4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

హిందూ ధర్మానికి

విదేశీయుడు: స్వామి క్రిస్టియానిటీ స్థాపకులు ఎవరు?
స్వామి చిన్మయానంద: జీసస్
విదేశీయుడు: ఇస్లాం స్థాపకుడు ఎవరు?
స్వామి చిన్మయానంద: మహమ్మద్

విదేశీయుడు: హిందూ మత స్థాపకులు ఎవరు?
స్వామి చిన్మయానంద: సమాధానం ఇవ్వలేదు. మౌనంగా వుండిపోయారు.
విదేశీయుడు: అదేమిటి స్వామి మీ మతానికి స్థాపకులంటూ ఎవ్వరూ లేరా?

స్వామి చిన్మయానంద: హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు జీవన విధానం, ధర్మం., ఎందుకంటే ఇది వ్యక్తుల నుండి వచ్చిన జ్ఙ్ఞానం కాదు. నీవు అడిగినటువంటిదే నేను అడుగుతాను. సమాధానం చెప్పగలవా. కెమిస్ట్రీ స్థాపకులు ఎవరు, జువాలజీ స్థాపకులు ఎవరు? దీనికి నీ వద్ద ఖచ్చితమైన సమాధానం వుందా? వుండదు. అలాగునే ఈ సనాతన హిందూ ధర్మం కూడా ఎంతో మంది సైంటిస్టుల పరిశోధనల ఫలితమే. ఆ పరిశోధకులే మన ఋషులు, మునులు.

విదేశీయుడు: అపరాధభావంతో మిన్నకుండిపోయాడు.

స్వామి చిన్మయానంద: నువ్వు ఒక క్రిస్టియన్ ని అడిగితే బైబిల్ ఇస్తాడు. ఒక ముసల్మాను సోదరున్ని అడిగితే ఖురాన్ ఇస్తాడు. అదే హిందువుని అడిగితే తన గ్రంధాలయానికి ఆహ్వానిస్తాడు.
ఎందుకంటే ఇక్కడ వున్నది మితం కాదు… అనంతం…
హిందత్వం ఒక మతం కాదు ....భారతీయుల జీవన విధానం
హిందూ ధర్మం సనాతనమైనది.

కార్పొరేట్ కల్చర్




గరుడ విగ్రహం ఇండోనేసియా




పరమాత్మ

పోపూరి అరుణశ్రీ

ఆకాశ తత్వమే హరుని లక్షణమట
పేరునే కలదట విష్ణువునకు
ఉరగ భూషణుడట ఉమ పెనిమిటి తాను
రగశాయి యందురు లచ్చి మగని
విశ్వ రక్షణ సేయ విషముఁద్రావె శివుడు
నారాయణుండాడు నాటకముల
దక్షిణా మూర్తి గా దారి చూపు హరుడు
హయగ్రీవ రూపాన హరియె నడుపు

వేల నామాల పరమాత్మ వేరు కాదు
భేద మెంచుచు మతముల వేరు సేయ
భక్తి కరవౌను నరులకు ముక్తి రాదు
పాహి పార్వతీ హృదయేశ పాహి శ్రీశ

మనం మనలాగే ఉండాలి

🌹 .. విజ్ఞానం🌹

అది బ్రిటిష్ కాలం.. ఒక పిల్లవాడు స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. " స్కూళ్ళో కొందరు పోకిరీ పిల్లలు పిలక పంతులు అని వెక్కిరిస్తున్నారమ్మా .. పిలక తీసేస్తానమ్మా " అని చెప్పి ఏడ్చాడు.

చూడు నాన్నా.. " నీ పిలక వలన వాళ్ళకి ఏ నష్టమూ లేదు. పిలక ఉన్నందుకు నువ్వు బాధ పడక్కరలేదు. ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళు వెక్కిరించారని నువ్వు పిలక తీసేస్తే నీ మీద నీకు గౌరవం లేనట్టే. అవన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టిపెట్టు నీ వలన దేశానికి చాలా ఉపయోగముంది." అంది.

కొంతకాలం తరువాత .." అమ్మా స్కూళ్ళో పిల్లలు నన్ను జంధ్యం మాష్టారు .. జంధ్యం మాష్టారు అంటూ వెక్కిరిస్తున్నారు.. అస్తమానూ జంధ్యం పట్టుకొని లాగుతూ అల్లరి చేస్తున్నారు " అంటూ మళ్లీ ఏడ్చాడు.

" నీ జంధ్యం బయటకు రాకుండా చొక్కాలు కుట్టిస్తాను నాయనా.. బాధపడకు. వాళ్ళ చేతలు ,వాళ్ళ మాటలు పట్టించుకోకు. నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుమిలిపోకూడదు. రాళ్లు
అడ్డొచ్చాయని ప్రవాహం ఆగిపోతుందా.. ? " అని అనునయించింది.

మరికొంత కాలం గడిచాక ఆ పిల్లాడు ఇంకా పెద్ద చదువులు చదవడానికి దూరప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ అలాంటి సమస్యే ఎదురయ్యింది. " అమ్మా ! ఇక్కడి వాళ్ళు కోడిగుడ్లు తినమని నన్ను పొరుపెడుతున్నారు.
బెదిరిస్తున్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను తినే భోజనంలో కోడిగుడ్డుని కలిపేస్తున్నారు. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా " అని ఉత్తరం రాసాడు.

"వాళ్ళు ఎన్నిరకాల పన్నాగాలు పన్నినా నువ్వు చలించకు. వాళ్ళు కాకుల వలే గోలచేస్తే చెయ్యనీ , దోమల వలే రొదపెడితే పెట్టని.. వాళ్ళు అలాగే మిగిలిపోతారు. కానీ నువ్వు దేశచరిత్రలో మహానుభావుడిలా నిలిచిపోవాలి. ఏకాగ్రత కోల్పోకు.. నీ చదువుని ఒక తపస్సులా భావించు.
ఉదయాన్ని చూడాలంటే చీకటిని భరించాలి.ధృఢమైన సంకల్పంతో ముందుకెళ్లు. " అని ఆమె తిరుగు ఉత్తరం రాసింది.

తల్లి రాసిన ఉత్తరం చదివిన అతడు కొండంత బలంతో చదువు పూర్తిచేశాడు. కేంబ్రిడ్జి కి వెళ్ళాడు. ప్రపంచదేశాలు మనివ్వెరపోయేలా భారతదేశపు ఖ్యాతిని ఆకాశంలో నిలబెట్టాడు.

అతడే విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త
 " సి.వి.రామన్ " . తన తల్లి చెప్పిన విలువలను , హితోక్తులను ఆయన తన జీవితకాలం పాటించారు. విదేశాలకు వెళ్లినా , ప్రోఫెసర్ గా పనిచేస్తున్నా, మద్రాస్ ఐ.ఐ.టి. కి వైస్ ఛాన్సేల్లెర్ గా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ తన పిలకని తీయలేదు. భారతీయతను వదిలిపెట్టలేదు. అందుకే తలపాగా ధరించేవారు.
" Raman the great."

అంతఃకరణ



మనం బాహ్య కర్మలు చేయడానికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.

వీటిని బాహ్య కరణాలు అంటారు.

ఈ రెంటినీ కలిపి దశేన్ద్రియాలు అంటారు.

రాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఈ పది ఇంద్రియాల ద్వారా జరిగే కర్మలు అనుభవాలు వస్తాయి. అంటే కలలో చూడటము, నడవడం మాట్లాడటము లాంటివి. వీటిని అంతః దశేన్ద్రియాలు అంటాం.

శరీరం తో ఉన్న దశేన్ద్రియాలు మనము బాహ్య జగత్తులో ఉన్నప్పుడు పని చేస్తాయి.

నిద్ర పోయినప్పుడు ఈ అంతః దశేన్ద్రియాలు పని చేస్తాయి.

అయితే ఈ రెంటినీ పని చేయంచడానికి లోపల ఉండి పనిచేయడానికి నాలుగు పరికరాలు ఉన్నాయి. పరికరం అంటే కరణం. నాలుగు పరెకరాలు లోపల ఉండడం వల్ల వీటిని అంతఃకరణ చతుష్టయం అంటారు.

అంతఃకరణ చతుష్టయం లో మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము ఉంటాయి.

మనస్సు అంటే అలోచనల సమూహము. చంచలం దీని స్వభావము. ఎప్పుడు ధ్వందం లో ఉంటుంది, ఆదా, ఇదా అన్నది తెల్చుకొకపోవడము దీని నైజము. ఆవేశము దీని స్వభావము. ఏది కావాలి ఏది అక్కరలేదో దీనికి తెలియదు.

బుద్ధి అనేది ఒక నిర్ణయాత్మక శక్తి, జ్ఞానవంతంగా ఉండడం దీని లక్షణం. యుక్తాయుక్త విచక్షణ దీని స్వభావం. ఆస్తిక బుద్ది, నాస్తిక బుద్ది, సరళ బుద్ది, వక్ర బుద్ది, స్థిర బుద్ది అని బుద్ది పది రకాలుగా ఉంది.
అనుభవాల సారంని జ్ఞానం గా మార్చుకొంటుంది ఈ బుద్ది.

చిత్తం అన్నది ఒక జ్ఞాపకాల మూట. ఇందులో ఎన్నో రకాల జ్ఞాపకాలు ఉంటాయి. అవి కొని చెత్త జ్ఞాపకాలు, కొన్ని అనిత్య జ్ఞాపకాలు, కొన్ని శాశ్వత సత్యాలు.

అహంకారము అన్నది ఒక వేర్పాటు ధోరణి.
"నేను ~ నాది",
"నీది ~ నాది",
 "నువ్వు వేరు ~ నేను వేరు " ,

ఇలా ఉంటుంది అహంకారం..
ఇదండి అంతఃకరణ గురించి

వృద్ధాప్యం ... శాంతులు

*వృద్ధాప్యంలో (మలివయసులో) జరిపే శాంతులు*
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
పురుషునికి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి చేయడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము.
కాని భాస్కరభట్టు అభిప్రాయం ప్రకారం 50 సంవత్సరాల వయసు మొదలుకొని ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించాలి.
 (భట్టభాస్కరీయ మతానుసారిణ్యః వయోవస్థా శాంతయః పంచాశత్ వర్షమారభ్య పంచభిః పంచభిః వర్షైర్యుక్తాః।(అన్యమతేన - షష్టితమ వర్షమారభ్య దశభిర్దశభిర్వర్షైః శాంతిరుక్తాః))
శ్లో॥ వైష్ణవీ వారుణీ చైవ తతశ్చోగ్రరథీ తథా ।
     మహారథీ భీమరథీ ఐంద్రీచైవ విశేషతః ॥1॥
     చాంద్రీదార్శనికీ రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తథా।
     మహామృత్యుంజయీ శాంతిః క్రమశశ్చ ప్రకీర్తితాః ।
     అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్ప్రయత్నతః ॥2॥
వాటి వివరాలు క్రింద తెలిపినట్లుగా...
1. వైష్ణవీ శాంతి ----50 వ సంవత్సరము.
2. వారుణీ శాంతి ----55 వ సంవత్సరము.
3. ఉగ్రరథ శాంతి ---60 వ సంవత్సరము.
4. మృత్యుంజయ శాంతి ---65 వ సంవత్సరము.
5. భౌమరథీ శాంతి ---70 వ సంవత్సరము.
6. ఐంద్రీ శాంతి ---75 వ సంవత్సరము.
7.సహస్ర చంద్ర దర్శన శాంతి ---80 వ సంవత్సరము.
8. రౌద్రీ శాంతి ---85 వ సంవత్సరము.
9.కాలస్వరూప శౌరి శాంతి ---90 వ సంవత్సరము.
10. త్ర్యంబక మహారథి శాంతి ---95 వ సంవత్సరము.
11. శతాబ్ది -- మహామృత్యుంజయ శాంతి --- 100 వ సంవత్సరము.

*సేకరణ*
*వరలేఖరి.నరసింహశర్మ*

జోస్యం చెప్పే జగన్నాథుడు



కాన్పూర్ సమీపంలోని
బిత్రగావ్ బెహతా గ్రామస్తులు “జగన్నాథుడే తమకు 'వర్షసూచన' ఇస్తాడని నమ్ముతారు.
తిఏటా వర్షాలు సకాలంలో, సమృద్దిగా ప్రపడాలని రైతులు పూజలు, ప్రార్థనలూ చేయడం సర్వసాధారణంగా జరిగేదే! ఇక వర్షాలు ఏ
మేరకు పడతాయో తెలుసుకోవడానికి వాతావరణశాఖ సూచనల మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని ఒక గ్రామం వారికి ఆ అవసరం లేదు. ఆ ఊరిలో కొలువైన జగన్నాథుడే 'వర్షసూచన ఇస్తాడని వారు భావిస్తారు. ఆ జగన్నాథుడి పురాతన ఆలయం కాన్పూర్ సమీపంలోని బిత్రగావ్ బెహతా గ్రామంలో ఉంది. దాన్ని వర్షాకాలం గుడి, 'వాన గుడి' అని పిలుస్తారు.
వర్షాకాలం రావడానికి సుమారు పది రోజుల ముందు ఆలయం పైకప్పు నుంచి నీటి చుక్కలు పడడం
మొదవుతుంది. ఆ నీటి చుక్కలు పెద్దవిగా ఉంటే వర్షాలు పుష్కలంగా పడతాయనీ, చిన్నవైతే వర్షపాతం తక్కువగా ఉంటుందనీ, దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయనీ స్థానికుల విశ్వాసం. వర్షాలు ప్రారంభమయ్యాక పైకప్పు నుంచి నీటి చుక్కలు
రాలడం ఆగిపోవడం మరో విశేషం. ఇది 'జగన్నాథుడు చెప్పే జోస్యం' అని చుట్టుపక్కల
గ్రామాల వారు నమ్ముతారు. ఈ 'సూచనల' ప్రకారం వ్యవసాయ కార్యకలాపాలపై ప్రణాళిక వేసుకుంటారు. బౌద్ధ స్థూపంలా ఉండే ఈ ఆలయ
నిర్మాణ శైలే దీనికి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు కొందరు అభిప్రాయపడుతున్నా అసలు కారణం ఏమిటన్నది అంతుపట్టని రహస్యమే! క్రీస్తు శకం 11-18 శతాబ్దాల మధ్య ఈ ఆలయ నిర్మాణం జరిగిందన్నది చరిత్రకారుల అంచనా. బలరాముడు, సుభద్రలతో కలిసి ఉన్న జగన్నాథుడి నల్లరాతి విగ్రహాలు ఈ ఆలయంలో కొలువుతీరాయి. ఒడిశా రాష్ట్రంలోని పూరి ఆలయం మాదిరిగానే ఈ ఆలయం పైన కూడా పవిత్రమైన చక్రం ఉంటుంది. కాషాయ ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది. వర్షాలు బాగా
పడేలా అనుగ్రహించాలని కోరుతూ వానాకాలం రావడానికి ముందు ఈ జగన్నాథుడికి రైతులు పూజలు చేయడం ఆనవాయితీ.

ఈ పద్యాన్ని చదివినారా

🚩 ఈ పద్యాన్ని ఎప్పుడైనా చదివినారా ~ లేక విన్నారా?

🚩తిరుమలరాయలనే రాజుకు ఒకే కన్ను ఉండేదట!

అత‌నికిపొగడ్తలంటే చాలా ఇష్టమట!

తననుపొగిడినవారికి కా‌‌నుకలిచ్చేవాడట!

ఒకసారి హేమచంద్రుడనే కవి ~ ఎలా ఒంటికన్ను రాజును

మెప్పించాలాఅని ఆలోచించి ఇలా ఒక పద్యాన్ని చెప్పి మెప్పించాడట!

🔻"నిన్నాతి గూడ హరుడవు

అన్నాతిని గూడ నప్పుడ సుర గురుడవే

అన్నా! తిరుమల రాయా!

కన్నొక్కటి కలిగె గాని కౌరవ పతివె!"

💥💥💥

దీని అర్థమేమిటంటే : "నీ నాతి (రాణి) తో కలిసి వుంటే

నువ్వు పరమశివుడివే
(ముక్కంటివి అవుతావు తన ఒక కన్ను తన రాణి రెండు కళ్ళు కలిపి)!

రాణి దగ్గరలేకపోతే నీవు శుక్రాచార్యుడివే!
నీకు ఆ కన్నొకటి వుంది గానీ ~ లేకపోతే నీవు
ధృతరాష్ట్రుడివే ~ అంటే పుట్టు గుడ్డివే అని అర్థము.

ఈ పద్యాన్ని రాజు వినగానేపొంగిపోయి కవికి
ఘన సన్మానము చేసినాడట!

కవిగారి సమయస్పూర్తికిజోహార్లు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

భోజరాజు


ఒకరోజు భోజరాజు తన రాజధాని నగరం లో మారువేషం లో తిరుగు చుండగా ఒక అందగత్తెను చూశాడు. ఆమె బంతి తో ఆడుకుంటున్నది. బంతిని చేతితో నేలకేసి కొడుతూ ఆమె ఆడుకుంటూ వుంటే, ఆమె చెవికి అలంకరించుకున్న కలువపూవు జారి ఆమె కాళ్ళ మీద పడింది. ఈ దృశ్యం రాజుకు ఎంతో మనోహరంగా కనిపించింది. కాసేపు దూరం నుండే ఆనందంగా ఆ ఆటను తిలకించి తన మందిరానికి వెళ్ళిపోయాడు. మరునాడు సభలో తన ఆస్థాన కవులకు ఆ బంతి ఆట దృశ్యం గురించి చెప్పి ఆ ఆటను వర్ణిస్తూ తలా ఒక శ్లోకం చెప్పమని కోరాడు.
మొదట భవభూతి లేచాడు. ధాటీగా తోటక వృత్తం లో యిలా శ్లోకం చెప్పాడు
తోటక వృత్త మంటే "కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతనో" అన్నట్టు 'టటటా, టటటా. టటటా' అని వరుస 'స' గణాలతో సాగుతుంది)
విదితం, నను కందుక!, తే హృదయం
ప్రమదాధర సంగమ లుబ్ధ ఇతి
వనితాకర తామర సాభి హతః
పతితః పతితః పునరుత్పతసి
తా:--ఓ బంతీ! నీ ఉద్దేశ్యం స్పష్టంగా తెలుస్తూ వుంది ఈ అందగత్తె ఆధారాలు
ముద్దుపెట్టుకోవాలని చాలా ఉత్సాహ పడుతున్నావు. అందుకే తామరపువ్వు లాంటి ఆమె చేతుల చేత దెబ్బలు తిని మాటి మాటి కీ క్రింద పడి కూడా లేస్తున్నావు.
(నను కందుక! ఓ బంతీ; తే-హృదయం-విదితం!=నీ హృదయమేమితో విదితమే!;
ప్రమదా-అధర-సంగమ -లుబ్ధ:-ఇతి =జవరాలి ఆధారాలను చేరాలని ఆశ పడుతున్నావు. అని; వనితా-కర-తామరస-అభిహతః ఈ ఉవిద కరకమలాల చేత కొట్టబడి కూడా పతితః పతితః = పదే పదే క్రింద పడి; పునః - ఉత్పతసి=మళ్ళీపైకి 
లేస్తున్నావు. ఎంత చక్కటి ఉత్ప్రేక్ష, అని మెచ్చుకున్నాడు రాజు.
తరువాత వరరుచి లేచాడు. తన వర్ణన యిలా చెప్పాడు.
ఏకోపి త్రయ ఇవభాతి కందుకోయం,
కాన్తాయాః కరతల రాగ రక్త రక్తః
భూమౌ తచ్చరణ నఖాంశు గౌర గౌరః
ఖస్థః సన్ నయన మరీచి నీల నీలః
తా:--ఈ బంతి ఒక్కటే అయినా మూడు బంతుల్లాగా కనిపిస్తున్నది. ఆ కాంత చేతిలో ఆమె అరచేతి యెర్రని కాంతుల వల్ల ఎర్రబడి యెర్రని బంతిగానూ, అదే బంతి భూమి మీద పడినప్పుడు ఆమె కాలిగోళ్ళ తెల్లని కాంతి లో తెల్లగానూ, ఆ బంతే పైకి లేచినప్పుడు ఆమె కన్నుల నీలికాంతులలో నల్లటి బంతిగానూ కనిపిస్తున్నది..
(అయం-కందుకః -ఏక-అపి-త్రయః -ఇవ-భాతి =ఈ బంతి ఒక్కటే అయినా -మూడు బంతుల లాగ -ప్రకాశిస్తున్నది. కాన్తాయాః -కరతల-రాగ-రక్త-రక్తః = కాంత యొక్క
అరచేతి ఎర్రదనం చేత ఎర్రబడి యెర్రనిదిగా; భూమౌ-తత్ -చరణ-నఖ-అంశు- గౌర-
గౌరః యెర్రనిదిగా; భూమిపైన పడినప్పుడు ఆమె చరణాల గోళ్ళ-కాంతికిరణాల చేత తెల్లబడి తెల్లదిగా; ఖస్థ - సన్ - నయన-మరీచి-నీల-నీలః;ఆకాశం లో వున్నదై (పైకి లేచినప్పుడు)వున్నప్పుడు కన్నుల కాంతులచేత నల్లబడి నల్లనిదిగా) ఇది మరీ బాగున్నది అన్నాడు భోజరాజు.
ఇంతలో కవికుల గురువు కాళిదాసు లేచి ఆ దృశ్యాన్ని యిలా వర్ణించాడు.
పయోధరాకార ధరో హి కందుకః
కరేణ రోషాదభిహన్యతే ముహు:
ఇతీవ నేత్రాకృతి భీతముత్పలం
స్త్రియః ప్రసాదాయ పపాత పాదయో:
ఆ బంతి ఆట చూస్తే, ఆమె చెవిలో వున్న కలువమొగ్గకు భయం వేసిందట. ఎందుకు?
తన పయోధరాలను ఆ బంతి అనుకరిస్తున్నదని కోపంతో ఈ జవరాలు పదే పదే
చేతులతో కొట్టి దండిస్తున్నది. మరి కలువపూవునైన నేను ఆమె కన్నులను
అనుకరిస్తున్నాను కదా!తనను కూడా దండిస్తుందేమో నన్న భయంతోనే ఆ కలువ ఆమె పాదాలమీద పడిపోయింది క్షమించమని.
(పయోధర-ఆకార -ధరః - కందుకః ;ఆమె పాలిండ్ల ఆకారం ధరించిన బంతి ; రోషాత్ - కరేణ - ముహు: - అభిహన్యతే - హి = కోపం తో చేత్తో మాటి మాటికీ కొట్ట బడుతుంది కదా! ఇతి - ఇవ - అన్నట్టుగా,నేత్ర-ఆకృతి - భీతం - ఉత్పలం = కన్నుల ఆకారం లో వుండటం చేత భయపడ్డ కలువ పూవు: స్త్రియః - ప్రసాదాయ = ఆ స్త్రీ అనుగ్రహం కోసం:
 పాదయో:పపాత =కాళ్ళ మీద పడిపోయింది.
ఈ మూడు శ్లోకాలూ మరోసారి జాగ్రత్తగా చదివి ఎవరి వర్ణన ఎక్కువ మనోహరంగా వుందో
పాఠకులే తేల్చుకోవాలి.
వర్ణన చేసిన కవులిద్దరూ కలువపువ్వు ఆ యువతీ కాళ్ళ మీద పడిపోయిన విషయాన్ని స్పృశించ లేదు. ఆ పని కాళిదాసు మాత్రమే చేశాడు.
(చమత్కార శ్లోక మంజరి నుండి )

కొండచిలువను పెంచుకొంటోందట

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
ఒక మహిళ ఒక కొండచిలువను పెంచుకొంటోందట.

రోజూ తనకు కావలసిన ఆహారం అందిస్తూ,
అది వేగంగా పెరిగి పెద్దదవటం చూసిమురిసిపోయేదట.
కొంత కాలం తర్వాత ఉన్నఫళంగా అది ఆహారం తీసుకోవడం మానేసిందట
తను బయట నుంచి ఇంటికి రాగానే ఒళ్లంతా చుట్టుకుని, తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేసేదట. ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండచిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేక ఆమె డాక్టర్ ని తీసుకొచ్చి చూపించిందట. డాక్టర్ అమెతో ఇలా చెప్పాడు దీనికి ఎలాంటి జబ్బులు లేవు. కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు. తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి అరాయించుకోగలదో అంచనా వేస్తోంది. నీ శరీరాన్ని చుట్టుకోవడంలో ప్రేమ లేదు, నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకొంటోంది.
నీ తల మీద అది ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయటం లేదు. నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తోంది "అని చెప్పాడట.

కొన్ని స్నేహాలు కూడా, ఇలాగే ఉంటాయి. ఇలాంటి స్నేహితులు కొంత మంది మనతోనే ఉంటారు. మనతోనే తిరుగుతారు. మన బలాలు, బల హీనతలు బాగా తెలుసుకుని ముంచేస్తారు.

అందుకే ఇలాంటి స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ.
తస్మాత్ జాగ్రత్త.

ఆవిడలు


భార్యను ఉదహరించినప్పుడు, 'మా' ఆవిడ అని ఎందుకంటారో ఇంతవరకు నాకు అంతుపట్టడంలేదు. 'మా పెళ్ళాం ' 'మా భార్య' లేక 'మా ధర్మపత్ని' అనే పదాల కూర్పు ఏ కవీ చేయలేదు . (ఫాండవులు మాత్రం ద్రౌపది విషయంలో అలా అనే వారేమో తెలియదు). ఈ 'మా ఆవిడ ' అన్న ప్రయోగానికి నాంది ఎక్కడనించి వచ్చిందో అనూహ్యం. 'ఆవిడ ' అనగానే ముందు 'మా' చేరడం అనివార్యం. 'ఒరే, ఏరా' అనే స్నేహితులు కూడా, భార్య విషయానికి వచ్చేసరికి, ఆ మిత్రుడికి ఎప్పుడూలేని గౌరవం ఇచ్చి, 'మీ ఆవిడ ఎలా ఉంది?' అంటారు. ఒకటే సంతోషింపదగ్గ విషయం- 'మా ఆవిడ' బదులు, 'మన ఆవిడ ' అనే ప్రయోగం చేయలేదు! అలాగే, ఇంట్లో ఏక భార్య తప్ప వేరే ఆడవారెవరూ లేకపోయినా, మా ఆడాళ్ళు, అనే బహువచన ప్రయోగం కూడా కద్దు. అటువంటి గౌరవ సంబోధనకి భార్య అర్హురాలే అనిపిస్తుంది. ఎందుకంటే, పెళ్ళి అవగానే ఆవిడకి ఎక్కడలేని కొమ్ములూ మొలుచుకొస్తాయి. ఇంటిలో సర్వాధికారాలూ సంక్రమిస్తాయి. ఆమె అడుగుజాడలలోనే భర్త నడుచుకోవాల్సి వస్తుంది. అదే ఆవిడ, ఇంటి బయట కొచ్చినప్పుడు మాత్రం అతి విధేయతతో, భర్త వెనకాలే నడుస్తుంది. అదో విచిత్రం! అయినా దానికీ ఒక కారణం ఉంది. రాజుగారు ఏదయినా తినే ముందు, ఆ పదార్థాన్నే విషం ఏదయినా ఉంటుందేమోనని, ఒక సేవకుడు తింటాడు. అలాగే ఆవిడ నడిచే మార్గంలో ముళ్ళూ గట్రా ఉంటాయేమోనని, భర్త ముందుగా నడుస్తాడేమో!
పెళ్ళయిన కొత్తల్లో మా ఆవిడకి ఏది ఇష్టమో గ్రహించడానికి నేను పెద్దగా ప్రయత్నం చేయలేదనుకోండి. అయినా, ఆఫీసునించి వచ్చేటప్పుడు, మల్లెపూలో, గులాబీలో, కనీసం కనకాంబరాలో తెస్తే ఆవిడ సంతోషిస్తుందని మాత్రం తెలిసింది. వీలయినప్పుడల్లా పూలు తేవడం అలవాటు చేసుకున్నాను. వీధిలోకి పూలు వచ్చినా, నేను తేవడంవల్ల ఆవిడకొచ్చే ఆనందం ఎక్కువని గ్రహించి అది ఒక అలవాటుగా చేసుకున్నాను. తెచ్చినప్పుడల్లా, 'నిన్నటి పూలు మీకు అంటగట్టాడండీ, ఎలాగ వాడిపోయి ఉన్నాయో చూడండి?' అనే విమర్శే కాని, తెచ్చాడే అనే సంతృప్తి కనపడదు. తేకపోతే మాత్రం, 'మీరు తెస్తారని, ఇవాళ వీధిలోకి తాజా పూలు తెచ్చినా కొనలేదు ' అని ఎదురు దాడి తప్పదు. 
నాకు హిందూ చదవడం ఇష్టం. అయినా పెద్దగా ఇంగ్లీషు చదువుకోని మా ఆవిడ కోసం అది మానేసి, ‘ఈనాడు’ తెప్పించడం మొదలెట్టాను. ‘ఈనాడు’ మాత్రం పూర్తిగా చదివేది. నేనయితే, నాకు ముఖ్యమని అనిపించే వార్తలని మాత్రమే చదివేవాడిని. ఆవిడకి అటువంటి పక్షపాత ధోరణి ఉండేది కాదు. అన్ని వార్తలనూ పూర్తిగా చదివి, తరువాత ఇది చదివారా, అది చదివారా అని నన్నడగడం కూడా చేసేది. నేను తెల్లమొహం వేయడం కూడా మామూలయింది .
నేను పుస్తకాల పురుగునే అని చెప్పాలి. వేరే ఊరు వెళ్ళినప్పుడు విధిగా రెండో మూడో పుస్తకాలు తేకుండా ఇంటికి వచ్చేవాడినే కాదు. ఇవికాక, అప్పుడు వస్తూ ఉన్న, జ్యోతీ, యువ వంటి మాస పత్రికలూ, ప్రభా, స్వాతీ వారపత్రికలూ, ఇంగ్లీషు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ కూడ కొనే వాణ్ణి. తెలుగు పత్రికలయితే, మా ఆవిడ బయట చేరినప్పుడు, చాపమీద పడుకున్నప్పుడు తలకింద పెట్టుకోడానికి మాత్రం పనికొచ్చేవి. ఆవిడ పేజీలు తిరగెయ్యడం చూసాను కాని, పట్టుమని పది పేజీలు చదివిన దాఖలా, నాకయితే కనబడలేదు. ఈ వార పత్రికలూ, మాసపత్రికల జీవితం మహా అవుతే నెలో రెండు నెలలో ఉండేది . పేపర్లతో పాటు వాటినీ తూకానికి అమ్మేసేది. ‘కిందటి వారం పత్రిక ఎక్కడుంది’ అని అడుగుతే, ‘అది నిన్ననే కదా అమ్మేశాను’ అని సమాధానం వచ్చేది. పోతే నేను అప్పుడప్పుడు కొనే ఇంగ్లీషు నవలలకి, తెలుగు పుస్తకాలకీ ఆ గతి పట్టేది కాదు. విమానప్రయాణాలలో వాళ్ళిచ్చే పుస్తకాలు, చక్కని ఆర్ట్ పేపరు మీద ఉండి, చదివేందుకు వాటిలో ఎక్కువ ఉండకపోయినా, మంచి మంచి బొమ్మలుండి, కష్టపడి, వాళ్ళకి తెలిసో, తెలియకుండానో తీసుకొచ్చి, ఇంట్లో కనిపిస్తూ ఉంటే, విమానయానం చేసినట్టు తెలిసి వాటి వల్ల మన పరపతి పెరుగుతుందని ఎంత చెప్పినా వినదే! అటువంటి బరువయిన పుస్తకాలు కొనను మొర్రో అని అంటున్నా వినక, వాటిని కూడా పాత పేపర్లు కొనే వాడికి అంటగట్టేది. ఆవిడ ఉద్దేశంలో, కాగితాలు పొట్లాలు కట్టడానికే నిర్దేశింపబడ్డాయి. ఒకరో ఇద్దరో తన భర్తలాంటి వెర్రోళ్ళు అవి అన్నీ చదువుతారు, ఆ వెర్రి ముదరకుండా ఉండాలంటే, వాటిని దూరం చెయ్యడంకంటే వేరే మార్గం లేదు.
ఇవికాక, ఎక్కడికయినా సెమినార్లకో, మీటింగులకో వెళ్తే, వారిచ్చే సావనీర్లు కూడా చాలా పోగయేవి. వాటిల్లో అప్పుడు ఉపయోగకరమయినవి అనిపించే వ్యాసాలకోసం దాచి ఉంచేవాడిని. అయితే నేను ఊరికి వెళ్ళినప్పుడూ, చూడకుండా ఉన్నప్పుడూ, మిగతా వాటితో పాటు, నిర్దాక్షిణ్యంగా అవీ తుక్కు కాగితాలలోకి వెళ్ళిపోయేవి. 
చిరుతిళ్ళు తినే విషయంలో మాత్రం ఆవిడని ససేమిరా మార్చలేకపోయాను. ఇంట్లోకి ఏమయినా బయటనించి తినుబండారాలు తెస్తే, అవి, అరుదుగా వచ్చే అతిథులకో లేకపోతే, కొంచెం కొంచెంగా పనిమనిషికో ఇవ్వడం చేసేది, కాని, తను మాత్రం తినేది కాదు. మహా అవుతే ఇంట్లో పండగకీ పబ్బానికీ చేసే పులిహోర మాత్రం కొంచెం తినేది. అలాగే తను చేసే బజ్జీలో, అట్లో, ఏ పూరీలో, చపాతీలొ మాత్రం తినేది . మా పిల్లలయితే ఇంట్లో చేసేవీ, బయట చేసేవీ, హోటళ్ళోకెళ్ళి తినేవీ, అప్పుడప్పుడు పిజ్జాలూ తెప్పించుకుని తినడం బాగానే అలవాటు చేసుకున్నారు. మా ఆవిడ మాత్రం, మహా అవుతే ఎప్పుడయినా హోటల్లో పూరీకూర మాత్రం తినేది. అదయినా కూర సాదా సీదాగానే ఉండాలి.
పిల్లలు పెద్దవారయాక, వాళ్ళ పెళ్ళిళ్ళూ పేరంటాళ్ళూ అయి, ఎవరి గూటికి వాళ్ళు ఎగిరిపోయాక, నేనూ, మా ఆవిడే ఇంట్లో మిగిలాం. మేము వాళ్ళదగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వాళ్ళ పిల్లలతో మా వద్దకి వచ్చినా, తినే విషయంలో మాత్రం మా ఆవిడ ఇంతకు మునుపుకన్నా చాదస్తం ఎక్కువయింది . వాళ్ళని తీసుకుని ఎదయినా హోటలుకి వెళ్తే, అందరూ, ఇవో అవో తింటూ ఉంటే, ఆవిడమాత్రం ఉత్త మినపట్టో, మసాలా లేకుండా ఉంటే, పూరీ కూరో తెప్పించుకునేది . ఇంటికి తిరిగి వచ్చాక మామూలుగా అన్నమే తినేది.
సరే, తిండి విషయంలో ఎవరి ఇష్టాలు వారివే అని ఊరుకోడం తప్ప చేసేది ఏమిటి? స్టెయిన్ లెస్ స్టీలు మీద ఉండే మోజు పుస్తకాలూ, కాగితాలమీద ఆడవారికి ఉండదనే సత్యాన్ని గ్రహించడానికి, నాకు చాలా ఏళ్ళు పట్టింది. ఏ పెళ్ళికో, ఫంక్షనుకో వెళ్తే, ఆవిడకి బొట్టు పెట్టించుకోవడం (బొట్టు ముఖ్యం కానేకాదు. బొచ్చే ముఖ్యం! ) 'వెళ్ళొస్తాం ' అని ఆ గృహిణికి చెప్పేముందే, ఆ బొచ్చేదో ఇచ్చేస్తే పోలా? అది జరగదు. 'వెళ్ళొస్తాం' అని చెప్తే, 'ఉండండి బొట్టు పెడతా', అని లోపలికి వెళ్ళి, ఈవిడ చిన్న బొచ్చె మొహమా, పెద్ద బొచ్చెదా అని నిర్ణయించి, అది తీసుకుని, ఈ లోగా ఆవిడని పలకరించేవారికి సమాధానం చెప్పి, బయటకొచ్చి, బొట్టుపెట్టి ఇచ్చేంతవరకూ, వెర్రిమొహం వేసుకుని, 'ఆ బొచ్చెకోసమే వచ్చినట్టున్నారు' అనిపించే మిగతావారి చూపులను భరించి నిలబడాలి. పోతే 'ఆ బొట్టు మా ఆవిడ మొహాన కళకళలాడుతూ ఉంటేనే నేనున్నట్టు' అని సమాధాన పడడం తప్ప, భర్తలం ఏం చెయ్యగలం? ఆవిడకి బొట్టుతో పాటు, వారిచ్చే స్టీలు బొచ్చె చాలా ముఖ్యం . అటువంటి భిక్షమెత్తి, భిక్షానికి మాత్రమే పనికొచ్చే బొచ్చెలతో మా ఇంట్లో ఒక ట్రంకుపెట్టె నిండిపోయింది. వాటిలో ఏ రెండు బొచ్చెలూ ఒక గోత్రానికి చెందినవి ఉండవు. ‘నానా గోత్రభ్యా’ గా ఉండే వాటిని, బంగారు నగలకంటే భద్రంగా దాస్తుంది. పొనీ ఏ ఫంక్షనుకి వెళ్ళినప్పుడో గిఫ్టుగా ఇద్దామనుకుంటే అది పనికిరాదు. సశాస్త్రీయంగా కొత్తగా కొని ఇవ్వవల్సిందే. ఇటువంటి బొచ్చెలు ఇచ్చేకన్నా, అరడజను కటోరీలో, డజను చెంచాలో, లేదా ఒకే రకంగా ఉండే నాలుగో ఆరో గ్లాసులో, ప్లేట్లో ఇస్తే బాగుంటుందనే నా మాట అరణ్య రోదనే. అది కుదరదు. ఎవరికీ ఉపయోగించని బొచ్చెలే ఇవ్వాలి. ఈ విషయంలో, మా ఆవిడ స్పెషలో, అందరు ఆవిడలూ అంతేనో, నాకు మాత్రం తెలియదు.
ఒకసారి, ఎవరిదో గృహప్రవేశం అవుతే, మా ఆవిడ రానందున, నేనొక్కడినే వెళ్ళవలసిన అగత్యం ఏర్పడింది. మా ఆవిడ, వందరూపాయలు పెట్టి ఏదయినా ఇవ్వండి అని హుకుం జారీ చేసింది. అక్కడి స్టీలు దుకాణంలో, కిరసనాయిలు డబ్బా సైజులో, మధ్యన మూత ఉన్న స్టీలు డబ్బా ఒకటి కనిపించింది. మా ఆవిడ బడ్జెటుకు దగ్గరలోనే ఉంది అని, అది కొని, పసిపిల్లాడిని పట్టుకున్నట్టు మోసుకొని, గిఫ్టుగా ఇచ్చాను. ఇప్పటికీ, ఆ ఇల్లాలు మేము వెళ్ళినప్పుడల్లా ఆ డబ్బా నాకు చూపించి, అది ఎంతో ఉపయోగంగా ఉందని చెప్తూ ఉంటే, మా ఆవిడ మాత్రం ముభావంగానే ఉంటుంది .
బహుమతులుగా సంగ్రహించిన స్టీలు వస్తువులలో ఒక్కటయినా ఉపయోగించే పాత్ర లాటిది ఉండదు. వంటింట్లో చిన్న గిన్నెలు ఎన్నో కొన్ని ఉంటాయి. ఆ పాత్రలు నిర్వహించే పాత్ర చాలా పకడ్బందీగా ఉంటుంది. ఒక పాత్రలో పెరుగు తోడు వెయ్యాలి అంటే దానికే వాడాలి. ఫాక్టరీ యూనియన్లలో నాయకులు ఎవరి విధులు వారే నిర్వర్తించాలి, ఇంకొకరి పనిని, ఎంత అవసరం వచ్చినా ముట్టుకోకూడదని ఎంత నిక్కచ్చిగా ఉంటారో, వీటి విషయంలో మా ఆవిడా అంతే. ఇంతకు మునుపయితే ‘ఆ మూడు’ రోజులూ వంటింట్లోకి వెళ్ళే పని పడేది. ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా, ఎప్పుడయినా వంటింట్లో, కాఫీ పెట్టాల్సిన, లేక అన్నం పడేయాల్సిన అవసరమో, అగత్యమో ఏర్పడినప్పుడు, ఏదో చేస్తున్నాడు కదా అని ఊరుకోకుండా, పెరుగు తోడేసే గిన్నెలో పాలు కాచాననీ, సాయంత్రం కాఫీ గిన్నెని, ఇప్పుడు ఎందుకువాడాననో, కూర గరిట అది కాదనీ, ఇటువంటి సవాలక్ష అభ్యంతరాలు లేవనెత్తుతూ ఉంటుంది. ఒకసారి నాకు కోపం వచ్చి ఒకే సైజులోవి రెండేసి చొప్పున మూడు సైజుల గిన్నెలు కొనుక్కొచ్చాను. వాటితో పాటు అన్నం గరిటలు రెండు కొనుక్కొచ్చాను. అవి కొన్న తరువాత ఒక సారి వంటింట్లోకి వెళ్ళి చూస్తే ఒక్కటే చిన్న గిన్నె కనిపించింది. అప్పుడు కొన్నవి ఏమయ్యాయని అడుగుతే సమాధానం, 'అవసరం ఉండదు కదా అని పెట్టెలో పెట్టేసాను'. తీద్దామా అంటే, ఆ పెట్టెమీద, అంతకన్నా బరువయిన మరో పెట్టె ఉంటుంది. లక్ష్మీదేవి గలగల అన్నట్టు, అన్ని బొచ్చెలనూ పక్కకి తీస్తే కాని మనకు కావలసిన చిన్న గిన్నె కనిపించదు. అన్నం గరిటెలు కొనడానికి ఇంకో కారణం ఉంది. పని మనిషి రెండు రోజులు నాగా పెడితే, మూడో పూట, అన్నం ఒక పెద్ద చెంచాలాంటి గరిటతో వడ్డించింది. సకారణం, ‘పనిమనిషి రాలేదు కాబట్టి అన్నం గరిటెలు అంట్లల్లో ఉండిపోయాయి’. అన్నం గరిట కడగడం ఎంతసేపు పడుతుంది? అన్నం తిన్న వెంటనే కడుక్కుంటే సరిపోతుందికదా అనే ప్రశ్నకి సమాధానం ఉండదు. 
అసలు పనిమనిషి అన్న వ్యవస్థను సృష్టించిందే ఆవిడలు. ఒక విధంగా చూస్తే, రకరకాల వృత్తుల వారిని సమాజం పోషించడానికే ఇటువంటి పనులు కల్పింపబడ్డాయనుకున్నా, మధ్యతరగతివారికి మాత్రం వారి కాలం అంతా పనిమనిషి కేంద్రంగా తిరుగుతూ ఉంటుంది. పొద్దున్నే పనిమనిషి వచ్చాకనే రోజు మొదలవుతుంది. పనిమనుషులకి ఒక ప్రత్యేకత ఉంది. రేపు రావడంలేదని ముందు రోజు చెప్తే వాళ్ళ సొమ్మేంపోతుంది? చచ్చినా చెప్పరు. ఆ మర్నాడో తరవాత రోజో, మా పక్కింటివారికి ఒంట్లో బాగాలేదనో, బంధువులెవరో చనిపోయాడనో, ఏదో ఒక కారణం పోస్ట్ మార్టం లాగా చెప్తారు. మా ఆవిడకి పనిమనిషి రాని రోజంతా మూడ్ ఆఫ్. 'రేపు ఉదయమే బయలుదేరి వెళ్దాం' అంటే, 'పనిమనిషి అప్పటికి రాదుగా' అని వెంటనే సమాధానం. 'మనం సాయంత్రానికి తిరిగి వస్తాం కదా' అంటే, 'అంట్లు అలాగ ఉండిపోతాయి. పాచి ఇల్లు తుడవకుండా ఎలా వెళ్తాం?' అని ప్రశ్నే. ఒక్క రోజు తుడవకపోతేనో, లేకపోతే, తనే తుడుస్తే ఏమవుతుంది, అని అడగగలిగే భర్త ఎక్కడయినా ఉంటాడా!
పిల్లలొచ్చినప్పుడు మాపిల్లలకీ వాళ్ళు చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలో, ఊళ్ళో చూపించాలని ఉంటుంది. ఇటువంటి పర్యాటనలకు, ఉదయమే బయల్దేరాలి కదా. నలుగురు వచ్చినప్పుడు అంట్లు ఎక్కువగానే తయారవుతాయి. వాటిని తోమడానికి పనిమనిషి సణుగుడు అటుంచి, అంత ఉదయాన్నే వచ్చే అవకాశం ఉండదుగా. దీనికి నా వద్ద ఉండే ఒకే ఒక పరిష్కారం, ఎవరూ లేవకముందే లేచి, గుట్టుచప్పుడు కాకుండా నేనే తోమడమే! కూతురయినా, కోడలయినా, లేస్తే, 'మీరు తోమడమేమిటి, నేను ఉన్నానుగా' అని సమాధానం చెప్పి నన్ను ఆ పనినించి తప్పిస్తారు. గుణుస్తూ, చేస్తారనుకోండి. 
టీవీ సంగతి ఉదహరించకుండా కుదరదు. టీవీని, 'ఇడియట్ బాక్సు ' అని ఎవరు పేరు పెట్టారో కాని, వారే ఇడియట్లు. అది లేని ఇల్లు ఊహించగలమా? దాని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆవిడలను ఆకర్షింపచేసుకుని, అనవసరమయిన గొడవలను సృష్టించకుండా ఆపగలిగిన మహాశక్తి కలిగి ఉంది. కొంతమంది అంటూ ఉంటారు, 'దానిలో ఆడ విలన్లు ఉంటారు, కిడ్నాపులు నేర్పుతాయి, అత్తగార్లనూ కోడళ్ళనూ కొత్త కొత్త విధాలుగా హింసించే విధానాలు నేర్పుతాయీ' అని. అది శుధ్ధాబధ్ధం. టీవీలవల్ల ఎక్కువ నేర్చుకోనక్కరలేదు, స్వతహాగానే హింస అన్నది నేర్చుకునే పుడతారు. అదీ కాక, టీవీని నోరెళ్ళబట్టి చూడడం తప్ప, విచక్షణతో చూసే ఆవిడలు ఉండరు. అలా చూసే వారే ఉంటే, ఏ ఒక్క సీరియల్నీ చూడరు. ఈ సీరియళ్ళు అన్నీ, తర్కానికి నిలబడవు. విజ్ఞానానికి టీవీ చూడరు. అజ్ఞానాన్ని ప్రాచుర్యం చేయడానికే సీరియళ్ళు పుట్టాయి. 
ఇలా రాస్తున్నానని తెలుస్తే, రేపు నాకేమవుతుందోనని అనుమానంగానే ఉంది. అయినా చాలా ఆవిడలు చదువుతారనే ఆశతో రాస్తున్నాను.
రచన:-
*గాడేపల్లి సుబ్రహ్మణ్యం*
208, శ్రీ సిధ్ధివినాయకనగర్,
ఫూల్ బాగ్ రోడ్డు, విజయనగరం 535002.

నమ్మినవాడికి నమ్మినంత


ఓ ఊళ్ళోరాముడ్ని కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు. అయితే అతను బంగారం పట్టినా మట్టయ్యేది. దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు.

ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది.

"రాముడ్ని మన దరిద్రం తీర్చమని ప్రార్ధించరాదూ? ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు".

"పిచ్చిదానా! మనకేం కావాలో ఆయనకు తెలీదా? అందుకు నేనాయనకు సూచనలు ఇవ్వలేను" అని అతను ఒప్పుకోలేదు.

ఆ రాత్రి రాముడు అతనికి కలలో కనబడి చెప్పాడు.

"నీ ఇంట్లోని గూట్లో ఆరు రూపాయలు ఉన్నాయి కదా? అవి తీసుకొని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకి వెళ్ళు. అక్కడ ఆరు రూపాయలకి నీకు ఇష్టమైంది ఏది కనబడితే అది కొను. నీ దరిద్రం తీరుతుంది."

ఉదయం నిద్రలేవగానే తన భార్యకి ఆ కల గురించి చెప్పి, అతను సైకిలు మీద పెద్ద బజారుకి బయలు దేరాడు. ఓ చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరని అడిగాడు. జత పది రూపాయలు. ఇంకొంచెం ముందుకు సాగాడు, వేలంపాట వేసే ఓ హాల్లో బొమ్మలని వేలం వేస్తున్నట్లు బయట బోర్డుని చూసి లోపలకి వెళ్ళాడు. గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి. వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది వచ్చారు. అతను వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతాలతో గీసిన ఓ బొమ్మని చూపించి చెప్పారు నిర్వాహకులు.

"దీని పేరు శ్రీ రామచంద్రుడు. దీన్ని గీసింది దీపక్ అనే ఆరేళ్ళ కుర్రాడు. మా పాట అయిదు రూపాయలు."

చిన్న పిల్లవాడు గీసిన ఆ నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. అసహానంగా పెద్ద చిత్రకారుడి బొమ్మల వేలంపాట మొదలవడం కోసం వారంతా వేచి చూడసాగారు.

"మొదటిసారి అయిదు రూపాయలు....రెండవసారి..అయిదు రూపాయలు...." అది రాముడి బొమ్మ అవడంతో, వెంకట్రావు గట్టిగా 'ఆరు రూపాయలు' అని అన్నాడు.

" ఆరు రూపాయలు, ఒకటోసారి..రెండోసారి..." దాన్ని కొనడానికి అక్కడున్న వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, 'మూడోసారి' అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలంపాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు. అక్కడున్న వాళ్ళంతా ఆ బొమ్మని కొన్న వెంకట్రావు వంక వింతగా చూసారు.

"వేలంపాట మొత్తం ముగిసింది." అని చెప్పారు నిర్వాహకులు.

'అదేమిటి? ఇంకా గోడకి వేలాడే ఆ అసలు బొమ్మలని వేలం వేయాలిగా?" అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు.

"ఈ బొమ్మలని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాసాడో వినండి. అకాల మృత్యువువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటగా అయిదు రూపాయలతో వేలం వేయాలని, దాన్ని ఎవరు కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటిని ఉచితంగా ఇవ్వాలని రాసాడు. కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు.. ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది. కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలని మీరు ఇతని నుండి కొనుగోలు చేయండి."

_ఎవరైనా దేవుణ్ణి కానీ, దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే... అతని విలువకు పది ఇంతల విలువను చేకూర్చడానికి, అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి..ఆ ప్రేమని పొందగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు.._
*సేకరణ:* సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు.

*ఐశ్వర్యం ??*



• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?

• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.

• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!

• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.

• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*.

• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*.

• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*.

• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*.

• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*.

• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*.

• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*.

• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*.

• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*.

• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.

• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*.

• అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు *ఐశ్వర్యం*.

• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*.

• బిడ్డలకొచ్చే చదువు *ఐశ్వర్యం*.

• భగవంతుడిచ్చిన ఆరోగ్యం *ఐశ్వర్యం*.

• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*.

• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.

• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.

• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*.

• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం*

ధన్యవాదాలు.....🙏

**మళ్లీ మూలాల్లోకి**



మనిషి తనకు మెట్లెక్కడం భారమనుకుని , *లిఫ్ట్* ను కనుక్కుని ఎక్కడం
అలవాటు పడ్డాక ,
తద్వారా
పెరిగిన కొవ్వును
కరిగించు కోవడానికై
 *మళ్లీ*
 *మెట్లెక్కుతున్నాడు* !!!!

నడక కష్టమనీ, ఎంతో శ్రమపడి కారు ను తయారు చేసుకుని,
వాడటం మొదలెట్టాక ,
లావెక్కిన తనను తాను.. తగ్గించు కోవడానికై,
వాఁకింగ్ పేరుతో
 *మళ్లీ* *రోడ్డున* *పడ్డాడు* *మనిషి* !!


హరిత విప్లవం అంటూ
అనేక రసాయనాల్ని వాడి, పంటలను పెంచుకున్నానని
గర్వపడేలోగా, వాటి
దుష్ప్రభావం తెలిసి
మళ్లీ ఆర్గానిక్ పేరు
జపిస్తున్నాడు!!

పారిశ్రామిక విప్లవంతో
ఏదో సాధించాననుకుని మిడిసిపడ్డ మనిషి,
తను నాశనం చేసిన
ప్రకృతిని బ్రతికించు కోవడానికి మళ్లీ పర్యావరణ మంత్రం పఠిస్తున్నాడు!!

పిజాలు, బర్గర్లు అంటూ వెంపర్లాడిన,
మనిషి కరొనా పుణ్యమా అని
మళ్లీ ఆరోగ్యకరమైన ఇంటి తిండికి అలవాటు
పడుతున్నాడు!!

ఇంగ్లీష్ మందులంటూ, జిమ్ములంటూ పరిగెత్తిన మనిషి కరొనా నుంచి రక్షణ కై మళ్లీ యోగా , ప్రాణాయామం,
ఆయుర్వేదం అనడం నేర్చుకుంటున్నాడు!!!

ఉమ్మడి కుటుంబాలని చీదరించుకుని,
చిన్న కుటుంబాలతో సుఖపడదామనుకున్న, మనిషి మళ్లీ అంతా కలిసుందాం రా అంటూ పాత బంధాల వైపే మొగ్గు చూపు తున్నాడు!!!

పడచు పిల్ల లాంటి పట్నం మోజులో పడి తల్లి లాంటి పల్లెను మరచిన మనిషి, కరోనా భయంతో , ఫామ్ హౌజుల పేరిట,
పచ్చని ప్రకృతి కొరకై
 *మళ్లీ* *పల్లె* *బాట* *పట్టాడు* !!

 *ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమోమరి*!!

              ......✍️

ప్రవచనం




Using the mask


7 wonders of life




అష్టకం




రేడియో నాటకం



తిరుమల శ్రీవారి ఆలయంలో



నమకం చమకం




ఆలయాల్లో ఇవి దానం చేయాలి



🌺 ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే.. ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది.

🌺 అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు. ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు.

🌺 అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు. చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు.

🌺 ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు

🌺 కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది. వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి. ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం. చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది. దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం.

🌺 ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు. దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు. వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు.

🌺 పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి, బండిని లాగేఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా వేయింతల ఫలం లభిస్తుంది. వన్యమృగాలు, పక్షులదానం అగ్నిష్ఠోమయాగ ఫలితాన్ని ఇస్తుంది. పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి.

🌺 నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి. శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి, దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది. దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది.

🌺 ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది. వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే. పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి, జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది. దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.
🙏స్వస్తి🙏
శ్రీ దత్త ఘనపాఠి ఋగ్వేదం .అనంతపురం 8277246156.

శ్రీహృషీకేశాష్టకం


1) నమో భగవతే హృషీకేశాయ
   సహస్రవదనాన్వితసహస్రాక్షాయ
   యక్షగంధర్వకిన్నరసేవితాయ
   వేదవేదాంగశాస్త్రపురాణసన్నుతాయ ||

2) నమో భగవతే హృషీకేశాయ
   శౌర్యపరాక్రమభవ్యతేజోమయాయ
   వశిష్ఠవామదేవాదిమునిగణపూజితాయ
   కౌంతేయాదిసురక్షకమలహస్త

3) నమో భగవతే హృషీకేశాయ
   సమ్యక్పరిశీలనాశక్తిప్రదాయకాయ
   భక్తధృవధృవమండలప్రదాయకాయ
   తులసీబిల్వమాలాధరపన్నగశయనాయ ||

4) నమో భగవతే హృషీకేశాయ
   భక్తానురక్తశుభప్రదచతుర్భుజాయ 
   ఆద్యంతరహితకాలపురుషాయ 
   సవితృమండలమధ్యస్థాయ ||

5) నమో భగవతే హృషీకేశాయ 
   అజ్ఞానాంధకారహరణగురుస్వరూపాయ
   సర్వోపద్రవారణనళినేక్షణాయ
   సత్యాసత్యవివేకవిచక్షణాశీలాయ ||

6) నమో భగవతే హృషీకేశాయ
   నవనవోన్మేషపరాద్యుతిభాసమానాయ
   ధ్యానమగ్నఅర్ధనిమీలితనేత్రాయ
   వ్యాసాంబరీషప్రహ్లాదాదిసేవితాయ ||

7) నమో భగవతే హృషీకేశాయ
   శ్రీఆదిశంకరాచార్యారాధ్యదైవతాయ
   యోగీశ్వరనిర్మలహృదయస్పందనాయ
   జీవపరిణామశీలప్రభావవైశ్వానరాయ ||

8) నమో భగవతే హృషీకేశాయ
   జడాజడవ్యక్తావ్యక్తస్వరూపాయ
  రత్నప్రవాళముక్తాకేయురహారభూషితాయ
   సత్సంగవ్యాసంగనామపారాయణాసుప్రీతాయ ||

    సర్వం శ్రీహృషీకేశదివ్యచరణారవిందార్పణమస్తు

Jokes











































Song



Complete cleaning



Be cool




కార్టూన్లు