23, ఏప్రిల్ 2023, ఆదివారం

#మన #వృక్షసంపద ప్రతీ గ్రామంలో, నగరాల్లో, కాలనీల్లో, వీధుల్లో, పొలాల-కాలవ-చెరువు గట్లపై, రోడ్లకి ఇరువైపులా తప్పనిసరిగా పెంచవలసిన చెట్లు 1.వేప 2.రావి 3.మఱ్ఱి 4.మద్ది 5.కానుగ (గానుగ) 6.ఉసిరి 7.జమ్మి 8.చింత 9. సీమచింత 10. నల్లతుమ్మ, తెల్లతుమ్మ 11. సుబాబుల్ 12. అశోక 13. గుల్మొహర్ (తురాయి/ కోడిపుంజు చెట్టు) 14. నేరేడు (జంబూ ఫలం) 15. మారేడు 16.సరుగుడు 17. ఆఫ్రికన్ తులిప్ 18. అడవి లవంగ 19. తాడి 20. జువ్వి 21. నీలగిరి (జామాయిల్/యూకలిఫ్టస్) 22. బాదం 23. వెదురు 24. రబ్బరు 25. కొబ్బరి 26. నల్లతుమ్మ 27. తమ్మ 28. వెలగ 29. పున్నాగ 30. పత్తి 31. ఆముదం 32. అవిసె 33.పల్లేరు 34. గుంటగరగర 35. గచ్చకాయ 36. వామింట 37. మొగలి 38. పనస 39. పంపర పనస 40. ఈత 41. గొబ్బి 42. పూచిక 43. గోరింటాకు 44. పొన్న 45. పొగడ 46. ఇండుప కాయ (చిల్లగింజ) 47. ఇప్ప 48. రేల 49. మోదుగ 50.కుంకుడు 51. శీకాయ 52. చందనం (గంధం) దేవాలయాల్లో తప్పనిసరిగా పెంచవలసిన మొక్కలు (వినాయకచవితికి పత్రిగా ఉపయోగించే 21 రకాల మొక్కలు కనీసం ఆలయాల్లో అయినా పెంచుకోవాలి) #వినాయకచవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు. 1. మాచీ పత్రం (మాసుపత్రి) 2. దూర్వా పత్రం (గరిక) 3. అపామార్గ పత్రం(ఉత్తరేణి) 4. బృహతీ పత్రం (నేలములక,వాకుడాకు) 5. దత్తూర పత్రం (ఉమ్మెత్త) 6. తులసీ పత్రం (లక్ష్మీ తులసి, కృష్ణతులసి..) 7. బిల్వ పత్రం (మారేడు) 8. బదరీ పత్రం (రేగు) 9. చూత పత్రం (మామిడి) 10. కరవీర పత్రం (దేవగన్నేరు) 11. మరువక పత్రం (ధవనం,మరువం) 12. శమీ పత్రం (జమ్మి) 13. విష్ణుక్రాంత పత్రం (శంఖుమల్లె పత్రి) 14. సింధువార పత్రం (వావిలి) 15. అశ్వత్థ పత్రం (రావి) 16. దాడిమీ పత్రం (దానిమ్మ) 17. జాజి పత్రం (జాజి ఆకు) 18. అర్జున పత్రం (మద్ది) 19.దేవదారు పత్రం 20. గండలీ పత్రం (లతాదూర్వా,దేవకాంచనం) 21. అర్క పత్రం(జిల్లేడు) ఇవి కూడా ఆలయాలలో స్థలం ఉంటే పెంచుకోవచ్చు. 1.పారిజాతం 2. మందారం 3. బిళ్ళ గన్నేరు, నిద్రగన్నేరు 4. నూరువరహాలు 5. సంపెంగ 6. ఉసిరి, రాచ ఉసిరి 7.అరటి 8. కొబ్బరి 9. నేరేడు 10. తమలపాకు 11. వేప 12. జామ 13. నిత్యమల్లి 14. రుద్రాక్ష 15. బ్రహ్మకమలం ఇంటి పెరడులో పెంచుకోగలిగిన మొక్కలు #ఔషధ_మొక్కలు 1. తులసి (రామతులసి, కృష్ణతులసి, లక్ష్మీతులసి, పుదీనాతులసి ఇలా 8 రకాలుగా ఉన్నాయి) 2. కలబంద 3. రణపాల 4. వాము 5. నల్లేరు 6. తిప్పతీగ 7.జిల్లేడు 8. నాగజెముడు 9.అశ్వగంధ 10. నిమ్మగడ్డి 11. తమలపాకు 12. బిర్యానీ ఆకు 13. యాలకులు 14. సునాముఖి (దాల్చిన చెక్క) 15. కరక్కాయ 16. గంజేరు 17. సరస్వతి ఆకు 18.అల్లం,శొంఠి 19. పునర్నవ 20. కరివేపాకు 21. మరువము #పూల_మొక్కలు 1. మల్లెలు ( తీగమల్లి, జడమల్లి, బొండు మల్లి) 2. మందారం 3. కనకాంబరం 4. బిళ్ళగన్నేరు (పిచ్చి మొక్క అనుకుంటాం కానీ షుగర్ కి బాగా పనిచేస్తుందట) 5. గులాబి 6. రాధామనోహరం 7.చంద్రకాంత 8.చిలకగన్నేరు 9. నందివర్ధనం 10. నవరత్నాలు 11. నూరువరహాలు 12. బంతి, బంగళాబంతి 13. చామంతి 14. సన్నజాజులు 15. విరజాజులు 16. సీతమ్మవారిజడబంతి 17. సంపెంగ 18. పూల తీగ మొక్కలు (శంఖు పూలు, మాలతీ,గోకర్ణ, కౌరవ-పాండవ పూలు, పింక్ వైన్ ట్రంపేట్, టెకొమో రాడికన్స్, బోగన్ విల్లా,అల్లామందా క్రీపర్, బటానీ పూలు, రంగూన్ క్రీపర్ మొదలైనవి) 19. తామర,కలువ 20.హెలికోనియా 21. లిల్లీ 22. నాచు/గడ్డి గులాబీ 23. తులిప్ 24. ముళ్ళగోరింట 25. నీలమణి(Lavender) 26. మంకెన 27. ప్రొద్దు తిరుగుడు 28. మెక్సికన్ సన్ ఫ్లవర్ 29. బ్రహ్మ కమలం 30. డిసెంబరాలు 31. జర్బరా 32. దాలియా 33. డైసీ 34. తులిప్ 35. ఆర్కిడ్ 36. నైట్ క్వీన్ ఇంట్లో తేలికగా పెంచుకోగలిగిన #ఆకుకూరలు, #కూరగాయలు 1.తోటకూర 2. బచ్చలికూర 3. పాలకూర 4. మెంతికూర 5. చుక్కకూర, గోంగూర 6. పుదీనా 7. కొత్తిమీర 8. ఉల్లి,వెల్లుల్లి 9. చామ, చిలకడ దుంప 10. టమోట, సీమ టమోట 11. బీన్స్ 12. కాకర 13. బీర 14. సొర 15. దోస, బుడందోస 16. కీరాదోస 17. చిక్కుడు 18. వంకాయ 19. పచ్చిమిర్చి 20. మునగ (కనీసం ఈ ఆకులు తినడానికి అయినా పెంచుకోవాలి) 21. వాక్కాయ 22. పొట్లకాయ 33. కాప్సికం 34. గుమ్మడి 35. క్యాబేజీ 36. కాలిఫ్లవర్ 37. బఠాణి పండ్ల మొక్కలు 1. సపోటా 2. సీతాఫలం 3.బొప్పాయి 4. కమల 5. దానిమ్మ 6. నారింజ 7. బత్తాయి 8. పనస 9. పంపర పనస 10. రేగి 11. ఏప్రికాట్ 12. అవకాడో 13. నిమ్మ 14. స్వీట్ లెమన్ 15. మామిడి 16. నేరేడు 17. జామ 18. ఉసిరి 19. అరటి 20. కొబ్బరి 21. ద్రాక్ష 22. అంజీర ఇంటి లోపల పెట్టుకునే ఆక్సిజన్ మొక్కలు 1. వీపింగ్‌ ఫిగ్‌ (#WeepingFig ) 2. మనీప్లాంట్‌ (#MoneyPlant ) 3. స్పైడర్‌ ప్లాంట్‌ (#SpiderPlant) 4. అరెకా ఫామ్‌ ( #ArecaPalm) 5. జెర్బారా డైసీ (#GerberaDaisy) 6. స్నేక్‌ ప్లాంట్‌ (#SnakePlant) 7. పీస్ లిల్లీ (#PeaceLily) 8. కలబంద (#Aloevera) 9. చైనీస్ ఎవర్‌గ్రీన్ (#ChineseEverGreen) 10. ఆర్కిడేసి (#Orchid) 11. బ్రాడ్ లేడీ పామ్ (#BroadLeafLadyPalm) 12. డ్రాగన్ (#DragonPlant) 13. లక్కీ బ్యాంబూ (#LuckyBamboo) 14. తులిప్ (#Tulip) 15. ఫెర్న్ (#Fern) తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట. ఈ వర్షాకాలంలో మీకు వీలైనన్ని మొక్కలు, చెట్లు మీ ఇంట్లో, వీధిలో, ఆలయాల్లో నాటండి. ఇంకా మీకు తెలిసిన చెట్ల, మొక్కలు పేర్లు తెలియచేయండి. వృక్షో రక్షతి రక్షితః - చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. #ధరిత్రి_దినోత్సవం

 #మన #వృక్షసంపద


ప్రతీ గ్రామంలో, నగరాల్లో, కాలనీల్లో, వీధుల్లో, పొలాల-కాలవ-చెరువు గట్లపై, రోడ్లకి ఇరువైపులా తప్పనిసరిగా పెంచవలసిన చెట్లు


1.వేప

2.రావి

3.మఱ్ఱి

4.మద్ది

5.కానుగ (గానుగ)

6.ఉసిరి

7.జమ్మి

8.చింత

9. సీమచింత

10. నల్లతుమ్మ, తెల్లతుమ్మ

11. సుబాబుల్

12. అశోక

13. గుల్మొహర్ (తురాయి/ కోడిపుంజు చెట్టు)

14. నేరేడు (జంబూ ఫలం)

15. మారేడు

16.సరుగుడు

17. ఆఫ్రికన్ తులిప్

18. అడవి లవంగ

19. తాడి

20. జువ్వి

21. నీలగిరి (జామాయిల్/యూకలిఫ్టస్)

22. బాదం

23. వెదురు

24. రబ్బరు

25. కొబ్బరి

26. నల్లతుమ్మ

27. తమ్మ

28. వెలగ

29. పున్నాగ

30. పత్తి

31. ఆముదం

32. అవిసె

33.పల్లేరు

34. గుంటగరగర

35. గచ్చకాయ

36. వామింట

37. మొగలి

38. పనస

39. పంపర పనస

40. ఈత

41. గొబ్బి

42. పూచిక

43. గోరింటాకు

44. పొన్న

45. పొగడ

46. ఇండుప కాయ (చిల్లగింజ)

47. ఇప్ప

48. రేల

49. మోదుగ

50.కుంకుడు

51. శీకాయ

52. చందనం (గంధం)


దేవాలయాల్లో తప్పనిసరిగా పెంచవలసిన మొక్కలు (వినాయకచవితికి పత్రిగా ఉపయోగించే 21 రకాల మొక్కలు కనీసం ఆలయాల్లో అయినా పెంచుకోవాలి)


#వినాయకచవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.

1. మాచీ పత్రం (మాసుపత్రి)

2. దూర్వా పత్రం (గరిక)

3. అపామార్గ పత్రం(ఉత్తరేణి)

4. బృహతీ పత్రం (నేలములక,వాకుడాకు)

5. దత్తూర పత్రం (ఉమ్మెత్త)

6. తులసీ పత్రం (లక్ష్మీ తులసి, కృష్ణతులసి..)

7. బిల్వ పత్రం (మారేడు)

8. బదరీ పత్రం (రేగు)

9. చూత పత్రం (మామిడి)

10. కరవీర పత్రం (దేవగన్నేరు)

11. మరువక పత్రం (ధవనం,మరువం)

12. శమీ పత్రం (జమ్మి)

13. విష్ణుక్రాంత పత్రం (శంఖుమల్లె పత్రి)

14. సింధువార పత్రం (వావిలి)

15. అశ్వత్థ పత్రం (రావి)

16. దాడిమీ పత్రం (దానిమ్మ)

17. జాజి పత్రం (జాజి ఆకు)

18. అర్జున పత్రం (మద్ది)

19.దేవదారు పత్రం

20. గండలీ పత్రం (లతాదూర్వా,దేవకాంచనం)

21. అర్క పత్రం(జిల్లేడు)


ఇవి కూడా ఆలయాలలో స్థలం ఉంటే పెంచుకోవచ్చు.

1.పారిజాతం

2. మందారం

3. బిళ్ళ గన్నేరు, నిద్రగన్నేరు

4. నూరువరహాలు

5. సంపెంగ

6. ఉసిరి, రాచ ఉసిరి

7.అరటి

8. కొబ్బరి

9. నేరేడు

10. తమలపాకు

11. వేప

12. జామ

13. నిత్యమల్లి

14. రుద్రాక్ష

15. బ్రహ్మకమలం


ఇంటి పెరడులో పెంచుకోగలిగిన మొక్కలు

#ఔషధ_మొక్కలు

1. తులసి (రామతులసి, కృష్ణతులసి, లక్ష్మీతులసి, పుదీనాతులసి ఇలా 8 రకాలుగా ఉన్నాయి)

2. కలబంద

3. రణపాల

4. వాము

5. నల్లేరు

6. తిప్పతీగ

7.జిల్లేడు

8. నాగజెముడు

9.అశ్వగంధ

10. నిమ్మగడ్డి

11. తమలపాకు

12. బిర్యానీ ఆకు

13. యాలకులు

14. సునాముఖి (దాల్చిన చెక్క)

15. కరక్కాయ

16. గంజేరు

17. సరస్వతి ఆకు

18.అల్లం,శొంఠి

19. పునర్నవ

20. కరివేపాకు

21. మరువము


#పూల_మొక్కలు

1. మల్లెలు ( తీగమల్లి, జడమల్లి, బొండు మల్లి)

2. మందారం

3. కనకాంబరం 

4. బిళ్ళగన్నేరు (పిచ్చి మొక్క అనుకుంటాం కానీ షుగర్ కి బాగా పనిచేస్తుందట)

5. గులాబి 

6. రాధామనోహరం

7.చంద్రకాంత

8.చిలకగన్నేరు

9. నందివర్ధనం

10. నవరత్నాలు

11. నూరువరహాలు

12. బంతి, బంగళాబంతి

13. చామంతి

14. సన్నజాజులు 

15. విరజాజులు

16. సీతమ్మవారిజడబంతి

17. సంపెంగ

18. పూల తీగ మొక్కలు (శంఖు పూలు, మాలతీ,గోకర్ణ, కౌరవ-పాండవ పూలు, పింక్ వైన్ ట్రంపేట్, టెకొమో రాడికన్స్, బోగన్ విల్లా,అల్లామందా క్రీపర్, బటానీ పూలు, రంగూన్ క్రీపర్ మొదలైనవి)

19. తామర,కలువ

20.హెలికోనియా

21. లిల్లీ

22. నాచు/గడ్డి గులాబీ

23. తులిప్

24. ముళ్ళగోరింట

25. నీలమణి(Lavender)

26. మంకెన

27. ప్రొద్దు తిరుగుడు

28. మెక్సికన్ సన్ ఫ్లవర్

29. బ్రహ్మ కమలం

30. డిసెంబరాలు

31. జర్బరా

32. దాలియా

33. డైసీ

34. తులిప్

35. ఆర్కిడ్

36. నైట్ క్వీన్


ఇంట్లో తేలికగా పెంచుకోగలిగిన #ఆకుకూరలు, #కూరగాయలు

1.తోటకూర

2. బచ్చలికూర

3. పాలకూర

4. మెంతికూర

5. చుక్కకూర, గోంగూర

6. పుదీనా

7. కొత్తిమీర

8. ఉల్లి,వెల్లుల్లి

9. చామ, చిలకడ దుంప

10. టమోట, సీమ టమోట

11. బీన్స్

12. కాకర

13. బీర

14. సొర

15. దోస, బుడందోస

16. కీరాదోస

17. చిక్కుడు

18. వంకాయ

19. పచ్చిమిర్చి

20. మునగ (కనీసం ఈ ఆకులు తినడానికి అయినా పెంచుకోవాలి)

21. వాక్కాయ

22. పొట్లకాయ

33. కాప్సికం

34. గుమ్మడి

35. క్యాబేజీ

36. కాలిఫ్లవర్

37. బఠాణి


పండ్ల మొక్కలు

1. సపోటా

2. సీతాఫలం

3.బొప్పాయి

4. కమల

5. దానిమ్మ

6. నారింజ

7. బత్తాయి

8. పనస

9. పంపర పనస

10. రేగి

11. ఏప్రికాట్

12. అవకాడో

13. నిమ్మ

14. స్వీట్ లెమన్

15. మామిడి

16. నేరేడు

17. జామ

18. ఉసిరి

19. అరటి

20. కొబ్బరి

21. ద్రాక్ష

22. అంజీర


ఇంటి లోపల పెట్టుకునే ఆక్సిజన్ మొక్కలు

1. వీపింగ్‌ ఫిగ్‌ (#WeepingFig )

2. మనీప్లాంట్‌ (#MoneyPlant )

3. స్పైడర్‌ ప్లాంట్‌ (#SpiderPlant)

4. అరెకా ఫామ్‌ ( #ArecaPalm)

5. జెర్బారా డైసీ (#GerberaDaisy)

6. స్నేక్‌ ప్లాంట్‌ (#SnakePlant)

7. పీస్ లిల్లీ (#PeaceLily) 

8. కలబంద (#Aloevera)

9. చైనీస్ ఎవర్‌గ్రీన్ (#ChineseEverGreen)

10. ఆర్కిడేసి (#Orchid)

11. బ్రాడ్ లేడీ పామ్ (#BroadLeafLadyPalm)

12. డ్రాగన్ (#DragonPlant)

13. లక్కీ బ్యాంబూ (#LuckyBamboo)

14. తులిప్ (#Tulip)

15. ఫెర్న్ (#Fern)


తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట. ఈ వర్షాకాలంలో మీకు వీలైనన్ని మొక్కలు, చెట్లు మీ ఇంట్లో, వీధిలో, ఆలయాల్లో నాటండి. ఇంకా మీకు తెలిసిన చెట్ల, మొక్కలు పేర్లు తెలియచేయండి.


వృక్షో రక్షతి రక్షితః - చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది.


#ధరిత్రి_దినోత్సవం ఏప్రిల్ 22



#EarthDay

అరుణాచలం

 🌿🌼🙏 అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని వివరాలు.🙏🌼🌿


🌿🌼🙏1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో, అక్కడికి చేరుకోవడంతోనే, వారి  గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది.🙏🌼🌿


🌿🌼🙏రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి, తిరిగి అక్కడికి చేరుకోవటంతో ఈ పరిక్రమణ  పూర్తి అవుతుందనుకోవద్దు..🙏🌼🌿


🌿🌼🙏మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినా ఖచ్చితంగా, అక్కడ ఒక వినాయకుని గుడి ఉంటుంది... అక్కడ, ఆ స్వామికి నమస్కరించి అక్కడినుంచి కూడా మొదలు పెట్టవచ్చు. అంటే, పరిక్రమణకు ముందుగా వినాయకుని దర్శనంతోనే ప్రారంభించాలి..🙏🌼🌿


🌿🌼🙏2. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి.  మనం గుడిలో ఎలా ప్రదక్షిణ చేస్తామో అలాగే చెయ్యాలి. కుడివైపున  అరుణ గిరికి దగ్గరలో ఉండే కుడి మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు,  సిద్ధులు, దేవతలు, గురువులు మొదలైన వారందరూ ప్రదక్షిణలు చేస్తారట! అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు.🙏🌼🌿


🌿🌼🙏3. అరుణాచలం వెళ్లే ప్రతి వారు ఖచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి.ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు  ఇస్తారు. ఆ విభూది పిల్లలు జడుసుకున్నప్పుడు, కార్యసిద్ధికి పనికివస్తుందని నమ్ముతారు.🙏🌼🌿


🌿🌼🙏4. దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్లేటప్పుడు రెండు చిన్నచిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి . ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు.🙏🌼🌿


🌿🌼🙏5. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘంగా పనిచేస్తుందని చెబుతారు.🙏🌼🌿


🌿🌼🙏6. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుందని చెబుతారు.

ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు.🙏🌼🌿


🌿🌼🙏7. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు గాని, మధ్యలో గాని...  ఎక్కువ ఆహారం తీసుకుని మొదలు పెట్టవద్దు.  భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు.  ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షణ వేగవంతంగా ఉంటుంది. ఆరోగ్యంకూడాను.🙏🌼🌿


🌿🌼🙏8. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షణ చాలా ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుంది. అది నా స్వానుభవం కూడానూ!!🙏🌼🌿


🌿🌼🙏9. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది.వీలైనంతవరకూ,  కూర్చోకుండా నిలబడి గానీ,  తప్పనిసరి పరిస్థితుల్లో బెంచీపై పడుకునిగానీ, చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ పరిక్రమణ చేయండి. కూర్చోవడం అంటూ మొదలు పెడితే, చాలా ఇబ్బందులు ఉంటాయి. కూర్చున్న చోటునుంచి లేవలేము.🙏🌼🌿


🌿🌼🙏10. కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్లే వారు, అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు మూలన స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మాత్రమే మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి,  గోత్ర నామాలు చదివి,  విభూతి ప్రసాదంగా ఇస్తారు. కొబ్బరికాయ లేకపోతే, అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు.🙏🌼🌿


🌿🌼🙏11. ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, దానిని

తప్పనిసరిగా దర్శనం చేసుకోండి.🙏🌼🌿


🌿🌼🙏12. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దపెద్ద  స్తంభాలతో, అతి పెద్ద మండపం ఉంటుంది. ఆ మండపం  పైకి వెళ్లి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది. రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేసారని చెబుతారు. దానిని దర్శించి, కొంచెంసేపు ఆ మంటపంలో జపమో, ధ్యానమో చేసుకుంటే చాలా బావుంటుంది.🙏🌼🌿


🌿🌼🙏13. రాజ గోపురానికి కుడి వైపున ఆనుకొని,  ఒక పెద్ద వేదిక లాగా ఉంటుంది.  అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు ఉండే బృందావనం.🙏🌼🌿


🌿🌼🙏14.  ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం.  ఆ మంటపం, గోపురం, మహా భక్తురాలైన అమ్మాణి అమ్మన్‌,  అనే ఆవిడ కట్టించినట్లు చెబుతారు.🙏🌼🌿


🌿🌼🙏15. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతి పెద్ద కాలభైరవుని విగ్రహంతో ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి.🙏🌼🌿


🌿🌼🙏16.  అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది.  దాని క్రింద రాతితో చెక్కిన అతి పెద్ద త్రిశూలం ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చూసి రండి.🙏🌼🌿


🌿🌼🙏17. ఆ ప్రక్కనే ఉన్న దేవాలయంలో... ఉన్నామలై అమ్మన్ (అపితకుచలాంబ) అమ్మవారిని దర్శించుకుని, ఆ ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు. దక్షణ వేయని, వేయలేని వారికి ప్రక్కనే పళ్ళెంలో కుంకుమ ఉంచుతారు. బొట్టు పెట్టుకొని కొంచెం ఇంటికి కూడా తెచ్చుకోవచ్చును.🙏🌼🌿


🌿🌼🙏18. అగ్ని లింగానికి, రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది.  చాలా పెద్ద విగ్రహం, ఆ విగ్రహం  అత్యంత శక్తివంతమైనదని చెబుతారు.🙏🌼🌿


🌿🌼🙏అరుణాచల శివుడిని దక్షిణామూర్తి స్వరూపంగా  కొలుస్తారు. ఇది అగ్ని లింగం. కనుకనే ఎంత చలికాలంలో వెళ్లినా గర్భగుడిలో విగ్రహ పరిసరాలు, భూమి కూడా వేడిగా ఉంటాయి.🙏🌼🌿


🌿🌼🙏ఒకవేళ,  మీరు గురువారం రోజున అక్కడ ఉంటే  తప్పని సరిగా దీపం వెలిగించండి. ఒక  రూపాయకు శెనగల దండ అమ్ముతారు. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శెనగల దండలను స్వామివారికి సమర్పించండి.  అది స్వామి వారి మీద వేస్తారు.🙏🌼🌿


🌿🌼🙏19. శివసన్నిధి రోడ్ లో కొంచెం ముందుకు వెళ్లి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ప్రశాంతంగా కూడా ఉంటుంది. రమణ మహర్షి వారి ఆశ్రమంలో వలె, ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి.🙏🌼🌿


🌿🌼🙏ఇక్కడ ఉదయం ఉపాహారం, మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు.  దానం మన ఇష్టమొచ్చినంత ఇవ్వవొచ్చు.🙏🌼🌿


🌿🌼🙏విదేశీయులు కూడా మనతో పాటుగా,  సహబంతి భోజనాలు చేస్తారు. మనతో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు. వీలైతే ఎప్పుడూ కూడా కనీసం 

ఒకసారి అయినా అక్కడి ప్రసాదం స్వీకరించండి.🙏🌼🌿


🌿🌼🙏20. ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమం లోనే అవధూత శ్రీ తోప్పి అమ్మాల్ వారు వుంటారు. వారిని ఒకసారి దర్శనం చేసుకొని తరించండి🙏🌼🌿


🌿🌼🙏పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అతి మహిమాన్విత క్షేత్రం తిరువణ్ణామలై అనబడే అరుణాచలం.🙏🌼🌿


🌿🌼🙏అనేక మహిమలు కలిగిన అరుణాచల  గిరిని ప్రదక్షిణం చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం.🙏🌼🌿


🌿🌼🙏సోమవారం నాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను ఏలే శక్తి లభిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏మంగళవారం ప్రదక్షిణం చేస్తే

పేదరికం తొలగిపోతుంది. సుభిక్షంగా వుంటారు. జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది. మహాత్ములు శేషాద్రి స్వాములు వంటి సిధ్ధులు మంగళవారంనాడే గిరి ప్రదిక్షణలు చేసేవారు.🙏🌼🌿


🌿🌼🙏బుధవారం గిరి ప్రదక్షిణం చేస్తే  లలితకళలలో రాణింపు, విజయం లభిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏గురువారం గిరి ప్రదక్షిణం చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏ప్రతి శుక్రవారం గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది.🙏🌼🌿


🌿🌼🙏శనివారాలలో గిరి ప్రదక్షిణం చేస్తే

నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏ఆదివారం నాడు అరుణాచలగిరి ప్రదిక్షణలు చేస్తే కైలాసప్రాప్తి కలుగుతుంది.🙏🌼🌿

  

🌿🌼🙏సంతానహీనులైన భార్యాభర్తలు 48 రోజులపాటు భక్తితో గిరి ప్రదక్షిణలు చేస్తే సంతానభాగ్యం కలుగుతుంది.🙏🌼🌿

            

🌿🌼🙏గిరిని ప్రదక్షిణం చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్య ఫలం లభిస్తుంది. రెండవ అడుగులో పవిత్ర  తీర్ధాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన

పుణ్యం లభిస్తుంది. నాలుగవ అడుగు వేయగానే

అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏తిరువణ్ణామలైలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు చేసి వస్తే పాప విమోచనం లభిస్తుంది.🙏🌼🌿


🌿🌼🙏భరణీ దీపం  రోజున ప్రాతఃకాలమున మూడున్నర ఘంటలకు ఒక సారి, ఏడు గంటలకు ఒకసారి, పగలు 11 గంటలకు ఒకసారి సాయంకాలం

దీపదర్శన  సమయాన  ఒకసారి రాత్రి 11గం.లకు

ఒకసారి అని ఐదు సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే

ఘోర పాపాలన్నీ హరిస్తాయి.🙏🌼🌿


🌿🌼🙏గిరి ప్రదక్షిణం చేసి రాగానే స్నానం చేయడమో.. నిద్రపోవడమో చేయకూడదు.

వాటివల్ల పుణ్యఫలం తగ్గి పాపం ఫలం కలుగుతుంది. భగవన్నామ స్మరణలోనే గడపాలి.🙏🌼🌿


🌿🌼🙏భారత దేశంలో మరెక్కడా లేని విధంగా   అరుణాచలం లో మాత్రమే శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది..🙏🌼🌿


🌿🌼🙏పార్వతి మాత ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.🙏🌼🌿


🌿🌼🙏ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు.. 🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు అమ్మవారు ఇలా అడిగారు "మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునుగు ఎక్కడ నుండి వచ్చింది" అని.. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు..🙏🌼🌿


🌿🌼🙏"పార్వతి.. పునుగు పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని నన్ను అడిగారు.. నేను సరే అన్నాను..


🌿🌼🙏ఇప్పుడు నేను పునుగు పిల్లి దగ్గరకి వెళ్లి ఇలా అన్నాను "పులగా.. నీ నుండే వచ్చే ఆ సువాసన వల్ల రిషి పత్నులు నీ వెంట పడడం జరుగుతుంది.. నువ్వు వెంటనే నీ ప్రాణాలని వదిలేయ్" అని అన్నాడు...🙏🌼🌿


🌿🌼🙏దానికి అదిసరే అని ఒక చిన్నకోరిక కోరుతుంది.. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లిలే..వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించాలి ప్రభూ అని అడుగుతుంది.. అందుకు శివుడు అంగీకరిస్తాడు..🙏🌼🌿


🌿🌼🙏అప్పటినుండి ఆయన తన వంటికి పులుగు అద్దుకోవడంతో ఆ సువాసనకి అమ్మవారు పరవశించి ఉండేది.🙏🌼🌿


🌿🌼🙏అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు..🙏🌼🌿


🌿🌼🙏"స్వామీ.. మీరు కొలువైయున్న ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలంలో ఉండకూడదు.. ఒంటి నిండా నగలు వేసుకోవాలి.. పాములు ఏమి ఉండకూడదు.. నెత్తిన కిరీటం పెట్టుకోవాలి.. పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి.. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్ళి రోజున ఎలా ఉన్నావో అలా ఉండాలి.. అంతే కాదు.. నిన్ను శరణు కోరి వచ్చిన భక్తులు ఎవరైనా సరే వాళ్ళు నిన్ను ఏ కోరిక కోరితే అది వెంటనే నెరవేరిపోవాలి.." అని ఇలా ఈశ్వరుణ్ణి అడగడం జరిగింది.. అందుకే మనకి అరుణాచలంలో స్వామి వారు నిండుగ దర్శనం ఇస్తారు.🙏🌼


🌿🌼🙏అందరం భక్తితో " అరుణాచల శివ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿


అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ

పాదస్పర్శం క్షమస్వమే ll*

 శ్లోకం:☝️

*సముద్ర వసనే దేవీ*

 *పర్వతస్థన మండలే l*

*విష్ణుపత్ని నమస్తుభ్యం*

 *పాదస్పర్శం క్షమస్వమే ll*


భావం: సముద్రమే వస్త్రంగా కల దేవి, పర్వతాలు వక్షఃస్థలంగా కల తల్లి, విష్ణువుకు భార్య అయిన నీకు నమస్కారము. నా కాలితో (నిన్ను) తాకటాన్ని క్షమించు.🙏

*ప్రపంచ ధరిత్రి దినోత్సవం*

250 బియ్యం బస్తాలు

 250 బియ్యం బస్తాలు


పరమాచార్య స్వామివారు రామేశ్వరంలోని శ్రీమఠం శాఖకి బియ్యాన్ని పంపమని 1964 ప్రారంభం నుండే బియ్యం దాతలకు చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా తోచి మేనేజరు కూడా ఎక్కువ బియ్యం నిల్వకి ఏర్పాట్లు చేసాడు. కాని అతను ఈ విషయంలో చాలా అసహాయతతో అప్పుడప్పుడు తన అసహనాన్ని స్వామివారికి గట్టిగానే వినిపిస్తున్నాడు. 


కాని పరమాచార్య స్వామివారు ఈ విషయంలో కాస్త మొండిగా వ్యవహరించి రామేశ్వరంలోని వారి శాఖామఠంలో 250 బస్తాల బియ్యం నిల్వచేసేట్టు చర్యలు తీసుకున్నారు. 1964 డిసెంబరు మాసంలో పెద్ద తుఫాను రామేశ్వరంని తాకింది. 


ఆ తుఫాను దెబ్బకి రామేశ్వరం చేరడానికి ఉన్న ఒక్క మార్గం పంబన్ వారధి ధ్వంసమైంది. ధనుష్కోటి పట్టణం మొత్తం సముద్రంలో కలిసిపోయింది. సముద్రుని అలల ఆవేశం వల్ల రామేశ్వర ద్వీపానికి ఆహారం పంపించడం జరగని పని. 


పరమాచార్య స్వామివారు ముందుచూపుతో రామేశ్వరంలోని మఠంలో నిల్వచేయించిన 250 బియ్యం బస్తాలే ప్రకృతి విలయం దెబ్బకి సర్వం కోల్పోయిన రామేశ్వరంలోని వేలాదిమంది ప్రజలకి ఆహారమై వారి కడుపు నింపింది. 


_/\_ శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే _/\_


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వైశాఖ పురాణం - 3



వైశాఖ పురాణం - 3


3వ అధ్యాయము


వివిధ దానములు - వాని మహత్మ్యములు


నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా? మరి యింకనూ ఉన్నవా? అవి యేవి? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను.


అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును(మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి/బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు/సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును(పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై/చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక, మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును, సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి, తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ, ఉన్ని, గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట/శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ, దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును.


ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు, మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర, తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి, మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను, సుగంధద్రవ్యమును, కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు, ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును.


సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న యిసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు, జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు.


మార్గమున తోట, చెరువు, నూయి, మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము,పరులకుపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు.


సచ్చాస్త్రశ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వర్థరోపణము(రావి చెట్టును నాటుట) పుత్రుడు అను ఏడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు.  వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును.


ఉత్తమములైన పోకచెక్కలు, కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము, రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు, ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు/సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును, అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు.


విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల యాశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.


వైశాఖ పురాణము మూడవ అధ్యాయము సంపూర్ణం.🙏🙏🙏



వైశాఖ పురాణం - 2


2వ అధ్యాయము


వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు


నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు.


నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.


శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు. వైశాఖమాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో యివి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖవ్రతమును పాటించువానికి మాధవార్పితములగావించి భక్షించి ఫలాదులకును శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధికధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములును యెన్నియో యున్నవి. ఆ వ్రతములన్నియు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును. అనగా ముక్తి నీయవు. కనుక నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును.


అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జల దానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునను జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో జలదానమే గొప్పది యగును.


బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు. జలదానము చేసినవారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారులు, సర్వ దేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినంది వరముల నిత్తురు. ఇది నిస్సంశయముగ సత్యము సుమా. దప్పికగలవాడు నీటిని కోరును. ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమటపట్టినవాడు విసురుకొనుటకు విసనకఱ్ఱను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును(నీరుకల చెంబును), గొడుగును, విసనకఱ్ఱను దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును దానమీయవలయును. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై(చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బునుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండ ఆకాశముననే త్రాగి యుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు) జన్మించును.


దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకుడస్సిన వానికి విసనకఱ్ఱతో విసిరి యాదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నందును అట్లు జలము నీయనివారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు. ఎండకుడస్సినవానికి విసురుటకు విసనకఱ్ఱ లేనిచో పైబట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నందును. పరిసుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకఱ్ఱ నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకఱ్ఱనీయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.


గొడుగును దానము చేసినచో ఆధిభౌతిక, ఆధీఅత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగుదానమీయనివాడు, నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులులేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువానిని నిర్మించినవాని పుణ్యపరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున అతిధిగ వచ్చినవానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును.అంబరీషమహారాజా! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు. అలసివచ్చిన బాటసారిని వినయమధురముగ కుశలమడిగి యాదరించినవానిని పుణ్యము అనంతము. ఆకలిగలవానికి, భార్యసంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి యిష్టములు కావు. ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివియన్నియు నిష్టములు ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటె ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానములకంటె నుత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమిన దానము యింతకు ముందులేదు, ముందుకాలమున గూడ నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము, చత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగునవానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరుకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగువానిని యధాశక్తిగ చేయవలయును. రాజా! అన్నమును పెట్టినవాడు తల్లినిదండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రులకంటె నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు(వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు(వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు(అన్ని ధర్మముల నాచరించిన ఫలము) కలుగునని బావము. 


వైశాఖ పురాణము రెండవ అధ్యాయము సంపూర్ణం🙏🙏

న్య‍ాయవ్యవస్థ

 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

దినదినాభివృద్ధి చెందుతున్న మన దేశ న్య‍ాయవ్యవస్థ !!


కొన్ని ఆణిముత్యాల్లాంటి తీర్పులు:


👉అక్రమ సంబంధాలు నేరం కాదు.

👉సహజీవనం నేరం కాదు.

👉పెళ్ళికి ముందు శృంగారం నేరం కాదు.

👉స్వలింగ సంపర్కం నేరం కాదు.

👉స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు.

👉భావప్రకటనా స్వేచ్ఛతో కించపరచడం నేరం కాదు.

👉జాతీయగీతం పాడేటప్పుడు నిలబడకపోవడం నేరం కాదు.

👉అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చెయ్యడం నేరం కాదు.

👉వ్యభిచార గృహానికి వెళ్లిన విటుణ్ని విచారించకూడదు.

👉సెక్స్ వర్కర్స్ ని అరెస్ట్ చెయ్యకూడదు.

👉డ్యాన్స్ బార్లకు అనుమతి.


ఇప్పుడు 👉పెండ్లికి ఆడ మగనే అవసరమా అని వ్యాఖ్య..🤔🤔


ధర్మ ప్రభువులు ఎక్కడ ఉంటారు సామీ మీరంతా ?

ఎక్కడ చదువుకున్నారు ? 


మీలాంటి వారి వల్లే న్యాయం ధర్మం చట్టం వర్ధిల్లుతున్నాయి. 🙏🙏🙏

కనకధారా స్తోత్రం

 కనకధారా స్తోత్రం


అక్షయ తృతీయ రోజున ‘కనకధారా స్తోత్రం’ పఠిస్తే చాలా మంచిది. ఒకనాడు శంక రాచా ర్యుల వారు ఒక ఇంటికి బిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహారపదార్ధాలు లేకపోవడమే కాక,  నిరు పేదరాలు అయిన ఆ ఇంటి ఇల్లాలుకి కట్టుకోడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇళ్ళంతా వెతికిన ఆమెకి ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటునుండే ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకథారాస్తవము ఛెప్పగా ఆ పేదరాలి యింట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. సంప్రదాయం ప్రకారం సాధారణంగా అన్ని ప్రార్థనల, స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని భక్తితో, నియమ నిష్ఠలతో పారాయణం చేయాలి. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా ఈ ఈ స్తోత్రం పఠిస్తే సిరిసంపదలు కలుగుతాయి.


శ్రీ కనకధారా స్తోత్రం


వందే వందారు మందార మందిరానంద కందలం

అమందానంద సందోహ బంధురం సింధురాననం

అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ

భృంగాగనేవ ముకుళాభరణం తమాలం

అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా

మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

 

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని

మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా

సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః

 

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష

మానందహేతు రధికం మురవిద్విషోపి

ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ

మిందీవరోదర సహోదర మిందిరాయాః

 

ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద

మానందకంద మనిమేష మనంగ తంత్రం

ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం

భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః

 

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః

ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ

మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

 

బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరనీలమయీ విభాతి

కామప్రదా భగవతోపి కటాక్షమాలా

కల్యాణమావహతు మే కమలాలయాయాః

 

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్

మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన

మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం

మందాలసం చ మకరాలయ కన్యకాయాః

 

దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా

మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే

దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం

నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

 

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర

దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే

దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః

 

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి

శాకంభరీతి శశిశేఖర వల్లభేతి

సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై

తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః

 

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై

రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై

శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై

పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై

 

నమోస్తు నాళీక నిభాననాయై

నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై

నమోస్తు సోమామృత సోదరాయై

నమోస్తు నారాయణ వల్లభాయై

 

నమోస్తు హేమాంబుజ పీఠికాయై

నమోస్తు భూమండల నాయికాయై

నమోస్తు దేవాది దయాపరాయై

నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై

 

నమోస్తు దేవ్యై భృగునందనాయై

నమోస్తు విష్ణోరురసి స్థితాయై

నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమోస్తు దామోదర వల్లభాయై

 

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై

నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై

నమోస్తు దేవాదిభి రర్చితాయై

నమోస్తు నందాత్మజ వల్లభాయై

 

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని

సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి

త్వద్వందనాని దురితా హరణోద్యతాని

మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

 

యత్కటాక్ష సముపాసనా విధిః

సేవకస్య సకలార్థ సంపదః

సంతనోతి వచనాంగ మానసైః

త్వాం మురారి హృదయేశ్వరీం భజే

 

సరసిజనయనే సరోజ హస్తే

ధవళతరాంశుక గంధమాల్యశోభే

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

 

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం

ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష

లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

 

కమలే కమలాక్ష వల్లబే త్వం

కరుణాపూర తరంగితై రపాంగైః

అవలోకయ మా మకించనానాం

ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః

 

బిల్వాటవీమధ్యలసత్ సరోజే

సహస్రపత్రే సుఖసన్నివిష్టాం

అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం

సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం

 

కమలాసనపాణినా లలాటే

లిఖితామక్షర పంక్తిమస్య జంతోః

పరిమార్జయ మాతరంఘ్రిణాతే

ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం

 

అంభోరుహం జన్మగృహం భవత్యాః

వక్షస్స్థలం భర్తృగృహం మురారేః

కారుణ్యతః కల్పయ పద్మవాసే

లీలాగృహం మే హృదాయారవిందం

 

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం రమాం

గుణాధికా గురుతర భాగ్యభాజినో

భవంతి తే భువి బుధ భావితాశయాః

సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్


ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం