4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

 *శ్రీమాత్రేనమః*




*661వ నామ మంత్రము*


*ఓం సదసద్రూప ధారిణ్యై నమః*


సత్-అసత్ అనగా బ్రహ్మము-జగత్తు, లేదా వ్యక్తము-అవ్యక్తము, భావము-అభావము, అస్తిత్వం-నాస్తిత్వం, మంచి-చెడు మొదలైన ఒకదానికి ఇంకొకటి వ్యతిరేకము అనిపించే ద్వంద్వములన్నియు కూడా పరమాత్మ తత్త్వమును ప్రతిపాదించగా - ఇలాంటి అనుకూల ప్రతికూలములు సమానముగా ఉండుటయే పరమాత్మ తత్త్వము. అట్టి పరమాత్మ తత్త్వంగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సదసద్రూప ధారిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం సదసద్రూప ధారిణ్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లికరుణచే బ్రహ్మజ్ఞాన సంపదలు, ఆత్మానందానుభూతిని పొంది, భౌతికంగా సుఖసంతోషములు, ప్రశాంతజీవనమును కొనసాగించును.


సత్తు అంటే సత్యము. అనగా బ్రహ్మము. అసత్తు అనగా అసత్యము అనగా అనంతకోటి జీవరాసులు ఉన్న ఈ జగత్తు. ఈ జగత్తు ఒక నాటకరంగం. పాత్రలు వస్తాయి నిష్క్రమిస్తాయి. మళ్ళీ వేరే పాత్రలు వస్తాయి అవికూడా నిష్క్రమిస్తాయి. జననమరణ చక్రభ్రమణము. ఏదీ సత్యంకాదు, నిత్యంకాదు. ఇటు బ్రహ్మము అనగా సత్యమూ ఆమెయే, అటు అనిత్యము, అసత్యము అయిన జగత్తు ఆమెయే. సత్తు అనేది పారమార్ధిక సత్యము అయితే అసత్తు అనేది తుచ్ఛము. ఒకదానికి ఇంకోటి ప్రతికూలమైన ఈ రెండిటినీ ప్రకాశింప జేసేది జగన్మాతయే. అసత్తు అనేది నామరూపాలు కలిగి, కంటికి కనిపించే ఈ మాయాజగత్తు. ఇక సత్తు అంటే నిత్యము, సత్యము, ఈ అసత్తు అనే మాయా జగత్తును సృష్టించిన బ్రహ్మము. కంటికి కనిపించే అసత్తు అయిన జగత్తు అవ్యక్తమయితే ఆ జగత్తును సృష్టించే బ్రహ్మము కనిపించదు అంటే అవ్యక్తము. ఇలా వ్యక్తావ్యక్తరూపాలు ధరించి యున్నది పరమేశ్వరి. అందుకనే జగన్మాత *సదసద్రూపధారిణీ* అని స్తుతిస్తున్నాము.


భావ-అభావాలు, సత్యం-అసత్యం, అస్తిత్వం-నాస్తిత్వం, మంచి-చెడు ఇలాంటి అనుకూల ప్రతికూలములు కలిగిన ద్వంద్వములన్నీ కూడా వ్యక్తావ్యక్త స్వరూపిణి అయిన పరమేశ్వరి. అందుకే సత్తు-అసత్తుల ద్వంద్వభావమే *సదసద్రూపధారిణి* అయిన అమ్మవారు.


వ్యక్తావ్యక్తస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సదసద్రూపధారిణ్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


నేడు శుక్రవారము🌻🌻🌻శుక్రవారమునకు అధిపతి శుక్రగ్రహము🔯🔯🔯శుక్రుడు భృగు వంశస్థుడు గాన శుక్రవారమును భృగువారము అని అంటారు🌺🌺🌺లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది అందుచే శుక్రవారము లక్ష్మీకరమైన రోజు🔯🔯🔯మంగళకరమైన రోజు గాన లక్ష్మీదేవిని ఆరాధించే శుభదినము.

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

కామెంట్‌లు లేవు: