4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శ్రీనాధుడు "శృంగారకవి

 

కవిసార్వభౌముడు శ్రీనాధుడు "శృంగారకవి" అనుటకు సందియమేలేదు శ్రీనాధుని శృంగారపద్యములు

ఉ.

గుబ్బలగుమ్మ లే జిగురుగొమ్మ సువర్ణపు కీలుబొమ్మ బల్ ,

గబ్బి మిఠారి చూపులది కాపుది దానికినేలయొక్కనిం,

బెబ్బులి నంటగట్టితివి పెద్దవు నిన్ననరాదురోరి దా,

నబ్బ! పయోజగర్భ! మగనాలికి నింత విలాసమేటికిన్ !

శా.

దాయాదుల్వలె గుబ్బచన్ను లొరయన్ ధావళ్య నేత్రాంబుజ,

చ్ఛాయన్ తాండవమాడ గేరి పురుషస్వాంతమ్మునన్ మన్మధుం,

డేయం జంగమువారి చంద్రముఖి విశ్వేశార్చనావేళలన్ ,వాయించెం గిరిగిండ్లు బాహుకుశలవ్వాపారపారీణతన్ !

ఉ.

పువ్వులు కొప్పునందురిమి ముందుగ గౌనసియాడుచుండ గా

జెవ్వున జంగసాచి యొకచేతను రోకలిపూని యొయ్యనన్ ,

నవ్వుముఖంబుతోడ దననందనుబాడుచు నాధు చూచుచున్ ,

సువ్వియ సువ్వియంచు నొకసుందరి బియ్యము దంచె ముంగిటన్ !

కామెంట్‌లు లేవు: