2, అక్టోబర్ 2023, సోమవారం

Architecture in temple

 Architecture

Butterflies

Coil

Mandir

 https://youtube.com/shorts/CMGlUkJKsJI?si=CGWf9--2hOr2ou6N

Welding

Earth point

 Earth point

Wings

⚜ శ్రీ గౌరీశంకర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 196

⚜ ఢిల్లీ : చాందిని చౌక్

⚜ శ్రీ గౌరీశంకర్ ఆలయం

💠భారతదేశంలోని పురాతన నగరాలలో ఢిల్లీ ఒకటి. 

ఈ నగరాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజల వస్తుంటారు. 

ఢిల్లీలో హిందువులు మరియు ముస్లింల మిశ్రమ సంస్కృతి కనిపిస్తుంది. 

చరిత్ర పుటల్లో ఢిల్లీకి ముఖ్యమైన స్థానం ఉంది. ఇక్కడ ముస్లిం సమాధులు కాకుండా, అనేక హిందు పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.

💠 ఢిల్లీలో శైవమతం యొక్క అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో గౌరీ శంకర్ ఆలయం ఒకటి.

800 సంవత్సరాల పురాతన గౌరీ శంకర్ దేవాలయం చాందినీ చౌక్‌లోని ప్రధాన పాత ఢిల్లీ రహదారిపై దిగంబర్ జైన్ లాల్ మందిర్ సమీపంలో ఉంది.  

ఈ ఆలయంలో 800 సంవత్సరాల నాటి గోధుమ శివలింగం కలదు

💠 ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 

ఒకసారి, మరాఠా వంశానికి చెందిన ఒక పోరాట యోధుడు అప గంగాధర్   , శివుడిని ఆరాధించేవాడు.

అతను యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. తాను బ్రతకాలంటే గౌరీ-శంకరుల ఆలయాన్ని సుందరంగా నిర్మిస్తానని శపథం చేశాడు. 

అతను అన్ని అనారోగ్య లక్షణాలను వ్యతిరేకంగా జీవించి, క్రమంగా హాయిగా ఆరోగ్యంగా  మారాడు.ఋ తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, అతను ఆలయాన్ని నిర్మించాడు మరియు తరువాత 1959 సంవత్సరంలో సేథ్ జైపురియా ద్వారా భవనం పునరుద్ధరించబడింది.

అక్కడ కొన్ని హనుమాన్ మరియు ఇతర హిందూ దేవతల విగ్రహాలు ఉన్నప్పటికీ, ఈ ఆలయం ప్రధానంగా గౌరీ మరియు శంకర్‌లకు ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ పరమశివుని అర్ధనారీశ్వరుడు దర్శనమిస్తాడు.

💠 ఆలయ మేనేజర్ పండిట్ తేజ్ ప్రకాష్ శర్మ ఆలయానికి సంబంధించిన మరో కథను ప్రస్తావించారు. 

మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఇక్కడ పరిపాలించినప్పుడు, ఆలయ గంటల శబ్దంతో అతని నిద్ర చెదిరిపోయింది. దీని తర్వాత, ఔరంగజేబు ఆలయంలోని గంటలను తొలగించాలని ఆజ్ఞ జారీ చేశాడు.

దీని తరువాత, ఆలయంలో గంటలు తొలిగించారు.

💠 అయితే గంటలు లేనప్పటికీ, గంటల శబ్దం వినబడటం ఔరంగజేబును ఆశ్చర్యపరిచింది. స్వయంగా ఆలయానికి చేరుకున్నప్పుడు అక్కడ గంటలు లేవు అయినా అతనికి శబ్దాలు వినిపించాయి. 

దీని తర్వాత ఔరంగజేబు మరో పరీక్ష పెట్టాడు.

ఉదయాన్నే ప్లేటులో పచ్చి మాంసం వడ్డించి పంపాడు. శివుని ముందు పళ్ళెంపై కప్పి ఉన్న గుడ్డ తీయగానే, పళ్ళెం నిండా పూలతో నిండిపోయింది.

అంతటితో ఈ ఆలయం జోలికి ముస్లింలు రాకుండా శాసనం చేసాడు.

💠 ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం  800 సంవత్సరాల నాటివని భావిస్తారు.  శివుడు, అతని భార్య పార్వతి మరియు వారి ఇద్దరు కుమారులు గణేశుడు మరియు కార్తీక్ విగ్రహాలు కాకుండా, గోడలపై వేలాడుతున్న వెండి చిత్రాలు మరియు శివుని జీవితంలోని దృశ్యాలను వర్ణించడం ప్రధాన ఆకర్షణలు. 

 సోమవారాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.

 💠 నిజమైన బంగారు ఆభరణాలు ధరించిన శివుడు మరియు పార్వతి మూర్తులు వెండి పందిరి క్రింద లింగం వెనుక ఉన్నాయి.  

లింగం పైన కూడా ఒక వెండి నీటి పాత్ర ఉంది, దాని నుండి నీటి బిందువులు నిరంతరంగా వస్తాయి.

💠.ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం శివరాత్రి .

ఈ పండుగ సమయంలో ఇది గొప్పగా అలంకరించబడి భక్తి కార్యక్రమాలతో నిండి ఉంటుంది.  

శివుని రోజు అయిన సోమవారాల్లో ప్రత్యేకంగా ఆలయాన్ని సందర్శించవచ్చు. 

 ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది మరియు అన్ని కులాలు మరియు మతాల సందర్శకులను స్వాగతిస్తుంది.

💠 ఆలయం లోపల వాతావరణం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా మరియు సంయమనంతో ఉంటుంది. 

యోగులు 'ఓం నమః శివాయ' అని మృదువుగా జపించడం చూడవచ్చు, అయితే ఇతర వ్యక్తులు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం చూడవచ్చు.

💠 తెల్లవారుజామున హారతి సమయంలో లింగాన్ని పాలు, నీటితో స్నానం చేయించి అందమైన పూల అలంకారం చేస్తారు.

 ఆ సమయంలో శక్తి విపరీతంగా ఉంటుంది మరియు ప్రతిధ్వనులు అపారంగా ఉంటాయి.

💠 పూర్వం ఈ ఆలయం ఉన్న చోట యమునా నది ప్రవహించేది. ఇక్కడే భక్తులు ముందుగా స్నానమాచరించి నదిలోని ఒక కుండలో నీటిని తీసుకుని శివునికి సమర్పించి ఆ మట్టిని తలపై పూసుకుని శివుని ఆశీర్వాదం పొందుతారు.

💠 మహాశివరాత్రి సందర్భంగా భోలేనాథ్ నాలుగు రూపాలను కొనియాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా పురాతన గౌరీ శంకర్ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పండిట్ తేజ్ ప్రకాష్ శర్మ తెలిపారు. 

💠 ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం ఏమిటంటే.. ఎవరైతే తన కోరికతో ఇక్కడికి వచ్చినా దేవుడు ప్రతి కోరికను నెరవేరుస్తాడని భక్తులు చెబుతున్నారు.

పాండవులు ఆయుధాలు

 *పాండవులు ఆయుధాలు జమ్మిచెట్టు పైనే ఎందుకు దాచారు*?

ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు.

జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.

జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.

ఆంధ్రవ్యాసుల వారిని ఒక సారి ఒకభక్తుడు జమ్మిచెట్టు గురించి ప్రశ్నించాడు. పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా అని అడిగాడు.

దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది.

జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్త్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు.

రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే.

ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.

దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.

నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.

సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.

ఒక జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః).

ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.

ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.

(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,

అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః | 

కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)

పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు

(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం, 

యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి | 

తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).

జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు.

అంతగా దాన్ని ఆరాధిస్తారు.*పాండవులు ఆయుధాలు జమ్మిచెట్టు పైనే ఎందుకు దాచారు*?

అంతగా దాన్ని ఆరాధిస్తారు.

all gas companies

 *All LPG consumers should pay attention to this post -*

    *Especially women's group,*

This post is based on a woman's experience,

Last Sunday I got a useful information,

I had to change my gas cylinder, I removed the empty cylinder and installed a new filled cylinder,

As soon as I turned on the knob, I felt the smell of gas leaking, for safety reasons I immediately turned off the knob.

    I immediately informed my gas agency and asked for help.

   He replied that the agency is closed as it is Sunday, now our man will be able to solve your problem only tomorrow, sorry.

I sat down in despair, suddenly I thought that I should search on Google, maybe I will find some emergency number.

  Google shows a number *1906* in case of gas leakage.

When I called that number, *Gas Leakage Emergency* appeared on True Caller.

A lady picked up the phone, I told her my problem, she replied that the service man will reach your address within 1 hour, if your pipe is leaking then you will have to pay the charge for the new pipe, otherwise you will not have to pay anything,

  I was surprised when within half an hour a boy knocked at the door.

*That boy checked, and within 1 minute changed the washer inside the cylinder and turned on the gas,*

  When I tried to give him some money, he politely refused to take it.

*He said that this facility has been provided to him free of cost by the Central Government*

Within half an hour the lady who received the call called and asked whether your problem was resolved or not?

   *I checked the facts again on Google and saw that this facility is available 24×7 on services.india.gov.in, which is related to all gas companies*

*I request you all to share this message with all your acquaintances and groups so that it is useful for everyone*🙏💐

*School for Brahmin Boys*

 *School for Brahmin Boys*

🎈 All expenses paid institution 

*Important message for Brahmin parents:*

Kanchi Math has started a Veda cum regular school in *Ullal near Bangalore University*. All castes are admitted here for CBSE system of regular 10+2 schooling. But Brahmin boys are given Veda class from 6 to 7 AM and 6:30 to 8 PM (approx times). This is in addition to regular schooling. They are also provided with a 400 seat hostel with full Brahman food. 

But one of the organisers of this institution in Kanchi Math was telling that they can find monetary resources but are finding it difficult to get Brahmin boys to join this all expenses paid institution! Now only 100 seats are occupied in the hostel and 300 are vacant. He was requesting all Brahmin families to utilize this opportunity and school. 

As the boys lose nothing and gain Vedic knowledge along with regular knowledge, this is the best place for them. They have got excellent class rooms, labs, play grounds etc of very high standard. This is suitable for every type of Brahmin family irrespective of rich, middle class or poor! The decision of higher studies -if in Veda line or Science , Engg or Medicine etc can be done after 12th standard.

*Details: Sri Sankara Smartha Samskrutha Paatasala, (Vidyaneketan Public school), Ullal Cross Road, Ullal Upanagar, Bangalore 560 056, phone:080 2321 3396, 080 2321 1364.*

 Please visit the school with prior appointment. www.vidyaniketan-school.com (getting ready)

contact email: admissions@vidyaniketan-school.com

Please spread the word.

వామనావతారం

 వామనావతారం

అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. ‘మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించకపోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగినవారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.

ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. శుక్రాచార్యులవారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’ అంటారని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండములో నుండి ఒక బంగారురథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉన్నది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతున్నది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వాటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మెడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మెడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.

ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉన్నది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు..ఆదిత్యయోగి..

శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహముతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికి బలిచక్రవర్తి దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన మహాభక్తుడు రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.

కశ్యపప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యపప్రజాపతి గొప్ప బ్రహ్మజ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉన్నది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నదని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన ప్రీతి చెందితే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు.

ముళ్ళపంది లేదా అడవిపంది తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహము కలుగుతుంది. భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.

స్వామి అదితిని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్యభ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. ‘అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉన్నది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆమె ‘స్వామీ! నాకు అంత భాగ్యమా! తప్పకుండా’ అన్నది. స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంతో యథాపూర్వకంగా పుట్టాడు. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. అదితి గర్భం గర్భాలయం అయింది.

గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రవణ నక్షత్రము లో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్సంజ్ఞాతలగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా శంఖ, చక్ర, గద, పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యపప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్న వటువుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్యమండలమునుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రమును ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగకర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింకచర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతల గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీమాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహాతేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. వటువు ‘ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.

బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారుపళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.ఆదిత్యయోగి..

‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటివరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయ్యాయి. ఇంతకుముందు తొంభైతొమ్మిది యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదని చెప్పడం ఎలా కుదురదు. ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పడము కూడా కష్టమే. నేను మూడురకములుగా మాత్రము ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తే నాకు చాలా ఆనందముగా ఉన్నది. నీవు వటువువి నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. నీకు ఏమి కావాలో కోరుకో’.

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

కరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమొ కాక ఏమడిగెదో దాత్రీసురేంద్రోత్తమా!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి ? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిస్తాను’ అన్నాడు. వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. నాకు నీవు ఇవ్వగలిగినది ఏమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చానని అంటే నేను బ్రహ్మానందమును పొందుతాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు.

బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములను జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితే అది ఇస్తాను’ అన్నాడు.

వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు

గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

‘అవన్నీ ఇస్తానంటావేమిటి? నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. బలిచక్రవర్తి

ఓ వటువా! ఇదిగో బంగారుపాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ! బంగారుచెంబుతో నీళ్ళు పొయ్యి. ఈ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్ళు పట్టుకువద్దామని లోపలి వెళుతున్నది. ఈలోగా బ్రహ్మచారి బంగారుపాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చి రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట ఇచ్చావా? అని అడిగాడు. బలిచక్రవర్తి ‘ ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తానన్నాను’ అన్నాడు. శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. నీజోలికి రాలేడు. నీతో యుద్ధం చేయకుండా నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును తీసుకుని ఇంద్రునకు ఇస్తాడు. మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాటచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు

జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప !

శుక్రాచార్యుల వారు రాక్షసనీతి చెప్పారు. దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దాని వలన పాపం రాదు. మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగుకూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదం ఆయనను నమ్మకు’ అన్నాడు.ఆదిత్యయోగి..

బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీనాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుపై

బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే ?

‘ఆయన చేయి లక్ష్మీఅమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్క సారి ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతున్నది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై.

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!

‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా!

నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాటపోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను ఆ జాబితాలో చేరను. నేను దానం చేస్తాను’ అన్నాడు. శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం త్రాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేసాను. ఇవాళ నువ్వు గురువు మాటకాదన్నావు. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు!’ అని శపించాడు.

వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారుపళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి వంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లనిపాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూసాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదము ఏది ఉన్నదో ఆ పాదమును చూసాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూసాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెము ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకుని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూసాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నా నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసాడు...ఆదిత్యయోగి..

వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.

ఇంతింతై, వటుడింతయై, మఱియుదానింతై, నభోవీధిపై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై

నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.

పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలోనుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.

రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై

శ్రవణాలంకృతియై గళాభరణ మై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా, తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదములకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.

ఆయన బలిచక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది? అని అడిగాడు. బలిచక్రవర్తి

సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు;

నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!

నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసికూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానములో నేను అనాథను కావడమా! నాకు భర్తృ భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.

పది దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వస్తే బలిచక్రవర్తి ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.

శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వీనిని రక్షించాలి. వానిని వరుణపాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. సావర్ణిమనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుని నాలో కలిపేసుకుంటాను. అప్పటివరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పదిదిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.

మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం ఇస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణిమనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.ఆదిత్యయోగి..

‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.

ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీకటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తము?

ధర్మం చేయుస్తూ ఉండాలి

 ధర్మం …

    *నీవు ఏది చేస్తే… అదే…*

         *వేల రెట్లలో పొందుతావు!*

                     ➖➖➖

            {పుణ్యమైనా-పాపమైనా}

*ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు.*

*ఒకరోజున, అలా అమ్మకానికి పోయినప్పుడు, అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది; నీరసంగా ఉంది; ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి?*

*‘అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం’ అనుకున్నాడు అతను. వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు- అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి, వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు- “ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా?” అని మాత్రం అడగ గల్గాడు.  అయితే, పిల్లవాడి ముఖం‌ చూస్తే, ‘వాడికి ఆకలిగా ఉంది’ అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు, వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది.* *పిల్లవాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు- త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది- ‘తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే!’ అని.*

*పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా అడిగాడు, జేబులో‌చెయ్యి పెడుతూ- “మీకు ఎంత చెల్లించాలి?” అని.*

*“నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే!”అన్నది ఆ యువతి నవ్వుతూ. “దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట- మా అమ్మ చెప్పింది!” అన్నది.*

*పిల్లవాడి కళ్ళు చెమర్చాయి. “అయితే మీరు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీకరించాలి” అని చెప్పి, వాడు అక్కడినుండి ముందుకు సాగాడు.*

*ఆ గ్లాసెడు పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగూ తీరింది- శారీరకంగా సత్తువ వచ్చింది. అయితే దానితోబాటు వాడి మనస్సూ మార్పుకు లోనైంది.* 

*మనిషిలోని మంచితనం పట్లా, దేవుని కరుణ పట్లా ఆ పసి హృదయంలో నమ్మకం ఒకటి, చిన్న విత్తనం మొలకెత్తినట్లు, మొలకెత్తింది. రాను రాను అది బలపడింది-                           ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి, ఆ నమ్మకం అతనిలో వ్రేళ్ళూనుకున్నది.*

*చాలా సంవత్సరాలు గడిచాయి. రోజులు ఒకేలాగా ఉండవు. అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది. ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు ఆ జబ్బు. వాళ్ళు ఆమెను పట్టణానికి వెళ్ళి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు. ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్ళు ఆమె సమస్యను పెద్ద డాక్టరు గారికి అప్పగించ దలచారు. ఆమె వివరాలున్న ఫైలును డాక్టరుగారి దగ్గరికి పంపించారు. ఆమె ఊరి పేరు చూసిన డాక్టరుగారు వెంటనే లేచి, ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చారు.*

*ఆమెను చూడగానే పెద్ద డాక్టరుగారికి కళ్ళు చెమర్చాయి. ‘ఎలాగైనా ఆమెను రక్షించాలి’ అని నిశ్చయించుకొని, ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది- చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత, చివరికి ఆమె తన జబ్బు నుండి బయటపడింది!*

*ఇక ఆమె ఇంటికి వెళ్ళవచ్చు- వెళ్ళేముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించటమే తరువాయి: ఎంత ఖర్చు అయ్యిందో‌మరి! ఆమెకు బిల్లు పంపించేముందు దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టరుగారు. దాన్ని చూసిన తరువాత, ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి, ఆమెకు అందజేసారు.*

*ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది- ఎందుకంటే, ఆమెకు తెలుసు- అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు! అయినా చేసేదేమీ లేదు- ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే! వణికే చేతులతో కవరును తెరిచిందామె… బిల్లు చివర్లో‌ రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి:*

*ఒక పెద్ద గ్లాసెడు పాలద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది.*

సం/-

**దయ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. మన కరుణ, సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరమూ చెప్పలేము!*

**మనం ఏపంట వేస్తే అదే పంట కోస్తాం మనం పుణ్యంచేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడు తుంది అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తూంది అందుకే మనం ధర్మం చెస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయుస్తూ ఉండాలి అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయుటం మర్చి పోకుండా ఉంటారు ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది.*

                     ➖▪️➖

మానవీయ విలువల గురించి

 https://youtu.be/eHGKpWFinrU?si=G8MsD5I6fu3Ln-fi

 మానవీయ విలువల గురించి గొప్ప ప్రేరణ కలిగించారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు సిద్దిపేటలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి చే అద్భుతమైన ప్రవచనం మన అఖండ జ్యోతి ఛానల్లో🙏🙏👆👆

Panditulaku

తప్పులను ఇతరులపైకి నెట్టి

 *1937*

*కం*

తప్పుల నితరుల మీదకు

చొప్పించుచు నీవిపుడిట సుఖపడుచున్నన్

తప్పుల ఫలముగ నీవిల

తప్పక రోదించుటెల్ల తధ్యము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నీ తప్పులను ఇతరులపైకి నెట్టి ఇప్పుడు సుఖంగా ఉన్నప్పటికీ ఆ తప్పు ల ఫలితంగా ఈలోకంలో నువ్వు బాధపడవలసిన రోజు తప్పకుండా వస్తుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

building technology

 New building technology

Chair making

 Chair making

Shirt display

 Shirt display

Motor experments

Motor experments

Voice record

 Voice record

Leadership

 Leadership

Amazing

 Amazing

Three arrow

Steem engine

 Steem engine

Tiller

 Tiller

Visham

 Visham

Racing drone

 Racing drone

Mechanical links

Mechanical links

లైంగిక సమశ్యలకు చక్కని పరిష్కారం

 లైంగిక సమశ్యలకు చక్కని పరిష్కారం

DC motor texting

 DC motor texting

గరికపాటివారు చాలా బాగా చెప్పారు

గరికపాటివారు చాలా బాగా చెప్పారు. నిజంగా ఆలొచనలను రేకెతిస్తుంది వీరి వాదన

Paripurnananda swami speech

gear mechanism

Types of gear mechanism

Free energy

Free energy with two DC motors is this really work that you should conform after making ok.  

This vedio is exclusively for those who are interested in doing electric experments.  

Dc motor

 https://youtube.com/shorts/0eQVcBAj3yg?si=9v5f1PJz8Ue__CpT

E Bike

పదములే చాలు రామా!*.

 *ॐ శ్రీ దేవులపల్లి వారి ప్రసిద్ధ శ్రీరామ గీతం*

*పదములే చాలు రామా!*.

*నీ పద ధూళులే పదివేలు*

*నీ పదములే చాలు రామా!*.

*నీ పద ధూళులే పదివేలు* 

*నీ పదములే చాలు* 

*నీ పదమంటిన పాదుకలు*

*మమ్మాదుకొనే ఈ జగమేలు*.

*నీ పదమంటిన పాదుకలు*

*మమ్మాదుకొనే ఈ జగమేలు*. 

*నీ పదములే చాలు రామా!*...

*నీ పద ధూళులే పదివేలు* 

*నీ పదములే చాలు* 

*కోవెల లోనికి రాలేను*

*నువు కోరిన కానుక తేలేను* 

*కోవెల లోనికి రాలేను*

*నువు కోరిన కానుక తేలేను* 

*నినుగానక నిమిషము మనలేను*

*నువు కనబడితే నిను కనలేను*!

*నినుగానక నిమిషము మనలేను* 

*నువు కనబడితే నిను కనలేను*!

*నీ పదములే చాలు రామా!*

*నీ పద ధూళులే పదివేలు*

*నీ పదములే చాలు*!! 

*నీ దయ గౌతమి గంగా రామయ*

*నీ దాసులు మునుగంగా*

*నీ దయ గౌతమి గంగా రామయ*

*నీ దాసులు మునుగంగా*  

*నా బ్రతుకొక నావ* 

*దానిని నడిపే తండ్రివి నీవా*!

*నా బ్రతుకొక నావ* 

*దానిని నడిపే తండ్రివి నీవా*! 

*నీ పదములే చాలు రామా!* 

*నీ పద ధూళులే పదివేలు*

*నీ పదములే చాలు రామా*! 

*నీ పద ధూళులే పదివేలు*

*నీ పదములే చాలు*

Living shanka

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -63🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -63🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*🌷తిరుపతి గంగమ్మ జాతర:🌷*

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది.

అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. 

యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట.

 దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. 

వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.

తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కడతారు.

 సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపుకుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు వూరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు.

మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు.

 • ఈ క్రమంలో వెుదటిరోజున బైరాగివేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మిక. 

• రెండోరోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు.

 • మూడోరోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు.

 • నాలుగోరోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు వూరంతా వూరేగుతారు. 

స్థలపురాణం ప్రకారం శనివారంనాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది.

నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట.

 దీనిని గుర్తుచేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. 

గోపురాన్ని పోలిన సప్పరాలను(వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు.

ఇక చివరిరోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తారు. 

బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రినుంచే పడిగాపులు కాస్తారు.

పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది.

గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు.

 పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 52*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 52*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ప్రకృతికి నియమాలున్నాయి. మొక్కలలో పువ్వులు ముందు పూస్తాయి, పిదప పిందె వస్తుంది - ఇది అలాంటి నియమాలలో ఒకటి, కాని ఈ నియమాలు కొన్ని చోట్ల, కొన్ని సమయాలలో ఉల్లంఘనమవడమూ కద్దు. గుమ్మడి మొక్కలలో మొదట పిందె వస్తుంది. ఆ తరువాతే పువ్వు పూస్తుంది. ఈశ్వరకోటులైన తమ శిష్యులకు దీనిని ఉదాహరణగా పేర్కొనేవారు శ్రీరామకృష్ణులు. 

సాధారణంగా ఆధ్యాత్మిక సాధనలు, తపస్సు అనుష్ఠించి భగవదనుభూతి పొందుతారు. ఇది నియమం కాని ఈశ్వరకోటుల విషయంలో ఈ నియమం మారుతుంది. వారు ముందుగానే ఆధ్యాత్మిక అనుభూతులను పొందివుంటారు. పిదప తపస్సు ఇత్యాదులు ఒనరించి తద్వారా ఆధ్యాత్మిక అనుభవాలు సంతరించుకొని, ముందుగానే తాము పొంది వున్న ఆధ్యాత్మిక అనుభూతులతో వాటిని పోల్చి చూసుకొంటారు.

ఈశ్వరకోటులలో అగ్రతాంబూలం నరేంద్రునిదే. అతడు ఇప్పటికే కొన్ని అత్యున్నత అనుభవాలు పొందడం చూశాం. కాని అతడూ ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించాడు. శ్రీరామకృష్ణులు అతడికి అనేక సాధనలలో శిక్షణలిచ్చారు.

ఆధ్యాత్మిక సాధనా శిక్షణలలో మొదటి మెట్టు మంత్రదీక్ష. సామాన్యంగా గురువు శిష్యుని అర్హతకు తగిన ఒక మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా దీక్ష ప్రసాదిస్తాడు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి మార్గం చూపుతాడన్నమాట. ఈ మంత్రం సిద్ధమంత్రమై ఉండాలి. సిద్ధమంత్రం అంటే జాగృతం కలిగించే మంత్రం అని అర్థం. అంటే గురువు ఆ మంత్రాన్ని జపించి తద్వారా, ఆ మంత్రానికి చెందిన దేవత అనుగ్రహం పొందినవాడై ఉండాలి. అలాంటి గురువు ఒసగే మంత్రదీక్ష మాత్రమే ఫలవంతమవుతుంది. 

ఎందుకంటే మంత్రంతోపాటు ఆ మంత్రాన్ని జపించడానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తాడు కనుక. అందుకే గ్రంథాల్లో చదివి, ఆ మంత్రాలను జపించ కూడదు, గురువు ద్వారా పొందిన మంత్రాన్నే జపించాలని వక్కాణిస్తారు. ఈ మంత్రదీక్షకి ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి.

కాని పరిపూర్ణ స్థితిని సంతరించుకొన్న గురువు నియమాలను ఉల్లంఘించి, తాను అభిలషించే రీతిలో దీక్ష నివ్వడం కద్దు. ఆధ్యాత్మిక శక్తిని శిష్యునిలో ప్రసరింపజేయడమే దీక్ష ఉద్దేశం. దీనిని వారు తమకు నచ్చిన రీతిలో నెరవేరుస్తారు. ఇలాంటి దీక్షను తంత్రశాస్త్రాలు శాంభవీదీక్ష అని పేర్కొంటాయి. శ్రీరామకృష్ణులు నరేంద్రునికి ఇలాంటి దీక్షనే ప్రసాదించారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 41*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 41*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

  *తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా*

  *నవాత్మానం మన్యే నవరస మహాతాణ్డవనటమ్ |*

  *ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా*

  *సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమ జ్జగదిదమ్ ‖*

ఇదొక అద్భుతమైన శ్లోకం. మూలాధార చక్రములో శివ శక్తులు ఎలా వున్నారో చెప్తున్నారు ఇందులో. కుండలిని శక్తికి మూలాధారం ప్రధానం. తీగకు పాదు వలె. మనిషిలో ఏ స్పందనైనా ముందు మెదడులో మొదలై విద్యుత్ వేగంతో మూలాధారానికి వెళ్లి, అక్కడ నుండి మళ్ళీ పైకి ప్రయాణించి మెదడును చేరుతుందని యోగశాస్త్రాలు చెప్తున్నాయి.

తవాధారే మూలే = నీదైన ఈ మూలాధార చక్రంలో

 శరీరం నాది కాదు అమ్మదే అనే భావనతో

సహ సమయయా లాస్యపరయా = ఇక్కడ అమ్మవారు *సమయ* అనే పేరుతో లాస్యం చేస్తూ ఉంటారట. లాస్యం కోమలంగా పద ఘట్టనం లేకుండా ఉంటుంది. 

నవాత్మాన మన్యే = శివుడు నవాత్మకుడు. 

మన శరీరము ఈ విశ్వము కూడా నవాత్మకమే. వీటిని వ్యూహములని కూడా అంటారు. వ్యూహమునకు వ్యుత్పత్తి  *ఊహ వితర్కే* విశేషముగా విచారింపబడునది. *వ్యూహో నా బలవిన్యాస నిర్మాణ నికురుంబయో: ఇతి రుద్రః* అని అమరం.

రుద్రుని  వ్యూహములు

కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కల, జీవ. వ్యూహములు ఈశ్వర విభూతులూ, అంశలు. అవతార విశేషముల వంటివే వ్యూహములు.   సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తూ జీవుల గతులను నిర్దేశించే నవగ్రహాలు, నృత్యంలో నవరసములు, నవావరణాలు ఇవన్నీ ఇలాటివే.

నవరస మహాతాండవ నటమ్ = స్వామి, నటరాజుగా నవరసాలొలికిస్తూ మహాతాండవ నృత్యం చేస్తూ వుంటారు. తాండవమనేది ఉద్ధృతంగా ఉంటుంది. ఈ తాండవాన్ని *ఆర్భటీ వృత్తి* అంటారు. వృత్తి అంటే వర్తించేది.ఒక నడక/నడవడి. వీటిని కావ్య వృత్తులంటారు. ఇవి కైశికి, ఆర్భటి, సాత్వతి, భారతి. 

అమ్మవారి లాస్యము కైశికి వృత్తి. ఈ కౌశికీ, ఆర్భటీ వృత్తుల సమన్వయమే శరీరం.

 జనకజననీమ జ్జగదిదమ్ =  శరీరం లోనే కాదు, విశ్వంలో కూడా ఈ రెండిటి సమన్వయం అవసరం.

ఉభాభ్యా మేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయా

సనాథాభ్యాం జజ్ఞే = ఈ విధంగా వీరిద్దరూ ప్రపంచానికి తల్లి తండ్రులుగా వున్నారు. కనుక మేము అనాథలం కాము, సనాధలము.

ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు *లాస్యప్రియా లయకరీ లజ్జా  రంభాది  వందితా* , *మహేశ్వర మహాకల్ప  మహా తాండవ సాక్షిణి* దర్శించవచ్చు.

మూలాధార చక్రం భూమి తత్త్వం. భూమిపై  జీవించే మానవులు అరిషడ్వార్గాలకు లోనయి ధర్మమును పాటించక భ్రష్టత్వం పొందుతుంటే పార్వతీ పరమేశ్వరులు తమ తాండవ/లాస్యములతో వారికి జ్ఞానేచ్ఛను కలిగించి యోగసాధనకు ప్రోత్సహిస్తారని భావం.

పరమేశ్వరుడు స్థాణువు. *స్థిరః స్థాణుః* అని శివ సహస్ర నామాలు ప్రారంభం. అమ్మవారు ఆయనను కార్యోన్ముఖులను చేస్తుందట. ఆయన నవరసాలతో కూడిన మహా తాండవ నృత్యం చేస్తుంటే ఆవిడ విలాసంగా చూస్తూ తరువాత తన మృదువైన లాస్యంతో ఆయన ఉద్ధృతిని తగ్గిస్తుందట. ఈ మహా తాండవాన్ని మహాప్రళయం కాలంలో ఆయన ప్రదర్శించి సర్వ జగత్తును మహాగ్నిలో భస్మీపటలం  చేస్తుంటే ఆమె సాక్షిణిగా చూస్తూ వుంటుందట. అనంతరం తన కరుణారస దృష్టులతో చల్లదనాన్ని వర్షించి ఆనందభైరవిగా తన లాస్యంతో పునః సృష్టికి ఆయనకు సహకరిస్తుంది. ఆయన ఆనంద భైరవుడు ఆమె ఆనందభైరవి. 

ఈ స్తోత్రము మొదలుపెట్టినప్పుడు అందమే ఆనందం అని అన్నాను. ఏమిటి ఈ రెండూ? 

ఒకటి నుండి ఈ 41 వ శ్లోకం వరకు *ఆనంద లహరి* గా పిలుస్తారు. వీటిలో, సచ్చిదానంద తత్త్వమును ప్రతిపాదించే దివ్యమైన మంత్ర, తంత్ర, యోగ, ఉపాసనా రహస్యములు అనేకం చెప్పబడ్డాయి. అందుకని ఆనందలహరి. వీటివలన కలిగిన సంస్కారంతో మిగిలిన 59 శ్లోకాలను పఠించి అర్థం చేసుకోవాలి. వీటిని *సౌందర్యలహరి* అంటారు. వీటిలో అమ్మవారి కేశముల నుండి పాదముల వరకు సౌందర్య వర్ణన ఉంటుంది. ఇవన్నీ వేదాంతపరమైన అనేక విషయములను సూచిస్తాయి. ఏది ఆనందమును కలిగిస్తుందో అది అందము. కాళిదాసు రఘువంశ కావ్యంలో చెప్పినట్లు , *వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే  జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ* 🙏🏻

 *తాండవం నటనం నాట్యం లాస్యం నృత్యం చ నర్తనే* అని నృత్య రీతులు.

*తాడ్యతే భూమిఃఅనేన ఇతి తాండవం* దీని చేత భూమి కొట్టబడును. పాదఘట్టనలు

*నట్యతే నటనం* నటించుట నటనం

*నటస్య కర్మ నాట్యం* నటుడు చేసేది నాట్యం 

*లసనం లాస్యం* లలితముగా లావణ్యముతో క్రీడించుట లాస్యము.

*నృతీ గాత్ర విక్షేపే నృత్యం నర్తనం* గాత్రమునకు చేయు నృత్యము నర్తనం.

           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నాగమణిగారి నియమం..

 *నాగమణిగారి నియమం..*

"ఈరోజు నాగమణి గారి పేరుతో అన్నదానము అని రిజిస్టర్ లో ఉన్నది..కానీ ఇతర వివరాలేమీ లేవు..బోర్డ్ మీద అన్నదానానికి విరాళం ఇచ్చిన దాత తాలూకు గోత్రము, పేరు..ఊరు..వ్రాయాలి కదా..ఇక్కడ కేవలం నాగమణి గారు అని మాత్రమే ఉన్నది..కనీసం వారి సెల్ నెంబర్ కూడా లేదు..ఈరోజు ఇక్కడ అన్నదానం జరిపించామని వారికి తెలియచేయాలి కదా?..వారి గోత్రనామాలతో అర్చన చేయించాలి..ఇప్పుడెలా?.." అని మా సిబ్బంది నన్ను అడిగారు..నేను రిజిస్టర్ తెప్పించుకుని చూసాను..నిజమే..ఒక్క పేరు తప్ప మరే వివరాలు లేవు.."ఇది నమోదు చేసింది ఎవరు?.." అని అడిగాను.."మీరు నా పేరు వ్రాసుకోండి..ఆతేదీకి నేను వస్తాను..అన్ని వివరాలు ఇస్తాను.." అని ఆవిడ చెప్పింది సార్..ఎంత ఖర్చు అవుతుంది..అని అడిగింది..చెప్పాను..అంత మొత్తము ఇచ్చింది..రసీదు ఇచ్చాను..ఎలాగూ ఆవిడ వస్తానన్నారు కదా అని నేను మిగిలిన వివరాలు అడగలేదు..." అని సిబ్బందిలో ఒకరు చెప్పారు.."సరే..ఇప్పుడు సమయం ఏడు గంటలేకదా..?..తొమ్మిదిన్నర కు వచ్చే బస్సులో వేస్తారేమో వేచి చూద్దాము.. మరో రెండుగంటలు చూద్దాం..అన్నదానం మాత్రం నిర్వహిద్దాము.." అని చెప్పాను..

స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..మా సిబ్బంది మైకు ద్వారా..అన్నదానం ఉందన్న సంగతి అందరు భక్తులకూ తెలియచేశారు..ఆరోజు మంగళవారం..ఉదయం తొమ్మిదిన్నర సమయం లో వచ్చిన బస్సులో కొందరు భక్తులు వచ్చారు కానీ..అన్నదానానికి విరాళం ఇచ్చిన నాగమణి గారు మాత్రం రాలేదు..మరో అరగంట గడిచింది..స్వామివారి మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోనుండి దంపతులు దిగారు..వారి వెనకాలే నాగమణి గారు కూడా వచ్చారు..మందిరం లోపలికి వచ్చి..కాళ్ళూ చేతులూ కడుక్కొని..నేను కూర్చున్న స్థలం వద్దకు వచ్చి.."నా పేరు నాగమణి అండీ..ఈరోజు ఈ స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదం ఏర్పాటుకు నాకు అవకాశం దొరికింది..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని మీ సిబ్బంది చెప్పారు.." అన్నారు.."అమ్మా..ఉదయం నుంచీ మీ గురించే మేము మథనపడుతున్నాము..మీ తాలూకు వివరాలేవీ మా వద్ద లేవు..ఈకార్యక్రమం జరుపుతున్నామని మీకు తెలియచేయాలి కదా..అలాగే మీ గోత్రనామాలతో అర్చన చేయడానికి కూడా ఇబ్బంది వచ్చింది..మీరే వచ్చారు కనుక ఇక మాకు బాధలేదు.." అన్నాను..నాగమణి గారు నా వైపు చిరునవ్వుతో చూసి.."నేను వస్తానని చెప్పే వెళ్ళాను బాబూ..ఆరోజు మీరు లేరు.." అన్నారు..

తనతో వచ్చిన దంపతులను నాకు చూపిస్తూ.."వీళ్ళిద్దరూ నా తమ్ముడూ మరదలూనూ..అసలు వీళ్ళగురించే నేను ఈ స్వామిదగ్గరకు వచ్చాను..వీడిపేరు రాజేశ్వరరావు..అమ్మాయి ప్రసూనాంబ..అమెరికా లో వుంటారు..వీళ్లకు ఇద్దరు పిల్లలు.. మూడేళ్ళ క్రితం వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు..వీడి చిన్ననాటి స్నేహితుడు ఒకడు కలిసాడు..మాటల్లో రెండు మూడు రకాల వ్యాపారాలు చెప్పాడు..కొద్దిగా పెట్టుబడి పెడితే..ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికాడు..మా తమ్ముడు ఆశ పడ్డాడు..సరే అన్నాడు..ఆ స్నేహితుడి మాటలు నమ్మి..ఏ కాగితాలూ లేకుండా కొంత డబ్బు ఇచ్చాడు..ముందు కొద్దిగా పెట్టుబడి చాలు అని చెప్పిన ఆ స్నేహితుడు..వీడి నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసాడు..ఆ తరువాత ముఖం చాటేశాడు..తీరా వీడు ఇక్కడికి వచ్చి విచారిస్తే..మోసపోయానని తెలుసుకున్నాడు..ఆ స్నేహితుడి వద్ద కొన్ని భూముల తాలూకు పత్రాలు తప్ప మరేమీ లేవు..ఆ భూముల కాగితాలు వీడి చేతిలో పెట్టి..ఇంతకంటే ఏమీ చేయలేను..అని తేల్చి చెప్పాడు..అవి ఎవరూ కొనే భూములు కూడా కాదు..మావాడు బాగా దిగులు పడ్డాడు..అప్పుడు నేనే సలహా ఇచ్చాను.."నాయనా మనం ఒకసారి మొగిలిచెర్ల వెళ్లి ఆ దత్తాత్రేయుడి ని శరణు వేడదాము..ఏదో ఒక దారి చూపిస్తాడు..నువ్వు దిగులుపడకు..నీ కష్టార్జితం అయితే ఎక్కడికీ పోదు.." అని చెప్పాను..వీళ్లిద్దరి తరఫున నేనే ఇక్కడికి వచ్చాను..మొత్తం పదకొండు ఆదివారాలపాటు ఒక నియమం అనుకోని ..ప్రతి ఆదివారం ఈ స్వామివద్దకు సాధారణ భక్తులతో పాటు వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని..వీళ్ల గురించి ప్రార్ధించి వెళ్ళాను..స్వామివారు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు అని నా మనసుకు తోచింది..అందుకు తగ్గట్టుగానే..పోయిన నెలలో ఈ అవధూతకు మామీద దయ కలిగింది..అనుకోకుండా వీడి వద్ద ఉన్న భూముల కు రేటు వచ్చింది..అగ్రిమెంట్ అయింది..కొంత డబ్బూ చేతికి వచ్చింది..అందుకే ఈరోజు అన్నదానం చేయిస్తానని మొక్కుకొని..వీళ్ళిద్దరినీ పిలిపించాను..ఈరోజు మంగళవారం అయినా..ఈరోజే అన్నదానం చేయడానికి కారణం ఉంది..ఈరోజు వీడి పుట్టినరోజు..స్వామివారి దయవల్ల మా తమ్ముడు నిరాశ లోంచి బయటపడ్డాడు.." అని చెప్పారు..

నాగమణి గారు పదకొండు ఆదివారాలు.. స్వామివారి మందిరానికి వచ్చి వెళ్లిన విషయం మేమెన్నడూ గమనించలేదు..

ఆరోజు అన్నదానానికి బోర్డ్ మీద తమ పేర్లు ఏవీ రాయవద్దని నాగమణి గారు కోరారు..స్వామిచూపిన కరుణ తమ మీద ఎల్లకాలమూ ఉంటే చాలని..తమ పేర్లు ప్రచారం చేసుకోవాలని అనుకోలేదని చెప్పారు..అందరూ ఆరోజు అర్చన చేయించుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం నాగమణి గారు తిరిగి వెళ్లిపోయేముందు నా వద్దకు వచ్చి.."స్వామివారు కరుణించబట్టి మావాడికి తన సొమ్ము లభించింది..ఈ క్షేత్రం అభివృద్ధికి సహాయం చేయమని సలహా ఇచ్చాను..నలుగురికి ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా నాకు తెలియచేయండి..తప్పకుండా మా వంతు సహకారం మేము అందిస్తాము.." అన్నారు..

సర్వం..

శ్రీ దత్తకృప!

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మంచితనం

 💐 *

    🪷 *మంచి మాటలు* 🪷

🎄 “డబ్బు”ఆస్తులను సంపాదించి పెడుతుంది కానీ,”మంచితనం” మనుషుల్ని సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కాని, “ఒంటరితనం” ఎప్పటికీ రాదు. హద్దులకు మించి “ఆశలు” ఉన్నట్లయితే శక్తికి మించి కష్టాలు పడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా అదుపులో ఉంటేనే మంచిది.”

🎄“తెలివి తేటలు ఎక్కువ, తక్కువ అందరికీ ఉంటాయి. కాని, అవి ఎదుటి వారి మనసును గెలుచుకోవాలి. అప్పుడే,మన “గొప్పతనం”తెలుస్తుంది. మోసేది “బరువు” అనుకుంటే దించి వేయాలనిపిస్తుంది, “బాధ్యత” అనుకుంటే మోయాలనిపిస్తుంది. “కర్తవ్యం” అనుకుంటే చేయాలనిపిస్తుంది మరియు. “ఇష్టం” అనుకుంటే కష్టమనిపించదు.”

🎄 “ఎక్కడైతే అవసరానికి కాకుండా ఆత్మీయతకు చోటుంటుందో, ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణ అడిగితే మన్నించే వీలుంటుందో మరియు ఎక్కడైతే   పట్టింపులకు ప్రాధాన్యత లేకుండా ఉంటుందో, అక్కడ  “బంధాలు” బలంగా ఉంటాయి. అంతేకాదు,అక్కడ మనుషులతో   పాటు మనసులు కూడా మాట్లాడతాయి.”

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Wisdom evergreen *

 {{{{{ ఆలోచనాలోచనాలు }}}}} *** Wisdom evergreen ***.                    ***** My riches consist not in the extent of my possessions , but in the fewness of my wants. --- J. Brother ton.                                      ***** One person's candle is light for many. --- Babylonian Talmud.                              ***** Love means exposing yourself to the pains of being hurt, deeply hurt by someone you trust. --- Reira Weems.                   ***** You must have bird in your heart before you can find it in the bush. --- John Burroughs.                        ***** We ourselves feel that we are doing is just a drop in the ocean. But the ocean would be less because of that missing drop. --- Mother Teresa.                 ***** Success is the sum of small efforts , repeated day in and day out. --- Robert Collier.                                ***** Things work out best for those who make the best of how things work out. --- John Wooden.                  ***** We can't stop the waves , but we can surf them. --- Jonathan Kabat-Zinn.      ***** The whole life is now, is today, is this eternal moment. --- Jalaluddin Rumi.              ***** The cure of the part should not be attempted without the cure of the whole. --- Plato.                                 Dt 2--10--2023, Monday, Good morning.

బ్రాహ్మణ భోజనం విజయవాడ

 హల్లో అండి 

బ్రాహ్మణ భోజనం విజయవాడ 9182554800 విజయవాడలో అన్ని రకాల శుభకార్యాలకి కేటరింగ్ చేయబడును మాసికాలకి,సంవత్సరికలకి, ఇంట్లో చేసుకోవడానికి వీలు లేని వాళ్ళకి మడిగా చేసి క్యాటరింగ్ పద్ధతిలో ఇవ్వబడును

మేము,జర్నీ లో వెళ్లే వాళ్ళకి కూడా భోజనం అందజేస్తాం (బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ) జర్నీ లో వెళ్ళే వాళ్ళు ఒకరోజు ముందుగా తెలియచేయగలరు.🙏

ఈ రోజు వంటలు

దోసకాయ పప్పు

దొండకాయ కూర

ఆలూ ( అల్లం పచ్చిమిర్చి,నిమ్మకాయ ) వేసి కూర

సాంబార్

,టమోటో రోటిలో నూరిన పచ్చడి

దయచేసి ఆర్డర్ ముందు రోజు చెప్పవలెను అప్పటికప్పుడు అడగవద్దు🙏🙏 మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9182554800

Disclaimer.  This blogger is not responsible for the above content. Vewers are requested to enquir before proceed. 

సంచలన వార్త

 జైభారత్ జైశ్రీరామ్ 🙏🚩🌹 మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో మోదీజీకి ఒక ప్రశ్న లేవనెత్తారు

 “దళితులైన మా కోసం - మీరు కుటుంబానికి కనీసం ఒక సెంటు భూమిని కేటాయించాలి!  మేము  కూడా బ్రతకాలి కదా?

 మోదీజీ కొంత సమయం తీసుకుని సీటు నుంచి లేచారు

 “నువ్వు స్వయంగా దళితుడవు కాదా?” అని ఖర్గేని అడిగాడు

మీ ఆధీనంలో ఎంత భూమి ఉందో తెలుసా?

 వివరించండి..మోడీ అన్నారు..

ఆ స్థలంలో రూ.50 కోట్ల విలువైన బంగ్లా ఉంది!

 ➡️కెంగేరిలో రూ.40 కోట్ల విలువైన ఫామ్‌హౌస్!

 ➡️రామయ్య కాలేజీ దగ్గర రూ.25 కోట్ల విలువైన భవనం!

 ➡️బెంగళూరు R.Tలో మరో బంగ్లా ఉంది.  నగరం!

 ➡️బళ్లారి రోడ్డులో 17 ఎకరాల వ్యవసాయ భూములు!

 ➡️బెంగళూరులోని బన్నారఘట ప్రాంతంలో మీకు రూ.500 కోట్ల విలువైన వాణిజ్య సముదాయం ఉంది.

 ➡️చిక్‌మగ్గలూరులో 300 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ ఎస్టేట్ ఉంది.

 ➡️ బెంగళూరులోని ఇందిరా నగర్‌లో మూడు అంతస్తుల భవనం!

 ➡️బెంగుళూరు సదాశివ నగర్‌లో 2 బంగ్లాలు!

 ➡️పైనవి కాకుండా - మైసూర్‌లో ఉన్న మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఆస్తుల జాబితాను నేను చదవాలా;  గుల్బర్గా;  చెన్నై;  గోవా;  పూణే;  నాగ్పూర్;  ముంబై మరియు ఢిల్లీ ??

 మల్లికార్జున ఖర్గే ముఖం పాలిపోయింది!

సింహన్ని దూరం నుండి చూసి ఆనందించు తప్పుకాదు సింహం జూలుతో అడితే కను రెప్పపాటులో చస్తావు సంకరజాతి మాటలు రాహుల్ దగ్గర,మీపార్టీ పెంట తింటున్న బొకడా ప్రాంతీయ పార్టీల దగ్గర మాట్లాడు వింటారు..

 మీడియా ఈ సంచలన వార్తను ఎందుకు బయటకు తీసుకురాలేదు??🤷‍♂️...జైహింద్

శర్మద గారికి ఘనసన్మానము

 నిన్న మేడిపల్లి-హైదరాబాద్ లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు జరిపిన జ్యోతిషసభలో మన ఆత్మీయ సభ్యులు శ్రీ శర్మద గారికి జరిగిన ఘనసన్మానము యొక్క చిత్రం.

 మేడిపల్లి-హైదరాబాద్ లో బ్రాహ్మణ సంక్షేమ వేదిక వారు జరిపినజ్యోతిషసభలో *జ్యోతిష ప్రముఖ* అను బిరుదముతో ఘనసన్మానము చేయటమైనది.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -63🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -63🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*🌷తిరుపతి గంగమ్మ జాతర:🌷*

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది.

అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. 

యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట.

 దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. 

వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.

తమిళ సంప్రదాయం ప్రకారం చిత్రినెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి, వడిబాలు కడతారు.

 సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపుకుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు వూరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు.

మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాణ్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు.

 • ఈ క్రమంలో వెుదటిరోజున బైరాగివేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగివేషం వేసిందని భక్తుల నమ్మిక. 

• రెండోరోజు బండవేషం. మానవుడు కష్టనష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు.

 • మూడోరోజు తోటివేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు.

 • నాలుగోరోజు దొరవేషం. డప్పులు, వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు వూరంతా వూరేగుతారు. 

స్థలపురాణం ప్రకారం శనివారంనాడు అమ్మవారు దొరవేషంలో పాలెగాడిని సంహరిస్తుంది.

నాలుగోరోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్లి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్య వాచకాలు చెబుతుందట.

 దీనిని గుర్తుచేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. 

గోపురాన్ని పోలిన సప్పరాలను(వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాల వేషం వేస్తారు.

ఇక చివరిరోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తారు. 

బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రినుంచే పడిగాపులు కాస్తారు.

పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది.

గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపుకుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు.

 పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహా పురాణం🪐* . *41వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *41వ అధ్యాయం*

*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*బుధగ్రహ జననం - 4*

విద్యార్థులు కళ్ళు మూసుకుని వేదసూక్తాన్ని వల్లెవేస్తున్నారు. బృహస్పతి అరమోడ్పు కళ్ళతో ఏకాగ్రతగా ఆలకిస్తున్నాడు.

చంద్రుడు కళ్ళు మూసుకోలేదు. వల్లె వేయడం లేదు. ఆలకించడమూ లేదు. అతని చూపులు ఆశ్రమ వాతాయనం మీదే ఉన్నాయి. వాతాయనం ముందు వయ్యారంగా నిలుచుని , తన వైపే చూస్తున్న తార మీదే ఉన్నాయి. తనను చూస్తున్న తార కళ్ళు నవ్వుతున్నాయి. పెదవులూ నవ్వుతున్నాయి...

*"చంద్రా !"* బృహస్పతి కంఠస్వరం చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది.

చూపుల్ని తిప్పి , ఆందోళనగా చూశాడు చంద్రుడు గురువుగారి వైపు. 

బృహస్పతి కళ్ళు తీక్షణంగా అతన్నే చూస్తున్నాయి. *"నీ మనసు పాఠం మీద లేదు..."*

*"క్షమించండి గురువుగారూ..."* చంద్రుడు సిగ్గుపడుతూ అన్నాడు.. *"విద్యార్జనలో ఏకాగ్రత అవసరం !"* బృహస్పతి మందలింపుగా అన్నాడు. *"జాగ్రత్త సుమా !"*

*"తారా ! ఇవాళ ఇంద్రసభకు వెళ్తున్నాను. "* పూజ ముగించిన బృహస్పతి అన్నాడు. *"ఎప్పుడు తిరిగొస్తారు ?"* తార ఆయన వైపే చూస్తూ అంది.

*"రాత్రి భోజనం వేళకు వచ్చేస్తాను ! ఆ... చంద్రుడు విద్యార్థుల్ని చూసుకుంటాడు..."* 

*"ఎవరో ఒకరు చూసుకోవడం మంచిది. లేకపోతే ఒకటే అల్లరి చేస్తారు. చిన్నపిల్లలు కదా !"* తార నవ్వుతూ అంది. 

*"నువ్వు జాగ్రత్త సుమా... పుంజికస్థల చేత పనులు చేయించుకో..."* నీరసంగా కనిపిస్తున్న తారను చూస్తూ అన్నాడు బృహస్పతి. 

*"అలాగే.... మీరు జాగ్రత్త స్వామీ !”* అంది తార.

నైవేద్యం పెట్టిన ఫలాలను అల్పాహారంగా స్వీకరించి , బృహస్పతి వెళ్ళిపోయాడు. తార వాతాయనం ముందు నిలబడి చూస్తోంది. విద్యార్థులందరూ వరుసలుగా కూర్చుని , ఏవో మంత్రాలు పఠిస్తున్నారు. చంద్రుడు వాళ్ళ ముందు నిలబడి - గురువుగారి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు.

తారలో రకరకాల ఆలోచనలు తేనెపట్టులోంచి తేనెటీగల్లా లేస్తున్నాయి. ఆలోచనల్లోంచి తేరుకున్న ఆమె పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. వాతాయనం ముందు నుంచి కదిలింది.

తార నీళ్ళ పాత్రల ముందు నిలుచుంది. నవ్వుతూ ఒక పాత్రను అందుకుంది. వెలుపలికి వెళ్ళి పాత్రలోని నీటిని చెట్టుపాదులో పోసింది. ఆ పాత్రను అక్కడే పెట్టి ,

 *"పుంజికా !"* తార బిగ్గరగా పిలిచింది. ?“ఓ పుంజికస్థలా ! ఎక్కడున్నావ్ ? ఇలారా !"* క్షణంలో పుంజికస్థల అక్కడికి వచ్చింది. *"అమ్మా... పిలిచారా ?"*

*"ఆ ! నీళ్ళు ఎందుకో కలుషితంగా ఉన్నాయి. పాదుల్లో పోసేశాను. నదికి వెళ్ళి నీళ్ళు తీసుకురా ! పిల్లలందరికీ త్రాగటానికి కావాలిగా. అన్ని పాత్రల నిండా ఉండాలి. నీళ్ళు !"*

*“సరే... అలాగే తీసుకొస్తాను..."* అంటూ పుంజికస్థల పాత్రను అందుకుంది. తమ దగ్గరగా వస్తున్న గురుపత్నిని చూస్తు విద్యార్థులు మంత్రపఠనం ఆపారు. విద్యార్థుల చూపుల్ని గమనించిన చంద్రుడు తల తిప్పి తార వైపు చూశాడు. తార అతని వైపు చూడడం లేదు.

విద్యార్థుల ముందు నిలబడి తార చిరునవ్వుతో చూసింది. *"ఇవాళ గురువుగారు లేరు కదా ! మీరు ఒక పని చేయాలి. వంటచెఱకు అయిపోవస్తోంది. అరణ్యంలోకి వెళ్ళి వంటచెఱకూ , సమిధలూ ఏరి తీసుకురండి. సనాతనుడు మీకు నాయకత్వం వహిస్తాడు. అతను చెప్పినట్టు నడుచుకోండి !"*

*"ఇవాళ మాకు నాయకుడిగా చంద్రుణ్ణి నియమించారమ్మా గురువుగారు !"* సనాతనుడు లేచి నిలుచుని , వినయంగా అన్నాడు. 

*"నాకు తెలుసు ! చంద్రుడు ఆశ్రమంలో , తోటలో కొన్ని పనులు చేయాలి. ఆ పనులు మీరూ , నేనూ చేయలేం. మీరు అరణ్యానికి వెళ్ళండి !”*

విద్యార్థులు ఉత్సాహంగా లేచారు.

చంద్రుడు అనుమానిస్తూ తార వైపు చూశాడు. *"గురువుగారు నన్ను..."*

*"ఏ పనికి నియోగించారో నాకు తెలుసు చంద్రా ! గురుశుశ్రూష ఎంత ముఖ్యమో , గురుపత్నీ సేవ కూడా అంతే ముఖ్యం !"* అంటు తార ఉత్సాహంగా అరణ్యం వైపు ఉరకలు పెడుతున్న విద్యార్థుల్ని చూస్తూ ఉండిపోయింది.

చంద్రుడు ఆమె వైపే చూస్తున్నాడు. ఎదురుగా చూస్తే ఎంత అందంగా ఉందో , ప్రక్కవాటంగా కూడా అంతే అందంగా , ఆకర్షణీయంగా ఉంది ఆమె. ఎందుకో తెలీదు గానీ , అందరు విద్యార్థులూ పిలుస్తున్నట్టు ఆమెను 'అమ్మా' అని పిలవాలనిపించడం లేదతనికి , ఆశ్రమంలో ఆడుగు పెట్టిన నాటినుంచీ !

తార తటాలున అతని వైపు తిరిగింది. చిరునవ్వు ఆమె పగడాల పెదవుల్ని కొద్దిగా విడదీసి , ముత్యాల్ని కొద్దిగా చూపించింది. *“చంద్రా.... నువ్వు నన్ను అందరిలాగా . 'అమ్మా !' అనడం లేదు ! ఎందుకు ?”*

చంద్రుడి గుండె దడదడ కొట్టుకుంది. తార ఎదుటివారి ఆలోచనల్ని చదువుతుందా ?

*"చెప్పు ! ఎందుకు ?"* తార నవ్వుతూ అడిగింది.

ఏం చెప్పాలో తేల్చుకోలేని చంద్రుడు నాలుకతో తడి ఆరుతున్న పెదవుల్ని తడుపుకున్నాడు.

*"చెప్పు ! ఎందుకు ?"* తన వెనక వైపు నుంచి బిగ్గరగా వినిపించిన ప్రశ్న , తారనే చూస్తున్న చంద్రుణ్ణి ఉలిక్కిపడేలా చేసింది. చంద్రుడు భయాందోళనలతో వెనుదిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు ! ఇందాక వెనకబాటుగా తనని ఉద్దేశించి ఆ ప్రశ్నను పలికిందెవరు ?

*“చెప్పు ! ఎందుకు ?”* తార అడిగిన ప్రశ్న మళ్ళీ చంద్రుడి చెవుల్ని పగలేసింది. ప్రశ్న అడిగిన చిలక చెట్టు మీద రెక్కల్ని టపటపలాడించింది. 

తార కిలకిలా నవ్వింది. 

*“నువ్వు సమాధానం చెప్పేదాకా అది అలా అడుగుతూనే ఉంటుంది !"*

చంద్రుడు కంగారుగా చూశాడు. తార చెయ్యి చాపి , చంద్రుడి చేతిని పట్టుకుంది.

*"ఇక్కడొద్దులే ! అక్కడ తోటలో చెబుదువుగానిలే రా !"* అంటూ లాగింది. చంద్రుడు గుటకలు మింగాడు.

*"రా , చంద్రా !”* తార లాగుతూ అంది.

*"రా, చంద్రా !"* అంది చెట్టు మీది చిలక.

చంద్రుడు ఉలిక్కిపడి కదిలాడు. తామరతూడులాగా నాజూకుగా ఉన్న తార చెయ్యి ప్రణయపాశంలా అతన్ని లాగుతోంది. *'రా , చంద్రా !', 'రా , చంద్రా !'* అంటూ వల్లె వేస్తున్న పిలుపు అతన్ని వెంటాడుతోంది. ఎందుకో అతని అడుగులు తడబడ్డాయి.

*"రా !”* తార తలతిప్పి వాలుగా చూస్తూ , చిరునవ్వుతో అంది , లాగుతూ. 

వెనక చిలక , ముందు చిలకల కొలికి ! చంద్రుడు అప్రయత్నంగా నవ్వుకున్నాడు..

అర్ధరాత్రి దాటింది. నిద్రపట్టని చంద్రుడు అటూ , ఇటూ దొర్లుతున్నాడు. తనను తోటలోకి తార లాక్కెళ్లినప్పటి దృశ్యాలు మూసుకున్న కళ్ళ ముందు పునర్దర్శనమిస్తున్నాయి. చంద్రుడికి.

*'రా !"* అంటూ తనను చెయ్యి పట్టి తీసుకెళ్తున్న తార వయ్యారాల నడక కాస్సేపట్లో పరుగుగా మారింది. ఒక గుబురు పొదరిల్లు సమీపంలోని చెట్టు నీడలో ఆగింది తార. నవ్వుతూ అతని వైపు చూసింది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చంద్రుడికి కనిపిస్తున్నాయి , సమ్మోహనకరంగా.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 52*