హీనజాతి వాని నిలు జేరనిచ్చేనా,
హానివచ్చు నెంతవానికైనా,
ఈగ కడుపు జొచ్చి ఇటట్టు చేయదా,
విశ్వదాభిరామ వినురవేమ *
భావము =
దుర్మార్గపు లక్షణాలు కల వ్యక్తిని మన ఇంటికి పిలిచి మర్యాదగా పలకరించి, కాఫీ ఇచ్చినా వాడు దుర్మార్గంగా ఆలోచన చేస్తూనే ఉంటాడు, అక్కడ వాడికి మనకు ఏదో మనస్పర్థలు రేకెత్తుతాయి. అందుకే వాడి నైజము తెలియగానే వాడి స్నేహానికి తిలోదకాలిచ్చి, సాగనంపటమే ఉత్థ మొత్తమం.అందుకే ఎదుటివాడి గుణమెఱిగి మనము ప్రవర్తించుకోవాలని పెద్దలు చెబుతారు. అలాగే కొన్ని సందర్భాలలో ఆహారపు పదార్దాలలో పొరబాటున ఈగలు ముసిరిన పదార్ధము తిన్నట్లయితే ఎలా కడుపు అంతా గడి బిడి గా ఉంటుందో, దుర్మార్గుడు తో చెలిమి అలాంటిదే అని వేమన మహాశయుని ఉద్ఘాటన.
మీ రాజబాబు 😷🎹🎼🎤
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి