*ఆశీర్వచనం సమయంలో తలమీద అక్షింతలు ఎందుకు చల్లుతారు*
ప్రతి శుభకార్యంలో ఆశీర్వచనానికి తలమీద అక్షింతలు చల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా? పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి?
ఇలా చాల మందికి సంశయం కలగవచ్చు.
బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే బియ్యం, మనం మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట.
బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.
మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారం నుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది.
క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందుతారు.
ఇందుకే మన పూర్వికులు, ఆశీర్వచనానికి శక్తి వుంటుంది అని చెప్పేవారు.
🌷🙏 🙏🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి