15, ఏప్రిల్ 2024, సోమవారం

నిర్వికల్ప" అనుభవం

 సత్యం ఆధారంగా జగత్తును సృష్టించి అందు వ్యాపించి ధర్మమును నెలకొల్పునది జగదీశ్వరి. అయా దేశములందు పరంపరగా వచ్చినవి ధర్మములు. అట్టి ధర్మముల ఆధారముగా సృష్టిని ఆచరింపజేయునది., వేదములకు విరుద్ధముగాని క్రియలు ధర్మపదముచే చెప్పబడుచున్నది. ఇట్లు సంవర్త స్మృతి యందు గలదు. "దేశదేశములందు పారంపర్యముగా వచ్చిన ఆచారము, వేదములకు విరుద్ధముగానిది ధర్మము అని చెప్పబడుచున్నది" అట్టి ధర్మములకంతట అడ్డులేని ప్రవాహము దేవి స్వరూపము.

"ధర్మము ఆధారముగా గలది, ధర్మము నందు ఉండునది. ధర్మమునందు అంతయు ప్రతిష్ఠితమై ఉన్నది" అని శ్రుతి చెప్పుచున్నది.

ధర్మమునకు ఈమె ఆధారము అని భావము.

ఆమెచే ధర్మము అన్నింటికీ ఆధారముగా చేయబడినది.


ధనమునకు స్వామిని.

ఉపాస్యోపాసకులకు (ఉపాసకుడు కుబేరుడు, ఉపాస్య దేవి) భేదము లేదు కావున కుబేరరూపము గలది).

ధనము అనగా అగ్ని, వాయు, సూర్య, చంద్ర, ఇంద్ర, బృహస్పతి, వసువు, వరుణుడు, సోముడు అని వేదము నందు ప్రతిపాదించబడినది.

పరమేశ్వరిని కోరవలసిన సంపద జ్ఞాన వైరాగ్య సంపద. అందుకే ఆమెను 

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే|

జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ ||

అని ఎల్లప్పుడూ స్తుతింపబడుతుంది

ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులుగా అగ్ని రూపంగా, ప్రాణముగా వాయు రూపంలో, తేజస్సుగా సూర్యరూపంలో, ఆనందము వృద్ధిగా చంద్రుడు రూపంలో, సుఖముగా వసువు రూపంలో, పరిపాలనా సామర్థ్యం గా ఇంద్ర రూపంలో, జ్ఞానము వివేకము గా బృహస్పతి రూపంలో, అమృతము సోమునిగా అన్నింటిలోను అధ్యక్షత వహించి జగత్తును పోషించుచున్నది.ఆదిత్యయోగీ. 


ధనధాన్యములను వృద్ధి పరచునది. తనదే సృష్టించ బడిన జగత్తులకు ఎల్లప్పుడూ ధనము ధాన్యము సమృద్ధిగా ఉండుటకై వాటిని వర్థిల్లచేయునది దేవి. 

అన్నమే పరబ్రహ్మ స్వరూపం. అట్టి అన్నమును వృద్ధి పరచునది.  

సమృద్ధిగా అట్టి అన్నమును పొందిన వారు లేనివారికి దయతో సహకారం చేయువారు ఎల్లప్పుడూ ఆ దేవి అనుగ్రహము వలన సర్వవిధ సుఖములను పొందుదురు...

.

అసలైన సన్యాసి ఎవరు ?


           *నిజమైన సన్యాసి*


*ఒక పడవ నడిపేవాడు ప్రతిరోజూ ఒక సన్యాసిని నదికి ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు తీసుకువెళ్ళేవాడు. ప్రతిఫలంగా సన్యాసి నుండి ఏమీ తీసుకునేవాడు కాదు.


*అతను చాలా సాధారణమైన వ్యక్తి, చదువుకోకపోయినా, ఎలాంటి అవగాహనా లోపం లేదు. సన్యాసి మార్గమధ్యంలో జ్ఞానసంబంధమైన విషయాలను అతనితో పంచుకునేవాడు, కొన్నిసార్లు సర్వాంతర్యామి అయిన భగవంతుని గురించి మాట్లాడేవాడు, మరికొన్ని సమయాల్లో శ్రీమధ్భగవద్గీత శ్లోకాలను అర్థంతో సహా పఠించేవాడు. చేపలు పట్టే పడవవాడు చాలా శ్రద్ధగా వినడం వల్ల, ఆ మాటలు అతని హృదయంలో నాటుకునేవి.


*ఒకరోజు, నది ఆవలి తీరానికి చేరుకున్నప్పుడు, ఆ సన్యాసి పడవ నడిపే వ్యక్తిని తన గుడిసె వద్దకు తీసుకెళ్ళి, ఇలా అన్నాడు: "నాయనా, నేను ఇంతకు ముందు ఒక వ్యాపారిని, చాలా డబ్బు సంపాదించాను, కానీ నా కుటుంబాన్ని ఒక విపత్తు నుండి కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు ఈ డబ్బు నాకు పనికిరాదు, నువ్వు తీసుకో. అది నీ జీవితాన్ని మారుస్తుంది. నీ కుటుంబం కూడా బాగుపడుతుంది."


*పడవవాడు ఇలా చెప్పాడు, "అయ్యో అయ్యవారూ, నేను ఈ ధనం తీసుకోలేను, ఉచితంగా ధనం ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే, అది అందరి స్వభావాలను నాశనం చేస్తుంది, ఎవరూ కష్టపడరు, సోమరితనం జీవితంలో దురాశను, పాపాలను పెంచుతుంది. భగవంతుని గురించి మీరే నాకు నేర్పించారు. మీరు 'సర్వాంతర్యామి ' అని పిలిచేదాన్ని నేను ఈ మధ్య అలలలో కూడా చూస్తున్నాను. నేను ఆయన దృష్టిలో ఉన్నప్పుడు నేను ఎందుకు అవిశ్వాసంగా ఉండాలి? నా పని నన్ను చేసుకోనివ్వండి, మిగిలినది ఆయనకే వదిలివేయండి."ఆదిత్యయోగీ*


*ఈ కథ ఇక్కడతో ముగుస్తుంది, కానీ ఒక ప్రశ్నను వదిలివేస్తుంది! ఈ రెండు పాత్రలలో సన్యాసి ఎవరు?


*దుఃఖం వచ్చినప్పుడు సర్వస్వాన్ని విడిచిపెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు - కాషాయ వస్త్రాలు ధరించి, అన్నీ త్యజించి, ధార్మిక గ్రంథాలను అభ్యసించి, కంఠస్థం చేసి, వాటిని వివరించే స్థితికి కూడా చేరుకున్నాడు. అయినా ధనాన్ని వదిలిపెట్టలేక, అది ఇవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తి కోసం వెతుకుతున్నాడు.


 *మరోవైపు, పేద పడవవాడు ఉన్నాడు. ఉదయం భోజనం చేసిన తర్వాత, తన తరవాతి భోజనం ఎక్కడ నుండి వస్తుందో కూడా అతనికి తెలియదు, అయినప్పటికీ మరొకరి సంపదపై కోరిక లేదు. ప్రాపంచిక వ్యవహారాలలో మునిగిపోయి ఉన్నా కూడా నిర్లిప్తంగా, బంధవిముక్తుడై ఉన్నవాడు. అతను కాషాయం ధరించలేదు, ఏదీ త్యజించలేదు, కానీ దివ్యశక్తిపై అతని విశ్వాసం ప్రబలంగా, స్థిరంగా ఉంది.


*అతను శ్రీమధ్భగవద్గీత సారాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా, దానిని ఆచరణాత్మక జీవితంలో ఎలా అన్వయించుకోవాలో నేర్చుకున్నాడు. ప్రాపంచిక సంపద యొక్క బంధాన్ని క్షణంలో తిరస్కరించాడు.ఆదిత్యయోగీ..


*మనస్సును సమతుల్యం చేసుకోవడమే నిజమైన సాధన...

.

ఒకరు ఒక ప్రశ్నాపత్రాన్ని మహర్షికి సమర్పించారు :


1. భగవంతుడు లోకాన్ని సృష్టించేటప్పుడే ఇంత భిన్నత్వంతో సృజించాడా? లేక ఈ తేడాలన్ని తర్వాత వచ్చాయా?


2. అందరికీ ఒకే దేవుడైతే - మంచీ, చెడ్డా; గుడ్డీ, కుంటీ; జ్ఞానులూ, అజ్ఞానులూ - ఇలా లోకంలో ఇన్ని తేడాలెందుకు ఉన్నాయి?


3. అష్టదిక్పాలకులూ, ముప్పై మూడు కోట్ల దేవతలూ, మహర్షులూ, ఋషులూ వీళ్ళందరూ ఈనాడు కూడా ఉన్నారా?


 కాగితంలోని ప్రశ్నల వంక చూసి మహర్షి ఇలా సెలవిచ్చారు ....


   ఈ సందేహాలు కలుగుతున్నదెవరికి?" అని గనక నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే వాటికి సమాధానాలు వాటంతట అవే నీలో వెలుగుతాయి. ముందు మనల్ని మనం తెలుసుకున్న తర్వాత, భగవంతుడు సృజించిన ప్రపంచం వంక చూస్తే, అప్పుడు సత్యం బోధపడుతుంది. ఈ స్వీయజ్ఞానం లేకుండా లోకం గురించీ, దైవం గురించి తెలుసుకొనడానికి ప్రయత్నించడం అజ్ఞానమే. 


ఇది ఎలా ఉన్నదంటే "పచ్చ కామెర్లు వచ్చినవాడు లోకం గురించి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు ఉంటుంది."


   చిన్న విత్తనంలో పెద్ద మర్రిచెట్టు దాగి ఉంది. ముందు ఏది వచ్చింది? చెట్టా, విత్త అంటే ఏం చెబుతాం? ఇలాంటి ప్రశ్నలకు అసలు నిజమైన సమాధానం ఒకటే; "తననుతాను తెలుసుకున్నవాడికి లోకమే అన్నది లేదు..

.

మనస్సు ఒక్కసారి పుట్టిన తరువాత భగవంతుని తో ఐక్యత చెందే వరకు అదే మనస్సు కొనసాగుతుంది అంటారు సద్గురు ..


ప్రథమంగా ఆత్మ "ఓం" బిందువు నుండి సృష్టి లోనికి ప్రవేశించిన సమయంలో మనస్సు వ్యక్తం అవుతుంది. పిమ్మట లక్షలాది జన్మలు అనుభవం కోసం పొందినప్పటికీ కూడా, లక్షలాది శరీరము లు ధరించిన తరువాత కూడా అదేవిధంగా మనస్సు కొనసాగుతుంది అంటారు సద్గురు ..


చివరికి భగవంతుని తోటి మానవుడు ఉపాధి ఐక్యత చెందే జన్మలో మనస్సు తనది అనబడే ఉనికిని కోల్పోతుంది. అనగా మనస్సు యొక్క ఉనికి పూర్తిగా నశించి పోతుంది. ఇన్ని సార్లు పుట్టడం, ఇన్ని సార్లు మరణించడం అనేది మనస్సు కు ఉండదు. నిర్వాణ చైతన్యం లో మానవ ఉపాధి ప్రవేశం చెందితే మనస్సు మరణిస్తుంది అంటారు సద్గురు..


"నిర్వికల్ప" అనుభవం లోనికి ఆత్మ ప్రవేశం చెందినప్పుడు, మరల మనస్సు, అనంత మనస్సు వలె వ్యక్తీకరణ చెందుతుంది సృష్టిని రక్షించడానికి. అది ఏడవ చైతన్య భూమిక అనుభవం. ఏడవ చైతన్య భూమిక అనుభవం యందు నాలుగు దివ్య యానములు (DIVINE PLANES) ఉన్నవి అంటారు సద్గురు ...

.

మనం మన జీవితంలో మనకు నచ్చినట్లు 

జీవించడం తో పాటు, సక్రమంగా కర్తవ్య బాధ్యతలను నిర్వహిస్తూ, ధర్మబద్ధంగా జీవించాలి.....*

.

Panchaag