#USPresidentialElections2020
మా మీడియా వాళ్లకు కొన్ని విషయాలు తెలియవు. అధికారం అప్పగించేందుకు ట్రంప్ ససే fcమిరా అంటున్నారు, ట్రంప్ కుటుంబంలో చీలికలు, రెండుగా చీలిన రిపబ్లికన్ పార్టీ, శ్వేత సౌధం నుంచి ట్రంప్ ను గెంటేస్తారా?.. ఇలా రకరకాల కథనాలను వండి వారుస్తున్నారు. ట్రంప్ ను హేళన చేసేలా కార్టూన్లు వేస్తున్నారు.
అసలు నిజం ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ జనవరి 20 వరకూ కొనసాగుతారు. ఆయనకు సర్వ హక్కులూ ఉన్నాయి, ఉంటాయి. అంత వరకూ బైడెన్ కు ఏ హక్కులూ ఉండవు. భద్రత పెరుగుతుంది అంతే. ఇంకో మాటలో చెప్పాలంటే బైడెన్ ఇంకా అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదు. ఎందుకంటే ఆయన ఎన్నికైనట్లు ఏ రాష్ట్ర ఎన్నికల అధికారులూ ధృవీకరించలేదు. నవంబర్ 14న మాత్రమే ఆయనకు ఆయన గెలిచిన రాష్ట్రాలలో రిటర్నింగ్ అధికారులు ధృవీకరణ పత్రాలను అందజేస్తారు. పోలింగ్ అవకతవకలపై ప్రస్తుతం కొన్ని కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసుల్లో తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో తెలియదు. అంతే కాదు తాను ఇంకా అధ్యక్షుడిగా కాలేదని, అందుకు జనవరి 20 వరకూ సమయం ఉందని బైడెన్ స్వయంగా ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని పిలుపునిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి