13, నవంబర్ 2026, శుక్రవారం

పరిమళభరితం చేస్తారు

 🦚🦚🦚🦚🦚

వివాహం అనంతరం తొలిసారి పుట్టింటికి వచ్చిన కుమార్తెకు వారంరోజుల పాటు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు।

ఆ వారం రోజులూ అమ్మాయికి నచ్చినవే అన్నీ చేశారు। తిరిగి అత్తింటికి వెళ్తున్నప్పుడు తండ్రి ఎంతో సువాసనగల ఓ అగరబత్తుల ప్యాకెట్‌ను ఆమెకు ఇస్తూ ఇలా అన్నాడు —                                                                                                  “బిడ్డా, నువ్వు అత్తింట్లో పూజ చేసేటప్పుడు ఈ అగరబత్తిని తప్పకుండా వెలిగించు.”

అప్పుడు తల్లి చెప్పింది —

“మొదటిసారి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్న కూతురికి అగరబత్తులాంటి వస్తువు ఇస్తారా?”

అంతలోనే తండ్రి జేబులో చేయి వేసి, తన దగ్గర ఉన్న డబ్బంతా కూతురి చేతిలో పెట్టాడు।

అత్తింటికి చేరుకున్న తర్వాత, కోడలికి పుట్టింటి వారు ఏమిచ్చారో అని అత్తగారు చూసారు। అందులో ఆ అగరబత్తుల ప్యాకెట్ కూడా కనిపించింది। అప్పుడు ఆమె ముఖం చిట్లిస్తూ — “సరే, రేపు పూజలో ఇవి వెలిగించు” అని చెప్పింది।

మరుసటి ఉదయం అమ్మాయి పూజకు కూర్చొని అగరబత్తుల ప్యాకెట్ తెరిచింది। అందులో ఒక చిన్న లేఖ కనిపించింది।

ఆ లేఖలో ఇలా వుంది…

“బంగారం… ఈ అగరబత్తి తాను కాలిపోతూ కూడా మొత్తం ఇంటిని సువాసనతో నింపుతుంది। అంతేకాదు, చుట్టుపక్కల వాతావరణాన్నీ పరిమళభరితంగా, ఆనందంగా మారుస్తుంది…!!

ఎప్పుడైనా నీకు భర్తపై కోపం రావచ్చు, కొన్నిసార్లు అత్తమామలపై మనసు నొచ్చుకోవచ్చు। మరికొన్ని సందర్భాల్లో మరిది, మరదళ్లపై కూడా అలక రావచ్చు। కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు నిన్ను బాధించవచ్చు, లేదా పొరుగువారి ప్రవర్తనతో నీ మనసు కలత చెందవచ్చు। అలాంటి ప్రతి సమయంలో నా ఈ కానుకను గుర్తు పెట్టుకో…

ఈ అగరబత్తిలా నీవూ కాలిపోతూ, నీ బాధలను భరించుకుంటూ, అత్తింటినే నీ పుట్టింటిలా భావించి, నీ ప్రవర్తనతో, నీ మంచితనంతో ఆ ఇంటిని పరిమళభరితంగా, ఆనందభరితంగా మార్చు…”

ఆ లేఖ చదివిన కూతురు ఆపుకోలేక బిగ్గరగా ఏడవసాగింది। అత్తగారు పరుగెత్తుకుంటూ వచ్చారు। భర్త, మామగారు కూడా పూజగదిలోకి వచ్చారు।

“ఏమైంది? చేతికి ఏమైనా కాలిందా?” అని భర్త అడిగాడు।

“ఏమైందో చెప్పమ్మా?” అని మామగారు అన్నారు।

అత్తగారు చుట్టూ ఏదైనా సమస్య ఉందేమో అని చూసారు।

అప్పుడు తండ్రి అందమైన అక్షరాలతో రాసిన ఆ లేఖ ఆమె కంటపడింది। లేఖ చదివిన వెంటనే అత్తగారు కోడలిని హత్తుకుని, ఆ లేఖను మామగారి చేతిలో పెట్టారు।

కళ్లజోడు లేకపోవడంతో మామగారు ఆ లేఖను తన కుమారుడితో చదివించారు।

మొత్తం విషయం అర్థమైన వెంటనే ఆ ఇంట్లో ఉన్న అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు।

అప్పుడు అత్తగారు అన్నారు — “ఈ లేఖకు వెంటనే ఫ్రేమ్ వేయించాలి। మా కోడలికి వచ్చిన అత్యంత విలువైన కానుక ఇదే। పూజగది పక్కనే దీనిని పెట్టాలి.”

ఆ తరువాత ఆ ఫ్రేమ్‌లోని ఆ మాటలు, వాటి అర్థం, ఆ ఇంటినే కాదు… చుట్టుపక్కల వాతావరణాన్నీ ఎప్పటికీ పరిమళభరితంగా ఉంచాయి… అగరబత్తుల ప్యాకెట్ అయిపోయిన తరువాత కూడా…

మీరు కూడా మీ కుమార్తెకు ఇలాంటి సంస్కారాలను ఇవ్వాలనుకుంటారా…?                             ఇంకేం ఆ అమ్మాయి ఉన్న ఆ ఇల్లు కూడా పరిమళభరితం కాబోతోందన్నమాట!

 ఇలాంటి పరిమళాలను పంచిపెట్టే సమస్త తల్లిదండ్రులకు మరియు పూర్వీకులకు అంకితం…

🙏 కూతుళ్లు రెండు కుటుంబాలను పరిమళభరితం చేస్తారు 🙏

🌴🌴🌴🌴🌴

శనివారం,నవంబర్.14,2026

 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శనివారం,నవంబర్.14,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం -  శుక్ల పక్షం

తిథి:పంచమి రా7.54 వరకు    

వారం:శనివారం(స్థిరవాసరే)

నక్షత్రం:పూర్వాషాఢ సా6.14 వరకు

యోగం:శూలం తె5.05 వరకు

కరణం:బవ ఉ6.49 వరకు తదుపరి బాలువ రా7.54 వరకు

వర్జ్యం:తె3.04 - 4.50

దుర్ముహూర్తము:ఉ6.08 - 7.37

అమృతకాలం:మ12.55 - 2.41

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 -3.00

సూర్యరాశి:తుల||చంద్రరాశి:ధనుస్సు 

సూర్యోదయం:6.08 || సూర్యాస్తమయం:5.21

సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

🪷13నవంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🌹భృగువారం*🌹

 *🪷13నవంబర్26🪷*     

  *దృగ్గణిత పంచాంగం* 

  *🕉️ఈనాటి పర్వం🕉️*     

   *🪱నాగులచవితి🪱* 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు* 

*కార్తీకమాసం - శుక్లపక్షం*

*తిథి    : చవితి* రా 08.42 వరకు ఉపరి *పంచమి*

*వారం    :శుక్రవారం*

(భృగువాసరే)

*నక్షత్రం   : మూల* సా 05.17 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం  : ధృతి* రా (14) తె 05.23 వరకు ఉపరి *శూల*

*కరణం   : వణజి* ఉ 07.24 *భద్ర* రా 08.42 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 08.00  &  09.30 - 10.30*

అమృత కాలం  :   *ఉ 10.05 - 11.53*

అభిజిత్ కాలం  :   *ఉ 11.29 - 12.14*

*వర్జ్యం             : మ 03.29 - 05.17 &  రా 04.08 - 05.56 తె*

*దుర్ముహూర్తం  : ఉ 08.27 - 09.12 మ 12.14 - 01.00*

*రాహు కాలం    : ఉ 10.26-11.52*

గుళికకాళం       :  *ఉ 07.35 - 09.01*

యమగండం     : *మ 02.42-04.08*

సూర్యరాశి : *తుల*                            

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.19*  

సూర్యాస్తమయం :*సా 05.41*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం         : *ఉ 06.10-08.27*

సంగవ కాలం        : *08.27-10.43*

మధ్యాహ్న కాలం    : *10.43-01.00*

అపరాహ్నకాలం    : *మ 01.00-03.17*

*ఆబ్ధికం తిధి     : కార్తీక శుద్ధచవితి*

సాయంకాలం       : *సా 03.17-05.33*

ప్రదోషకాలం        : *సా 05.33-08.05*

రాత్రి కాలం          : *రా 08.05-11.27*

నిశీధి కాలం          : *రా 11.27-12.17*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.29 - 05.20*

¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           *🌷ఓం శ్రీ🌷* 

*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

కార్తీకపురాణం

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️

*భృగువారం తేదీ 13 నవంబరు 2026*

           *🕉️కార్తీకపురాణం🕉️*             

             *నాల్గవ అధ్యాయం*

    *దీపారాధన మహిమ*

         *శతృజిత్ కథ*```

ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసమున ముఖ్యమైనవి యేమేమి చేయవలయునో, ఎవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.. 

“జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొంద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధినిగాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీకమాసమందు హరి హరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. 

దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యాత్ములుగాను, భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము..```

           *శతృజిత్ కథ* ```

పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చుటకు 

పిప్పలాదుడను ముని పుంగవుడు వచ్చి ‘పాంచాల రాజా! నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక యేమి?' యని ప్రశ్నించగా, ‘ఋషిపుంగవా! నాకు అష్ఠైశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని చెప్పెను. 

అంత మునిపుంగవుడు ‘ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల నీ కోరిక నేరవేరగలదు' యని చెప్పి వెడలిపోయెను.

వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీకమాసము నెలరోజులూ దీపారాధన చేయించి, దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్యకార్యమువలన ఆ రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తుమున నొక కుమారుని గనెను. 

రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మాలు జేసి, ఆ బాలునకు ‘శత్రుజి'యని నామకరణము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి. 

కార్తీకమాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు,దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. 

కాని, యవ్వనమునము రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటికింపగు స్రీలకు బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకోనుచుండెను.

తల్లితండ్రులు కూడా, తమకు లేకలేక కలిగిన కుమారుని యెడల చూచిచూడనట్లు - విని విననట్లు వుండిరి. 

శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పువారలను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. 

అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తముని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైననూ శక్యము గాదు. అట్టి స్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మవలె నిశ్చేష్టుడై కామవికరముతో నామెను సమీపించి తన కమవాంఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపోయి భోగములనుభవించెను. 

ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్ధరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. 

ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, భార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.

ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగనమొనర్చుకొను సమయమున 'చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా’ యని రాకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యనూ, ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది 

ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. 

అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు 'ఓ దూతలారా! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను. 

అంత యమకింకరులు ‘ఓ బాపడా! ఎవరెంతటి నీచులైననూ, యీ పవిత్ర కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు' అని చెప్పగా - యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు అలా యెన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మాయందరికి వర్తించవలసినదే' అని, తాము చేసిన దీపారాధన ఫలములో కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి. 

వింటివా రాజా! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికుల పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొందుదురు.```

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.*```

*🕉️ఓం నమః శివాయ🙏*

             🌷🙏🌷

   *🕉️🌹సేకరణ🌹🕉️*

    🙏*న్యాయపతి*🙏 

       *నరసింహారావు*

రచించిన శివానంద లహరి -

 🌹🌷🪷🍁🛕🍁🪷🌷🌹

       *🌷భృగువారం🌷*

*🌷13 నవంబరు 2026🌷*

*🌹జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య🌹* 

*🌷రచించిన శివానంద లహరి - 5🌷*

      **శ్లోక సంఖ్య – 5**

*స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ*

*పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః |*

*కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే*

*పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో ||*

            **తెలుగు అర్థం**

స్మృతులయందు గానీ, శాస్త్రములయందు గానీ, వైద్యమునందు గానీ, శకునములు చెప్పుటయందు గానీ, కవిత్వము చెప్పి మెప్పించుటయందు గానీ, సంగీతము పాడి రంజింపజేయుటయందు గానీ, పురాణములు చెప్పుటయందు గానీ, మంత్రశాస్త్రమందు గానీ, స్తోత్రములు చేయుటయందు గానీ, నాట్యము చేయుటయందు గానీ, హాస్యములు చెప్పి నవ్వించుటయందు గానీ నేర్పులేనివాడను. ఇట్టి నాయందు రాజులకు ప్రేమ ఎట్లు కలుగును? ఒకవేళ వారు ఆదరించిననూ వారిచ్చు ఫలములు నాకు వద్దు. వేదప్రసిద్ధుడవూ, సర్వజ్ఞుడవూ అయిన ఓ మహేశ్వరా! నేనెవ్వడనో నాకే తెలియని పశువునైన నన్ను దయతో రక్షించుము.

              **వివరణ..**

ఇది సాధారణ శ్లోకం కాదు, పాశుపత మంత్రం. జంతువును తాడుతో గుంజకు కడితే దాని చుట్టూ కొంత దూరం మాత్రమే తిరగగలదు, అలాగే బంధాలు, రాగద్వేషాలు అనే పాశాలతో కట్టబడిన జీవుడు కూడా ఇవే సర్వస్వం అని బతుకుతాడు. కానీ అసలు పరమార్థం వీటిని దాటితేనే ఉంటుంది. వీటిని దాటాలి అంటే కట్టు తొలగాలి, పశువుల కట్టు పశువుల కాపరి తీస్తాడు, జీవుడి కట్లు విప్పేవాడు పశుపతి అయిన పరమశివుడు. ఆయన అనుగ్రహం కలిగితే సకల బంధాల నుండి విముక్తి కలుగుతుంది. ఎప్పుడు విప్పుతాడు? స్వామీ నీవే నాకు సర్వం, అసలు నా అస్తిత్వమే లేదు అంతా నీవే అని సర్వస్వ శరణువేడితే... అది వేడుకోవడం మనకు రాదు అని జగద్గురువులు మన స్థాయికి దిగివచ్చి పరమదయతో ఇచ్చిన శ్లోకం ఇది. అందుకే ఇది పాశుపత మంత్రం అన్నాను.

శంకరులు ‘కోహం పశుపతే’ అన్నారు అంటే “అహంకారానికి మూలమైన అస్తిత్వమే నశించి, ‘నేనెవరు?’ అని అంతర్ముఖ విచారణ చేసినప్పుడు కనిపించే స్థితి.

నేను అజ్ఞానంతో కట్టుబడిన ఒక పశువు మాత్రమే; ఆ నన్ను బంధవిముక్తుడిని చేసే అధికారం పశుపతివైన నీకే ఉంది” అని చెప్పారు. అంటే ఇది ఒకపక్క మనవంటి సాధారణ మనుషులకు, మరొకవైపు జ్ఞానులకు కూడా ఉపయోగపడే విధంగా అందించారు.

ఈ శ్లోకంలో పేర్కొన్న విద్యలు స్మృతి, శాస్త్రం, వైద్యం, శకునం, కవిత్వం, గానం, పురాణం, మంత్రం, నటన, హాస్యం లోకంలో పేరు, ప్రతిష్ఠలు, ధనం సంపాదించడానికి లేదా రాజులను (ప్రభువులను) ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడేవి. వీటి సహాయంతో మానవమాత్రులైన రాజులను మెప్పించి పొందే సంపదలు అశాశ్వతాలు, క్షుద్రమైనవి.

“అయినా స్వామీ ఈ విద్యలేవీ నాకు రావు అన్నారు. వారికా ఏమి తెలియనిది? 8 ఏళ్లకే సకల శాస్త్రాలు అవపోసన పట్టిన మహాజ్ఞాని వారు. కానీ వినయం! స్వామి హనుమ కూడా 100 యోజనాల మహా సముద్రాన్ని అలవోకగా దాటి సీతమ్మ దగ్గర వానరులలో నాకంటే అధిక బలం ఉన్నవారు, నాతో సమానులు ఉన్నారు కానీ నాకంటే తక్కువ బలం ఉన్నవారు ఎవరూ లేరు, నేనే అందరిలోనూ తక్కువ శక్తి కలవాణ్ణి అని వినయంగా చెప్పుకున్నారు. వినయం ఉంటేనే ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. శాశ్వతత్వం కలుగుతుంది. అందుకే ఆదిశంకరులు, స్వామి హనుమ శాశ్వతులు.

మనకోసం చెప్తున్నారు ఇలా చెప్పుకో నాయనా బాగుపడతావు అని... స్వామీ నాకు ఆ విద్యలు ఏవీ రావు కనుక ఏ రాజూ నన్ను ఆదరించడు. ఒకవేళ నువ్వు అనుగ్రహించి ఆ విద్యలు వచ్చినా ఆ లౌకిక ప్రభువుల దయాదాక్షిణ్యాల కోసం ప్రాకులాడే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే వారు ఇచ్చే దానితో వచ్చేది సంసార బంధాన్ని పెంచే అల్పసుఖాలు మాత్రమే.”

కొద్దిసేపు సుఖం ఇచ్చి బంధనం వేసే భౌతిక లాభాల కోసం నరులను కీర్తించే ‘నరస్తుతి’ కంటే, నీ పాదాలకు శరణాగతితో చేసే ‘ఈశ్వరస్తుతి’ చేయడం కోటిరెట్లు శ్రేయస్కరం. అది నా కట్టు విప్పుతుంది అన్నారు.

స్వామీ! నీకు అన్నీ తెలుసు, నాకు ఏమీ తెలియదు. నా అజ్ఞానాన్ని దాచుకోవడానికి నీ ఎదుట ఎలాంటి కపటమూ పనికిరాదు. లోకాలను ఏమి రాకపోయినా నాబోటి వాడిలా అన్నీ వచ్చినట్టు ఏదో మాయ చేయవచ్చు కానీ, నీ ముందు ఇవేం పనిచేయవు కనుక నేను అజ్ఞానినే, లోకంలో ఎవరూ నన్ను చేరదీయరు నీవే దిక్కు అంటున్నారు.

అప్పుడు ఈశ్వరుడు అన్నాడు, దేనికి పనికిరాని నిన్ను నేను మాత్రం ఎందుకు చేరదీయాలి అంటావేమో అని...

అవును స్వామీ లోకంలో అజ్ఞానిని ఎవరూ చేరదీయరు, కానీ నీవు సర్వజ్ఞుడవు మాత్రమే కాదు, ‘ప్రథిత కృప’ కలవాడివి అన్నారు—అంటే ‘లోకప్రసిద్ధమైన సహజ దయ’ కలవాడివి. కాబట్టి నేను కూడా వీడిని పట్టించుకోకపోతే వీడు ఏమైపోతాడో వెర్రివాడు అని దయతో అనుగ్రహించు అన్నారు.

శరణు అన్నవారికి అజ్ఞానమే ఈశ్వర అనుగ్రహాన్ని పొందే అర్హతగా మారుతోంది.

భగవంతున్ని ఎలా ప్రార్థించాలి, పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేది ఇక్కడ శంకరులు చూపిస్తున్నారు. ఎప్పుడైనా, ఎంత జ్ఞానం ఉన్నా, గొప్ప పండితుడివి అయినా సరే నాకు ఏమీ తెలియదు, అందరికన్నా తక్కువ జ్ఞానం నాకే ఉంది అని వినయంగా చెప్పుకునేవాడే ఈశ్వర అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. నాలుగు విషయాలు తెలుసుకోగానే నేనే గొప్ప, నన్ను మించినవాడు ఎవరూ లేరు అని విర్రవీగితే ఈశ్వరుడు అనుగ్రహించడు అంటున్నారు శంకరులు.

అంటే ఇది వారికా అవసరం? మనకు! మనలాంటి వారు చెప్పుకుని అయినా ఆయన అనుగ్రహం పొందుతారు అని అనుగ్రహించారు.

*🕉️శివాయ నమః.....🙏*

*మళ్ళీ రేపు కలుసుకుందాం మరొక శ్లోకంతో🙏*

  *🌷🌹సేకరణ🌹🌷*

     🙏*న్యాయపతి*🙏 

        *నరసింహారావు*

🌹🌷🪷🍁🛕🍁🪷🌷🌹

   *🌷బృహస్పతివారం🌷*

*🌷12 నవంబరు 2026🌷*

*🌹జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య🌹* 

*🌷రచించిన శివానంద లహరి - 4🌷*

      **శ్లోక సంఖ్య – 4**

*సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా*

*నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్ |*

*హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం*

*చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్ 4*

        *తెలుగు అర్థం.....*

ఏదో కొంచెము ఫలమిచ్చెడు దేవతలెందరో కలరు. కలలోనైనను ఆ దేవతలను భజించుటగానీ ,ఆ దేవతలు కలుగచేయు ఫలమునుగానీ ఆశించను . మంగళస్వరూపుడవగు ఓ శంకరా! ఎల్లప్పుడూ నీ సన్నిధిని చేరియున్న విష్ణువుకిగానీ , బ్రహ్మకుగానీ లభించని నీ పాదసేవయే నాకు అనుగ్రహింపమని మిమ్ము పదేపదే వేడుకొనుచున్నాను ...

వివరణ

ఈ లోకం లో వేలకొలది ఉపాసనా మార్గాలు, తాంత్రిక పరిహారాలు,శక్తులు, మంత్రాలు,అనేక దేవతలు వేలల్లో, కోట్లలో ఉన్నారు,వారు ఎంత గొప్పవారు అంటే సాధకుడు దేన్నీ కోరి ఉపాసన చేస్తానో దాన్ని సులభంగానే ఇచ్చేస్తారు అయినా సరే ఓ శంభో..నేను కలలో కూడా వారిని అనుసరించను,వారి ఉపాసన చేయను, అసలు వాటి వల్ల లభించే తాత్కాలిక భోగాలను కలలో కూడా పొందాలి అని అనుకోను అంటున్నారు శంకరులు...

ఎందుకంటే నాలుగు తలలు ఉన్న బ్రహ్మ కు, స్థితి కారుడు అనీ చెప్పబడే విష్ణువుకు కూడా అంత సులభంగా దక్కని నీ పాద సేవను శాశ్వతంగా అనుగ్రహించమని నేను కోరుతున్నాను కనుక.

అంటే ఈశ్వరా నేను నిన్ను కోరేది క్షణ కాలం సుఖంలో ఉంచే భోగాలు కాదు,అవి ఇచ్చేవారు అనేకమంది ఉన్నారు,

నాకు నీవు మాత్రమే ఇవ్వగల శాశ్వత ఆనందం,ఆ ఆనందం నీ పాదాల దగ్గర మాత్రమే లభిస్తుంది, అక్కడ చోటు ఇచ్చి నీ పాదసేవ చేసుకుని తరించే భాగ్యం ఇవ్వు అంటున్నాడు.

అది కూడా వారినే అడగక పోయావా శంకరా ఇస్తారేమో అంటావేమో నీ పాద సేవ నీకు ఆప్తులు అని చెప్పబడే బ్రహ్మ, విష్ణులకే నీ అనుగ్రహం తో లభిస్తుంది; వారు చేయాలి అనుకుంటే కాదు అది నీవు మాత్రమే ఇవ్వగలవు,ఇవ్వాలి,ఇచ్చి నన్ను అనుగ్రహించు తండ్రి అంటున్నారు.

అంటే ఎన్ని సుఖాలు రాని,ఎన్ని కష్టాలు రాని అవన్నీ ఉంచితే ఉంచావు, తీసేస్తే తీసావు నాకు అనవసరం కానీ నీ పాద సేవ ను మాత్రం దూరం చేయకు తండ్రి, నీ పాద దాసుడి గా ఉండే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని మన తరుపున శంకరులు కోరుతున్నారు, మనం కోరాల్సినది కూడా అదే.

శంకరులు ఇక్కడ ఇతర దేవతలను నిందించడం లేదు; భక్తుడికి ఉండవలసిన ఏకముఖ ప్రపత్తిని (అనన్య భక్తిని) ప్రబోధిస్తున్నారు. ప్రాపంచిక కష్టాలు వచ్చినా, సుఖాలు కోల్పోయినా సరే చిత్తం చలించకుండా పరమశివుని మీదే నిలకడగా ఉండటమే సాధకుడి నిజమైన సంపద. లౌకిక అవసరాల కోసం దేవుళ్లను మార్చడం సాధకుని లక్షణం కాదు.

లింగోద్భవ ఘట్టం లో విష్ణువు, బ్రహ్మలు కేవలం బాహ్యమైన అన్వేషణతో శివుని ఆద్యంతాలను పట్టుకోలేకపోయారు.

ఎప్పుడు వారు అహంకారాన్ని వదిలి, శరణాగతితో స్తుతించారో అప్పుడే పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు.

కాబట్టి అధికారం, తపస్సు, పాండిత్యం ఉన్నంత మాత్రాన శివపాద భక్తి దక్కదు; పరిపూర్ణమైన అహంకార నాశనం, శరణాగతి ఉన్నవారికే అది సాధ్యమవుతుంది.

చిరం యాచే అన్నారు"నీ పాదసేవను భిక్షగా పెట్టు" అని అడుగుతున్నారు, మోక్షాన్ని అడగకుండా దాస్యాన్ని అడుగుతున్నారు.శివతత్వంలో లీనమైపోవడం కన్నా, నిరంతరం ఆయన పాదదాసుడిగా ఉంటూ భక్తిరసాన్ని ఆస్వాదించడమే పరమోత్కృష్టమైన సాధన అని శంకరుల అంతరంగం.

శంకరుల గొప్పతనం ఇదే అండి అన్ని నాకు ఇవ్వు ఇవ్వు అని స్తోత్రం చేస్తారు,అంటే ఎవరు చదివితే వారికి ఆ చదివే ప్రతి ఒక్కరికి అది లభిస్తుంది. మనం ఇంత గొప్పగా స్తోత్రం చేయలేం, అడగలేము అని అన్ని సిద్ధం చేసి ఇచ్చారు మహానుభావులు.

*🕉️శివాయ నమః.....🙏*

*మళ్ళీ రేపు కలుసుకుందాం మరొక శ్లోకంతో🙏*

  *🌹🌷సేకరణ🌷🌹*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🌹భృగువారం*🌹

 *🪷13నవంబర్26🪷*     

  *దృగ్గణిత పంచాంగం* 

  *🕉️ఈనాటి పర్వం🕉️*     

   *🪱నాగులచవితి🪱* 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు* 

*కార్తీకమాసం - శుక్లపక్షం*

*తిథి : చవితి* రా 08.42 వరకు ఉపరి *పంచమి*

*వారం    :శుక్రవారం*

(భృగువాసరే)

*నక్షత్రం  : మూల* సా 05.17 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : ధృతి* రా (14) తె 05.23 వరకు ఉపరి *శూల*

*కరణం  : వణజి* ఉ 07.24 *భద్ర* రా 08.42 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 08.00 & 09.30 - 10.30*

అమృత కాలం  : *ఉ 10.05 - 11.53*

అభిజిత్ కాలం  : *ఉ 11.29 - 12.14*

*వర్జ్యం   : మ 03.29 - 05.17 & రా 04.08 - 05.56 తె*

*దుర్ముహూర్తం  : ఉ 08.27 - 09.12 మ 12.14 - 01.00*

*రాహు కాలం   : ఉ 10.26-11.52*

గుళికకాళం      : *ఉ 07.35 - 09.01*

యమగండం    : *మ 02.42-04.08*

సూర్యరాశి : *తుల*                            

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.19*  

సూర్యాస్తమయం :*సా 05.41*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం         : *ఉ 06.10-08.27*

సంగవ కాలం        : *08.27-10.43*

మధ్యాహ్న కాలం    : *10.43-01.00*

అపరాహ్నకాలం    : *మ 01.00-03.17*

*ఆబ్ధికం తిధి     : కార్తీక శుద్ధచవితి*

సాయంకాలం       : *సా 03.17-05.33*

ప్రదోషకాలం        : *సా 05.33-08.05*

రాత్రి కాలం          : *రా 08.05-11.27*

నిశీధి కాలం          : *రా 11.27-12.17*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.29 - 05.20*

¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           *🌷ఓం శ్రీ🌷* 

*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*

🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹*

     🙏*న్యాయపతి*🙏 

        *నరసింహారావు*

పంచాంగం 13.11.2026 Friday

  ఈ రోజు పంచాంగం 13.11.2026 Friday

స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం శరదృతువు కార్తీక మాస శుక్ల పక్ష చతుర్థి తిథి భృగు వాసర మూల నక్షత్రం ధృతి యోగః వణిజ తదుపరి భద్ర కరణం.

రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.  

శ్రాద్ధ కర్మ తిథి : చతుర్థి.

నమస్కారః , శుభోదయం.

శ్రీ గురుభ్యోనమః 🙏 13-11-2026 శుక్రవారం రాశి ఫలితాలు

  శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

13-11-2026 శుక్రవారం రాశి ఫలితాలు

మేషం

బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో  అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

వృషభం

అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్త్రా వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి.     

---------------------------------------

మిధునం

వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. మానసికంగా  ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ఖర్చులు చేస్తారు.

---------------------------------------

కర్కాటకం

వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

---------------------------------------

సింహం

వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున  కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.           

---------------------------------------

కన్య

వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి బయటపడతారు. వ్యాపారాలలో అంచనాలను దాటి లాభాలు అందుతాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తిచేస్తారు.               

---------------------------------------

తుల

బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ధనపరంగా ఇబ్బందులను అధిగమించి ఋణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

---------------------------------------

ధనస్సు

అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది.

---------------------------------------

మకరం

ఉద్యోగాలలో  బాధ్యతలను  సమర్థవంతంగా  నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ధనాదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

కుంభం

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.   

--------------------------------------- 

మీనం

ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరో బాధలు పెరుగుతాయి. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. 

---------------------------------------