31, ఆగస్టు 2021, మంగళవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *31.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - నాలుగవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*రాజోవాచ*


*4.1 (ప్రథమ శ్లోకము)*


*యాని యానీహ కర్మాణి యైర్యైః స్వచ్ఛందజన్మభిః|*


*చక్రే కరోతి కర్తా వా హరిస్తాని బ్రువంతు నః॥12301॥*


*నిమి మహారాజు నుడివెను* "యోగీశ్వరులారా! సర్వేశ్వరుడైన శ్రీహరి తనను ఉపాసించినవారి యొక్క భక్తిప్రపత్తులకు వశుడై, లోకకల్యాణార్థము తన ఇచ్ఛానుసారముగా అనేక అవతారములను దాల్చి, వివిధములైన అద్భుతలీలలను ప్రకటించుచుండును. ఇంతవరకును ఆ భగవంతుడు ప్రదర్శించిన లీలలను, ఇప్పుడు చేయుచున్నవాటిని, మున్ముందు నడుపబోవు మహత్కార్యములను గూర్చి వివరింపుడు.


*ద్రుమిల ఉవాచ*


*4.2 (రెండవ శ్లోకము)*


*యో వా అనంతస్య గుణాననంతాననుక్రమిష్యన్ స తు బాలబుద్ధిః|*


*రజాంసి భూమేర్గణయేత్కథంచిత్ కాలేన నైవాఖిలశక్తిధామ్నః॥12302॥*


*ఏడవయోగీశ్వరుడైన ద్రుమిళుడు ఇట్లు నుడివెను* "నిమి మహారాజా! భగవంతుడు అనంతుడు. ఆ స్వామి గుణములు అసంఖ్యాకములు. ఆ ప్రభువుయొక్క గుణములను యథాక్రమముగా పూర్తిగా లెక్కింప బూనుకొనుట మూర్ఖత్వమేయగును. ఏదోవిధముగా ఎంతకాలమునకైనను భూమికణములను లెక్కింప వచ్చునేమోగాని, సమస్తశక్తులకు ఆధారమైన ఆ సర్వేశ్వరుని గుణములను మాత్రము లెక్కించుట అసాధ్యము.


*4.3 (మూడవ శ్లోకము)*


*భూతైర్యదా పంచభిరాత్మసృష్టైః పురం విరాజం విరచయ్య తస్మిన్|*


*స్వాంశేన విష్టః పురుషాభిధానమవాప నారాయణ ఆదిదేవః॥11303॥*


ఆ పరమాత్మ తననుండి పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అనుపంచ మహాభూతములు మొదలగు చతుర్వింశతి తత్త్వములను తానే సృష్టించెను. వాటిద్వారా విరాడ్రూపమైన బ్రహ్మాండమును నిర్మించి, అందు తనయొక్క అంశతో అంతర్యామిరూపమున ప్రవేశించెను. అప్పుడు ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు *పురుషుడు* అను పేరుతో ఖ్యాతి వహించెను. ఇది ఆ స్వామియొక్క మొదటీ అవతారము.


*4.4 (నాలుగవ శ్లోకము)*


*యత్కాయ ఏష భువనత్రయసన్నివేశో యస్యేంద్రియైస్తనుభృతాముభయేంద్రియాణి|*


*జ్ఞానం స్వతః శ్వసనతో బలమోజ ఈహా సత్త్వాదిభిః స్థితిలయోద్భవ ఆది కర్తా॥12304॥*


ఈ ముల్లోకములును ఆ పరమాత్ముని శరీరమే. ఆయనశక్తి కారణముననే దేహధారులైన సమస్తప్రాణుల యొక్క జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు రూపొందినవి. ఆ స్వామియే ప్రాణులన్నింటిలో అంతర్యామి రూపమున స్థితుడైయున్నాడు. అందువలననే సకలజీవులలో జ్ఞానశక్తి, ప్రాణశక్తి ఏర్పడినవి. ఆ ప్రభువు యొక్క శక్తివలననే అందఱికిని శారీరకశక్తి, మానసికశక్తి, క్రియాశక్తి సమకూరినవి. ఆదికారణుడైన శ్రీమన్నారాయణుడు సత్త్వ, రజ, స్తమోగుణములద్వారా ఈ విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములను జరుపుచుండును. ఇది ఆ పరమాత్ముని లీలావిలాసము.


*4.5 (ఐదవ శ్లోకము)*


*ఆదావభూచ్ఛతధృతీ రజసాస్య సర్గే విష్ణుః స్థితౌ క్రతుపతిర్ద్విజధర్మసేతుః|*


*రుద్రోఽప్యయాయ తమసా పురుషః స ఆద్య ఇత్యుద్భవస్థితిలయాః సతతం ప్రజాసు॥12305॥*


ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడే మొట్టమొదట రజోగుణముద్వారా బ్రహ్మరూపమున విశ్వమును సృజించెను. యజ్ఞములకు అధిపతియైన శ్రీహరి ద్విజులయొక్క వర్ణాశ్రమాను గుణధర్మములను నిలుపుటకై సత్త్వగుణముద్వారా విష్ణురూపమున విశ్వమును రక్షించుచుండును. ఆ ఆదిపురుషుడే రుద్రరూపమున తమోగుణముద్వారా విశ్వమును లయమొనర్చును. ఈ విధముగా ఈ విశ్వముయొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు శ్రీమన్నారాయణుడే కారకుడు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*402వ నామ మంత్రము* 31.8.2021


*ఓం విద్యాఽవిద్యా స్వరూపిణ్యై నమః*


విద్య (జ్ఞానము, ఏకత్వం), అవిద్య (అజ్ఞానం, నానాత్వ భావము) - ఈ రెండిటి స్వరూపమై విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలీ *విద్యాఽవిద్యా స్వరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును, *ఓం విద్యాఽవిద్యా స్వరూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు భక్తులకు ఆ తల్లి అజ్ఞానులకు జ్ఞానము, అద్యైతభావన, జ్ఞానులకు కైవల్యమును ప్రసాదించును.


'విద్యను, అవిద్యను తెలిసికొనినవాడు అవిద్యచే మృత్యువును తరించి, విద్యచే అమృతత్వమును, మోక్షమును పొందును' అని ఈశాన్యోపనిషత్తులో చెప్పబడినది. విద్య, అవిద్య అను రెండిటిని గ్రహించవలెను. అందుచే విద్యా, అవిద్యల స్వరూపమైన పరమేశ్వరిని ఉపాసించవలెను. విద్య అనగా స్వాత్మారూపజ్ఞానము అనియు, అవిద్య అనగా చరమవృత్తి జ్ఞానము అనియు అందురు. అనగా అద్వైతభావనతో తననే పరమాత్మగా తెలిసికొనుట విద్య అని చెప్పబడితే, జీవాత్మ, పరమాత్మలను వేరు వేరుగా చెప్పడమనేది అవిద్య. దేనిలో భేదవృత్తితో చరమవృత్తి రూపజ్ఞానము ఉండునో అది అవిద్య, దేనిలో వృత్తిరాహిత్యముతో ఆత్మైక్యానుభూతి కలుగునో అది విద్య. ఇటువంటి విద్య-అవిద్యల రెండిటి స్వరూపము తనదిగా విరాజిల్లుచున్నది పరమేశ్వరి గనుకనే ఆ తల్లి *విద్యాఽవిద్యా స్వరూపిణీ* యని అనబడినది.


విద్యాస్వరూపము తెలిసికొనిన జ్ఞాని ముక్తుడగును. అవిద్యారూపమును తెలిసినవాడు సంసారబంధమును పొందును. విద్యా-అవిద్యలు రెండూ అవసరమే ఎందుకంటే ఆ రెండు స్వరూపాలు కూడా పరమేశ్వరియే గనుక. విద్య-అవిద్యలు రెండూకూడా సమానంగానే ఉపాసన చేయవలసి ఉంటుంది. అవిద్య వల్ల శరీరాన్ని వదలి విద్యతో జన్మరాహిత్యం పొందవలెను. జ్ఞానం లేకుండా ఉపాసన చేయుట వలనగాని, ఉపాసన లేని జ్ఞానం వలన గాని సద్గతి లభించదు. విద్యను ఉపాసించడం వలన దేవలోకము, అవిద్య వలన పితృలోకము ప్రాప్తిస్తాయి. 'భ్రాంతి, విద్య, పరము అనునవి మూడును శివస్వరూపములు. వేరువేరుగా పదార్థములను తెలిసికొనుట భ్రాంతి, అంతయు ఆత్మస్వరూపముగా తెలిసికొనుట విద్య, వికల్పములులేని కేవల పరతత్త్వాకారము పొంది ఉండుట పరము' అని లింగపురాణమున గలదు. విద్య-అవిద్యలు పరమేశ్వరి స్వరూపాలు గనుక, ఆ తల్లి *విద్యాఽఅవిద్యా స్వరూపిణి* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విద్యాఽవిద్యాస్వరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*985వ నామ మంత్రము* 31.8.2021


*ఓం అంబాయై నమః*


సకల జగత్తులకు మరియు గుణత్రయమునకు జనని అయిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అంబా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం అంబాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి సర్వకాల సర్వావస్థలయందును కాపాడుచు వారికి సకల సంపదలు, శాంతిసౌఖ్యములు, ఆయురారోగ్యములు ప్రసాదించును.


ఇంతకు ముందు నామములో (984వ నామమంత్రములో) జగన్మాతను *త్రిగుణా* యని స్తుతించాము. *సత్త్వరజస్తమో* గుణములు గలదిగా అమ్మవారిని ప్రస్తుతించాము. ఆ గుణములు కలిగియుండుట మాత్రమేగాక, అట్టి గుణములు వ్యక్తమగుటకు ఆ తల్లియే కారణము. గనుకనే అమ్మవారు *అంబా* (త్రిగుణాంబా) యని అనబడినది. సకలజగత్తులకు ఏవిధముగా జనని అయినదో, అలాగే గుణత్రయమునకు కూడా ఆ పరమేశ్వరి జనని.


సృష్ట్యాదియందు పరబ్రహ్మ స్వరూపిణియైన పరమేశ్వరి అవ్యక్తమై, తాను మాత్రమే యున్నది. అట్టి పరబ్రహ్మ తత్త్వం నుండి సత్త్వము, రజస్సు, తమస్సులనెడి త్రిగుణములతోగూడిన మూలప్రకృతి ఉద్భవించెను. ఆ మూలప్రకృతియందు ఏర్పడిన సంక్షోభకారణముగా మహత్తత్త్వము ఉత్పన్నమాయెను. దానినుండి సూత్రాత్ముడైన హిరణ్యగర్భుని ఉత్పత్తి జరిగెను. ఈ సూత్రాత్మ నుండి జీవులకు ఉపాధియగు (కార్యరూపమైన) అహంకారము, మనస్సు, ఇంద్రియములయొక్క అధిష్ఠానదేవతలు, ప్రాణములు, ఇంద్రియములు, అట్లే శబ్ధాది విషయములు ఉత్పన్నములయ్యెను. ఆ పరమాత్మయే జీవరూపముగా ఈ తత్త్వములన్నింటిలో ప్రవేశించెను. ఈ విధముగా అన్ని రూపములలోను అనంతశక్తి స్వరూపమైన ఆ పరమాత్మ మాత్రమే ప్రకాశించుచుండెను. గుణత్రయమునకు కారణభూతురాలు కనుకనే పరమేశ్వరి *అంబా* యని అనబడినది. ఈ విషయాన్ని మంత్రశాస్త్రములో మంత్రజీవమని చెప్పడం జరిగినది. తేజోమూర్తులకు, శక్తిమూర్తులకు, సకల జగత్తులకును కారణము గుణత్రయము. అటువంటి గుణత్రయమునకు కారణమైన పరమేశ్వరి *అంబా* (త్రిగుణాంబా) యని అనబడినది. 


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం అంబాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

తృటి లో మన లెక్క

 తృటి లో మన లెక్క

౮౮౮౮౮౮౮౮౮౮

మనం అప్పుడప్పుడు వింటుంటాం.. పత్రికలలో చదువుతుంటాం.. 

" *తృటి* లో తప్పిన ప్రమాదం " అని.. అసలీ *తృటి* అంటే ఏమిటి? 

మన పూర్వీకులు మనం కాలాన్ని ఎన్ని భాగాలు గా విడదీసారొ,వాటి పేర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం అంటే రెప్ప పాటుకాలం నిముషం కాదు.. 

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

12 కష్టాలు = ఒక నిముషం 

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు

4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట

అదన్నమాట సంగతి.. 

మనము మన విజ్ఞానాన్ని తెలుసుకుందాం.. భావి తరాలకు తెలుపుదాం.. 

*సర్వేజనా సుఖినోభవంతు!*

శ్రీకృష్ణావతారం

 ॐ శ్రీకృష్ణావతారం - కొన్ని ముఖ్య అన్వయాలు 


    దేవకీదేవి అష్టమ గర్భంలో అవతరించాడు.

    నందగోపునివద్ద పెరిగాడు.


* వెన్నముద్దలు కాజేశాడు 


నవనీతమ్ - "నవ" అంటే "కొత్తగా", 

                    "నీతమ్" అంటే -పొందబడింది"

                      జన్మాంతర సంబంధమైన వాసన పాతది. 

                       ఈ జన్మలో మనకి కోరికలు కలగజేసే కర్మల దోషాలు (ప్రార్థనతో) హరించడం.


* కాళీయమర్దనం 


కాళీయుడు - తమో గుణం 


వ్యాపించేది మాయ.

        మాయకు మూలస్థానమైన వాసనా బీజం "కదంబ వృక్షం" నుండి దూకి తమోగుణంమీద నృత్యం చేశాడు.

        పాదాలు శిరస్సుపై పెట్టుకుంటే, ఆ పాద ముద్రలు చూస్తే, "గరుడుడు"(వేదం) ఏమీ చేయలేడు - అంటాడు. అంటే వేదం కర్మలు చెబుతుంది కదా! 


* గోపికా వస్త్రాపహరణం 


గోపికలు - ఇంద్రియాలు

    - వాసనా తత్త్వం కలిగిన ఇంద్రియాలు నీటిలో మునిగియున్నాయి. 

   - గుడ్డలు విడిచినా(మాయ తొలగినా) మళ్ళీ ప్రాపంచకమైన మాయలో పడతాయి. 

    - మాయను కృష్ణుడు స్వాధీనపరచుకుంటే,

      "నీరు" అంటే "అజ్ఞానం" అనే నుంచీ వస్తే తప్ప ఇవ్వను అన్నాడు.

     ఆయన చేతినుంచీ వచ్చేది "జ్ఞానం".

      లోకంలో వచ్చేది మాయ.


కృష్ణః 


 కర్షతీతి కృష్ణః

 - ఆకర్షించే స్వభావం ఉన్నవాడు. 


    కృష్ణావతారం జరిగి ఇప్పటికి 5,247 సంవత్సరాలైంది.


                      =x=x=x=


    — రామాయణం శర్మ

            భద్రాచలం

తిరుమల తిరుపతి గోవిందా !

 వందేమాతరం

 

తిరుమల తిరుపతి గోవిందా !

 

గత రెండు సంవత్సరాలుగా అధ్యాత్మికంగా కాక ఎడారిమత పాలనలో అక్కడ జరుగుతున్న వికృత కార్యకలాపాల వలన తిరుమల ప్రతీరోజు వార్తా శీర్షికల్లో  కనిపిస్తోంది.

 

కరోనా పేరు చెప్పి ఉచిత దర్శనం రద్దు చేసారు. ప్రస్తుతం ఆంధ్రాలో అవనీతి ఆనవాయితీ కాబట్టి 300 రూపాయలిస్తే కరోనా రాదనుకొంటా, ఆ దర్శనం మాత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంలా కొనసాగుతోంది.

కొండక్రింద తిరుపతిలో కూడా దైవ దర్శనాలకి ఎటువంటి ఆంక్షలు లేవు. 

 

కరోనా పేరు చెప్పి  ప్రజల  దృష్టికి అందని మరోక భయంకరమైన కుట్ర అక్కడ జరుగుతోంది.   తిరుపతి ప్రాదాన్యత తగ్గించడానికి మెల్లగ కొండపై వసతి సౌకర్యాలు తగ్గించుకొంటూ వస్తున్నారు.

 

ఈ మధ్య సాంప్రదాయ భోజనం  అంటూ ఒక క్రొత్త ప్రక్రియ మెదలుపెట్టారు. ఇది ఫక్తు వ్యాపారం. తిరుమల క్షేత్రం యొక్క పవిత్రతను దెబ్బతీసే ఒక కుతంత్రం.   తిరుమలని ఒక holiday spot గా తయారుచేసి , ఆ  పేరుమీద అన్ని మతాలవాళ్లని అక్కడ చేర్చి , అసలైన భక్తుల్లో అభద్రత, అసౌకర్యం కలగచేసి వారిని తిరుమలకి దూరం చేయడమే దీని వెనుక ఒక్క ప్రణాళిక.  ఇంతకముందు డా. రాజశేకర్ రెడ్డి  గారు 7 కొండలు కాదు 2 కొండలే అంటూ తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసారు. మిగిలిన 5 కొండల్లో Holiday resorts, amusement parts ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు  అప్పటి ఉడిపి పెజావర్ పిఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ విశ్వేశతీర్థ స్వామి వారు వెంటనే జరగబోయే ఉపద్రవాన్ని గుర్తించి ముందుండి ప్రజా ఉద్యమాన్ని నడపడం వల్ల ఆ దుష్టుల కల కలగానే మిగిలిపోయింది. ఆనాటి ఆ ఉప్పొంగిన ప్రజా ఉధ్యమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కలగడం నా అదృష్టంగా భావిస్తాను. ఆ మత మౌడ్యులు ఆ రోజుల్లో  తిరుమల కొండల్లో ఎన్నో శిలువలు పాతారు. 

 

గత కొన్ని సంవత్సరాలుగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని, హైందవ ధర్మానికి పొంచి వస్తున్న ముప్పు గ్రహించి హిందువుల్లో వస్తున్న సంఘటిత స్పందన ఈ విషయంలో స్పష్టంగా కనిపించింది. ప్రజల్లో, ముఖ్యంగా సాంఘీక మాధ్యమాల ద్వారా పెల్లుబికిన నిరసనలకు భయపడి ప్రభుత్వం తనకు తెలియకుండా జరిగిన విషయమని,  ఆ తప్పును అన్నిటికి  పాపాలబైరవులైన అధికారులపై నెట్టేసి, ఆ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిది. ఇక్కడ కోసమేరుపెమిటంటే, అదేదో ప్రభుత్వపు గొప్పతనంగా కొన్నిమన  సంఘాలే పొగడడం.

 

ఇక్కడ ఒక విషయం చర్చించులోవాలి, తిరుపతి వెళ్ళినవాళ్ళకి భోజనం ఉచితంగా పెట్టాలా అని కొందరు మాధ్యామాల్లో ప్రశ్నించారు. అలా అన్నవాళ్ళు ఎవరు?, వారి వెనుక ఉన్నదేవరు?, అని తెలిసిన విషయాలనే  ఆరా తీస్తూ ఆయాసపడడం కన్నా, దాని వెనుక ఉన్న నిగూడార్ధాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.  ఉచితంగా ఎందుకు పెట్టాలి అన్నారంటే, అక్కడ జరిగే నిత్యాన్నదాన పథకానికి ఎసరు పెట్టే ఆలోచనలో ఉన్నట్టే అని అర్థమవుతోంది.

 

స్వామివారి దర్శనానికి వచ్చే వారందరూ  హుండీలో రూపాయి వేసినా , కోట్లు వేసినా , స్వామివారికి కోట్లతో అభారణాలు చేయించినా, పేద, ధనిక తేడా లేకుండా అందరూ  అన్నసత్రంలో భోజనం చేసేది ప్రసాదమనే భక్తితోనే. ఈ విధంగా రోజూ కొన్ని వేలమంది పేదవారికి కడుపునింపుతున్న ఈ కార్యక్రమానికి ఎందరో గుప్తదాతలు సామాగ్రిని చేరుస్తూ చేయూతనిస్తున్నది అచంచలమైన భక్తితోనే అన్న విషయాన్ని దేవాలయ అధికారులు విస్మరిస్తున్నారు.

ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో  దేవస్థాన నిర్వహణపై ఆందోళన కలిగినపుడు, ప్రస్తుత ఛైర్మన్ ఎంపికలో  పలు అనుమానాలు తలేత్తినపుడు, ఆయన  హిందువు కాదు అని ఆరోపణలు  వచ్చినపుడు, ఆయన అందిరికన్నా పెద్ద హిందువని, నిత్యం గోపూజ చేస్తారని, ఆయన అధ్వర్యంలో దేవస్థానానికి ఎటువంటి ఢోకా ఉండదని, గత అనుభావాల దృష్టా  ఎటువంటి దుశ్చర్యకు ఒడగట్టరని ఆశపడ్డ వాళ్ళల్లో నేనూ ఒకడిని. అందుకు ఇప్పుడు చింతిస్తున్నాను.


ప్రతీ హిందూ దేవాలయంలోనూ  అన్నదానం జరుగుతుంది. ఇది వేల సంవత్సరాలుగా హైదవ సమాజంలో వస్తున అనావాయతీ.  అసలు అన్నదానం ఎందుకు చేస్తారు?

 

మనిషికి ఉన్న పంచ కోశములైన అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూలశరీరానికి  సంబందించినది. మనిషి మనుగడకు అతి ముఖ్యమైన ఈ అన్నమయ కోశములో ప్రవేశించే పదార్థము(అందుకే దానిని అన్నము అంటాము) ప్రాణ శక్తిగా మారి మనిషి ప్రాణాన్ని  నిలుపుతుంది.

 

హైందవ సంస్కృతిలోని గొప్పదనమదే . హిందూ దేవాలయాల్లో నిరంతరంగా జరుగుతున్న ఆన్నదాన ప్రక్రియ వెనుక ఉన్న సంకల్ప లక్ష్యం కూడా సమాజ శ్రేయస్సే.

 

ఇంతటి గొప్ప సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి వేల సంవత్సరాలుగా ఎడారి మతాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ వారు కృతకృత్యులైనా పూర్తిగా నిర్వీర్యం చేయలేక పోయారు. దానికి కారణం మన సంస్కృతి యుక్క గొప్పదనం , హిందూజాతి ప్రజల సంఘటిత  సంకల్పమే.

 

కానీ, మనం తెలుసుకోవలసిన నిజమేమిటంటే , మన దేశ స్వాతంత్రం అనంతరమే మన ధర్మానికి యెక్కువ నష్టం జరిగింది.  ప్రస్తుత తరుణంలో అందరం సంఘటితమై ఎదురునిలువవలసిన సమయం ఆసన్నమైంది. నీ, నా తరతమ భేధం లేకుండా అందరం ఈ ఉధ్యమంలో పాత్ర వహించవలసిందే.

 

ధర్మాన్ని  నాశనం చేసేవాడికి  ప్రాంతీయ భావంతోనో , కుల ప్రాతిపదికతోనో , భాష మత్తుతోనో  మద్దతు పలకం మానుకోవాలి.

 

ఇక్కడ ఒక విషయం, వారి దుశ్చర్యలు ఇంతటితో ఆగిపోవు, సమస్యలు సమిసిపోవు.  అధికారంలో వారికి ఆయువు దొరికినప్పుడేల్లా వారి ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి . కాబట్టి వారి ఆయువు తెలుసుకొని దెబ్బ కొట్టడమే సమస్యకు పరిష్కారం.  సంఘటితంగా నిలవడమే సమాధానం.

 

మీ తరువాయి తరాలకి బ్రతకడమే కాదు భారతీయత కూడా నేర్పండి

 

మీ

 

మృశి

30.08.2021

శాస్త్రము విధించిన అన్ని కర్మలను

 మానవుడు తనకు శాస్త్రము విధించిన అన్ని కర్మలను ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. కాని ఆ కర్మలు చేసేటప్పుడు నన్నే ఆశ్రయించుకొని ఉండాలి. ఆ ప్రకారంగా కర్మలు చేస్తే, నా అనుగ్రహము వలన తుదకు శాశ్వతమైన పరమ పదమును పొందుతాడు.


ఇప్పటి దాకా జ్ఞానము భక్తి గురించి చెప్పిన పరమాత్మ కర్మల గురించి కూడా చెబుతున్నాడు. ఇంతకు ముందు పరమాత్మ కర్మలు స్వధర్మనిష్టతో చేయాలి అని అన్నాడు. ఇప్పుడు ఆ స్వధర్మనిష్టకు భక్తి కూడా తోడవ్వాలి. భగవంతుని మీద భక్తి లేనిదే ఏ కర్మ కూడా సఫలం కాదు అని భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.


మానవుడు కర్మలు చేయక తప్పదు. ఏదో ఒక కర్మ చేయాలి. అందుకే మానవులు తమకు నిర్దేశించిన కర్మలను, స్వధర్మపరమయిన కర్మలను ఆచరిస్తూ కూడా, ఎల్లప్పుడూ పరమాత్మయందు మనసును లగ్నం చేసి, పరమాత్మయందు భక్తి కలిగి ఉండాలి. భక్తితో కూడిన కర్మ మాత్రమే కర్మయోగము అవుతుంది. కేవలం యాంత్రికంగా చేసే కర్మలు, శుష్క, కర్మలు అవుతాయి కానీ కర్మయోగము అనిపించుకోవు. అందుకే ఇక్కడ రెండు నిబంధనలు పెట్టారు. ఒకటి ఏ పని చేసినా పరమాత్మను ఆశ్రయించుకొని చేయాలి. పరమాత్మ పరంగా చేయాలి. కరృత్వభావన లేకుండా చేయాలి. ఫలితం ఆశించకుండా చేయాలి. అందుకే మద్వ్యపాశయ: అన్నారు.


తరువాత మత్ ప్రసాదాత్ అంటే నా అనుగ్రహం కూడా ఉండాలి. భగవంతుని అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది. ఆయనను ఆశ్రయించుకొని ఉన్నప్పుడు. కాబట్టి భగవంతుని ఆశ్రయించడం, ఆయన అనుగ్రహానికి పాత్రులు కావడం ముఖ్యం. అప్పుడు అతడు ఏ కర్మ చేసినా అతనికి ఆ కర్మ బంధనములు అంటవు. సుఖదు:ఖములు ఉండవు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా లోపల భగవన్నామ స్మరణ చేస్తుంటాడు. అటువంటి వాడికి పునర్జన్మ ఉండదు. పరమాత్మలో ఐక్యం అవుతాడు. కాబట్టి ఏ కర్మ చేసినా దైవమును స్మరించుకుంటూ చేయాలి. కర్మలను కర్మఫలములను ఈశ్వరార్పణ చేయాలి. ఏ పని సఫలం కావాలన్నా దానికి భగవంతుని అనుగ్రహం తప్పదు. మనకు ఏది లభించినా దానిని భగవంతుని ప్రసాదంగానే భావించాలి కానీ అంతా నా మహిమ వలననే జరిగింది అనుకోవడం అజ్ఞానం.


కాబట్టి ఏ కర్మ చేసినా భగవంతుని తల్చుకుంటూ, భగవంతుని పరంగా చేస్తూ, దాని వలన వచ్చే ఫలితాలను భగవంతునికి అర్పిస్తే, ఎల్లప్పుడూ పరమాత్మను ఆశ్రయించుకొని ఉంటే, ఆ కర్మలు, కర్మలు చేయగా వచ్చిన కర్మఫలములు అతనిని బంధించవు. అటువంటి వాడికి శాశ్వతమైన, ఎప్పటికీ నాశనము లేని, పరమ పదము అంటే మోక్షము లభిస్తుంది.

.

 #హరేకృష్ణ #కృష్ణంవందేజగద్గురుం #భగవద్గీత #k

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 35

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                   శ్లోకం : 35   

                           SLOKAM : 35

                                                

नमामि नारायणपादपङ्कजं

करोमि नारायणपूजनं सदा ।

वदामि नारायणनाम निर्मलं

स्मरामि नारायणतत्त्वमव्ययम् ॥ ३५ ॥


నమామి నారాయణ పాదపంకజం 

కరోమి నారాయణ పూజనం సదా I    

వదామి నారాయణ నామ నిర్మలం 

స్మరామి నారాయణ   

                        తత్త్వమవ్యయం ॥ 35


    శ్రీమన్నారాయణుని పాద పద్మములకు నమస్కరింతును.   

    నారాయణుని సదా పూజింతును. 

    నారాయణుని నిర్మలమగు నామమును కీర్తింతును.     

    శాశ్వతమగు నారాయణ తత్వమును స్మరింతును.  


    At every moment I bow down to the lotus feet of Nārāyaṇa, 

    I perform worship to Nārāyaṇa, 

    I recite the pure name of Nārāyaṇa, and 

    I reflect on the infallible truth of Nārāyaṇa.


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అంకమ్మ భక్తి..*


"అమ్మా..వయసురీత్యా పెద్దదానివి..ఇంటిపట్టున కూర్చొని కృష్ణా..రామా..అనుకోరాదూ..వారం మార్చి వారం బస్సెక్కి ఇంతదూరం రాకపోతే.." అని మా సిబ్బంది ఆమెతో హాస్యానికి అంటూ వుంటారు.."నాకేం ఇబ్బందీ లేదు..అన్నింటికీ ఆ దత్తాత్రేయుడే వున్నాడు..నాకే భయమూ లేదు..అన్నీ ఆ స్వామే చూసుకుంటాడు.." అని నిర్మలంగా నవ్వుతూ కందుకూరు నుంచి క్రమం తప్పకుండా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చే అంకమ్మ గారు తరచూ చెప్పే మాట ఇది..ఆమె విషయం లో అది నిజం కూడా..


శ్రీ స్వామివారు సిద్ధిపొందినది 1976 వ సంవత్సరం మే నెల 6వ తేదీ నాడు..ఆ తరువాత రెండు సంవత్సరాలకు అంకమ్మ గారు మొదటిసారి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వచ్చారు.."నాకు ముప్పై ఏళ్ల వయసప్పుడు జబ్బు చేసింది..అప్పట్లో ఇంత వైద్య సౌకర్యాలు లేవు..అప్పటికీ మా వాళ్ళు డాక్టర్ల కు చూపించారు కానీ పెద్దగా ప్రయోజనం కనబడలేదు..చుట్టుప్రక్కల వాళ్ళు ఈ స్వామి దగ్గరకు తీసుకెళ్లండి..ఏదైనా గాలి చేష్ట వున్నా బైట పడుతుంది..ఆరోగ్యం బాగు పడుతుందని చెపితే..ఇక్కడికి తీసుకొచ్చారయ్యా..మూడు వారాల్లోనే నేను మామూలు మనిషినయ్యాను..నువ్వు అప్పుడు ఇక్కడ లేవు..మీ నాన్నా..అమ్మా..నన్ను కన్నా బిడ్డలా చూసుకున్నారు..ఈ దత్తాత్రేయుడి దయ లేకుంటే..అప్పుడే నేను పోయేదాన్ని.." అని మొగలిచెర్ల శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతిసారీ నాకు చెపుతూ వుంటారు..


ఆనాటి నుంచీ నేటి దాకా అంకమ్మగారు ఏ కష్టమొచ్చినా..సుఖం కలిగినా..నేరుగా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..ఆ స్వామివారి సమాధి ముందు నిలబడి విన్నవించుకొంటారు..తన బిడ్డల వివాహాలు ఇక్కడే చేశారు..ఆ తరువాతి తరం వాళ్ల వివాహాలు కూడా ఇక్కడే చేశారు..అంకమ్మ గారితో పాటు ఆమె సంతానమూ.. వారి సంతానం కూడా శ్రీ స్వామివారికి అత్యంత భక్తులు..ఇప్పుడంటే వార్ధక్యం కారణంగా అంకమ్మ గారు కేవలం శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి పరిమితం అయ్యారు గానీ..అంతకుముందు ఆవిడ వచ్చినప్పుడల్లా ఏదో ఒక సేవ చేస్తూనే ఉండేది..


పిల్లల కు చెప్పుకొని.. శ్రీ స్వామివారి మందిరం వద్ద..వచ్చి పోయే భక్తుల సౌకర్యం కోసం.. ఒక గది కూడా కట్టించారు..ప్రస్తుతం అంకమ్మ గారి వయసు సుమారు ఎనభై సంవత్సరాలు.. ఇప్పటికీ తన శక్తి కూడగట్టుకొని వారం మార్చి వారం (ఆదివారాల్లో) శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తూనే వుంటారు..ఏనాడూ ఉత్త చేతులతో మందిరానికి రాదు..పళ్ళూ..కూరగాయలూ..బియ్యమో..ఏదో ఒకటి తీసుకొని వస్తారు..అంకమ్మ గారు శ్రీ స్వామివారిని దర్శించుకునే పద్దతి చిత్రంగా ఉంటుంది..ఆవిడ మందిరం లో గడిపే నాలుగైదు గంటల సమయంలో..కనీసం తొమ్మిది పది సార్లు శ్రీ స్వామివారి సమాధిని దర్శించి వస్తుంటారు.."అయ్యా..అక్కడ ఖాళీగా ఉంది..భక్తులెవరూ లేరు..ఒక్కసారి స్వామి దాకా వెళ్ళొస్తా నాయనా.." అని ప్రాధేయపూర్వకంగా అడుగుతారు..మేమూ కాదని చెప్పము.. ఎందుకంటే..ఒక్కొక్కసారి భక్తుల తాకిడి ఎక్కువగా వున్నప్పుడు..ఆవిడే గమనించుకుని ఒక ప్రక్కగా నిలబడి వుంటారు తప్ప..వాళ్ళ మధ్యలో దూరి వెళ్ళరు..తన పరిమితులు దాటి వేరే విధంగా ప్రవర్తించే అలవాటు లేని మనిషి అంకమ్మ గారు..


"మనకు కష్టమొచ్చినప్పుడే స్వామి దగ్గరకు వచ్చి..మనకు సుఖం కలిగితే అది మన గొప్ప అనుకోకూడదయ్యా.. ఏ కాలానికి ఏది మనకు ప్రాప్తమో దానిని అనుభవించాలి..ఇప్పటి వరకూ అన్ని విషయాల్లో ఆ దత్తాత్రేయుడు మమ్మల్ని చల్లగానే చూసాడు..కష్టాలు లేకుండా ఎవ్వరి జీవితమూ ఉండదు..చిన్నదో పెద్దదో కష్టం వచ్చి తీరుతుంది..స్వామిని నమ్ముకుంటే..ఆ కష్టం యొక్క తీవ్రత తగ్గిస్తాడు..నువ్వు చూపే విశ్వాసం..భక్తీ..ఆ రెండే ఆ స్వామి చూసేది..నీ దగ్గరున్న ధన రాశులు ఆయన చూడడు..ఆ స్వామి దయ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేను నేను..ఇట్లా తిరుగుతూ వున్నపుడే నాకు మరణం ప్రసాదించే వరమివ్వు నాయనా..అని కోరుకుంటానయ్యా నేను.." అంటూ ఎల్లప్పుడూ చెప్పుకుంటూ వుంటారు అంకమ్మ గారు..ఆవిడ మాటల్లో అంతర్లీనంగా వేదాంత ఛాయలు ఉంటాయి..శ్రీ స్వామివారి గురించి చెప్పేటప్పుడు అంకమ్మ గారు ఏదో తెలియని ఆనందంతో పొంగిపోతూ వుంటారు..ఆవిడ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి..


అంకమ్మ గారు నిష్కల్మష భక్తి కి ప్రతిరూపంగా వుంటారు..ఆవిడ గారు చెప్పినట్టు భక్తీ విశ్వాసాలే ఆ భగవంతుడు చూస్తాడు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114...సెల్..94402 66380 & 99089 73699).

శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం


నేడు శ్రీకృష్ణ స్వామి జన్మోత్సవం ఒకటే కాదు. మాయమ్మ యోగమాయ జన్మోత్సవం కూడా నేడే. కావున భక్తిశ్రద్ధలతో నేడు ఇరువురుని పూజిద్దాం.. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో శుభోదయం.


శ్రీకృష్ణ

కర్ష యతి ఇతి కృష్ణ అని తెలుపుతుంది నిరుక్తము. మనసును చిలికి వెన్న తీస్తాడు అని తలువ వచ్చు. లేక భూమి దున్ని భక్తిబీజము నాటి సత్ఫలితమునందిస్తాడని చెప్పవచ్చు. నల్లగా ఉంటాడు అనీ చెప్పవచ్చు, ఇవికాక 'క' అంటే బ్రహ్మ. 'ఋ' అంటే అనంతుడు. 'ష' అంటే శివుడు. 'ణ' అంటే ధర్మము. 'అ' అంటే విష్ణువు. విసర్గ (అః) అంటే నరనారాయణులు. కృష్ణునిలో కృషి ఉంది. కర్షణ ఉంది, ఆకర్షణ ఉంది, సంకర్షణ ఉంది. (అందుకే ఉపసర్గలు) అని సద్గురు శివానందమూర్తి గారు తమ అనుగ్రహ భాషణములో ఒక పర్యాయము పేర్కొన్నారు.

కృష్ణుని తెలుసుకొనుట సులభమైన విషయము కాదు. అది మహామహులకే అంతుబట్టని విషయము. నేనో ఒక పిపీలిక పాదమును. మహనీయుల వల్ల విన్నది, నేను చదివి తెలుసుకొన్నది, నాకు గుర్తున్నంతవరకు తెలియజేయ ప్రయత్నము చేస్తాను. కృష్ణ తత్వము తెలుసుకొనుటకు భాగవతము మాత్రమే చాలదు. ముఖ్యముగా బ్రహ్మవైవర్త పురాణము, హరివంశమే కాకుండా భారతము కూడా చదువవలసి వుంటుంది.


శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.


శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం

ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగేయుగే [1.3.28 ]


ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే. 


కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే. 

ధర్మ విరోధుల చేత లోకం వ్యాకులం చెందినపుడు. రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు.


కొన్ని అవతారాలలో పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది.


శ్రీకృష్ణావతారం వల్ల లోకానికి మూడు ముఖ్యమైన ప్రయోజనాలు


 ఒకటి - వేదాంతం గ్రంధాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమే అని తన అద్భుతమైన జీవితం ద్వారా నిరూపించడం.


 రెండు- అత్యద్భుతమైన మధురభక్తిమార్గాన్ని లోకానికి అందించడం. కృష్ణప్రేమభక్తి మాధుర్యంలో ఓలలాడి ఎందరు భక్తవరేణ్యులు దివ్యానందాన్ని చవిచూసారో లెక్కలేదు. వేదాంతంలో అత్యున్నతమైనదిగా తలచే మోక్షాన్ని కూడా తక్కువ స్తాయిదిగా తలచి త్రుణీకరించగల శక్తి మధురభక్తి సొంతం. దివ్యమైన మధురప్రేమానుభావం ముందు మోక్షం కూడా వెలవెలా బోతుంది అన్నది వాస్తవమే.


మూడు - సమస్త వేదాంతసిద్ధాంతాలనూ భగవద్గీతా రూపంలో సమన్వయపరచడం. ఇప్పటివరకూ వచ్చిన ఆచార్యులు పండితులు అందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసినవారే. ఎందుకంటే సమస్త వేదవేదాంతాల సారం గీతలో నిక్షిప్తమై ఉన్నది.


కాకపోతే ఇటువంటి మహత్తరమైన అవతారాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎప్పటిలాగే మన దురదృష్టం. కృష్ణుడు అబద్దాలు చెప్పాడనీ, మోసాలు చేసాడనీ, గోపికలతో సరసాలు సాగించాడనీ, రాసలీల అనేది కామకేళి అనీ పిచ్చిపిచ్చి మాటలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు చేసినట్లు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యండి - వ్యతిరేకంగా మాత్రం చెయ్యకండి. అన్న శ్లేషాత్మకవ్యాఖ్యలూ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుని ఔన్నత్యం అర్ధంకాక అజ్ఞానులు అనుకునే పిచ్చిమాటలు. కృష్ణావతార మహత్యాన్ని అణుమాత్రం గ్రహించగలిగినా ఆ కధల వెనుక ఉన్న అద్భుతమైన ఔన్నత్యాన్ని మనం చూడగలుగుతాం.

30, ఆగస్టు 2021, సోమవారం

ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి

 కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి 




అవునండి కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు 


యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య 




కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు ధరి చేరకుండా ఉండడంతో కృష్ణుడు కర్ణుడిని వెళ్ళి ఒక కోరిక అడిగాడు 




కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని అడిగాడు 


కర్ణుడు కృష్ణుడు అడగగానే దానం చేసేసాడు 




అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు 




అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు 


ఒకవేళ అలా ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు 




ఆ మాట వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి 


ఇంతమంచి వాడి వేంటయ్యా కర్ణా నువ్వు అని గట్టిగ కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు 




మనం మంచి మనసున్న వారిమైతే చాలండి 


దేవుడి మోక్షం కోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదండీ 


జీవితం ముక్తి పొందడం కోసం దైవదర్శనాలు అంటూ తిరగక్కరలేదండి 




మంచి మనసుంటే చాలండి ఆ భగవంతుడే దిగి వచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు 




కర్ణుడంత కరుణామయులం కాకపోయినా ఏదో ఆయన చిటికిన వేలంత మంచిగా బతికేద్దాం అండి 


🙏🙏🙏🙏

భూచక్రగడ్డ విశేషాలు

 భూచక్రగడ్డ విశేషాలు -


       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు. నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 


          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 


             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.


           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.


        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.


    


     నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *30.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2246(౨౨౪౬)*


*10.1-1358-*


*క. శ్రమజలకణసిక్తంబై*

*కమలదళేక్షణుని వదనకమలము మెఱసెన్*

*హిమజలకణసిక్తంబై*

*కమనీయం బగుచు నున్న కమలము భంగిన్.* 🌺



*_భావము: చెమట బిందువులతో తడిసిన మనోజ్ఞమైన శ్రీకృష్ణుని ముఖకమలము మంచుబిందువులతో తడిసి మనోహరంగానున్న పద్మమువలె రమణీయముగానున్నది._* 🙏🏻



*_Meaning: Soaked in drops of sweat, lotus like lovely face of Sri Krishna is sparkling like the lotus flower drenched in dew drops_* 🙏🏻



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *30.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - మూడవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణన*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*3.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*శుచిః సమ్ముఖమాసీనః ప్రాణసంయమనాదిభిః|*


*పిండం విశోధ్య| సన్న్యాసకృతరక్షోఽర్చయేద్ధరిమ్॥12294॥*


సాధకుడు స్నానాదులచేత శరీరమును, సంతోషాదులచేత అంతఃకరణమును, పరిశుద్ధమొనర్ఛుకొని, భగవంతుని విగ్రహము ముందు ఆసీనుడు కావలెను. ప్రాణాయామాదులచేత నాడీశోధన గావించుకొనవలయును. నిర్దిష్టముగా మంత్రపూర్వకముగా అంగన్యాసకరన్యాస విధులను అనుష్ఠించి పరమేశ్వరుని ఆరాధింపవలయును.


*3.50 (ఏబదియవ శ్లోకము)*


*అర్చాదౌ హృదయే చాపి యథా లబ్ధోపచారకైః|*


*ద్రవ్యక్షిత్యాత్మలింగాని నిష్పాద్య ప్రోక్ష్య చాఽఽసనమ్॥12296॥*


*3.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*పాద్యాదీనుపకల్ప్యాథ సన్నిధాప్య సమాహితః|*


*హృదాదిభిః కృతన్యాసో మూలమంత్రేణ చార్చయేత్॥12296॥*


సాధకుడు స్వయముగా స్నానాది కృత్యములద్వారా తాను పరిశుద్ధుడై, తాను పూజింప దలచిన భగవద్విగ్రహమును సిద్ధముగా నుంచుకొనవలెను. శుద్ధిచేసిన పూజాస్థలమునందు అర్చామూర్తిని నిలుపవలెను. హృదయము నందు భగవంతుని ధ్యానించుకొని, ఆ విగ్రహమునందు పరమేశ్వరుని భావింపవలెను. సమయానుకూలముగా లభించిన పూజాద్రవ్యములను సమకూర్చుకొనవలెను. అర్చామూర్తిని జలములతో శుద్ధిచేయవలెను. ఆసనము మీదను, తనపైనను నిర్మలోదకములచే ప్రోక్షణ చేసికొనవలెను. పిదప అర్ఘ్యపాద్యాదులను, ధూపదీపములను, నైవేద్యములను అర్చామూర్తికి ఎదురుగా నుంచవలయును. అంగన్యాసములను, కరన్యాసములను, హృదయాది న్యాసములను ఆచరింపవలెను. పిదప మూలమంత్రముతో ఇష్టదైవమును (అర్చామూర్తిని) ఆరాధింపవలెను.


*3.52 (ఏబది రెండవ శ్లోకము)*


*సాంగోపాంగాం సపార్షదాం తాం తాం మూర్తిం స్వమంత్రతః|*


*పాద్యార్ఘ్యాచమనీయాద్యైః స్నానవాసోవిభూషణైః॥12297॥*


*3.53 (ఏబది మూడవ శ్లోకము)*


*గంధమాల్యాక్షతస్రగ్భిర్ధూపదీపోపహారకైః|*


*సాంగం సంపూజ్య విధివత్స్తవైః స్తుత్వా నమేద్ధరిమ్॥12298॥*


అనంతరము సాధకుడు ఆయుధాది ఉపాంగసహితునిగా, పార్షదసమేతునిగా తన ఇష్టదైవమును అర్చామూర్తిలో మూలమంత్ర పూర్వకముగా ఆవాహన చేయవలెను. పిమ్మట పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, మధుపర్కము, స్నానము, వస్త్రము, ఆభూషణములు, గంధపుష్పములు, అక్షతలు, తిలకము, మాలలు, ధూపదీపనైవేద్యములు మొదలగువాటితో ఆ దైవమును విధ్యుక్తముగా పూజింపవలెను. స్తోత్రములద్వారా స్తుతించుచు, శ్రీమన్నారాయణునకు సపరివారముగా ప్రణమిల్లవలెను.


*3.54 (ఏబది నాలుగవ శ్లోకము)*


*ఆత్మానం తన్మయం ధ్యాయన్ మూర్తిం సంపూజయేద్ధరేః|*


*శేషామాధాయ శిరసి స్వధామ్న్యుద్వాస్య సత్కృతమ్॥12299॥*


పిదప ఆరాధ్యమూర్తిని తన ఆత్మలో అంతర్యామిగా ధ్యానింపవలెను. భగవన్నివేదితమైన ప్రసాదమును భక్తిపూర్వకముగా స్వీకరింపవలెను. భగవత్పాదములయందు సమర్పింపబడిన పుష్పాదులను శిరమున దాల్చవలయును. పిమ్మట ఉద్వాసనపూర్వకముగా స్వామిని యథాస్థానమున నిలిపి, పూజావిధిని ముగింపవలెను.


*3.55 (ఏబది ఐదవ శ్లోకము)*


*ఏవమగ్న్యర్కతోయాదావతిథౌ హృదయే చ యః|*


*యజతీశ్వరమాత్మానమచిరాన్ముచ్యతే హి సః॥12300॥*


ఇట్లు సాధకుడు హృదయ పూర్వకముగా అగ్నియందును, సూర్యునియందును, జలములయందును, అతిథులయందును, శ్రీహరిని భావించి పూజింపవలయును. అట్లొనర్చినచో అచిరకాలములోనే అతనికి ముక్తి లభించును.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే తృతీయోఽధ్యాయః (3)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *భగవదవతారముల వర్ణన* అను

మూడవ అధ్యాయము (3)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

జన్మ చరితార్థ మయ్యే లా!..

 జన్మ చరితార్థ మయ్యే లా!..


పరమాత్మను కీర్తించే రోజు

ఆ పరాంధాముని పూజించే రోజు

పాండవ పక్షపాతి యై ధర్మాన్ని

కాపాడాడ ని

ఆపద్బాంధవు డై గోవులను,ఆ బాల

గోపాలా న్నీ గోవర్ధన గిరి నెత్తి

రక్షిం చాడ నీ

కాళీయుని మద మడచి కాలిందిని

కల్మష రహితం గావించాడనీ

జరాసంధ వ థకై నలుని కి యుక్తిని

ప్రసాదించాడని

బృందావన విహారి యై మురళీ గాన

లోలుడై గొపికల్నే కాదు ఆబాల గోపాలా న్నీ తన మురళీ గానంలో

ముంచెత్తా డ నీ

వెన్న దొంగ యై కడకు మన్ను తిన్న

నెపంతో తల్లి యశోదకు తన నోట

పడునాల్గు భువన భాండమ్ముల

చూపాడ నీ

ధర్మార్థ సాధనకై గీటాబోధ నూ ఈ

జగతికి చేశాడనీ

లీలా మానుష వేషధారి యై

మాధవుడు గా, మధుసూ ధనుడు గా, బాల కృష్ణుడు గా,జనార్ధనుడు గా,మేఘ శ్యా ముడు గా,గోవిందుడు గా, కన్నయ్య గా,మురళీ మోహ నుడుగా,

ఇలా ఎన్నో,ఎన్నెన్నో నామాలతో

ఆర్తితో పిలిస్తే అంతటా ఏపేరు నైనా

ఏ రూపు నైనా దర్శన మిస్తాననీ

జీవిత పరమార్థాన్ని బోధించిన

ఆ పరం ధాముడు

మన శ్రీ కృష్ణ భగవానుని

ఆ పరం ధా మునీ

ముక్తియుక్తిభుక్తిశక్తి భక్తి ప్రదాత యనీ

ఆయన జన్మదినం కృష్ణాష్టమి

సందర్భంగా మనమంతా

మనసారా గోవింద కృష్ణ జై!

గోపాల కృష్ణ జై!!....

గోపాల బాల బాల బాలరాధ కృష్ణ జై,!!!!......అంటూ తనివి తీరా

గొంతెత్తి కీర్తి ద్ధా ము

జన్మ చరితార్థ మయ్యే లా!..


దోస పాటి.సత్యనారాయణ మూర్తి.

రాజమహేంద్రవరం

9866631877

సన్మైత్రీ భావుకత ప్రకృతి

 " సన్మైత్రీ భావుకత ప్రకృతి ఒసగే మహోన్నత సన్మార్గ జీవన పథం " విశాల విశ్వమందు సకల జీవరాశి ప్రశాంత మనుగడ, సుస్నేహ జీవన పథాన సాకారం ! అనాదిగా ప్రకృతి బోధించే జీవిత సత్యం, విశ్వ జీవరాశి సన్మైత్రీ భావనాత్మక సమైక్య గమనం ! సకల జీవజాలపు నిత్య చైతన్య స్ఫూర్తి, ప్రకృతి ఒసగెడి మహోన్నత ఓషధీ పరిమళం ! విశ్వ మానవాళి బాధ్యత, ప్రకృతి పరిరక్షణం, తద్వారా సకల జీవ సంరక్షణం ! సృష్టి కర్త బ్రహ్మ ఒసగిన ప్రత్యేక సుజ్ఞాన వికాస చైతన్య స్ఫూర్తి, మానవాళి మదిన జీవకారుణ్య స్థాపనం ! ఈ విశాల విశ్వంలో చరాచర జీవజాల నిత్య జీవన గమనంలో, మానవాళి పాత్ర మహోన్నతం ! విద్వేషాలు లేని, అనుమానావమానాలు కానరాని రీతిలో విశ్వ మానవాళి నడవాలన్న సమయోచిత ప్రకృతి నిత్య చైతన్య సంకేతం ! దృశ్యమాన జగతి నందు ప్రశాంత జీవనానికి ప్రత్యక్ష మార్గగామి, ప్రకృతియే అనెడి సృష్టి కర్త సద్భావనం ! తల్లి ఒడిన ఓనమాలు దిద్దిన తదుపరి సకల జీవుల నిత్య పయనం, ప్రకృతి ఒడిలోనే అనెడి సత్య చైతన్య వీక్షణం ! ప్రకృతి పరిరక్షణం సకల జీవుల ముఖ్య కర్తవ్యం, అందునా విశ్వ మానవాళికి అయ్యది నిత్య దార్శనిక దృక్పథం ! ప్రకృతి ప్రతి క్షణం, ఈ విశ్వ జీవ ప్రశాంత జీవన పథాన మహోన్నత ప్రత్యక్ష దర్పణం ! విశ్వ మానవాళి నిత్య సమున్నత కర్తవ్యం, ఈ పవిత్ర పృధ్విపై జీవకారుణ్యతా భావ వికాస సుహృద్భావ స్థాపనం ! ఒండొరుల నిత్య సత్య చైతన్య సన్మైత్రీ భావనాత్మకతా చింతనే విశ్వ సమాజ సువికాస సమైక్య తోరణం ! ఆత్మీయానురాగాల సమ్మేళనం, విశ్వ మానవాళి సుస్నేహ భావ స్ఫూర్తిదాయక చైతన్య దృక్పథం ! ఈ సద్భావనే సకల జీవరాశి దీర్ఘకాలిక ప్రశాంత అఖండ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధికి చక్కని జీవన సోపానం ! రచన : గుళ్లపల్లి ఆంజనేయులు

వీలునామా

 వీలునామా


*


"మనింట్లో మనం ఉంటూ అద్దె కట్టడమేంటండి? మాఁవయ్య గారికి ఛాదస్తం పెరుగుతున్నట్లుంది" అంటోంది సునంద.


"మనిల్లు కాదు, ఇది నాన్న గారు లోను తీసుకుని కట్టుకున్న ఇల్లు" సమాధాన పరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు సుశాంత్.


"ఆయనదైతే మాత్రం .... ఆయన తరువాత మీకే కదా వచ్చేది?"


" 'ఆయన తరువాత' అన్నమాట మరొకసారి అనొద్దు సునంద" గొంతు పెంచుతూ అన్నాడు సుశాంత్ 


"ముందే అనుకోకపోతే మా బాబాయి వాళ్ళ పిల్లల్లాగే కొట్టుకు చావాలి" అంటూ సోదాహరణంగా సుశాంత్ మనసు మార్చేందుకు ప్రయత్నం చేస్తోంది సునంద.


"మీ బాబాయికి ఉన్నది ఐదొందల గజాల స్థలం .... అందులో ఇల్లు. నలుగురు సంతానం. పైగా ఆ స్థలం వాళ్ళ నాన్న గారి నుంచి వారసత్వంగా వచ్చింది కాబట్టి కొడుకులందరూ కలసి ఆయన్ని ఏడిపించారు. ఇప్పుడు చూడు ఏమయిందో? ఆ ఐదొందల గజాల కోసం అందరూ కోర్టుకు పోయారు. పోనీ మధ్యవర్తిత్వం చేద్దామంటే ఆ పెద్దాడికి అసలు మన పొడే గిట్టదు ...."


"అందుకే చెప్పేది .... ఇల్లు ముందుగా మన పేరు మీద రాయించేసుకుంటే .... " అంటూండగానే సుశాంత్ అనేసాడు ....


"ఆ తరువాత నా బుధ్ధి మారి ఆయన్ని వేరే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు ఈ వయసులో?" అన్నాడు .... సునంద మనసులో విషయం తన మాటగా చెబుతూ ...,


"అదీగాక ఈ ఇంట్లో చెట్లు, మొక్కలు ఆయన ప్రాణం. రోజూ చూస్తున్నావ్ కదా, ఎంత శ్రధ్ధగా వాటిని చూసుకుంటారో?" అంటూ తండ్రిని సమర్ధిస్తూ మాట్లాడాడు సుశాంత్ 


"ఎంత సేపటికీ మీకు మీ నాన్న గారి ఆలోచనే కానీ నా మనసులో ఆలోచన మాత్రం పట్టదు ...." మూతి వరిచింది సునంద.


ఆమె మనసులోని మాట అతడికి తెలుసు. అందుకే తండ్రికి అద్దె కట్టి మేడ మీద ఉండటానికే నిశ్చయించుకున్నాడు. తమ ఇంటికి తామే అద్దె కట్టడం మాత్రం ఆమెకు సుతరామూ ఇష్టం లేక పోయింది.


"అద్దె డబ్బులు ఏం చేసుకుంటారట? రోజూ వండి పెడుతున్నా కదా?" అంటూ మళ్ళీ మొదలు పెట్టింది సునంద.


"చాల్లే .... నీ వంట సంగతే చెప్పు. వారంలో రెండు, మూడు రోజులు బైట నుండి తెప్పిస్తావు. ఆ తిండి ఆయనకు సయించదు. మొదటినుండి అమ్మ చేతి వంట అలవాటైన మనిషి. ఆ బైట తిండి తింటే ఈ వయసులో మంచిది కాదు కూడా" అంటూ సమాధానం చెప్పాడు. 


ఈ మాటతో సునందకు ఎక్కడలేని రోషం వచ్చింది. 


"అంటే మీ ఉద్దేశ్యంలో నాకు వంట రాదనా?" 


"వంట రాదనలేదు. బైటనుండి తెప్పించే ఆహారం ఆయనకు పెట్టొద్దు అని అంటున్నాను" అన్నాడు సుశాంత్ 


"దానికీ, మన అద్దెకు ఏంటి సంబంధం?" అంటూ మళ్ళీ మొదటికే వచ్చింది సునంద.


"ఆయనకు అద్దె కడితే వంట మనిషిని పెట్టుకుని ఆయనకు కావలసినట్లు చేయించుకుంటాడు. నాకెలాగూ నీ చేతి ముద్ద తప్పదనుకో" అన్నాడు సుశాంత్ 


"మరైతే ఆయనకు అద్దె కడితే ఆయన కోసం వంట చెయ్యనని చెప్పేయండి .... ఐనా కొడుకు దగ్గర అద్దె వసూలు చేసే తండ్రిని ఈయన్నే చూస్తున్నా" అంటూ సాగతీసింది సునంద.


మరేమీ మాట్లాడలేదు సుశాంత్. తండ్రికి ఎలా చెప్పాలో ప్లాన్ వేసుకున్నాడు.


*


"ఏరా ఇలా వచ్చావ్? అద్దె విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావ్? అనడిగారు సుశాంత్ తండ్రి సుబ్రమణ్యం గారు.


"అదే నాన్నా .... ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. సునంద విషయం తెలిసిందే కదా, మన ఇంటికి మనం అద్దె కట్టడం ఏంటంటోంది. ఒక వేళ అద్దె కట్టేట్టయితే మీ వంట సంగతి మిమ్మల్నే చూసుకోమని అంటోంది ...."


"నెత్తిన పాలు పోసిందిరా నీ భార్య .... ఇవాళనుండి అద్దె ఇరవై వేలు. ఎడ్వాన్సుగా రెండు నెలల అద్దె ఇచ్చేసి వెళ్ళు. గోడలకు మేకులు కొడితే మేకుకి రెండొందలు ఎక్స్ట్రా కట్టాలి. చిన్న చిన్న రిపేర్లొస్తే నువ్వే చేయించుకోవాలి" అన్నారు సుబ్రమణ్యం గారు.


అన్నిటికీ ఒప్పుకున్న సుశాంత్ అప్పటికప్పుడు నలభై వేలు ఆయనకు తన మొబైల్ నుండి బదిలీ చేసాడు.


మేడ మీదకు రాగానే చెప్పాడు సుశాంత్ నాన్న గారికి వంట చెయ్యనవసరం లేదని.


"అద్దె ఇచ్చారా?" అనడిగింది సునంద.


"ఇచ్చాను"


"ఎంత?" 


"నెలకి ఇరవై వేలు" అని చెప్పాడు సుశాంత్ 


"ఇరవయ్యా? ఇరవై వేలు పెడితే ఇంతకంటే మంచి కొంపే దొరికేది. ఐనా ఈ వయసులో ఆయన అంత డబ్బు ఏం చేసుకుంటాడండి, మరీ కాపీనం కాకపోతే?" అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది సునంద.


"వంట వాడికి జీతం ఇవ్వాలి కదా? అదీ కాక ఆయన పెన్షను సరిపోవడం లేదట. నన్ను డబ్బు అడగడానికి మొహమాట పడుతున్నారు. అందుకే అద్దె కట్టమన్నారు. ఐనా మనం ఆయనతో కలసి ఉండటం లేదు. మేడ మీద విడిగా ఉంటున్నాం. అది మరచిపోకు" అని సున్నితంగా హెచ్చరించాడు సుశాంత్ 


*


నాలుగు రోజులు గడిచాయి. ఉదయం నిద్ర లేచిన సునందకు ఇంటి ఆవరణ అంతా సందడిగా అనిపించింది. 


'ఏఁవిటో హడావాడి?' అనుకుంటూ బాల్కనీలోకి వచ్చి చూసింది.


చాలామంది వృధ్ధులు .... అందరూ పెద్దవాళ్ళే .... ఆవరణలో సందడిగా మొక్కల మధ్య చెట్ల కింద తిరుగుతున్నారు.


బాల్కనీలోనుండి లోపలకొచ్చిన సునంద భర్తను లేపి విషయం చెప్పింది.


సుశాంత్ కూడా వచ్చి చూసాడు. అతడికీ అర్ధం కాలేదు. మొహం కడుక్కుని కిందకు వచ్చాడు. 


నాన్న గారి దగ్గరకు చేరి "ఏంటి నాన్న విషయం, అంతా సందడిగా ఉంది?" అని.


"వీళ్ళందరూ బిడ్డలనుండి దూరంగా ఉంచబడిన తల్లిదండ్రులురా .... వీళ్ళు నాకు తోడుగా ఉంటారని తెచ్చుకున్నాను" అన్న నాన్న గారి మాటలు మొదట అర్ధం కాకపోయినా ఆయన సంగతి తెలుసు కాబట్టి పక్కకు తీసుకువెళ్ళి అడిగాడు.


"ఔన్రా సుశీ .... నాకు ఈ వయసులో నువ్వు, కోడలు తప్ప ఎవరూ లేరు. ఆ అమ్మాయికి నేనంటే ఎందుకో నచ్చదు. తన కారణాలు తనకు ఉండి ఉండవచ్చు. ఆ కారణాల వల్ల నీవు అమ్మాయి పోట్లాడుకోవడం, ఈ వయసులో నాకు ఇవన్నీ అవసరమా? అందుకే 'వీలునామా' రాసాను" అన్నారు సుబ్రమణ్యం గారు.


"వీలునామానా?" ఆశ్చర్యంగా అడిగాడు సుశాంత్.


"ఔన్రా .... నేను బతికున్నంత కాలం ఈ ఇంట్లో ఉన్నందుకు నువ్వు అద్దె కట్టాలి. నా అనంతరం కింద భాగం ఈ వృధ్ధులు ఉండటానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. అలాగే ఇరవై వేలు అద్దె కూడా కట్టాలి. ఏ రోజైనా వీళ్ళను ఖాళీ చేయించే ప్రయత్నం చేసావంటే ఆస్థి మొత్తం వయో వృధ్ధుల ఆశ్రమానికి వెళ్ళిపోతుంది" అంటూ 'వీలునామా'లోని ముఖ్యమైన అంశాలు వివరించారు సుబ్రమణ్యం గారు.


తిరిగి వెళ్తున్న సుశాంత్ ని పిలిచి మరొక మాట కూడా చెప్పారు .... "ఈ 'వీలునామా' నేను ఎప్పుడైనా మార్చుకునేందుకు హక్కు నాకు ఉంది" అంటూ.


*


పది నిముషాలలో అందరికీ 'కాఫీ' తీసుకొచ్చింది సునంద.


"మాఁవయ్య గారు .... ఈ వయసులో మీకెందుకండి ఈ బరువు బాధ్యతలు? నేను, ఆయన చూసుకుంటాం కదా? మీరు వాళ్ళ సంగతి మరచిపొండి" అంటూ చేతికి 'కాఫీ' కప్పు అందించింది సునంద.


ఏనాడూ చేతికి 'కాఫీ' కప్పు ఇవ్వని కోడలు అలా చేతికి ఇచ్చేసరికి నవ్వుకున్నారు సుబ్రమణ్యం గారు.


'వీలునామా మార్చుకునే హక్కు ఉంది' అనే మాట వినేసరికి కోడలికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది. ఆ మార్పు ఎటైనా మార్చవచ్చు అన్న సంగతి తెలిస్తే కనీసం ఈ 'కాఫీ' నీళ్ళు కూడా ఇవ్వదు' అనుకున్నారు సుబ్రమణ్యం గారు .... #రాయని_వీలునామా గురించి ఆలోచిస్తూ.


పైనుండి సుశాంత్ నవ్వుతూ చూస్తున్నాడు .... నాన్న గారి 'ఏ కీలుకి ఆ కీలు విరిచే వకీలత్వా'న్ని తలచుకుంటూ ....


*************************** (శుభం)


రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు

కరుగుతున్న_తెలుగుభాష

 అ ఆ ఇ ఈ

కరుగుతున్న_తెలుగుభాష


దక్షిణాది నాలుగు ప్రధాన భాషల్లో తెలుగు చివర పుట్టినది. తమిళ, మలయాళ, కన్నడ భాషలు మనకంటే ముందు పుట్టినవి. లిపి పరిణామ క్రమం కూడా ఇదే వరుసలో ఉంటుంది. ఇంతకంటే తెలుగు భాషోత్పత్తి, వికాసం, చరిత్ర విషయాలు ఇక్కడ అనవసరం. అయితే మిగతా మూడు భాషలకంటే ముందు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మాత్రం తెలుగుకే.


తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- కచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం మిగిలి ఉంటే గొప్ప. ఇంకో అయిదు వందల సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక తెలుగు శ్రీనాథుడి పద్యాల్లా ఎవరయినా విడమరచి చెబితే తప్ప అర్థం కాకపోవచ్చు.


కనీసం ఇంకో పది వేల సంవత్సరాలయినా బతికి, బట్ట కట్టి, బలుసాకయినా తిని, నిలబడగల కండపుష్టి, ఎముకల బలం తెలుగుకు ఉన్న మాట నిజమే అయినా-ఇప్పటి పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవు. తెలుగు లిపి నెమ్మదిగా విలువ లేనిది అవుతుంది. తరువాత మాట కూడా విలువ లేనిదే అవుతుంది. కచ్చితంగా ఇదంతా ఎప్పటికి జరుగుతుంది? అని తేల్చడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. మహా అయితే ఇంగ్లీషు రాని తెలుగువారు మాత్రమే తెలుగు మాట్లాడుతుంటారు. భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరని భరోసా అయితే ఏమీ లేదు. ఇంతకంటే లోతుగా భాష కనుమరుగయ్యే ప్రమాదం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు.


మన పొరుగున కర్ణాటక సముద్రతీరం మంగళూరు-ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు. తుళు ప్రత్యేక భాషే అయినా, కోటి మందికి పైగా తరతరాలుగా మాట్లాడుతున్నా లిపి లేదు. కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి. నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు తుళుకు ప్రత్యేక లిపి ఉండేది. అనేక కారణాల వల్ల లిపిని వాడక అంతరించిపోయింది. కృష్ణదేవరాయల మాతృభాష తుళు. తుళు తన సొంత లిపిని మరచిపోయి, కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు- మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు.


ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా, అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి. మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన, బాగా దగ్గరయిన వర్ణమాల ఉంది. అంత నిర్దుష్టమయిన, నిర్దిష్టమయిన లిపి తెలుగుకు ఉంది.


ముత్యాల్లాంటి, రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తున్నాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అనిపిస్తున్నాయి. తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తోంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇప్పుడు ఇంగ్లీషులో రాయడం ఫ్యాషన్. మర్యాద. ట్రెండ్.


క్షుద్రులెరుగని నిర్ణిద్ర గానమిది…పాటకు fools who don’t know the song singing without sleep లాంటి అనువాదం చేస్తుంటే తెలుగు భావాన్ని ఇంగ్లీషులోకి తీసుకెళుతున్నారని సంతోషించవచ్చు. కానీ జరుగుతున్నది కేవలం లిప్యంతరీకరణ మాత్రమే. Kshudrulerugani nirnidra ganamidi అని రాస్తున్నారు. ఇలా రాయడంవల్ల లండన్ లో షేక్స్ పియర్లు, అమెరికాలో నోమ్ చాస్కీలు మన తెలుగును సులభంగా చదివి అర్థం చేసుకుంటున్నారేమో తెలియదు. తెలుగు లిపిని మాత్రం ఘోరంగా అవమానిస్తున్నారు. లిపిని రద్దు చేస్తూ దుర్మార్గమయిన పాపం మూటగట్టుకుంటున్నారు. మన నిలువెత్తు సంతకాన్ని మనది కాకుండా చేస్తున్నారు.

పలికే మాటను సంకేతించే అక్షరం పుట్టడానికి కొన్ని యుగాల సమయం పట్టింది. దాన్ని చెరిపేయడానికి పదేళ్ల సమయం సరిపోయింది. ప్రత్యేకించి సినిమా పాటల లిరికల్ రిలీజ్ లన్నీ ఇలా ఇంగ్లీషు లిపిలోనే జరగాలని తెలుగు సినీ పరిశ్రమ రాసుకున్న రాజ్యాంగం.


ఈమధ్య చిరంజీవి ఆచార్య సినిమా లాహే లాహే లాహే పాటను యూ ట్యూబ్ లో ఆరు కోట్ల మంది చూశారు. మణి శర్మ మంచి సంగీతం. రామజోగయ్య శాస్త్రి చక్కటి రచన. పాట అద్భుతంగా, నిండు తెలుగు కండతో ఉంది. ఆధ్యాత్మిక, వేదాంత విషయాలను సాధారణ పరిభాషలో ప్రతీకాత్మకంగా చెప్పిన తీరు బాగుంది. నూటికి నూరు మార్కులు వేయదగ్గ రచన. మంచి కొరియోగ్రఫీ.లవ్ స్టోరీ సినిమా సారంగదరియా సాయి పల్లవి జానపదగీతం అసాధారణంగా ఇరవై అయిదు కోట్ల మంది చూశారు. ఈ రెండు పాటలు తెలుగువే అయినా ఇంగ్లీషు లిపిలోనే ఉంటాయి.ఇవే కాదు. ఏ పాటలయినా ఇంగ్లీషులోనే ఉండాలని నియమమేదో పెట్టుకున్నట్లున్నారు. తెలుగు పాటలకు తెలుగు లిపిలో టెక్స్ట్ పెడితే జరిగే నష్టాలేమిటో, పెట్టడానికి కష్టాలేమిటో ఇంగ్లీషు తండ్రికే తెలియాలి. నిజంగా తెలుగును ఇంగ్లీషులో రాయడం వల్ల వ్యాపార ప్రయోజనాలుంటే ముందు తెలుగు లిపిలో ఇచ్చి, తరువాత ఇంగ్లీషులో ఇవ్వవచ్చు. అప్పుడు అసలు భాషకు తగిన గౌరవం ఇస్తూనే, కొసరు భాష ఉపయోగాన్ని కూడా పిండుకోవచ్చు.


ఇప్పటికీ శ్రీలంకలో ప్రభుత్వ బోర్డుల్లో మొదట వారి అధికార భాష సింహళీ, తరువాత ఎక్కువ మందికి తెలిసిన తమిళం, దాని కింద మూడో లైన్లో ఇంగ్లీషులో రాస్తున్నారు. మనసుంటే మార్గముంటుంది.


కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఒక మాట ఉంది. మూడో కంటికి తెలియకుండా తడి గుడ్డతో గొంతు కోయడం. చుక్క రక్తం చిందకుండా గుండె కోయడం. అలా మనం తెలుగు లిపిని సైలెంట్ గా మర్డర్ చేస్తున్నాం. ఇన్నాళ్లు ఈ లిపి హత్యా నేరంలో తెలుగు సినీ పరిశ్రమ ఒకటే ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ప్రకటనలు కూడా తోడయ్యాయి.


మనకు మనమే చెరిపేసుకుంటున్న చరిత్ర మనది. మనకు మనమే అక్షరాన్ని బూడిద చేసుకుంటున్న పాపం మనది. మనకు మనమే నిరక్షరులుగా మిగిలే దైన్యం మనది. తెలుగు అక్షరం గుక్క పట్టి ఏడుస్తున్నా వినిపించుకోని పుట్టు చెవుడు మనది. తెలుగు అక్షరం గుండెలు బాదుకుంటున్నా చూడలేని పుట్టు వైకల్యం మనది. తెలుగు పట్టని వైక్లబ్యం మనది.


ఎవ్వరూ భయపడకండి. తెలుగును నడి బజారులో పట్ట పగలు అందరు చూస్తుండగా ఖూనీ చేసినా ఎవరూ కేసులు పెట్టరు. పెట్టినా నిలబడవు. నిలబడినా శిక్ష పడదు. పడినా అమలు కాదు.


త్వరగా పిడికిలి బిగించి ఉరికి రండి!

తలా ఒక పిడిబాకు చేతబట్టి ఉబికి రండి!

తెలుగును కసితీరా పొడిచి పొడిచి చంపేద్దాం.

తెలుగును తెలుగు లిపిలో రాస్తే- అమ్మ భాష.

తెలుగును ఇంగ్లీషు లిపిలో రాస్తే- ? ? ? !


దొర'సాని' భాష..

☹️😞😓🙏

*33 కోటి దేవతలు ఎవరు?*

 *33 కోటి దేవతలు ఎవరు?*


  హిందువులను విరోధించువారు మీ 33 కోటి దేవతల పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవతారు.


 అసలు ఈ కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్ వంటివారు తమకు కావలసిన ఒక మత ధర్మమునకు అనుకూలమగునటుల చరిత్ర ను తిద్ది తీర్చి తెలివిమంతులు అనిపించుకొన్నారు.


   హిందువులు అటువంటి చరిత్ర ప

ను చదివి బుద్ధి హీనులు వారనిపించుకొనిరి.


  వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి(33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా?


  హిందూ ధర్మ - సంస్క్రతియందు 33కోటి దేవతల ఉల్లేఖన ఉంది. మిక్కిలి జనులు ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. మరియు 33కోటి పేర్లను చెప్పమని బలవంతం చేస్తారు. వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు.


    సంస్క్రతములో 'కోటి' అనగా 'విధము' 'వర్గము' (type) అని అర్థమూ ఉంది. 

  ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం. అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.  


  యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయత్రింశతి కోటి (33కోటి) దేవతలు. హిందూ గ్రంధములేకాదు బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి. బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది.


   ఇపుడు దేవతల ఈ 33వర్గములనూ, అందులో వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము: 


 12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) : 1 త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్ 4. మిత్ర 5. ధాతా 6. విష్ణు 7. భగ. 8. వరుణ 9. సవితృ 10. శక్ర 11.అంశ 12. ఆర్యమ.  

  11 రుద్రులు (ఏకాదశ రుద్రులు): 1.మన్యు 2. మను 3. మహినస 4. మహాన్ 5. శివ 6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా 8. భవ 9 కాల 10. వామదేవ 11. ధృతవృత.  


 8 వసువులు(అష్టవసువులు): 1. ధరా 2. పావక 3 అనిల 4. అప 5. ప్రత్యుష 6. ప్రభాస 7. సోమ 8 ధ్రువ. 


మరి ఇద్ధరు: 1. ఇంద్ర 2. ప్రజాపతి. 


 త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరని తెలిసినది కదా! ఈ పేర్లను కంఠపాఠము చేయునది చాలా సులభము. ఎవరైననూ ఇపుడు 33కోటి దేవతల పేర్లను చెప్పమంటే వెనుక ముందు చూడవలసిన అవసరమే లేదు! కదా?. 

            *

 ( True translation from kannada version)

          🙏హరే శ్రీనివాస🙏

  🙏నా హం కర్త 🙏హరి కర్త 🙏

          🙏శ్రీ కృష్ణార్పణం🙏

జయ గోవింద

 జయ గోవింద

సింహామాసం కృష్ణపక్షంలో రోహిణి నక్షత్రం రోజున శ్రీకృష్ణుడి తిరునక్షత్రం(పుట్టిన రోజు) నిర్వహించాలని ఈశ్వర,శ్రీప్రశ్న మొదలగు సంహితా గ్రంథాలు తెలుపుతున్నాయి.

తిరునక్షత్ర తనియ

సింహమాసే౽ సితే పక్షే రోహిణ్యాం అష్టమీతిథౌ |

చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుమ్ || 


నిత్య తనియ

తతో౽ ఖిల జగత్పద్మ బోధాయాచ్యుతభానునా | 

దేవకీ పూర్వసన్ధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా ||

     శ్రీజయంతి గా పిలువబడే కణ్ణన్ తిరునక్షత్ర మహోత్సవం,ఆమరుసటి రోజు శిక్యోత్సవం నిర్వహించాలని విధి విధానాలను శ్రీప్రశ్న,ఈశ్వర సంహితలు పేర్కోన్నాయి.

 మొదటి రోజున శ్రీస్వామి వారికి విశేష తిరుమంజన కార్యక్రమం,వివిధ ప్రసాదాల నివేదన(ముఖ్యంగా కాయం,పాలు,వెన్నె,మీగడతో పాటు ఇతర ప్రసాదాలు)చేసి ఊంజల్ సేవని,నృత్య,గీతాది కార్యక్రమాలు నిర్వహించాలని ,ఆతరువాతి రోజు గర్భాలయంలో మూలమూర్తి ఆరాధన జరిగిన పిమ్మట ఉత్సవమూర్తిని పల్లకిలో వేంచేపు చేసుకోని శిక్యోత్సవం(ఉట్లి కోట్టడం) నిర్వహించడానికి అనుమతికై స్వామి వారిని ప్రార్థించి ఉత్సవమూర్తిని మంటపానికి వేంచేపు చేయాలి.వీథిలోని గోప బాలకులను భగవంతునికి ఎదురుగా నిలబెట్టాలి.పాలు,వెన్నె వంటి వాటిని సిద్ధం చేసుకోని శిక్యాన్ని(ఉట్టిని)నిర్మించాలి.ఆఉట్టిలోని పాలు,పెరుగు ,వెన్నె ఇత్యాదులతో ఉన్న ఆఉట్టిని గోప బాలురు కొట్టేందుకు భగవంతుని అనుమతిని తీసుకోమని చెప్పి వేడుకను ప్రారంభించాలి.నృత్య,గీత,వాధ్య,వేద,దివ్య ప్రబంధ ,స్తోత్రాదులు చదువుతూ తిరువీథిగా ఉట్టి వద్దకు చేరుకుని అక్కడ పసుపు నీళ్ళతో ఈఉత్సవాన్ని నిర్వహించాలి.ఉత్సవం పూర్తి అయ్యాక ఉత్సవమూర్తికి ఉపచారములు సమర్పించి గర్భాలయానికి వేంచేపు చేయాలి.సంతానార్థులు ఈఉత్సవం పూర్తి తర్వాత పారణ చేసిన సంతానం కలుగుతుందని చెప్పబడింది.

భగవదుత్సవములు అనే శ్రీకోశం నుండి గ్రహించబడింది.

   ప్రియ భగవద్బందువులందరికి శ్రీజయంతి శుభాకాంక్షలు

 సర్వ అపరాధాన్ క్షమస్వ

అడియేన్ రామానుజ దాసన్

శ్రీ కృష్ణ జననం

 శ్రీ కృష్ణ జననం


శ్రావణమాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉన్నది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేసాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేసాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు ఇనుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది.


మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బువంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొన్న వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు. పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. 

మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. నేను చెయ్యడానికి కూడా లేదు. ‘కృష్’ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసాడు. ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు. ‘నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను’ అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ ‘భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ పన్నెండు వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడుమార్లు పుట్టాను. ఒకసారి నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవమారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉన్నది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.


ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునానదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయ యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడనుంచి ఆడపిల్లను తెచ్చి దేవకి ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు.


వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెలమీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడనే ఉన్నది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు ఉన్న ఇనుప గొలుసులు, తాళములు, మేకులు అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడపట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉన్నది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. విపరీతమయిన వేగంతో ప్రవహిసస్తున్న యమునానది దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు పరమాత్మను గుండెలమీద పెట్టుకుని యమున వంక చూశాడు.


కృష్ణభగవానుని గుండెలమీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగివచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుపసంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణపరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.

ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదీ లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు పిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తనపిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టుకున్నది. ‘అన్నయ్యా! ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయింది ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్లయిన దానిని చంపాడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు ’ అని ఏడుస్తూ వేడుకున్నది.

కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకు లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాలుగు నామములతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ నామములు వింటున్న వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవన్నీ తీసుకుని క్రింద ఉన్న కంసుని చూసి ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్నుకూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది.


వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.

అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణపరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతు చూచివద్దామని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ‘అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నందప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగకృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు.

జీవన సాఫల్యం

 జీవన సాఫల్యం 

మనుషుల మనస్తత్వాలు కొన్ని సార్లు ఆశ్చర్యకరంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొందరు మాట్లాడే మాటలు వింటుంటే మనుషులు ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపిస్తుంది.  మనిషి ఆశా జీవి కాదనలేము. కానీ ఈ రోజుల్లో మనుషులు ఎలావున్నారంటే, ప్రతిదీ ఐహికంగానే ఆలోచిస్తున్నారు, సరే అది పర్వాలేదు అని అనుకుంటే వారి ఆలోచనలకి ఒక గమ్యం లేకుండా కూడా కొన్ని సార్లు అనిపిస్తున్నది. నాకు ఇటీవల తారస పడిన కొన్ని సందర్భాలను ఇక్కడ ఉటంకించ ప్రయత్నిస్తాను.  ఒక న్యాయవాదుల వాట్సాప్ గ్రూపులో అది న్యాయవాదులకు సంబంధించింది కాబట్టి ఒక మిత్రుడు ఢిల్లీలో ఒక సీనియర్ న్యాయవాది న్యాయవాద వృత్తి జీవితాంతం చేయవచ్చు దీనికి రిటైర్మెంట్ లేదు అని పేర్కొన్నారు.  నిజానికి అడ్వాకెట్స్ చట్టంలో కూడా ఎక్కడ న్యాయవాదికి రిటైర్మెంటు అని లేదు.  కానీ విషయం ఏమిటంటే ఆ పోస్టు చూసిన ఒక సభ్యుడు పెట్టిన పోస్టు నన్ను ఆలోచనలో పడేసింది.  ఆయన ఏమన్నారంటే తాను ఇంకా ఐదు సంవత్సరాలకు చనిపోతానన్న దాకా వృత్తిలో కొనసాగుతా అని ఆయన వ్రాసారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆయనకి తాను  ఎప్పుడు చనిపోతాడో తెలుసా? ఆయన ఏమి జ్యోతిష్య పండితుడు కాదు.  అయినా కూడా జ్యోతిష్యం ఎంతవరకు కరెక్టుగా ఉంటుంది అన్నది కూడా ప్రస్నార్ధకమే.  నిజానికి తాను యాదృచ్చికంగా ఆ పోస్టు చేసారని నాకనిపించింది. కానీ నేను చెప్పదలచుకుంది ఏమిటంటే ధన వ్యామోహం మనిషిని ఎలా మాట్లాడిస్తుంది అన్నది. యెంత సంపాదించినా ఇంకా ఇంకా సంపాదించాలి దేనికోసం అంటే నా భార్యా పిల్లలకోసం అని అంటారు. నాకు నా భార్య పిల్లలు ఎంతవరకు వస్తారు అని ఎవ్వరు ఆలోచించటం లేదు, ఎందుకంటె మనిషిని కమ్మిన మాయ అటువంటి ఆలోచనని రానివ్వడు. ఎప్పుడైతే మనిషి తాను ఈ శరీరం కాదు కేవలం శరీరం నేను వుండే గృహం లాంటిదని అనుకుంటాడో అప్పుడు ఈ బంధాల మాయలోంచి వెలువడుతాడు.  కానీ చిత్రం ఏమిటంటే అరవై దాటినా, దిబ్బయి దాటినా ఇంకా దేహ వ్యామోహం బంధాల మొహం పోవటం లేదు.  ఏమంటారు. 

ఇంకొక సంఘటన ఇక్కడ ప్రస్తావించదలిచాను నాకు ఒక సహృదయుడు మంచి ఆధ్యాత్మిక మిత్రుడు అయ్యారు. ఆయన విగ్రహారాధనను నిరసిస్తూ అది అంతా ఒక ట్రాష్ నిజానికి ఉన్నది ఒక పరబ్రహ్మ ఒక్కటే విగ్రహారాధనతో ఏమి పని అని అన్నారు. నాకు ఆయన ఆలోచనలు చూసి తాను గొప్ప బ్రహ్మ జ్ఞ్యాని అని అనుకున్నాను. మాటల సందర్భంలో నేను ఆయన చేసే సాధనగూర్చి తెలుసుకుకో దాలిచాను.  ఆయన చెప్పింది ఏమిటంటే తానూ ఒక ఐదు సంవత్సరాల తరువాత జ్ఞ్యాన సాధన మొదలు పెడదామనుకున్నాను అని సెలవించారు. ఐదు సంవత్సరాలు ఎందుకు ఆగారో మాత్రం నాకు చెప్పలేదు.  మనం యెంత అమాయకత్వంలో ఉన్నామంటే రేపు ఇది చేద్దాం అది చేద్దాం అని నిత్యం ఆలోచిస్తూ ఆ ఈశ్వర స్మరణ మరచి ఈ ఐహిక వాంఛలతో ఐహిక బంధాలతో నిత్యము కాలం వృధా చేస్తున్నాము.  నిజానికి ఇక్కడ ఎవ్వరికీ తెలియనిది ఒకటి వుంది అదేమంటే నేను అనుకునే ఈ దేహం ఈ జగత్తుది కానీ నాది కాదు.  అటువంటప్పుడు నాది కాని దేహంలో నేను ఎంతకాలం వుంటాను? అనే ఆలోచన మనసులో వెలువడినప్పుడు ప్రతి వారు ఆ దేవా దేవుని వెంటే పరుగులిడుతారు జన్మ రాహిత్యానికి తహ తహ లాడుతారు. 

ఒకసారి నాకు ఒక మంచి ఆధ్యాత్మిక మిత్రుడు తెలిపినది ఏమిటంటే తాను ఒక మంచి గురువు కోసం ఎదురు చూస్తున్నాడట. మీకు తెలుసా గురువే మనలని వెతుకుంటూ వస్తారు అని అయన సెలవిచ్చారు. నిజానికి ప్రతి మనిషిలో ఒక గురువు ఉంటాడు ఆయనే ఆ పరమాత్మ ఎప్పుడైతే మనం ఆ పరమాత్మా చెప్పినట్లు సంచరిస్తూ అరిషడ్వార్గాలను విడనాడి నిధిజాసలో జీవితాన్ని గడుపుతామో అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం కారతలామలకాలం అవుతుంది.  నిజమైన యోగి ఈ ప్రపంచం గురించి ఎక్కువగా ఆలోచించాడు, కేవలం కేవలం అంటే తన ఆధ్యాత్మిక ఉన్నతి గూర్చి మాత్రమే చింతన చేస్తాడు.  మన జ్ఞ్యాన బాండాగారైన ఉపనిషత్తులకు మించిన జ్ఞ్యనం  మనకు మరెక్కడ లభించదు.  ఇప్పుడు సద్గురువులని చెప్పుకునే వారు చాలామంది వారే ఐహిక వాంఛలకు దాసులుగా వుంటూ ఖరీదైన జీవనాన్ని గడుపుతున్నారు.  అటువంటప్పుడు మనకు బ్రహ్మ జ్ఞనాన్ని ఎలా ప్రసాదించి గలరు. ముందుగా నేను జ్ఞ్యాన సాధన చేయాలి అప్పుడే నాకు సాధనా మార్గం దొరుకుతుంది అని ప్రారంభిస్తే తప్పకుండ మార్గం దొరుకుతుంది. 

ఇలా నేను చాలామంది మిత్రులతో సంభాషిస్తూ పొతే నాకు తెలిసింది ఏమిటంటే ప్రతి వారు తమకు తాము జ్ఞ్యానులం అని ప్రకటించుకోటానికి గాను గ్రంథ పఠనం చేస్తారా అని నాకు అనిపిస్తున్నది.  ఈ రోజు చాలా మంది కృష్ణ భగవానుని గీత చదవని వారు వున్నారు.  ఇక చదివిన వారు వారికి గీతాజ్ఞానం వున్నదని పలువురికి తెలియచేయటానికి చదువుతున్నారా అని అనిపిస్తున్నది. నీతులు చదివి ఇతరులకు చెప్పటం సులువు కానీ వాటిని ఆచరించటం కష్టం అని ఎవరో అన్నారట. కేవలం గ్రంథ పఠనం లేక తర్కం చేయటంతో ఏమి సాధించలేము.  అసలు మోక్షము అంటే ఏమిటి దానిని ఎలా సాదించాలి అని సాధన చేస్తే కానీ మోక్షం కారతలామలకాలం కాదు. 

మనకు మన హిందూ ధర్మంలో అపారమైన జ్ఞ్యాన సంపద వున్నది. యెంత జ్ఞ్యానం మనకు ఉపలబ్దం అవుతున్నదంటే నాకు తెలిసి ఒక సాధకుడు వేరే ఏ వ్యాపకం లేకుండా కేవలం తన జీవితాన్ని జ్ఞ్యాన సముపార్జనకు కేటాయించినా కూడా ఒక జీవితకాలం సరిపోదు అని అనిపిస్తుంది. 

నాలుగు వేదాలు, వేల సంఖ్యలో ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, రెండు ఇతిహాసాలు, అనేక వేదాంత గ్రంధాలు మరియు అనేక మహర్షులు, జ్ఞ్యానుల ప్రవచనాలు, వ్యాఖ్యానాలు, భాష్యాలు ఇలా అనేక అనేక గ్రంధాలూ కేవలం ఒక్క హిందూ ధర్మంలోనే వున్నాయి. అన్నది సత్యం. నా అభిప్రాయంలో ఇక్కడ సాధకుడు బహు గ్రంథ పఠనం చేయ నవసరం కూడా లేదనిపిస్తుంది.  ఒక్క శ్రీమత్ భగవత్గీతను త్రికరణ శుద్ధిగా చదవండి.  అందులో స్వామి చెప్పిన విషయాలను తు. చ తప్పకుండ ఆచరించండి చాలు జన్మ తరిస్తుంది.  నాడు ధ్యానం చేయటం కష్టం అట్లా నేను నన్ను నియంత్రించుకోలేను అని అంటారా.  వారికి కూడా భగవానులు సరళమైన మార్గం చెప్పారు. 

భగవద్గీత 18-66

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః || ”

అర్ధం: “ అన్ని ధర్మాలనూ వదిలేసిఎవరిని వారే శరణు వేడుకోవాలి ; అప్పుడు నిన్ను నేను సర్వపాపాలనుంచీ ఉద్ధరిస్తాను. ”

వివరణ: భగవద్గీతను అర్థం చేసుకోవడంలో అనుసరించవలసిన విధానం :

శ్లోకంలోని మొదటి పాదంలోని “ మామేకం శరణం వ్రజ ” లోని “ మామ్ ”

అన్నది ఎవరికి వారు తమకు తాముగా అన్వయించుకోవాలి.

రెండవ పాదంలోని “అహం” శ్రీకృష్ణుడికీశ్రీ వేదవ్యాసులవారికీ,

మరి స్వీయ పరమ ఆత్మకూ అన్వయించుకోవాలి.

“ శరీరం”, “ మనస్సు ”, “ బుద్ధి ”, “ కుటుంబం ” … ఇంకా సామాజికపరంగా

మనం నిర్వర్తించవలసిన అనేక ధర్మాలు ఉన్నాయి … ఉంటాయి.

సర్వధర్మాలనూ వదిలేసి కేవలం ఆత్మధర్మాన్నే నిర్వర్తించమంటున్నారు.

“ మాం ఏకం శరణం వ్రజ ” అంటే అర్థం “ ఎవరి ఆత్మను వారే శరణు వేడుకోవాలి. ”

ఎవరి ఆత్మను వారే శరణు కోరుకోవాలి … మన ధ్యానంలో మనం కూర్చోవాలి.

ఆకలి వేస్తుందిభోంచెయ్యాలి … అది శరీరధర్మం.

నిద్రవస్తుందినిద్రపోవాలి … అది శరీరధర్మం.

నిద్దుర కొంత నిరాకరించాలిఆకలిని కొంత తిరస్కరించాలి … శ్వాసను

చేపట్టాలిశ్వాస మీద ధ్యాస పెట్టాలిధ్యానం చెయ్యాలి … ఇది ఆత్మధర్మం.

సర్వశారీరిక ధర్మాలనూ పరిత్యజించి,

మన ఆత్మధర్మంలో మనం యదావిధిగా ఉండాలి.

అప్పుడు  “ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి ”,

“ నేను నీ సర్వ పాపాలనూ శుద్ధి చేస్తాను ;

అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను ” అంటున్నారు శ్రీకృష్ణులవారు.

ఎవరినివారుఉద్ధరించుకోడానికిఎంతప్రయత్నంచేస్తే

అంత సహాయం మనకు పరమ ఆత్మల నుండి కూడా లభిస్తుంది.

“ ధ్యానం రక్షతి రక్షితం ”… “ ఎవరైతే ధ్యానాన్ని రక్షిస్తారోవారి చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి వారిని రక్షిస్తుంది ”.

మన చేత రక్షింపబడిన ధ్యాన ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది.

ప్రతిరోజు తప్పనిసరిగా శరీరధర్మంకుటుంబ ధర్మం అన్నవాటిని

కొంతప్రక్కన పెట్టి ఆత్మధర్మం చూసుకోవడమే “ మామేకం శరణం వ్రజ ”.

మనచేతనేరక్షించబడినఆఆత్మధ్యానం

మన పాపాలన్నీ పోగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

ఒకసారి ఆది శంకరాచార్యులు వీధిలో వెళుతుంటే అరుగుల మీద కూర్చొని కొందరు పిచ్చాపాటి మాట్లాడుకుంటే అప్పుడు శంకరులవారు 

భజగోవిన్దం భజగోవిన్దం

గోవిన్దం భజమూఢమతే .

సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి డుకృఞ్కరణే .. ..

 

మూఢ జహీహి ధనాగమతృష్ణాం

కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్ .

యల్లభసే నిజకర్మోపాత్తం

విత్తం తేన వినోదయ చిత్తమ్ .. ..(పూర్తి శ్లోకాల కోసం ఇక్కడ క్లిక్ https://kavulu.blogspot.com/2021/08/blog-post_255.html  చేయండి ) 

అని ఓ మూఢ మతి తెలుసుకో అని వేదాంత సారాన్ని శ్లోకాలలో వివరించారు.  ఇప్పుడు మనకు జ్ఞ్యానబిక్ష పెట్టటానికి అది శంకరులు మన వద్ద లేరు. ఇప్పుడు వున్న  ప్రవచనకారులు కేవలం వారి జ్ఞానాన్ని భక్తి మార్గం వరకు పరిమితం చేసుకున్నారు.  అంతేకాక వారు విగ్రహారాధనే సర్వ శ్రేష్టమైనదని జ్ఞానులు కూడా తప్పకుండ విగ్రహారాధన చేయాలి అన్నట్లు వున్నది వారి భావం. 

ఈ దేహం శాస్వితంకాదు ప్రతి క్షణం గడచినా కొద్దీ నేను మృతువుకు ఒక్కో క్షణం దగ్గరవుతున్నాను అనే భావన మనలో కలగటంలేదు. తాత్కాలికమైన భోగాలకు, సుఖాలకు శరీరం అలవాటు పడి సర్వ వ్యాపకుడైన ఆ ఈశ్వరుణ్ణి మరచి పోతున్నాము. మన రోజులో ప్రతి క్షణం విలువైనదని, దానిని మనం ఆత్మజ్ఞాన సముపార్జనతోనే సార్ధకం చేసుకోవాలనే సత్యాన్ని మరచి పోతున్నాము. సగానికి సగం మంది కేవలము తమ ఐహిక సుఖాలకోసం మాత్రమే ఒక పక్షివలె, చిమవలే జీవిస్తున్నారు. ఇక చాలామంది వారి అమూల్య కాలాన్ని విగ్రహారాధనలతో, పూజలతో పుణ్యక్షేత్రదర్శనాలతో గడుపుతూ అదే పరమార్ధం అని అనుకుంటున్నారు. పరబ్రహ్మతన హృదయ కుహరంలో ఉంటే అక్కడ చూడటానికి ప్రయత్నించకుండా బాహ్యంగా వెతుకుతూ వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. 

బాల్య యవ్వనప్రాయంలో ఐహిక వాంఛలు ఉండటం సర్వ సహజం కానీ అరవై దాటినవారు కూడా ఇంకా జీవితాన్ని ఐహిక సంతోషాలతో గడపాలనుకోటం ఆశ్చర్యాన్ని కలుగ చేస్తుంది. మిత్రులారా ఇప్పుడే ఈ గాఢనిద్రలోంచి లేవండి నిత్యుడు, సత్యుడు సర్వత్రుడు ఐన ఆ పరబ్రహ్మను కనుగొనటానికి ఇప్పుడే వుద్యుత్తులు కండి.  కనీసం మనం ఈ జన్మలోనైనా సాధన మొదలు పెడితే వచ్చే జన్మలలోనయినా మనకు మోక్ష ప్రాప్తి కలుగ వచ్చు. ఇంకా ఎన్నాళ్ళు ఈ చేరాచర సృష్టిలో పరిభ్రమిస్తూ మన కాలాన్ని వృధా చేసుకుందాము. 

ఆలోచించండి. మేల్కొనండి. 

జిజ్ఞాసువులారా సదా జ్ఞాన సముపార్జనలో జీవితాన్ని గడుపుదాము, మోక్ష ప్రాప్తికి ప్రయత్నిద్దాము . 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

సుబుధజన విధేయుడు 

భార్గవ శర్మ