*పాండవులు ఆయుధాలు జమ్మిచెట్టు పైనే ఎందుకు దాచారు*?
ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు.
జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.
జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.
ఆంధ్రవ్యాసుల వారిని ఒక సారి ఒకభక్తుడు జమ్మిచెట్టు గురించి ప్రశ్నించాడు. పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా అని అడిగాడు.
దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది.
జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్త్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు.
రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే.
ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.
దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.
నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.
సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.
ఒక జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది.
మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః).
ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.
ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.
(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,
అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః |
కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)
పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు
(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం,
యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి |
తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).
జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు.
అంతగా దాన్ని ఆరాధిస్తారు.*పాండవులు ఆయుధాలు జమ్మిచెట్టు పైనే ఎందుకు దాచారు*?

అంతగా దాన్ని ఆరాధిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి