20, ఆగస్టు 2022, శనివారం

కృష్ణ" నామం

 శ్లోకం:☝️

అగ్రాహ్యః శాశ్వతః *కృష్ణో*

  లోహితాక్షః ప్రతర్దనః l

వేధాః స్వాంగో జితః *కృష్ణో*

  దృఢః సంకర్షణోచ్యుతః ll


భావం: విష్ణు సహస్రనామ స్తోత్రంలో "కృష్ణ" నామం రెండుసార్లు వస్తుంది. ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు. వాటిలో కొన్ని ..

1) సృష్ట్యాది లీలావిలాసముల ద్వారా సచ్చిదానంద క్రీడలో వినోదించువాడు.

2) నల్లని వర్ణము కలవాడు.

3) నీలమేఘ శ్యాముడు.

4) తన అనంత కళ్యాణ గుణములతో భక్తులను ఆకర్షించువాడు.

5) నాగలివలె భూమిని దున్ని జీవ సమృద్ధి కలిగించువాడు.

6) కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు. వ్యాసునిగా వేదములను విభజించి భక్తులకు మనోవ్యవసాయము కలిగించి జ్ఞానమును పండించువాడు.


*అందరికీ వైష్ణవాగమము ప్రకారం శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!*🙏

కామెంట్‌లు లేవు: