https://drive.google.com/file/d/11zAppFN_V1l1zC9y_tTrBE8PlJdIOogw/view?usp=drivesdk
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, ఏప్రిల్ 2021, మంగళవారం
అమృత రసాన్ని
సకల విశ్వ శ్రేయస్కరమై, చరాచర జీవజాలపు నిత్య సుచైతన్య సంక్షేమార్ధమై, పవిత్ర ప్రకృతి ఒసగే స్నేహ హస్తం ! కాలానుగుణంగా తరలివచ్చే వివిధ సదావకాశాల సమ్మేళనంగా, విశ్వ మానవాళి పుణికిపుచ్చుకోవాల్సిన సన్మార్గ, సుహృద్భావ, సహృదయ, సువ్యక్తిత్వ వికాస సద్భావనాత్మక జీవన శైలి ! యావత్ విశ్వానికే మణిహారమై, అమృతతుల్యమై దేదీప్యమానమై అనునిత్యం ఈ భువిన ప్రకాశించే, దివ్య భవ్య సమైక్యతను ప్రస్ఫుటించే విభిన్న భావనలకు ఆలవాలమైన అద్భుత భాషా వికసన స్ఫూర్తి ! ప్రకృతి, సకల జీవుల పట్ల అభిమానంతో, స్నేహమయిగా కురిపించే అమృత ధార, వివిధ నదీనదాలుగా ప్రవహిస్తూ, ఈ అవనిపై అనుక్షణం అమృత రసాన్ని యావత్ చరాచర జీవజగతికి అందచేస్తున్న వైనం ! ఏ భాషైనా, ఏ మతమైనా, వివిధ వర్గ లేక తెగలకు చెందిన మానవాళి ఈ పవిత్ర పృధ్విపై మరువరాని ముఖ్యాంశం, " సమున్నతమై, సమైక్య భావనతో, సయోధ్యతో, కలసిమెలసి నడుస్తూ సకల విశ్వ జీవరాశి సంరక్షణకై నిత్య చైతన్య స్ఫూర్తిమంతమైన సుమైత్రీ బాటలో పయనించే విషయం " ! " ప్లవ నామ వత్సరపు ముఖ్య ధ్యేయం, యావత్ విశ్వ జీవరాశి ప్రశాంత జీవనానికై అనాదిగా ఈ ఇలపై నిర్దేశించబడిన ప్రాచీన వైదిక, ధార్మిక సనాతన స్ఫూర్తి ఆధారితమైన, ప్రత్యేకమైన, అత్యంత ప్రధానమైన సువిశాల సుహృద్భావ సయోధ్య ! ప్లవ నామ వత్సర శుభ ఫలాల లభ్యత, సకల విశ్వ మానవాళి నిత్య సుచైతన్య సయోధ్యపై ఆధారితమన్నదే, ఈ క్రమంలో సత్య చైతన్య దార్శనికతగా నిలుస్తున్నదే ఇక్కడ గమనించాల్సిన విషయం ! " స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాభినందనలతో.... సకల విశ్వ జీవరాశి సంరక్షణకై అనునిత్యం, అన్నికోణాల్లో యావత్ విశ్వ వ్యాప్తమైన కృషి జరగాలని మనసారా అభిలషిస్తూ....... ✍️గుళ్లపల్లి ఆంజనేయులు
ఉప్పు వ్యాపారి
పరమాచార్య స్వామి – ఉప్పు వ్యాపారి
అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. నాలుగు నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నాకోసం కబురు పంపారు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు.
అప్పుడు రాత్రి పది గంటలు. . . . కటిక చీకటి. . . . కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది.
”...నిపుణౌ”, మహాస్వామి వారు మెల్లిగా చెప్పారు, “చెప్పు”.
”తవ హి చరణావేవ నిపుణౌ . . . సౌందర్యలహరి లోని నాలుగవ శ్లోకం
త్వదన్యః పాణిభ్యాం. . . ”
పరమాచార్య స్వామి వారు చిన్నగా అన్నారు, “అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు.”
అంతా నిశ్శబ్ధం.... ”సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా?”
“తెలుసు పెరియావ. చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తూంటారు.”
“నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా?”
“అవును. వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం.”
“అవును. అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూసారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి “రేయ్ రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి.” వారు ఒక పథకం వేసారు. ఇంకా, వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా?”
“దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారుచేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దము చేస్తూ పేలుతుంది.”
“అవును. ఆ దొంగల పథకము కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టీ నుండి డబ్బు తస్కరించవచ్చు.”
“ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోసాడు. కాని ఆరోజు బాగా వర్శం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆరోజు వ్యాపారం లో నష్టము మనస్సుకు కష్టము కలిగింది. బుద్దికి తోచినట్టుగా మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు. అతని కోపం ఏంటంటే డబ్బులేకుండా ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెనుతిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తి గుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కాని పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున్న పడిన వర్షానికి. వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు. “దేవుడు నిన్ను కాపాడాడు. నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి దేవున్ని ప్రార్థించు”
ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడయ్యాడు. “అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను. కాని అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లీ. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు.“
కావున మనకి ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలినది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చెయ్యడమే.
మహాస్వామి వారు చిన్న గొంతుకతో, తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే నాటికి రాత్రి 2:30 అయ్యింది.
అప్పుడు నేను “నా తల పైన ఉన్న వెయ్యి టన్నుల బరువు తీసేసినట్టు అయ్యింది” అని అన్నాను.
పరమాచార్య స్వామి వారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా!
తరువాత మహాస్వామి వారు ”క్రమం తప్పకుండా ప్రతిరోజూ రామాయణం చదువు. నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.” అని అన్నారు
ఈనాటికి నాకు రామాయణ పారాయణ - మనస్సుకు ప్రశాంతత ఒకేసారి వస్తుంది.
--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, శ్రీమఠం విద్వాన్. మహాపెరియావళ్ దరిశన అనుభవంగళ్-1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
https://t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
*ఉగాది సమాచారం
*శ్రీ ప్లవ నామ సంవత్సర*
*ఉగాది సమాచారం* ..
🌱🌱🌱🙏🏻🙏🏻🙏🏻🌱🌱🌱
*_శుభమస్తు_*
*_ పంచాంగము_*
కలియుగ సంవత్సరం - 5122
విక్రమార్క సంవత్సరం - 2078
శ్రీ మద్వచార్య సంవత్సరం - 905
శ్రీ శంకరాచార్య సంవత్సరం - 2093
శాలివాహన సంవత్సరం - 1943 - 1944
శ్రీ రామానుజ సంవత్సరం - 1004
భారత దేశ స్వతంత్ర సంవత్సరం - 74
ఆంగ్ల సంవత్సరం - 2021 - 2022.
*_ఆదాయ , వ్యయాలు_*
మేషం 8 - 14
వృషభం 2 - 8
మిధునం 5 - 5
కర్కాటకం 14 - 2
సింహం 2 - 14
కన్య 5 - 5
తుల 2 - 8
వృశ్చికం. 8 - 14
ధనుస్సు 11 - 5
మకరం 14 - 14
కుంభం 14 - 14
మీనం 11 - 5
🌱🌱🌱🌻🌻🌻🌱🌱🌱
ఉగాది పూజా విధానం పై ధర్మ సూక్ష్మ సహితమైన ప్రవచనం శ్రీ చాగంటి వారిచే
https://youtu.be/WnMH6J5TleM
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
పండుగ వేదాశీర్వచనం
https://youtu.be/wpwLVbnP0kM
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
*_రాజపూజ్యం , అవమానాలు_*
మేషం 4 - 3
వృషభం 7 - 3
మిధునం 3 - 6
కర్కాటకం 6 - 6
సింహం 2 - 2
కన్య 5 - 2
తుల 1 - 5
వృశ్చికం. 4 - 5
ధనుస్సు 7 - 5
మకరం 3 - 1
కుంభం 6 - 1
మీనం 2 - 4
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
ఈ సంవత్సరానికి
రాజు - కుజుడు
మంత్రి - బుధుడు
పూర్వ సస్యాధిపతి - శని
రసాధిపతి - చంద్రుడు
ధాన్యాధిపతి - గురుడు
🌱🌱🌱🌻🌻🌻🌱🌱🌱
🥭🌿🎋🥭🌿🎋🥭🌿
🎋🥭🌿🎋🥭🌿🎋🥭
🙏🙏 *సేకరణ*🙏🙏
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
మొగలిచెర్ల
*శివరాత్రీ..స్వామివారి సోదరులు..*
"బాగున్నావా..?" అనే పిలుపుతో తలయెత్తి చూసాను..శ్రీ రాజయ్యగారు..మొగిలిచెర్ల గ్రామ శివారులో ఆశ్రమం నిర్మించుకొని..కఠోరతపస్సు ఆచరించి..హఠయోగం ప్రక్రియ తో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దిగంబర అవధూత కు తోడబుట్టిన వారు..శ్రీ స్వామివారికి అన్నయ్యగారైన రాజయ్యగారు..నేను కూర్చునే టేబుల్ ప్రక్కన నిలబడి వున్నారు..గబుక్కున లేచి నిలుచున్నాను.."ఎప్పుడొచ్చారు రాజయ్య గారూ..కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు..మీరు ఇక్కడికి వచ్చి దాదాపు మూడు సంవత్సరాల కాలం గడిచి పోయింది..ఆరోగ్యం ఎలా ఉంది..?..మీ సామాన్లు ఎక్కడ?.." అని గబ గబా అడిగేశాను..ఒక్కక్షణం ఆగమన్నట్టు సైగ చేశారు..కుర్చీ లో కూర్చోమని చెప్పాను..నా ప్రక్కనే కూర్చున్నారు.."మధ్యాహ్నం వచ్చాను..అదిగో ఆ శెట్టిగారి సత్రం లో సంచీ పెట్టాను..ఇక్కడికి వచ్చాను..నువ్వు అప్పుడే భోజనానికి పొయ్యావని మీ సిబ్బంది చెప్పారు..నేను కూడా అన్నదానసత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి..ఆ శెట్టిగారి సత్రం లోనే కొంచెం సేపు పడుకొని..లేచి ఇటు వచ్చాను.." అన్నారు..మా సిబ్బందికి చెప్పి ఒక రూమ్ కేటాయించాను..
మొన్న శివరాత్రికి రెండురోజుల ముందు శ్రీ రాజయ్యగారు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..మహాశివరాత్రికి వచ్చే భక్తుల కు సౌకర్యాలు..స్వామివారి మందిరం లో క్యూ లైన్ల ఏర్పాట్లు..వచ్చేపోయే అధికారుల హడావిడులు..వీటి మధ్యలో ఉన్నాము..రాజయ్య గారు అన్నీ గమనిస్తూ..స్వామివారి మందిరం లో అటూ ఇటూ తిరుగుతూ వున్నారు..మధ్య మధ్య లో నా వద్దకు వచ్చి.."ఇంత ఏర్పాట్లు చేస్తున్నారు..ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు..ఇందాక RTC వారిని అడిగితే..కావలి, కందుకూరు..రెండు డిపో ల నుంచీ సుమారు 80 బస్సులు తిరుగుతాయి అని చెప్పారు..ఓ పాతిక వేల మంది వస్తారా?.."అని ఒకసారి..
" శివరాత్రికి ముందు రోజు నుంచీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారట..దాదాపు 15 వేల మందికి అని వంటవాళ్ళు చెప్పారు.." అని మరోసారి కుతూహలం తో నన్ను అడుగుతున్నారు.."పాతిక వేల మంది కాదు..సుమారు నలభై, యాభై వేల మంది వస్తారని అంచనా తో ఉన్నాము.." అన్నాను..ఒక్కక్షణం ఆశ్చర్యం గా చూసి.."మా కుటుంబం లో పుట్టాడు అని కాదు కానీ..మహానుభావుడు ఇంతమందిని రప్పించుకుంటున్నాడు..ఈసారి ఈ శివరాత్రి పూర్తి అయ్యేదాకా ఇక్కడే ఉంటాను.." అన్నారు..
మహాశివరాత్రి రోజు రాజయ్య గారు ఎక్కువ సేపు స్వామివారి మందిరం లొనే గడిపారు..ఆరోజు మధ్యాహ్నం స్వామివారి తమ్ముడు శ్రీ పద్మయ్య నాయుడు కూడా తమ కుమారుడి తో సహా వచ్చారు..శ్రీ పద్మయ్యనాయుడు గారు స్వామివారి సమాధి దర్శించుకొని.."ఏర్పాట్లు బాగున్నాయి ప్రసాద్..ఈరోజు ఇక్కడ ఉండాలని ఉంది గానీ..త్వరగా వెళ్ళాలి..ఎన్ని పనులున్నా..శివరాత్రికి..స్వామి ఆరాధనకూ..నేను ఖచ్చితంగా వస్తానని తెలుసుకదా..ఆ మహానుభావుడి దయవల్ల నేను, నా బిడ్డలూ అందరమూ క్షేమంగా ఉన్నాము..అది మర్చిపోలేను..నువ్వు బాగా కష్టపడుతున్నావు.." అన్నారు..కొద్దిసేపు అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ వున్నారు..శ్రీ పద్మయ్యనాయుడు మా అందరికీ వెళ్ళొస్తానని చెప్పి..మరొక్కసారి స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు..
మహాశివరాత్రి అయిపోయిన తెల్లవారి శనివారం నాడు శ్రీ రాజయ్య గారు నా వద్దకు వచ్చి.."ఒక్క పొరపాటు కూడా జరుగకుండా..ఎటువంటి చిన్న అపశృతి కూడా లేకుండా..ఈ మొత్తం ఉత్సవం సవ్యంగా జరిగిపోయింది..ఈరోజు శనివారం కదా రాత్రికి పల్లకీసేవ ఉన్నదా?.." అన్నారు.."యధావిధిగా ఉంది.." అన్నాను..ఆరోజు కూడా స్వామివారి మందిరం లోనే ఎక్కువభాగం గడిపారు రాజయ్య గారు..పల్లకీసేవ మొత్తం ఆసక్తిగా చూసారు..రాజయ్యగారు చాలా ఉద్వేగం పొందారు..స్వామివారి ని తమ్ముడు గా భావించి కలిసి ఉన్న రోజులు..స్వామివారు సన్యాసిగా మారిన తరువాత తమతో ప్రవర్తించిన తీరు..స్వామివారు సిద్ధిపొందిన తరువాత నుండి ఇప్పటి వరకూ మొగిలిచెర్ల లోని మందిరం ఒక క్షేత్రం గా మారేవరకూ వచ్చిన మార్పులూ..అన్నీ గుర్తుకు తెచ్చుకున్నారు..తాను స్వామివారికి అన్నయ్య ను అనే భావన విడనాడి..ఒక సిద్ధపురుషుడి సమాధి ని దర్శించుకుంటున్నాము అనే భావనలో వున్నారు..అటువంటి మహానుభావుడికి తాను సోదరుడిని కావడం తన భాగ్యం గా చెప్పుకున్నారు..
"వయసు మీద పడి పోతున్నది..ఆరోగ్యము అంతంత మాత్రమే..కానీ..ఈ నాలుగు రోజులూ..ఇక్కడ జరిగిన శివరాత్రి ఉత్సవమూ..పల్లకీసేవ..ఆదివారం నాటి విశేష హారతులూ..అంతకుమించి స్వామివారి సమాధి దర్శనం కొరకు దూరప్రాంతాల నుంచి వస్తున్న ఈ భక్తులూ..అన్నీ చూసిన తరువాత..అతి త్వరలో ఇది ఒక ప్రసిద్ధ క్షేత్రం గా మారుతుందనే నమ్మకం కలిగిందయ్యా..నాకు ఓపిక ఇచ్చినంతకాలం తరచూ ఇక్కడికి వస్తాను ప్రసాదూ..నాకోసం నువ్వేమీ పెద్ద ఏర్పాట్లు చేయొద్దు..అంతగా అయితే..అందరితో పాటు నేనుకూడా స్వామివారి సన్నిధి లోనే ఉంటాను.." అని చెప్పారు..
శ్రీ స్వామివారి సోదరులు రావడం..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లడం..మాకు అభినందన పూర్వక ఆశీస్సులు అందచేయడం..మాకు కూడా ఒక మంచి అనుభూతిని మిగిల్చింది..ఇది కూడా స్వామివారి ఆశీర్వాదమే అని మా సిబ్బందీ..మా దంపతులమూ అనుకున్నాము..ఇక మహాశివరాత్రి ఉత్సవం మొత్తం ఏ ఇబ్బందీ లేకుండా జరగడానికి కారణం..ముమ్మాటికీ స్వామివారే..మేము కేవలం నిమిత్తమాత్రులం..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).