*మన సంపాదన ఖర్చు చేసే విధానం*
*శ్లోకము :*
*ధర్మాయ యశసే అర్థాయ,*
*కామాయ స్వజనాయచ,*
*పంచథా విభజన్ విత్తం,*
*ఇహా ముత్రచ మోదతే*
*(ఎనిమిదవ స్కంధం, శ్రీమద్భాగవతం)*
*ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానిని అయిదు భాగాలుగా విభజించాలి.*
*మొదటి భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వినియోగించాలి. గుప్తదానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, ఈతి బాధల్లో ఉన్నవారికి ఆర్తులకు సహాయం, ప్రేత సంస్కారాలు మున్నగు కార్యక్రమాలు, ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధితో చెయ్యాలి. అన్నీ భగవత్పరంగా చెయ్యాలి. ఇవే మనిషిని కృతకృత్యుణ్ణి, ధన్యుణ్ణి చేస్తాయి.*
*రెండవ భాగాన్ని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రజోపయోగ శాశ్వత కార్యక్రమాలపై వెచ్చించాలి. ఆలయాలు, ధర్మశాలలు, అనాథ సేవాశ్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు విద్యా, వైద్య కార్యక్రమాలు, నిత్యాన్నదాన పథకాలు, పండిత సమ్మానాలు మున్నగునవి ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలను చిరకాలం నిలబెడతాయి.*
*మూడవ భాగం తిరిగి తాను ధనం సంపాదించడానికి పెట్టుబడిగా పెట్టాలి. ఉద్యోగులైతే పొదుపు పథకాల్లోను, ఇళ్ళ స్థలాలు వీటిపై పెట్టుబడిపెట్టాలి.*
*నాల్గవ భాగం తన స్వంత సుఖాలు, అవసరాల కోసం ఖర్చుపెట్టాలి.*
*అయిదవ భాగం తనను ఆశ్రయించి ఉన్నవారి సుఖాలు, అవసరాలు, అభివృద్ధి కోసం ఖర్చుపెట్టాలి.*
*మన ధర్మ శాస్త్రాలు మనకు ఎంత చక్కని ప్రణాళిక ఇచ్చాయో కదా!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి