పరమేశ్వర స్తుతికి భాషా భేదాలు లేవు
ఉ: హెడ్డున మూను , స్కిన్నుపయి నెంతయు డస్టును, ఫైరు నేత్రమున్ ,
సైడున గ్రేటు బుల్లు , బహు చక్కని గాంజెసు హైరు లోపలన్ ,
బాడికి హాఫెయౌచు నలపార్వతి , మౌంటెను డాటరుండ , ఐ
షుడ్డు డివోటు ,దండములు సోకగ ప్రేయరు సేతు నెప్పుడున్;
ఆదిభట్ల నారాయణ దాసుగారు.
బహు భాషా కోవిదులైన దాసుగారు పరమేశ్వరుని మణిప్రవాళ శైలిలో యీవిధంగా నుతించారు. ఇందులో ఆంగ్లపదాలను బహురమ్యంగా తెలుగు పదాలకు జోడించి తమభాషాచాతుర్యాన్ని ప్రకటించారు.
సిరసున చంద్రుడు , శరీరమునభస్మము , అగ్ని నేత్రము ,(మూడవకన్ను) వాహనంగా నంది. తలపై గంగ , అర్ధనారీశ్వరియై పార్వతి. (హిమవంతుని పుత్రి) నేను ఒరుల నేల తలచెదను శంకరునకే నమస్కృతులు చేసి ప్రార్ధింతును.
అనిదీని భావము.
ఇలా అన్సభాషాపదాలను తెలుగు పదాలతోకలిపి వ్రాయటం శివకవులతో ప్రారంభమైనది.పాల్కురికి సోమనాధుడే
ఈవిధానమునకు ఆద్యుడు. తరువాత తరువాత తక్కిన కవులందరూ ఈపద్దతిని అనుసరిస్తూ ఈవిధానానికి "మణిప్రవాళశైలియని" పేరు నిర్దేశించారు.
బాగుందికదా తరువాత మరికొన్ని!
స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🙏🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి