4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*💫 ప్రతీది మనకు ఆదర్శమే..*_

_

_పడగొట్టిన వాడి పైన పగ పట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకొనే *"సాలె పురుగు"* మనకు ఆదర్శం..._

_ఎన్ని సార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేసే *"అలలు"* మనకు ఆదర్శం..._

_మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే *"మొక్క"* మనకు ఆదర్శం..._

_ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే *"బాణం"* మనకు ఆదర్శం..._

_ప్రత్యర్ధి పెద్దదైన సరే సూర్యుడిని సైతం కప్పి ఉంచే *"మేఘాలు"* మనకు ఆదర్శం..._

_అసాధ్యం అని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే *"గాలిపటం"* మనకు ఆదర్శం..._

_తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే *"పువ్వు"* మనకు ఆదర్శం..._

_ఎంతటి వేడిని అయిన తాను భరిస్తూ మనకు మటుకు చల్లని నీడనిచ్చే *"చెట్టు"* మనకు ఆదర్శం..._

_ఎప్పుడు విడిపోయిన ఇద్దర్ని కలపడానికి తాపత్రయ పడే *"సూది"* మనకు ఆదర్శం..._

_తన మూలంగా లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే *"సూర్యుడు"* మనకు ఆదర్శం..._

_తను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే *"చినుకు"* మనకు ఆదర్శం..._

_చుట్టూ చీకటే ఉన్నా చల్లని వెన్నెల పంచే *"చంద్రుడు"* మనకు ఆదర్శం..._

_ఒక్క సారి అన్నం పెడితే జన్మంత విశ్వాసంగా ఉండే *"శునకం"* మనకు ఆదర్శం..._

_జీవించేది కొంత కాలమైన అనుక్షణం ఆనందంగా ఉండే *"సీతాకోకచిలుక"* మనకు ఆదర్శం..._

_ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే *"హంస"* మనకు ఆదర్శం..!_

_నిరంతరం జీవకోటి హితం కోసం పరితపించే ప్రతి *"హృదయం"* మనకు ఆదర్శం..!_

🙏🇮🇳😷🌳

కామెంట్‌లు లేవు: