💐 *
🪷 *మంచి మాటలు* 🪷
🎄 “డబ్బు”ఆస్తులను సంపాదించి పెడుతుంది కానీ,”మంచితనం” మనుషుల్ని సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కాని, “ఒంటరితనం” ఎప్పటికీ రాదు. హద్దులకు మించి “ఆశలు” ఉన్నట్లయితే శక్తికి మించి కష్టాలు పడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా అదుపులో ఉంటేనే మంచిది.”
🎄“తెలివి తేటలు ఎక్కువ, తక్కువ అందరికీ ఉంటాయి. కాని, అవి ఎదుటి వారి మనసును గెలుచుకోవాలి. అప్పుడే,మన “గొప్పతనం”తెలుస్తుంది. మోసేది “బరువు” అనుకుంటే దించి వేయాలనిపిస్తుంది, “బాధ్యత” అనుకుంటే మోయాలనిపిస్తుంది. “కర్తవ్యం” అనుకుంటే చేయాలనిపిస్తుంది మరియు. “ఇష్టం” అనుకుంటే కష్టమనిపించదు.”
🎄 “ఎక్కడైతే అవసరానికి కాకుండా ఆత్మీయతకు చోటుంటుందో, ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణ అడిగితే మన్నించే వీలుంటుందో మరియు ఎక్కడైతే పట్టింపులకు ప్రాధాన్యత లేకుండా ఉంటుందో, అక్కడ “బంధాలు” బలంగా ఉంటాయి. అంతేకాదు,అక్కడ మనుషులతో పాటు మనసులు కూడా మాట్లాడతాయి.”
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి