౽౽౽౽౽౽౽౽౽౽౽౽౽౽౽౽౽౽౽౽౽
రేపు ఎవరికోసమైనా ఏడ్వడానికి
కైచిప్పెడు కన్నీటి బొట్లైనా ఉండాలి
నేత్రాలూ ! ఒత్తుకుని ఒత్తుకుని
ఇప్పుడే కన్నీరును చెంపల పై
ఎందుకు పిండేస్తారు
పత్తి సంచులా!
ఆరని తడి చెంపల పై
దుఖం మొలకలౌతుందేమో
చెంపల ఆరేదాక
ఎండలో నిల్చోరాదూ!!
_ కందాలై రాఘవాచార్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి