ఫేస్ బుక్ మిత్రుడు Adusumilli Srinivasa Rao వాల్ నుంచి
.................
డాక్టర్ రాజ్ కుమార్!
----------------
ఒక మంచి ఎముకల వైద్యుడు!
దర్పం లేదు..అభిజాత్యం లేదు..పొరుగున నివశించే వ్యక్తిలా అనిపిస్తారు.
రెండువారాల క్రితం ఒక ప్రమాదం జరిగి నా ఎడమచేయి ముంజేతి మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది.
వెంటనే సమీపం లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్ళటం జరిగింది.
డాక్టరు గారు అందుబాటులో లేరు..వారి డ్యూటీ ముగిసి వెళ్ళిపోయినారు.
అక్కడ డ్యూటీ డాక్టరు ఎక్సరే తీయించి..నొప్పి రాకుండా మందుబిళ్ళలు వ్రాసి ఉదయం వచ్చి డాక్టరు గారిని సంప్రదించమన్నారు.
మర్నాడు ఆ డాక్టరు గారిని కలిసాను.
ఆ సారు మంచి పేరున్న వారంట..విదేశాల్లో విద్యనభ్యసించారంట.ఎముకల వైద్య నిపుణులంట.
ఆయన కచ్చితంగా ..విరిగిన చెయ్యి ని అతికించేస్తాడని భావించాను.
డాక్టరు గారి ఎదుటకూర్చున్న నన్ను ఒకసారి ఎగాదిగా చూసి..నేను ఇచ్చిన ఎక్సరే పరిశీలించారు.
వెంటనే రెండో మాటలేకుండా సర్జరీ చేసేద్దాం ..అన్నారు.
అరవై వేలు అవుతుంది..ప్లాటినమ్ ప్లేటులు వేస్తే ఇంకా ఎక్కువ అవుతుందన్నారు.
కనీసం ఆయన చెయ్యి ఎలా ఉందన్న సంగతి చూడలేదు.
ఆయన ఎక్సరే చూసి మొత్తం గ్రహించగలిగిన వారు అయిఉండవచ్చు..కాని నాకు మాత్రం...
నేను ఏమీ మాట్లాడకపోయేసరికి కావాలంటే పిండి కట్టు వేసేస్తాను..తర్వాత ఇబ్బంది పడతారన్నారు.
ఆయనకు ఒక నమస్కారం చేసి..ఆలోచించుకుని చెబుతా అన్నాను.
నేను బయటకొచ్చే ముందు ఒక ఆఫర్ ఇచ్చారు..ఓకే అంటే గనుక డే కేర్ లో చేసేస్తానన్నారు.
తల ఊపి బయటపడ్డాను.
తర్వాత యూనికార్పస్ వారి హాస్పిటల్ గురించి తెలిసి వారిని సంప్రదించాను.
వారి అప్పాయింట్ మెంట్ తీసుకుని కలవటం జరిగింది.
అక్కడ డాక్టర్ రాజ్ కుమార్ గారు చూసారు.
చేతి ని నిశితంగా పరిశీలించారు.
ఎక్సరే చూసిన తర్వాత ..వారు కూడా సర్జరీ సజెస్ట్ చేసారు.
అయితే ప్రస్తుతం కోవిద్ కారణంగా..పైగా నా వయసు రీత్యా ఇప్పుడు సర్జరీ అంత అడ్వైజ్ బుల్ కాదన్నారు.
సర్జరీ చేసి ప్లేటులు వేసి బిగించేయటం ..లేదా వైర్ సర్జరీ అని బయటనుండే వైర్ పంపించి లోపల విరిగిన ఎముకను గట్టిగా బిగించి కట్టేద్దామన్నారు.
ఏం చేద్దామన్నా కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి..అనేక పరీక్షలు చేయించుకోవాలి కాబట్టి..అంత వరకు పిండి కట్టు వేసి పంపిస్తాను..ఈలోగా టెస్టుల పూర్తి చేసుకోండి.
అలాగే కట్టు వేసిన తర్వాత మళ్ళీ ఎక్సరే తీయించండి..అని చెప్పారు.
నేను డాక్టరు గారి మాటతీరు వారు పరీక్ష చేసిన విధానము చూసిన తర్వాత వారిపై గురి కుదిరింది.
తర్వాత ఇద్దరు చేతిని అటూ..ఇటూ పట్టుకుని లాగిపెట్టి పట్డుకుంటే డాక్టరు గారు..ఎముకనుసరి చేసి కట్టు వేసేసారు.
కొంచెం నొప్పి వస్తుంది ..తట్టుకోవాలి రావుగారూ ..అంటూ ముందే హెచ్చరించారు.
నిజమే! చేతిని చెరో వైపు లాగి ..మధ్యలో ఎముకను సరి చేస్తున్నపుడు..చుక్కలు కనిపించాయి.ఎముకలు సర్దుకుంటున్న చప్పుడు స్పష్టం గా వినిపించింది.
కాని పది నిమిషాల తర్వాత నొప్పి మటుమాయం అయింది.
రెండు వారాలు గడిచింది.
మధ్యలో డాక్టరు గారు వారంతట వారే ఫోన్ చేసి మాట్లాడారు.
చేయి సులువు గా తిప్పగలుగుతున్నాను..చేతి వేళ్ళు కూడా ఫ్రీగా కదులుతున్నాయి.
నొప్పి లేదు.
ఈ విషయం తెలుసుకున్న తర్వాత కట్టు మారుద్దాం రండని చెప్పారు.
డాక్టరు మొదట వేసిన కట్టు విప్పి చేతిని జాగ్రత్త గా పరిశీలించి..
సర్జరీ కావాలంటే చేయించుకోవచ్చు...!
ప్లేటులు వేసిన తర్వాత కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వైర్ సర్జరీ అయినా వైర్లు బయటకు ఉండనిస్తాము ఆరు వారాల తర్వాత బయటనుండే తీసేస్తాము.
ఎముక యధాతధ స్దితికి రావటం అంటూ జరగదు.
ఎనభై శాతం మాత్రం ఫలితం ఉంటుంది.
సర్జరీ చెయ్యక పోయినా బాగానే అతుక్కుంటున్నది కనుక ..మళ్ళీ కట్టు వేస్తాను ..ఈసారి ఐదు వారాలు ఉంచుకోవాల్సి వస్తుందన్నారు.
చేయ్యి కొద్దిగా వంకర గా అనిపించవచ్చు..కాని ఏ రకంగా పనితీరులో ఇబ్బంది ఉండదని చెప్పారు.
నేను సరే అనగానే..కట్టు వేసి పంపించారు.
డాక్టర్ రాజ్ కుమార్ ! వైద్య విధానం నమ్మకం కలిగిస్తున్నది.
రోగి తో మాట్లాడే విధానం ..చేస్తున్న వైద్యం గురించి చర్చింటం..అనవసర మైనవి మన మీద రుద్దక పోవటం..వారి స్పెషాలిటీ!
ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ..వైద్య విధానం చూసిన తర్వాత..
మనం హాస్పిటల్ లో అడుగు పెట్టిన దగ్గర నుండీ..మనం డబ్బు తీసి ఇచ్చేలోపలే అక్కడి సిబ్బంది మన జేబులో చెయ్యి పెట్టి వారే తీసేసుకుంటున్నారు.
పేకాటలో లాగ ..ముక్కేసి కళ్ళు మూసుకోమంటున్నారు.
యూనికార్పస్ ..ఈ సంస్ద ఛారిటీ మోటివ్ గా చేస్తున్నారు.
సీనియర్ సిటిజన్స్ అయితే చాలా వెసులు బాటు ఇస్తున్నారు.
ఆ సంస్ద ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఇంచుమించు అన్ని వైద్య సదుపాయాలున్నాయి.
నా అనుభవాన్ని షేర్ చేసుకుంటే ఇతరులు కి ఉపయోగపడుతుందని భావించాను.
ఇప్పుడు డబ్బు సమస్య కంటే ..నమ్మకం ముఖ్యం..
డాక్టర్ రాజ్ కుమార్ అలాంటి..భరోసా..నమ్మకం కలిగించారు.
సగం బాధ అప్పుడే తగ్గిపోయింది.
మిత్రులు హైదరాబాద్ లో ఉన్నవారైనా..లేక ఇతర ప్రాంతాల్లో ఉన్నాఎలాంటి ఆరోగ్య ఇబ్బంది ఉన్నా ఈ ఆసుపత్రి ని సంప్రదించండి.
హయత్ నగర్ లో పెద్ద ఆసుపత్రి ఉన్నది.
సికిందరాబాద్ సంగీతా సర్కిల్ ..అపోలో హాస్పటల్ ఎదురు గల్లీలో కూడా వారి వైద్య కేంద్రము ఉన్నది.
లేదా గూగుల్ లో సెర్చ్ చేసినా వివరాలు లభిస్తాయి.
డాక్టర్ రాజ్ కుమార్ గారిని చూసిన తర్వాత డాక్టర్ల మీద నాకుండే దురభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను.
ఎవరు బడితే వాళ్ళను సంప్రదించి..అక్కడ దెబ్బ తిని మొత్తం వైద్యులను విమర్శించకూడదు.
మనమే మంచి వాళ్ళను వెతుక్కుని వెళ్ళాలి.
వెతికితే కచ్చితంగా కావల్సింది దొరుకుతుంది.
ధాంక్యూ డాక్టర్ రాజ్ కుమార్ గారు.!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి