రోగ నిరోధతకు - చక్కటి ఆయుర్వేద పరిస్కారం.
ఇప్పుడు మనం వర్షాకాలం దాటి శీతాకాలంలో అడుగు పెట్టాము. గత కొన్ని రోజులుగా ఉస్నోగ్రతలు 20 డిగ్రీల కన్నా తక్కువ వుంటూ చలి వీస్తూవున్నది మనమంతా గమనిస్తున్నాము. ఈ చల్లటి వాతావరణం రోగకారక సూక్ష్మ క్రిముల వృద్ధికి బాగా తోడ్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు రోగాలు రెండు రకాలుగా సంక్రమించే అవకాశం వున్నది. అది 1) వాతావరణంలో వుండే క్రిములు అంటే గాలినుంచి సంక్రమించేవి. రెండు మనం తీసుకునే ఆహరం మరియు నీటినుండి సంక్రమించేవి. నిన్న మొన్నటి దాకా వరదలతో అన్ని ప్రాంతాలలో నీరు కలుషితం అయంది .ఆ కలుషిత నీటిని మనం తీసుకుంటే నీటిలోని క్రిములు మనకు రోగాలను కలుగ చేస్తాయ్. ఇక ఆహారం విషయం తీసుకుంటే మనం రోజు అనేక కల్తీ పదారాధలను తీసుకుంటున్నాము. అది ఒకవైపు అయితే మొన్నటి వరదల నీటిలో పండించిన కూరలు కూడా కలుషితం అయి ఉండవచ్చు.
ఏతా వాత తేలేది ఏమిటంటే ఇప్పుడు మనకు వున్న సమయం రోగ కారకం అని తెలుస్తున్నది.
గాలి ద్వారా వ్యాపించే క్రిములు రెండు రకాలు ఒకటి బ్యాక్తీరియాలు రెండు వైరస్ల్. కరోనా కూడా ఒక వైరస్ అని మనం మరువ వద్దు.
మనం ఇల్లు వదిలి పోక పోయిన మన శరీరంలో వ్యాధి నిరోధకత సరిగా లేకుంటే మనం వ్యాధి గ్రస్తులం అయ్యే ప్రమాదం వుంది. కాబట్టి మన రోగ నిరోధకత పెంచుకోవటం చాలా ముఖ్యం.
ఆయుర్వేదంలో "త్రిఫల చూర్ణం" అనే ఒక చక్కటి మందు వున్నది. దాని పేరులోనే అది మూడు ఫలాల సంయుక్తంగా తయారు చేసిందని తెలుస్తున్నది.
ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయ, ఈ మూడు కాయల పెచ్చుల పొడిని త్రిఫల చూర్ణం అని అంటారు. ఈ కాయల పొడిలో చాలా పోషక పదార్ధాలు ఉంటాయి. విటమిను సి మరియు విటమెను డి పుష్కలంగా ఉండటంతో ఈ పొడిని మంచి రోగ నిరోధక ఔషధంగా మన దేశంలో చాలా సంవత్సరాలనుండి ఉపయోగిస్తున్నారు. ట్రీఫాల చూర్ణం సేవించటం వలన మన శరీరంలో అంటి ఆక్సిడెంట్లు పెరుగుతాయి, ఊపిరి తిత్తులకు బలం చేకూరుతుంది, కండ్ల ఆరోగ్యం బాగుంటుంది, జీర్ణ వ్యవస్థ మంచిగా ఉంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రీఫాల చూర్ణం ఉపయోగాలు అనేకం. మంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ప్రతి ఇంట్లో వుండదగ్గ మందు ఈ త్రిఫల చూర్ణం.
రోజు ఉదయం పరిగడుపున ఒక ఆర చెందాడు చూర్ణాన్ని ఒక చెంచాడు తేనెతో రంగరించి సేవించిన మంచి ఆరోగ్యాన్ని, రోగనిరోధకతను కల్పించే అద్భుత ఆయుర్వేద మందు. పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వండి. దయచేసి మోతాదు విషయంలో జాగ్రత్తగా వుండండి. యెంత మంచి మందైనా మోతాదుకు మించి వాడితే అది శరీరానికి హాని చేస్తుంది, గమనించగలరు.
ఈ ఔషధాన్ని చిన్న పిల్లల దగ్గరనుండి వృద్ధుల వరకు ఆడ మగ తేడాలేకుండా సురక్షితంగా వాడవచ్చు. ప్రస్తుత ఈ శీతాకాలం అనేక రోగాలను తీసుకొని వస్తుంది. వాటన్నింటిని మన శరీరం తట్టుకొనే విధంగా చేసేదే ఈ ట్రీఫాల చూర్ణం.
రోగాలు రాకముందు పెట్టె చిన్న ఖర్చు రోగాలని రాకుండా చేస్తుంది. మరియు రోగం వచ్చిన తరువాత అయ్యే లక్షల రూపాయల ఖర్చు, కస్టాలు, బాధలను తొలగిస్తుంది.
మనకు డాబర్, జాన్దు, పతంజలి మొదలైన అనేక ఆయుర్వేద కంపెనీలు ఈ మందుని తయారు చేస్తున్నాయి. నేను మాత్రం పతంజలి కానీ డాబర్ కానీ వాడటానికి సూచిస్తాను. మీరు చూసుకోవలచినది ఒక్క విషయం పొడి చక్కగా మెత్తగా ఉన్నదానిని తీసుకోండి. ఏ కంపెనీ ఆయన పర్వాలేదు. ఎందుకంటె ఇది కేవలం మూడు ఎండిన పండ్ల పొడి మాత్రమే. తేనే కూడా మంచి ముందుగా పనిచేస్తుంది. ఈ రెండిటి మిశ్రమము చాలా ఉపయుక్తంగా వుండివుంటుంది.
కాబట్టి మిత్రులారా తప్పకుండ ఈ మందును వాడండి. నాకు ఆరోగ్యం మంచిగా వుంది నాకేం కాదు అని దయచేసి అనుకోకండి. ఈ మందు వాడటం వలన మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీ భవిష్యత్తులో చక్కటి ఆరోగ్యం చేకూరి మీరు వైద్యం కోసం ఖర్చు చేయకుండా మిమ్మలిని మీ కుటుంబాన్ని కాపాడుతుంది.
రోజు త్రిఫల వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిండు నూరేళ్లు పూర్తి ఆరోగ్యంగా వుండండి. మరొక ఆయుర్వేద మందుతో మళ్ళి కలుద్దాము.
మీ భార్గవ శర్మ.
ఓం తత్సత్
సర్వే జానా సుఖినోభవందు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి