11, నవంబర్ 2020, బుధవారం

7.6 ఏ ప్రమాణం వాడాలి?

 **దశిక రాము**


**అద్వైత వేదాంత పరిచయం**


7.6 ఏ ప్రమాణం వాడాలి?

  మరి మనం ఏ ప్రమాణం వాడాలి? శాస్త్రం మనకి యిష్టం వచ్చిన లేదా మనకి సరదాగా అనిపించిన ప్రమాణం వాడటానికి వీలు లేదంటుంది. ఆ ప్రమాణం మనం 

తెలుసుకోవాలనుకుంటున్న వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. మనం రంగు గురించి తెలుసుకోవాలను కుంటే, కన్ను అన్న ప్రమాణం వాడాలి. నేను స్వేచ్ఛాజీవిని, నా యిష్టం 

వచ్చినట్టు చేస్తాను, ఎవరిమాటో ఎందుకు వినాలి? నేను చెవులు వాడతాననలేము. బుద్ధిగా కళ్ళు మాత్రమే వాడాలి. అందువల్ల జ్ఞానం సరియైన ప్రమాణం వాడితేనే కలుగుతుంది.

అద్వైత వేదాంత పరిచయం

7.7 ఆత్మజ్ఞానానికి ఏ ప్రమాణం?

  మనకి అందుబాటులో ఉన్న ఐదు ప్రమాణాలూ, బాహ్యప్రపంచాన్ని చూస్తాయి. ఇందులో ఏవీ వాటి వెనుక ఉన్న కర్తని చూడవు. అందువల్ల ఇది ప్రత్యక్ష ప్రమాణం, 

అనుమాన ప్రమాణాల లోటుపాటు. ఇది పంచ ప్రమాణాల వల్ల వచ్చే లోటుపాటు. ఇది సైన్సు యొక్క లోటుపాటు.

ఇంతకు ముందు ఈ లోటుపాటుని సైన్సు ఒప్పుకోలేదు. కాని ఇప్పుడు ఒప్పుకుంటోంది. అది చదివే విద్యార్థిని చూడలేదు.

  అక్షరాలా మన కళ్ళలాగా. మన కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూడగలవు గాని మనని చూడలేవు. (ఐ కెనాట్‌ స్టడీ ఐ) కర్తని కర్మలాగా చూడలేము. కర్త ఎప్పుడూ 

కర్మలాగా అందుబాటులో లేదు. ఇలా అయితే ఆత్మజ్ఞానం అందుబాటులో ఉండదు, వైజ్ఞానిక శాస్త్రానికి అంతుబట్టదు. మరేదైనా మార్గం ఉందా? 

అద్వైత వేదాంత పరిచయం

7.10  వేరే పద్ధతి ఉంది అది జ్ఞానయోగం :

  జ్ఞాన యోగానికి మూడుదశల సాధన ఉంది. శ్రవణం, మననం, నిధిధ్యాసనం.

అద్వైత వేదాంత పరిచయం

7.10.1 శ్రవణం :  సమర్థవంతుడైన గురువు, క్రమ పద్ధతిలో చెప్పిన శాస్త్ర జ్ఞానాన్ని విని ఆకళింపు చేసుకోవటం, అది కూడా కొన్ని సంవత్సరాలపాటు. 

  గురువు లేకుండా మనమే చదివితే ఈ డైకాటమీలో పడిపోయి,సమాచారం నేర్చుకోవటంలోనో, ప్రత్యక్ష అనుభవం కోసం చూడటమో జరుగుతుంది.

  ఉదాహరణకి కుంతి కర్ణుడుల మధ్య జరిగిన సంభాషణ గురించి చూద్దాం. కుంతి కర్ణుడితో చెప్తుంది, ‘కర్ణా, నాకు ఆరుగురు పుత్రులు 

ఉన్నారు.’ అతనికి ఐదుగురి గురించే తెలుసు, నిద్రలో కూడా వాళ్ళని మర్చిపోడు. అందుకని అడుగుతాడు, ‘ఓ కుంతీ! ఆ ఆరవ పుత్రుడిని చూడాలని ఉంది’. కుంతి, ‘తత్త ్వమసి’ 

అంటుంది. అంటే అది నువ్వే. అప్పుడు కర్ణుడు యిలా అన్నాడనుకోండి, ‘ఓ కుంతీ, నాకు ఆరవ పుత్రుడి గురించి సమాచారం తెలిసింది. ఇప్పుడు అతన్ని ఎక్కడ కలుసుకోను?’ అలా 

అంటే ఎలా ఉంటుంది?ఆ ప్రశ్న యిక్కడ కుదరదు. అజ్ఞానం తొలగిపోవటమే జ్ఞానం. డైకాటమీ లేదు. 

  అందువల్ల శ్రవణం అంటే క్రమపద్ధతిలో శాస్త్రం నేర్చుకోవటం. సమర్థవంతమైన గురువు దగ్గర, కొన్ని సంవత్సరాల పాటు. ఎందుకంటే మనకి అలవాటైన పద్ధతిని 

పోగొట్టుకోవటానికి సమయం పడ్తుంది.

  శ్రవణం జరుగుతున్న దశలో ప్రశ్నలు అడగకూడదు. గురువు 

అనేక కోణాల్లోంచి, అనేక అంశాల గురించి సంపూర్ణంగా వివరిస్తాడు. మనకి సందేహాలు కలిగినా,కొంత భాగం ఒప్పుకోవటానికి సిద్ధంగా లేకపోయినా, వాటిని పక్కన పెట్టుకుని, చెప్పిన 

విషయాన్ని అంగీకరించే తత్త్వం పెంచుకోవాలి. మనం గురువు మాటతో విభేదించవచ్చు. నా మాటవినకపోతే శపిస్తాను అనడు.కాని అది పూర్తి అయ్యేదాకా మనం ఆగాలి. మనం ఒక 

ముగింపుకు రావటం, మనకి తోచిన విశ్లేషణ చేసుకోవటం, విమర్శించటం చేయకూడదు. శ్రవణం దశలో చాలా ఓపిక కావాలి. శ్రవణం అజ్ఞానాన్ని తొలగిస్తుంది

7.10.2 మననం  : సంపూర్ణంగా విన్నాక, కొన్నేళ్ళపాటు శ్రవణం చేసాక, మన సందేహాలని బయటకి తేవచ్చు. ఈ అధ్యయనంలో ఒక గొప్పదనం ఉంది. అన్నేళ్ళపాటు శ్రవణం చేసాక, 

మనలో రేగిన సందేహాలన్నీ అవే మటుమాయమవుతాయి. ఎందుకంటే శాస్త్రం గురుశిష్య సంవాదంలా  వుంటుంది. మనకి కలిగే సందేహాలని శిష్యుడు వేస్తాడు.అయినా మనకి ఏదైనా 

కొత్త సందేహం కలిగితే, మన తార్కిక మెదడుకి తోచినది, తప్పకుండా అడగవచ్చు, గురువు దాన్ని తీరుస్తాడు. అప్పుడు సందేహాలని దాచుకుంటే, అవి జ్ఞానానికి అడ్డంకులవుతాయి. 

అందువల్ల మననం సందేహాలని తొలగించి, మనకి నిస్సంశయ జ్ఞానం కలిగిస్తుంది.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: