20, ఆగస్టు 2022, శనివారం

నిద్ర నియమాలు

 ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు  - 


 *  ఆరోగ్యం , శరీరపుష్టి , రోగము , కృశత్వము , బలము , శరీర బలహీనత , పురుషత్వము , నపుంసకత్వం , జ్ఞానము , అజ్ఞానము , జీవితము , మరణము ఇవన్నియు నిద్రకు అధీనములై ఉన్నవి. అనగా నిద్రపైన ఆధారపడి ఉన్నవని అర్థం.


 *  నిద్రించుటకు రాత్రియే సరైన సమయము . రాత్రి సమయము నందు 6 లేక 9 గంటల కాలం నిద్రించవలెను. కాలాన్ని అతిక్రమించక నిద్రించవలెను. ఒకవేళ రాత్రి సమయము నందు జాగరణ చేయవలసి వచ్చినచో అట్టి జాగరణ ఎంత సమయం చేసినారో అందు సగం సమయం భోజనమునకు పూర్వము నందే ప్రాతఃకాలము నందే నిద్రించవలెను.


 *  రాత్రి సమయము నందు ఎక్కువ కాలం జాగరణ చేసినచో శరీరం నందు రూక్షగుణం ఎక్కువై వాతరోగములు కలుగును.


 *  వృద్దులు , బాలురు , బలహీనులు , ధాతుక్షయం కలవారు , శ్వాస , హిక్కా , అతిసారం , దెబ్బలు తగిలినవారు , శూల , దప్పి , అజీర్ణం , ఉన్మాదం రోగములు కలవారు , అధికంగా మాట్లాడుట , ఆయాసం కలిగించు పనులు , గుర్రము , ఒంటె మొదలగువానిపై స్వారి చేయుట , మార్గగమనము , మద్యములు తాగుట , సంభోగం చేసినవారు , భయం , కోపం , శోకములచే శ్రమ పొందినవారు , ప్రతిదినం మధ్యాహ్నం నిద్రించుట అలవాటుగా గలవారు పగలు నిద్రించవచ్చు. అందువలన దోష , ధాతు సమానత కలుగును.


 *  ఎక్కువైన మేథస్సు , కఫం కలిగినవారు , గట్టిగా ఉండు ఆహారం తీసుకున్నవారు ఎప్పుడూ పగలు నిద్రించకూడదు. ఇటువంటివారు గ్రీష్మకాలం నందు కూడా నిద్రించరాదు . విషపీడితుడు , కంటరోగం కలవాడు రాత్రులయందు కూడా నిద్రించరాదు .


 *  ఆకాలంలో నిద్రించుచున్న ఆరోగ్యమును , ఆయువును నశింపచేయుటయే గాక మోహము , జ్వరం , పీనస , శిరోరగము , వాపు , మూత్రబంధనం వంటిరోగాలు కలుగును.


 *  నిద్రయొక్క వేగమును ఆపుట వలన మోహము , తలబరువు , కండ్లునొప్పులు , సోమరితనం , ఆవలింతలు , శరీరం బరువు పెరగటం వంటివి కలుగును. ఇట్టి స్థితి యందు శరీరమర్ధనం , శరీర అంగములు పిసుకుట , నిద్రించుట చేయవలెను .


 *  రాత్రినిద్ర తక్కువైనచో అట్టికాలములో మరురోజు ఉదయమున భోజనం చేయకుండా నిద్రించవలెను . రాత్రియందు సక్రమముగా నిద్రపట్టనివారు క్షీరము , మద్యము , మాంసరసము , పెరుగు వీనిని తాగవలెను . అభ్యంగనం , స్నానం మొదలగునవి ఆచరించవలెను.


 *  నిద్రించునప్పుడు నిద్రాభంగము కలిగినచో బడలిక , సోమరితనం , తలబరువు , ఆవలింతలు , ఒళ్ళు నొప్పులు , బడలికగా ఉండటం , పనుల యందు ఇష్టం లేకుండా ఉండటం , భ్రమ , అజీర్ణం , వాతరోగములు కలుగును.


 *  కూర్చుండి నిద్రపోయినచో కఫవృద్ధి , ఆరోగ్యభంగం కలుగదు .


            పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

మోక్షం

 మోక్షం 

మన హిందూ ధర్మం ప్రతి మనిషి ఎందుకు జన్మించాడు అనే విషయన్ని కూలంకుషంగా పరిశీలించి ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఏమి ఏమి చేయాలో పేర్కొనటం జరిగింది.  అదే పురుషార్ధంగా తెలిపారు అంటే పురుషుడు (ఇక్కడ పురుషుడు అంటే కేవలం పురుషులని కాదు అది మనుషుల అందరికి వర్తిస్తుంది) సాధించవలసిన విషయాలు అవి 1) ధర్మం,2) అర్ధం, 3) కామం, 4) మోక్షం 

1)  ధర్మం,: ప్రతి మనిషి తనకు నిర్ధేశించిన ధర్మాన్ని ఆచరించాలి.  కృష్ణ భగవానులు గీతలో నీ ధర్మం సరిగా అనుష్టానించదగినది కాక పోయిన ఇతరుల ధర్మం మేలైనది ఐయినా నీవు నీ ధర్మాన్ని ఆచరించాలి అని పేర్కొన్నారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 35 ।। 

గీత అధ్యాయం 3 శ్లోకం .35: ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం (ఇతర ధర్మాన్ని చేయటం) అనుసరించటం ప్రమాదకరమైనది.అనగా ఉదా : ఒక వ్యాపారస్తుడు వున్నదనుకోండి అతను వ్యాపారమే చేయాలి అంతే కానీ చక్కగా వున్నదని ఇతరులకు నిర్దేశించిన ధర్మాన్ని ఆచరించకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తన బాధ్యతను తానూ త్రికరణ శుద్ధిగా ఆచరించటం ఉత్తమం.  ఇతరుల బాధ్యతను స్వేకరించకూడదు. 

ఒక చిన్న కథతో ఈ విషయాన్ని విశదీకరిద్దాం ఒక చాకలి వానికి ఒక కుక్క మరియు గాడిద వున్నాయట.  ఆ రెంటిని  అతను వాని ఇంటి ముందు కట్టి వేసి ఉంచాడట.  ఒక రాత్రి వేళ చాకలి ఇంటికి ఒక దొంగ ప్రేవేశించాడట అది ఆ రెండు చూశాయి.  అప్పుడు గాడిద ఓ కుక్క మిత్రమా మన యజమాని ఇంటిలోనికి దొంగ ప్రవేశించాడుగా నీవు మిన్నకున్నావు ఎందుకు నీవు చూడలేదా అని అడిగింది.  దానికి కుక్క మన యజమాని నన్ను సరిగా చూసుకోవటం లేదు కావట్టి నేను మొరగను అని మొరాయించింది.  యజమానిమీద ప్రేమ వున్న గాడిద నీవు మొరగక పోతేనేమి నేను మన యజమానికి నష్టం జరిగితే నేను ఊరుకోను అని పెద్దగా అరవటం మొదలు పెట్టింది.  ఆ అరుపులకు నిద్రా భంగం అయిన ఆ చాకలి కోపంగా వచ్చి ఒక కర్రతో గాడిదను కొట్టాడు.  ఆ దెబ్బలకి గాడిద  చనిపోయింది. యజమానికి మేలు చేద్దామనుకున్న గాడిద తన చావు తానె కొనితెచ్చుకుంది.  అదే కుక్క మొరిగితే యజమాని జాగ్రత్త పడేవాడు తన సొమ్మును కాపాడుకునే వాడు.  కానీ గాడిద ప్రయతనం ఫలించక పోగా తన చావుకు తానే కారణం అయ్యింది.  ఈ కధ మనకు భగవానులు చెప్పిన శ్లోకానికి అద్దం పట్టినట్లు వుంది. 

2) అర్ధం: అనగా ధన సంపాదన చేయటం. ప్రతి మనిషి కూడా ధర్మంగా వుంటూ తనకు యోగ్యమైన దానినే పరిగ్రహిస్తూ ఉన్న దానింతో తృప్తి చెందుతూ జీవనం చేయాలి.

3) కామం: అంటే కోరికలు ధనం తో కోరికలను తీర్చుకోవచ్చు కానీ తన స్థాయిని మించిన వాటిని ఆశించకుండా ఒక ప్రణాళికా బద్దంగా కోరికలను తీర్చుకోవాలి.

4) మోక్షం:  ముందు మూడు పురుషార్ధాలను ఆచరించి చివరిదయిన మోక్షాన్ని కోరుకోవాలి.  నిజానికి మానవ జన్మ అంతిమ లక్ష్యమే మోక్షం.  ఇతర జీవులకు లేనిది మనుషులకు వున్నది బుద్ది అంటే మంచి చెడులను విచేక్షించే లక్షణం.  అది ఉండటం వలననే మనుషులు తమ విచక్షణతో తన జన్మకు లక్ష్యాన్ని నిర్దేశించుకోగలరు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే   మన మహర్షులు వారి అద్వితీయ, అపార జ్ఞ్యాన సంపదతో తెలుసుకున్న జీవిత పరమావధి మోక్షం. 

మోక్షం కోసం మనిషి మనస్సు వేదాంతం వైపు మళ్ళాలి, వేదాంతం అంటే వేదాలకు చివరన వున్న  జ్ఞ్యానం. అవే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మోక్ష జ్ఞ్యానాన్ని మనకు ప్రసాదించాయి. అవి ఆత్మానాత్మ విచేక్షణ చేసి సాధకుడు ఎలా మోక్షాన్ని సాధించాలో తెలియపరచారి 

మోక్షాన్ని కోరేవారు ముందు అనుసరించవలసినది సాధన చతుష్టయం. అవి 1. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము 2. శమదమాది షట్క సంపత్తి 3. ఇహముష్మిక ఫల భోగ విరాగం 4. వైరాగ్యము. మొదటి మూడింటిని అనుభవంలోనికి తెచ్చుకుంటే నాల్గవదైన వైరాగ్యము కలుగుతుంది.

వైరాగ్యం స్థిరంగా ఉండాలంటే ఆత్మ యొక్క ప్రత్యక్షానుభవం కావాలి. ప్రత్యక్షానుభవం కలగడానికి ఆత్మ వస్తువు కాదు. గురువు వలన తెలుసుకొన వచ్చును గదా అంటే అది పరోక్షానుభుతి అవుతుందిగాని స్వానుభవం కాదు. అట్లని గురువు అవసరం లేదా అంటే అదీ కుదరదు. తమస్సు నుండి జ్యోతిస్సు లోనికి తీసుకొని వెళ్ళేవాడే గురువు. అట్టి గురువులకు గురువైన జగద్గురువు శ్రీ ఆదిశంకరుల వారు చెప్పిన అపరోక్షానుభూతిని పొందాలి. పరోక్షానుభూతి అంటే పంచదార తియ్యగా ఉంది అని ఎవరో చెఫ్పితే నమ్మినట్లు. ఆ పంచదారను మనమే తింటే తియ్యదనం మన అనుభవంలో ఉంటుంది. కాబట్టి గురువు చెప్పిన, చూపిన మార్గంలో స్వయంగా విచారణ చేసి పొందిన స్వానుభవమే అపరోక్షానుభూతి. అది పొందాలి. దానిని స్థిరంగా ఉంచటమే మోక్షం. 

మనకు కలిగే జ్ఞ్యానం పూర్తిగా పరోక్షమైనదే అదెలా అంటే నీవు ఒక విషయాన్ని గూర్చిన జ్ఞ్యానాన్ని పొందవనుకో అది ఏ విషయమైనా కానీ అది నీ కన్నా భిన్నంగా వున్నదే.  కానీ అనుభూతులు మాత్రం ఎవరివి వారివే. ఆలా కాకుండా విషయం దానిని తెలుసుకునే వాడు ఒక్కటే అయితే అదే అపరిక్షానుభూతి అంటే అనుభూతి పొందేవాడు అనుభూతిని ఇచ్చే వస్తువు ఒకటి  అవటం. ఇది తెలుసుకోవటం చెప్పినంత సులువు కాదు.  సాధకుడు తన నిరంతర సాధనతో తెలుసుకోవలసినది మాత్రమే. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ

హిందూ దేశం'

 *'హిందూ దేశం' రాజ్యాంగ ముసాయిదా సిద్దం... ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరణ‌* 

 

కొందరు పీఠాధిపతులు, సాదువులు, హిందుత్వ మేదావులు కలిసి భారత్ ను హిందూ దేశంగా మార్చడానికి కావాల్సిన రాజ్యాంగ ముసాయిదాను సిద్దం చేశారు. ఢిల్లీకి బదులు వారణాసిని దేశ‌ రాజధానిగా డిసైడ్ చేసిన ఆ బృందం ముస్లిం, క్రిస్టియన్ ప్రజలకు ఓటు హక్కును నిరాకరించింది.


భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి కావాల్సిన రాజ్యాంగం సిద్దమయ్యింది. 30 మంది ప్రముఖ, సాధువులు, మేధావులు, ప్రొఫెసర్స్ , పరిశోధకులు ఈ రాజ్యాంగాన్ని సిద్దం చేశారు. ఇప్పుడు ఈ రాజ్యాంగం ముసాయిదాను శాంభవి పీఠాధీశ్వరుడి ఆధ్వర్యంలో 30 మందితో కూడిన బృందం తుదిమెరుగులు దిద్దుతోందని వారణాసికి చెందిన శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆనంద్ స్వరూప్ తెలిపారు. 750 పేజీల ముసాయిదాను సిద్ధం చేసే బృందంలో స్వరూప్ తో పాటు హిందూ రాష్ట్ర నిర్మాణ సమితి చీఫ్ కమలేశ్వర్ ఉపాధ్యాయ, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది బిఎన్ రెడ్డి, రక్షణ రంగ నిపుణుడు ఆనంద్ వర్ధన్, సనాతన ధర్మ పండితుడు చంద్రమణి మిశ్రా, ప్రపంచ హిందూ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ తదితరులు ఉన్నారు


ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రయాగ్ రాజ్ లో జరిగిన ధర్మసంసద్ లో దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని తీర్మానం చేశారు. ఆ మేరకు అందుకు తగ్గ రాజ్యాంగం ముసాయిదా తయారు చేస్తున్నారు. 2023 లో జరిగే ధర్మ సంసద్ లో ఈ రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తారు. "రాజ్యాంగం 750 పేజీలతో ఉంటుంది. దాని వివరాలను విస్తృతంగా చర్చిస్తున్నాం. ధార్మిక పండితులు, వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. దీని ఆధారంగా, ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మాఘమేళా-2023లో సగం రాజ్యాంగం (సుమారు 300 పేజీలు) విడుదల చేస్తాము."అని స్వరూప్ తెలిపారు


విద్య, రక్షణ, శాంతిభద్రతలు, ఓటింగ్ విధానం, ఇతర అంశాలకు సంబంధించిన అంశాలను వివరిస్తూ ఇప్పటి వరకు 32 పేజీలు సిద్ధం చేశామన్నారు. "ఈ హిందూ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం, ఢిల్లీకి బదులుగా వారణాసి దేశ రాజధానిగా ఉంటుంది. అంతేకాకుండా, కాశీ (వారణాసి)లో 'మతాల పార్లమెంటు' నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది" అని స్వరూప్ తెలిపారు. ఈ ముసాయిదా కవర్ పేజీపై 'అఖండ భారత్' మ్యాప్‌ ఉంది. ఆ అఖండ భారత్ లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాలున్నాయి. ''ఏదో ఒక రోజు ఆ దేశాలు మన దేశంలో విలీనం అవుతాయి" అని స్వరూప్ అన్నారు


ఈ పత్రంపై స్వరూప్ మాట్లాడుతూ, ప్రతి కులానికి చెందిన ప్రజలు దేశంలో నివసించే సౌకర్యం ఉంటుందని అలాగే అందరికి భద్రత లభిస్తుందని, అయితే ఇతర మత విశ్వాసాల ప్రజలను ఓటు వేయడానికి అనుమతించరని అన్నారు. *"హిందూ రాష్ట్ర రాజ్యాంగ ముసాయిదా ప్రకారం, ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు ఉండదు* కానీ ఒక సాధారణ పౌరునికుండే అన్ని హక్కులూ ఉంటాయి. వారు తమ వ్యాపారాలు చేయడానికి, విద్యా, ఉపాధిని పొందడానికి అందరితో సమానంగా అన్ని సౌకర్యాలు పొందుతారు." అని స్వరూప్ చెప్పారు.


అయితే హిందువులతో పాటు సిక్కులు, బౌద్ధులు, జైనులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. స్వరూప్ ప్రకారం, ఎన్నికలలో పోటీ చేసే వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించబడింది, 16 సంవత్సరాలు నిండిన తర్వాత పౌరులు ఓటు హక్కును పొందుతారు. మొత్తం 543 మంది సభ్యులు 'మతాల పార్లమెంటు' కోసం ఎన్నుకోబడతారు, కొత్త వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి నియమాలు, నిబంధనలను రద్దు చేస్తుందని, *ప్రతిదీ 'వర్ణ' వ్యవస్థ ఆధారంగా నిర్వహించబడుతుందని చెప్పారు.* త్రేతా, ద్వాపర యుగాల శిక్షా విధానంపై న్యాయవ్యవస్థ ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. "గురుకుల వ్యవస్థ పునరుద్ధరణ చేయబడుతుంది. ఆయుర్వేదం, గణితం, నక్షత్రం, భూ-గర్భ, జ్యోతిష్యం మొదలైన వాటిలో విద్య అందించబడుతుంది," అన్నారాయన. అంతేకాకుండా, ప్రతి పౌరుడు తప్పనిసరి సైనిక శిక్షణ పొందుతారని, వ్యవసాయాన్ని పూర్తిగా పన్ను రహితంగా చేస్తామని ఆయన తెలిపారు. ఇదీ భవిష్యత్తు భారతమని ఈ హిందుత్వ పండితులు చెప్తున్నారు.



 *అనేక హింసలు, దోపిడితో కూడిన వర్ణ వ్యవస్థను మళ్ళీ ప్రవేశపెట్టడానికి, కుల ఆధార శిక్షలతో కూడిన న్యాయవ్యవస్థ* ను తేవడానికి తహతహలాడుతున్న ఈ పండితులకు ఇప్పుడున్న పాలకులు సహకరిస్తారనే నమ్మకం కూడా గాఢంగా ఉంది. రిజర్వేషన్ వ్యవస్థ ను పూర్తిగా నిర్మూలించి కులప్రాతిపదికన కులవృత్తులను ఉద్ధరించడానికి ప్రోత్సాహక వ్యవస్థ చేయనున్నారు. మత ఆధారిత మైనారిటీ రిజర్వేషన్ లు ఉండబోవని స్పష్టం చేసారు. తామంతా ఒకే తాను ముక్కలమని వాళ్ళ భావన. ఇది అమలు జరిపిన మరుక్షణం భారత దేశం విశ్వగురుప్రస్థానం మొదలౌతుందని విదేశాలు ఇప్పటికే దీనిని ఆపడానికి రకరకాలుగా కుట్ర లు చేస్తున్నారు.

ఇది ఆమోదించబడటం ఇక లాంఛనప్రాయమే.

 1.The stomach gets scared when you don't eat breakfast.


2. The kidneys are afraid when we don't drink enough  of water in 24 hours.


3.The gallbladder is scared when you don't sleep until 11pm and you don't wake up at sunrise.


4) The small intestines get scared when eating cold and late food.


5) The colon gets scared when you eat too much fried and spicy food.


6) Lungs deteriorate when you breathe in smoke and dirty ambient air


7) The liver is just in shock from heavy fried food.


8) The heart gets scared when it eats food with a lot of salt and cholesterol.


9) The pancreas is afraid when you eat too much sugar.


10) The eyes get sick when working with a cell phone or computer screen in the dark.


11) The brain gets scared when you start thinking negative thoughts.


Take care of your organs and don't scare them!

All these organs are not available on the market.😄😄🚲🚲

కృష్ణ" నామం

 శ్లోకం:☝️

అగ్రాహ్యః శాశ్వతః *కృష్ణో*

  లోహితాక్షః ప్రతర్దనః l

వేధాః స్వాంగో జితః *కృష్ణో*

  దృఢః సంకర్షణోచ్యుతః ll


భావం: విష్ణు సహస్రనామ స్తోత్రంలో "కృష్ణ" నామం రెండుసార్లు వస్తుంది. ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు. వాటిలో కొన్ని ..

1) సృష్ట్యాది లీలావిలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు.

2) నల్లని వర్ణము కలవాడు.

3) నీలమేఘ శ్యాముడు.

4) తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు.

5) నాగలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు.

6) కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు. వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయము కలిగించి జ్ఞానమును పండించువాడు.


*అందరికీ వైష్ణవాగమము ప్రకారం శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!*🙏

శుద్దమైన నూనెలను

 వాత, పిత్త, కఫ దోషాలకు--మన వంట నూనెల నివారణం.


       మహర్షి వాగ్బటాచార్యులంటారు జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన వంట నూనెలను వాడవలెను. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనే ( Non Refined Oil ) . నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది , బాగా జిగురు , జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది . నూనెలో ఉండ వలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధము , ప్రోటీన్స్ . ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు . నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ ( Refined ) చేసినపుడు జిగురు , వాసన పోతాయి . ఇక అందులో ఉండేది నూనె కాదు నీళ్ళే .


      ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్ , చెడ్డ కోలెస్ట్రాల్ వుండదు . మనము తీసుకొనే ఆహారము మరియు నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది . మనము శుద్ధమైన నూనె ( Non Refined Oil ) తీసుకున్నప్పుడు మన శరీరంలో *లివర్* సహాయంతో మంచి కొలెస్ట్రాల్ ( H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి . 


      భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు . రిఫైండ్ నూనె చేసేటప్పుడు  6 రకాల హానికరమైన కెమికల్స్ , డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడుతారు . ఈ కెమికల్స్ ముందు ముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి . ఈ రిఫైండ్ అయిలో మన శరీరానికి కావలసిన జిగురు , వాసన , ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. చాలా హానికరమైన ఎటువంటి రిఫైండ్ ఆయిల్స్ వాడకూడదు . 


     వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె , పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి , కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనది బెల్లం , తేనె. కుస్తీపట్లు , దండీలు , బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది . 


      రోగాలకు రాజు వాతరోగాలు. 

మోకాళ్ళ నొప్పులు , నడుం నొప్పి , మెడనొప్పులు , హార్ట్ ఎటాక్ , పక్షవాతము , బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవటం వల్ల కానీ లేదా చెడిపోవటం వల్ల కానీ కలుగుతాయి . 


       జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్దమైన నునెలు ( Non -Refined )  వేరు శెనగ నూనె , కొబ్బెర నూనె , కుసుమల నూనె , నువ్వుల నూనె మరియు ఆవాల నూనెలు మాత్రమే వాడవలెను . 


      ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలను ( Sun flower seeds )  గేదలకు మరియు పశువులకు మాత్రమే పెట్టదగినవి . మనకు ఏ మాత్రము ఈ Sun flower oil  వాడదగినది కాదు , ఆరోగ్యకరము కాదు . 


      ఈ రిఫైండ్ ఆయిల్స్ ( Refined oils)  ఎంత మాత్రమూ వాడతగినవి కాదు .  


        సోయాబీన్స్ , సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు . పందులు తినతగినవి ఈ సోయాబీన్స్ , ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని అరగించు కోగలవు . మనుష్యులలో ఈ సోయాబీన్స్ ని అరిగించే ఎంజైమ్స్ లేనే లేవు . కావున వీటిని వాడరాదు . వీటిని వాడిన యెడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి .


      పామోలిన్ అయిల్ కూడా చాలా హానికరమైన అయిల్ . వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకుము వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలము. ప్రస్తుతము చాలా రోగాలకు మూలము ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేదించినారు . వారు ఏ విధముగా కూడా ఈ పామోలిన్ వాడటం లేదు . ప్రపంచములో ఒక్క భారత దేశములో మాత్రమే ఉపయోగిస్తున్నారు . 


      విదేశీయులకు భారత దేశము ఒక ప్రయోగశాలగా మారింది. కావున మనము మన సంపూర్ణ ఆరోగ్యము కొరకు త్యజించ వలెయును . 

      *శుద్దమైన నూనెలను* వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు.


*గమనిక :-   సన్ ఫ్లవర్ ఆయిల్ ( Sun Flower Oil ),  సోయాబిన్ ఆయిల్ ( Soya Bean Oil ) , పామోలిన్ ఆయిల్ ( Pamolene Oil )  ఈ నూనెలు వాడరాదు*. 


          *శ్రీ రాజీవ్ దీక్షిత్*

ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -5

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -5


అందరూ ఆనందంలో మునక లేస్తుంటే, ఆ చిన్నపిల్లకు సిగ్గూ, ఏడుపూనూ. అయితే ఆనందం లేదా అంటే ఈ సిగ్గూ దుఃఖాలకు సమానంగా అదీ మనసులో ఉన్నదట. ముసలి వగ్గు అయిన తరువాత అంటే 50సంవత్సరాల తరువాత ఈ కథ చెప్పేటప్పుడు కూడా ఆమె ఈ మిశ్రమ భావనలతో సతమతమవుతూ అనుభవిస్తూ చెప్పారు. అదీకాక మొదట్లో తనకు అప్పట్లో తెలియని తన భర్త గొప్పదనాన్ని ఎంతో గర్వంగా కూడా చెప్పుకొన్నారు. 


శ్రీమఠానికి రాజుగారు చేసిన మర్యాదలకు శిఖరంగా పీఠం కుంభకోణానికి బయలుదేరే ముందు స్వామివారికి కనకాభిషేకం చేశారు. వారిని ఆహ్వానించడానికే డబ్బు లేదని చెప్పిన రాజుగారు స్వర్ణ పుష్పాలతో స్వామి నిండి పోయేంతవరకూ అభిషేకం చేశారు. ద్వితీయుల శ్వాస ఆశ్చర్యంతో నిలిచిపోయినంత పని అయింది. వారి ఆనందానికి అంతే లేదు. 5000 వరహాల బంగారం (సుమారు పదికిలోలు) జంబుకేశ్వరంలో చేసిన అప్పంతా ఈ బంగారంతో తీర్చి వేయవచ్చు. అలానే కుంభకోణం చేరిన వెంటనే జంబుకేశ్వరపు అప్పులు తీర్చివేశారు. మిగిలిన బంగారాన్ని నవనిధులను కాపాడే నాగుపాము వలె కాపాడుతూ వచ్చారు ఈ ద్వితీయులు. 


స్వామివారికి కూడా అమ్మవారి దయతో అప్పు తీరిందనే తృప్తి. కామాక్షి అఖిలాండేశ్వరీ అమ్మవార్ల కార్యాలు తన హయాంలో పూర్తీ చేయగలిగాననే సంతృప్తి. ఆ తరువాత రెండు మూడు సంవత్సరాల్లోనే స్వామివారు పరిపూర్ణ తృప్తి పదాన్ని పొందారు. రాజదృష్టియే దోషమంటారు. రాజుగారి చేత అత్యంతమైన మర్యాద పొందినందుననే ఈ రకంగా అయిందని ఊరిలో చెప్పుకొన్నారు. సిద్ధి పొందక ముందే స్వామివారు తమ వారసుని, తరువాతి పీఠాధిపతిని నియమించారు. వారెవరో కాదు శంకర మఠంలో పూజ చేస్తూ శ్రీమఠ ముద్రాధికారిగా తిరువడైమరుదూరులో స్థిరపడిన మన ద్వితీయుల అన్నగారి కుమారులే. 


వారు బాల్యంలోనే పాండిత్యంలోనూ, దాన ధర్మాలలో ధారాళమయిన బుద్ధి కలవారుగా ప్రసిద్ధి పొందారు. చిన్నప్పటి నుండి మహాపండితులు, దానశూరులు అయిన మహారాష్ట్ర పండితుల మధ్య పెరిగి ఉండడం వీరిలో ఈ గుణాలు పరిడవిల్లడానికి కారణమయి ఉండవచ్చు. పీఠమునకు వచ్చిన తరువాత వీరి పాండిత్యము దాన శూరత మరింత పరిడవిల్లినవి. పూజా కల్పములో చెప్పిన విధముగా ప్రతిదినము త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరులను కొంగ్రొత్త ద్రవ్యములతో పూజించుట, ఔత్తరాహిక భక్షణములు వివిధములు పుష్కలముగా చేయించి నైవేద్యములు చేసి, మహా సంతర్పణాదులు చేయించుట, పేదలకు అన్న వస్త్రాది దానములెన్నో చేయుట, విద్వత్సదస్సులు, శాస్త్ర గోష్ఠులు జరిపించి శాస్త్ర విచారమూ పండిత సన్మానాదులు చేయుట, మొదలుగా గల మహత్కార్యములలో కాలము గడపజొచ్చినారు. 64వ ఆచార్యుల వలె వీరు ఆజానుబాహువులు కానప్పటికీ, తేజో గాంభీర్య విశేషము చేత శీఘ్రముగానే సర్వ జన ప్రియులయినారు. వీరి మూలముగనే శ్రీమఠము రెండవ తూరి ఖైదు అయినది. ఖైదు చేసినది అదే తంజావూరు సిపాయిలు. అయితే పోయినసారి రాజావారి ఆజ్ఞానుసారం జరిగింది. ఈసారి ఇంకొకరు ఆజ్ఞ చేసినారు. వారెవరో తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మన కథలో ముఖ్య పాత్ర. శ్రీమఠమే ఊపిరిగా జీవిస్తున్న ద్వితీయులే పోయిన సారి మార్గమధ్యంలో మఠం నిర్బంధించబడినది. ఏ కారణాన ఈ ద్వితీయులే సాహసానికొడిగట్టారని మీకు ఉత్సుకతగా ఉన్నది కదా!


ధనం విలువ, దాని ఆవశ్యకత. అది లేనందువల్ల పడవలసిన కష్టములు తెలిసిన వారు కదా. ఈ ద్వితీయులు? క్రొత్త స్వామి ఆదాయవ్యయములు చూడకుండా దానధర్మములు విరివిగా చేయనారంభించారు. మధ్యకాలంలో పోగు చేయబడిన డబ్బంతా కరిగిపోయింది. తంజావూరు ఊరేగింపులో సమర్పింపబడిన వెండి అంబారీ వెండిని తొలగించి అమ్మివేసి ఆ డబ్బు కూడా దానం చేసేశారు. ద్వితీయులు ఈ క్రొత్త స్వామివారికి పూర్వాశ్రమపు పినతండ్రి అయి ఉండటాన శ్రీమఠ శ్రీకార్యం చూసేవారు చెప్పవలసిన విధంగా నైనా చెప్పజాలని సున్నితస్థితి ఏర్పడింది. ద్వితీయులు తీవ్రంగా ఆలోచించారు. స్వయంగా స్వామి వారితో తలబడితే వారికీ వీరికీ కూడా మొహమాటంగా ఉంటుంది. అందువల్ల మొరటు కార్యక్రమమే చేయాలి అనుకున్నారు. మనకోసం చేయడం లేదు. భగవత్పాద పీఠంకోసం చేస్తున్నాము. అందువలన మర్యాదాతిక్రమం చేశామనే చెడు పేరు వచ్చినా ఫరవాలేదని సిద్ధపడ్డారు.


వీరు తంజావూరు సంస్థాన ‘హేజీబు’ కదా! నేరుగా రాజావారికి మఠమునకు 12మంది సిపాయిలు కావాలని సందేశము పంపారు. రాజావారికి వీరి వాక్కు వేదవాక్కు అయినందువలన కారణమడుగకుండానే సిపాయిలను పంపారు. సాధు బ్రాహ్మణుడయిన ఈయన మిలటరీ చర్య తీసుకొన్నారు. మఠంలో మహారాజా వారిని తొలగించి వారి స్థానే సిపాయిలను నియమించారు.


సన్నిధానము వారి బాల హ్రుదయాన్నికరిగించి అబద్ధాలో నిజాలో చెప్పి వారివద్ద నుండి ద్రవ్యము సంగ్రహించే వారిని ఆపడమే వీరి ఈ ఏర్పాటులోని మర్మం. మఠంబాగుచేస్తున్నానని చెప్పుకుంటూ తానీ పని చేయడమే తప్పు. అందులో మఠసిబ్బందిని స్వామివారికి వ్యతిరేకంగా ప్రోత్సహించడం మరింత తప్పు. ఇది యోచించే రాజ సేవకులను పిలిపించారు. వారితో “నే చెప్పేవారిని తప్పించి ఇతరుల నెవరినీ లోనికి పంపరాదు” అని కట్టుదిట్టమైన ఆజ్ఞ చేశారు. సిపాయిల పహారా అనగానే స్వామి వద్ద వంచన మాటలతో మోసపుచ్చి ద్రవ్యం సంగ్రహించి వారు భయపడతారు కదా అని ఆయన అభిప్రాయం. ఈ నడవడి చూసి ఊరంతా గడగడలాడింది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వివాహము

 భార్య గురించి, భార్యాభర్తల సంబంధం గురించి మహాస్వామి వారు:: 


వేదము ప్రతిపాదించిన శాస్త్రకర్మలు చేసితీరవలసిందే. ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమము తరువాత వేరొకరి సహాయం తీసుకొనవలసిందే. ఆ సహాకురాలు నీకు భగవంతుడు ఇచ్చిన బహుమానం. అది ఎప్పటికి నీనుండి విడదీయలేని ఆస్తి. ఆమె ఉపయోగం నీకు కేవలం వండిపెట్టడానికి, నీ ఇంద్రియాలకు తృప్తి నివ్వడానికి మాత్రమే కాదు. ఆమెను “ధర్మ-పత్ని”, “యజ్ఞ-పత్ని” అని శాస్త్రాలు కొనియాడాయి. కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి. భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం. ధర్మపత్నిగా ధర్మాచరణయందు ఆయన పక్కన ఉండాలి. మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞయాగాది క్రతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ ఆయనకు సహాయం చెయ్యాలి. 


ఆమె తన భర్తకు కేవలం వంట చేసి, అతని ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చినా ఆమె ప్రపంచ క్షేమాన్ని కోరుకున్నట్టే. అది ఎలాగంటే ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చెయ్యదు. ఆమె చేసిన వంట వల్ల అతిథులు, అన్నార్తులు, పశుపక్ష్యాదులు కూడా ఆధారపడతాయి. ఇలా ఆమె వల్ల ‘అతిథిసేవ’ ‘వైశ్వేదేవము’ కూడా జరుపబడతాయి. ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలములు కాదు. ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది. కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాలకోసమే. ప్రపంచంలోని ఏ ఇతర ధర్మము వివాహ వ్యవస్థకి ఇంతటి లక్ష్యం ఆపాదించలేదు. 


మన సనాతన ధర్మంలో స్త్రీపురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ సుఖాలకోసం కాదు. ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి, మానవ ఉద్ధరణ లభిస్తాయి. వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి కాని మన వివాహ వ్యవస్థ అంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది. మన సనాతన ధర్మంలో వివాహం, భర్తను ఉత్తమ స్థితికి తీసుకునివెళ్ళి భార్యకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే. ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సంప్రాదాయాలలో లేదు. వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సమాజిక ఒప్పందం మాత్రమే. కాని ఇక్కడ వారిది ఆత్మ సంబంధం. కాని ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాలనుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయ్యుండాలి. ఇందులో విడాకులు అన్న పదానికి తావు లేదు. అది తలవడం కూడా పాపమే.


మూడు ముఖ్యమైన సంస్కారములు కలగలిసి వివాహము అనే సంప్రదాయం ఏర్పడింది. మొదటిది వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు, సహాయకురాలు ఏర్పాటు చెయ్యడం. ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదికధర్మాచరణకు తోడ్పాటునివ్వడం. రెండవది మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం. వారి వల్ల ఆ వంశపు వైదికసంస్కృతి పరిఢవిల్లుతుంది. మంచి వ్యక్తులుగా ఎదిగి సంఘానికి మేలుచేసే సంతానం అవుతారు. మూడవది స్త్రీకి ప్రాపంచిక ఉనికినుండి విముక్తినివ్వడం. ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది. అలా చేయడం వలన ఆమె పూర్తిగా భర్తకు అంకితమై అతనికంటే పైస్థాయిని పొందుతుంది. నాలుగవది పైమూడు విషయాలకోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం.


కాని ఇప్పుడు మనం పై మూడింటిని మరచిపోయాము. మిగిలినది నాలుగవది ఒక్కటే శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం. ఎల్లప్పుడూ అసత్యమైన ఈ శరీరమును సుఖింపచేయడం. మీరు నా సలహా పాటించి శాస్త్రము చెప్పిన ఉన్నతమైన ఆదర్శాలకొరకు సశాస్త్రీయ వివాహము చేసుకొన్న ఆత్మోన్నతి తప్పక పొందెదరు. చంద్రమౌళీశ్వరుడు మిమ్ము కాపాడుగాక !!!


బాలస్థావత్క్రీడాసక్తః తరుణస్థావత్తరుణీసక్తః

వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః ||


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం