రోగస్థానమును పట్టును . అప్పుడు కూడా జలగ పట్టనిచో దానిని వదిలి వేరొక జలగ పట్టించవలెను .


                   జలగ ఎప్పుడూ తన ముఖమును గుర్రపుడెక్క వలే విస్తరించి స్కంధమును పైకెత్తి రోగస్థానమును తగులుకొనునో అప్పుడు అది రక్తమును పీల్చుతుంది అని అర్ధంచేసుకొనవలెను వెంటనే దానిని తడిగుడ్డతో కప్పి మధ్యమధ్యలో  తడుపుచుండవలెను . అలా చేస్తున్నచో రక్తం బాగుగా పీల్చును. ఆ పీల్చుటలో ముందుగా దుష్టరక్తమునే పీల్చును .


            జలగ రక్తం పీల్చుతూ ఉన్నప్పుడు కొంత సమయం తరువాత పోటు , దురద మొదలగుచున్న అప్పటివరకు అది దుష్టరక్తం పీల్చి ఆ తరువాత మంచిరక్తం పీల్చడం మొదలు అయినది అని అర్థం . ఆ తరువాత వెంటనే జలగను తీసివేయవలెను . రక్తం యొక్క రుచి మరిగి ఆ జలగ రానిచో దాని ముఖము పైన సైన్ధవ లవణము వేసినచో విడిచివేయును .


        చెడు రక్తం పీల్చిన జలగను శుద్దిచేయు విధానం గురించి మీకు తెలియచేస్తాను.


      పైన చెప్పినట్టు రోగస్థానమును విడిచిన జలగకు శరీరం పైన బియ్యపు పిండిని పూసి ముఖం నందు నూనె, ఉప్పు కలిపి రాసి ఎడమచేతితో తోకను పట్టుకొని కుడిచేతితో ముఖము వరకు ఆవుపాలు పితికినట్లు చేయవలెను . ఈ విధంగా చేస్తూ తాగిన రక్తమును బయటకి కక్కునట్టు చేయవలెను . ఆ తరువాత ఆ జలగను శుభ్రపరచి మంచినీటితో కూడిన పాత్ర యందు ఉంచవలెను. అప్పుడు అది ఉత్సాహముగా సంచరించును. అలా సంచరించకుండా కదలక మొద్దుగా ఉన్నచో చెడురక్తం దాని శరీరం నుంచి పూర్తిగా బయటకి పోలేదు అని గ్రహించి మరలా కక్కించు ప్రయత్నం చేయవలెను . కక్కించాక మరలా కుండ నందు భద్రపరచవలెను.


       జలగతో రోగనివారణ క్రియ చేశాక చేయవలసిన విధి గురించి వివరిస్తాను.


          జలగ ద్వారా చెడు రక్తం తీసాక ఆ గాయమునకు ఔషదాలు కలిపిన ఆవునెయ్యి పూయవలేను . కొందరికి తేనె కూడా పూయవచ్చు.


      పైన చెప్పిన జలగతో చెడు రక్తాన్ని తీయు విధానాన్ని రక్తమోక్షణం అంటారు. ఈ క్రియను రోగి యెక్క బలం, రోగం యొక్క బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే అంచనా వేసుకొని చేయవలెను .


      ********** సంపూర్ణం ************


  

     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అజీర్ణం

 శరీరంలో అజీర్ణం హరించి ఆకలి ఎక్కువ చేయు మూలికా యోగాలు  - 


 *  ప్రతినిత్యం నీరుల్లిపాయలు తినుచుండిన మందాగ్ని హరించి ఆకలి బాగుగా అగును. 


 *  శొంఠి , ఉప్పు రెండూ సమభాగాలుగా కలిపి చేసిన చూర్ణమును ప్రతిపూట భోజనమునకు ముందు 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు పుచ్చుకొనుచుండిన నాలుక , గొంతుక శుభ్రపడి అన్నము బాగా జీర్ణం అయ్యి ఆకలి బాగా పుట్టును . 


 *  అల్లంరసం , తేనె రెండు సమభాగాలుగా కలిపి పూటకు 10 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు రోజూ మూడుపూటలా ఆహారానికి ముందుగా పుచ్చుకొనుచుండిన జలుబు , దగ్గు , అరుగుదల తక్కువుగా ఉండటం హరించి మంచి ఆకలి పుట్టును . 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

దగ్గు, జలుబు పడిశం, జ్వరం కు ఆయుర్వేద మందులు

 దగ్గు, జలుబు పడిశం, జ్వరం కు ఆయుర్వేద మందులు. 

ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో చాలామందికి సాధారణంగా దగ్గు, జలుబు పడిశం, జ్వరం వస్తూవుండటం సహజం. మనం డాక్టరు దగ్గరకు వెళితే ఒక పారసెటామోల్ టాబులెటు, ఒక అంటి బైటికి క్యాప్సూలు, ఒక కాఫ్ సీరపు వ్రాసి పంపిస్తాడు. నిజానికి ఈ మందులు మనకు రోగాన్ని తగ్గించటం అటుంచి వాటి వల్ల వచ్చే సైడు ఎఫెక్టులు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు అల్లోపతి మందులు సాంప్రదాయ మందులు ఆయుర్వేద, హోమియో , యునాని మందులు సాంప్రదాయేతర మందులుగా అయ్యాయి. నేను అందరికి చెప్పదల్చుకునేది ఏమనగా మనం సాధ్యమైనంత వరకు అల్లోపతి మందులకు దూరంగా ఉంటే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు. నా మాట మీకు కొంత కఠినంగా ఉండవచ్చు కానీ ఇది యదార్ధం. పారాసెటామోల్ మాత్రలు ఎక్కువగా తీసుకుంటే అవి జీర్ణాశయం మీద తదుపరి కిడ్నీల మీద ప్రభావం చూపి వాటి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇక అంటి బయటికులు ఇవి మన శరీరంలో వుండే బి కాంప్లెక్ విటిమినును పూర్తిగా మింగి కాళ్ళ తీపులుతో మొదలై తరువాత, జీర్ణాశయం మీద మరియు కిడ్నీల మీద దుషు ప్రభావం చూపుతాయి. మనిషి శరీరాన్ని బలహీన పరుస్తాయి. ఎక్కువగా వాడితే శరీరంలో రోగ నిరోధకత తగ్గుతుంది. ఇక దగ్గు తగ్గ్గటానికి ఇచ్చే కాఫ్ సీరపు. ప్రతి దానిలో కూడా వుండే రసాయనిక పదార్ధాలు శరీరాన్ని బలహీన పరచటమే కాకుండా నిద్ర మత్తుని కలిగిస్తాయి. అందుకే డాక్టర్లు కప్ సిరప్ త్రాగిన తరువాత డ్రైవింగ్ చేయవద్దని అంటారు. ఇవ్వని తెలుసుకుంటే మనకు అల్లోపతి మందులు సురక్షితం కాదని తెలుస్తుంది. 

ఇక ఆయుర్వేద మందుల విషయానికి వద్దాము. ముందుగా దగ్గు. దగ్గులో రెండు రకాలు వున్నాయి ఒకటి పొడి దగ్గు. ఈ దగ్గుకి సీతాఫలాది చూర్ణము చక్కటి మందు. ఈ మందు పొడి రూపంలో ఉంటుంది. ఈ పొడిని తేనెలో రంగరించుకొని తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. 

ఇక రెండో రకం దగ్గు శ్లేష్మంతో కూడుకొన్నది. ఈ దగ్గులో కంఠంలో శ్లేష్మం వుంది ముక్కు పూసుకొని జలుబుతో ఉంటుంది. దీనికి చక్కటి మందు (Talisadi Churna) తలిసాది చూర్ణం. ఈ మందు కూడా పొడి రూపంలో లభిస్తుంది. దీనిని కూడా తేనెలో రంగరించి సేవించిన శ్లేష్మంతో కూడిన దగ్గు, జ్వరంలో చక్కటి గుణం కనిపిస్తుంది. 

ఈ రెండు మందులు కూడా అనేక కంపెనీలు తయారు చేస్తున్నాయి. పతంజలి, డాబర్, జాన్దు, బైద్యనాడు, మీరు ఏ కంపెనీ మందునైన కొనవచ్చును. పతంజలి మందులు కొంచం తక్కువ ధరకు లభిస్తాయి. 

ఇక పతంజలి వారి శ్వాసారి రస్ అనే మందు ద్రవ రూపంలోనూ, పొడి రూపంలోనూ లభిస్తుంది. ఇది ఒక మంచి కాఫ్ శిరుపులాగా పనిచేసి పడిశాన్ని తొందరగా వదిలిస్తుంది. 

పైన పేర్కొన్న మందులు ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవటం మంచిదని నా అభిప్రాయం. తక్కువ ఖర్చుతో మీరు దగ్గు, జలుబు, సాధారణ జ్వరాన్ని సత్వరంగా నివారించుకోవచ్చు. మరొక ఆయుర్వేద మందుతో మళ్ళి కలుద్దాము. 

మీ భార్గవ శర్మ. 

ఓం తత్సత్ 

సర్వే జానా సుఖినోభవందు. 

శ్రీకాళహస్తీశ్వరమ్

 శ్రీకాళహస్తీశ్వరమ్


కలుగవే ఫలములు కందమూలంబులు 

            విరివిగా సలిలంబు విపిన మందు 

నుండవే బిలములు నుండంగ వసతిగా 

           యేరులు పాఱవే నీరు తోడ 

చిరు పల్లవంబులు చిగురు టాకులు పెక్కు 

           వనమందు నుండవే మనము పొంగ 

యనయంబు మనమందు యాశీనువై నీవు              

          వైరాగ్య మిచ్చేవు వరము గాను

నిరత రక్షణ మోక్షంబు నీయ నీవు 

మోహ మందున మునిగియు మూఢ జనులు 

యేల పోవలె సేవించ యేలికలను ? 

రమ్య శ్రీకాళహస్తీశ్వరా ! నమోస్తు 46


✍️ గోపాలని మధుసూదన రావు 🙏

శ్రీ భూ వరాహ స్తోత్రం..

 శ్రీ భూ వరాహ స్తోత్రం.. ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు.సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి.


శ్రీ భూ వరాహ స్తోత్రం

ఋషయ ఊచు |

జితం జితం తేఽజిత యజ్ఞభావనా

త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |

యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః

తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||


రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం

దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |

ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-

స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||


స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-

రిడోదరే చమసాః కర్ణరంధ్రే |

ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే

యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||


దీక్షానుజన్మోపసదః శిరోధరం

త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |

జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః

సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||


సోమస్తు రేతః సవనాన్యవస్థితిః

సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |

సత్రాణి సర్వాణి శరీరసంధి-

స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||


నమో నమస్తేఽఖిలయంత్రదేవతా

ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |

వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత

జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||


దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా

విరాజతే భూధర భూస్సభూధరా |

యథా వనాన్నిస్సరతో దతా ధృతా

మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ ||


త్రయీమయం రూపమిదం చ సౌకరం

భూమండలే నాథ తదా ధృతేన తే |

చకాస్తి శృంగోఢఘనేన భూయసా

కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||


సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం

లోకాయ పత్నీమసి మాతరం పితా |

విధేమ చాస్యై నమసా సహ త్వయా

యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||


కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో

రసాం గతాయా భువ ఉద్విబర్హణం |

న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే

యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ || ౧౦ ||


విధున్వతా వేదమయం నిజం వపు-

ర్జనస్తపః సత్యనివాసినో వయం |

సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-

ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||


స వై బత భ్రష్టమతిస్తవైష తే

యః కర్మణాం పారమపారకర్మణః |

యద్యోగమాయా గుణ యోగ మోహితం

విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం.

🌺🙏🙏🙏🙏🙏🌺

ఓం శ్రీం కమల వాసిన్యై నమః*

 *ఓం శ్రీం కమల వాసిన్యై నమః*


మహాలక్ష్మీ అనుగ్రహానికి, సర్వ సంపదల సిద్ధికి.. 


*పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి*

*విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మమయి సన్నిధత్స్వ.*


 *పద్మం* వికాసానికి సంకేతం. *సూర్యుడు* ఆకాశంలో ఉదయించగానే పద్మం వికసిస్తుంది. 


అదే విధంగా సృష్టి చైతన్యమైన *కమలవాసిని* ప్రభావం వల్ల సంపదలు, ఆనందం, సంతృప్తి అనే కమలాలు వికసిస్తాయి. 


అందుకే, *వికాసానికి ప్రతీకగా అమ్మవారి ఆసనంగానూ, ఆమె చేతిలో అలంకారాలుగానూ, ఆమె గృహంగానూ, తన కన్నుల రూపంగానూ పద్మాలను సూచిస్తుండటం పురాణ* సంప్రదాయం.


 మన *సంపదలన్నీ వికాసానికి* సంకేతాలు. *కనిపించే సంపదరూపం ధనం.  కనిపించని సంపదలెన్నో* మన చుట్టూ చాలా ఉన్నాయి. 


 *ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం* అన్నీ సంపదలే. *నిరంతరం సంతృప్తిగా ఉండటం గొప్ప సంపద. ధైర్యం వంటి గుణాలన్నీ సంపదలే* . 


ఇటువంటి *సంపదలన్నీ మనకు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందించాలంటే ఈ సంపదలకు కారకమైన మూలశక్తి మహాలక్ష్మీదేవి* అనుగ్రహాన్ని పొందాల్సిందే. 


ఈ *అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే కేవలం సంపదలు కలగడమే కాదు, వాటి విస్తరణ కూడా బాగా* జరుగుతుంది. *తరువాతి తరాలకు కూడా అది అందుతుంది* .


 *లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక. సర్వ సంపదలకు నిలయం. మన చుట్టూ, మనలోని రూపసహిత, రూపరహిత వ్యవహారాలకు మూలం.* 


అందుకే, *కమలంలో కొలువై వుండే మహాలక్ష్మీ దేవిని ఆరాధిస్తే అందరికీ సంపదలు సమూలకంగా* లభిస్తాయి. *భావాలకు వికాసం కలుగుతుంది. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. వ్యవహారాల్లో విజయం* కలుగుతుంది.


 *దీపావళి వేళ ఇటువంటి జపాలకు విశేషమైన గుర్తింపు* ఉంటుంది. *నిరంతరం ఈ జపాలను చేయడం వల్ల భౌతిక, దైవిక, ఆత్మిక సంపదలన్నీ ఇంటిముందు కొలువు* తీరుతాయి.


 అందుకే ‘ *ఓం శ్రీ కమల వాసిన్యై నమః* ’ జపాన్ని ప్రతి రోజూ కనీసం ఒక గంటసేపు చేయండి.


 *కమలంలో కొలువైన మహాలక్ష్మీదేవి పటం ఎదురుగా పెట్టుకుని, దీపాన్ని వెలిగించి ఆరాధనలో నిమగ్నం* అవాలి.


 అప్పుడు *సర్వ సంపదలతో హాయిగా ఆనందంగా గడిపే భాగ్యం* లభిస్తుంది.


*✍ సాగి కమలాకర శర్మ*

భారతీయ విద్యార్థి కోవిడ్-19

 _*శుభవార్త*_


చివరగా పాండిచ్చేరి విశ్వవిద్యాలయానికి చెందిన ఒక భారతీయ విద్యార్థి కోవిడ్-19 కు సహజ నివారణను కనుగొన్నాడు, ఇది మొదటిసారి WHO చేత అంగీకరించబడింది.

1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు పొడి 

2 టేబుల్ స్పూన్ల తేనె మరియు కొంత అల్లం రసమును వరుసగా 5 రోజులు పాలలో కలిపి సేవించడం ద్వారా కరోనా ప్రభావాలను అణిచివేస్తుందని ఆయన నిరూపించారు. చివరికి పూర్తిగా 100% కరోనా ఏ మందులు లేకుండా తగ్గిపోతుంది. ప్రపంచం మొత్తం ఈ చిట్కాను అంగీకరించడం ప్రారంభించింది. చివరగా 2020 లో శుభవార్తను మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ఈ సమాచారాన్ని సర్క్యులేట్ చేయండి.

సుభాషితాలు

 --------------    ---------   సుభాషితాలు --------------

వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్, సురారాతి జీ

వనసంపత్తి నిరాకరిష్ణుఁ, గరుణావర్ధిష్ణుఁ, యోగీంద్ర హృ

ద్వనవర్తిష్ణు, సహిష్ణు, భక్తజనబృందప్రాభవాలంకరి

ష్ణు, నవోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్, జిష్ణు, రోచిష్ణునిన్.

 

భావము:- విష్ణుమూర్తి రాక్షసుల బతుకు తెరువులను నశింప జేసే వాడు, దయా రసంతో మించేవాడు, మహాయోగుల హృదయా లనే వనాలలో విహరించేవాడు, గొప్ప ఓర్పుగల వాడు, భక్తుల గొప్పదనాన్ని పెంపొందించేవాడు, నవయౌవనంతో వెలుగొందే లక్ష్మీదేవితో కలిసి విహరించే వాడు. జయశీలుడు, మహా కాంతిమంతుడు. అట్టి భగవంతుడిని ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూసారు.

 

    అడుగంబోనిఁక నన్యమార్గరతులం బ్రాణావనోత్సాహినై,

    యడుగంబోయినఁబోదు నీదు పదపద్మారాధకశ్రేణియు

    న్నెడకున్నిన్ను భజింపఁగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో

    రెడిదింకేమి? భవత్ప్రసాదమె తగున్‌ శ్రీకాళహస్తీశ్వరా!

 

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నా ప్రాణములు రక్షింపగోరి నేను నీ భక్తి తప్ప అన్యమార్గములను ఆశ్రయించను. ఒకవేళ ఆశ్రయించినా నీ పాదపద్మభజనతత్పరులైన పరమశైవులను భజించెదను. నీ అనుగ్రహమే ఉన్న నాకు వేరొండు పదార్థములయందు వాంఛ ఏల కలుగును? ప్రభో!

 

ఏల సమస్తవిద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్

జాలు ననేక మార్గములసన్నుతి కెక్క నదెట్లొకో యనన్

ఱాలకు నేడ విద్యలు? తిరంబగు దేవత రూప చేసినన్

వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీద భాస్కరా!

 

తాత్పర్యం: భాస్కరా! రాళ్ళు విద్య నేర్వకున్ననూ వాటి అదృష్టముచే దేవతా ప్రతిమలగును. జనులు ఆ ప్రతిమలకు పూలతో అర్చనలు, పూజలు చేసి తరిస్తారు. అటులనే అదృష్టరేఖ ఉన్నచో సమాజమునందు కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతారు. అంటే విద్యలేకపోయిననూ అదృష్ట రేఖ ముఖ్యమని భావము.

 

    తనపై దయ నుల్కొనఁ గన్

   గొన నేతెంచినను శీల గురుమతులను వమ్

   దనముగఁ భజింపందగు

   మనమలరగ నిదియ విబుధ మతము కుమారా!

 

తా:--ఓ కుమారా! దయతో తనకు మంచి చేయ బూనిన వారిని గౌరవించి, నమస్కరింపుము. వారి మనస్సు సంతోషపడునట్లు చేయుటయే నీవు వారి పట్ల చూపించదగు మర్యాద. పెద్దలనుసరించే మంచి పద్ధతి యిదియే.

 

వాసన లేని పూవు బుధవర్గము లేని పురంబు నిత్య వి

శ్వాసము లేని భార్య గుణవంతుడు గాని కుమారుడున్ సద

భ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యమున్

గ్రాసము లేని కొల్వు కోరగానివి పెమ్మయ సింగధీమణీ

గ్రాసము=జీతము

 

పెట్టక కీర్తి రాదు వలపింపక యింతికి యింపు లేదు తా

దిట్టక వాదులేదు కడుధీరత వైరుల సంగరంబులో

కొట్టక వాడ లేదు కొడుకొక్కడు పుట్టక ముక్తి రాదయా

పట్టపు రాజుకైన నిది పద్ధతి పెమ్మయ సింగధీమణీ

 

మచ్చిక లేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా

గుచ్చితులున్నచోట గుణ కొవిదులుండని చోట విద్యకున్

మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే ని

నచ్చట మోసముండ్రు కరుణాకార పెమ్మయ సింగధీ మణీ!

మచ్చిక=స్నేహము

 

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృ౦

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వారకబంధ రాక్షసవిరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

 

తా:--సంపత్ప్రదమైన రఘుమహారాజు జన్మించిన ఇక్ష్వాకు వంశములో జన్మించి,

భద్రాచల క్షేత్రములో నివసించి వున్న దయా సముద్రుడగు ఓ దశరథరామా!నీవు సుందరమైన తులసీదళమాలను ధరించిన వాడవు.శాంతము, ఓర్పు,అనే మనోహర గుణములుగలవాడవు. స్వర్గ మర్త్య పాతాళలోకములలో పొగడబడిన పరాక్రమ లక్ష్మికి అలంకారమైనవాడవు, ఎదిరించడానికి సాధ్యంకాని కబంధుడనే రాక్షసుడిని సంహరించి

నవాడవు,సముద్రమువంటి అపారమైన జనుల పాపాలను దాటింపజేసే సామర్థ్యము కలవాడవు.

 

తాతముత్తాత లెంతెంత ధనము కూడ

బెట్టి పెట్టెల నిండుగ పెట్టి యున్న

గష్టపడి తాను న్యాయమార్గమున బడయు

స్వార్జితం, బొక గవ్వతో సమము గాదు

 

చద్దన్నం మూట లాంటి ఈ మాట చెప్పింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు.

తాత ముత్తాతలు పెట్టెల నిండా కూడబెట్టి పోయిన డబ్బు ఎంతవున్నా అది మనం

శ్రమించి సంపాదించిన దాని కన్నా ఒక గుడ్డి గవ్వ విలువ చెయ్యదు.వంశపారంపర్యం గా వచ్చే ఆస్తి అక్రమ ఆస్తి కన్నా ఒక గుడ్డి గవ్వ విలువ చెయ్యదు.వంశ పారంపర్యం గా వచ్చే ఆస్తి అక్రమ ఆస్తి అని కాదు కానీ దాన్ని అనుభవించడం లో సంతృప్తి దొరకదు.తెరగా వచ్చిన సొమ్ము నీళ్ళ లాగా ఖర్చు చేస్తారు.తాను సంపాదించిన ఒక్క రూపాయితో కొబ్బరిముక్క కొనుక్కొని తిన్నా కడుపు నిండుతుంది.ఆ సంపాదన కూడా న్యాయమార్గం లో జరగాలంటున్నారు.కందుకూరివారు.

 

కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా 

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా:

వాణ్యేకా  సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 

క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం (భర్తృహరి సుభాషితం)

 

తా:--పురుషులకు భుజకీర్తులు,సూర్యహారములు,చంద్రహారములు మొదలగు సొమ్ములు కానీ స్నానము,చందనము పూసికొనుట,పువ్వులు ముడుచుకొనుట,కురులు దువ్వుకొనుట,మొదలగునవి నేవియు అలంకారమును కలుగజేయవు.శాస్త్ర సంస్కారం  గల వాక్కు యొక్కటే అలంకారమును   కలుగజేయును.సువర్ణ మయాది  భూషణము లన్నియు నశించును.వాగ్భూషణ మొక్కటియే నశించని  భూషణము.

 

భూషలు గావు  మర్త్యులకు  భూరి మయాంగద తారహారముల్ 

భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ 

భూషలు గావు పూరుషుని భూషితు జేయు బవిత్ర వాణి వా 

గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్ (ఏనుగు లక్ష్మణ కవి అనువాదము) 

 

మతము లెన్ని యైనను  మానవత్వ మొక్కటే

జాతు లెన్ని యైన జగతి యొకటే

పథము లెన్ని యైన పరమార్థ మొకటే

వాస్తవమ్ము నార్ల వారి మాట

ఋణానుబంధము

 *ఋణానుబంధము.....* 


తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి...


ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు.


ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూర మవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...


మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.


మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులు గానో, సహాయకులు గానో ఎదురవుతారు.


ఉదాహరణకు ఒక జరిగిన కథ...


కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచ లోనూ పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయం లో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.


తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. 


అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...


ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.


నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...


ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తె వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.


ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.


అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము. ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు...

సౌందర్యలహరి-ముక్తిసాధనకు* 🌹

 🌹 *సౌందర్యలహరి-ముక్తిసాధనకు* 🌹

సౌందర్య లహరి 

1వశ్లోకము

శ్లో||శివఃశక్త్యాయుక్తోయదిభవతిశక్తఃప్రభవితుం

నచేదేవందేవోనఖలుకుశలఃస్పందితుమపి|

అతస్త్వామారాధ్యాంహరిహరవిరఞ్చాదిభిరపి

ప్రణంతుంస్తో్తుంవాకథమకృతపుణ్యః ప్రభవతి||


భావం:- అమ్మా !ఓభగవతీ!సర్వమంగళ సహితుడయిన శివుడు జగన్నిర్మాణ శక్తివయిన నీతో కూడితేనే కాని జగాలను సృజించడానికి సమర్థుడుకాడు; నీతో కూడకపోతే ఆదేవుడు తాను కదలటానికిసైతం అశక్తుడు. అలాంటప్పుడు హరి హర బ్రహ్మాదుల చేతను పూజింపదగిన నిన్ను మ్రొక్కటానికిగాని, స్తుతించటానికి గాని పూర్వజన్మలో పుణ్యం చేయని వ్యక్తి ఎలా సమర్థుడవుతాడు? కాడు.

ఆధ్యాత్మికత

 *ఆధ్యాత్మికత - అంతర్ముఖ సాధన!!!*

*ఆధ్యాత్మిక సాధన అంటే అంతా అంతర్ ప్రయాణమేనా...??*

అవును... మనిషికున్న ప్రత్యేకత ఏమిటంటే మనసు ద్వారా బాహ్య ప్రపంచంతోపాటు అంతర్ముఖం కాగలగటం...

అంటే వివేకంతో నిరంతరం విశ్లేషణ ద్వారా ఈ జగత్తుకి, తనకీ మూలంగా ఉన్న ఒక సత్యపదార్ధం ఉందని మనిషి గ్రహించగలడు...

_దాన్నే అంతర్దర్శనమని, ఆత్మదర్శనమని అంటారు._

కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి అనుగ్రహించిన దివ్య విశ్వరూప సందర్శనం అంతా అంతర్ ప్రయాణమే తప్ప బాహ్య ప్రయాణం కాదు. 

అందువల్లనే వేరెవరికి విశ్వరూప సందర్శనం కాలేదు...

సత్యవస్తువు ఈశ్వరుడిగా ఉంటే అందుండి వెలువడిన చైతన్యం మన దేహంగా, మనసుగా, ప్రకృతి యావత్తుగా మారింది,

చైతన్యంలోని ఒక కిరణం మన మనసు, దాన్ని మనం ప్రస్తుతం ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవించటం కోసం ఉపయోగిస్తున్నాం...

_సృష్టిలోని సకల ప్రాణులు ఇదే చేస్తున్నాయి, మరి మనిషికున్న ప్రత్యేకతే అంతర్ముఖం కావటం..._


        *_🌻శుభమస్తు🌻_*

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

రోగ నిరోధతకు - చక్కటి ఆయుర్వేద పరిస్కారం.

 రోగ నిరోధతకు - చక్కటి ఆయుర్వేద పరిస్కారం. 

ఇప్పుడు మనం వర్షాకాలం దాటి శీతాకాలంలో అడుగు పెట్టాము. గత కొన్ని రోజులుగా ఉస్నోగ్రతలు 20 డిగ్రీల కన్నా తక్కువ వుంటూ చలి వీస్తూవున్నది మనమంతా గమనిస్తున్నాము. ఈ చల్లటి వాతావరణం రోగకారక సూక్ష్మ క్రిముల వృద్ధికి బాగా తోడ్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.  మనకు రోగాలు రెండు రకాలుగా సంక్రమించే అవకాశం వున్నది. అది 1) వాతావరణంలో వుండే క్రిములు అంటే గాలినుంచి సంక్రమించేవి. రెండు మనం తీసుకునే ఆహరం మరియు నీటినుండి సంక్రమించేవి. నిన్న మొన్నటి దాకా వరదలతో అన్ని ప్రాంతాలలో నీరు కలుషితం అయంది .ఆ కలుషిత నీటిని మనం తీసుకుంటే నీటిలోని క్రిములు మనకు రోగాలను కలుగ చేస్తాయ్. ఇక ఆహారం విషయం తీసుకుంటే మనం రోజు అనేక కల్తీ పదారాధలను తీసుకుంటున్నాము. అది ఒకవైపు అయితే మొన్నటి వరదల నీటిలో పండించిన కూరలు కూడా కలుషితం అయి ఉండవచ్చు. 

ఏతా వాత తేలేది ఏమిటంటే ఇప్పుడు మనకు వున్న సమయం రోగ కారకం అని తెలుస్తున్నది. 

గాలి ద్వారా వ్యాపించే క్రిములు రెండు రకాలు ఒకటి బ్యాక్తీరియాలు రెండు వైరస్ల్. కరోనా కూడా ఒక వైరస్ అని మనం మరువ వద్దు. 

మనం ఇల్లు వదిలి పోక పోయిన మన శరీరంలో వ్యాధి నిరోధకత సరిగా లేకుంటే మనం వ్యాధి గ్రస్తులం అయ్యే ప్రమాదం వుంది. కాబట్టి మన రోగ నిరోధకత పెంచుకోవటం చాలా ముఖ్యం. 

ఆయుర్వేదంలో "త్రిఫల చూర్ణం" అనే ఒక చక్కటి మందు వున్నది. దాని పేరులోనే అది మూడు ఫలాల సంయుక్తంగా తయారు చేసిందని తెలుస్తున్నది. 

ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయ,  ఈ మూడు కాయల పెచ్చుల పొడిని త్రిఫల చూర్ణం అని అంటారు. ఈ కాయల పొడిలో చాలా పోషక పదార్ధాలు ఉంటాయి. విటమిను సి మరియు విటమెను డి పుష్కలంగా ఉండటంతో ఈ పొడిని మంచి రోగ నిరోధక ఔషధంగా మన దేశంలో చాలా సంవత్సరాలనుండి ఉపయోగిస్తున్నారు. ట్రీఫాల చూర్ణం సేవించటం వలన మన శరీరంలో అంటి ఆక్సిడెంట్లు పెరుగుతాయి, ఊపిరి తిత్తులకు బలం చేకూరుతుంది, కండ్ల ఆరోగ్యం బాగుంటుంది, జీర్ణ వ్యవస్థ మంచిగా ఉంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రీఫాల చూర్ణం ఉపయోగాలు అనేకం. మంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

ప్రతి ఇంట్లో వుండదగ్గ మందు ఈ త్రిఫల చూర్ణం. 

రోజు ఉదయం పరిగడుపున ఒక ఆర చెందాడు  చూర్ణాన్ని ఒక చెంచాడు తేనెతో రంగరించి సేవించిన మంచి ఆరోగ్యాన్ని, రోగనిరోధకతను కల్పించే అద్భుత ఆయుర్వేద మందు. పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వండి. దయచేసి మోతాదు విషయంలో జాగ్రత్తగా వుండండి. యెంత మంచి మందైనా మోతాదుకు మించి వాడితే అది శరీరానికి హాని చేస్తుంది, గమనించగలరు.  

ఈ ఔషధాన్ని చిన్న పిల్లల దగ్గరనుండి వృద్ధుల వరకు ఆడ మగ తేడాలేకుండా సురక్షితంగా వాడవచ్చు. ప్రస్తుత ఈ శీతాకాలం అనేక రోగాలను తీసుకొని వస్తుంది. వాటన్నింటిని మన శరీరం తట్టుకొనే విధంగా చేసేదే ఈ ట్రీఫాల చూర్ణం. 

రోగాలు రాకముందు పెట్టె చిన్న ఖర్చు రోగాలని రాకుండా చేస్తుంది. మరియు రోగం వచ్చిన తరువాత అయ్యే లక్షల రూపాయల ఖర్చు, కస్టాలు,  బాధలను తొలగిస్తుంది. 

మనకు డాబర్, జాన్దు, పతంజలి మొదలైన అనేక ఆయుర్వేద కంపెనీలు ఈ మందుని తయారు చేస్తున్నాయి. నేను మాత్రం పతంజలి కానీ డాబర్ కానీ వాడటానికి సూచిస్తాను. మీరు చూసుకోవలచినది ఒక్క విషయం పొడి చక్కగా మెత్తగా ఉన్నదానిని తీసుకోండి. ఏ కంపెనీ ఆయన పర్వాలేదు. ఎందుకంటె ఇది కేవలం మూడు ఎండిన  పండ్ల పొడి మాత్రమే. తేనే కూడా మంచి ముందుగా పనిచేస్తుంది. ఈ రెండిటి మిశ్రమము చాలా ఉపయుక్తంగా వుండివుంటుంది.  

కాబట్టి మిత్రులారా తప్పకుండ ఈ మందును వాడండి. నాకు ఆరోగ్యం మంచిగా వుంది నాకేం కాదు అని దయచేసి అనుకోకండి. ఈ మందు వాడటం వలన మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీ భవిష్యత్తులో చక్కటి ఆరోగ్యం చేకూరి మీరు వైద్యం కోసం ఖర్చు చేయకుండా మిమ్మలిని మీ కుటుంబాన్ని కాపాడుతుంది.  

రోజు త్రిఫల వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిండు నూరేళ్లు పూర్తి ఆరోగ్యంగా వుండండి. మరొక ఆయుర్వేద మందుతో మళ్ళి కలుద్దాము. 

మీ భార్గవ శర్మ. 

ఓం తత్సత్ 

సర్వే జానా సుఖినోభవందు. 

కృషి